అప్రాశ్యులు

(4)
  • 161.5k
  • 5
  • 45k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 1 1966 Published by: Adarsa Gandha Mandali, Vijayawada © 1966 C.B.Rau Ebook edition @2020 Bhimeswara Challa Cover painting by Nirmala Rau (author’s spouse) Other books by the author: క్షంతవ్యులు (A novel) Man’s Fate and God’s Choice (An Agenda for Human Transformation) The War Within- between Good and Evil (Reconstructing Money, Morality and Mortality) Dedicated to అప్రాశ్యులు world Acknowledgements to: Jyothi Valaboju (writer, editor and publisher) for shaping this ebook edition and BS Murthy, my nephew, for giving the idea of and helping the re-publication of the long-forgotten book అప్రాశ్యులు ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ

Full Novel

1

అప్రాశ్యులు - 1

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 1 1966 Published by: Adarsa Gandha Mandali, Vijayawada © 1966 C.B.Rau Ebook edition @2020 Bhimeswara Cover painting by Nirmala Rau (author’s spouse) Other books by the author: క్షంతవ్యులు (A novel) Man’s Fate and God’s Choice (An Agenda for Human Transformation) The War Within- between Good and Evil (Reconstructing Money, Morality and Mortality) Dedicated to అప్రాశ్యులు world Acknowledgements to: Jyothi Valaboju (writer, editor and publisher) for shaping this ebook edition; and BS Murthy, my nephew, for giving the idea of and helping the re-publication of the long-forgotten book అప్రాశ్యులు ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ ...మరింత చదవండి

2

అప్రాశ్యులు - 2

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 2 పది రోజుల తరువాత ఆరోజు సాయంకాలం కమలాకరము, కమల యిండియా గేటువద్దకు షీకారుకి వెళ్లారు. చలికాలం అవటం వలన, ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా వుంది. బాగా చీకటి పడింది. ఒకరి ప్రక్కన వొకరు చేతుల మీద ఆనుకుని పచ్చటి పరుపు ...మరింత చదవండి

3

అప్రాశ్యులు - 3

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 3 అందరు శనివారం సాయంకాలం ఆగ్రా బయలు దేరారు. కమల రానని చాలాపట్టుపట్టింది. కాని చివరకి కమలాకరం బలవంతంమీద బయలు తప్పింది కాదు, కాలం గడచేకొలదీ ప్రసాద్ కోపం తగ్గింది. చెంప పెట్టు పెట్టినా అతను దానిని పట్టించుకోకుండా మరునాడేవచ్చి క్షమాపణ చెప్పుకోవటం ఆమెకి ఎంతో తృప్తినిచ్చింది. అప్పుడు కూడా తన ప్రవర్తన కఠినంగా వున్నా, అతను పట్టించుకోలేదు. చివరకు కమలకి యిష్టం లేకపోతే తను రావడం మానేస్తానని కమలాకరంతో చెప్పాడుట కూడాను, అలాంటి పరిస్థితులలో తాను రానని నిరాకరించటం అసమంజసంగా వుంటుందని కమల ప్రయాణానికి బయలు దేరింది. రజని ఎంతవద్దన్నా ప్రసాద్ స్టీరింగ్ వద్ద కూర్చున్నాడు, నున్నటి ఆ తారురోడ్డుమీద విద్యుద్వేగంతో పోతున్న ఆ కారులోని వారంతా భయంతో వణకసాగారు. కమలాకరం, రామం ఎంత వారించినా ప్రసాద్ వినలేదు. ఆ పరిస్థితిలో ప్రసాద్ ని చూచి కమలకు భయంకూడా వేసింది. ముఖంలోని నరాలన్నీ ...మరింత చదవండి

