Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 5 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

హ్యాపీ డేస్

ప్రీతీ క్లాస్ లోకి అడుగుపెట్టగానే అందరూ డోర్ వైపు చూసారు ప్రీతీ కి చాల ఇబ్బందిగా అనిపించింది తల దించుకొని నెమ్మదిగా లోపలి వచ్చి గర్ల్స్ వైపు మూడవ బెంచ్ లో కూర్చుంది. తనకి ముందు బెంచ్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు తనకు మొదట పరిచయం అయ్యింది కూడా వాళ్ళ ఇద్దరే కొన్ని పరిచయాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి కొన్ని పరిచయాలు జీవితంలో మంచి పాఠాలను నేర్పిస్తాయి కానీ కొంతమంది మన జీవితంలోకి వస్తే మన జీవితమే మారిపోతుంది. ప్రీతీ వాళ్ళని పరిచయం చేసుకునింది ఒక అమ్మాయి పేరు ప్రేమ మరొక అమ్మాయి పేరు వందన. అందరూ ఒక్కొక్కరుగా క్లాస్ లోకి వస్తున్నారు ఈలోపు వాళ్ళ సార్ క్లాస్ లోకి వచ్చారు. అందరిని కాలేజీ చూపించడానికి తీసుకొని వెళ్లారు. అందరూ బయటకి వెళ్లారు అన్ని బ్రాంచెస్ ని వాళ్ళ సార్ చూపిస్తూ ప్రతి దాని గురించి చెప్తూ ఉన్నారు. అందరూ కాలేజీ నే చూస్తున్నారు ఆ కాలేజీ ప్రతి ఒక్క విద్యార్థి కి మంచి జ్ఞాపకాలని ఇస్తుంది ప్రతి ఒక్కరు ఎదో ఒకటి నేర్చుకోకుండా అక్కడినుంచి బయటకి వెళ్ళరు. ప్రతి ఒక్కరి మనస్సులో ఎన్నో ఆలోచనలు ఒకడు మంచిగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. మరొకడు ఎలాగైనా అందరిలో టాప్ లో ఉండాలని ఆలోచిస్తాడు. ఇంకొకడు మంచి అమ్మాయిని చూసి ప్రేమించాలి అని ఆలోచిస్తాడు. ఇలా రకరకాలుగా అందరూ ఆలోచిస్తున్నారు. ప్రీతీ బాగా చదివి జాబ్ చేసి వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకోవాలని ఆలోచిస్తుంది. ప్రేమ తనకి నిజమైన ప్రేమ ఈ కాలేజీలో దొరకాలి అని ఆలోచిస్తుంది. వందన తనను అన్ని విషయాల్లో అందరూ మెచ్చుకునేలా ఉండాలి అని ఆలోచిస్తుంది. అందరికి కాలేజీ చూపిస్తూవుండగా వాళ్ళ సీనియర్స్ గార్డెన్ లో నవ్వుతు గ్రూప్ గా కూర్చోవటం ఆడుకోవటం అవన్నీ చూసి వాళ్ళు రాబోయేరోజుల్లో అలాగే స్నేహితులుగా ఉంటు ఆనందిస్తారు అని అందరూ చాలా సంతోషించారు. కాలేజీ చూపించటం అయ్యిపోగానే అందరూ క్లాస్ లోకి వెళ్లారు వాళ్ళ సార్ ఒక్కకొకరిగా అందరిని క్లాస్ కి పరిచయం చేసుకోమన్నారు. ఒకరి తరవాత ఒకరు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు మరియు వాళ్ళ జీవితంలో ఎం సాధించాలనుకుంటున్నారో చెప్తున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలని చెప్పారు కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేయాలనీ చెప్పారు. మరి కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల వ్యాపారాల్లో సహాయం చేయాలనీ చెప్పారు. అందరూ చెప్పటం అయ్యిపోయాక వాళ్ళ సార్ ఇంకొక ప్రశ్న అందరిని అడిగారు ఏంటి అంటే మీరు సివిల్ బ్రాంచ్ ఏ తీసుకోడానికి కారణం ఏంటి అని ఇప్పుడు వచ్చాయి ఒక్కొక్కరి దగ్గరనుంచి వింత వింత సమాధానాలు. ఒకడు కౌన్సిలింగ్ లో వచ్చింది అని జాయిన్ అయ్యాను అని చెప్పాడు. ఒకడు నాకు ఇష్టం సార్ సివిల్ అంటే అన్నాడు ఎందుకురా అని అంటే సార్ మిగతా బ్రాంచుల్లో కష్టపడాలి దింట్లో అయితే ఆడుతూ పాడుతూ పాస్ అయ్యిపోవచ్చు పెద్ద కష్టపడేది ఏం ఉండదు అని జాయిన్ అయ్యాను అని అన్నాడు అది విని అందరూ నవ్వారు. మరొకడు నాకు ప్యాషన్ సర్ సివిల్ అంటే అని అన్నాడు. ఆలా అబ్బాయిలందరు సమాధానాలు చెప్పారు అమ్మాయిలదగ్గరకి వచ్చింది