Read Super Brain - 7 by Writer raguvaran in Telugu Adventure Stories | మాతృభారతి

Featured Books
  • అమ్మ… నా ప్రపంచం

    అమ్మ… నా ప్రపంచం(తల్లి–కూతురు మధ్య నిశ్శబ్దమైన ప్రేమ కథ)“అమ్...

  • Super Brain - 7

    రఘువరన్ శరీరం ఒక్కసారిగా వణికింది.తన గదిలో నేలపై నిలబడేందుకు...

  • డార్క్ నెట్ ఎపిసోడ్ - 3

    అలా తరువాత కిరణ్ సాయి బాబా టెంపుల్ లో టెంకాయ కొడుతాడు. కిరణ్...

  • రుధిరపు అడుగులలో - 22

    రుద్రకు చెందిన జూబ్లీహిల్స్ భవంతి యొక్క అత్యున్నత మొదటి భద్ర...

  • ప్రణయ గీతిక - 19

    రామాపురంలోపెద్దాయన ఏదో ముఖ్యమైన పని ఉందని టౌన్ కి వెళ్లడంతో...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

Super Brain - 7

రఘువరన్ శరీరం ఒక్కసారిగా వణికింది.

తన గదిలో నేలపై నిలబడేందుకు ప్రయత్నించిన అతని చేతులు కుర్చీ అంచును పట్టుకున్నాయి.

కానీ శరీరం మాట వినలేదు.

కళ్ల ముందు చీకటి కమ్ముకుంది.

తల ఒక్కసారిగా భారంగా మారింది.

తర్వాత—

ధమ్!

రఘువరన్ నేలపై పడిపోయాడు.

అతని శ్వాస నెమ్మదించింది.

గది మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది.

అయితే...

అదే క్షణంలో...

ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఒక పాత ల్యాబ్‌లో, ఎన్నో సంవత్సరాలుగా వెలగని ఒక నల్లటి స్క్రీన్‌పై చిన్న తెల్లటి బిందువు వెలిగింది.

ఒక సెకను...

రెండు సెకన్లు...

ఆ బిందువు నెమ్మదిగా విస్తరించింది.

తర్వాత స్క్రీన్ మొత్తం ఒక్కసారిగా వెలిగిపోయింది.

ఎరుపు, తెలుపు, నీలం రంగుల సిగ్నల్స్ వరుసగా స్క్రీన్ మీద పరుగులు తీశాయి.

SIGNAL DETECTED

NEURAL FREQUENCY MATCHED

UNKNOWN USER DETECTED

కొన్ని క్షణాల తర్వాత...

స్క్రీన్ మధ్యలో ఒక భారీ మెదడు చిహ్నం ప్రత్యక్షమైంది.

దాని చుట్టూ ఉన్న డిజిటల్ వలయం వేగంగా తిరగడం మొదలుపెట్టింది.

అప్పుడు...

SUPER BRAIN ACTIVATED

అనే పదాలు మెరిపించాయి.

ల్యాబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా కదలకుండా నిలబడిపోయారు.

ముసలివాళ్లు...

యువ శాస్త్రవేత్తలు...

కొంతమంది చిన్న వయసు పరిశోధకులు...

అందరి కళ్లూ స్క్రీన్‌పైనే.

అయితే వెంటనే వారి ముఖాల్లో ఆశ్చర్యం కంటే గందరగోళం ఎక్కువైంది.

స్క్రీన్‌లో చూపిస్తున్న ఎనర్జీ మ్యాప్‌ను ఒక వృద్ధ శాస్త్రవేత్త వేగంగా పరిశీలించాడు.

“ఏంటి ఇది?”

“సిగ్నల్ వచ్చింది...”

“సూపర్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది...”

“కానీ పవర్ ఎక్కడికి వెళ్తోంది?”

మరో వ్యక్తి వెంటనే సిస్టమ్‌ను చెక్ చేశాడు.

“బ్రెయిన్ సిగ్నల్ ఇక్కడ కనిపిస్తోంది.”

