Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 3 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

3. నిర్ణయం – మరపు

ఐదుగురు కలిసి పార్కుకి వచ్చారు. వాళ్ళ ఇద్దరిని మాట్లాడుకోమని స్నేహ,ప్రియా,ప్రభు ముగ్గురు పక్కకి వెళ్లిపోయారు. ప్రణయ్ కోపంతో ప్రీతీ ని అడిగాడు కలవటానికి ఎందుకురాలేదు నేను చాలసేపు ఎదురుచూసి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు ప్రీతీ నాకు ఇష్టంలేదు నేను రాలేదు అనింది. ప్రణయ్ కి కోపం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏం అయింది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఓహో స్కూల్ లో ఉన్నప్పుడు ప్రేమించి ఇప్పుడు అవసరం అయ్యిపోయిందిగా వదిలేద్దాం అని అనుకుంటున్నావా అంటాడు. ఆ మాటలు వినగానే ప్రీతికి బాగా ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది. ఏడుస్తూనే ప్రణయ్ కి సమాధానం చెప్తుంది అవును నువ్వు అంటే నాకు ఇష్టంలేదు నీ పనులు నాకు నచ్చట్లేదు దయచేసి నా జోలికి రాకు. ఈ క్షణం నుంచి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీకు నాకు సంబంధం లేదు నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను నీ మొహం కూడా చూడటం ఇష్టంలేదు నాకు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రణయ్ కి ప్రీతీ ఎందుకు ఆలా మాట్లాడుతుందో అర్ధంకాలేదు స్నేహ వాళ్ళను అడిగితే తెలియదు అని చెప్పారు. కోపంరాని అమ్మాయి అంతకంటే ఏం చేయగలదు తాను ఏడవటం తప్ప. ప్రేమించినప్పుడు ఎంత దైర్యంగా ఉంటామో అబ్బాయి తప్పు చేసినప్పుడు అంతే దైర్యంగా వాడిని నిలదీయాలి కానీ ప్రీతీ ఆలా చేయలేదు తన చేతకానితనంతో ఆ అబ్బాయి చేసిన తప్పు తనకి చెప్పే దైర్యం లేక తన మీద నిందవేసుకొని తానే బాధపడుతూ వెళ్లిపోయింది వాళ్ళ స్నేహితులకి కూడా జరిగిన విషయం ఏది ప్రణయ్ తో చెప్పద్దు అని మాట తీసుకుంది. ప్రీతీ ఇంటికి వచ్చేస్తుంది. రోజు అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఒక పక్కన ప్రేమ విఫలం మరో పక్క ఇంట్లో అమ్మ నాన్న గొడవలు ఎం చేయాలో తెలియని పరిస్థితి ఆ అయోమయం లోనే ఇంటర్ జాయిన్ అయ్యింది. పవన్ కూడా ప్రీతీ కోసం అదే కాలేజీ లో జాయిన్ అయ్యాడు ప్రణయ్ ని మర్చిపోడంలో ప్రీతికి పవన్ సహాయం చేయాలనుకున్నాడు. అన్ని మారినా అంతమంది తనకి సహాయం చేయాలనుకుంటున్న ప్రీతీ వాడికోసం బాధపడుతూనే ఉంది. కానీ ప్రణయ్ మాత్రం పల్లవి తో హ్యాపీ గా ఉన్నాడు కానీ ప్రీతిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ప్రణయ్ ఎప్పటికప్పుడు వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి ప్రీతీ గురించి కనుకుంటానే ఉన్నాడు. ఇంటర్ పరీక్షలు వచ్చాయి మొదటి రోజు పరీక్షహాల్ కి వెళ్ళింది.అక్కడి వాతావరణం చూసి ప్రీతీ చాలా బాధపడింది ఎందుకంటే అక్కడ అందరూ స్టూడెంట్స్ పేరెంట్స్ తో వచ్చారు ప్రీతీ ఒక్కతే పరీక్షకి వెళ్ళింది. పిల్లలు చదువుతూఉంటే వాళ్ళ తల్లితండ్రులు వారికీ టిఫన్ తినిపిస్తూ ఉన్నారు వాళ్ళఅందరిని చూసి ప్రీతీ నా తల్లితండ్రులు ఎందుకు ఇలా లేరు అని బాధపడుతుంది. పరీక్షలు అయ్యిపోతాయి కొన్నిరోజులకు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉండటం వల్ల ఆ పెళ్ళికి వెళ్లారు. తన ఇంటర్ ఫ్రెండ్ కేశవ్ అనే ఒక అబ్బాయి ప్రీతిని ప్రేమిస్తున్నాను అని కాల్ చేసి చెప్పటం దానికి ప్రీతీ నాకు ఇష్టంలేదు స్నేహితురాలిగా మాట్లాడమంటే మాట్లాడతా అని చెప్పటం ఇవన్నీ రికార్డు అయ్యాయి. అనుకోకుండా అందరూ ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళు ప్రీతీ ఫోన్లో పాటలు పెట్టి డాన్సులు వేస్తుంటే ఆ రికార్డింగ్ వినపడుతుంది. అది విన్న ప్రీతీ వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ వాళ్ళందరూ చాల కోపంగా ఉంటారు పెళ్లి లో ఉండటంతో ప్రీతిని ఏం అనకుండా ఉన్నారు. ఇలా జరిగిన సంగతి ప్రీతికి తెలియదు ఎందుకంటే ప్రీతీ ఆ సమయం లో వాళ్ళ అక్క వాళ్ళతో బయటకి వెళ్తుంది. ప్రీతీ వచ్చాక ప్రీతీ ఎవరితో మాట్లాడుతున్న తనతో ఎవ్వరు మాట్లాడలేదు తనకి ఎం జరుగుతుందో అర్ధంకాలేదు చేసేదేమిలేక వెళ్లి చిన్నగా ఇంటి బయట మంచంమీద వాళ్ళ చెల్లి వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళదగ్గరకి వెళ్లి కూర్చుంటుంది. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి ప్రీతీ పక్కన కూర్చొని ప్రీతిని తిట్టటం మొదలుపెట్టింది ప్రీతికి వాళ్ళ అమ్మ ఎవర్ని తిడుతుందో ఎందుకు తిడుతుందో తనకి అర్ధంకాలేదు. పెళ్లి లో హ్యాపీగా సందడి చేసుకుంటూ ప్రీతీ తిరుగుతా ఉంటుంది అప్పుడు వాళ్ళ అక్క వచ్చి ప్రీతీకి జరిగినదంతా చెప్తుంది. ప్రీతికి ఆ రికార్డింగ్ ఎలా వచ్చిందో ఎలా రికార్డు అయ్యిందో కూడా తెలియదు నేను ఇంటికివెళ్ళాక అయ్యిపోయాను నన్ను చంపేస్తారు అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది మళ్ళి ఇంకోవైపు నేను ఎం తప్పు చేయలేదుగా ఎందుకు బయపడుతున్నాను అని అనుకుంటుంది కానీ ఒకవైపు భయపడుతూనే ఉంటుంది. ఇలా ప్రతీ దానికి భయపడుతున్న ప్రీతిని చూసి ఇలాంటి అమ్మాయి తన జీవితంలో తన కలలను ఎలా చేరుకోగలుగుతుందో అని తన జీవితం గురించి అన్ని తెలిసిన వాళ్ళ అక్క తనని చూసి బాధపడుతూ ఉంటుంది. పెళ్లి అయ్యిపోతుంది లోపల బాధ ఉన్న సంతోషంగా నటిస్తూ ఉంది. తనతో వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడట్లేదు ఆలా రెండురోజులకి ఇంటికి తిరిగి వెళ్ళిపోతూవుంటారు బస్సు లో కూడా ప్రీతీ అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్లిన వెంటనే అందరూ తిట్టటం మొదలుపెట్టారు ప్రీతిని వాళ్ళ అమ్మమ మా కుటుంబం లో ఇలాంటి వాళ్ళు లేరమ్మ ప్రేమలు అని తిరగటానికి అని అనింది వాళ్ళ అమ్మ ఇంకా ఎన్ని ఘనకార్యాలు చేసావే అని అనింది వాళ్ళ నాన్న కోపంగా చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రీతీ వాళ్ళ అమ్మ వాళ్ళు అన్ని మాటలు అంటున్న నా తప్పు లేదు అని ఒక్క మాటకూడా మాట్లాడల ఏడుస్తూనె ఉంది. ఎం అనుకుందో వెళ్లి తన ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ కళ్ళముందే సిమ్ విరిచి డస్ట్ బిన్ లో పడేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసింది. ఆరోజు నుంచి ఎవ్వరితో మాట్లాడకుండా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఏం తినేది కాదు ప్రీతీ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అక్క ని పిలిచి చెప్తే వాళ్ళ అక్క ప్రీతీ దగ్గరకు వెళ్తుంది ప్రీతీ వాళ్ళ అక్కని చూడగానే ఇంకా ఏడ్చేస్తుంది వాళ్ళ అక్క ప్రీతీ కళ్ళు తుడుస్తా ప్రీతీని నీ గోల్ ఏంటి అని అడిగింది అప్పుడు ప్రీతీ అమ్మ నాన్నని కలపాలి వాళ్ళకి మంచి ఇల్లు కట్టియాలి తమ్ముడిని మంచి హాస్పిటల్ లో వైద్యం చేయించాలి అనింది అప్పుడు వాళ్ళ అక్క ప్రీతితో నువ్వు ఇలా ప్రతిదానికి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇవన్నీ ఎలా చేస్తావ్ అని అనింది. ప్రీతిని చూసి నువ్వు ఇలా ఉండకురా నువు తప్పుచేయినప్పుడు తిరిగి మాట్లాడాలి ఎందుకు ఏడవటం నువ్వు ఏడిస్తే తప్పు చేసినదానివి అవుతావ్ ఇవి ఏంటి నువు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మాటలొస్తాయి ఇవే భరించలేకపోతున్నావ్ ఇంకా అవి ఎం భరిస్తావ్ నువ్వు అనుకున్నవి ఎలా సాధిస్తావ్. ఒక్కసారి ఆలోచించుకో నువ్వే అని వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది. వాళ్ళ అక్క ప్రీతీ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్లి ఆ పిల్ల చేసిన తప్పు ఏంటి ఆ పిల్ల టీనేజ్ లో ఉంది మీరు ఇన్ని మాటలు అంటే ఆ పిల్ల ఏమన్నా చేసుకుంటే అని అనింది అప్పుడు వాళ్ళ అమ్మ మాకు తెలుసులే న్వువ్వు వేళ్ళు వచ్చిన పని అయిందిగా అని పంపించేసింది. వాళ్ళ అక్క మాట్లాడిన మాటలకూ ప్రీతీ మారి దైర్యంగా ఉండగలుగుతుందా లేక పిరికిదానిలా ప్రతిదానికి భయపడుతూ బాధపడుతూ ఉంటుందా ? తరవాతి భాగంలో చూద్దాం ......