Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 6 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

స్నేహంకోసం

కాలేజీ లో జాయిన్ అయ్యి 10రోజులవుతుంది. తొమ్మిది మంది మంచి స్నేహితులయ్యారు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు. సాయంత్రం బ్రేక్ లో అందరూ కాంటీన్ కి టీఫిన్ తినటానికి వెళ్తున్నారు. మరి కాలేజీ అన్నాక సీనియర్లు జూనియర్లు మధ్య గొడవలు ఉంటాయిగా. కాంటీన్ కి వెళ్తుంటే సీనియర్లు దారిలో జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తూ కనపడ్డారు. వీళ్ళకి భయం వేసి వెన్నక్కి వెళ్లిపోతున్నారు కానీ సీనియర్లు వాళ్ళని చూసి పిలిపించారు. తొమ్మిది మంది సీనియర్స్ దగ్గరికి వచ్చారు. సీనియర్స్ లో ఒక అబ్బాయి ఉన్నాడు పేరు నీరజ్ తను ప్రేమ ని చూడగానే ఇష్టపడతాడు. తనని దగ్గరకి పిలిచి తన గురించి చెప్పమన్నాడు చెప్పింది. పాట పడమన్నాడు నాకు రాదు సర్ అని అనింది నీరజ్ పరవాలేదు అని అనేలోపే వేరే ఒకడు కౌషిక్ సీనియర్ అడిగితే పాడవ అని తన వర్క్ ఇచ్చి 10సార్లు రేపు వచ్చేటప్పుడు రాసుకురావాలి అని ఇస్తాడు నీరజ్ ఎం అనలేక మౌనంగా ఉంటాడు. వైష్ణవి మరియు వినీత కి కూడా అలాగే వర్క్ ఇస్తారు. ప్రీతీని తనగురించి అడిగితే చెప్పింది పాట పడమంటారు రావు అని చెప్తుంది ప్రీతీ తనకి కూడా వర్క్ ఇస్తారేమో అనుకుంది కానీ వాళ్ళ సివిల్ సీనియర్ లో ఒక అబ్బాయి పేరు చెప్పి తన దగ్గరకి వెళ్లి తన ఫోన్ నెంబర్ తీసుకురావాలి అని అనగానే ప్రీతికి ఎం చేయాలో అర్ధంకాల సరే అనింది. అది విన్న తేజ్ తను తీసుకురాదు సర్ అవసరమయితే నేను తీసుకొస్తా అని అన్నాడు. కౌషిక్ కి కోపం వచ్చి ఏంటిరా ఎక్కువచేస్తున్నావ్ తనకి చెప్పిన పనిని తను చేస్తుంది మధ్యలో నీకెందుకురా జూనియర్ వి జూనియర్ ల ఉండు తేడా వస్తే కాలేజీ లో తిరగడానికే భయపడేలా చేస్తా అని అన్నాడు. తేజ్ సీరియస్ అయ్యేలోపు వద్దురా గొడవలెందుకు అని అందరూ ఆపుతారు ఈలోపు ప్రీతీ వదిలేయ్ తేజ్ ఫోన్ నెంబర్ ఏగా తెస్తాలే అని అంటుంది. ఆ 10 రోజుల్లో ప్రీతీ తేజ్ తో మాట్లాడిన మొదటి మాటలు అవే. ప్రీతీ మాట్లాడగానే తేజ్ ఆగిపోతాడు సీనియర్స్ వెళ్ళండి ఇంకా రేపు కాలేజీ కి వచ్చేటప్పుడు అవ్వన్నీ చూపించే మీరు క్లాసులు కి వెళ్ళాలి అని అంటారు. అందరూ క్లాస్ కి వెళ్తారు కాలేజీ అవ్వగానే ప్రీతీ తో పాటు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సీనియర్ దగ్గరకు వస్తాం అంటారు కానీ ప్రీతీ వద్దు నేను వెళ్తాను అని అంటుంది. సరే అని వెళ్తుంది వాళ్ళ సీనియర్ క్లాస్ దగ్గర బయట ఫోన్ నెంబర్ తీసుకుందామని ఎదురు చూస్తూ ఉంటుంది ఈలోపు ఒక అబ్బాయి వచ్చి ప్రీతీ భుజంతట్టి పిలుస్తాడు ప్రీతీ ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. ఎవరు నువ్వు