జీప్ క్వార్టర్స్ కి వెళ్ళే లోపు case డీటైల్స్ చూసాడు విజయ్, రాఘవులు కూడా కిందటి రోజు వూళ్ళో జరిగిన విషయాలు అన్ని చెప్పాడు , సో ఇప్పుడు అందరికీ పోలవరం సర్పంచ్ మీద డౌట్ ఉంది ,కానీ పిల్లాడు అక్కడ కూడా దొరకలేదు అంతేకదా మీరు చెప్పేది అన్నాడు విజయ్ , అంతే sir అన్నాడు రాఘవులు తటపటాయిస్తూ , ఏంటి రాఘవులు గారు ఏదో అడగడానికి మొహమాట పడుతున్నట్టున్నారు అడిగాడు విజయ్ , అబ్బే ఏం లేదు సర్ మీరు నా పై ఆఫీసర్ కదా నన్ను మీరు ,గారు అంటున్నారు మీలాంటి వారిని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు రాఘవులు. విజయ్ చిన్నగా నవ్వుతూ మీరు వయసులో పెద్దవాళ్ళు ఇంకా experienced కూడా సో ఆమాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు , ఈలోపు జీప్ క్వార్టర్స్ చేరుకుంది లోపలనుండి పనివాళ్ళు వచ్చారు, sir తను లక్ష్మి వంటపని చేస్తుంది , వీడు మల్లన్న ఇంటి పనులు చేస్తాడు ఇద్దరు మొగుడు , పెళ్ళాలు ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు అన్నాడు రాఘవులు. ఓకే నేను రెడీ అయి వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు విజయ్.
మరోవైపు హైదరాబాద్ లో బ్యాచిలర్ రూం లో తన బెడ్ పై పడుకొని ఉన్నాడు రాఘవులు కొడుకు సాగర్ . నైట్ షిఫ్ట్ చేసొచ్చి పడుకున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు . తన పక్కనున్న ఫోన్ నుండి గంగా ,నీ ఉరుకులే రాగంగ నా గుండెల మోగంగా సరిగమలే పాడంగా నాలో సగ భాగంగా అంటూ రింగ్ టోన్ మోగింది , ఆ పాట వింటూ గంగా నా గంగా అంటూ పిల్లో ని గట్టిగా హగ్ చేసుకొని మురిసిపోతూ , సడన్ గా మెలకువ వచ్చి ఇంత పొద్దున్నే ఫోన్ ఎవరు చేస్తున్నారు అనుకొంటూ ఫోన్ తీసెలోపు కాల్ కట్ అయింది, ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న అందమయిన అమ్మాయి ఫోటో చూసి గుడ్ మార్నింగ్ బంగారం అని ముద్దు పెట్టుకున్నాడు , అవును మీరనుకున్నది నిజమే ఆ ఫోటో సర్పంచ్ గారి అమ్మాయి గంగదే , సాగర్ చిన్నప్పుడు ఉద్యోగరీత్యా రాఘవులు కి ట్రాన్స్ఫర్ పేరుతో ఒకే చోట ఉండటం కుదరదు కాబట్టి 10త్ class వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు సాగర్ ని, తరువాత సాగర్ వాళ్ళ తాతయ్య చనిపోవడం తో వాళ్ళ అమ్మమ్మ ని ముంబై లో ఉన్న తన మేనమామ తీసుకెళ్ళాడు , సాగర్ ని రాయవరం తీసుకొచ్చారు. అప్పుడే జాతర లో చూసాడు గంగని , తన చెల్లి విద్య పరిచయం చేసింది గంగని తన బెస్ట్ ఫ్రెండ్ అని ,అప్పటికే వాళ్ళ కుటుంబం రాయవరం వచ్చి సంవత్సరం అయినా సరే 10th లో busy గా ఉండి తను ఒక్కసారి కూడా ఈ వూరికి రాలేదు, గంగ ని మొదటి సారి చూడగానే ఒక అద్భుతం తన కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించింది , తనను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు, ఫోన్ చూస్తూ సాగర్ ఏం చేస్తున్నావు బంగారం నిన్ను చూడక ఎన్ని రోజులైంది , రోజులు కాదు నెలలు త్వరలోనే వచ్చి కలుస్తా , ఇద్దరం కలిసి ఒక రోజంతా బీచ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి సరేనా అని తనలో తానే మాట్లాడుకుంటుండగానే మళ్ళీ ఫోన్ నుండి గంగా అని రింగ్ టోన్ రాగానే నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సాగర్ , ఫోన్ లో అటునుండి వాళ్ళఅమ్మ ఏంట్రా ఎప్పటి నుండి కాల్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయవు అంది కోపంగా ,అయ్యో చూల్లేదమ్మా నైట్ షిఫ్ట్ చేసొచ్చా late గా పడుకొన్నా బాగా నిద్ర పట్టేసింది , అయినా నువ్వెంటమ్మా ఇంత పొద్దుటే ఫోన్ చేశావు అని అడిగాడు సాగర్ , జరిగింది అంతా చెప్పింది కనకం , అంతా విని ఒక్క నిమిషం షాక్ లో ఉండిపోయాడు సాగర్ ,హెలో సాగర్ వినిపిస్తూఉందా అని వాళ్ళమ్మ అనగానే సాగర్ తేరుకొని ఏం టమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు , అవున్ రా మీ నాన్న నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నారు అంది కనకం ,సరెమ్మా నేను వెంటనే బయలుదేరతాను అని ఫోన్ పెట్టేసి , బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు వెంటనే లేచి లగేజ్ ప్యాక్ చేసుకుని తన రూమ్మేట్ కి కాల్ చేసి ,అరే రాజేష్ నేను వూరికి వెళుతున్నారా రూం కీ బయట షూ రాక్ లో ఎప్పుడూ పెట్టే చోట పెడతాను అన్నాడు సాగర్ , అదేంటీ ఇంత సడన్ గా నైట్ కూడా ఏం చెప్పలేదు అన్నాడు రాజేష్ , అదంతా తర్వాత చెప్తారా bye అంటూ ఫోన్ పెట్టేసి బయలుదేరాడు సాగర్ .
విజయ్ ని రాఘవులు ,రామారావు ఇంటికి తీసుకువెళ్ళాడు , రామారావు గారి ఇంటి ముందు వూరి జనం అంతా నిలబడి ఉన్నారు , వాళ్ళను చూసిన విజయ్ కి అర్థమయింది ఆ కుటుంబం అంటే అందరికీ ఎంత అభిమానం ఉందో, అందరూ విజయ్ ని చూసి నమస్కారం చేశారు . అరుగు మీద పడక కుర్చీలో వాలి శూన్యం లోకి చూస్తూ ఉన్నాడు రామారావు , రామారావు గారు అంటూ పిలిచి , కొత్తగా వచ్చిన S.I ఈయనే అంటూ విజయ్ ని పరిచయం చేశాడు రాఘవులు , రా బాబు కూర్చో అంతా సరిగా ఉంటే మా ఊరిలోకి ఘనంగా తీసుకుని వచ్చేవాళ్లమ్ కానీ ఒక్కరాత్రి లో నా ఇంటిని ఇలా చీకటి కమ్మేసింది అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో , మీ అబ్బాయి ఎక్కడ sir అని అడిగాడు విజయ్ రామారావును , మోహన్ పక్క వూరికి వెళ్ళాడు బాబు గురించి ఏమైనా తెలుస్తుంది ఏమో అని సమాధానం ఇచ్చాడు రామారావు. ఓకె sir నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అన్నాడు విజయ్, పర్లేదు అడుగు బాబు , నా మనవడిని వెతికి పెట్టావంటే నీకు రుణపడి ఉంటాను అన్నాడు రామారావు , అది నా duty sir అని ,ఇంతకీ బాబుని రోజూ స్కూల్ కి ఎవరు తీసుకెళతారు అడిగాడు విజయ్ , నేనే సారు అన్నాడు అన్నాడు పక్కనే ఉన్న వీరయ్య , రోజూ నువ్వే తీసుకెళ్ళి తీసుకొస్తావా అడిగాడు విజయ్ , లేదు బాబు కిందటి ఏడాది వరకు నేనే తీసుకెళ్ళి తీసుకుని వచ్చేవాడిని ,కానీ అని చెబుతుంటే రామారావు మధ్యలో కల్పించుకొని ఈ ఏడాది పక్కింటి చిట్టి తో నడచి వస్తానని పేచీ పెడితే , దగ్గరే కదా పైగా దారిలో అంతా తెలిసిన వాళ్ళే కదా అని సరే అన్నాం ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అన్నాడు బాధగా.
