Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆక్సిజన్ - ప్రాణవాయువు ఎలా ఏర్పడుతుంది.

మనం మన భూమిని చాలా తేలికగా తీసుకుంటాము అలాగే చాలా వాటిని తేలికగా తీసుకుంటాము అలాంటి వాటిలో చాలా ముఖ్యం అయింది శ్వాస. మనకి తెలిసినంతవరకు మనకి ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది. కానీ మనకి ఆక్సిజన్ ఒక సూక్ష్మజీవి నుండి కూడా వస్తుంది.

శ్వాస కంటే సహజంగా జరిగేది లేదు. మనకి తెలిసినంత వరకు అది కేవలం భూమి మీద మాత్రమే జరుగుతుంది. ఒకవేళ భూమి మీద ఆక్సిజన్ లేకపోతే జీవం వేరేలా వుంటుంది. దానికి వుదాహరణ మన భూమి మీదనే వుంది అదే డెలోల్ అనే ఏరియా. ఇక్కడ గాలి చాలా విషపూరితంగా వుంటుంది. ఇక్కడ గాలి లో ఆక్సిజన్ కాదు హైడ్రోజన్ సల్ఫేట్ వుంటుంది. నేల లో నుండి నీరు కాదు యాసిడ్ వస్తుంది. ఇక్కడ స్వచ్ఛమైన నీరు వుండదు అందుకే ఇక్కడ జంతువులు, పక్షులు, చెట్లు వుండవు. కానీ ఇక్కడ కొన్ని జీవులు వున్నాయి. అవి ఆక్సిజన్ ని అసలు ఉపయోగించుకోవు.

ఆక్సిజన్ లేకపోతే జీవం సాధ్యం కాని అది వేరేలా వుంటుంది. చాలా చిన్నగా వుంటుంది. డెలోల్ ప్రాంతంలో వున్న యాసిడ్ ని మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో సేకరిస్తే ఆ టెస్ట్ ట్యూబ్ లో వున్న యాసిడ్ లో ఈ జీవాలు కొన్ని కోట్లు వుంటాయి. మనకి శక్తి మనం తినే ఆహారం మరియూ ఆక్సిజన్ వల్ల వస్తుంది.

ఆక్సిజన్ ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం.

దీని కోసం మనం తూర్పు ఆఫ్రికా లోని డాంకిల్ అనే ప్రాంతానికి వెళ్లాలి. ఇది ఒక ఎడారి. కానీ ఇది మట్టితో కాదు ఉప్పు తో ఏర్పడింది. ఇక్కడి ప్రజలు ఈ ఎడారి మీదనే ఆధారపడి వున్నారు మరియూ మనం కూడా ఈ ఎడారి మీదనే ఆధారపడి వున్నాము కానీ ఇక్కడ వున్న ఉప్పు మీద కాదు ఇక్కడ వచ్చే ఇసుక తుపాను మీద. ఇక్కడ వచ్చే తుపాను వల్ల ఇక్కడ వున్న దుమ్ము అంతా గాలి లో కలిసి అట్లాంటిక్ సముద్రాన్ని దాటి అమెజాన్ ప్రాంతం లో పడుతుంది. ఇలా పడిన దుమ్ము నుండి వచ్చిన పోషకాలను ఎరువులుగా ఉపయోగించి కొత్త మొక్కలు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం 27 మిలియన్ టన్నుల దుమ్ము ఇక్కడ పడుతుంది దీనివల్ల అమెజాన్ అడవిలో ఎన్నో రకాల కొత్త మొక్కలు వస్తాయి.