మా క్లాస్ దగ్గర ఎం చేస్తున్నావ్ అంటే ప్రీతీ ఎం లేదు సర్ మీ క్లాస్ లో చేతన్ సర్ ని కలవాలి అని అంటుంది. కామెడీ ఏంటి అంటే ఆ అబ్భాయే చేతన్. తనతో నీకు పని ఏంటి అని ప్రీతిని అడుగుతాడు. ప్రీతీ సీనియర్స్ ఇలా చేతన్ సర్ నెంబర్ తెమ్మన్నారు సర్ రేపటిలోగా నెంబర్ ఇవ్వకపోతే మమ్మల్ని క్లాసులు కి వెళ్లనివ్వరంట అని అంటుంది. చేతన్ ప్రీతితో ఆడుకోవాలనుకొని అయ్యో చేతన్ ఈరోజు కాలేజీ కి రాలేదుగా మరి ఎలా అని అంటాడు ప్రీతీ అయ్యో ఎం చేయాలి అని మనసులో అనుకోని సరే సర్ అని వెళ్ళిపోతుంది. వెళ్లిపోతున్నా ప్రీతిని చేతన్ అవుతాడు పోనీ నా నెంబర్ ఇవ్వమంటావా అని అంటాడు వద్దు సర్ అని అంటుంది. పర్లేదు తీసుకో వాళ్ళకి చేతన్ ఎవ్వరో తెలియదుగా అని అంటదు వద్దు సర్ ఒక వేళా చేతన్ సర్ నెంబర్ కాదని తెలిసిందనుకో ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఇస్తారు అని వెళ్ళిపోతుంది. క్లాస్ కి తిరిగి వచ్చి మిగతా వాళ్ళకి చెప్తుంది చేతన్ సర్ రాలేదు అని ఎం కంగారు పడకు అని అంటారు. ఇంటికి వెళ్ళిపోతారు మరసటి రోజు రోజు లాగే కాలేజీ బస్సు లు దగ్గర 9 మంది కలుసుకొని కాలేజీ లోపలికి వస్తారు కానీ సీనియర్స్ బస్సు లు దగ్గరే ఉండటం చూసి తప్పించుకొని వెళ్ళిపోదాం అనికొని అందరూ కలిసి గ్రూప్ గ వెళ్లకుండా ఒక్కక్కరిగా లోపలికి వెళ్తున్నారు కానీ తేజ్ ని చూసి కౌషిక్ గుర్తుపట్టి పిలుస్తాడు ప్రేమ ని నీరజ్ పిలుస్తాడు ఏంటిరా వెళ్లిపోతున్నారు మిగతావాళ్ళు ఎక్కడ పిలవండి అని అంటే తేజ్ ప్రేమ ఇద్దరు ఏమో సర్ ఇంకా రాలేదు అనుకుంట అని అంటారు. ఏంటి కతలుపడుతున్నారా ఇప్పుడు మీ బ్యాచ్ రాలేదనుకో పరిణామాలు వేరేలాగా ఉంటాయి అని అంటాడు కౌషిక్. ఇవన్నీ వైష్ణవి చూసి మిగతా వాళ్ళకి చెప్తుంది అందరూ కలిసి వెళ్తారు. మీకు ఇచ్చిన వర్క్ చూపించండిరా అని అంటారు అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈలోపు ప్రీతీ నెంబర్ తెచ్చావా అని అడుగుతారు ప్రీతీ లేదు సర్ నిన్న చేతన్ సర్ రాలేదంటా అని అంటుంది కౌషిక్ నీరజ్ ఒకరినొకరు చూసుకొని గట్టిగ నవ్వుతు వాడు రాలేదని ఎవడు చెప్పాడు ఏంటి అబద్దాలు చెప్తున్నావా అసలు నువు వెళ్లి అడగకుండా తప్పిచుకోడానికి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావా అని అంటారు. లేదు సర్ అని ప్రీతీ అంటుంది సరే నువు అబద్ధం చెప్పట్లేదుగా సాయంత్రం కల్ల మీ సీనియర్ బాయ్స్ అందరి నంబర్లు నువ్వు తీసుకురావాలి లేదు అనుకో తరవాత చెప్తా అని అంటారు. అది విని తేజ్ సర్ ఇది కరెక్ట్ కాదు సర్ ఒక అమ్మాయితో అలాంటి పనులు చేయించకూడదు సర్ అని అంటాడు అప్పుడు కౌషిక్ అవునా నాకు తెలియదురా నువు చెప్పావుగా తెలుసుకుంటాలే ఏంటి హీరో అవుదాం అనుకుంటున్నావా అన్ని మూసుకొని ఉండు అని అంటాడు. నీకు ఇలా కాదురా