Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 7 - (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

7.PARTY – ENJOYMENTS

అభి వాళ్ళ అన్నయ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళ అన్నయ ఆ గ్రూప్ కి మాకు పడదు రా నేనేంచేయలేను అని అన్నాడు. అభి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకి వచ్చి వాళ్ళ అన్న మాటలు చెప్పాడు . ప్రీతీ ఎం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రీతీ వెనకాలే తేజ్ కూడా వెళ్ళాడు ప్రీతీ కాలేజీ గార్డెన్ లో కూర్చుంది తేజ్ కూడా వచ్చి ప్రీతీ పక్కన కూర్చొని బాధపడకు ప్రీతీ రేపు ఫ్రెషర్స్ పార్టీ లో ఎం జరిగిన నీకు అడ్డుగా నేను ఉంటా నువ్వు ఎం బయపడకు. అది విన్న ప్రీతీ వద్దు తేజ్ నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు నాకు వాళ్ళు ఎం చెప్పిన చేస్తాను ఇంకా 4 సంవత్సరాలు ఉండాలి నాకు ఏ గొడవలు వద్దు అని అంటుంది. అది విన్న తేజ్ కి ఇంకా ప్రీతీ బాగా నచ్చుతుంది. తన ప్రేమ విషయం చెప్పేదాం అనుకున్నాడు కానీ వాళ్ళ స్నేహితులు వచ్చేసారు. తేజ్ వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు అది అభి,విక్రమ్ గమనించి తేజ్ పక్కకి వచ్చి ఏమైంది రా అని అడుగుతారు. అప్పుడు తేజ్ నా ప్రేమ విషయం ప్రీతికి చెప్పేదామనుకున్న ఈలోపు మీరు వచ్చి అంతా చెడకొట్టారు. అభి,విక్రమ్ పోనీ మమ్మల్ని చెప్పమంటావా అని ప్రీతీ అని గట్టిగా ఇద్దరు పిలుస్తారు. తేజ్ వాళ్ళ ఇద్దరిని వెన్నకి పట్టుకొని లాగుతాడు. ప్రీతీ ఏమైంది అని అడిగితే ఎం లేదు రేపు మనం పార్టీ లో డాన్స్ వేద్దామా అని అడుగుతున్నాడు అని అంటారు. మనమా ఎవరెవరు అని ప్రీతీ అడుగుతుంది డ్యూయెట్ కి వేద్దాం అని విక్రమ్ అంటాడు. ప్రీతీ సరే అంటుంది ప్రీతీ విక్రమ్ తో నువ్వు నేను జంటగా ఉందాం డాన్స్ లో అని అంటుంది తేజ్ ,వినీత మొహాలు ఆ మాట వినగానే వాడిపోతాయి. విక్రమ్,అభి ఆశర్యపోతారు. ఏంటి ఆలా చూస్తున్నారు నాతో జంటగా ఉండవా అని అడుగుతుంది అదేం లేదే వేద్దాం వేద్దాం అని విక్రమ్ అంటాడు. ఇంకా అందరూ జోక్స్ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తారు అక్కడ చేతన్ వాళ్ళు ఉంటారు. చేతన్ ప్రీతీ దగ్గరికి వచ్చి ఏంటి మేడం సంతోషంగా కనిపిస్తున్నారు నంబర్స్ దొరికాయా అని అడుగుతాడు ప్రీతీ కోపంతో మీకెందుకు అని వెళ్ళిపోతుంది. డాన్స్ లో వినీత తేజ్ ఒక జంట , విక్రమ్ ప్రీతీ ఒక జంట మరియు అభి వైష్ణవి ఒక జంట. తేజ్ విక్రమ్ ని ఎలాగైనా ప్రీతీ నాతో డాన్స్ చేసేలా చూడరా అని బ్రతిమిలాడతాడు అయితే పార్టీ ఇప్పిస్తానంటేనే నీకు సహాయం చేస్తా అంటాడు