4

అప్రాశ్యులు - 4

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 4 కమల మనస్సు ఎందుకో అశుభం సూచించింది. రజని మనస్సులో చాలా అశాంతి చేల రేగింది. మాటిమాటికి ఆమెకు పీడకల వచ్చింది. ప్రసాద్ రజని కారులోవెళ్తుండగా కారు యాక్సిడెంటు అయినట్లు కలవచ్చింది. కాని ఆమె అది ఎవరికి చెప్పలేదు. వ్యాకులపాటుతో మనస్సు సతమతమవుతున్నా ఆమె బయట కేమి వెల్లడించకుండా లోలోనే అణచుకుంది. అలాంటి పరిస్థితిలో అబలలు గుండెలవిసే కంటతడి పెట్టి బావురుమంటారు. అదే కమల అయితే భయంతో ఆతృతతో చేతనారహిత ఆవును కానీ, రజని నిండుకుండలాంటిది. మనస్సులోని పెనుగాలి మరగు పరచి పైకి మామూలుగానే వుంది రజని. “నా అనుమానం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయార” ని అని మాత్రం అంది. “మనల్నందరినీ ఇక్కడ వదలి ఎలా వెళ్తాడు! అయినా దానికి తగిన వాడే బొత్తిగా మేనర్స్ లేవు.” రామం మండిపడుతూ అన్నాడు. కమల కూడా “ఆహ్వానించి యిక్కడకు తీసుకువచ్చి యిలా అవమానిస్తారని నేనూహించలేదు. ...మరింత చదవండి

5

అప్రాశ్యులు - 5

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 5 ప్రసాద్ హాస్పటల్లో పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. రజని సేవ, శరీర తత్వము త్వరలోనే స్వస్థునిచేసాయి. మొదటిలో రజని రోగితోవుండేది. రోగికి కావలసినవన్నీ ఆమె యితరులు చెప్పకుండా చేసివుంచి క్రియారూపేణా పెట్టేది. రజనితత్వం పూర్తిగా తెలిసిన ప్రసాద్ కి అది చాలా ఆశ్చర్యము వేసేది. నిపుణతతో, దృఢత్వము, మృదుత్వము మిళితమైన ఆమె పరిచర్యలకు అతనే ఎంతో విస్తుపోయి వొక రోజున “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు రజని!” అన్నాడు. “వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటే ప్రసాద్. మావయ్య మొదటి నుంచి రోగిష్టి. ఎప్పుడూ నేనే కనిపెట్టి వుండేదాన్ని”అంది. ప్రసాద్ “నువ్వే యిలా సేవ చేయకపోతే నేనేమై పోయేవాడిని రజని” అన్నాడు. నవ్వుతూ “నీ నోటివెంట ఆ మాటలు చాలా కృత్రిమంగా కనబడుతున్నాయి, నేనేమి కమలనుకాను ప్రసాదు వాటిని విని మోసపోవడానికి” అంది. “నేను నిజంగా కమలని మోసపుచ్చానని భావిస్తున్నావా అన్నాడు. ...మరింత చదవండి

6

అప్రాశ్యులు - 6

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 6 మరునాడు సాయంకాలం రామం, రజని కలుసుకొని విశాలకోసం ఎదురు చూడసాగారు. రైలు గంటన్నర లేటు అని తెలిసింది. ప్లాటు వున్న బెంచీపై కూర్చుని మౌనంగా వున్నారు. రామం హఠాత్తుగా జేబులోంచి వొక ఉత్తరం తీసి రజని చేతిలో కిచ్చి “యిది చదువుకో రజనీ” అన్నాడు. “ఎవరి ఉత్తరం” అంది రజని. “మా నాన్నగారిది. నువ్వు చదవకూడనిది ఇందులో ఏమి లేదు అన్నాడు. రామం. రజని వుత్తరం చదివి నవ్వుతూ “శుభవార్త ఎప్పుడు పెళ్ళి” అంది. ఆ మాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. రజని బాధపడుతుందనీ, విచారం వ్యక్తం చేస్తుందనీ అనురాగపువాక్యాలు పలికి పూరడిస్తుందనీ వూహించుచున్నాడు. “నీకిది శుభవార్త కావచ్చు రజనీ కాని నాకిది ఎంతో దుఃఖవార్త. నువ్వింక చెప్పవలసింది ఇంకేమీ లేదా? అన్నాడు రామం. “చెప్పవలసిందింకేమి లేదు రామం బాబూ కాని మీరు గ్రహించవలసింది చాలా వుంది” అంది రజని. రామం ...మరింత చదవండి

