solar flare books and stories free download online pdf in Telugu

సౌర జ్వాల

మన సౌర కుటుంబం కి రాజు సూర్యుడు. కొన్ని కోట్ల నక్షత్రాలు వున్న మన పాలపుంత లో ఒకటి. మొత్తం సౌర కుటుంబములో 8 గ్రహాలు వున్నాయి. అవి బుధుడు,  శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. ఈ 8 గ్రహాలు సూర్యుని యొక్క బారీ సెంటర్ చుట్టూ తిరుగుతాయి. బారీ సెంటర్ గురించి తెలియాలి అంటే ఉదాహరణకు మన సౌర కుటుంబం లోని సూర్యుని ని భూమి ని ఉదాహరణగా తీసుకుందాం. బారీ సెంటర్ ఒక వస్తువు యొక్క మాస్ ని బట్టి వుంటుంది. సూర్యుని మాస్ మన భూమి కంటే 3,33,000 రేట్లు ఎక్కువ. కాబట్టి సూర్యుని కి భూమి కి మద్య బారి సెంటర్ సూర్యుని మద్యభాగం కంటే కొన్ని కిలోమీటర్ల పక్కకు వుంటుంది. అందుకే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ వున్నట్లు కనపడుతుంది. అదే మనం సూర్యుని ని గురుడు ని ఉదాహరణగా తీసుకుంటే సూర్యుని కి గురుడు కి మద్య బారి సెంటర్ సూర్యుని బయట వుంటుంది. 

మన నక్షత్ర మండలం లో ఉన్న గ్యాస్ మరియూ డస్ట్ ని ఉపయోగించి సూర్యుడు ఏర్పడ్డాడు. మిగిలిన గ్యాస్ మరియూ డస్ట్ నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. మన భూమి సూర్యుని యొక్క నివాసానికి సరిపడ్డ ప్రాంతం లో వుండటం వల్ల భూమి మీద జీవం సాధ్యం అయింది. మనం చాలా వరకు సూర్యుని మీదనే ఆధారపడి వున్నాము. సూర్య కాంతిని ఉపయోగించి చెట్లు ఆక్సిజన్ ని ఇస్తాయి. మనం సోలార్ ప్యానల్ ని ఉపయోగించి కరెంట్ ని తయారు చేసుకుంటాము. సూర్యుని నుండి వచ్చే కాంతిని, వేడినీ చాలా రకాలు గా ఉపయోగించుకుంటున్నాము. కాని ఒకటి మాత్రం నిజం మనం సూర్యుని వల్ల వుంటున్నాం కానీ సూర్యుడు మన కోసం వుండట్లేదు. సూర్యుడు మనకి ఎంత మంచి చేస్తున్నాడో అంత కంటే ఎక్కువ చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మన భూమి మనల్ని సూర్యుని నుండి కనపడుతున్నది. 

మన భూమి సూర్యుని యొక్క హబిటబుల్ జోన్ లో వుండటం వల్ల భూమి కి కొన్ని శక్తులు వున్నాయి. అవి అయస్కాంతం క్షేత్రం, ఓజోన్ లేయర్ మరియూ వేడిని కంట్రోల్ చేయడం. సూర్యుని వల్ల వచ్చే ప్రమాదాల్లో చాల ప్రమాదకరమైనది సోలార్ ఫ్లేర్( సౌర జ్వాల). ఈ సౌర జ్వాలల నుండి అప్పుడప్పుడు మన భూమి కూడా మనల్ని కాపాడలేదు. సూర్యుని లో జరిగే అయస్కాంత చర్యలు వలన సౌర జ్వాలలు వస్తాయి. కొన్నిసార్లు సూర్యుడు సోలార్ ఫ్లేర్ తో పాటు విద్యుత్ తో కూడిన పార్టికిల్స్ ని కూడా పంపుతుంది దానిని కరోనల్ మాస్ ఇంజెక్షన్(CME). CME's భూమి ని చేరుకున్నప్పుడు అది మన అయస్కాంత క్షేత్రం తో కలుస్తుంది అప్పుడు జియోమాగ్నెటిక్ స్టోర్మ్ వస్తుంది. అవి అరోరాస్. 1859 లో భూమిని ఒక ప్రమాదకరమైన సౌర జ్వాల వచ్చింది. అపుడు భూమికి చాలా నష్టం జరిగింది. భూమి మీద విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది, ఫోన్లు పనిచేయలేదు. ఇలా అవ్వడం వల్ల ప్రాణ నష్టం లేకపోయినా ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. ఒకవేళ 1859 లో వచ్చిన సౌర జ్వాల ఇప్పుడు వస్తే మనకి అప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. 

