Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యూ ఆర్ మై డెస్టినీ - 12

ఇంకొక సెకండ్ లో తన పెదవులు అందుకోవచ్చు అనుకున్న ప్రేమ్ కి ప్రియా అలా దూరంగా నెట్టేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాడు.

నితిన్ వైపు కోపంగా చూస్తూ ' అన్ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ లో ఎవడో ఒక ఎదవ ఉన్నట్టుగా,  వీడొకడు నా లవ్ స్టోరీ లో  తగలడ్డాడు , ప్రతి దానికి అడ్డొస్తు ,  కృష్ణయ్య వీడిని మా లవ్ స్టోరీ లో నుంచి ఎలాగైనా సరే సైడ్ చేయవయ్యా నీకు పుణ్యం ఉంటుంది'  అని అనుకుంటాడు తన మనసులో.

నితిన్ మాట్లాడుతూ "  స్వీటీ నాకెందుకో వీడి మీదే డౌట్ , వీడే వాడి ఇన్ఫర్మేషన్ నీకు కనపడకుండా  చేసినట్లు ఉన్నాడు , వీడికి తప్ప ఆ అవసరం ఎవరికి ఉంటుందో నువ్వే ఆలోచించు " అని ప్రియా మనసులో ఒక కొత్త అనుమానం కలిగేలాగా చేస్తాడు. 

" నా తమ్ముడికి ఏమీ అలాంటి అవసరం లేదు వాడు ఏమి కావాలనుకున్నా సరే జెన్యూన్ గా వెళ్తాడు కానీ అడదరుల్లు  ఎప్పుడూ తొక్కడు " అని ఆదిత్య కొంచెం గట్టిగా అంటాడు. తన తమ్ముడిని ఎవరు తక్కువ చేసి మాట్లాడిన తట్టుకోలేడు ఆదిత్య. 

" వాడికి తప్ప ఆ అవసరం ఇక్కడ ఎవరికి ఉందో  నువ్వే చెప్పు,  వాడు నాతో చాలెంజ్ కూడా చేశాడు ఎలాగైనా సరే ప్రియా ని పెళ్లి చేసుకొని తీరుతాను అని , ఎవరికి తెలుసు వాడే ఆ డిటెక్టివ్ ని డబ్బుతో కొనేసి వాడి ఇన్ఫర్మేషన్ ప్రియా కి కనపడకుండా చేసి ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడేమో " అని అంటాడు నితిన్.

నితిన్ మాటలకు ప్రియా ఫ్రెండ్స్ లో కూడా లైట్ గా కొంచెం అనుమానం స్టార్ట్ అవుతుంది.

" అవును చాలెంజ్ చేసిన మాట నిజమే , కానీ ప్రియా ని జెన్యూన్ గా గెలవాలి అనుకున్నాను నా ప్రేమతో , కానీ ఇలా అడ్డదారులు తొక్కి మాత్రం కాదు , నేను అలా చేయాలి అనుకున్న వాడినే అయితే ఈ పాటకి ప్రియా నా ఇంట్లో నా పెళ్ళాం గా ఉండేది " అని అంటాడు ప్రేమ్.

ప్రియా కి నితిన్ చెప్పిన మాటలు నమ్మాలి అనిపించిన తన మనసు ఎందుకు దానికి అంగీకరించలేదు. 

నితిన్ తన మాటలే కరెక్ట్ అంటూ "  స్వీటీ వాడిని నమ్మొద్దు వాడే ఇదంతా చేసి ఉంటాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి"  అని అంటాడు.

" మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వని ఆ డిటెక్టివ్ గాడిని అడగండి, అంతేగాని తెలియకుండా ప్రేమ్ మీద నిందలు వేస్తే   ఊరుకునేది లేదు"  అని అంటాడు ఆదిత్య.

" ఆ డిటెక్టివ్ మన రాష్ట్రంలోనే టాప్ మోస్ట్ పేరున్న డిటెక్టివ్ , అతనికి పని ఇస్తే ఏ ఇన్ఫర్మేషన్ మిస్ చేయడు , మా డాడీ ఏదైనా బిజినెస్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలి అంటే అతనిని కాంటాక్ట్ అవుతాడు అతను ఇప్పటివరకు కూడా మాకు ఏది మిస్ చేయలేదు అతను ఇచ్చిన డేటా అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది " అని అంటాడు అరుణ్.

