Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఖగోళశాస్త్రం - సైకిల్స్

చీకటి ఆకాశంలో మనం కొన్ని వేల నక్షత్రాలు చూడవచ్చు. కొన్ని గంటలు మీరు గమనిస్తే ఆకాశంలో నక్షత్రాలు ఒక రోజులో ఉదయించడం, అస్తమించడం చూడవచ్చు. మరుసటి రోజు మీరు అదే సమయంలో ఆకాశాన్ని గమనిస్తే మీరు మళ్ళీ అదే గమనిస్తారు. నక్షత్రాలు ఉదయిస్తూ, అస్తమిస్తూ వుంటాయి. పొలారిస్ ఉత్తరాన అలానే కదలకుండా అలానే వుంటుంది. ఒక్క రోజులో ఆకాశం లో ఎటువంటి తేడాలు కనపడవు. ఒకవేళ మీరు ఒక వారం ఓపికగా ఉండి గమనించగలిగితే ఆకాశంలో కొంత మార్పుని చూడవచ్చు.

కొన్ని వారాలు గడిచిపోయాయి అనుకుందాం. సూర్యుడు అస్తమించిన తరువాత తూర్పున వున్న ఒక చెట్టుపై వున్న నక్షత్రాన్ని గుర్తుతెచ్చుకొండి. దాన్ని మళ్లీ గమనించండి. మీరు ఆ నక్షత్రం అదే స్థానం లో వుంటుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఆ నక్షత్రం తన స్థానం కంటే కొంచెం పైకి వుంటుంది. మీరు పశ్చిమాన చూస్తే గతవారం హారిజన్ దగ్గర ఉన్న నక్షత్రాలు ఇప్పుడు తమ స్థానం కంటే కిందకి వుంటాయి. ఒక నెల వేచి వుంటే. ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా వుంటుంది. కొత్త కొత్త నక్షత్ర కూటములు ఆకాశం లో సూర్యుడు అస్తమించిన తరువాత కనిపిస్తాయి. దీనికి కారణం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది దీనివల్ల మనం ఆకాశాన్ని చూస్తే దృష్టికోణం మారుతుంది.

భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది. ప్రతిరోజూ తన కక్ష్య లో కొంచెం జరుగుతోంది. ఇలా తిరుగుతున్నప్పుడు భూమి యొక్క ద్రుష్టి కోణం లో దూరంగా ఉన్న నక్షత్రాలు తమ స్థానాన్ని సూర్యుని సంబంధించి మారుతాయి. దీనివల్లనే ఒకరోజు మనం ఒక నక్షత్రాన్ని సూర్యునికి దగ్గరగా చూస్తాము, మరుసటి రోజు ఆ నక్షత్రం సూర్యునికి కొంచెం దూరం లో వుంటుంది. 6 నెలల తరువాత ఆ నక్షత్రం సూర్యునికి వ్యతిరేకంగా వస్తుంది. ఆ తరువాత ఆ నక్షత్రం మళ్లీ సూర్యునికి దగ్గరగా వస్తుంది. ఇపుడు మీకు ఎమ్ అర్దం అవుతుంది. ఒక సంవత్సర కాలంలో నక్షత్రాలు వేరు వేరు సమయాల్లో ఉదయిస్తూ, అస్తమిస్తూ వుంటాయి. ప్రతిరోజు తూర్పున వున్న నక్షత్రాలు 4 నిమిషాలు ముందుగా ఉదయిస్తాయి, పశ్చిమాన ఉన్న నక్షత్రాలు 4 నిమిషాలు ముందుగా అస్తమిస్తాయి. ఏదైతే ఒక నక్షత్ర కూటమి తూర్పు హారిజన్ కి కింద వుంటుందో ఒక నెల తరువాత ఆ నక్షత్ర కూటమి మనకి ఆకాశం లో కనపడుతుంది .

