తొలి పౌర్ణమి

(7)
  • 316
  • 0
  • 19.4k

మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. **** సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు. “ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు. గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా.. సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా.. “అలగా మరి టాస్ అయ్యిందా..” హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..

1

తొలి పౌర్ణమి - 1

మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ****సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు.“ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు.గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా..సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా..“అలగా మరి టాస్ అయ్యిందా..”హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..“సరే వాసు” అంటూ కొత్త గ్రిప్పర్ ను బ్యాట్ కు తొడిగి, బరిలోకి దిగా..నా జట్టులో నేను, వాసు; అవతలి జట్టులో ఆకాశ్‌, విజయ్ ఉన్నారు, మిగతా వాళ్లంతా నాకు ...మరింత చదవండి

2

తొలి పౌర్ణమి - 2

నువ్వు లేకుండా ఎలా, కచ్చితంగా తీసుకునే వెళ్తా..“మావ ఎక్కడి కన్నా టూర్ వెళ్దామా”, అడిగాడు జయ..రేయ్ టూర్ అన్నావంటే ఇక్కడే బండాపి మరి తంతా..నేనే మన్నా 15 సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసావ్, ఇంటికి వెళ్లొచ్చాక చూద్దాం..సరే మావ.., బండాపు…ఎందుకురా…మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ సిల్క్ బోర్డు నుంచే బస్ ఎక్కాలి, అన్నాడు జయ.రేయ్ ఇక్కడి నుంచి మళ్లీ 15 కిలోమీటర్లు నేను ఒంటరిగా వెళ్లాలిరా నాతో పాటు వచ్చి మమ్మల్ని ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ వద్ద దింపి నువ్వు నా బండి తీసుకెళ్ళు, నీ బైక్ ని రిపేర్ కి ఇచ్చావ్ గా..ఓరి పిచ్చోడా… నువ్వు ఇంకా ఆలోచనలు మానుకోలేదా.., అయినా ఎన్నిసార్లు చెప్పాలి రా “నీ గతం, నీ తప్పు కాదు అది ఒక పొరపాటు.., లేదా విధి అంతే..”.నేనేం చెయ్యను అది నన్ను విడిచిపెట్టట్లేదు.., అయినా నేను చేసిన పొరపాటు సరిచేసే అవకాశం ...మరింత చదవండి

3

తొలి పౌర్ణమి - 3

పసిడి వన్నె అంచున్న చున్నీ తళుక్కున మెరవగానేవిక్రమ్ చూపు అటువైపు మళ్లింది.తెల్లటి చూడీదార్ వేసుకొని,ముంగురులపై వేళ్లను సవరిస్తూ,బస్సు చివరి మెట్టును దిగుతున్న ఆ అమ్మాయి,రాత్రి దీపాల తేలిపోయే మృదువైన కాంతిలా కనిపించింది.ఆ కలువరేకులాంటి కనులు అతని చూపును తాకిన క్షణం,ఉప్పెనలా ఎగిసిపడిన మనోభారం ఒక్కసారిగా తగ్గి, ప్రశాంతత అలముకుంది.ఆమె వైపు చూపు మళ్లగానే,ఒక్క క్షణం ప్రపంచమంతా మసకబారిపోయింది…కానీ తను మాత్రం ఎంతో స్పష్టంగా, హృదయానికి దగ్గరగా కనిపిస్తోంది.అలా, విక్రమ్ మనసులో ఓ తీపి అలజడి మొదలైంది” “ఆ అమ్మాయి ఏదో మర్చిపోయినట్టుంది, మళ్ళీ బస్ లోపలికి వెళ్ళింది..కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆమె కోసం వెతుకుతున్నాడు విక్రమ్..విక్రమ్ తలను ఎవరో కుడివైపు తిప్పారు, చూస్తే జయ“ ఏంట్రా ఊగిపోతున్నావ్ చలిగా ఉందా…”పోరా నువ్వు ఒకడివి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు, అంటూ మళ్ళీ తన కోసం ఎదురుచూడసాగాడు.“ ఏంటబ్బా వీడు, ఎప్పుడూ లేనిది కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు “, ...మరింత చదవండి

