Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఖగోళశాస్త్రం - గమనించడం

మనం ఆకాశం లో వున్న నక్షత్రాలు చూడటానికి మన కళ్లు, మంచి నల్లని ఆకాశం వుంటే చాలు. మన పూర్వికులు ఇలానే ఖగోళశాస్త్రం కనుగొన్నారు. ఆకాశం వైపు చూస్తూ ఈ విశ్వాన్ని అధ్యయనం చేయడం చాలా అద్భుతమైన విషయం.

మీరు ఊహించుకోండి మీరు పట్టణ కాంతి కి దూరం వున్నారు, ఆకాశంలో మబ్బులు లేకుండా చాలా నల్లగా వుంది. సూర్యుడు అస్తమించాడు. కొన్ని నిమిషాలు నల్లటి ఆకాశం చూస్తారు. కొంత సమయం తరువాత తూర్పున ఒక నక్షత్రం కనపడుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఇలా ఒక గంట తరువాత ఆకాశం మొత్తం నక్షత్రాలతో నిండిపోతుంది. మనం మామూలు కంటి చూపుతో కొన్ని వేల నక్షత్రాలు చూడగలం. మీ కంటి చూపుని బట్టి నక్షత్రాలు కనపడతాయి.

మీరు ఇప్పుడు ఒకటి గమనించవచ్చు అన్ని నక్షత్రాలు ఒకేలా ప్రకాశించవు. కొన్ని చాలా ప్రకాశవంతం గా వుంటే కొన్ని మామూలుగా ప్రకాశిస్తూ వుంటాయి. కొన్ని చాలా తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇలా కనపడడానికి రెండు కారణాలు వున్నాయి. మొదటిది అన్ని నక్షత్రాల కాంతి ఒకేలా వుండదు కొన్ని బల్బ్ లా తక్కువ కాంతిని కలిగి వుంటే మరికొన్ని చాలా ఎక్కువ కాంతిని ఎంత అంటే మన సూర్యుడు ఒక రోజులో ఉత్పత్తి చేసే కాంతిని ఇవి ఒక్క సెకండ్ లో ఉత్పత్తి చేస్తాయి. మరొక కారణం అన్ని నక్షత్రాలు భూమికి సమానమైన దూరం లో ఉండవు. ఎంత ఎక్కువ దూరం లో వుంటే అంత తక్కువ కాంతితో కనపడుతుంది.

ప్రాచీన ఖగోళశాస్త్రవేత్త అయిన హిప్పర్కస్ నక్షత్రాల జాబితా ను ఏర్పాటు చేసినందుకు మంచి పేరు వచ్చింది. ఆయన నక్షత్రాల వెలుగును బట్టి జాబితా ఏర్పాటు చేశారు. ఆయన ఒక మాగ్నిట్యూడ్ అనే సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అతి ఎక్కువ ప్రకాశవంతం గా వున్న నక్షత్రాలు 1st మాగ్నిట్యూడ్ జాబితాలో, మామూలు ప్రకాశవంతం గా వున్న నక్షత్రాలు 2nd మాగ్నిట్యూడ్ జాబితాలో ఇలా 6 మాగ్నిట్యూడ్ వున్నాయి. మనం ఎప్పటికీ ఈ సిస్టమ్ ని ఉపయోగిస్తున్నాము. అతి తక్కువ ప్రకాశవంతం కలిగిన నక్షత్రాలు ( హబ్బుల్ టెలిస్కోప్ ఉపయోగించి చూసినవి) 31 మాగ్నిట్యూడ్. మనం మన కంటితో చూసిన అతి తక్కువ ప్రకాశవంతం కలిగిన నక్షత్రాలు నిజానికి 10 బిలియన్ రేట్లు ఎక్కువ వెలుగుని కలిగి వుంటాయి. మనం చూడగలిగిన ఆకాశం లో అతి ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్.

