MY LIFE JOURNEY - 4 books and stories free download online pdf in Telugu

నా జీవిత పయనం - 4 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

4. మార్పు – చదువు

ప్రీతీ వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూఉంటుంది. రెండు రోజల తరవాత ప్రీతీ ఇంటర్ మొదటిసంవత్సరం ఫలితాలు వచ్చాయి బోర్డర్ మార్కులతో పాస్ అవుతుంది అది చూసిన ప్రీతికి ఇంట్లో ఎలా చెప్పాలో అర్ధంకాదు బెటర్మెంట్ రాద్దామనుకునింది కానీ దేవుడు కూడా ప్రీతీ మీద కన్నెర్ర చేసినట్టు అదే సమయానికి ప్రీతిని వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రీతీ ఎంతచెప్పినా వినకుండా ఊరు తీసుకెళ్ళిపోతారు. ప్రీతీని ఊరు ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళ మామయ్య తనకి పెళ్లి సంబంధం చూసాడు దాని కోసం తనని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు ఈ విషయం ప్రీతీ వాళ్ళ నాన్న కి తెలియదు ఎందుకంటే ఆయన క్యాంపులో ఉన్నాడు చెప్తే వాళ్ళ అమ్మ తరుపు చుట్టాలని ఒప్పుకోడని వాళ్ళ నాన్న కి చెప్పకుండా తీసుకొస్తారు. ప్రీతీ కి కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా తెలియదు తనకి పెళ్ళిచూపులని వెంటనే ప్రీతీ వాళ్ళ అక్కకి ఫోన్ చేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ప్రీతీ వాళ్ళ అక్క ఏడువకురా అని వెంటనే ప్రీతీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. వాళ్ళ నాన్న వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నా కూతురికి పెళ్లి చేయటానికి మీరు ఎవరు అని ఫోన్ లో బాగా గొడవాడుకుంటారు ఇవన్నీ ప్రీతీ గదిలో నుంచి చూస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న అన్న మాటలకి పెళ్ళిసంబంధానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ప్రీతీ వాళ్ళ నాన్న నా కూతురికి ఇప్పుడల్లా పెళ్లి చేయను తాను బాగా చదవాలి జాబ్ చేయాలి అప్పుడుదాకా పెళ్లి చేయని అని అందరితో చెప్తాడు. ప్రీతీ వాళ్ళ నాన్న అన్న మాట విని చాలా ఆనందపడుతుంది మా నాన్నకి నేను అంటే ఇంత ప్రేమ ఉందా అని అనుకుంటూ హ్యాపీగా ఉంటుంది కానీ మనసులో ఒక భయం ఇలా వాళ్ళ నాన్నతో చెప్పింది ప్రీతీ అని తెలిస్తే వాళ్ళ అమ్మ ఎం అంటుందో అని. ఈలోపే వాళ్ళ అమ్మ లోపలకి వస్తుంది ప్రీతిని చెంపమీద కొట్టి ఇంత దైర్యం ఎక్కడినుంచి వచ్చిందే అని బాగా అరుస్తుంది. ప్రీతీ ఏడ్చుకుంటూ పడుకుంటుంది తరవాతిరోజు ఇంటికి వెళ్ళిపోతారు. ప్రీతీ ఎం తోచక పవన్ తో జరిగిన విషయాలన్నీ చెప్పుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పవన్ ఇంట్లో ఉండడు బయటకి వెళ్తాడు పవన్ వాళ్ళ అమ్మ ప్రీతిని లోపల కూర్చోపెట్టి మాట్లాడుతుంది పవన్ కాలేజీ మానేస్తున్నాడమ్మా అని అంటుంది ఎందుకు ఆంటీ అని అడిగితే ఇంట్లో పరిస్థితులు బాగోలేదు కాలేజీ ఫి కట్టలేకపోతున్నాం అని చెప్తుంది.