Read MY LIFE JOURNEY - 1 by stories create in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 1

నా జీవిత పయనం

(ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

ప్రీతీ పేరులాగే అమ్మాయి కూడా అందరితో ప్రేమగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి గొడవలన్న అరుచుకోవడాలన్న చాలా భయం. ఎవరైనా కన్నెర్ర చేస్తేనే ఏడ్చేస్తుంది. అటువంటి అమ్మాయి జీవితంలో తన కలలను ఎలా సాధించగలుగుతుంది ?

CHAPTER Ⅰ

మొదటి కష్టాలు - మొదటి ప్రేమ

ప్రీతీది ఒక మధ్యతరగతి కుటుంబం ఇష్టంలేకుండా పెళ్లి చేసుకున్న అమ్మ నాన్న, అమాయకపు తమ్ముడు, ప్రేమగా చూసుకొనే అమ్మమ్మా. వీళ్ళే ప్రీతీ చిన్న ప్రపంచం. కానీ తనకు తెలియదు ఆ ప్రపంచం నవ్వుల ప్రపంచం కాదు అని తన అనుకున్న వారే తనని ఏడిపిస్తారని. వాళ్ళ అమ్మ నాన్నది ఇష్టంలేని పెళ్లి కావటం తో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలే ప్రతి చిన్నదానికి అరుచుకోడాలే చిన్న వయసులో తనకి తెలిసేది కాదు ఎందుకు ఇలా జెరుగుతుందో అని కానీ తను టీనేజ్ కి వచ్చాక తెలిసింది ఏం జెరుగుతుందో ఇంట్లో. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూసి రోజు ఏడ్చేది ఒక్కరోజు కూడా ఏడవకుండా నిద్రపోలేదు. ప్రీతీ కి తన తమ్ముడంటే ప్రాణం ఎందుకంటే వాళ్ళ తమ్ముడుకి బ్రెయిన్ లో హోల్ ఉండటంవల్ల మానసిక ఎదుగుదల లేదు తన తమ్ముడికి ఏం తెలియని అమాయకుడు. ప్రీతీ చిన్న వయస్సులో అందరిలాగే బాగా చదవాలి మంచి జాబ్ చేయాలి అని అనుకునింది కానీ తనకు ఏం తెలుసు జీవితంలో ఏది శాశ్వతం కాదు అని ఆఖరికి తన కలలు కూడా. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల ప్రీతీ 7th క్లాస్ నుంచే అన్ని పనులు నేర్చుకుంది. వాళ్ళ అమ్మ ప్రీతీ మీద అన్ని పనులు వదిలిపెట్టేసి తాను బయటకు వెళ్లిపోయేది. వాళ్ళ నాన్న ఇంట్లో కంటే క్యాంప్స్ లోనే ఎక్కువ ఉంటారు. ప్రీతీ అన్ని పనులు చేసుకొని స్కూల్ కి వెళ్ళేది స్కూల్ లోనే హ్యాపీ గా ఫ్రెండ్స్ తో నవ్వుతు నవ్విస్తూ ఉండేది. తన ఇంట్లో పరిస్థితి ఇది అని ఎవ్వరితో చెప్పుకోలేదు తనలో తానే బాగా బాధపడేది కానీ ఫ్రెండ్స్ ముందు తనకు ఏ కట్టలు లేనట్టు నటించేది ఆలా చిన్న వయసునుండే తనకి అమ్మ నాన్న ప్రేమ కరువయ్యింది నాకు ఇది కావాలి అని ఏ రోజు అడగలేదు వాళ్ళు ఏది తెచ్చిన నవ్వుతూ తీసుకొనేది. వాళ్ళు ఏం తెచ్చినా చాలా ఆనందపడేది.