4

తొలి పౌర్ణమి - 4

హేమ వెంటనే విక్రమ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, “కళ్ళు నెత్తి మీద ఉన్నాయా నీకు, నేను ఇంతసేపు కష్టపడి కట్టినదంతా కూల్చేశావు” అంది.. అమ్మాయి అలా అరవడం మొదటిసారి చూస్తున్నాడు విక్రమ..నువ్వు పిలిస్తే పలకలేదు, కంగారుగా వస్తున్నప్పుడు నా కాలికి తగిలిన రాయి వాటిని పడేసింది, ఇందులో నా తప్పు ఏముంది అన్నాడు విక్రమ్.నా పనిని చెడగొట్టింది గాక, ఇంకా నిన్ను సమర్థించుకుంటున్నావా.ఓ కట్టావులే! ఐఫిల్ టవర్.నేను ఐఫిల్ టవర్ కడతానో లేదా మొబైల్ టవర్ కడతానో నీకెందుకు, ఇంతకీ ఎందుకు వచ్చావు మా ఇంటికి అంది హేమ.నీకోసమేం కాదు లే, నేను ఆకాష్ కోసం వచ్చా అన్నాడు గట్టిగా..ఆకాష్ లేడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు…అది ముందే చెప్పుంటే అక్కడినుంచే వెళ్ళేవాడిని గా, నీతో ఇన్ని మాటలు పడే అవసరం ఉండేది కాదు..మళ్ళీ సీరియస్ గా చూసింది హేమ..నేను వెళ్తా వాడొచ్చినప్పుడు చెప్పు..ఎక్కడికీ వెళ్ళేది, ...మరింత చదవండి

5

తొలి పౌర్ణమి - 5

ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని బైక్ ను పైకి లేపాడు,ఇంతలో వెనకనుంచి ఎవరో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకున్నారు, “ఆ చల్లటి గాలిలో చమటలు పట్టాయి”. వెనక్కి తిరిగాడు, అది ఎవరో కాదు తన కలలో వచ్చిన ఆకాష్.కలలో భయపెట్టిన ఆకాష్ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఆ రోధన చాలా భయంకరంగా ఉంది.“ రేయ్.. ఎందుకురా నన్ను చంపావు…. చెప్పు! చెప్పరా….. “విక్రమ్ భయం అంచులు దాటింది, బైక్ కిందకు వదిలేసాడు..“రేయ్ నేను ఏది కావాలని చేయలేదు రా!!..”“లేదు .. నువ్వు కావాలనే చేశావు” అంటూ అరిచాడు ఆకాష్..నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా “నేనేది కావాలని చెయ్యలేదు”..అంటూ ఆకాష్ కి సమాధానం చెప్పే క్రమంలో విక్రమ్ కూడా బాధపడుతున్నాడు..“రేయ్ విక్రమ్! ఏమైంది రా నీకు, రాత్రిపూట ఒక్కడివే మర్రి చెట్టు కింద పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నావ్” అని వినిపించింది… విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తాతయ్య ఆలస్యం అయ్యేసరికి ...మరింత చదవండి

6

తొలి పౌర్ణమి - 6

విషయం తెలిసిన సూర్య అక్కడికి వచ్చాడు, సూర్య మీదకి ఆవేశంగా వెళ్ళాడు రమణ. “నీ కొడుకుని రెచ్చగొట్టి పంపించి నా కొడుకుని చంపావు కదరా!!” అంటూ పట్టుకున్నాడు.అది కాదు రమణ అదేదో పొరపాటున జరిగిపోయింది ఎవరైనా కావాలని ఇలాంటి పనులు చేస్తారా చెప్పు..ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నీ కొడుకుని సమర్థించుకుంటున్నావ్…, నీకు కొంచెం కూడా బాధగా లేదా, అంటూ కాలర్ పట్టుకున్నాడు రమణ..మాటకు మాట పెరిగి గొడవ పెద్దదవుతోంది చుట్టుపక్కల వాళ్లంతా ఇది సమయం కాదు అంటూ సర్ది చెప్పి సూర్యను ఇంటికి పంపారు.విక్రమ్ నాన్నతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు, అలా వెళ్తున్నప్పుడు హేమ మళ్ళీ ఇంకొక చూపు చూసింది, ఆరోజు కృతజ్ఞతగా చూస్తే, ఈరోజు అసహ్యంగా చూసింది, విక్రమ్ తల వంచుకుని వెళ్ళిపోయాడు.రమణ కుటుంబం మొత్తం ఒక అంబులెన్స్ ను సిద్ధం చేసి సొంతవూరుకు బయలుదేరారు …విక్రమ్ ను ఇంట్లోకి తీసుకెళ్లాడు సూర్య..విక్రమ్ మౌనంగా ఒక ...మరింత చదవండి