" స్వీటీ నాకు ఆ రోజు ఒక డిటెక్టివ్ కావాలి అని అడిగితే నేను అరుణ్ ని అడిగి ఇతని డీటెయిల్స్ స్వీటీ కి ఇచ్చాను, సో నాక పూర్తి కాన్ఫిడెన్స్ , అంది అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏది కూడా మిస్ అయ్యి ఉండదు,  మధ్యలో ఈ ప్రేమ్ గారే ఏదో చేసి ఉంటాడు"  అని అంటాడు నితిన్.

ప్రియా, ప్రేమ్ వైపు అనుమానంగా చూస్తుంటే , ప్రియా కళ్ళల్లోకి చూస్తూ " నేను అలా చేశాను అంటే నువ్వు నమ్ముతావా ప్రియా , నేను నీకు ముందుగానే చెప్పాను,  నీ ప్రేమను నేను జెన్యూన్ గా పొందుతాను కానీ ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసి మాత్రం కాదు అని " అని అంటాడు ప్రేమ్.

ప్రేమ్ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది ప్రియా కి. 

"ఈ డిస్కషన్ అంతా కూడా అనవసరం , స్వీటీ  జరిగింది మొత్తం డీటెయిల్ గా చెప్పరా నాకు " అని అడుగుతాడు నితిన్.

........
టూ డేస్ బ్యాక్.

ప్రియ ఆఫీసు.
ప్రియా  దీర్ఘంగా ఆలోచిస్తూ  కూర్చుంది ఇంతలో నితిన్ ఒక ఫైల్ తీసుకొని లోపలికి వచ్చి "  స్వీటీ ఈ ఫైవ్ లో నీ సైన్ కావాలి " అని అడుగుతాడు.

ప్రియా ఆ ఫైల్ అందుకొని సిగ్నేచర్ చేస్తూ నితిన్ వైపు చూసి " ఒరేయ్ నాకు హెల్ప్ చేస్తావా"  అని అడుగుతుంది .

"ఈ నితిన్ ఉన్నది అందుకే కదా ఏం కావాలో చెప్పు " అని అడుగుతాడు .

" నాకు ఒక డిటెక్టివ్ కావాలి అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ గా ఉండాలి ఏది కూడా మిస్ అవ్వకూడదు " అని అడుగుతుంది.

నితిన్ ఎందుకు ఏమిటి అని అడగకుండా " ఇది చాలా సింపుల్ ఒక 5 మినిట్స్ లో అతని నెంబర్ నీ ముందు ఉంటుంది ఓకేనా "  అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

చెప్పినట్లుగానే ఒక నెంబర్ ప్రియా కి పాస్ చేస్తాడు నితిన్ .ప్రియా అతన్ని కాంటాక్ట్ అయ్యి తనకు తెలిసిన డీటెయిల్స్ అతనికి ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తనకి కావాలి అని అడుగుతుంది.
అతను దానికి ఒప్పుకొని నెక్స్ట్ డే పర్టికులర్ కాఫీ షాప్ లో ఆమె అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అని చెప్తాడు. 

నెక్స్ట్ డే. 

అతను చెప్పిన కాఫీ షాప్ కి వెళ్లి ముందుగానే బుక్ చేసుకున్న టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. 
" మేడం ఎనీ ఆర్డర్ " అని వెయిటర్ వచ్చి అడగడంతో. 

" జస్ట్ టూ మినిట్స్ ఫ్రెండ్ వస్తారు ఆయన వచ్చాక ఆర్డర్ చేస్తాను"  అని చెప్పి అతన్ని పంపిచేస్తుంది.