విక్రమ్. సరే ఇప్పిస్తాలే నువు ముందు పని చెయ్యి అని అంటాడు తేజ్. ప్రీతీ వినీత వైష్ణవి రాగానే ప్రీతీ తో విక్రమ్ ప్రీతీ నువ్వు తేజ్ తో డాన్స్ వెయ్యి అని అంటాడు. ఎందుకు తేజ్ అడిగాడా ఎం మాట్లాడుకున్నారు అని కోపంగా అడుగుతుంది అదేం లేదు నేను వినీత ని ఇష్టపడుతున్నాను అందుకే తనతో జంటగా డాన్స్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. ఓహో ఆలా అయితే సరేలే మరి నేను అడిగినప్పుడే చెప్పచ్చుగా ఇప్పుడెందుకు చెప్తున్నావ్ అని ప్రీతీ అడిగి సరేలే వెళదాం పదా అని అంటుంది. వెళ్లి ఎవరి జంటల పక్కన వాళ్ళు నుంచుంటారు. వీనితకి ఎం జరుగుతుందో అర్ధంకాలేదు.వినీత కి జరిగిందంతా విక్రమ్ చెప్పాడు. వినీత తేజ్ ని చూసి నవ్వుతుంది డాన్స్ ప్రాక్టీస్ అయ్యిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. తరవాతి రోజు వైష్ణవి,వినీత,ప్రీతీ లంగావోణీ కట్టుకొని వచ్చారు. అందరూ వాళ్ళ ముగ్గురిని చూడగానే పొగడ్తలతో ముంచేసారు ఇంకా ఆపండి వెళదాం పదండి అంటారు. ఆడిటోరియం కి అందరూ వెళ్తారు. సీనియర్స్ అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళని చూసి కౌషిక్ నీరజ్ తో అరేయ్ మామ నీ పిల్ల వచ్చిందిరా అని అంటాడు. రేయ్ నువ్వు అపరా ఈరోజు ఆ పిల్ల చేత నువ్వు ఎం చేయించద్దు ఏడిపించద్దు అని నీరజ్ అంటాడు సరే మామ ఎం చేయించనులే ఏడవకూ !!!! ప్రీతీ వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటారు. సీనియర్స్ వాళ్ళ ఉపాధ్యాయుల్ని,HOD ని పిలుస్తారు ప్రిన్సిపాల్, సీఈఓ కూడా వస్తారు అందరి స్పీచ్ అయ్యిపోయాక మీరు ఎంజాయ్ చేయండి అని వెళ్ళిపోతారు. సీనియర్స్ జూనియర్స్ ని ఒకరి తరవాత ఒకరిని పిలిచి స్టేజి ఎక్కించి ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. చేతన్ ప్రీతీ ని పిలిపిస్తాడు పాట పాడు అని అడుగుతాడు పాట పడుతుంది అంతే తన వాయిస్ కి అందరూ ఫాన్స్ అయ్యిపోతారు తేజ్ ప్రీతీ ని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఈలోపు కౌషిక్ లేచి మీ సీనియర్స్ నంబర్స్ తెచ్చావా అని అడుగుతాడు లేదు సర్ వాళ్ళు ఇవ్వలేదు సర్ అని అంటుంది. కౌషిక్ కి కోపం వచ్చి సరే తేలేదుగా మీ సీనియర్స్ అందరి అబ్బాయిల దగ్గరకు వెళ్లి వాళ్ళ బుక్స్ లో పెద్దగా ఐ లవ్ యూ అని రాసి రా అందరి పుస్తకాలలో ఉండాలి లేకపోతే ఊరుకోను అని అంటాడు. సరే సర్ అని దిగిపోతుంది. కౌషిక్ తేజ్ పీలిపించి ఏరా ఏంటి సైలెంట్ గా ఉన్నావ్ దాన్ని అంటే నీకు కోపం వచ్చిద్దిగా అని అన్నాడు తేజ్ ఎం మాట్లాడడు సరే నువ్వు దాని దగ్గరకి వెళ్లి తనని పైకి తీసుకొచ్చి ఒక సీనియర్ తో ప్రేమిస్తున్నాను అని చెప్పియ్యిరా అని అంటాడు.