Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 2 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

1. తొలిప్రేమ అనుభవాలు - నేర్పించిన పాఠాలు

ప్రణయ్ కి తన ప్రేమ విషయం చెప్పిన తరువాతి రోజు నుంచి ప్రణయ్ ని కలవటానికి రోజు ప్రీతీ స్కూలుకి త్వరగా వెళ్ళేది. రోజు వాళ్ళ సార్ వొచ్చేదాకా మాట్లాడుకునేవారు. ప్రీతిని ప్రణయ్ ప్రేమ గానే చూసుకునేవాడు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు తన విషయంలో కానీ తన మాటలు పట్టించుకునేవాడు కాదు తనని లెక్క చేసేవాడు కాదు అయినా తన చూపించిన ప్రేమ కి ప్రీతీ సంతోషంగా చూసుకుంటాడులే అనుకునింది. ఆలా రోజులు గడుస్తూ ఉండగా ప్రణయ్ జీవితంలోకి వాళ్ళ మరదలు పల్లవి వచ్చింది. ప్రణయ్ ప్రీతిని ప్రేమగా చూసుకోవటం పల్లవి కి నచ్చలా ఎలా అయినా వాళ్ళ ఇద్దరిని విడదీయాలనుకునింది. అప్పుడు పల్లవి ప్రణయ్ కి చెప్పింది ఎందుకురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా మన కులం కాదు అని అనింది కానీ ప్రణయ్ వినకపోయేసరికి ప్రీతీ మీద పవన్ మీద రూమర్లు పుట్టించి ప్రణయ్ కి అనుమానం అనే రోగం వొచ్చేలా చేసింది. అప్పటివరకు బాగానే ఉన్న ప్రీతీ ప్రణయ్ ల బంధంలోకి అనుమానం అనే అడ్డుగోడ చిన్నగా పెరుగుతూ వచ్చింది. ప్రీతీని రోజు ప్రణయ్ తిడుతుంటే పవన్ తట్టుకోలేకపోయేవాడు ఏలా అయినా ప్రీతికి నచ్చచెప్పాలనుకున్నాడు కానీ ప్రీతీ పవన్ మాటలు పట్టించుకొనేది కాదు. అప్పటివరకు ప్రీతిని పట్టించుకోకూడదు అనుకున్న పవన్ ప్రీతీ కి తోడుగా ఉండి సహాయం చేయాలనుకున్నాడు. ప్రణయ్ లేనప్పుడు ప్రీతితో మాట్లాడేవాడు తనని ఇంటిదగ్గరకు దింపడానికి వెళ్తూ ఉండేవాడు కానీ ప్రీతీ పవన్ తో ఎప్పుడు ప్రణయ్ గురించే మాట్లాడుతూ ఉండేది.కొన్ని రోజులకి ప్రీతిని ప్రణయ్ నువు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టు అయితే నాకు నేను అడిగినప్పుడల్లా ముద్దు పెట్టాలి అని అన్నాడు అందుకు ప్రీతీ ఒప్పుకోలేదు. దానితో ప్రీతీ కి కోపం వచ్చి ప్రణయ్ తో మాట్లాడటం మానేసింది. కానీ ప్రీతీ తో మాట్లాడకుండా ప్రణయ్ రెండు రోజులు కూడా ఉండలేకపోయాడు. నాతో మాట్లాడు లేకపోతే చెయ్యి కోసుకుంటాను అని బెదిరించాడు ప్రీతి భయంతో మాట్లాడింది అప్పటినుంచి ప్రీతికి ప్రణయ్ అంటే భయంమొదలయ్యింది. ఇవన్నీ చూసిన పల్లవి ఎలాగైనా ప్రణయ్ ని తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రణయ్ ని ప్రేమిస్తున్నా విషయం ప్రణయ్ కి చెప్పింది. మొదట్లో ప్రణయ్ ఒప్పుకోలా కానీ మెల్లగా పల్లవి కి దగ్గెరఅయ్యాడు. తనని ప్రేమిస్తున్న అని పల్లవి కి కూడా చెప్పాడు ప్రణయ్ తనతో శారీరికంగా కూడా దగ్గరవ్వతూవచ్చాడు. ఇవన్నీ పవన్ మరియు వాళ్ళ స్నేహితులు చెప్పిన ప్రీతీ వినలేదు 10th పబ్లిక్ పరీక్షలు వచ్చాయి ప్రీతీ ఆనందగానే ఎగ్జామ్స్ రాసింది చివరి పరీక్ష రోజు అందరూ కలిసి ప్రణయ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే పరీక్ష అవ్వగానే వెళ్లారు. ప్రీతిని వాళ్ళ ఇంట్లో అందరికి పరిచయంచేసాడు ప్రణయ్. ప్రీతీ సంతోషంగా ఉంది ఈలోపు అందరూ భోజనాలకి కూర్చున్నారు ప్రణయ్ వాళ్ళ ఇంట్లో వేడుక కాబట్టి ప్రణయ్ వాళ్ళతో తినలేదు.