Read The shadow is true - 20 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 20

అజయ్ పెదవులపై చిరునవ్వు ‘ గొప్ప రాజవంశానికి ప్రతినిధి ‘ అన్న కామెంట్ మంత్రం లా పనిచేసింది . నిజానికి అతడి బలం, బలహీనత---రెండూ ఈ భావన లో నే ఇమిడి ఉన్నాయి . అతడి సంస్కారానికి , సంకుచిత మనస్తత్వానికి royal blood అన్న భావనే మూలం . అన్న విక్రం నుండి మంచి గుణాలు పుణికి పుచ్చుకు న్నాడు . జాత్యహంకారం తో మొండిగా, బండ గా తయారయినాడు .

ఇంతలో రూపా దేవి వచ్చింది . భార్య గా పరిచయం చేశాడు . పేరుకు తగ్గట్లే ఆమె చాలా అందం గా ఉంది . చదువు, సంస్కారం ఉన్న మనిషి లా అనిపించింది . ఈ బండరాముడికి, దొండపండు లాంటి రూపా దేవికి జత ఎలా కుదిరిందా ? అని జస్వంత్ ఆశ్చర్యపోయాడు . “ ...... సతి నిస్సందేహం గా దురాచారమే . ఈ అభిప్రాయం ఎవరూ కా ద న లేరు . రాజస్థాన్ లో ముఖ్యంగా రాజకుటుంబాలలో ఇదో ఆచారం గా పాటించే వారు . మీరు అన్నట్లు ఇది చరిత్ర చెప్పే సత్యం . ఒక స్త్రీ సజీవం గా భర్త చితి లో కాలిపోవటం హృదయ విదారక సంఘటన . అయినా ఇది ఆచారం . పురాణ కాలం లోనే ఈ ఆచారం పాటించినట్లు

సాక్ష్యాలు ఉన్నాయి . శాప కారణం గా పాండు రాజు మరణిస్తే

అతడి మరణానికి కారణమైన మాద్రి భర్త తో సహగమనం చేసింది . కొడుకుల బాధ్యత తీసుకున్న కుంతి ఆ ప్రయత్నం మానుకుంది . ఈ సంఘటన వల్ల మనకు

తెలిసింది ------సతి స్త్రీలందరూ విధిగా పాటించవలసిన ఆచారం కాదు . వారి వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడిన విధి విధానం ..... మా కుటుంబ స్త్రీ ల విషయం లోనూ వారి నిర్ణయం తో నే రెండు సహగమనాలు జరిగాయి . ఎవరూ వారిని సహగమనం చేయమని ఒత్తిడి చేయ లేదు . భర్త ఎడబాటు భరించలేక , బ్రతుకు భారం మోయలేక వారా సాహసం చేశారు . ఆపాలని మా వంతు ప్రయత్నం త్రికరణశుద్ధిగా శుద్ధిగా చేశాం . వారు ససేమిరా వినలేదు . సహగమనం చేస్తానన్న స్త్రీ సతీత్వం గౌరవించాలి గనుక నిస్సహాయ పరిస్థతి లో వారి సహగమనాన్ని అంగీకరించాము . ఇలాంటి సంంఘటనలు చరిత్ర లో చాల ఉన్నాయి . ... ఇప్పుడు మీరేమంటారు ? సతి సదాచారమా / దురాచారమా ? సతి ఈ రెండింటి లో ఏదైనా కావచ్చు ; కానీ----ఈ ఇద్దరి స్త్రీల సాహసాన్ని , సతీత్వాన్ని గౌరవించాలా లేదా ? .....అందుకే మా ఇంటి ఇలవేల్పు ఐశ్వర్యా దేవికి స్మారక మందిరం నిర్మించాము .

దేవతలా ఆరాధిస్తున్నాము. ఆచారం, సంప్రదాయం అన్నవి చాలా సున్నితమైన అంశాలు . ప్రజల మనోభావాలు, నమ్మకాల తో ముడిపడి ఉంటాయి . జాగ్రత్త అవసరం “.

విద్యాధరి డైరీ లో ఊపిరి పోసుకున్న అజయ్, తను చూస్తున్న అజయ్ ---- ఇద్దరి లో చాలా తేడా ఉంది . కాలం, వయసు, లోకానుభవం అతడి లో ఊహించని మార్పుకు కారణ మైనాయి . భార్య రూపాదేవి ప్రభావం అతడి పై తప్పక ఉంది ఉంటుంది . ఆమె కట్టి పడవేసే సౌందర్యం , సంస్కారం, అనురాగం , అతడి వ్యక్తిత్వం పై చెరగని ముద్రలు వేశాయి . అతడి లో ‘ మనిషి ‘ రూపా దేవి చెక్కిన శిల్పమే .

