Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజాలు మరియు అంచనాలు

1. సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిముషాలు పడుతుంది. ఒకవేళ వున్నట్లు వుండి సూర్యుడు మాయమైనా 8 నిమిషాలు వరకు మనకు సూర్యుడు వున్నట్లు కనపడతాడు.

2. చాలా వరకు ఏలియన్స్ అంటే అంతరిక్షం నుండి వచ్చే జీవులు అనుకుంటారు. కాని ఏలియన్ అనే పదానికి అర్దం మన గ్రహం నుండి కాకుండా వేరే గ్రాహాల మీద వుండే ప్రతిదాన్ని ఏలియన్ అనే అంటారు. వేరే ఏదైనా గ్రహం లో జీవం వుంటే వాటికి మనం ఏలియన్స్.

3. నెప్ట్యూన్ మరియు యురేనస్ లో వున్న ఒత్తిడి వల్ల అక్కడ వజ్రాలు వర్షం లా పడతాయి.

4. మనం ఇంద్రధనుస్సు ని విమానం నుండి చూస్తే అది మనకు సర్కిల్ లా కనపడుతుంది. దానికి కారణం మనం భూమి మీద వున్నప్పుడు మనకి వర్షం మరియు కాంతి 180 డిగ్రీ లో వుంటుంది కాని మనం విమానం లో వున్నప్పుడు వర్షం మరియు కాంతి మన పైన మరియు కింద కూడా పడుతుంది కాబట్టి మనకు విమానాల నుండి చూస్తే ఇంద్రధనుస్సు సర్కిల్ గా కనపడుతుంది.

5. స్పేస్ సూట్ 2 రకాలు వుంటాయి.
1. ఆరెంజ్ రంగు : దీని కేవలం భూమి మీద నుండి అంతరిక్షం లోని ఉపగ్రహాల దగ్గరకు వెళ్లడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ పొరపాటున ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం భూమి మీద పడిపోతుంటే ఈ ఆరెంజ్ రంగు వల్ల భూమి మీద వున్న వాళ్ళకి సులభంగా కనపడి వాళ్లను కాపాడగలరు.
2. తెలుపు రంగు : ఇది అంతరిక్షం లో పని చేసేటప్పుడు ఉపయోగిస్తారు. వ్యోమగాములు అంతరిక్షం లో పనిచేయాలని అంటే చాలా రక్షణ అవసరం. ముఖ్యంగా సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది. ఈ సూట్ లో చాలా సదుపాయాలు వుంటాయి ఒకవేళ వ్యోమగాములు నీళ్లు తాగాలి అంటే హెల్మెట్ లో ఆ సదుపాయం వుంటుంది ఇలా చాలా సదుపాయాలు వుంటాయి.

6. మనం జనవరి 15 ని ఆర్మీ డే గా జరుపుకుంటాము.

7. కేవలం శని గ్రహం కి మాత్రమే కాదు ఔటర్ ప్లానెట్స్ అన్నిటికీ రింగ్స్ వుంటాయి.

8. మనకి కొరల్ ఐలాండ్ ఏర్పడటానికి కారణం అయిన జీవి పారట్ ఫిష్. ఇది సముద్రంలోని ఆల్గీ మరియు కొరల్ ని తింటుంది. ఇది తెల్లని ఇసుకను విసర్జన చేస్తుంది. ఈ ఇసుక ఐలాండ్ గా మారుతుంది. ఒక్కో పారట్ ఫిష్. ఒక సంవత్సరంలో 320 కేజీల ఇసుకను విసర్జిస్తుంది.

9. మనకి శ్వాస కి అవసరం అయిన ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది అని మనకు తెలుసు. కాని ఆక్సిజన్ ని చెట్లు మాత్రమే కాదు డయాటంమ్స్ అనే ఒక జీవి కూడా ఇస్తుంది. ఇవి సముద్రాలలో మాత్రమే వుంటాయి. ఇవి మన వెంట్రుక కంటే 4 రేట్లు చిన్నవి.

10. మన భూమిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఉల్క ఢీ కొట్టింది. అదే ఇప్పటి వరకు రికార్డు అయిన అతి పెద్ద ఉల్క. ఆ ప్రాంతం ఆరిజోనా ఎడారి. ఉల్క పడిన ప్రాంతం లో ఒక పెద్ద గుంట పడింది అది ఒక మైల్ పొడవు 500 అడుగుల లోతు వుంది.

11. భూమి మీద మొట్ట మొదటి జీవం సముద్రంలో పుట్టింది అదే సింగిల్ సెల్ ఆర్గానిసం.

12. మనం చంద్రుడు కొన్ని రోజులు కొంత భాగం ప్రకాశవంతంగాను మరి కొంత భాగం నీడగాను కనపడుతుంది. ఈ రెండు భాగాలను విడదీస్తూ ఒక గీత వుంటుంది దానిని టర్మినేటర్ అంటారు.