ఒక్క చెట్టు ఇద్దరికి సరిపడే ఆక్సిజన్ ని ఇస్తుంది. అమెజాన్ రైన్ ఫారెస్ట్ 5.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు. కేవలం అమెజాన్ అడవులు మాత్రమే మన ఆక్సిజన్ కంటే 20 శాతం ఎక్కువ ఇవ్వగలదు. కానీ 1 శాతం ఆక్సిజన్ కూడా ఇక్కడ నుండి బయటకు వెల్లదు. దానికి కారణం ఇక్కడ వున్న జంతువులు, పక్షులు, కీటకాలు. ఇవి ఇక్కడ వున్న ఆక్సిజన్ మొత్తం ఉపయోగించుకుంటాయి. కానీ మనం పీల్చుకునే ఆక్సిజన్ ఇక్కడి నుంచి వస్తుంది అందేలా అంటే ఇక్కడ వున్న ఒక రివర్ వల్ల. కానీ ఈ రివర్ నేల మీద వుండదు ఆకాశంలో వుంటుంది.

మనం భూమి ని స్పేస్ నుండి చూస్తే మన భూమి అప్పుడప్పుడు ఐన చాలా బాగా కనపడుతుంది. కానీ అమెజాన్ రైన్ ఫారెస్ట్ మాత్రం అస్సలు కనపడదు దానికి కారణం అమెజాన్ మీద వున్న రివర్. అమెజాన్ అడవిలో ఒక పరిశీలన కేంద్రం వుంది అదే " అమెజాన్ టాల్ టవర్ అబ్సర్వేటరి". ఇక్కడ పరిశోధన లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఈ అడవుల్లో ని చెట్లు నెల లో ని నీళ్లను పీల్చుకుంటాయి. వాటిలో కొంత నీళ్లు ని ఆకుల నుండి వదులుతాయి. ఇలా పంపిన నీరు సూర్యకాంతి మరియు గాలి వల్ల ఆవిరి గా మారి మేఘాలుగా మారుతుంది. ఇవే నేను చెప్పిన రివర్. ఈ రివర్ ఆకాశం లో వెళ్తూ అండిస్ అనే ప్రాంతంలో అక్కడ వున్న ఒత్తిడి వల్ల ఘనీభవించి వర్షం లా పడుతుంది.

ఇలా పడిన నీరు రాళ్ళ మీద ప్రవహిస్తు ఆ రాళ్లను కరిగిస్తూ ఆ పోషకాలను వాటితో తీసుకుని వెళ్లి సముద్రంలో కలుపుతాయి.

ఇప్పుడు నేను ఒక కొత్త సూక్ష్మజీవి గురించి చెపుతాను. అవే డయాటం. ఇవి మన వెంట్రుకల కంటే 4 రేట్లు చిన్నగా వుంటాయి. మన శ్వాస కి ఇవే కారణం. వర్షం ద్వారా సముద్రంలో కలిసిన పోషకాహారం లో వున్న సిలికాన్ ని ఇవి తీసుకుని వాటి మీద చిప్పను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ చిప్పలు పునరుత్పత్తి కి ఉపయోగపడుతాయి. అప్పుడు అవి వాటి సంఖ్య ను పెంచుకుంటాయి.

డయాటంమ్స్ ని మనం ఆకాశం నుండి చూస్తే చాలా అందం గా కనపడతాయి. ఇవి వున్న ప్రాంతంలో సముద్రం నీలం రంగులో కనపడుతుంది. ఇవి కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ని తయారు చేస్తాయి. కానీ కేవలం ఈ వర్షం మీదనే ఇవి ఆధారపడి వుండవు. ఇంకా చాలా వనరుల వున్నాయి అందులో ఒకటి మంచు మనోజ్ కొండలు కరగడం. మంచుదిబ్బ  నుండి మంచు విరిగి సముద్రంలో పండినప్పుడు ఆ మంచు లో వున్న పోషకాలను ఉపయోగించుకుంటాయి ఈ డయాటంమ్స్. పోషకాహారం ఐ పోయాక ఇవి చనిపోతాయి. కానీ ఇవి చనిపోయి కూడా మనకి ఉపయోగపడతాయి. అందేలా అంటే.