అదే ప్రశ్న. మరి వీళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తారో అని అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారు అప్పుడే లేచింది ఒక అమ్మాయి పేరు వైష్ణవి తను చాలా అల్లరి అమ్మాయి అందరిని కలుపుకుంటుంది అందరితో బాగా మాట్లాడుతుంది తాను చెప్పిన సమాధానం విని అందరూ నవ్వుకున్నారు తాను చెప్పిన సమాధానం ఏమిటి అంటే ఏంలేదు సార్ మా అమ్మాయిలు చదివినా పెద్ద చేసేదేం ఉండదు పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం తప్ప మేము ఇంటర్ చవినవాళ్ళం అనుకో బీటెక్ వాడినో డిగ్రీ వాడినో ఇచ్చి పెళ్లి చేస్తారు అదే బీటెక్ చదివాం అనుకో మాకంటే ఎక్కువ చదివాడిని అంటే పీజీ చేసినవాడినో అంతకంటే ఎక్కువ చదివిన వాడినో ఇచ్చి పెళ్లి చేస్తారు అప్పుడు మా జీవితాలు కొంచెం బాగుంటాయి కదా అని అనింది అది విని వాళ్ళ సార్ షాక్ అయ్యాడు. తరవాత తేరుకొని అవునా అమ్మ మరి అలాంటప్పుడు సివిల్ లోనే ఎందుకు జాయిన్ అయ్యావమ్మా అని అడిగితే అదో పెద్ద కథా సార్ అని అనింది వైష్ణవి పర్లేదు చెప్పు వింటాము అని అన్నారు వాళ్ళ సార్ ఏంలేదు సార్ నాకు ECE,CSE బ్రాంచెస్ అంటే ఇష్టం ఎందుకంటే చక్కగా ఏసీ లో కూర్చోవచ్చు మంచిగా కంప్యూటర్ ముందు కూర్చోవచ్చు అని కానీ నాకు తెలిసిన సీనియర్స్ చెప్పారు అది చాలా కష్టం అందులో సి లాంగ్వేజ్ అని ఏవేవో ఉంటాయంటగా అవి మన వల్ల కాదులే అనుకున్న సరే EEE లో జాయిన్ అవుదామనుకున్న ఆ కనెక్షన్స్ కరెంట్ తో షాక్ కొట్టి పోతానేమో అని జాయిన్ అవ్వల. ఇంకా MECH అంటారా అమ్మాయిలు ఎక్కువ ఉండరు పైగా ఆ మెషిన్స్ తో ఎవరు పనిచేస్తారులే అని జాయిన్ అవ్వాలా ఇంకా మిగిలింది CIVIL అందరూ బాగా సులబంగా ఉంటది అని చెప్పారు అందుకే జాయిన్ అయ్యాను సార్ అని అనింది. వాళ్ళ సార్ అంటే అన్ని బ్రాంచెస్ గురించి ఆరా తీసి జాయిన్ అయ్యావ్ అనమాట సరే కూర్చో అమ్మ అని అన్నారు. ఇవి ఇక్కడితో ఆపేద్దాంలే మిగతావి రేపు తెలుసుకుంటాలే ఇంకా ఇంటికి వెళ్ళండి రేపు నుంచి క్లాసులు మొదలుపెడతారు. అని అందరిని పంపించేశారు. వైష్ణవి చిలిపితనం ప్రీతికి బాగా నచ్చింది తనని కూడా ప్రీతీ పరిచయం చేసుకుంది మొదటి రోజు ముగ్గురు స్నేహితులు అయ్యారు చక్కగా నలుగురు బస్సు లు దగ్గరకు వెళ్లి ఇంటికి వెళ్లిపోయారు. తరవాత రోజు మరల క్లాస్ కి వచ్చారు ప్రీతీ వైష్ణవి ప్రేమ ఒక బెంచ్ వందన ఒక్కటే ఒక బెంచ్ వందన పక్కన మరో ఇద్దరు కొత్తగా వచ్చి కూర్చున్నారు వాళ్ళ పేర్లు వినీత మరియు ప్రణవి. వీళ్ల ఆరుగురు మంచి స్నేహితులు అయ్యారు. మరి గ్రూప్ లో అందరూ అమ్మాయిలే ఉంటె బాగొదుగా పైగా సివిల్ బ్రాంచ్ లో అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువ. అప్పుడే పరిచయం అయ్యారు అభి, విక్రమ్, తేజ్. అభి కి వైష్ణవి మొదటి రోజు చెప్పిన సమాధానాలికే పడిపోయాడు వైష్ణవి అభికి బాగా నచ్చింది తనని ప్రేమించాలనుకున్నాడు ఆలా తనకి దగ్గరవ్వటానికి అందరిని పరిచయం చేసుకున్నాడు. విక్రమ్ అంటే వినీత కి ఇష్టం వినీత వాళ్ళ విక్రమ్ ని వీళ్ళందరూ పరిచయం చేసుకున్నారు. తేజ్ కి ప్రీతీ ని మొదట చూడగానే నచ్చుతుంది. తన కోసం వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. ఇలా వీళ్ళ తొమ్మిది మంది ఒక బ్యాచ్ అవుతారు ఎక్కడికి వెళ్లిన తొమ్మిది మంది కలిసి వెళ్లి వచ్చేవారు. మరి వీళ్ల ముగ్గురు ప్రేమలు 4 సంవత్సరాలలో ఫలిస్తాయా లేక విఫలం అవుతాయో తరవాత భాగాల్లో తెలుసుకుందాం.....