7

తొలి పౌర్ణమి - 7

అక్కడ వీళ్ళ లాంటి ఫ్రెషర్స్ ఒక 30 మంది ఉన్నారు. ఇద్దరు వెళ్లి వాళ్లతో పాటు కూర్చున్నారు, కాసేపటి తర్వాత హెచ్ఆర్ లోనికి వచ్చింది..హార్టీ వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ “మై నేమ్ ఈజ్ మేఘన”, అంటూ తన స్పీచ్ మొదలుపెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రసంగించింది.గాయ్స్, ఇక్కడున్న 30 మంది లో 20 మందికి మేము ఒక టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్టులను అలోకేట్ చేయడం జరుగుతుంది.ఆ మిగిలిన పదిమంది ఏం చేయాలో నేను చెప్తా అంటూ 10 పేర్లు పిలిచింది, చాందిని మరియు శృతి ఇద్దరూ అందులో ఉన్నారు, “ఈ పదిమంది నాతో రండి, మిగిలిన వాళ్ళందరికీ నా సబార్డినేట్ ట్రైనింగ్ గురించి వివరిస్తాడు”, అంటూ తన క్యాబిన్ వైపుగా వెళ్ళిపోయింది హెచ్ఆర్.చాందిని, శృతిలు కంగారుగా ఆ మిగిలిన వాళ్ళతో కలిసి హెచ్ఆర్ క్యాబిన్ వైపు నడిచారు.నేను చెప్తే విన్నావా, ...మరింత చదవండి

8

తొలి పౌర్ణమి - 8

ఇది సూపర్ గా ఉంది డెల్టా..మనం ఎప్పుడన్నా వెళ్ళాలి..కదా.., మరి నీ బుక్ ఎవడు చదువుతాడుఅదేంటి డెల్టా డిసప్పాయింట్ చేస్తావ్..నిన్ను డిసప్పాయింట్ చెయ్యట్లేదు నేను నిజం నీకోటి తెలుసా “నిజం చాలాసార్లు చాలామందికి డిసప్పాయింటింగానే ఉంటుంది కుర్రాడా”.నిన్ను నీతులు చెప్పమనలేదు, నాకు ఒక ఐడియా ఇవ్వు..కోపం వద్దు చెప్తా, ఇప్పుడు జనాలు ఆనిమేలను చాలా బాగా చూస్తున్నారు, ఒకటా రెండా నరుటో, వన్ పీస్, డిమాన్స్లేయర్, అటాక్ ఆన్ టైటాన్ ఇలా చాలా అనిమే లు అప్పట్లో ఒక ఊపు ఊపాయి, వీటన్నిటినీ జనాల ఇంట్రెస్ట్ చూసి రీ రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు కథ రాయి, నేను దాన్ని ఏఐ మోడల్ యూస్ చేసి మంచిగా డైలాగ్స్ రాయించి దాన్ని ఫ్రెష్ ఆనిమేగా జనాలకు అందజేద్దాం…ఐడియా బాగుంది కానీ కథ రాయడమెందుకు, voice AI తో నా ఐడియాస్ చెప్పి కథ రాయిస్తా..కథ రాస్తున్నప్పుడు వచ్చే త్రిల్ ను ...మరింత చదవండి