డయాటంమ్స్ చనిపోయాక వాటి చిప్పలు అన్ని సముద్రం అడుగున పడతాయి. అలా పడిన చిప్పల వల్ల సముద్రం అడుగు ప్రాంతం పెరిగి కొన్ని సంవత్సరాల తరువాత నీరు పోవడంతో అది ఎడారి గా మారుతుంది. ఇప్పుడు అర్దం అయిందా ఆ ఇసుక తుఫాను లో వున్న దుమ్ము ఏమిటి అనేది అదే డయాటంమ్స్ చిప్పలు. అవి అమెజాన్ లో కుళ్లిపోయి అవి ఎరువులుగా మారుతాయి.ఇలా డయాటంమ్స్ ఉప్పు ఎడారి గా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం ఉపయోగించే ఆక్సిజన్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన డయాటంమ్స్ వల్ల వస్తుంది.

ఉప్పు ఎడారి నుండి అమెజాన్ ఎగిరే రివర్ వరకు. ఎగిరే రివర్ నుంచి డయాటంమ్స్ వరకు అన్ని అనుసంధానం తో వుంటారు. మన భూమి మన వాతావరణాన్ని చాలా బాగా బాలెన్స్ చేస్తుంది. మీకు తెలుసా మన భూమి మీద ఆక్సిజన్ ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆక్సిజన్ శాతం 20.95. మన భూమి మన ఆక్సిజన్ ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది. జన సంఖ్య పెరిగినా ఆక్సిజన్ శాతం మారలేదు. ఆక్సిజన్ లేకపోతే జీవం ఎలా వుంటుందో తెలుసుకున్నాం ఇప్పుడు ఆక్సిజన్ వుండవలసిన దాని కంటే ఎక్కువ వుంటే ఎమ్ అవుతుంది అని చెపుతాను. 

మనం చలి కాచుకోవడానికి మంట వేస్తాము. ఆ మంట ఆరిపోకుండ ఉండటానికి గాలి ని ఊదుతాము అప్పుడు మంట ఎక్కువ అవుతుంది. కారణం మనం వున్న ఆక్సిజన్ కంటే ఎక్కువ ఊదడం వలన. అలానే భూమి మీద కూడా వుండవలసిన దాని కంటే ఎక్కువ ఆక్సిజన్ వుంటే భూమి కాలిపోతుంది. ఇలా అవ్వకుండా వుండాలి అంటే దానికి బాలెన్స్ కావాలి. కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు భూమి మీద ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల భూమి మీద ఎక్కువ మంటలు వచ్చాయి. అది మళ్లీ జరగవచ్చు. మనం ఒక దారం మీద నడుస్తున్నాము. మనకి రెండు వైపులా చావు వుంది. ఆక్సిజన్ లేకపోతే అవయవాలు చెడిపోయి చనిపోతాము. ఆక్సిజన్ ఎక్కువ అయితే దానివల్ల వచ్చే మాటల్లో కాలిపోతాము. 

మనల్ని బతికించడానికి మన భూమి చాలా కష్టపడుతుంది. కాని మనం చెట్లు కొట్టేసి, నదుల ప్రవాహం ఆపేసి, ల్యాండ్ ని పెంచుతూ మన భూమి కష్టాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాము. మనం ఏదీ వున్న లేకపోయినా ఎలాగోలా బతకొచ్చు కానీ మనం వున్న భూమి లేకపోతే మనం బతకలేము. కాబట్టి దయచేసి చెట్లు పెంచండి మన భూమి కష్టాన్ని తగ్గించండి. 

ధన్యవాదాలు. 
మీ చంద్రకళ. 


ఈ కథని మీరు చూడాలి ante నా యూట్యూబ్ చానెల్  Drishti Telugu లో చూడవచ్చు. ఆ వీడియో చూసి దాన్ని Subscribe చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు మీ అభిప్రాయాలు కామెంట్స్ చేయండి.