వేగ నక్షత్రం నీలం రంగులో వుంటుంది. బెటల్జస్ నక్షత్రం ఎరుపు రంగులో వుంటుంది. ఆర్క్టూరస్ నారింజ రంగులో, కపెల్లా పసుపు రంగులో వుంటుంది. ఈ నక్షత్రాలు నిజం గా ఈ రంగుల్లో వుంటాయి. మన కంటికి కేవలం ప్రకాశవంతమైన నక్షత్రాలు మాత్రమే వివిద రంగుల్లో కనపడతాయి. మిగిలినవి తెలుపు రంగులో కనపడతాయి. ఎందుకు అంటే మన కంట్లో రంగులు గ్రహించే గ్రాహకాలు కాంతిని ఎక్కువ గ్రహించలేవు. కనుక కేవలం అతి ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రాలు మాత్రమే చూడగలం.

మనం గ్రహించిన ఇంకొక విషయం నక్షత్రాలు అన్ని ఎలా పడితే అలా చెల్లాచెదురుగా లేవు. అవి ఆకారాలను, నమూనాలు గా వున్నాయి. మనుషులు నమూనాలను గ్రహించగలరు. అందుకే పూర్వీకులు మన ఆకాశాన్ని నక్షత్రాల కూటమిగా విభజించి మనకు తెలిసిన వస్తువుల పేర్లను వాటికి పెట్టారు. ఓరియన్ అనేది ప్రసిద్దమైన నక్షత్రాల కూటమి. ఇది నిజంగా ఒక మనిషి తన చేతులు పైకి లేపి వున్నట్లు వుంటుంది. డాల్ఫినియస్ అనేది కేవలం 5 నక్షత్రాల కూటమి కాని ఇది చూడటానికి డాల్ఫిన్ సముద్రంలో నుండి దూకుతున్నట్లు వుంటుంది. స్కార్పియస్( వృశ్చికం), పైసీస్(మీనం), కాన్సర్( కర్కాటకం) ఇలా చాలా నక్షత్ర కూటములు వున్నాయి. మొత్తం 88 నక్షత్ర కూటములు వున్నాయి. ఈ నక్షత్ర కూటమి యొక్క సరిహద్దులు చాలా జాగ్రత్తగా గీయబడినవి.

ఇప్పుడు ఒక నక్షత్రం అఫ్యూకస్ అనే నక్షత్ర కూటమి లో వుంది అంటే ఆ నక్షత్రం ఆ నక్షత్ర కూటమి యొక్క సరిహద్దు లోపల వుంది అని అర్దం.
మీరు దీని అర్దం చేసుకోవాలి అంటే ఇండియా లో వున్న స్టేట్స్ లా. మన స్టేట్స్ సరిహద్దుల లాగా. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్ని నక్షత్రాల గుంపులు నక్షత్ర కూటమి గా వుండవు. ఉదాహరణకు బిగ్ డిప్పర్ అనే నక్షత్ర గుంపు అర్సా మేజర్ అనే నక్షత్ర కూటమి లో వుంటుంది.

ప్రకాశవంతమైన చాలా నక్షత్రాలకు పేర్లు వున్నాయి. అవి అరబిక్ లో వుంటాయి. చీకటి యుగం సమయం లో యూరోప్ శాస్త్రీయంగా ఆలోచించలేనపుడు పర్షియన్ ఖగోళశాస్త్రవేత్త అయిన అబ్ద్ రె-రెహ్మాన్ అల్ సుఫీ పురాతన గ్రీక్ ఖగోళశాస్త్రాన్ని అరబిక్ లో అనువాదించారు. అప్పటినుంచి నక్షత్రాల పేర్లు అలానే వున్నాయి. అయినప్పటికీ పేర్లు లేకుండా ఇంకా చాలా నక్షత్రాలు వున్నాయి అందువల్ల ఖగోళశాస్త్రవేత్తలు వేరే పేర్లను పెట్టారు. చాలా నక్షత్రాలు వాటి నక్షత్ర కూటమి లో ఎక్కువ గ్రీక్ పేర్లు కలిగి వున్నాయి. ఆల్ఫా ఓరియోనిస్ అతి ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రం ఓరియన్ నక్షత్ర కూటమిలో. చివరకు పేర్లు ఐ పోవడంతో ఆధునిక శాస్త్రవేత్తలు అంకెలను ఉపయోగిస్తున్నారు.