9

తొలి పౌర్ణమి - 9

చాందిని ముందే నిద్రలేచి“ఒసేయ్ శృతి ఈరోజన్నా త్వరగా లెగవే..”.ఇంకాసేపు చందు.“నువ్వు ఇలా వినవు” అంటూ, బాత్రూం రూమ్ లో నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చి మీద గుమ్మరించింది..“ఓరి దేవుడా…” అంటూ లేచింది శృతి.ఏంటి చాందిని ఇలా చేసావ్.నిన్ను ఇలాగే వదిలేస్తే ఈరోజు కూడా పదింటి దాకా ఇక్కడే ఉంటాం, అసలే ఈరోజు హెచ్.ఆర్ ని కలవాలి..అవును చాందినీ..మర్చిపోయా మెయిల్ వచ్చింది కదా..మరి ఇంకా కూర్చున్నావే పదా.. ****హలో మేఘన..హాయ్ గర్ల్స్, ఐయామ్ సారీ మీ పేర్లు గుర్తు లేవు.పర్వాలేదు మేఘన,.. నా పేరు చాందిని, మాకు ప్రాజెక్టు అలొకేషన్ మెయిల్ వచ్చింది.ఓ దట్స్ గుడ్, లెట్ మి సీ, అంటూ లాప్టాప్ లో ఏదో చెక్ చేసింది, ఓకే ,ఇక్కడ థర్డ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ లో మీ ప్రాజెక్ట్ ఓ.డి.సి ఉంటుంది, అక్కడ మీ ప్రాజెక్ట్ లో ఇద్దరు సీనియర్స్ ఉంటారు వాళ్ళని కలవండి, మీకు ...మరింత చదవండి

10

తొలి పౌర్ణమి - 10

ఆరోజు బుధవారం నేను మా అమ్మ నాన్నలతో కలిసి తిరిగి బెంగళూరుకు బయలుదేరాను.ఎందుకో తెలియదు కానీ తనని మళ్ళీ చూడాలనిపిస్తోంది.జయ నిన్న ఫోన్ చేశాడు మా ఆలస్యమై సోమవారానికి చేరుకుందట. ఎలాగో టైమ్ ఉంది కాబట్టి తనని వెతుకుదామని ముందే బయలుదేరా.పొద్దున్నే 8:00 కి బస్సు ఎక్కితే సాయంకాలం కల్లా బెంగళూరులో ఉన్నాం.జయా కి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను, ఏడింటి కల్లా వచ్చాడు, ఇద్దరం మేడ పైకి వెళ్ళాం.వాడికి ఈ విషయం ఎలా చెప్పాలా అని మౌనంగా ఆలోచిస్తున్నా..“ ఏంట్రా అర్జెంట్ గా రమ్మని పిలిచావ్ “ అని వాడే మొదలు పెట్టాడు.ఊళ్లో నాకు పెళ్ళి చూపులు జరిగాయి రా..కాంగ్రజులేషన్స్ మావ..అంత తొందరొద్దు, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు.ఎందుకు?.. వేరే ఎవరన్నా నచ్చారా..రేయ్ నీకు… తను తెలుసు గా..తనంటే ఎవర్రా మన పాత కంపెనీ లో ఉన్న షీలా నా, చాలా బాగుంటుంది కదా.ఒరేయ్ కామాంధుడా తను ...మరింత చదవండి

11

తొలి పౌర్ణమి - 11

సోమవారం పొద్దున్నే లేచి ఆఫీస్ కి రెడీ అవుతున్నాను, కొన్ని రోజులు చూసి ఈ జాబ్ మానేసి తనని వెతికిన తర్వాత ఇంకో జాబ్ వెతుకుదామని విక్రమ్ వారం రోజుల నుంచి చూస్తున్నా చాలా దిగాలుగా ఉన్నావ్” అంటూ అడిగింది అమ్మ.అలాంటిదేమీ లేదమ్మా.నీ కళ్ళలోనే కనిపిస్తోంది, ఏమైందిరా.విషయం చెప్పలేక ఇలా చెప్పా, అదే అమ్మ ఆ కొత్త ఆఫీస్ లో మనుషులు ఎలా ఉంటారా అని ఆలోచిస్తున్నా.ఎలా ఉన్నా వాళ్లు మనుషులే కదరా ఏలియన్స్ కాదు కదా మనం మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది.“మనం ఏదైనా అబద్ధం ఆడినప్పుడు దాని గురించి నీతులు వినడం చాలా దారుణంగా ఉంటుంది..”షూ వేసుకొని బయలుదేరాను.రేయ్ విక్కీ ఒక 20 నిమిషాలు ఆగరా దోసెలు చేస్తా తిని వెళ్దువు గాని.వద్దమ్మా, ఇప్పుడే లేట్ అయింది, జయా గాడు తొందరగా వస్తా అన్నాడు, ఈరోజు అక్కడే భోంచేస్తాం ఇద్దరం.సరే నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళి ...మరింత చదవండి