7

అప్రాశ్యులు - 7

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 7 ఒక పదిహేను రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు సాయంకాలం రామం రజని యింటికి బయయి దేరి వెళ్ళాడు. రజని తాళం వేసి వుంది. ఎంతో సేపు ఎదురు చూసాడు. విసిగి విసిగి కాళ్ళుపీకి అక్కడే కూలబడిపోయాడు. చీకటి పడి చాలాసేపయింది. రజని జాడ లేదు. చివరకు ఒక విధమైన మగత నిద్రలో పడ్డాడు, హఠాత్తు రాంబాబు అనే పిలుపు వినిత్రుల్లి పడిలేచాడు. స్త్రీ కంఠస్వరం, “రజనీ” అని లేచాడు. ఆ కంఠస్వరం కిలకిలా నవ్వి “కాదు రాంబాబు చంద్రికని ఇదేం అన్యాయం చెప్పండి. యిక్కడ నిద్రపోతున్నారు? అంది. “అందరూ నాకు అన్యాయం చేసే వారే చంద్రకా? చివరకునువ్వు కూడా అంతే. తీయని కలలు కంటూ నిద్రపోతున్న నన్ను లేపావు” అన్నాడు. చంద్రిక “కలలతోను, కథలతోనుతృప్తి పడవలసిన అవసరం మీకెందుకు? అయితే మా పిన్ని యింట్లో లేదా? అంది. “ఉంటే బయట తాళం వేసి ...మరింత చదవండి

8

అప్రాశ్యులు - 8

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 8 చంద్రికకు కమలకు బాగా స్నేహమయింది. కమలకు చంద్రికను మొదట చూచినప్పుడే హృదయంలో ఆప్యాయత ఏర్పడింది. అదీ కాక ప్రసాద్ ప్రభావం వల్ల పెడదారులు తొక్కుతుందేమోనని భయపడింది కూడా తన పరిచయం ద్వారా ఆ ప్రమాదం నుంచి తప్పించుదామనుకుంది. చంద్రకతో అంత స్నేహం చేయడానికి కారణం ఇంకొకటి కూడా వుంది. అది కమల వొప్పుకోదు. అది హృదయాంతరాళంలో మెదిలే రహస్యపు ఆలోచన. అలాంటివి బాహ్యరూపంలో అగుపడవు. కానీ చేష్టల్ని ఆవి తీర్చిదిద్దుతునే వుంటాయి. చంద్రిక ప్రసాద్ తో కలిసి నివశిస్తోంది. ఆమె కంటే ఆప్తులు అతనికి ఎవరు లేరు. అతని రాకపోకలు, చేష్టలు అన్నీ ఈమెకు తెలుసును. మొదట నుంచీ ప్రసాద్ కమలకొక సమస్యగానే వున్నాడు. అతని స్వభావం ఆమె అర్థం చేసుకోలేక పోయింది. సాధారణ మానవకోటినుంచి ఆమడదూరంలో వున్న విచిత్ర వ్యక్తిగా ఆమెకు అగుపించాడు, అతనంటే ఒక విధమైన భయం ఏర్పడింది. అయస్కాంతంలాంటి ...మరింత చదవండి