13. మనకు పర్సనల్ కంప్యూటర్ లేక ముందు ఒక పెద్ద కంప్యూటర్ వుండేది అదే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఇది కేవలం చాలా అనుభవం వున్నావాళ్లు మాత్రమే ఉపయోగించేవారు.

14. మనకి 1974 వరకు పర్సనల్ కంప్యూటర్ అనేదే లేదు. ఆ తర్వాత ఒక మినీ కంప్యూటర్ ను ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది అదే ఆల్టెయిర్ 8800బి. దీనికి కీబోర్డ్, మౌస్ వుండదు. దీనిని వాడటం చాలా కష్టం.

15. మనం కేవలం భూమి మీద మాత్రమే 100 సంవత్సరాలు బ్రతకగలం. సూర్యుని మీద ఒక సెకండ్,బుధ గ్రహం, అంగారక గ్రహం మీద 2 నిమిషాలు. శుక్ర, గురు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రాహల మీద ఒక సెకండ్ మాత్రమే బ్రతకగలం.

16. మన విశ్వం లో ఇంతవరకు కనుగొన్న అతి పెద్ద కృష్ణ బిలం ( బ్లాక్ హోల్) TON 618. ఇది మన సూర్యుని కంటే 66 వందల రెట్లు ఎక్కువ మాస్ ని కలిగి వుంది. మన సౌర కుటుంబం కంటే 32 రేట్లు పెద్దది. దీని వయసు 10.4 వందల కోట్ల సంవత్సరాలు.

17. కాంతి యొక్క వేగం ఒక సెకండ్ కి 200 మిలియన్ మీటర్లు. ఒకవేళ మనం కాంతి వేగం తో విశ్వాన్ని ఒక చివరి నుండి మరొక చివరికి వెళ్లాలి అంటే మనకి 26 బిలియన్ సంవత్సరాలు పడుతుంది.

18. ఒక్క టేబుల్ స్పూన్ పరిమాణం లో వున్న న్యూట్రాన్ స్టార్ బరువు 10 బిలియన్ టన్నులు వుంటుంది.

19. ఆక్టోపస్ రక్తం నీలం రంగులో వుంటుంది. దీనికి కారణం వాటి రక్తం లో కాపర్ వుంటుంది. మన రక్తం లో ఐరన్ వుండటం వల్ల మన రక్తం ఎరుపు రంగులో వుంటుంది.

20. బిగ్ బాంగ్ అయిన లక్షల సంవత్సరాల తరువాత మొదటి పరమాణువు ఏర్పడింది అదే హీలియం హైడ్రేడ్. ఇది హీలియం మరియు హైడ్రోజన్ కలవడం వల్ల ఏర్పడింది.

21. 20 నుండి 30 మిలియన్ సంవత్సరాల తరువాత అంగారక గ్రహం దాని అతి పెద్ద ఉపగ్రహం అయిన ఫోబోస్ అంగారక గ్రహాన్ని ఢీ కొట్టబోతుంది. దీని వల్ల శని గ్రాహానికి వచ్చినట్లు అంగారక గ్రాహానికి కూడా రింగ్స్ వస్తాయి.

22. బుధ గ్రహం చిన్నగా అవుతుంది దీని యొక్క కోర్ చల్లబడటం వల్ల ఆ గ్రహం కుంచించుకుపోతుంది.

23. అమెరికా చంద్రుడు మీద తన దేశ జెండాను పెట్టింది ఆ జెండా రంగు పోయి తెల్లగా అయింది దానికి కారణం చంద్రుని మీద ఉన్న రేడియేషన్.

24. మన విశ్వం ఎంత పురాతనమైనదో మీకు తెలుసా.
మన విశ్వం 13.82 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇంకా 22 బిలియన్ సంవత్సరాలు వుంటుంది.
మన పాలపుంత 13.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇంకా 5 బిలియన్ సంవత్సరాలు వుంటుంది.
మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇంకా 6 బిలియన్ సంవత్సరాలు వుంటుంది.
మన సూర్యుడు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇంకా 7 బిలియన్ సంవత్సరాలు వుంటుంది. ఆ తరువాత వైట్ డ్వార్ఫ్ గా మారుతుంది.

25. మనకి ఎంత చల్లగా వున్న ఎంత ఉష్ణోగ్రత లో వున్న మన కనుగుడ్లు చల్లగా అవ్వవు దానికి కారణం కనుగుడ్లకి ఉష్ణోగ్రత ని గ్రహించే గ్రాహకాలు లేవు.

దయచేసి నా యూట్యూబ్ చానెల్ అయిన Drishti Telugu ని subscribe చేయండి.
Instagram : DrishtiteluguLearning
Facebook : DrishtiLearning