12

తొలి పౌర్ణమి - 12

మీ బొక్కలో బావని తీసుకొని నీ పక్కలో పెట్టుకో…, నేను అడుగుతోంది విక్రమ్ నీ దృష్టిలో ఎలాంటోడు అని.విక్రమ్ ఆ.. చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ స్వీట్ పర్సన్ అంది .మరి చాందిని…తను బంగారం..అయితే మా వాడికి చాందినీ ని సెట్ చేయ్యోచ్చుగా.(నాకు దగ్గొచ్చింది)విక్రమ్ కా…ఆ మావాడికేం తక్కువ నా అంత కాకపోయినా బానే ఉంటాడు గా.తను చిన్నగా నవ్వి, ఏం మాట్లాడుతున్నావ్ అది ఉండి ఉంటే మన ముగ్గురిని చంపేసేది, నీకు దాని గురించి తెలీదు.“నాకు హెల్ప్ చేస్తా అని వీడు ఫ్లర్ట్ చేస్తున్నడేంటి అని మనసులో అనుకున్నా..”.అలా కాదు శృతి విక్రమ్ అసలు అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు, అలాంటిది తనని ఇష్టపడుతున్నాడు, పిచ్చోడిలా ఏవేవో కవితలు కూడా చెబుతున్నాడు, అర్థం చేసుకో శృతి.కానీ చాందిని సంగతి నీకు తెలీదు దానికి లవ్, పెళ్లి అంటే అస్సలు పడవు, స్టార్టింగ్ ఇద్దరూ అమ్మాయిలు ఇలాంటిదే ...మరింత చదవండి

13

తొలి పౌర్ణమి - 13

“ ఏంటి చాందినీ….”నీకేమన్నా పిచ్చి పట్టిందా, రేస్ పోతే పోయింది. నీ చెయ్యి చూడు ఒకసారి, ఏమన్నా అయ్యుంటే..నా చెయ్యి వంక చూసా రక్తం కారుతోంది, ని పట్టుకున్నప్పుడు బండి అంచు గీసుకున్నట్టుంది, నాకిప్పుడు ఆ బాధ లేదు తను నా గురించి మొదటి సారి ఇలా ఆలోచిస్తోంది అన్న ఆనందం..జయ ని పట్టుకున్నప్పుడే బండి ఆపేయొచ్చుగా….లైఫ్ లో ఫస్ట్ టైమ్ పార్టిసిపేట్ చేస్తున్నా చాందిని అందుకే అలా చేశా.., ఇంకెప్పుడు చెయ్యను లే..అయినా నువ్వు ఏం చేస్తే నాకేంటి, నేను చెయ్యాల్సింది చేస్తా అంటూ, శృతి తెచ్చిన పసుపును గాయం చుట్టూ బాగా దట్టించింది..తనతో వచ్చిన ప్రాబ్లం ఇదే, నేను ఎంతగా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్న ఇలా మాట దాటేస్తుంది..పసుపు గాయానికి తగలగానే మంట పుట్టాలిగా, నిజంగా చెప్తున్నా నాకు హాయిగా అనిపిస్తోంది, కొందరి స్పర్శ అంతే..ఆ తర్వాత మొదటి బహుమతి అందుకున్నాం..అలా మొదలైన జాతర ఎన్నో విశేషాలతో ముందుకు ...మరింత చదవండి