“ మీ సునిశిత దృష్టికి , విశ్లేషణ కు నా హృదయ పూర్వక అభినందనలు . సతి పై మీ అభిప్రాయం చాలా విలక్షణం గా ఉంది . మీరు మనఃస్ఫూర్తిగా , నిస్సంకోచం గా నిజాలే మాట్లాడారు . మీ అభిప్రాయాలకు పాఠకుల నుండి మంచి స్పందనే వస్తుంది . “ ... క్షణం ఆగాడు “ చదువు, సంస్కారం, అభ్యుదయ భావాలు ఉన్న రూపా దేవి గారి అభిప్రాయం కూడా తెలుసుకోవటం కూడా నాకు చాల ముఖ్యం . సతి పై మీ అభిప్రాయం ఏమిటి రూపా దేవి గారూ “? జస్వంత్ రూపాదేవి ని కుతూహలం గా చూశాడు .

“ మీ అభిప్రాయమే నా అభిప్రాయం . సతి, స్త్రీ కి నాటి సమాజం విధించిన మరణ శిక్ష . కిరాతక చర్య . ఈ చర్య లో పురుషాధిక్యం , అహంకారం స్పష్టం గా కనిపిస్తాయి . “

“రూపా ! సతి ని సమాజం స్త్రీలపై విధించలేదు . సూచించింది .”

“అదే --ఎందుకని ? భర్త చనిపోయినంత మాత్రాన భార్య కు ఇక జీవితం ఉండదా ?

తెలిసో, తెలియకో ,భర్త చనిపోయాడన్న దుఃఖం తో నో ఆమె సహగమనం చేయాలనీ పట్టుబడితే ఆచారం, సతీత్వమంటూ నిర్దాక్షిణ్యం గా ఆమెను చితిపై కూర్చోబెడతారా ? మంచి మాటలతో ధైర్యం చెప్పి , వెన్ను తట్టి ఆ ప్రయత్నం మానిపించాలి కదా “?

“ అలాంటి ప్రయత్నాలు జరిగాయనడానికి మా కుటుంబమే సాక్ష్యం అని నీకు తెలుసు . మా వదిన సహగమనం చేస్తానని పట్టుబడితే మేమెంత గా చెప్పి చూశామో నీకు తెలుసుగా ? అమ్మ ప్రాధేయపడింది . విజయ్ కాళ్ళు పట్టుకునేంత పని చేశాడు . ఊరి పెద్దలు చెప్పి చూశారు. ఫలితం లేకపోయింది . ఆమె సహగమనం ఎవరూ ఆపలేకపోయారు . బ్రతుకు మీద ఆశ లేనివారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం ?” అజయ్ భారంగా నిట్టూర్చాడు.

వారి వాదోపవాదాలు చాలా అర్థవంతం గా ఉన్నాయనిపించింది .జస్వంత్ కు . కుతూహలం గా వారిద్దరినీ చూడసాగాడు .

రూపా దేవి కాసేపు మౌనం గా ఉండిపోయింది . ఆలోచనల వలయం లో చిక్కుకు పోయింది . ...” తప్పు కేవలం మనుషుల్లోనే లేదు ; ఆనాటి వ్యవస్థలొనూ ఉంది . అప్పటి స్త్రీలు చాలామంది ఇంటికి ,ఇంటి బాధ్యతలకు పరిమితమై పోయే వారు . స్వేచ్చ లేదు, స్వతంత్రం గా ఆలోచించలేక పోయేవారు . పెద్దగా చదువు కునే అవకాశాలు లేవు . కారణం—నాటి పితృ వ్యవస్థ .తండ్రి మాట కాదనలేరు . అతడు చెప్పిందే శాసనం . పెళ్లి తర్వాత ప్రతి విషయానికి భర్త పై ఆధార పడాలి . వారి ఊహలు, ఊపిరి, ఉనికి భర్తలే . అందుకే భర్త మరణం, ముఖ్యంగా చిన్న వయసులో వారిని క్రుంగ దీసేది . భవిష్యత్తు అయోమయం గా అనిపించేది . వారిని వికృతం గా మార్చి వెలిసే వారు . శుభకార్యాల్లో వారి ఉనికి అశుభం . ... చనువుగా , ధైర్యం గా నలుగురిలో కలిసిమెలిసి తిరగ లేరు . అలా ప్రతిక్షణం తమ వైధవ్యం గుర్తుచేసుకుంటూ బాధ పడే కన్నా భర్త తో సహగమనం చేస్తే శాశ్వత విముక్తి అని భావించేవారు .”