“అంటే యూజర్ దగ్గర సిస్టమ్ కనెక్ట్ అయి ఉండాలి కదా?”

“అవును.”

“మరి ఎనర్జీ మ్యాప్ ఎందుకు వేరే దిశలో వెళ్తోంది?”

స్క్రీన్‌పై మెదడు చుట్టూ తిరుగుతున్న సిగ్నల్స్ ఒక్కసారిగా ఒక దిశగా దూసుకెళ్లాయి.

అక్కడికి చేరుకునేలోపే...

మాయమయ్యాయి.

“మళ్లీ ట్రేస్ చేయి!”

“చేస్తున్నాను సర్!”

“యూజర్ లొకేషన్?”

“తెలియడం లేదు!”

“అసాధ్యం.”

“మన సిస్టమ్ బ్రెయిన్ సిగ్నల్‌ను ఫాలో అవుతుంది. అది వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కోవాలి.”

మరో శాస్త్రవేత్త నెమ్మదిగా అన్నాడు.

“కానీ ఈసారి...”

అతని గొంతులో భయం.

“సిగ్నల్ బ్రెయిన్ దగ్గరికి వెళ్లకముందే వేరే దారిలోకి మళ్లుతోంది.”

అందరూ ఒకరినొకరు చూశారు.

ఒక వృద్ధుడు నెమ్మదిగా అడిగాడు.

“అయితే మనం కనెక్ట్ అయినది ఎవరితో?”

ఎవరూ సమాధానం చెప్పలేదు.

కొన్ని క్షణాల తర్వాత ఇంకొకరు భయంగా అన్నాడు.

“ఈ విషయం రాకకు తెలిస్తే...”

ఆ మాటతో ల్యాబ్‌లోని వాతావరణమే మారిపోయింది.

“అతను మనల్ని వదిలిపెట్టడు.”

“ఇన్ని సంవత్సరాల ప్రయోగాలు...”

“ఇన్ని మందిని ఎమోషనల్‌గా ట్రిగ్గర్ చేసి చేసిన పరీక్షలు...”

“ఈ పవర్ కోసం మనం ఎంత దూరం వెళ్లామో అతనికి తెలుసు.”

“ఇప్పుడు ఎవరో ఈ శక్తిని మన సిస్టమ్ కంటే ముందే వాడుకుంటున్నారని అతనికి తెలిస్తే?”

ఎవరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.

---

అదే సమయంలో...

రఘువరన్ శరీరంలో ఏదో జరుగుతోంది.

అతని రక్తంలో ఉన్న లవణాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలుపెట్టాయి.

ముందుగా చాలా నెమ్మదిగా...

ఆ తర్వాత వేగంగా...

అతని ఛాతిలో ఉన్న గాయం చుట్టూ వాటన్నింటి కదలిక కేంద్రీకృతమైంది.

ఒక్కసారిగా—

బ్లాస్ట్!

గాయం నుంచి నలుపు, తెలుపు రంగుల వెలుగు బయటికి వచ్చింది.

లవణ కణాలు చిన్న చిన్న కాంతి బిందువుల్లా ఆ గాయం చుట్టూ తిరుగుతున్నాయి.

ఒక చక్రంలా.

ఒక రహస్యమైన యంత్రం తిరుగుతున్నట్టుగా.

ఆ శక్తి నెమ్మదిగా చర్మం లోపలికి చొచ్చుకుపోయింది.

గాయం నుంచి...

నరాల్లోకి.

నరాల నుంచి...

గుండె వైపు.

గుండెను దాటి...

మెదడు వైపు.

రఘువరన్ మెదడు చుట్టూ ఒక తెలుపు-నలుపు వలయం ఏర్పడింది.

అతని మెదడులోకి దూసుకొస్తున్న వందలాది శబ్దాలు...

ఆలోచనలు...

సిగ్నల్స్...

ఒక్కసారిగా ఒక చోట ఆగిపోయాయి.

ఎర్ర సిగ్నల్ దగ్గర బస్సులు వరుసగా ఆగిపోయినట్టుగా.

అన్నీ ఆగిపోయాయి.