ఇవన్నీ ఇలా ఉండగా 8th లో స్కూల్ మారింది తనకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు పేరు పవన్. పవన్ కి ప్రీతీ అంటే చాల ఇష్టం స్నేహం నుంచి ప్రేమ గా మార్చుకున్నాడు పవన్ దైర్యం చేసి ప్రేమికుల రోజు ప్రీతీ కి ప్రేమ విషయం చెప్పాడు. కానీ ప్రీతీ ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ గానే ఉందాం అని అనింది కానీ పవన్ తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు తనని వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేసాడు. ఇలా అవుతూనే 10th క్లాస్ కి వచ్చారు అమ్మాయిలు ఎప్పుడు నిజముగా ప్రేమించే వారిని ప్రేమించరు మోసం చేయాలనుకున్న వాడినే ఇష్టపడతారు. అప్పుడు పరిచయమయ్యాడు ప్రణయ్. ప్రణయ్ ప్రీతీ వాళ్ళ క్లాస్ కాదు తాను వేరే క్లాస్ తెలుగు ఇంగ్లీష్ క్లాసులు మాత్రమే వాళ్ళని కలిపి కుర్చోపెడతారు. ఆలా ప్రీతికి ప్రణయ్ పరిచయమయ్యాడు. వాడు వాళ్ళ మేడం ని ప్రేమించి ప్రేమలేఖ రాసాడు. అది ప్రీతీ తోనే వాళ్ళ మేడం కి ఇప్పించాడు ఎందుకంటే ఆ మేడం వాళ్ళ ఇల్లు ప్రీతీ వాళ్ళ ఇంటి పక్కనే అప్పుడు ప్రీతీ కి తెలియదు ఆ లేఖ ప్రీతీ ని తొలి ప్రేమలోకి తీసుకొని వెళ్తుంది అని. లేఖ తీసుకొని వాళ్ళ మేడం కంటే ముందు తనే చదివింది అప్పుడు అనుకునింది ప్రేమ ఇలా ఉంటుందా అని తరవాత ప్రీతీ వాళ్ళ మేడంకి ఆ లేఖని ఇచ్చింది ఆమె దాన్ని చింపి ప్రీతిని లాగి పెట్టి ఒకటి కొట్టి ఇలాగె ఇవ్వు వాడికి అని అనింది. ప్రీతీ అలాగే వాడిని కొట్టి ఆ కాగితం ముక్కలు వాడి మొహం మీద కొట్టింది. అప్పటి నుంచి ప్రణయ్ ప్రీతితో ఎక్కువగా మాట్లాడటం చేసేవాడు ప్రీతీ అంటే కొద్దికొద్దిగా ఇష్టం మొదలయ్యింది అది ప్రేమగా మారింది కానీ ప్రీతికి కి చెప్పలేకపోయాడు. ప్రణయ్ తన స్నేహితురాలైన స్నేహ తో చెప్పించాడు. అప్పటికే వాళ్ళ మేడంకి రాసిన లేఖ చదివిన ప్రీతికి ప్రణయ్ అంటే కొంచెం మంచి అభిప్రాయం ఉంది. ఆలోచించుకోడానికి సమయం అడిగి ప్రణయ్ మంచివాడా కాదా అని ప్రణయ్ ఊరిలో ఉన్న వాళ్ళ క్లాస్ వాళ్ళని అడిగింది వాళ్ళు వాడు చాలా మంచివాడు అని చెప్పారు. ఇవన్నీ చూస్తున్న పవన్ ప్రీతీ కి చాల చెప్పి చూసాడు వాడు మంచివాడు కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చెప్పించాడు కానీ ప్రీతీ వినలేదు. మూడు నెలల తరవాత ప్రణయ్ కి ప్రేమిస్తున్నాను అని చెప్పింది.ఎవరికైనా వారు నేరుగా అనుభవిస్తేనే కానీ కొన్నిటి విలువ తెలియదు. ఒకరి ప్రేమ కోసం మరొకరి స్నేహాన్ని కూడా ఒదులుకోడానికి ఇష్టపడింది ప్రీతీ.మరి అటువంటి ప్రేమ ప్రీతిని తన పరుగును ఎక్కడిదాకా తీసుకెళ్లనుందో ? ప్రీతీ తొలిప్రేమ ఎలా అనుభవించిందో తరువాతి భాగంలో చూదాం ?