దీన్నే మనం వేరే విధంగా అర్దం చేసుకోవాలి అంటే. ఆకాశంలో నక్షత్రాలు వాటి స్థానం లో స్థిరంగా వుంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సూర్యుడు నక్షత్రాల నుండి కదులుతూ వుంటాడు. ఇలా ఒక సంవత్సరంలో సూర్యుడు ఆకాశంలో ఒక సర్కిల్ లా తిరుగుతాడు. ఈ మార్గం మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న మార్గం యొక్క ప్రతిబింబం. అది ఆకాశం లో ఒక గీత. ఈ గీతని ఎక్లిప్స్ అని పిలుస్తారు. దీని అర్దం సూర్యుడు ప్రతీ సంవత్సరం ఒకే నక్షత్ర కూటముల మద్య తిరుగుతాడు. అన్ని నక్షత్ర కూటములను కలిపి జోడియక్(రాశి చక్రం) అంటారు. ప్రతి సంవత్సరం ఒక నెలలో సూర్యుడు ఒక రాశీచక్ర రాశిలో వుంటాడు. ధనస్సు, వృశ్చికం, తులా, కన్య, సింహ ఇలా చాలా వున్నాయి.

చివరికి ఒక సంవత్సరం తరువాత సూర్యుడు తిరిగి ధనస్సు రాశిలో కి వస్తాడు. మళ్లీ ఈ సైకిల్ మొదలు అవుతుంది. మనం ఈ మార్గం సూర్యుని యొక్క కదలికలు బట్టి చెప్పుకున్న ఇది భూమి యొక్క కదలిక వల్ల మనకు కనపడుతున్నది. గ్రహాలు కూడా ఆకాశంలో తిరుగుతూ వుంటాయి. బుధ, శుక్ర, అంగారక మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఆ గ్రహాలు కూడా భూమి యొక్క కక్ష్య కి సమాంతరంగా తిరుగుతాయి. మన సౌర కుటుంబాన్ని ఒక పక్క నుండి చూస్తే ఫ్లాట్ గా కనపడుతుంది. దీనివల్ల భూమి మీద వున్న మనకి ఒక సంవత్సరంలో గ్రహాలు ఆకాశం చుట్టూ తిరుగుతున్నట్లు కనపడుతుంది.

ఇన్నర్ ప్లానెట్స్ అయిన బుధ, శుక్ర గ్రహాలు చాలా వేగంగా కదులుతాయి. ఆకాశంలో ఒక్క రోజులో ఈ గ్రహాల కదలికలు మనం చూడవచ్చు. ఔటర్ ప్లానెట్స్ చాలా నెమ్మదిగా కదులుతాయి కానీ కొన్ని రోజులు గమనిస్తే వాటి కదలిక కూడా చూడవచ్చు. వేరే ఒక అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. మీరు కచ్చితంగా గ్లోబ్ ని చూసి వుంటారు. దాని యొక్క ఆక్సిస్( అక్షరేఖ) కొంచెం వంగి వుంటుంది. దీనికి కారణం గ్లోబ్ మన భూమి యొక్క ప్రతిరూపం. భూమి కూడా ఒక పక్కకు వంగి వుంటుంది. భూమి ఈ అక్షం లో ఒకరోజులో తన చుట్టూ తాను తిరుగుతుంది మరియు సూర్యుని చుట్టూ ఒక సంవత్సర కాలంలో తిరుగుతుంది. కాని భూమి అక్షం దాని కక్ష్య రేఖకు సమానంగా 23.5 డిగ్రీలు వంగి వుంటుంది. దీనివల్ల భూమి మీద చాలా ప్రభావం వుంటుంది.