ప్రీతిని పవన్ కి నువ్వు అంటే ఇష్టం కదమ్మా అని అడుగుతుంది ప్రీతీ ఎం మాట్లాడదు వాడిని వదిలేయకు అమ్మ వాడు చాలా అమాయకుడు వాళ్ళ అక్క మాట నీ మాట తప్ప ఎవరిమాటా వినడమ్మా ఆఖరికి అంకుల్ మాట కూడా వినడు వాడిని మంచిగా చూసుకో అని అంటుంది ప్రీతీ కి ఎం మాట్లాడాలో అర్ధంకాదు ఈలోపు పవన్ వస్తాడు ఇద్దరు కలిసి బయటకి వెళ్తారు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్తుంది. పవన్ అవన్నీ విని ఇప్పటికైనా మారు వాడిని మర్చిపోయి బాగా చదువు మీ నాన్న నీకు సపోర్ట్ చేయాలనీ మారినప్పుడు నువ్వు ఎందుకు మారట్లేదు అని అంటాడు. ప్రీతీ కొంచెంసేపు పవన్ తో గడిపి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్లి ఆరోజంతా వాళ్ళ అక్క మాటలు పవన్ మాటలు ఆలోచిస్తుఉంటుంది నేను మారాలి మారతాను చదువుతాను నా కలలను సాధిస్తాను అని అనుకుంటుంది. కానీ అది అంత సులువు కాదు అని తనకి తెలియదు. జీవితం కష్టాలు కన్నీళ్లు లేకుండా ఎలా పూర్తి అవుతుంది. మన పుట్టుకే ఒక కన్నీటితో తల్లి బాధతో మొదలవుతుంది కన్నీటితోనే ముగిసిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు,బాధలు,ఆనందాలు వారికీ స్నేహితుల్లాంటివి. కానీ వాటిని ఫ్రెండ్స్ అని ఎప్పుడు పిలవము. అవి అందరికి ఉంటాయి కానీ బయటి స్నేహితుల్లాగా మాట్లాడలేవు అంతే. ప్రీతీ జీవితం కూడా అంతే అందరిలాగే కన్నీటిని భారం అనుకుంటుంది కానీ వాటి వల్ల దైర్యం వస్తుందని తనకి తెలియదు తనలాగే చాల మంది అలాగే అనుకుంటున్నారు. సెలవలు అయ్యిపోతాయి ఇంటర్ సెకండ్ ఇయర్ లోకి వస్తుంది బాగా చదువుతుంది. వాళ్ళ ప్రిన్సుపాలే ప్రీతీ ని చూసి ఆశ్చర్యపోతాడు ప్రీతిని అందరి మేడమ్స్ మరియు సార్లు బాగా మెచ్చుకుంటారు. ప్రీతి క్యారెక్టర్ కూడా కొంచెం కొంచెంగా మార్చుకుంటుంది ఒకప్పుడు ఎవ్వరితో మాట్లాడేది కాదు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది ఇప్పుడు అందరిని పలకరిస్తూ గేమ్స్ ఆడుతూ ఆడిస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. క్లాస్ లో అందరూ ప్రీతీని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఇంత మారిన ఇంట్లో మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ కొంచెంసేపు వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి. బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తుంది. చాలా కష్టపడుతుంది అని అనుకునే సమయంలో వాళ్ళ అక్క చనిపోతుంది సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అక్కది ప్రేమ వివాహం ఇంట్లో ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది వాళ్ళ అయన బాగానే చూసుకునేవాడు కానీ కోపం వస్తే బాగా కొట్టేవాడు గొడవలంటే బాగా భయపడే ప్రీతికి అవిచూసినప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటుంది. అప్పుల వల్ల వాళ్ళ అక్క ఎం చేయాలో అర్ధంకాక చనిపోయింది ప్రీతీ చాల బాధపడింది ఒక పక్క ఎగ్జామ్స్ బాగా రాసాను అని సంతోషపడేలోపల వాళ్ళ అక్క మరణం ప్రీతిని ఎంతో కలిచివేసింది.