Read JAASMI - 3 by BVD Prasadarao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జాస్మి (JASHMI) - 3

జాస్మి


- బివిడి ప్రసాదరావు

 

EPISODE 3

 


స్కూలు హెడ్ రూంలో ఉంది శకుంతల.
దుర్గ క్లాస్ లో ఉంది.
"మేడమ్, మా దుర్గ క్లాస్ టీచర్ కాస్తా కఠినంగా చెప్పారట. రేపటి పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు ఇద్దరూ తప్పక రావాలని." అనడం ఆపింది శకుంతల.
"యస్ మేడమ్. అది మా పద్ధతి. అలానే రావాలి." చెప్పింది హెడ్.
"మేడమ్. నాకు కొంత టైం ఇస్తే, కొన్ని చెప్పాలి." అంది శకుంతల.
"ప్రొసీడ్." అంది హెడ్.
"మేడమ్, నేను, ఒకతను ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మా ఇరువైపు పెద్దలు ఒప్పుకోలేదు. మా ఇద్దరం చెప్పాపెట్టక మా వాళ్లకి దూరంగా వచ్చేశాం. మేము పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టేశాం. చుట్టు పక్కల వాళ్ల దృష్టిలో మేము భార్యాభర్తలం గానే చలామణీ అయ్యాం.
దుర్గ పుట్టింది. అప్పటికి మా ఇరువైపు వాళ్లు మమ్మల్ని పట్టించుకోలేదు. ఐనా మేము కలిసి మెలిసి మెసులుకుంటున్నాం.
అప్పటికి అతడు అద్దెకు ఆటో తిప్పేవాడు. నేను మా అద్దె రూంలోనే ఎలిమెంట్రీ పిల్లలకు ట్యూషన్స్ చెప్పుతుండేదాన్ని. నేను మొదట్లో ఒక ప్రయివేట్ కాన్వెంట్ లో టీచర్ గా పని చేసేదాన్ని.
దుర్గకు రెండేళ్లు వస్తుండగా, ఏమో, ఏమైందో, సడన్ గా దుర్గ తండ్రి నా మీద తిరగబడడం చేపట్టాడు. నన్ను అకాలంగా అనుమానించేవాడు. తిట్టేవాడు. చివరికి కొట్టేవాడు.
నేను ఓర్చుకుంటూ వచ్చాను. కానీ రాను రాను అతడి ఆగడాలు మితి మీరాయి. నేను తిరగబడ్డాను.
అంతే, ఒక రోజు నుండి, అతడు మా వద్దకు రావడం మానేశాడు. వెతికాను. కాన రాలేదు.


***


4

 

"ఈ రోజు నా పుట్టిన రోజు." చెప్పింది జాస్మి.
ఆయన ఆశ్చర్యపోయాడు.
"మీరు నాకు తెలియదు. నాకు ఎందుకు తెలియ చేస్తున్నారు." ఆయన అడిగాడు చిత్రమయ్యిపోతూనే.
జాస్మి చిన్నగా నవ్వింది.
ఆమె ఒక వృద్ధాశ్రమం ఆఫీస్ రూంలో ఉంది.
ఆయన ఆ వృద్ధాశ్రమం నిర్వాహకుడు.
"నేను నా పుట్టిన రోజును ఇన్నాళ్లు చాలా వేడుకగా జరుపుకొనే దాన్ని. కానీ ఈ యేడాది నుండి ఆ వేడుక ఖర్చును సద్వినియోగ పర్చుకోవాలని తలిచాను. అందుకే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని కలుస్తున్నాను." చెప్పింది జాస్మి.
"అవునా. మీరు ముందు చెప్పక నేను విడ్డూరమయ్యాను. సరే. హేఫీ బర్త్ డే అమ్మా. కూర్చొండి." చెప్పాడు ఆయన.
ఆయన ఎదురు కుర్చీలో కూర్చుంది జాస్మి.
"సంతోషమమ్మా. ఆ వేడుక ఖర్చును ఏ విధంగా సద్వినియోగ పర్చుకోవాలనుకున్నారు." అడిగాడు ఆయన.
"చెప్తాను. ముందు మీరు ఒక వివరం ఇవ్వాలి." అంది జాస్మి.
"చెప్పమ్మా. ఏ విషయంలో వివరం కోరుకుంటున్నారు." అన్నాడు ఆయన.
"ఇక్కడ ఎంత మంది ఉంటున్నారు." అడిగింది జాస్మి.
"36 మంది." చెప్పాడు ఆయన.
"వాళ్లకై, ఒక రోజుకై, మీ ఆశ్రమంకి ఎంత ఖర్చు అవుతుంది." ఆరా తీస్తుంది జాస్మి.
"సుమారుగా.." అంటూ ఒక మొత్తం చెప్పాడు ఆయన.
"అవునా. ఐతే, నేను ఆ మొత్తం చెల్లిస్తాను. దానిని ఈ రోజున వినియోగించండి." చెప్పింది జాస్మి.
ఆయన వింతయ్యాడు. "అంటే.. అంత మొత్తం మీ పుట్టిన రోజుకు మీరు ఖర్చు చేస్తుంటారా." అన్నాడు.
"నా పుట్టిన రోజు నాటి ఖర్చు.. మీ రోజు వారి ఖర్చు కంటే రమారమీగా ఆరు వేలు ఎక్కువే. ఆ ఆరు వేలును కూడా కలిపి నేను పే చేస్తాను. ఈ రోజు ఏవైనా స్పెషల్స్ వారికి పెట్టండి. సంతోషిస్తాను." చెప్పింది జాస్మి.
ఆయన ఆనందమయ్యాడు.
జాస్మి మొత్తం డబ్బును ఆయనకు అందించింది తన బ్యాగ్ లోంచి తీసి.
ఆయన ఆ డబ్బును అందుకున్నాడు.
చేతులు జోడించి నమస్కరించబోయాడు.
జాస్మి వారించింది.
"నో. నో. మీరు పెద్దలు. పైగా దొడ్డ పనిని చేపట్టిన వారు. మీ లాంటి వారి దీవెనలే నాకు ఈ రోజు కావాలి. నన్ను దీవించండి." అంటూనే, లేచి వెళ్లి, ఆయన పాదాలకు నమస్కరిస్తుంది జాస్మి.