14

తొలి పౌర్ణమి - 14

జయ బయటికెళ్లాడు.చాందిని సడన్గా లేచి నా వైపు వచ్చింది.ఏంటి చాందిని ఏదన్నా డౌటా అని అడిగా.నటించకు విక్రమ్, నువ్వు పొద్దున్నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు అన్న నాకు తెలుసు.నేను కాసేపు మౌనంగా ఉండి, “చాందిని, నన్ను పెళ్లి చేసుకుంటావా..” అని అడిగా.“ఆరోజు శృతి అలా ఎందుకు అడిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది”, అయినా మీకు ఉన్నట్టుండి ఎందుకిలా ప్రేమ పుట్టుకొస్తుంది.., మేము ఫ్రెషర్స్ అని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా..నువ్వు ఎలా బడితే అలా మాట్లాడొద్దు, నువ్వు నాకు పరిచయమైనప్పటినుంచి ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా.., నేను టైమ్ పాస్ కి లవ్ అనట్లేదు, పెళ్లి చేసుకుందాం అంటున్నా..నాకు ఈ ప్రేమ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, నన్ను వదిలేయ్..ఐతే ఇన్ని రోజులు మన మధ్య జరిగిందంతా ఏంటి, అంటూ తన కళ్ళలోకి కి సూటిగా చూసా..మనమంతా ఒకే టీం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అని నువ్వే చెప్పావ్ గా, అందుకే ...మరింత చదవండి

15

తొలి పౌర్ణమి - 15

వాట్ ఈజ్ దిస్ చాందిని నువ్వు ఇంత లేట్ చేస్తే నేను దీన్ని మేనేజ్ చేయలేను.” It is showing your incapability in the ఎలాగైనా కంప్లీట్ చేస్తా సోహమ్, అంది తను.ఈరోజు సాయంత్రం ఎంత లేట్ అయినా సరే దీన్ని పూర్తి చేసి వెళ్ళాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అంటూ వెళ్లిపోయాడు.ఈ సోహమ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు అన్ని టాస్కులు అసైన్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లే, పోనీ సోహమ్ కి చెబుదాం అంటే మేం క్లైంట్ లొకేషన్ కి వచ్చాం వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు..తను చాలా టెన్షన్ పడుతోంది..నాకు తను భయపడటం నచ్చలేదు, తనకు హెల్ప్ చేద్దామని నిర్ణయించుకున్నా. తన పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలోకి కూర్చున్నాను, తనని అడక్కుండానే లాప్టాప్ తీసుకున్నాను, ఇష్యూ ఏంటో చూడటం మొదలుపెట్టా, దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు అరగంట పట్టింది.తర్వాత తనకు వాటిని ...మరింత చదవండి

16

తొలి పౌర్ణమి - 16

నువ్వు మీ నాన్న లాగే, సరే వెళ్ళు అంటూ చిన్నగా నవ్వింది..అమ్మ నువ్వు పెళ్లి కాకముందు ఎవరితో అన్న డేట్ కి వెళ్ళావా..లేదు రా.. మీ నా ఫస్ట్, అండ్ లాస్ట్.., ఇప్పుడు మనుషులకు ఓపిక తగ్గిపోయింది,” జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించే మైండ్ సెట్ మీ జనరేషన్ కి లేదు..నిజంగా జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించడం ఎలా సాధ్యం..అది ప్రేమిస్తే కానీ తెలియదు.. రా, సరే చెప్తా విను“జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించడం ఒక చెట్టు నీడలో ఉండడం లాంటిది కొంచెం బోరింగ్ గా ఉన్నా లైఫ్ పీస్ ఫుల్ గా ఉంటుంది.., అదే మనసు మారినప్పుడల్లా కొత్తవాళ్ళ కోసం వెళ్తే మనకు నీడ దొరుకుతుందేమో గాని లైఫ్ లో ప్రశాంతత ఉండదు..”అయినా ఇవన్నీ నీకిప్పుడు అర్థం కావు, పోను పోను నీకే తెలుస్తుంది..నువ్వు బాగా మాట్లాడతావు మా, ఇలా మాట్లాడటం నీకు ఎవరు నేర్పించారు..ఇంకెవరు మీ నాన్నే..,అలా ...మరింత చదవండి

