Read JAASMI - 1 by BVD Prasadarao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జాస్మి (JASHMI) - 1

జాస్మి


- బివిడి ప్రసాదరావు


EPISODE 1


1


"నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావ్." సూటిగానే అడిగింది జాస్మి.
వివేక్ వెంటనే ఏమీ చెప్పలేకపోయాడు.అతడినే చూస్తుంది జాస్మి.
అది కాలేజీ ఆవరణ.
వారి చుట్టూ.. వారికి దరి దరిన.. కొంత మంది స్టూడెంట్స్ తమ సొద తమదిగా కదలాడుతున్నారు. వాళ్లెవరూ వీళ్లని పట్టించుకోవడమే లేదు.
"చెప్పు." అంది జాస్మి.
"ఏం చెప్పేది." అవస్థ పడుతున్నాడు వివేక్.
"చాన్నాళ్లుగా నా వెంట పడుతున్నావ్. క్లాసులో నన్నే పట్టి పట్టి చూస్తున్నావ్. నాతో మాట్లాడడానికి యత్నిస్తున్నావ్. ఏమిటిదంతా." చకచకా మాట్లాడింది జాస్మి.
వివేక్ బిత్తరయ్యి పోయాడు.
అతడినే సూటిగా చూస్తుంది జాస్మి.
"మరి.. మరి.. అది కాదు.." అంటున్నాడు వివేక్.
"ఏం కాదు." టక్కున అంది జాస్మి.
"అదే.. మరి.. మరి.. నువ్వంటే.." తడబడుతున్నాడు వివేక్.
"ఆ. నేనంటే.. బోలో. కక్కై." విసురుగా అంది జాస్మి.
తల గోక్కుంటున్నాడు వివేక్.
"చేవ లేనోడివి. నీలాంటోడికి ప్రేమలెందుకు." కసురుకుంది జాస్మి.
"అబ్బే ప్రేమ కాదు. నువ్వంటే ఇష్టం. అంతే." తడబడుతున్నాడు వివేక్.
"అబ్బఛా." అంది జాస్మి తేలిగ్గా.
తల దించుకున్నాడు వివేక్.
"నిలతీస్తే నిలబడ లేక పోతున్నావు. నీకు ఎందుకు ఈ వెంపర్లాటలు. పోఫో." చెప్పుతుంది జాస్మి.
"ప్లీజ్. ప్లీజ్." ఆమెకు అడ్డు పడ్డాడు వివేక్.
"నాకెందుకు ఈ తంటాలు." అంది జాస్మి.
వివేక్ ఏదో చెప్పబోతుండగా -
"చాలు. ఇంతకీ కోరి పిలిచి నీతో ఈ రోజు మాట్లాడుతుంది ఎందుకో తెలుసా." ఆగింది జాస్మి.
వివేక్ ఆమెనే చూస్తున్నాడు.
"నీ చేష్టలకు బ్రేక్ వేయించడం కోసమే." చెప్పింది జాస్మి.
వివేక్ ఏమీ అనలేక పోతున్నాడు.
"సూటిగా చెప్పేస్తున్నాను. వినుకో. నాకు ఇట్టివి గిట్టవ్. నన్ను విడిచి పెట్టేయ్." చెప్పేసింది జాస్మి.
"అది కాదు.." చెప్పుతున్నాడు వివేక్.
"ఏదీ కాదు." అడ్డై చెప్పింది జాస్మి.
వివేక్ డీలా పడుతున్నాడు.
"వినుకో. నాకు చదువు అవసరం. అదే నా భవిష్యత్తుకు పెట్టుబడి. ఆ పట్టుదలతోనే నేను ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు." చెప్పింది జాస్మి.
వివేక్ ఏదో చెప్పబోయాడు.
"నో. నా మాట వినుకో. నీ భవిష్యత్తును పాడు చేసుకోకు." చెప్పింది జాస్మి. కదిలింది.
వివేక్ ఆమెను ఆపబోయాడు.
జాస్మి తీక్షణంగా -
"నువ్వు ఎంతగా ప్రయత్నించినా నేను ఒప్పుకోను. మరో మారు చెప్పుతున్నాను. వినుకో.
నా లక్ష్యం చెప్పాను. అదే నాకు ముమ్మాటికి దక్కాలి. అది తప్పా నాకు ఏమీ వద్దు. నమ్ము.
లేదూ, నేను కాదంటే, నువ్వు నన్ను ఏమైనా చేస్తానంటావా. అలానే కానీ. కానీ నేను నీకు లొంగను. మళ్లీ చెప్పుతున్నాను. నా ఆశయం తప్పా నాకు ఏమీ అక్కరలేదు.
వినుకో. లేదంటే నువ్వే నష్టపోతావు. కక్షతో నా మీద నువ్వు యాసిడ్ వేసినా, నన్ను గాయ పర్చినా, చివరికి నన్ను చంపేసినా, నువ్వు సంఘంకి, చట్టంకి లొంగక తప్పదు. నీకు శిక్ష తప్పదు. అది నీకు అవసరమా.
తప్పుకో. నాకు అడ్డు రాకు.
దయచేసి నా మాట వినుకో. నీ ఇంటి వాళ్లని సంతోష పర్చు.
నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, నా మాట వినుకో. నన్ను సంతృప్తి పర్చు." చెప్పింది.
వివేక్ తగ్గాడు. బెదిరాడు. ఆగి పోయాడు.
జాస్మి ముందుకు కదిలి పోయింది.