తేజ్ పిలవక ముందే ప్రీతీ పైకి వస్తుంది పర్లేదు తేజ్ ఎవరో ఒకరి దగ్గరకు వెళ్లు అని అంటుంది తేజ్ కిందకు దిగి అందరి సీనియర్స్ ని అడుగుతూ ఉంటాడు చేతన్ దగ్గరకి వచ్చి అడుగుతాడు చేతన్ సరే చెప్తాను కానీ ఒక షరతు అని అంటాడు ఏంటి అని అడిగితే తను అంటే నాకు ఇష్టం కాబట్టి తనకి నువ్వు దూరంగా ఉండాలి తనతో మాట్లాడావని తెలిసిన నిన్ను ఎం చేయను తనని..... అని ఆపేస్తాడు వద్దు దూరంగా ఉంటాను అని చెప్పి చేతన్ ని పైకి పంపుతాడు. చేతన్ పైకి వచ్చి ప్రీతీ వాళ్ళు వాడిచేత చెప్పించమన్నారనో నిన్ను కాపాడాలనో నీకు ఈ మాటలు చెప్పట్ల నాకు నిన్ను మా క్లాస్ బయట చూసినప్పుడు నీ భయాన్ని చూసా నాతో మాట్లాడినప్పుడు నీ మర్యాదని చూసా అబ్బాయి ఎవరో కూడా తెలియకుండా ఫోన్ నెంబర్ కోసం వచ్చావు ఆ అబ్బాయి రాలేదు అని చెప్పిన వెంటనే నీ అమాయకత్వాన్ని చూసా అందరితో క్లాస్ లో నంబర్స్ అడిగి నిన్ను నేను ఏడిపించినప్పుడు నీ కోపాన్ని,బాధని చూసా నా చేతిని జీవితాంతం పట్టుకుంటావా అని ఇంతకీ నా పేరు నీకు తెలియదు కదా నేనే చేతన్ అని ఐ లవ్ యూ అని తల దించి చెయ్యి చాపుతాడు. ప్రీతీ మైక్ తీసుకొని కౌషిక్ తో సర్ మీరు చెప్పిన పని తేజ్ చేసాడు ఇంకా నేను దిగొచ్చా కిందకి అని అడుగుతుంది కౌషిక్ వాడికి సమాధానం చెప్పి దిగు అని అంటాడు. డబల్ గేమ్ ఆడేవాళ్లకి నేను సమాధానం చెప్పను సర్ అని దిగిపోతుంది. చేతన్ ప్రీతీ ఇప్పుడు వదిలేస్తానేమో ఇంకా 3 సంవత్సరాలు వుంటా నీ ప్రేమ పొందే వరకు వదలను అని అంటాడు. ప్రీతిని చూసి సీనియర్స్ అందరూ ఏంటి ఈ పిల్ల ఇలా వాడిని రిజెక్ట్ చేసింది వాడిఅంతా మంచివాడు మన క్లాస్ లో ఎవరున్నారు పిచ్చి మొహంది అని అనుకుంటారు.తరవాత ప్రీతీ వాళ్ళ డాన్స్ ఉంది అందరూ స్టేజి ఎక్కుతారు డాన్స్ చేస్తున్నప్పుడు ప్రీతీ కళ్ళలోకి తేజ్ చూస్తూ క్షమించు ప్రీతీ రేపు నుంచి నీకు దూరంగా ఉంటాను నీకు ఏమైనా నేను తట్టుకోలేను నిన్ను దూరంనుంచి చూసే సంతోషిస్తాను అది చాలు నాకు అని మనసులో అనుకుంటాడు. అభి డాన్స్ లోనే వైష్ణవి కి తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. ఫ్రెషర్స్ డే అయ్యిపోయి ఆడిటోరియం నుంచి బయటకి వస్తుంటే నీరజ్ ప్రేమ ని అపి తన ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చెయ్యి నీతో మాట్లాడాలి అని అంటాడు ప్రేమ ఆ పేపర్ని చించి నా ఫ్రెండ్స్ ఏడిపించిన వాళ్ళతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోతుంది. ప్రీతీ తన స్నేహితులతో బుక్స్ షాప్ కి వెళదాం పదండి రా అంటుంది. ఎందుకే అని అందరూ అడుగుతారు ఎందుకేంటీ చెప్పారుగా బుక్స్ లో ఐ లవ్ యూ అని