చాలా ఏడుస్తుంది తన ఇంట్లో తనకి బాధ వచినప్పుడు ఆధారంగా ఉండేది వాళ్ళ అక్క ఒక్కటే అటువంటిది వాళ్ళ అక్క తనకి దూరంగా వెళ్లిపోయిందని బాధ తట్టుకోలేకపోయింది ఏడ్చింది కానీ వాళ్ళ అక్క తిరిగిరాదని దైర్యం తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా ఎంసెట్ పరీక్ష కు కోచింగ్ తీసుకొని పరీక్షా బాగా రాసింది. కొన్ని రోజులు వాళ్ళ ఇంటర్ స్నేహితురాలైన కీర్తి వాళ్ళ ఊరికి వెళ్లి హ్యాపీ గ ఒక వారం ఉండి వద్దామని వెళ్ళింది. కీర్తి వాళ్ళ ఊరు వైజాక్ దగ్గర యలమంచలి. కీర్తి వాళ్ళ ఊరు వెళ్లి బాగా హ్యాపీ గా ఉంటుంది పచ్చని చెట్లు చక్కని వాతావరణం నవ్వుతూ పలకరించే మనుషులు వారం రోజులు చాలా త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రీతీ వాళ్ళ నాన్న క్యాంపు కూడా యలమంచలి లోనే వాళ్ళ నాన్నని కలవాడనికి వెళ్ళింది. వాళ్ళ నాన్న చాలా ఎత్తులో ఎర్రటి ఎండలో లో పని చేస్తున్నడు. వాళ్ళ నాన్నని చూసి ప్రీతీ కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళ ఉండే రూమ్ కూడా తడికలతో కట్టింది గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది అవన్నీ చూసి ప్రీతీ మనసులో అనుకుంటుంది మా నాన్న ఇంత కష్టపడుతుంటే బాగా చదువుకోకుండా ఒక అబ్బాయి కోసం బాధపడుతున్నాను ఛీ నేను అసలు మనిషినే కాదు అని అనుకుంటుంది. వాళ్ళ నాన్నతో తన 10th లో జరిగిన విషయాలన్నీ చెప్పాలనుకునింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న నీతో మాట్లాడాలి అని పక్కకు తీసుకొచ్చింది ఏడుస్తూ వాళ్ళ నాన్నని గట్టిగ హత్తుకొని నేను తప్పు చేశాను నాన్న నేను 10th లో ఒక అబ్బాయిని ప్రేమించాను తను నన్ను మోసం చేసాడు. ఇంకెప్పుడు ఎవర్ని ప్రేమించాను నాన్న నన్ను క్షేమించు అని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చి బాగా ఏడుస్తుంది. అది చుసిన వాళ్ళ నాన్న నువు ఏడవకు తల్లిగా ఇంకెప్పుడు ఆలా చేయకు నీకోసం తమ్ముడు కోసమే నేను బతుకుతుంది మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు అది చూసిన ప్రీతీ కి వాళ్ళ నాన్న ప్రేమ బాగా అర్ధమయింది. తాను ఎవ్వర్నీ ప్రేమించకూడదు అని నిర్ణయించుకుంది. వైజాక్ టూర్ ప్రీతికి ఒక గొప్ప మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. ప్రీతీ తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మంచి మార్కులతో పాస్ అయ్యింది కౌన్సిలింగ్ కి వెళ్ళింది వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకుంది ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. మొదటి రోజు కాలేజీ కి వెళ్ళింది కాలేజీ చాలా అందంగా ఉంది ప్రీతీ ఆ కాలేజీ లో చదువుతుంది అంటే తనే నమ్మలేకపోయింది వాళ్ళ పెదనాన్నతో కాలేజీ లోపలకి కి వస్తుంటేనే ప్రీతీకి సంతోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. లోపలి వెళ్లి ఆఫీస్ లో సర్టిఫికెట్లు ఇచ్చారు క్లాస్ కి వెళదామని ఒక సార్ ని అడిగింది సివిల్ 1st ఇయర్ క్లాస్ ఎక్కడ సార్ అని. వాళ్ళ సార్ క్లాస్ చూపించారు వెంటనే వాళ్ళ పెదనాన్న ని వెళ్లిపొమ్మని చెప్పి క్లాస్ లోకి వచ్చింది. మరి ప్రీతీ కాలేజీ లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట మీద నిలబడి ప్రేమని దగ్గరకు రానియ్యకుండా ఉంటుందా లేక మరల కాలేజీ లో ఎవరినైనా ఇష్టపడుతుందా తరువాతి భాగంలో చూద్దాం.....

షేర్ చేయబడినవి

NEW REALESED