ఒక్క శబ్దం కూడా లోపలికి రాలేదు.

---

రఘువరన్ కళ్లను మెల్లగా తెరిచాడు.

తలలో భారంగా ఉంది.

శ్వాసను సరిచేసుకుంటూ పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని నెమ్మదిగా లేచాడు.

కూర్చున్న వెంటనే తల పట్టుకున్నాడు.

“బాబోయ్...”

“నాకేం అయింది?”

“అసలు...”

అతను చుట్టూ చూశాడు.

“ఇవి ఎవరి మాటలు?”

ఒక్కసారిగా...

నిశ్శబ్దం.

పూర్తి నిశ్శబ్దం.

పిన్ డ్రాప్ సైలెన్స్.

రఘువరన్ భయపడ్డాడు.

“ఏంటి ఇది?”

తన చెవులను రుద్దుకున్నాడు.

“చెవుడు వచ్చిందా?”

గుండె వేగంగా కొట్టుకుంది.

“కింద పడిపోవడం వల్ల చెవులు పోయాయా?”

అతను గట్టిగా చెవులు మూసుకున్నాడు.

అదే సమయంలో...

టిక... టిక్...

గడియారం శబ్దం.

వ్ర్ర్ర్...

ఫ్యాన్ శబ్దం.

క్లిక్...

లైట్ స్విచ్ చిన్న శబ్దం.

రఘువరన్ ఆశ్చర్యపోయాడు.

“ఇవి మాత్రమే ఎందుకు వినిపిస్తున్నాయి?”

బయట నుంచి ఒక్క హారన్ లేదు.

వీధి శబ్దం లేదు.

మనుషుల మాటలు లేవు.

కుక్కల అరుపులు లేవు.

“ప్రపంచం మాయమైందా?”

అతను నెమ్మదిగా కిటికీ వైపు తిరిగాడు.

“లేక...”

“ప్రపంచం నుంచి నేనే మాయమయ్యానా?”

అప్పుడే—

దూరంగా ఆగిపోయినట్టున్న ట్రాఫిక్ ఒక్కసారిగా మళ్లీ కదిలింది.

హారన్‌లు.

కుక్కల అరుపులు.

వాహనాల శబ్దాలు.

మానవ కేకలు.

అన్నీ ఒకేసారి అతని మెదడులోకి దూసుకొచ్చాయి.

రఘువరన్ చెవులు గట్టిగా మూసుకున్నాడు.

“ఆపండి!”

“ఆపండి!”

“ఎవరో ఆపండి!”

ఆ క్షణంలో...

అతని కళ్ల ముందే ఒక స్క్రీన్ తెరుచుకుంది.

రంగులు లేని పారదర్శక ఇంటర్‌ఫేస్.

వీధి మ్యాప్.

గదిలోని శబ్దాలు.

ప్రతి శబ్దానికి ఒక స్థానం.

ఎక్కడి నుంచి వస్తోంది...

ఎంత దూరంలో ఉంది...

ఎంత తీవ్రతతో ఉంది...

అన్నీ కనిపిస్తున్నాయి.

రఘువరన్ నోరు తెరిచాడు.

“ఇదేంటి...?”

అతని చూపు ఒక్కసారిగా స్క్రీన్‌పై నిలిచిపోయింది.

VOLUME CONTROL

INPUT SOURCE

LOCATION

SIGNAL

అతను కదలలేదు.

---

అదే క్షణంలో...

పాత ల్యాబ్‌లోని స్క్రీన్‌పైనా అదే ఇంటర్‌ఫేస్ తెరుచుకుంది.

అక్కడున్న వాళ్లందరూ నిశ్చేష్టులయ్యారు.

“ఇది మన సిస్టమ్ ఇంటర్‌ఫేస్!”

“కానీ ఇది ఎలా...?”

ఒక శాస్త్రవేత్త నెమ్మదిగా అన్నాడు.

“సిస్టమ్ అక్కడ లేదు.”

“అయితే?”

“యూజర్ బ్రెయిన్‌లోనే ఇంటర్‌ఫేస్ జనరేట్ అవుతోంది.”