నువు కూడా ఆ అమ్మాయితో పాటు వెళ్లి మీ సీనియర్ గర్ల్స్ అందరి నంబర్లు తీసుకురా అని అంటారు. తేజ్ కి కోపం వచ్చి ఎం మాట్లాడుతున్నారు సర్ నేను ప్రిన్సిపాల్ సర్ కి కంప్లైంట్ ఇస్తా అని అంటాడు ఇస్తే ఇచ్చుకో పో అని నెట్టేసారు. అందరూ క్లాస్ కి వెళ్ళిపోతారు తేజ్ బాగా కోపంగా ఉంటాడు అందరూ మనకి ఎందుకురా ఈ గొడవలు అసలుకే ఫ్రెషర్స్ పార్టీ వస్తుంది పార్టీ లో మనల్ని టార్గెట్ చేస్తారు అని అంటారు. ప్రీతీ తేజ్ తో వద్దు తేజ్ వదిలేయ్ ఈ గొడవలు ఇవన్నీ నాకు భయం అది కూడా నా వల్ల అవ్వటం అస్సలు ఇష్టముండదు నాకు అని అంటుంది. నేనే వెళ్లి నంబర్లు తీసుకువస్తాలే అని అంటుంది మద్యలో లంచ్ సమయం లో ప్రీతీ మళ్ళి సీనియర్ క్లాస్ దగ్గరకి వెళ్ళింది అందరూ ప్రీతిని అంతే చూస్తారు. ఈ లోపు చేతన్ ప్రీతీ దగ్గరకి వచ్చి ఏంటి మల్లి వచ్చావ్ చేతన్ కోసమా అని అడుగుతాడు లేదు సర్ అని అంటే మరి దేనికి వచ్చావ్ అంటే మీకోసమే సర్ అని అంటుంది చేతన్ ఆశ్చర్యపోయి నేనే చేతన్ ని అనితెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ నా కోసమా ఎందుకు అని అడిగితే సీనియర్స్ నిన్న చేతన్ సర్ నెంబర్ తేలేదని ఈరోజు సాయంత్రం లోపు మీ క్లాస్ లో ఉన్న బాయ్స్ అందరి నంబర్స్ తెమ్మన్నారు సర్ మీరు కొంచెం హెల్ప్ చేయండి సర్ అని అడుగుతుంది. చేతన్ వెంటనే క్లాస్ లో పోడియం ఎక్కి ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి మన క్లాసులో అబ్బాయిల నంబర్లు కావాలంట అని చెప్తాడు అందరూ నవ్వి ఎందుకు రోజు ఫోన్ చేస్తావా అని ఏడిపిస్తారు ప్రీతీ చేతన్ వైపు కోపం గా చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రీతీ ఏడ్చుకుంటూ క్లాస్ కి వస్తుంది మిగతావాళ్ళు చూసి ప్రీతీ ని ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావ్ సీనియర్స్ ఏమైనా అన్నరా అని అడుగుతారు ఎం లేదే అని బయటకి వెళ్ళిపోతుంది ప్రీతీ. వైష్ణవి వినీత ప్రేమ ముగ్గురు ప్రీతీ వెనకాలే వెళ్లి ఏమైందే అని అడుగుతారు ప్రీతీ జరిగిందంతా చెప్తుంది. ముగ్గురికి కోపం వచ్చి వెళ్లి ప్రిన్సిపాల్ కి చెపుదాం పదవే అని అంటారు ప్రీతీ వద్దు అని ఆపేస్తుంది. తిరిగి క్లాస్ కి రాగానే తేజ్ విక్రమ్ అభి ఏమైందంటా అని అడుగుతారు వినీత జరిగిందంతా చెప్తుంది. వాళ్ళకి కూడా కోపం వస్తుంది అప్పుడు అభి మెకానికల్ లో మా అన్నయ ఉన్నాడు తనకి తెలిసిన వాళ్ళు మన సీనియర్స్ లో ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ చేత నంబర్స్ అడిగిద్దాం అని అంటాడు మిగతా వాళ్ళు కూడా సరే అని అంటారు.

మరి నంబర్స్ తీసుకుంటారా లేక సీనియర్స్ తో గొడవలకి దిగుతారా అసలు ఫ్రెషర్స్ పార్టీ లో ఎం జరుగుతుందో తరవాతి భాగంలో చూద్దాం........

please give rating and support thank you for all viewrs