భూమి యొక్క అక్షం తన కక్ష్య కి నిలువుగా ఎటువంటి వంపు లేకుండా వుంది అని ఊహించుకుందాం. ఒకవేళ మీరు భూమధ్యరేఖ మీద వుంటే సూర్యుడు ఉదయించి, మద్యాహ్నం మన తల మీద వుండి, అస్తమిస్తాడు. ఒకవేళ మీరు ధృవాల మీద వుంటే సూర్యుడు భూమి హారిజన్ దగ్గర వుంటాడు. ఉదయించడు, అస్తమించడు. కానీ ఇప్పుడు అది కాదు జరిగేది. భూమి వంగి వుంటుంది. జూన్, జూలై నెలల్లో భూమి యొక్క ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వుంటుంది. ఆరు నెలల తరువాత ఇది సూర్యుని కి దూరంగా వుంటుంది. దీనివల్ల భూమి మీద సూర్యుని ప్రభావంలో వ్యత్యాసం వుంటుంది. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వున్నప్పుడు సూర్యుడు ఆకాశంలో చాలా సేపు వుంటాడు. దీనివల్లనే మనకి ఆ నెలల్లో పగటికాలం ఎక్కువగా ఉంటుంది. ఆరు నెలల తరువాత డిసెంబరు, జనవరి నెలల్లో భూమి యొక్క ధ్రువం సూర్యుని వైపు కాకుండా వ్యతిరేకంగా వుంటుంది. సూర్యుడు ఈ నెలల్లో ఆకాశంలో తక్కువ సమయం వుంటాడు. దీనివల్లనే ఈ నెలల్లో పగటిపూట తక్కువగా వుంటుంది. దీనివల్లనే మనకు ఋతువులు వున్నాయి. ఆకాశంలో సూర్యుడు ఎక్కువ సమయం వుండటం వల్ల మరియు పగలు ఎక్కువ వుండటం వల్ల మనకి ఎండాకాలం వస్తుంది. చలికాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ సమయం వుండటం వల్ల భూమి ఎక్కువ వేడి వుండక చలి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భూమి యొక్క అక్షం వంగి వుండకపోతే మనకి ఇలా ఋతువులు వుండవు. భూమి మీద ప్రతీ నెలలో ఒకే ఉష్ణోగ్రత వుంటుంది.

ఒక దురభిప్రాయం వుండేది ఏంటి అంటే భూమి కి ఋతువులు వుండటానికి కారణం భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారం లో తిరగడం అని సూర్యునికి భూమి దగ్గరగా వున్నప్పుడు వేసవికాలం మరియు దూరంగా వున్నప్పుడు చలికాలం అని చెప్పారు. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారం లో తిరగడం నిజమే కానీ భూమి సూర్యుని కి జనవరి నెలలో దగ్గరగా 5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే వుంటుంది కానీ జూలై లో భూమికి సూర్యునికి మద్య దూరం ఎక్కువగా వుంటుంది. దీన్నిబట్టి తెలిసింది ఏంటి అంటే భూమి మీద వేసవికాలం, చలికాలం రావడానికి కారణం భూమి యొక్క వంపు అంతేకాని సూర్యునికి భూమికి మద్య వున్న దూరం కాదు అని. ఉత్తర అర్థగోళం లో వేసవికాలం వుంటే దక్షిణ అర్థగోళం లో చలికాలం వుంటుంది. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వున్నప్పుడు దక్షిణ ధ్రువం సూర్యుని కి వ్యతిరేక వైపు వుంటుంది. అందువల్ల ఉత్తర, దక్షిణాది ఋతువులు వ్యతిరేకంగా వుంటాయి.


కానీ ఖగోళశాస్త్రం లో ఏది శాశ్వతంగా ఒకేలా ఉండవు. ఉత్తర ధృవం ఎప్పుడు జూన్ నెలలో సూర్యునికి ఎదురుగా వుండదు. పోలారిస్ ఎప్పుడు ఉత్తర నక్షత్రం లా వుండదు. దానికి కారణం భూమి యొక్క అక్షం కదులుతూ వుండటం. మీరు ఎప్పుడు అయినా గమనించారా బొంగరం యొక్క పై భాగం ఊగుతూ వుంటుంది. దాని యొక్క పై భాగం ఒక సర్కిల్ లా తిరుగుతుంది. దీన్ని ప్రిసెషన్( చలనం) అంటారు. భూమి కూడా తన చుట్టూ తాను ఒక రోజులో తిరుగుతుంది. భూమి యొక్క అక్షం కూడా తిరుగుతుంది చాలా నెమ్మదిగా. భూమి యొక్క అక్షం ఒక సారి తిరగడానికి 20 వేల సంవత్సరాలు పడుతుంది.