మరో వ్యక్తి ఆశ్చర్యంగా అడిగాడు.

“అంటే... బ్రెయిన్‌నే AIలా పనిచేస్తుందా?”

వృద్ధుడు స్క్రీన్‌నే చూస్తూ అన్నాడు.

“బ్రెయిన్ ఆజ్ఞ ఇస్తోంది.”

“సిస్టమ్ దానికి ప్రతిస్పందిస్తోంది.”

“అది సాధారణ AI కాదు.”

“బ్రెయిన్‌కు సంబంధించిన ఆలోచనను సిస్టమ్ అర్థం చేసుకుని... దానికి తగిన ఇంటర్‌ఫేస్‌ను సృష్టిస్తోంది.”

అక్కడున్న వాళ్లందరికీ ఒకే ప్రశ్న.

ఆ బ్రెయిన్ ఎవరిది?

---

ఇంకో చోట...

ఒక మసకబారిన గదిలో రాక నిలబడి ఉన్నాడు.

అతని రూపాన్ని చూసినవారెవరైనా క్షణం వెనక్కి తగ్గేంత భయంకరంగా మారిపోయాడు.

తలపై జుట్టు దాదాపు లేదు.

ముఖంపై కాలిన మచ్చలు.

చేతుల మీద గాయాలు.

వేళ్ల చివరల్లో పొడవాటి పదునైన గోర్లు.

అతని శరీరమే ఏదో ప్రయోగం తర్వాత మిగిలిన అవశేషంలా ఉంది.

అతని ఎదురుగా ఒక స్వామీజీ వణుకుతూ నిలబడ్డాడు.

రాక కళ్లల్లో కోపం మండుతోంది.

“నేను ఏం చెప్పాను?”

స్వామీజీ ఏదో చెప్పబోయాడు.

“కొంతమందికే ఈ డ్రగ్ వెళ్లాలి అన్నాను!”

రాక గొంతు గర్జించింది.

“కానీ మీ అత్యాశతో...”

“ఎవరెవరికి అమ్మారో మీకే తెలియదు!”

“ఎక్కడికి వెళ్లిందో తెలియదు!”

“ఇప్పుడు నా సిస్టమ్‌ను ఎవరో వేరే వ్యక్తి కంట్రోల్ చేస్తున్నారు.”

“అది నీ వల్లే.”

స్వామీజీ వెనక్కి తగ్గాడు.

“స్వామీ... నేను—”

రాక ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు.

అతని చేతిలోని గోర్లు మెరుపులా మెరిశాయి.

తర్వాతి క్షణం...

అక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది.

---

రాక అద్దం ముందు నిలబడ్డాడు.

తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉండిపోయాడు.

అద్దంలో కనిపిస్తున్న మనిషి...

ఒకప్పుడు తాను కాదు.

అతను వేళ్లతో తన ముఖాన్ని తాకాడు.

“నేను...”

అతని కళ్లు ఒక్కసారిగా మూసుకున్నాయి.

ఒక పాత జ్ఞాపకం అతని మెదడులో మెరిసింది.

ఒక యువకుడు.

తెలివైన కళ్లతో.

చేతిలో పుస్తకం.

స్కాలర్‌షిప్‌తో చదువుకుంటూ...

రాత్రింబవళ్లు కంప్యూటర్ ముందు కూర్చుని కోడింగ్ నేర్చుకుంటూ...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతూ...

ఒక కలతో ముందుకు సాగుతున్నాడు.

అతని పేరు...

రాక.

ఇరవై ఐదేళ్ల క్రితం...

అతను కేవలం ఒక విద్యార్థి.

కానీ ఆ రోజు...

అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు.

మనిషి మెదడుతో AIని కలపాలి.

అదే నిర్ణయం...

అతని జీవితాన్ని మార్చింది.

అదే నిర్ణయం...

రఘువరన్ పుట్టుకకు కారణమైంది.

అతనికి తెలియకుండా...

తాను వెతికిన “సూపర్ బ్రెయిన్”...

ఇప్పటికే మేల్కొంది.