మన జీవితం ఎక్కువ శాతం ఉపగ్రహాల మీద ఆధారపడి ఉంది. ఫోన్, జీపీఎస్, ఇంటర్నెట్ ఇలా చాలా వున్నాయి. CME వల్ల సోలార్ ప్యానల్ చెడిపోతాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఉపగ్రహాలు చెడిపోతాయి లేకపోతే సరిగా పనిచేయలేక తప్పు సిగ్నల్ పంపిస్తాయి. అంతరిక్షం మొత్తం చార్టర్డ్ పార్టికిల్స్ తో నిండి వుంటుంది. ఒకవేళ ఈ పార్టికిల్స్ CME తో కలిస్తే అపుడు అవి ఎనర్జీ ని ఏర్పాటు చేస్తాయి. అదే వేడి. వేడి విస్తరించడం వలన ఉపగ్రహాల వేగం తగ్గి అవి భూమి మీద పడిపోవచ్చు. సౌర తుఫాను వల్ల కేవలం ఉపగ్రహాలు మాత్రం నష్టంపోపు భూమి మీద వున్న మనకి నష్టం జరుగుతుంది. సౌర తుఫాను వచ్చినపుడు విద్యుత్ లైన్స్ ఓవర్ లోడ్ అయి పేలిపోతాయి అపుడు మనకి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది, ఫోన్ లకు సిగ్నల్స్ రావు ఇలా చాలా రకాల నష్టాలు వస్తాయి. 

సౌర తుఫాన్ లు మన భూమిని తాగడానికి చాలా తక్కువ సమయం పట్టొచు కానీ అప్పుడు వచ్చిన నష్టం నుండి కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సూర్యుని నుండి వచ్చే పెద్ద ప్రమాదాల్లో ముక్యం అయింది సౌర తుఫాను కానీ థాంక్స్ టు టెక్నాలజీ మరియు ఆస్టోనాట్స్. ఇప్పుడు వున్న టెక్నాలజీ ద్వారా 
ఆస్టోనాట్స్ సూర్యుని నీ 24 గంటలు  గమనిస్తున్నారు. సూర్యుని లో జరిగే మార్పులు మరియు సౌర తుఫాన్ లు అవి మనకి ప్రమాదమా కాదా అని అన్ని గమనిస్తున్నారు. కానీ మనం 100 శాతం సురక్షితం అని చెప్పలేము. సూర్యుడు కేవలం సౌర తుఫాన్ లనే కాదు ఇంకా కొన్ని ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు. ఈ విశ్వం లో పుట్టిన ప్రతిదీ చనిపోవాల్సిందే. అలానే సూర్యుడు కూడా చనిపోతాడు. కానీ అది చనిపోయేటపుడు కేవలం అది మాత్రమే పోదు మన భూమిని మిగిలిన గ్రహాలని అన్నిటిని నాశనం చేస్తుంది. సూర్యుడు ఏర్పడ్డప్పుడు ఇప్పుడు వున్న దానికంటే చాలా చిన్నది మరియు తక్కువ వేడిని కలిగి ఉంది. మన సూర్యుడు ఇప్పుడు మద్య వయసు లో వుంది ఇంకో 4 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు చనిపోతాడు. అప్పుడు సూర్యుని సైజ్ ఇప్పుడు వున్న దానికంటే 1000 రెట్లు పెద్దదిగా వుంటుంది. సూర్యుని నుండి వచ్చే వేడి కూడా ఇప్పటి కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ వుంటుంది. ఒక దశలో మన భూమి కూడా సూర్యుని లో కలిసిపోతుంది. 

ధన్యవాదాలు, 
చంద్రకళ. 

ఈ కథను మీరు చూడాలి అంటే నా యూట్యూబ్ చానెల్ అయిన Drishti Telugu లో చూడవచ్చు. నా చానెల్ ni subscribe చేయండి. 


షేర్ చేయబడినవి

NEW REALESED