ఫైవ్ మినిట్స్ తర్వాత బ్లాక్ హొడ్డి , బ్లాక్ కలర్ క్యాప్ అండ్ బ్లాక్ కలర్ మాస్ ధరించిన ఒక అబ్బాయి వచ్చి తన ముందు కూర్చుంటాడు.
అతని చూసిన ప్రియ 'ఎవడు వీడు ఇలా ఉన్నాడు అని కప్పుకొని కూర్చున్నాడు కొంపతీసి వీడే ఆ డిటెక్టివ్ అంటావా ' అని తనలో తాను అనుకొని

అతనే చూసి " మీరు ..." అని ప్రియా క్యూస్షన్ చేసేలోపు .
" గుడ్ మార్నింగ్ మామ్ , నేనే కరణ్ , నిన్న మీతో ఫోన్లో కనెక్ట్ అయ్యింది నేనే " అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. 
' హోం ..వీడే అన్నమాట డిటెక్టివ్ , అయినా వీడేంటి ఫేస్ కనపడకుండా అలా క్యాప్ ఇంకా మాస్ పెట్టుకున్నాడు ' అని తనలో తాను అనుకుంటుంది.

" హో.. గుడ్ మార్నింగ్ ఏమైనా తీసుకుంటారా"  అని ప్రియా అడుగుతుంటే.

" నో థాంక్స్ , ఇదిగోండి మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ " అని ఒక ఫైల్ తీసి తన ముందు పెడతాడు.
" ఇందులో మొత్తం 23 పేజెస్ ఉన్నాయి మేడం ,  అండ్ మీరు అడిగిన ఆవిడ డీటెయిల్స్ తన ఫ్యామిలీ బయోడేటా అంతా కూడా ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశాను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా"  అని అడుగుతాడు.

ఇంతలో నితిన్ కాల్ వస్తుంది ప్రియా కి 'వీడు నేను లేకపోతే ఆఫీసులో ఏ పని కూడా సవ్యంగా చెయ్యడు  ఇప్పుడు ఏం చేశాడో ఏంటో'  అని అనుకుంటూ ఎదురుగా అన్న వ్యక్తి వైపు చూసి " వన్ సెకండ్" అని చెప్పి ఆ కాల్ లిఫ్ట్ చేస్తుంది ప్రియా.

" హలో స్వీటీ ఎక్కడున్నావ్ ఇంకా ఆఫీస్ కి రాలేదేంటి ఈపార్టీకల్లా రోజు వచ్చేస్తావు కదా, అండ్ ఆ డిజైనర్ ప్లాన్ ఇంకా వాళ్ళకి అందలేదంట వాళ్లు ఫోన్ చేస్తున్నారు అవి ఎక్కడ పెట్టావు,  నాకు ఎక్కడ పెట్టావో కనిపించట్లేదు " అని అంటాడు నితిన్ , ప్రియా కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా .

ప్రియా తల పట్టుకొని " అబ్బా అక్కడే ఉంటుంది క్లియర్ గా చూడరా లెఫ్ట్ సైడ్ రాక్ లో థర్డ్ ఫైల్" అని చెప్తుంది. 

ఫోన్ స్పీకర్ లో లేకపోయినా ప్రియా ఇంకా అవతలి వాళ్ళ మాటలు డిటెక్టివ్ కి క్లియర్ గా వినిపిస్తున్నాయి.

" నాకు కనిపించట్లేదు. ఎక్కడున్నావ్ అసలు, ఈరోజు లాస్ట్ డేట్ ఆ ఫైన్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు ఇప్పటికే నాలుగు సార్లు కాల్ చేశారు ఆ డ్రాఫ్ట్ కోసం , ఆ కంపెనీ  ఎగ్జిక్యూటివ్ కూడా మన ఆఫీస్ లోనే ఉన్నాడు , నువ్వు మాత్రమే ఆ డ్రాఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యగలవు,  ఎందుకంటే ఆ డ్రాఫ్ట్ డిజైన్ చేసింది నువ్వే కాబట్టి"  అని అంటాడు.

" ఓకే అతన్ని మన కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోపెట్టు. నేనొక హాఫ్ ఎన్ అవర్ లో వస్తాను,  నేను ఆఫీస్ పక్కనే ఉన్న కాఫీ షాప్ దగ్గరే ఉన్నాను  " అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. 