ఇది మనం చూసే ఆకాశంలో చాలా మార్పులు తెస్తుంది. ఉదాహరణకు పొలారిస్ ఎప్పుడు ధృవ నక్షత్రం గా వుండదు. ప్రతీ సంవత్సరం అక్షం ఆ నక్షత్రం నుండి దూరంగా వెళుతుంది. పూర్వపు ఈజిప్షియన్స్ కు తుబన్ ధృవ నక్షత్రం. 11 వేల సంవత్సరాల తరువాత ఆ స్థానం వేగ అనే ఒక ప్రకాశవంతమైన నక్షత్రానికి వచ్చింది. సూర్యుడు వుండే రాశి చక్రం ఈ ప్రిసెషన్ వల్ల మారుతుంది. పూర్వకాలం లో సూర్యుడు మార్చి 22 న మేషం లో వుంటే ఈ కాలంలో మార్చి 22 న సూర్యుడు మీనం లో వున్నాడు. దీనివల్లనే మన పుర్వ కాలంలో వున్న జ్యోతిష్యశాస్త్రం ఇప్పటి జ్యోతిష్యశాస్త్రం కి వేరేలా గా వుంటుంది.

ఇది చాలా ఆశ్చర్యంగా వుంటుంది భూమి, సూర్యుడు, నక్షత్రాలు గమనించి మనం సమయాన్ని, సంవత్సరంలో కాలాన్ని చెప్పగలము. దీనివల్లనే మన పూర్వికులకు నక్షత్రాలు చాలా ముఖ్యమైనవి. గడియారం, క్యాలండర్ కనిపెట్టక ముందు నక్షత్రాలు ఆకాశంలో గడియారం, క్యాలండర్ లా ఉపయోగపడేవి. మనం కేవలం ఆకాశం వైపు చూసి చాలా తెలుసుకున్నాము.

మనం గడియారం, క్యాలండర్ ఉపయోగించడం మొదలు పెట్టి, రాత్రి వేళల్లో కూడా ఎక్కువ కాంతి వున్న పట్టానికి మారడం వల్ల మనం ఆకాశంలో నక్షత్రాలు చూడలేకపోతున్నాము. మన పూర్వికులు ఎక్కువ శాతం ఆకాశాన్ని గమనిస్తూ వుండేవారు. నక్షత్రాలు ఉదయించడం, అస్తమించడం గమనించేవారు. పాలపుంత ని చూస్తూ అదేంటో తెలియక పోయినా ఆనందించేవారు. కానీ మనకు ఇప్పుడు అది పాలపుంత అని తెలుసు కాని ఇప్పుడు మనం ఆ పాలపుంత యొక్క అందాన్ని ఈ పట్టణ కాంతిలో చూడలేము. పట్టణాలు లేని ప్రాంతం లో వెళ్లి చూడండి మన ఆకాశం ఎంత అందంగా ఎన్నో కోట్ల నక్షత్రాలు మిణుకుమిణుకు మంటు వెలుగుతూ మనకి ఆనందాన్ని కలుగచేస్తాయో. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ వాటిని గమనిస్తే ఎన్నో గంటల సమయం చాలా తక్కువగా అనిపిస్తుంది.


ధన్యవాదాలు
చంద్రకళ ?

దయచేసి నా యూట్యూబ్ చానెల్ అయిన Drishti Telugu ని subscribe చేయండి.
Instagram : DrishtiteluguLearning
Facebook : DrishtiLearning