9

అప్రాశ్యులు - 9

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 9 విశాల రాత్రింబగళ్ళు అక్కడ పిల్లలతోనే గడపసాగింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంవరకు వారికి ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పేది. ఆ తర్వాత భోజనాలయిన పిదప దగ్గర కూర్చుని వారికి కథలు చెప్పుతూ నిద్ర పుచ్చేది. మనశ్శాంతికి ఆప్యాయంగా కౌగలించుకొని గడపిన దినం వృధాగా లేదనే గర్వంలో ఆమె నిద్రించేది జీవితంలో ఎన్నడని ఆమె అంత సుఖం అనుభవించలేదు. దీనికి ఇంకొక కారణం కూడా వుంది. ఇద్దరి ఆశయాలకు వొక్కటే , గమ్యస్థానం ...సునల్ తో స్నేహం దినదినం వర్థమానమైంది, తీరిక ఉన్నప్పుడల్లా విశాలవద్దకు వచ్చి ఆమెతో కాలంగడుపుతూ ఉండేవాడు. అతని సహృదయత, సరళ స్వభావము, స్వార్ధరహితం ఆమెలో ఒక విధమైన గౌరవ భావాన్నికలుగజేసాయి క్రమక్రమంగా ఈ స్నేహమే అనురాగపు బీజాలని వారి హృదయాలలో నాటింది. వారికి తెలియకుండానే హృదయాలు సన్నిహిత మయ్యాయి సంధ్యాసమయాల్లోనూ, వెన్నెల రాత్రులలోను ఒకరి వద్దకు ఇంకొకరు బయలుదేరేవారు, దారి మధ్యలో కలుసుకొని ...మరింత చదవండి

10

అప్రాశ్యులు - 10

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 10 మరునాడు స్టేషన్ లో అందరు రజనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రామం, విశాల, డాక్టర్ సనల్, కమల, కమలాకరం, చంద్రిక అందరు వచ్చారు. ప్రసాద్ క్రితం రాత్రి ఢిల్లీ తిరిగి వచ్చాడు. న్యూఢిల్లీ ప్లాటుఫారంమీద అందరు నిలబడి వున్నారు. ప్రసాద్ రజనితో “నాకు స్టేషన్ కి వచ్చి వీడ్కోలు చెప్పడం చేతిరుమాళ్ళు వూపడం ఇలాంటి పనులంటే ఇష్టం లేదు. రజనీ, అయినా నీ విషయంలో ఇన్స్పెక్షన్ చేసేను” అన్నాడు. “అది మీ బలహీనత. నాయెడ గౌరవ సూచనమని నేను గర్వపడను” అంది రజని. “అది నాకు తెలుసును రజనీ, కాని నాకు ఇది గర్వ కారణమే” అన్నాడు ప్రసాదు. కమల కమలాకరం కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లో చాలా జనసమర్థంగా వుంది. చంద్రిక, విశాల, డాక్టర్, వృద్ధ దంపతులతో కబుర్లు చెప్పుతున్నారు. రైలు ప్లాటుఫారం మీదికి వచ్చే వేళయింది. ప్రసాదు ...మరింత చదవండి

11

అప్రాశ్యులు - 11

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 11 ఆరోజు సాయంకాలం సనల్ విశాల ఇంటికి వచ్చి తలుపుతట్టి తలుపు తెరచివుంది, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. విశాల కూర్చుని కిటికీలో నుంచి పరధ్యానంగా బయటకు చూస్తూంది. విశాలా, అనే పిలుపు దగ్గరలో వినబడి త్రుళ్ళిపడింది.సనల్ ని చూచి వెంటనే లేచి నిలబడి కంగారుగా “మీరా?” అంది. “అవును నేనే విశాలా, వంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు” అన్నాడు. “విశాలా నేను డాక్టరునని మరచిపోయి మాట్లాడుతున్నావు ఏది నన్ను చూడనీయి” అని దగ్గరకు వచ్చి విశాల చెయ్యి పట్టుకున్నాడు. విశాల శరీరం గజగజ వణికి సిగ్గుతో తలవంచుకొని “శారీరికమైనది కాదు డాక్టరు గారు మానసికమైనది” అంది. సనల్ చెయ్యి వదలి పెట్టలేదు. “మానసికంగా నువ్వు చింతించవలసినదేముంది? అన్నీ ఆలోచించే నువ్వు నిర్ణయానికి వచ్చేవు కదా?” అన్నాడు. “నేను దానిని గురించి మాట్లాడటం లేదు సనల్ బాబూ?” అంది మెల్లగా విశాల సనల్ ...మరింత చదవండి

