అయితే అందరం కలిసి ఇప్పుడే ఆ రామలింగం ఇంటికి వెళ్లి చుట్టు ముడదాం అన్నాడు ఆవేశంగా యువకుడైన వీరేశం ,అవును వెళదాం అంటూ అరిచారు ఇంకొంత మంది. ఆవేశంతో కాదు ఆలోచించి చేయాలి ఏదయినా ఏ ఆధారం లేకుండా ఏమి చేద్దామని వెళతారు గట్టిగా అన్నాడు కానిస్టేబుల్ రాఘవులు. ఏంటి రాఘవ బాబాయ్ అనుమానం ఉండి కూడా చేతులు కట్టుకొని కూర్చోమని అంటావా అన్నాడు వీరేశం , నువ్వేగా అంటున్నావ్ అనుమానం అని అతడే చేశాడని ఆధారం లేదు ,ఈ రోజు మన వూరిలో కొత్తవాళ్లని ఎవరయినా చూసారా చెప్పండి అన్నాడు రాఘవులు ,లేదు అన్నారు అంతా, మరి ఏం చెయ్యాలి నువ్వే చెప్పు రాఘవులు బాబాయ్ అన్నాడు వీరేశం కొంచెం తగ్గి , నేను case file చేసి సర్పంచ్ గారితో సైన్ చేపించాను, మోహన్ కొంత మందితో ఒక పక్క రెండు వూళ్లు వెతకటానికి వెళ్ళాడు, ఇంకొక పక్క రెండు వూళ్లు వెతకటానికి నేను కానిస్టేబుల్స్ ని పంపాను , ఉదయాన్నే కొత్త S.I గారు వస్తున్నారు అందుకే నేను వెళ్ళలేదు ,రేపటికి బాబు దొరకకపోతే S.I గారిని తీసుకొని నేనే పోలవరం వెళతాను, ఏదయినా అనుమానం అనిపిస్తే నేనే మీకు కాల్ చేస్తా సరేనా అన్నాడు రాఘవులు ,సరే అంటూ తలలు వూపారు అంతా. సరే ఇక్కడే నుంచొని ఇంకేం చేస్తాం వూరంతా వెతికాం వెళ్లి కాసేపు పడుకోండి ,ఏదయినా తెలిస్తే మన డప్పు కొట్టే సాంబడు డప్పు కొడతాడు అప్పుడు అందరం రావచ్చు అన్నాడు రాఘవులు సాంబడి వైపు చూపిస్తూ ,అట్టాగే అయ్యా ఈ పొలిమేరలో నే కదా నా ఇల్లు ఏదయినా తెలిస్తే వెంటనే వూరంతా డప్పు కొడతా అన్నాడు సాంబడు. సరే అంటూ ఇళ్ళ దారి పట్టారు అంతా విచారంగా , ఇళ్లకు వెళ్లారన్నారు అన్న మాటే గానీ ఎవరికీ నిద్ర పట్టడం లేదు. అటు రామారావు గారి ఇంట్లో స్వప్న ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పోయింది. అది చూసిన శాంతమ్మ, రామారావు కంగారు పడ్డారు, గంగ తన ఫ్రెండ్ విద్య ఇద్దరూ స్వప్న కు నచ్చచెప్పి కొద్దిగా మజ్జిగ తాగించారు . రోజూ ఇంటికి రాగానే తనను చుట్టేసి ముద్దు ముద్దు మాటలు చెప్పే సంపత్ పక్కన లేకపోతే ఎంతో దిగులుగా ఉంది గంగకు , రోజూ తానే కథలు చెప్పి నిద్రపుచేది గంగ ,అదంతా గుర్తుకు వచ్చి దుఖం ఆగట్లేదు గంగకి ,రామారావు , శాంతమ్మ లది కూడా ఇదే పరిస్థితి ,గర్భవతి అయిన తన కోడలు ఏమయిపోతుందో అని ఇంకొక వైపు కంగారు పడుతున్నారు ఇద్దరు. అరగంటకొకసారి కొడుకు మోహన్ కి కాల్ చేసి ఏమయింది అని అడుగుతూనే ఉన్నాడు రామారావు కాల్ చేసిన ప్రతిసారీ నిరాశే మిగిలింది. పక్క వూళ్ళ సర్పంచ్ లకు కూడా కాల్ చేసి విషయం చెప్పాడు రామారావు, ఆలస్యం చేయకుండా వాళ్ళు కూడా వెతికించటం మొదలు పెట్టారు. ఇంటికి వచ్చిన వీరయ్యకు పడక కుర్చీలో దిగాలుగా కూర్చోని కని పించాడు రామారావు ఎప్పుడూ గంభీరంగా ఉండే తన యజమాని ఇలా కుంగిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు వీరయ్య , వెళ్లి రామారావు కాళ్ళ దగ్గర కూర్చొని ఇంతవరకు వూళ్ళో జరిగింది అంతా చెప్తున్నాడు వీరయ్య, రామారావు చెవులకు మాత్రం ఏమి వినపడటం లేదు తన మనవడు ఏడుస్తున్నట్టు అనిపిస్తోంది, తన గుండెను ఎవరో పిండినట్టు భాదగా ఉంది, గంగానమ్మ తల్లి నా మనవడిని కాపాడు వాడిని క్షేమంగా ఇంటికి చేర్చు వాడు ఇంటికి రాగానే నీ గుడిలో అన్న సంతర్పణ చేయిస్తా అని మొక్కుకున్నాడు మనసులో, ఇంటి లోపల గంగ ఫ్రెండ్ విద్య ఫోన్విద్య పక్కకు వచ్చి హలో అంది ఫోన్ లిఫ్ట్ చేసి , విద్యా ఎలా ఉన్నారు రామారావు గారి ఇంట్లో వాళ్ళు అని అడిగాడు అటునుండి ఫోన్ లో కానిస్టేబుల్ రాఘవులు , స్వప్న అక్క అసలే pregnant పాపం ఏడుస్తూ నే ఉంది , uncle,aunty కూడా చాలా డల్ అయిపోయారు న్నాన్న వాళ్ళను ఇలా చూడ వలసి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు అంది విద్య. head కానిస్టేబుల్ రాఘవులు కూతురు విద్య. విద్య మాటలు విన్న రాఘవులు మంచి వాళ్లకు అన్యాయం చేయడు ఆ భగవంతుడు , బాబు తప్పకుండా దొరుకుతాడు , నువ్వు వాళ్ల ని జాగ్రత్తగా చూసుకో తల్లి అన్నాడు. సరే నాన్న నేను రిపొద్దిన్నే ఇంటికి వస్తాను అమ్మకు చెప్పండి అని ఫోన్ పెట్టేయబోతు ఏదో గుర్తచ్చినట్లు ఆగి నాన్న అన్నయ్యకు ఈ విషయం చెప్పారా అని అడిగింది విద్య, లేదు తల్లి నేను అన్నయ్యకు ఫోన్ చేయలేదు ఇప్పుడే ఇంటికి వచ్చా , నువ్వు రామారావు గారి ఇంట్లో ఉన్నావని చెప్పింది మీ అమ్మ ,వాళ్ళ గురించి అడుగుదామని నీకు ఫోన్ చేశాను అన్నాడు రాఘవులు. అవును నాన్నా నేను, గంగ వూళ్ళో కి రాగానే సంపత్ కనిపించట్లేదు అని తెలిసింది, అందుకే నేను గంగతో ఇక్కడికి వచ్చా ఇక్కడ పరిస్తితి చూసి ఉండిపోయా అంది విద్య. అమ్మ చెప్పింది తల్లి నువ్వు ఫోన్ చేశావని అక్కడే ఉండి మంచి పని చేసావు, మోహన్ వాళ్ళు ఇంటికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు , మీ అన్నయ్య సాగర్ కి నేను ఉదయాన్నే కాల్ చేస్తాను , అన్నట్టు ఉదయాన్నే కొత్త S. I గారు వస్తున్నారు , నేను వెళ్లి రిసీవ్ చేసుకోవాలి సో నువ్వు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియజేయి అన్నాడు రాఘవులు , సరే నాన్నా ఒకసారి పొద్దుటే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడకు వచ్చేస్తా, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది . రామారావు గారు పడకకుర్చీ లో వెనక్కు వాలి కళ్ళు మూసుకునే సరికి మగతగా అనిపించింది. తన కాళ్ళ దగ్గర మాటల్లో ఉన్న వీరయ్య కునిపాట్లు పడుతూ , కళ్ళు మూసుకున్న రామారావుని చూసి తను కూడా అక్కడే అరుగు మీద ఒరిగాడు నిదానంగా . రామారావు కి తాతయ్యా అంటూ ఏడుస్తూన్న మనవడి గొంతు వినిపించింది.