***


D

 

అతడికి అద్దెకు ఇచ్చిన ఆటో యజమాని ద్వారా తెలిసింది. తమ ఆటోల షెడ్ లో పని చేసే ఒక పనమ్మాయితో కూడి ఎటో పోయాడట.
నా ప్రయత్నాలు అన్నీ విఫలమమ్యాయి.
మా వాళ్లు నా మీద కనికరం చూపలేదు.
చుట్టు పక్కల వారి సానుభూతి మాత్రం పొందాను. ఇప్పటికీ దాన్ని నిలబెట్టుకుంటున్నాను.
నా బతిమలాట పట్టించుకున్న చుట్టు పక్కల వాళ్లు నా భర్త సంగతిని ఇప్పటికి దాచి పెట్టారు.
తన తండ్రి మిలట్రీలోకి వెళ్లాడని, వస్తాడని దుర్గను నమ్మిస్తూ వస్తున్నాను.
నేను నా ట్యూషన్స్ ను కొనసాగిస్తూనే దుర్గను పెంచుకుంటున్నాను.
దయచేసి మీరు నా విషయాన్ని కన్సిడర్ చేయండి. దుర్గ తండ్రి కూడా రావాలని పట్టు పట్టకండి. పేరెంట్స్ మీటింగ్ తో దుర్గను హైరానా పర్చవద్దు." చెప్పడం ఆపింది శకుంతల.
ఆ హెడ్ విషయాన్ని అర్ధం చేసుకుంది. తన సహకారం ఉంటుందని మాట ఇచ్చేసింది.
శకుంతల 'ధన్యవాదాలు' తెలిపి, అక్కడ నుండి ఇంటి వైపుకు కదిలింది.


***

దుర్గ చదువు సాఫీగా సాగుతుంది.
శకుంతల నిబ్బరంగా అన్నింటినీ నెట్టుకు పోతుంది.
రోజులు గడుస్తున్నాయి.
తలవని తలంపుగా నేటి ఉదయాన శకుంతల భర్త సూర్యం ఇంటికి వచ్చాడు.
శకుంతల ఇంట్లో ఉంది. దుర్గ స్కూలుకు వెళ్లి ఉంది.
తన భర్తను చూస్తూనే గాభరా ఐంది శకుంతల.
"ఏంటలా చూస్తున్నావు. మర్చిపోయావా." అన్నాడు సూర్యం.
"ఎందుకు వచ్చావ్." తేరుకుంటూ అడిగింది శకుంతల.


***


5

 

ఆ పెద్దాయన అనీజీని కదులుతున్నాడు.
"మీలో అసంతృప్తి అగుపిస్తుంది. కారణం ఏమిటి." సౌమ్యంగా అడిగింది జాస్మి.
"ఏమని చెప్పేదమ్మా. నా రిటైర్మెంట్ చాలా హైరానా పెడుతుంది." చెప్పాడు ఆయన.
"పని రోజుల్లో శ్రమించారు. కాలం మీరడంతో ఉద్యోగ విరమణ వచ్చింది. ఇక పై రోజుల్ని ఏదో వ్యాపకంతో గడపాలి కానీ, డల్ ఐపోతే ఎలా. పైగా అప్పటి శ్రమనే ఇంకా కోరుకుంటే ఎలా." అంది జాస్మి.
"ఏమోనమ్మా. అప్పుడు టైం తెలిసేది కాదు. అన్నింటా ఉరకలే ఉరకలు. ఇప్పుడు ప్రతి నిమిషం తెలుస్తుంది." చెప్పాడు ఆయన.
"ఆ ఆలోచన వదలండి. హాయిగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు సాహిత్యం అంటే ఇష్టంగా. ఆ పుస్తకాలు చదవండి. పగలు వాటితో కాలం గడిపేయండి. సాయంకాలం పార్కుకు, అలాగే వాకింగ్ కు వెళ్లండి. మొత్తం రోజు ఇట్టే ఐపోతుంది. చెప్పండి.. పుస్తకాలు ఏవి కావాలన్నా మీకు నేను సమకూరుస్తాను." చెప్పింది జాస్మి.
"ఏమని సమకూరుస్తావమ్మా. ఆ రోజుల్లో ఎన్నో పత్రికలు. పని మూలంగా వాటిని అప్పటిలో చదివే ఛాన్స్ లే గగనం. ఇప్పుడు చదువుదామంటే పత్రికలే మృగ్యం. ఏవో అర ఒకటిలా కనిపిస్తున్నాయి." అంటూనే..
"కరోనా వచ్చి వెళ్లింది కానీ. దాని బాదుడుకు ఇంకా తేరుకోలేక అల్లాడి పోతున్నాం. అది అన్నింటినీ అస్తవ్యస్తం చేసి పోయిందిస్మీ." చెప్పాడు ఆయన.


***


(కొనసాగుతుంది..)


***