ఖగోళశాస్త్రవేత్తకు కాంతి కాలుష్యం ఒక పెద్ద సమస్య అయింది. ఇది వీధి లైట్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఎక్కడ అయితే కాంతి ఆకాశం వైపు వెళుతుందో భూమి వైపు కాకుండా. ఇది ఆకాశాన్ని కాంతి తో నింపుతుంది దీనివల్ల అతి తక్కువగా కనపడే నక్షత్రాలు కనపడవు. అందుకే పరిశీలనాలయాలు పట్టణాలకు, గ్రామాలకు దూరంగా కొండ ప్రాంతాల్లో వున్నాయి. కాంతి తో నిండిన ఆకాశం లో అతి తక్కువ కాంతి వున్న నక్షత్రాలు చూడటం 50 అడుగుల దూరం లో వుండి గుసగుసలు వినడం లా వుంటుంది. ఒక పెద్ద పట్టణం లో వుండి పాలపుంత ని చూడటం అసాధ్యం. ఆ పట్టణ కాంతి లో ఆకాశంలో నక్షత్రాలు కనపడలేవు. కేవలం మానవులు మాత్రమే కాంతి కాలుష్యం వల్ల సమస్యలు ఎదుర్కోవట్లైదు. దీనివల్ల జంతువులు వేట కి, పురుగుల సంతానోత్పత్తి, ఇలా చాలా వాటికి వాటి రోజువారీ జీవితం అంతరాయం ఏర్పడుతోంది.

కాంతి కాలుష్యాన్ని ఆపడం చాలా సులభం. మంచి లైట్ ఫిక్చర్స్ వాడకం వల్ల కాంతి ఆకాశం వైపు కాకుండా భూమి వైపు వస్తుంది. చాలా పట్టణాలు వీటిని వాడి సక్సెస్ అయ్యాయి. ఇది పెద్ద పెద్ద గ్రూప్ ల వల్ల అవుతుంది అవే ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్, గ్లోబ్ ఎట్ నైట్, ది వరల్డ్ ఎట్ నైట్, ఇంకా చాలా వున్నాయి. ఒకవేళ మీరు వున్న ప్రాంతాల్లో ఆకాశం నల్లగా లేకపోతే మీరు వేరే వాటిని గమనించవచ్చు. మీరు జాగ్రత్తగా చూస్తే కొన్ని నక్షత్రాలు వేరే వాటికంటే తేడా గా వుంటాయి. అవి మిణుకుమిణుకు మంటు మేరవవు. దానికి కారణం అవి నక్షత్రాలు కావు. అవి గ్రహాలు. మిణుకుమిణుకు గా ఎందుకు కనపడతాయి అంటే మన గాలి కదులుతూ వుంటుంది. ఇలా కదిలినపుడు అది ఆ నక్షత్రాల నుండి వచ్చే కాంతిని వంకర చేస్తుంది దీనివల్ల మనకు నక్షత్రాలు మిణుకుమిణుకు మంటు కనిపిస్తాయి.

కాని గ్రహాలు మన భూమికి చాలా దగ్గరగా వుంటాయి, పెద్దగా కనిపిస్తాయి కాబట్టి గాలి యొక్క కదలిక వాటిని ప్రభావితం చేయదు. మనం కేవలం మన కంటితో 5 గ్రహాలను చూడగలం అవే బుధ గ్రహం , శుక్ర గ్రహం , అంగారక గ్రహం, బృహస్పతి గ్రహం, శని గ్రహం. యురేనస్ ని చూడాలి అంటే కంటిచూపు చాలా స్పష్టంగా వుండాలి. శుక్ర గ్రహం మూడవ అతి ఎక్కువ ప్రకాశవంతమైన వస్తువు ఆకాశం లో.