12

అప్రాశ్యులు - 12

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 12 అమెరికా నుంచి సనల్ స్నేహితుడువచ్చి విశాలను పరీక్షించాడు. కొత్తగా ఆయనేదీ చెప్పలేదు, సనల్ యిచ్చే వైద్యాన్ని సమర్ధించాడు. విశాల ననుసరించి ఆయన మిగతా రోగులందరినీ పరీక్షించాడు. సనల్ వైద్యాన్నిఎంతో మెచ్చుకొని , “నువ్వు చేసే వైద్యంకన్నా నేను ఇంకేమీ సలహాలు యివ్వలేను, డాక్టరు సనల్ నవీన పద్దతులు అభిప్రాయాలు చికిత్స యీ వ్యాధితో పోరాడే డాక్టర్లందరికీ ఆదర్శప్రాయలు” అన్నాడు. కాని సనల్ నిరుత్సాహపడ్డాడు. ఆయనేదో ప్రత్యేకమైన చికిత్స చెబుతాడని దానితోవిశాలకు అతి త్వరలో నయమవుతుందని ఆశించాడు. చంద్రిక ఆ రాత్రి రజనికి పెద్దవుత్తరం వాసింది. రజని వుత్తరం చదువుకోని క్షణకాలం అలాగే కూర్చుండి పోయింది. కర్తవ్యం కోసం క్షణకాలం కూడా ఆమె కాలం గడపలేదు. వుత్తరం అందకముందు కూడా ఆమె ఢిల్లీ తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయానికి వచ్చింది. తగిన సమయం కోసం మాత్రమే ఆమె ఎదురు చూస్తూంది. వృద్ధులిద్దరు స్వస్థతకు వచ్చారు. ఇక ...మరింత చదవండి

13

అప్రాశ్యులు - 13

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 13 విశాల వెళ్ళిన తర్వాత మూడు వారాలు గడచిపోయాయి. ప్రసాద్ కీ ఈలోపు కమల కమలాకరం నాలుగైదు సార్లు తటస్థపడ్డారు. కమలతో వంటరిగా మాట్లాడడానికి అవకాశం చిక్కలేదు. కాని అతని క్రోధాన్ని ప్రేరేపించిన దేమిటంటే కమల ప్రవర్తనలో ...మరింత చదవండి

14

అప్రాశ్యులు - 14 - Last part

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 14 ఆ రాత్రి రజని రామం గురించే ఆలోచించింది. మరునాడు రామం తనతో మాట్లాడదలచిన దేమిటోకూడ ఆమె గ్రహించింది. సమాధానం చెప్పాలో ఆమె తర్కించుకుంది. రామం మొదటనుంచీ ఆమెకొక సమస్యగానే వున్నాడు. తిరస్కరించలేని ఆ నిగూఢ ప్రేమ భరించరాని బలహీనత సంపూర్ణమైన ఆసమర్పణ ఆ సమస్యకి పరిష్కారం లభించకుండ చేశాయి. రాధా రాణీ ఆగమనం దానికి పరిష్కారంగా ఆమె మనస్సుకి తోచింది. బాల్యం నుంచి రాధకి రామం మనస్తత్వం తెలుసును. అతనిని అర్ధం చేసుకుంది. రాధ ఆధారంతో రామం నిరాటంకంగా ముందుకు సాగిపోగలడనే ధైర్యం రజనిలో కలిగింది. రామం హృదయంలో రాధ యెడల బలవత్తరమైన ప్రేమ లేకపోయినా అతని సున్నిత హృదయంలో సహజీవనం ఆ బీజాలను నాటగలదని రజనీ గ్రహించింది. ఇతరుల బరువు బాధ్యత మోయడమనేది రజనీకి కొత్త కాదు బాల్యం నుంచీ ఆమెకు అలవాటే. కాని ఆమె సమర్పించలేనిది అతగాడు ఆశించిలభించక సతమతమవుతూంటే ...మరింత చదవండి