17

తొలి పౌర్ణమి - 17

ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయం గురించి ఎవరు ఏం మాట్లాడలేదు, ఆ రోజు నుండి చాందిని తిరిగి వచ్చే వరకూ నా మనసు వాళ్ల నాన్నతో పాటు వచ్చింది, నేనూ ఆయన్ని పలకరించా..తను తిరిగి వచ్చాక నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, తనతో సమయం గడపడం నాకు మెడిసిన్ అని డాక్టర్ ఓబెరాయ్ చెప్పక ముందే నాకు తెలుసు.నాకిప్పుడు ఆకాష్ గురించి ఆలోచించడం క్యాజువల్ విషయం లా అనిపిస్తోంది, ముందులా ఎక్కువ యాంగ్జైటీ రావడం, వాడు కనిపించడం ఇలాంటివి అస్సలు జరగట్లేదు.. ****ఒకరోజు ఉదయం టీం మొత్తం కాఫీ తాగడానికి వెళ్ళాం..అందరం ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని, మాట్లాడుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాం.అంతా బానే ఉంది, కానీ నాకు హోటల్ బయట హేమ కనబడింది…ఎందుకో తెలియదు కానీ ఈ సిచ్యుయేషన్ లో తనకు ఎదురుపడడం నాకు ఇష్టం లేదు, “తొందరగా తాగండి వెళదాం” అన్నా..అంత తొందరెందుకు ...మరింత చదవండి

18

తొలి పౌర్ణమి - 18

చూడండి నేను మీరనుకున్నట్టు చేసేవాడిని ఐతే చాందిని నన్ను వదిలేసినప్పుడే వేరే అమ్మాయిని చూసే వాడిని కానీ నా మనసు అలా యాక్సెప్ట్ చెయ్యదు, నేను కి చేసింది మనసులో పెట్టుకొని మీరు ఏది బడితే అది మాట్లాడితే నాలో వేరే విక్రమ్ ని చూస్తారు..”నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా రా.., అయినా నువ్వేదో చేస్తే.. చూస్తూ కూర్చోవడానికి నేనేం చేతకాని వాడిని కాదు..ఆయన అలాగే మాట్లాడుతుంటే నాకు కోపం పెరిగిపోతోంది.ఇంతలో చాందిని వచ్చి నన్ను వెనక్కి తోసింది.., నేను కాలర్ వదిలేసా..,“నాన్న వెళ్దాం పదండి” అంది చాందిని..ఇంకా వీడితో మాటలు ఏంటి, అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్నాడు.మహా… నాకు సమాధానం చెప్పు, నాతో మాట్లాడు, ఒకవేళ నేను తప్పే చేసి ఉంటే, సరే అంగీకరిస్తున్నా, కానీ తప్పు చేసిన వాళ్ళకి ఈ లోకంలో బతికే హక్కు లేదా, నీతో‌ మాట్లాడకూడదా…, నిన్ను ప్రేమించకూడదా…, “చెప్పు చాందినీ” ...మరింత చదవండి

19

తొలి పౌర్ణమి - 19

అందరూ హాల్లో డిస్కషన్ పెట్టారు, జయ కూడా వచ్చాడు.నాకు తర్వాత వారం పెళ్లి చేసేద్దామని అందరూ మాట్లాడుకుంటున్నారు, “ “ఏంటి విక్రమ్ నీకు ఓకే నా” తాతయ్యా.”నేను లేచి “ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు” అంటూ గట్టిగా అరిచాను.తాత మళ్లీ లేచి మీదకి వచ్చాడు, మళ్లీ పీకుతాడేమో అనుకున్నా…వచ్చి నన్ను హత్తుకొని ఏడుస్తున్నాడు, ఒకపక్క అమ్మ ఏడుస్తోంది, నాన్న నా ముందు ఏడవలేక పక్కకు తిరిగాడు, అసలు నేను ఉన్నంతవరకు వీళ్ళందర్నీ ఎంత హ్యాపీగా చూసుకుందాం అనుకున్నా, ఇప్పుడు చూడు ఏడిపించి చస్తున్నా.వీళ్ళతో పాటు జయ కూడా ఉన్నాడు, ఎందుకో తెలియదు మౌనంగా ఉన్నాడు, బహుశా వాడికి ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాలేదేమో.“సరే చేసుకుంటా” అని ఒప్పేసుకున్నా, ఎలాగూ గౌతమి వాళ్ళ నాన్నతో మాట్లాడతా అని చెప్పింది అనే ధైర్యం తో…కట్ చేస్తే… నెక్స్ట్ వారం పెళ్లి, తన అభిప్రాయం అడిగితే గౌతమి ఒప్పుకుందట, ...మరింత చదవండి

