Read The shadow is true - 12 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 12

కాళరాత్రి ఎలాగో గడిచింది . తెల్లవారింది .విక్రం సింహ్ మరణవార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది . జనం తీర్థప్రజ లాగా రాసాగారు . పరగణా మొత్తం కదిలింది . సముద్రం లా పొంగిన జనసముహాలను , సానుభూతి పరులను ఆపటం విక్రం తమ్ముళ్ళకు అసాధ్యమైంది . అన్నగారి అంత్య క్రియలు మరో రోజుకు వాయిదా వేయక తప్పింది కాదు . ఆ రోజు కూడా అరని శోకంతో నే గడిచి పోయింది . ఏది ఆగినా ఆగక పోయినా కాలం ఆగదు . సూర్యుడు పడమటి కొండల పై అలసట గా నిట్టూర్చాడు . ఊరి పై చీకటి మెల్ల మెల్ల గా పరుచు కుంటోంది .

విక్రం శవాన్ని అ రోజు ఉదయమే పెద్ద లోగిలి కి తరలించారు . శవాన్ని ప్రత్యేకమైన తైలాలతో భద్రపరచారు . పూలవాసన తో , అగరుధూపం తో శవాన్ని ఉంచిన ప్రదేశం గుబాలించింది . –విక్రం సింహ్ కీర్తి లాగానే .

జనం పలచ బడ్డారు . విక్రం సింహ గొప్పదనం బరువెక్కిన గుండెల తో నెమరు వేసుకుంటూ ఇళ్ళకు వెళ్లి పోయారు . కలకలం తగ్గింది . చీకటి నేస్తం నిశ్శబ్దం విక్రం లోగిలి లో యధేచ్చగా రాజ్యమేలుతోంది .

కోమలా దేవి , విక్రం తల్లి ఏడ్చి ఏడ్చి శోష పోయారు . కన్నీళ్లు ఇంకి పోయాయి . తోటకూర కాడల్లా వాడి పోయారు . దగ్గరి బంధువులు ఉపచారాలు చేస్తున్నారు

విజయ్ సింహ్ దిక్కు తోచని పరిస్థితి లో పడిపోయాడు .గుండెల్లో రగులుతున్న బాధ ! ‘ తాము అనుకున్నది ఏమిటి ? జరిగిందేమిటి ? కోమలా దేవి కంట్లో నలుసులా ఉందని తొలగించాలను కుంటే కొండంత అన్నగారు నాటకీయంగా తప్పుకున్నారు . తిరిగిరాని లోకాలకు తరలి పోయారు . తను , అజయ్ అనాధలా మిగిలి పోయారు. ఈ నష్టం ఎవరూ పూడ్చ లేనిది ?

ఈ స్థితి లో అతడికి వంశం, పరువు, ప్రతిష్ట, పట్టుదలలు, పంతాలు అర్థ రహితం గా తోచాయి . మెదడు మొద్దు బారి పోయింది . నిర్వికార స్థితి లో ఉండి పోయాడు .

అజయ్ సింహ్ లో అవధులు మించిన దుఖం తో పాటు సహజావేశం పొంగుకు వచ్చింది . అయినా తమాయించుకున్నాడు . అతడి ఆవేశానికి లక్ష్యం కోమల . అతడి లో ఒక భావం నాటుకు పోయింది . --- ఇన్ని అనర్థాలకు కారణం కోమలా దేవి . !! కోమలను వివాహం చేసుకున్నందు వల్లే అన్న వేరు కాపురం పెట్టాడు . ఎన్నడూ లేంది--- తమ తోడూ లేకుండా అసుర సంధ్య వేళ పొలం గట్టు మీద నడుస్తూ పాము కాటు తో ప్రాణాలు పోగొట్టు కున్నాడు . ఏ కోణం లో చూసినా ఇన్ని అనర్థాలకు కారణం , మూలం కోమలాదేవి . ఈ విపరీతమైన ఆలోచన అతడిని ఒక అభిప్రాయానికి పరిమితం చేసి మూఢుడుగా మార్చి వేసింది . .అతడా ‘ట్రాన్స్ లో నుంచి బయటపడటం అసాధ్యం . ఎవరి హితబోధలు , తర్కాలు అతడి అభిప్రాయాన్ని మార్చలేవన్నది ముమ్మాటికీ తిరుగు లేని సత్యం . ఇది సమయం, సంధర్భం కాదు అన్న స్పృహే అతడిని మౌనం గా , గంభీరం గా ఉంచ గలిగింది .

 

‘తంతు ముగించుకుని ఇంటికి వచ్చిన పన్నాలాల్ వేళకాని వేళ , అర్థరాత్రి దాటిన సమయం లో తేజ్ సింహ ను చూసి ఉలిక్కి పడ్డాడు . విషయం తెలిసి నిశ్చేష్టుడయాడు .