రాయాలని మనం అడిగితే మన సీనియర్స్ బుక్స్ ఎందుకు ఇస్తారు అబ్బాయిలు అసలుకే ఇవ్వరు పైగా ఆ చేతన్ ఉన్నాడు వాడి క్లాస్ కి వెళ్తే ఇంకా ఎక్కువ చేస్తాడు అందుకే అబ్బాయిలు 50 మంది ఉన్నారంట బుక్స్ కొని రాసి రేపు వాళ్ళు ల్యాబ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ మీద పెట్టేసి వస్తా అని అంటుంది. బుక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు తేజ్ ప్రీతీ కోసం పెన్ కొని ఇస్తాడు ఎందుకు అని అంటే మాట్లాడనుగా గుర్తుగా ఉంచుకో అని అంటాడు ఏంటి అని ప్రీతీ అంటే ఎం లేదు నాతో డాన్స్ వేసావుగా అందుకే ఇస్తున్న బాగా చేసావ్ డాన్స్ పాట కూడా బాగా పాడవు అని అంటాడు ప్రీతీ థాంక్స్ చెప్పి పెన్ ని తీసుకుంటుంది. తరవాత రోజు రోజులాగానే బస్సులు దగ్గర కలుసునేవారు కానీ తేజ్ అందరికంటే ముందే ఎవ్వరి కోసం ఆగకుండా ముందే వెళ్ళిపోతాడు. అందరూ క్లాస్ లోకి వస్తారు అభి విక్రమ్ ఏమైందిరా అని అడిగారు ఎం లేదులేరా క్లాస్ వినండి అని అంటాడు. అందరితో మాట్లాడతాడు కానీ ప్రీతీ తో మాట్లాడాడు ప్రీతీ మాట్లాడదామని దగ్గరకొచ్చిన ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం సీనియర్స్ ల్యాబ్ కి వెళ్ళగానే ప్రీతీ ప్రేమ మరియు వందన ముగ్గురు సీనియర్ క్లాస్ కి వెళ్లి బుక్స్ పెట్టేసి వచ్చారు. సీనియర్స్ క్లాస్ కి రాగానే ఆ బుక్స్ చూసి ఎవరిది ఏ బుక్ అని తెరవగానే పెద్ద అక్షరాలతో ఐ లవ్ యూ అని రాసి ఉంది అప్పుడు అందరికి అర్ధమయ్యింది ఇది ప్రీతీ పని అని ప్రీతీ గురించి క్లాస్ లో సీనియర్స్ అందరూ ఈ పిల్లకి ఇంత ఆలోచన ఎలా వచ్చింది ఎన్ని బుక్స్ కొనిందా అని అనుకుంటూ ఉన్నారు అవన్నీ విని చేతన్ ఇంకా ప్రీతీ మీద ఇష్టం ఇంకా పెంచుకుంటాడు ప్రీతిని వదులుకోకూడదనుకుంటాడు. ఆరోజు సాయంత్రం వైష్ణవి అభి లైబ్రరీ కి వెళ్తారు. అక్కడ వైష్ణవి తను కూడా అభి ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది అభి తేజ్ కి విక్రమ్ కి చెప్పి పార్టీ ఇస్తాడు అమ్మాయిలకి ఎవ్వరికి చెప్పడు వైష్ణవి ఇప్పుడే చెప్పదు అని అంటుంది అదే మాట తేజ్ కి విక్రమ్ కి కూడా చెప్తాడు. ఒక వైపు చేతన్ ప్రీతీ కి రోజు ఏదో విధంగా తన ప్రేమని ఒప్పుకోమని విసికిస్తూనే ఉన్నాడు తేజ్ ఇవన్నీ చూసి బాధపడుతూనే ఉన్నాడు వైష్ణవి అభిలా ప్రేమ బాగానే ఉంది. ప్రేమ కోసం నీరజ్ తిరుగుతూనే ఉన్నాడు. వినీత విక్రమ్ కి తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది ఇలా జెరుగుతూనే 1st ఇయర్ semester ఎగ్జామ్స్ వచ్చేసాయి.మరి ఈ ప్రేమ ప్రభావం వీరి చదువుల మీద ఎలా పనిచేస్తుందో ? 2nd ఇయర్ లో ఎలా మారబోతుందో తరువాతి భాగంలో చూద్దాం