20

తొలి పౌర్ణమి - 20

నేను వేసే ప్రతి అడుగూ అక్కడి వాతావరణాన్ని కాస్త భారంగా, నా వెనక ఉన్న వాళ్ల గుండెల్లో ఓ అనుమానంతో కూడిన భయాన్ని మిగిలిస్తున్నాయి..లాస్ట్ ఆడియో తర్వాత వినడానికి ఎలాంటి రికార్డింగ్స్ లేవు..గదిలో నిశ్శబ్దం.ఆకాష్ ఆలోచనల్లో పడ్డాడు….అసలు నాన్న తర్వాత ఏం చేశాడు, మా అమ్మ చూస్తే నాన్నని పెళ్ళి చూపుల్లో చూసి పెళ్ళి చేసుకున్నా అని చెప్తోంది..ఇక్కడ చూస్తే నాన్న చాందినీ ని ప్రేమించి తనని మహా అని పిలుస్తున్నాడు, బహుశా చాందిని వదిలేసి వెళ్లిపోయినందుకు ఆ పేరు ఉన్న అమ్మని పెళ్ళి చేసుకున్నాడా, అయితే కథలో ఉన్న చాందిని ఏమైపోయింది..అలా అయితే నాన్న ఇద్దరికీ మోసం చేసినట్టే కదా…?, ఇలాంటి అనుమానాలు వానలా కురుస్తున్నాయి..టైం చూస్తే రాత్రి 12 అవుతుంది ఆతృత తట్టుకోలేక వెళ్లి వాళ్ళ అమ్మ ఉన్న రూమ్ తలుపు కొట్టాడు.డోర్ తీసి, ఏంట్రా నాన్న ఈ టైంలో నిద్ర లేపుతున్నావ్ అని అడిగింది అమ్మ.“అమ్మా ...మరింత చదవండి

21

తొలి పౌర్ణమి - 21

పైకి లేచి విక్రమ్‌ వైపు నడవడం మొదలుపెట్టాను…ఒక్కో అడుగు భారంగా ముందుకు కదిలింది, కళ్ల ముందు అన్నీ మసకబారుతున్నాయి…“విక్రమ్…” అనే మాట పెదవుల పైకి రావడం మారింది. అడుగులు కొంచెం తడబడ్డాయి.నా శరీరం సహకరించట్లేదు…, మూడో అడుగు వెయ్యగానే పడిపోయాను.“చాందినీ!” అంటూ శృతి పరుగెత్తుకొచ్చింది.నా పక్కన మోకాళ్లపై కూర్చుంది.అసలు ఏమైందే నీకు..నా గొంతు బలహీనంగా…, “స్లీపింగ్ పిల్స్… తీసుకున్నా, శృతి…”“నీకేమన్నా పిచ్చి పట్టిందా?!” అని అరిచింది శృతి.కళ్లపై నల్లటి తెర కమ్ముకుంటూ, శ్వాస మందగించింది.శృతి నా చేతిని పట్టుకొని,“చాందినీ… ఏంటి పిచ్చిపని!” అని కన్నీళ్లు కార్చింది."శృతి… నాకు ఇప్పుడు చావాలని లేదు…” అన్నా..నా కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు.., అంతే తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు.. *******కళ్ళు తెరవగానే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా.., కానీ నా చుట్టూ ఎవరు లేరు, ఇదేదో ICU లా ఉంది..నాకు తగిలించిన సెలైన్ ...మరింత చదవండి