Read black holes by Drishti Telugu in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 21

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్రిష్ణబిలం

క్రిష్ణబిలం అంటే అంతరిక్షం లో ఒక ప్రాంతం. క్రిష్ణబిలం నే బ్లాక్ హోల్ అని అంటారు. దీనియొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ వుంటుంది. కనీసం కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ ఎక్కువ గురుత్వాకర్షణ కలిగి వుంటుంది ఎందుకు అంటే అంతరిక్షం లో వున్న మాటర్{గ్యాస్, డస్ట్, గ్రహాలు,...} చాలా తక్కువ ప్రాంతంలో కుదించబడి వుండటం వల్ల మాస్ ఎక్కువ వుంటుంది. మాస్ ఎంత ఎక్కువ వుంటే అంత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి వుంటుంది.

బ్లాక్ హోల్ నుండి కనీసం కాంతి కూడా తప్పించుకోలేదు అందుకే మనం బ్లాక్ హోల్ ని చూడలేము. ఎందుకు అంటే మనం ఏ వస్తువు అయినా చూడాలి అంటే ఆ వస్తువు కాంతి ని తనగుండా వెళ్లకుండా ఆపి తిరిగి కాంతి ని ప్రతిబింబించాలి. ఉదాహరణకు మనం ఒక బాటిల్ ని చూడగలం ఎందుకు అంటే బాటిల్ కాంతిని తనగుండా  వెళ్లకుండా ఆపి తిరిగి ప్రతిబింబిస్తుంది. కానీ మనం గాలి ని చూడలేము ఎందుకు అంటే గాలి కాంతిని ఆపలేదు.

మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాలను ఉపయోగించి బ్లాక్ హోల్ ని చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మన సూర్యుని ప్లేస్ లో అదే మాస్ లో వున్న బ్లాక్ హోల్ వున్న మనకి ఏమీ కాదు కానీ సూర్యుని కంటే ఎక్కువ మాస్ వున్న బ్లాక్ హోల్ వుంటే 
అపుడు మన భూమి ఇంకా మిగిలిన గ్రహాలు అన్ని ఆ బ్లాక్ హోల్ లో కలిసి పోతాయి. బ్లాక్ హోల్ చుట్టూ వుండే సర్కిల్ ని ఈవెంట్ హారిసన్ అంటారు. దీన్ని బ్లాక్ హోల్ యొక్క నీడ అని కూడా అంటారు. ఇది దాటి వెళ్లిన ఏదీ అయినా బ్లాక్ హోల్ లో కలిసి పోవల్సిందే. అంతరిక్షం లో వున్న మాటర్ బ్లాక్ హోల్ లో కి వెళ్ళేటపుడు బ్లాక్ హోల్ చుట్టూ ఒక డిస్క్ లా ఏర్పడుతుంది. దీన్ని అక్రీషన్ డిస్క్ అంటారు. కొన్ని బ్లాక్ హోల్స్ నుండి అణువులు బయటకి నెట్టివేయబడతాయి  అపుడు బ్లాక్ హోల్ మద్యలో  ఒక పోల్ లా వస్తుంది దాన్ని క్వేసార్ అంటారు. 

బ్లాక్ హోల్స్ 3 రకాలు ఉన్నాయి. అవి 

1. స్టెల్లర్ బ్లాక్ హోల్. 
2. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్. 
3. మినిఎచర్ బ్లాక్ హోల్. 

మన సూర్యుని కంటే 20 రేట్లు ఎక్కువ వున్న నక్షత్రాలు పేలిపోయినపుడు స్టెల్లర్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఒక్క స్పూన్ సైజ్ వున్న స్టెల్లర్ బ్లాక్ హోల్ యొక్క మాస్ మన సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ వుంటుంది. మన నక్షత్రమండలంలో చాలా స్టెల్లర్ బ్లాక్ హోల్స్ వుంటాయి. మన నక్షత్రమండలాన్ని పాలపుంత అని అంటారు. సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దగా వున్న నక్షత్రాలు పాలిపోతే ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. 