***


A

 

"దుర్గా."
దుర్గ నిల్చుంది.
"డు యు రిమెంబర్. పేరెంట్స్ మీటింగ్ ఎట్ ఎగ్జాట్లీ టెన్ డే ఆఫ్టర్ టుమారో మోర్నింగ్."
"యస్. టీచర్."
"యు నో. దిస్ ఈజ్ ద థర్డ్ మీటింగ్."
"యస్. టీచర్."
"విల్ యువర్ పేరెంట్స్ కమ్ దిస్ టైం."
దుర్గ తల దించుకుంది.
"నాట్ ద మదర్. ఫాదర్ సుడ్ ఆల్సో కమ్. దిస్ ఈజ్ ఎ పేరెంట్స్ మీటింగ్."
దుర్గ తల దించుకొనే ఉంది.
"ఇఫ్ యువర్ పేరెంట్స్ డు నాట్ కమ్ దిస్ టైం వుయ్ విల్ టేక్ డిస్సిప్లినరీ యాక్షన్ ఎగినెస్ట్ యు. మైండ్ ఇట్."
దుర్గ ఇంకా తల దించుకొనే ఉంది.
"సిట్."
దుర్గ తన సీట్ లో కూర్చుంది. ఇంకా తల దించుకొనే ఉంది. తను చాలా అనీజ్ లో ఉంది.
దుర్గ ఫిప్త్ స్టాండర్డ్ స్టూడెంట్.
టీచర్ క్లాస్ కొనసాగిస్తుంది.


***

ఎప్పటిలాగే సరిగ్గా సాయంత్రం నాలుగు కాగానే, స్కూల్ ముగిసింది.
స్కూల్ బస్సులో స్కూల్ నుండి ఇంటికి వచ్చిన దుర్గ -
బుక్స్ బాగ్ ను విసురుగా సోఫాలో పడేసింది. లంచ్ బాగ్ ని అదే రీతిన విసిరింది.
కూతురు చేష్టలకు బిత్తరవుతూ, "ఏమైంది దుర్గా." అడిగింది శకుంతల.
సోఫాలో కూలబడేలా కూర్చుంటూ, "రేపటి నుండి నేను స్కూలుకు పోను." చెప్పింది. లేదు అరిచింది దుర్గ.


***


2

 

"నువ్వు నాకు కావాలి." అడిగేశాడు ఆఫీసర్.
జాస్మి బెంబేలు పడుతుంది.
"ఎన్ని రకాలుగా చెప్పుతున్న నువ్వు గ్రహించలేక పోతున్నావు. అందుకే సూటిగా అడిగేశాను. ఒక రాత్రంతా నువ్వు నాతో ఉండాలి. అలా ఐతేనే నీకు పోస్టింగ్ ఆర్డర్స్ అందుతాయి." చెప్పుతున్నాడు ఆఫీసర్.
అడ్డై - "సర్. ఏంటి సార్ ఇది." తడబడుతుంది జాస్మి.
ఆఫీసర్ చెప్పడం ఆపి నవ్వుతున్నాడు వెకిలిగా.
"ఛ. నాకు చదువు ఉంది. మీరు పెట్టించిన రిటన్ టెస్ట్ లో మెరిట్ వచ్చింది. మీ ఇంటర్వ్యూను కూడా బాగా ఫేస్ చేశానంటూనే మరి ఇదేమిటి సార్." అడగ్గలిగింది జాస్మి.
ఆఫీసర్ ఇంకా అలానే నవ్వుతున్నాడు.
జాస్మి ఇంకా విస్మయంలో ఉంది. అతడి వంకే చూస్తుంది.
"నెలకు ఫీక్స్ లో ఐదంకెల శాలరీ వెనకేసుకోబోతున్నావు. అదీ యేళ్ల తరబడి. అందుకు ఒక్క మారు, ఒకే ఒక మారు, నా పక్కకు రావాలి. వచ్చి తీరాలి." చక్కగా చెప్పేశాడు ఆఫీసర్.
జాస్మి గందికవుతుంది.
"వినుకో. తప్పదు. నువ్వు తప్పితే, వెయిటింగ్ లిస్ట్ నా చెంత ఉంది." చెప్పాడు ఆఫీసర్.
జాస్మి వింది. అతడినే చూస్తుంది.


***


(కొనసాగుతుంది..)


***