ఒకవేళ మీరు ఆకాశం వైపు ఒక గంట లేక రెండు గంటలు చూస్తే మీరు నక్షత్రాలు కదలడం గమనిస్తారు. మన భూమి గుండ్రంగా తిరుగుతుంది. తూర్పున వున్న నక్షత్రాలు హరిజన్ నుండి పైకి వస్తుంటే పశ్చిమాన వున్న నక్షత్రాలు హరిజన్ నుండి కిందకు వెళ్తున్నట్లు కనపడతాయి. దీనికి కారణం మన భూమి తిరుగుతూ వుండటం. భూమి రోజు కు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది. మనం భూమి మీద వుండటం వల్ల ఆకాశం మనకి వ్యతిరేకంగా తిరుగుతున్నట్లు కన్పిస్తోంది.

ఒక తిరుగుతున్న గ్లోబ్ ని చూడండి. ఇది ఒక అక్షం మీద రెండు ధృవాల గుండా తిరుగుతుంది. మద్యలో భూమధ్యరేఖ వుంటుంది. ఒకవేళ మీరు భూమధ్యరేఖ మీద వుంటే ఒక రోజులో మీరు భూమి చుట్టూ ఒక పెద్ద సర్కిల్ లో తిరుగుతారు. ఒకవేళ మీరు ఉత్తర లేక దక్షిణ ధృవాల వైపు వెళ్తే మీ సర్కిల్ చిన్నగా అవుతుంది. ఒకవేళ మీరు ధృవాల మీద నిల్చుని వుంటే మీరు అసలు సర్కిల్ చేయరు. ఇలానే ఆకాశం లో కూడా జరుగుతోంది. మనం భూమి మీద వుండటం వల్ల మనకు ఆకాశం తిరుగుతున్నట్లు కనపడుతున్నది. భూమధ్యరేఖ దగ్గర వున్న నక్షత్రం ఆకాశంలో పెద్ద సర్కిల్ చేస్తుంది. ధృవాలకు దగ్గర ఉన్న నక్షత్రాలు చిన్న సర్కిల్ ని, ధృవం దగ్గర వున్న నక్షత్రాలు అసలు కదలవు.

ఉత్తర ధృవం కి చాలా దగ్గరగా ఒక నక్షత్రం వుంది అదే పొలారస్. దీని ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు. ఇది ధృవం దగ్గర వుండటం వల్ల ఇది ఎప్పుడూ కదలకుండా అక్కడే వుంటుంది. మన కంటికి ప్రతీ రోజు పొలారస్ కదలకుండా అక్కడే వున్నట్లు కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి మన భూమి తిరుగుతూ వుంటుంది కాబట్టి ఆకాశం తిరుగుతూ వున్నట్లు కనిపిస్తోంది. మీరు ఉత్తర ధృవం మీద నిల్చుని వుంటే పొలారస్ మీ పైన కదలకుండా వున్నట్లు కనపడుతున్నది, భూమధ్యరేఖ మీద వున్న నక్షత్రాలు సర్కిల్ గా తిరుగుతున్నట్లు కనపడతాయి, దక్షిణ ధృవం దగ్గర వున్న నక్షత్రాలు కనపడవు. మనం చూసే నక్షత్రాలు మనం వున్న ప్రాంతాన్ని బట్టి కనపడతాయి. ఉత్తర ధృవం లో వున్నప్పుడు మనం దక్షిణ ధృవ నక్షత్రాలు చూడలేము ఇలానే దక్షిణ ధృవం లో వున్నప్పుడు ఉత్తర ధృవ నక్షత్రాలు చూడలేము. భూమధ్యరేఖ మీద వున్నప్పుడు ఉత్తర, దక్షిణ ధృవాల నక్షత్రాలు హారిజన్ లో వున్నట్లు కనపడతాయి.

ధన్యవాదాలు.
చంద్రకళ ?.

దయచేసి నా యూట్యూబ్ చానెల్ అయిన Drishti Telugu ని subscribe చేయండి.
Instagram : DrishtiteluguLearning
Facebook : DrishtiLearning