మన విశ్వం లో ఎన్నో కోట్ల నక్షత్రమండలాలు వున్నాయి ప్రతి నక్షత్రమండలం మద్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ వుంటుంది. మన పాలపుంత లో కూడా సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ వుంది అదే సాగిటేరియస్ ఏ. మన నక్షత్రమండలం మద్యలో వున్న బ్లాక్ హోల్ యొక్క మాస్ మన సూర్యుని మాస్ కంటే 40 లక్షల రెట్లు ఎక్కువ. మన భూమి లాంటి గ్రహాలు కొన్ని కోట్లు దానిలో పడతాయి. మన పాలపుంత మద్యలో వున్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ మన భూమికి సూర్యునికి మద్య ఎంత దూరం అయితే వుంటుందో అంత పెద్దగా వుంటుంది. 

మినిఎచర్ బ్లాక్ హోల్స్ వున్నాయి అని అనుకుంటున్నారు కానీ మన శాస్త్రవేత్తల దెగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని తియరీస్ చెబుతున్నవి ఏమిటి అంటే బహుశా మినిఎచర్ బ్లాక్ హోల్ విశ్వం ఏర్పడిన కొత్తలో వుండవచ్చు అని. 10 నుంచి 20 బిలియన్ సంవత్సరాల ముందు ఈ మినిఎచర్ బ్లాక్ హోల్స్ వుండవచ్చు అని దానిలో మౌంట్ ఎవరెస్ట్ కి సమానం అయిన మాటర్ వుండవచ్చు అని మరియూ దాని మాస్ మన సూర్యుని మాస్ కంటే 9 రేట్లు ఎక్కువ వుండవచ్చు అని భావిస్తున్నారు. 10 బిలియన్ సంవత్సరాల ముందు విశ్వం లో వున్న మాటర్ అంతా ఒక చిన్న ఏరియా లోకి కుదించుకుపోయింది. ఆ తర్వాత అది పాలిపోయింది. దీన్ని బిగ్ బాంగ్ అంటారు. అలా పాలిపోయినపుడు వచ్చిన మాటర్ వల్లనే మినిఎచర్ బ్లాక్ హోల్స్ ఏర్పడ్డాయి అని భావిస్తున్నారు. 

బ్లాక్ హోల్ యొక్క మొట్ట మొదటి ఫోటో ఏప్రిల్ 10 2019 న కనుగొన్నారు. అది కూడా మనం బ్లాక్ హోల్ ని చూడలేము ఆ ఫోటో లో వున్నది బ్లాక్ హోల్ కాదు బ్లాక్ హోల్ యొక్క నీడ. శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి ముందు 2 బ్లాక్ హోల్స్ ని ఎంపిక చేసారు. 
అవి మన పాలపుంత లో వున్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ మరియూ మిసైర్ 87 లో వున్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్. మిసైర్ 87 ని యమ్ 87 అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు మొట్ట మొదట తీసిన ఫోటో యమ్ 87 బ్లాక్ హోల్ ది. కాని శాస్త్రవేత్తలు మన పాలపుంత లో వున్న బ్లాక్ హోల్ ని కాకుండా యమ్ 87 మద్యలో వున్న బ్లాక్ హోల్ ని ఎందుకు ఫోటో తీశారు అంటే యమ్ 87 సాగిటేరియస్ కంటే చాలా పెద్దది. యమ్ 87 యొక్క మాస్ మన సూర్యుని కన్నా 6 వందల కోట్ల రేట్లు ఎక్కువ వుంటుంది. 

మనం ఇప్పటి వరకూ ఎక్కువ క్వాలిటీ తో తీసిన ఫోటో మన చంద్రునిది. అది కూడా చంద్రుడు మొత్తం కాదు చందమామ లో చాలా చిన్న ప్లేస్ ని. మనం మన భూమిని కాకుండా అంతరిక్షం లో వున్న వాటిని చూడాలి అంటే టెలిస్కోప్ ని ఉపయోగిస్తాము. టెలిస్కోప్ కాంతి ని సేకరించడం వల్ల పనిచేస్తాయి. టెలిస్కోప్ ఎంత పెద్దదిగా వుంటుందో అంత ఎక్కువ ఏరియా ని మనం చూడవచ్చు. ఉదాహరణకు మనం వర్షం పడేటప్పుడు మనం ఒక బకెట్ ని పెడితే నీళ్లు సేకరించవచ్చు. బకెట్ ఎంత పెద్దది అయితే అంత ఎక్కువ నీళ్లను సేకరించవచ్చు. 