ఈలోపు ఏదో పని ఉందని ప్రణయ్ బయటకి వెళ్ళాడు. అందరూ తిన్న తరవాత పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్లదామనుకున్నారు పల్లవి ఇంట్లో పని ఉంది అని చెప్పి ముందే వెళ్లిపోయింది.అవ్వగానే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్లారు లాక్ చేసి ఉంది సర్లే అని పల్లవి వాళ్ళ డాబా పైన ఎదురుచూస్తూ ఉన్నారు పల్లవి కోసం ఈలోపు ఇంట్లో నుంచి నవ్వులు వినిపించాయి పల్లవి వాళ్ళు వచ్చారనుకొని అందరూ కిందకు దిగారు అయినా చూస్తే తాళం వేసివుంది. కిటికీలోనుంచి తొంగి చూసారు లోపల పల్లవి ప్రణయ్ ఉన్నారు అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే ప్రీతి ఏడవటం మొదలుపెట్టింది. పవన్ ప్రీతిని అక్కడినుంచి తీసుకొని వచ్చేశాడు దారిలో అంత ప్రీతీ ఏడుస్తానే ఉంది.పవన్ ప్రీతితో ఏడవకు ఇప్పుడు ఎందుకు ఏడుస్తునావ్ నేను నీకు చాల సార్లు చెప్పా న్వువ్వు వినలేదు అని పవన్ కూడా అరిచాడు ప్రీతీ ఏడుస్తానేఉంది . ఏడవకు ఇంటికి వెళ్ళు అని ఇంటిలో దిగపెట్టాడు పవన్. ఆ రోజంతా ప్రీతీ ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు ఇంట్లో వాళ్లు పరీక్ష సరిగ్గా రాయలేదేమో అనుకున్నారు. పరీక్షా అయ్యిపోయిన తరవాత రోజు ప్రీతీ ప్రణయ్ కలుద్దాం అనుకున్నారు అనుకున్నట్టుగానే ప్రణయ్ ఒక పార్క్ లో కూర్చొని ప్రీతీ కోసం ఎదురుచూస్తున్నాడు కానీ ప్రీతీ రాలేదు ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రణయ్ కి తెలియదు ప్రీతికి పల్లవి గురించి తెలిసిపోయింది అని అలాగే ఎదురు చూస్తూ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రీతీ కి కాల్ చేసాడు ప్రీతీ లిఫ్ట్ చెయ్యలేదు ఎదురు చూసి చూసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. రెండు రోజుల తరవాత ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా స్నేహ,ప్రియా మరియు ప్రభుని తీసుకొని ప్రీతీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రీతీ వాళ్ళ అమ్మ ఉందని ఏడుపు వస్తున్నా ఆపుకొని వాళ్ళతో మాములుగా మాట్లాడింది. ప్రీతిని బయటకి తీసుకెళతాం ఆంటీ మళ్ళి ఇంటిదెగ్గరే వదిలిపెడతాం అని స్నేహ మరియు ప్రియా ప్రీతీ వాళ్ళ అమ్మని అడిగారు. వాళ్ళ అమ్మ ఒప్పుకొని పంపింది. ఇంట్లో దొరకని ప్రేమ ప్రణయ్ వల్ల దొరికిందనుకున్నా ప్రీతీకి మరల కన్నీరే ఎదురయ్యింది. ప్రీతీ తీసుకున్న నిర్ణయం ప్రణయ్ తో చెప్పాలనుకునింది. ప్రీతీ తీసుకున్న నిర్ణయం ఏంటి ? ఆ నిర్ణయం ప్రీతిని ఎటువైపు తీసుకెళ్లనుంది ? తరవాతి భాగంలో చూద్దాం.