రూపా దేవి విశ్లేషణ జస్వంత్ కు నచ్చింది . ఆమె ఆలోచనలో రీజనింగ్ ఉంది అనిపించింది.” నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే. మగమహారాజుల అహంకారం. వారి పైచేయి ఆనాటి ఆడవాళ్ళను అన్ని విధాలా బలిపశువును చేశాయి . కానీ—ఆచారాల స్వభావం నిర్ణయించడానికి కొన్ని పరిస్థితులలో సంధర్భం కాలమానం అవుతుంది . సంధర్భం మారితే ఆచారాల రూపురేఖలు కూడా మారిపోతాయి .

సతి ని దురాచారం అనను గాని మా కుటుంబం లో జరిగిన రెండు సహగమనాల తీరును బట్టి చూస్తే ఆ రెండూ ఉదాత్త సంఘటనలు అని చెప్పవచ్చు . ఈ మాట నేను కాదు, జస్వంత్ జీ అన్నారు.”

అజయ్ ఆలోచనా సరళి, మాట తీరు జస్వంత్ నే కాదు రూపా దేవి ని కూడా

ఆశ్చర్య పరచాయి . అజయ్ లో ఇంత మనిషి ఉన్నాడా అనిపించింది .

“మీ పరిశీలన బాగుంది . ప్రతి సంఘటనకు ఒక సంధర్భం తప్పక ఉంటుంది .

సంధర్భం మారితే సంఘటన రూపురేఖలు కూడా మారిపోతాయి . ఆచారాలు కూడా అంతే . పురుషాధిక్యం, నాటి సామాజిక పరిస్థితులే కాకుండా మూఢ నమ్మకాలు సతిని దురాచారం గా మార్చి వేశాయి . చనిపోయిన భర్త తో భార్య సహగమనం చేస్తే ఆమె కుటుంబానికి శుభం జరుగుతుందని ఓ గుడ్డి నమ్మకం ఆ కాలం లో ఉండేది . అందుకే భర్త పోయిన ఆడవారిని సహగమనం చేయమని ఆమె కుటుంబ సభ్యులే ఆమెను బలవంతం చేసేవారు . వేధించేవారు . కనుక మీ కుటుంబ దృష్టి లో సతి మరపురాని, మరిచిపోలేని సంగటన. మూఢనమ్మకాలు పాటించే వారి విషయం లో అదొక కిరాతక చర్య . జస్వంత్ మరోసారి అజయ్ ను మునగ చెట్టు ఎక్కించాడు . అజయ్ మొహం లో సంతోషం చిందులు వేసింది .

జస్వంత్ జీ నాదొక సందేహం . --- మీరే తీర్చాలి. భర్త పోయిన స్త్రీ కి సతి విధించి నట్లు భార్య పోయిన భర్తకు ఏ పరిమితులు హద్దులు విధించలేదే --- సారీ ! సూచించలేదే ?” భర్తను ఓరకంటి తో చూస్తూ అంది రూపా దేవి.

అజయ్ భార్యను గుర్రుగా చూశాడు . వారిని చూసి జస్వంత్ నవ్వాడు .

“ మీరే చెప్పండి ! మగవారికి మినహాయింపులు –ఆడవారికి ఆంక్షలా ? ఇదెక్కడి న్యాయం “? ఆమె స్వరం లో అల్లరి, చిలిపితనం. జస్వంత్ పెదవులపై మళ్ళీ చిరునవ్వు . “ ఈ ఇంటర్వ్యూ ప్రధాన లక్ష్యం ఇలా

ఎందుకు జరిగింది –అందుకు కారణాలేమిటి అని చర్చించటమే .......ఇలా ఎందుకు లేదు, ఇలా ఎందుకు ఉండకూడదు అన్న అంశాలు మన చర్చ పరిధి లో లేవు . మనం సతికి సంబంధించిన అంశాల పై మాట్లాడుకుంటే బాగుంటుంది . ...ఎనీవే ! మీ ఇద్దరి ఆలోచనలు , అభిప్రాయాలు చాలా విలక్షణం గా ఉన్నాయి . నేను ఆశించిన దానికన్నా మన చర్చ చాలా బాగా జరిగింది . అజయ్ జీ ఆలోచనా సరళి, మీ అభ్యుదయ భావాలు , క్రిటికల్ అప్రోచ్ నా ఆర్టికల్ ను బాగా ఎలివేట్ చేశాయి .

I am extremely happy . “

****************************************