మేనల్లుడి అకాల మరణం తేజ్ సింహ ను బాగా క్రుంగ దీసింది . క్షుద్ర పూజ ఆపమని చెప్పేందుకే అంత రాత్రి వేళ పన్నాలాల్ ఇంటికి వచ్చాడు . ఆ మాట తో పన్నాలాల్ క్రుంగి పోయాడు . ఎంతో దీక్ష తో నిర్వహించే కార్యాన్ని పూర్తి చేయకుండా ఆపటమా ? అదెంతో ప్రమాదం . ! ఆవాహన చేసి క్షుద్ర శక్తిని తృప్తి పరచకుండా వదిలివేస్తే అది ప్రయోగం చేసిన వాడినే కబళించి వేస్తుంది . ఆమాటే అతడు తేజ్ సింహ్ తో అన్నాడు. తేజ్ సింహ్ అతడి భయం, అభ్యంతరం అసలు పట్టించు కోలేదు . ఏదో విధం గా ప్రయత్నం ఆపమని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసవిసా వెళ్లి పోయాడు .

 

పన్నాలాల్ నిలువునా క్రుంగి పోయాడు . ఇప్పుడు ప్రయోగం ఎలా కొనసాగించాలి ? ఎవరి సాయం తో ? తేజ్ సింహ్ వైఖరి స్పష్టం గా తెలిసి పోయింది . అతడు సహకరించడు . విజయ్ మొదటి నుంచే క్షుద్ర విద్యలకు కొంత దూరం గా ఉన్నాడు . తప్పని పరిస్థితుల్లో మిగతా ఇద్దరి తో చేయి గలిపాడు . ఇప్పుడు అతడిని సంప్రద స్తే చాలా ప్రమాదం . దేహశుద్ది తప్పదు . పన్నాలాల్ కు కొద్దో గొప్పో అజయ్ మీదే ఆశలున్నాయి . ముగ్గురి లో కోమల మాట వింటేనే అతడు భగ్గుమంటాడు . ఆ ఆవేశ పరుడిని ఎలాగైనా మచ్చిక చేసుకోగలిగితే కోమల విషయం లో అతడి సహకారం పొందవచ్చు . ప్రతిఫలం అతడి ముందే రాబట్ట వచ్చు .

ఈ ఆలోచనా భారం తో నే తెల్లవారి పోయింది . అలాగే అలసి పోయి నిద్రలోకి జారు కున్నాడు బారెడు పొద్దు ఎక్కాక ఉలిక్కిపడి లేచాడు . చకచకా కాలకృత్యాలు ముగించుకుని పక్క ఊరికి ప్రయాణమైనాడు . ఆ ఊర్లో ఓ స్నేహితుడిని కలిశాడు . అతడు నాటకాలకు కావలిసిన దుస్తులు, అలంకరణ సామాగ్రి సప్లయి చేస్తుంటాడు . మంచి మేకప్ ఆర్టిస్ట్.

పన్నాలాల్ అతడి ముందు కూర్చున్నాడు . ( పన్నాలాల్ బ్రతుకు దెరువు కోసం నాటకాలు ఆడాడు . అప్పుడు ఇతడికి, పన్నాలాల్ కు మంచి దోస్తీ ఏర్పడింది . క్షుద్రవిద్యలు నేర్చుకున్న తర్వాత నటన వదిలేశాడు . పన్నాలాల్ మంచి నటుడు )

ఏ మాత్రం గుర్తించని రీతి లో తననో బైరాగి గా మార్చమని స్నేహితుడిని పురమాయించాడు . కుతూహలం తో స్నేహితుడు వివరాలు అడిగితె మళ్ళీ చెబుతానని , మేకప్ చేయమని తొందర చేశాడు .

గంటన్నర సేపు ఓపిగ్గా కూర్చున్నాక పన్నాలాల్ పవిత్రమైన సాధువులాగా మారిపోయాడు . ఏ మాత్రం గుర్తు పట్టని రీతి గా, అతి సహజం గా ఉన్నాడు. స్నేహితుడి కళాకౌశలానికి తగినట్లే పన్నాలాల్ పారితోషికం ముట్టజెప్పాడు .

చీకటి పడే వేళకు పన్నాలాల్ విక్రం సింహ గ్రామం చేరుకున్నాడు . మహల్ కు వెళ్ళాడు . కోట లాంటి మహల్ లో ఎక్కడ చూసినా శోకం తాండవిస్త్తూంది . అతడి రాక ను ఎవరూ అంతగా పట్టించుకోలేదు . ఎవరి ధ్యాస లో వారున్నారు .

పన్నాలాల్ విక్రం సింహ్ భౌతిక కాయానికి భక్తీ తో చేతులు జోడించాడు . పూలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం కూడా పాటించాడు . అతడి ప్రతి చర్య అతడి వేషం , వాలకానికి అనుకూలం గా ఉంది . అదే సమయం లో ఎవరిని ఏదో అడగటానికి తేజ్ సింహ అటుగా వచ్చాడు.. ఒక్కక్షణం పన్నాలాల్ గుండె ఝల్లుమంది. తమాయించుకున్నాడు . తేజ్ సింహ పన్నాలాల్ ను గుర్తించలేదు . పనాలాల్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు .

అజయ్ ను కలవాలని పన్నాలాల్ ఆరాటం.అజయ్ ఎక్కడ ఉన్నదో ? ఏ పరిస్థితి లో ఉన్నదో ? తన మాటలు వినే మానసిక స్థితి ఇప్పుడతడికి ఉందొ లేదో ? పన్నాలాల్ కు అన్నీ అనుమానాలే / అసలీ సాహసం ఏ పర్యవసానికి దారి తీస్తుందో .

మెల్లగా ఆ ఇంటి దర్బారు హాల్లోకి దారితీశాడు . దర్బారు హాలు విశాలం గా , కళాత్మకం గా ఉంది. అక్కడి గోడల కు ఎన్నో తైలవర్ణ చిత్రాలు , ఛాయాచిత్రాలు ఉన్నాయి . అందులో ఓ నిలువెత్తు తైల వర్ణ చిత్రం పన్నాలాల్ దృష్టిని ఆకర్షించింది . ఆ చిత్రం ఒక స్త్రీ సతి కి చెందినా ఉదాత్త సంగటన. స్త్రీ మొహం లో పవిత్రత, ధర్మావేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి . భర్త తలను ఒడిలో ఉంచుకొని అర్థ నిమీలత నేత్రాలతో , ముకుళిత హస్తాలతో తనను కబళిస్తున్న అగ్ని కీలలకు ఆహుతి కావడానికి సిద్ధం గా ఉంది . చుట్టూ చేరిన జన సందోహం పూలు చల్లి భక్తీ తో ఆమెకు వీడ్కోలు చెబుతున్నారు . జయజయధ్వానాలు చేస్తున్నారు . ఆ అపురూప దృశ్యాన్ని చిత్రకారుడు ఎంతో అంకితభావం తో కాన్వాస్ పై చిత్రీకరించాడు . ఎలాంటివారికైనా ఆ దృశ్యం చూస్తె మనసు ఆర్ద్రమై కళ్ళు చెమ్మగిల్లుతాయి .

కానీ, అ చిత్రం పన్నాలాల్ మనసులో ఏవేవో ఆలోచనలు ప్రేరేపించింది . అనూహ్యమైన రీతి లో చెలరేగిన విచిత్రమైన ఊహలు అతడినొక కిరాతక చర్యకు పురికొల్పాయి . మనసు తను సంకల్పించిన కార్యం పై లగ్నం కాగానే పన్నాలాల్ మొహం లో ఉద్వేగం , ఉత్సాహం పోటీ పడసాగాయి .

అటుగా వెళ్ళే ఒకరిని ఆ చిత్రం గురించి వివరాలు అడిగాడు . అతడు ఆగి సాధువు వేషం లో ఉన్న పన్నాలాల్ ను ఎగాదిగా చూశాడు . “ స్వామీ ! మీరీ ఊరికి కొత్తనుకుంటాను . ఈ చిత్రం గురించి తెలియని వారు ఈ ఊర్లో ఎవరూ ఉండరు . ఈ చిత్రం లో స్త్రీ ఈ ఇంటి ఇలవేల్పు . భర్తను ప్రత్యక్షదైవం గా పూజించింది . అతడిదే లోకం గా జీవితం గడిపింది . ఆ భార్యాభర్తలు క్షణం కూడా వదిలి ఉండే వారు కారు . అలాంటివారిని విధి విడదీసింది . అతడు అనుకోకుండా పాము కాటు తో మరణించాడు , అతడు లేని జీవితాన్ని ఆమె కనీసం ఊహించలేక పోయింది . ఎందరు ఎంతగా చెబుతున్నా వినకుండా సహగమనానికి సిద్ధ పడింది . అందరూ చూస్తుండగా చితిపై కూర్చొని , సంతానం లేని కారణం గా మరిది చితికి నిప్పంతిస్తే భర్త పేరు స్మరిస్తూ అగ్నికి ఆహుతైంది . ఆదర్శ స్త్రీ గా ఈ వంశం వారు కొలిచే దేవత గా నిలిచిపోయింది . ఆమెకు ఈ ఊరి చెరువు గట్టున గుడి కట్టారు . ఈ ఊరికి కోడలిగా వచ్చిన ప్రతి స్త్రీ ఆమెను ఇలవేల్పు గా కొలుస్తుంది . ప్రతి ఏటా ఆమె సహగమనం చేసిన రోజున ఊరి వారు పెద్ద పండగ జరుపుతారు . వయసు తో నిమిత్తం లేకుండా ప్రతి జంట ఆ గుడి ప్రాంగణం లో దీపం వెలిగిస్తుంది . అలాంటి వందల దీపాల తో ఆ రోజు నక్షత్రమండలం లా వెలిగి పోతుంది . “ చివరి మాటలు చెబుతున్నప్పుడు స్థానికుడి గొంతు లో భావావేశం

 

 

 

*******************************************

కొనసాగించండి 14 లో