యమ్ 87 బ్లాక్ హోల్ మన భూమి నుండి 50 మిలియన్ లైట్ ఇయర్స్ దూరం లో వుంది. ఒక్క లైట్ ఇయర్ అంటే 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు. ఇంత దూరం లో వున్న బ్లాక్ హోల్ యొక్క ఫోటో తీయాలి అంటే టెలిస్కోప్ మన భూమి పరిమాణం లో వుండాలి. కానీ మన భూమి సైజ్ లో వుండే టెలిస్కోప్ తయారు చేయడం జరగని పని ఇంకా అసాధ్యం. ఈ ప్రాజెక్టు లో 200 మంది కంటే ఎక్కువ శాస్త్రవేత్తలు పనిచేశారు. భూమి మీద 6 ప్రాంతాల్లో టెలిస్కోప్స్ లను ఏర్పాటు చేసి భూమిని ఒక పెద్ద టెలిస్కోప్ గా మార్చారు. ఈ టెలిస్కోప్స్ నుండి 5 పెటాబైట్ డాటా ని 2017 లో సేకరించారు. ఒక్క పెటాబైట్ అంటే 10 లక్షల జిబి. ఈ డాటా ని ప్రోసెస్ కి పంపించాలి అంటే చాలా కష్టం. ఈ 
5 పెటాబైట్ డాటా ని హార్డ్ డ్రెవ్స్ లో పెట్టి వాటిని విమానాల ద్వారా రవాణా చేశారు. ఇంత ఎక్కువ డాటా ని ప్రోసెస్ చేయడం చాలా కష్టం అయిన పని అందుకే శాస్త్రవేత్తలు 4 టీంలుగా ఏర్పడి వేరు వేరు అల్గారిదంను మరియు వేరు వేరు మోడల్స్ ఉపయోగించి ప్రోసెస్ చేశారు. చివరకు ఆ 4 టీమ్స్ నుండి వచ్చిన ఇమేజ్ ఒకేలా వుంది అదే బ్లాక్ హోల్ ఇమేజ్.

మొట్ట మొదట బ్లాక్ హోల్స్ వున్నాయి అని కనుగొన్నది డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ 1915 లో జనరల్ రిలేటివిటీ అనే తియరీ ని కనుగొన్నారు. ఈ తియరీ గురుత్వాకర్షణ కి సంబంధించినది. ఈ తియరీ పరంగా విశ్వం లో ఏదైనా చాలా ఎక్కువ మాస్ ని కలిగి వుంటే అది గోళాకారంలో వుండి ఒక నల్లని నీడను కలిగి వుండి దాని చుట్టూ కాంతి చాలా వేగంగా తిరుగుతుంది అని తెలిపారు. ఇటీవల తీసిన బ్లాక్ హోల్ ఇమేజ్ ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ కి తగ్గట్లు వుండటం వల్ల శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ తియరీ 100 శాతం నిజం అని నమ్ముతున్నారు. మన విశ్వం లో ఇంతవరకు కనుగొన్న అతిపెద్ద బ్లాక్ హోల్ టాన్ 618. ఈ బ్లాక్ హోల్ సైజ్ 13 వందల అస్ర్టోమికల్ యూనిట్లు. ఒక్క అస్ర్టోమికల్ యూనిట్ అంటే 150 మిలియన్ కిలోమీటర్లు. ఈ బ్లాక్ హోల్ మాస్ మన సూర్యుని కంటే 66 బిలియన్ రేట్లు ఎక్కువ. మన భూమి నుండి 10.37 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం లో వుంది.

ధన్యవాదాలు, 
చంద్రకళ ? 


ఈ కథని చూడాలి అంటే నా యూట్యూబ్ చానెల్ అయిన Drishti Telugu లో చూడవచ్చు. దయచేసి నా యూట్యూబ్ చానెల్ అయిన Drishti Telugu ని subscribe చేయండి.