మరి ఆ చిట్టి ఒక్కటే వచ్చిందా స్కూల్ నుండి అడిగాడు విజయ్, దానికి వీరయ్య లేదు బాబు నిన్న చిట్టి బడి కి పోలేదంట , చెప్పాడు వీరయ్య .ఒక నిమిషం ఆలోచించిన విజయ్ ఆ చిట్టి తో ఒకసారి మాట్లాడాలి రాఘవులు గారు అన్నాడు ,వెళదాం అన్నట్టు సైగ చేస్తూ , సరే sir ఆ పక్కనే వాళ్ల ఇల్లు వెళదాం రండి అన్నాడు రాఘవులు చేత్తో పక్క ఇంటిని చూపిస్తూ ,ఆ పక్కనే ఉన్న చిట్టి తండ్రి ఇదంతా విని దగ్గరకు వచ్చి sir నేను చిట్టి తండ్రిని రండి తీసుకెళతా మా ఇంటికి అన్నాడు, అతన్ని చూసిన రాఘవులు బసవ ఇక్కడే ఉన్నావా పద వస్తున్నాం అని , రామారావు కి మళ్ళీ కలుస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు, రామారావు వీరయ్య ను చూసి నువ్వు కూడా వెళ్ళు అన్నట్టు కళ్ళ తోనే సైగ చేశాడు, అది అర్ధం చేసుకున్న వీరయ్య విజయ్ వాళ్ల ను అనుసరించాడు .
గదిలో ఏడుస్తూ కూర్చున్న స్వప్న ఎవరు ఎంత చెప్పినా తినడానికి ఒప్పుకోవటం లేదు ,నా కొడుకును చూశాకే తిండి తింటాను అంటుంది , శాంతమ్మ ఇక ఏమి చేయలేక చూడు స్వప్న అందరికీ బాధ ఉంది , నువ్వు తల్లివి ఎంతలా కుమిలిపోతున్నాఓ నాకు తెలుసు తల్లి , కానీ నీ కడుపులో బిడ్డను ఎందుకు చెప్పు బాధపెట్టడం , ఆ బిడ్డకు కొంచెం భోజనం పెట్టనివ్వు అని ముద్దలు కలిపి తినిపించింది కోడలికి బలవంతంగా, హమ్మయ్య అని వూపిరి పీల్చుకున్నారు అక్కడే ఉన్న గంగా, విద్య ఒకరిమోహం ఒకరు చూసుకుంటు , స్వప్న అలానే కూర్చుని రాత్రి నిద్ర లేకపోవడంతో మగత పట్టేసింది అలానే కూర్చుని నిద్రలోకి వెళ్ళిపోయింది. స్వప్నను సరిగా బెడ్ మీద పడుకోబెట్టారు గంగ, విద్య కలసి , రూం లో నుండి బయటకు వెళ్లారు ఇద్దరూ. అయినదానికి కానిదానికి కోడలిని సాధించే అత్తలున్న ఈ రోజుల్లో ఆంటీ స్వప్న అక్క ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంది విద్య గంగ తో, వదిన కూడా తన అత్త , మామ లను సొంత తల్లి, తండ్రుల లానే చూసుకుంటుంది , మనతో కూడా ఎంత ప్రేమ గా ఉంటుంది నీకు తెలుసు కదా , పెళ్లయిన నెల రోజులకే వేరు కాపురం పెట్టించే ఈ రోజుల్లో ,తను సిటీ లో పుట్టి పెరిగి చదువుకుని ఉండి కూడా , అన్నయ్య విలేజ్ లో సెటిల్ అవ్వాలని అనుకున్న నిర్ణయాన్ని గౌరవించి మా అందరితో ఇలా విలేజ్ లో ఉంటుందంటే వదిన గ్రేట్ విద్యా ,ఇంత మంచి మనసు ఉన్న వదిన కి ఎందుకింత కష్టం వచ్చింది అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది గంగ.
నువ్వే ఇలా అయిపోతే ఆంటీ , uncle ని ఎవరు చూసుకుంటారు చెప్పు , నువ్వే కదా వాళ్లకు ధైర్యం చెప్పాలి , అని ఓదార్చింది గంగని విద్య.
.