ప్రియా ఆ డిటెక్టివ్ వైపు చూసి ఏదో చెప్పేలోగా అతను తన చైర్లో నుంచి లెగుస్తూ " మేడం నాకు కూడా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అండ్ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్ గా రాసి ఉంది ఒకసారి అది చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నా నెంబర్ కి కాల్ చేయండి , ఎనీ టైం అవైలబుల్ గా ఉంటాను , థాంక్యూ " అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

వెళ్తున్న డిటెక్టివ్  వైపు చూసి ' ఇతనేంటి కొంచెం మిస్టీరియస్ గా ఉన్నాడు , అతని ఫేస్ కూడా చూపించలేదు, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటావా'  అని అనుమాన పడి, ' అన్నా వీడిని నితిన్ గాడు సజెస్ట్ చేశాడు ఏమైనా తేడా జరిగితే వాడికి ఉండిద్ది ' అని అనుకుంటుంది తన మనసులో

ప్రియా ఒకసారి  టేబుల్ మీద ఉన్న ఫైల్ చూస్తుంది ఇప్పుడు అది ఓపెన్ చేసి డీటెయిల్స్ చదివే టైమ్ లేకపోవడంతో అది ఓపెన్ చేయకుండా అలాగే ఆ ఫైల్  ని పట్టుకొని బయటికి నడుస్తుంది, 
బయటికి వచ్చి ఆ ఫైల్ కార్ లో పెట్టగానే ఎదురుగా ఒక ఆక్సిడెంట్.

ఒక ముసలావిడని ఒక బైక్ మీద కుర్రాడు తెలియకుండా ఆవిడకి డ్యాష్ ఇచ్చి అక్కడ నుంచి పారిపోతాడు.

ప్రియా వెంటనే వెళ్లి ఆవిడకి సహాయం చేస్తుంది. 
" అయ్యో ఎలా ఉన్నారండి బాగా దెబ్బలు తాగినట్టు ఉన్నాయి, రండి హాస్పిటల్ కి వెళ్దాము " అని అంటూ ఆవిడకి సహాయం చేస్తుంది. 

అదే టైంలో నితిన్ అక్కడికి వస్తాడు . 
ప్రియా పక్కనే ఉన్న కాఫీ షాప్ లో ఉన్నాను అని చెప్పడంతో నితిన్ వెంటనే అక్కడికి బయలుదేరి వస్తారు అక్కడికి వచ్చి చూస్తే ప్రియ ఒక ముసలావిడకి సహాయం చేస్తూ కనిపిస్తుంది.

నితిన్ వెంటనే ప్రియా వైపు వచ్చి  ఆ ముసలావిడకి సహాయం చేస్తూ " ఎవరు స్వీటీ తను "  అని అడుగుతాడు.

" ఏమోరా ఆఫీస్ కి బయలుదేరుతుంటే ఇక్కడ ఒక కుర్రాడు ఈవిడని డాష్ ఇచి వెళ్ళిపోయాడు ఈవిడని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయాలి " అని అంటుంది.

నితిన్ ఇంకా ప్రియా ఇద్దరు కలిసి ఆ ముసలావిడకి సహాయం చేస్తారు.
ప్రియ తన కారులో ఆవిడని హాస్పిటల్ కి తీసుకువెళ్లబోతుంటే నితిన్ ప్రియా ని ఆపుతూ "నేను తనని హాస్పిటల్ కి తీసుకెళ్తాను రా నువ్వు వెళ్లి ఆఫీస్ వర్క్ చేసుకో " అని అంటాడు.

ప్రియా ఒక నిమిషం ఆలోచించి  సరే అంటూ,  ప్రియా కూడా ఆ ముసలావిడకి సహాయం చేస్తూ ఆవిడని నితిన్ కారులో ఎక్కించి నితిన్ ని ఆవిడకి అప్పచెప్పుతోంది. 

ప్రియా తన కార్ దగ్గరికి వచ్చేసరికి తన కార్ డోర్ తీసి ఉంటుంది. 
ప్రియా ఆ ముసలావిడ పడిపోగానే  కారు డోర్  క్లోజ్ చేసి  వెళ్తుంది. కానీ ఇప్పుడు కార్ డోర్ ఓపెన్ గా ఉండడం చూసి కొంచెం అయోమయంగా అనుకొని తనే హడావిడిలో కార్ డోర్ వేయలేదు ఏమో అని అనుకుంటుంది అది అంతగా పట్టించుకోకుండా తన ఆఫీసుకి బయలుదేరుతుంది.

తర్వాత తన ఆఫీస్ వర్క్ అంతా పూర్తి చేసుకొని ఆ ఫైల్ ఓపెన్ చేసి చదివితే అందులో కొన్ని పేర్లు కామన్ గా అనిపిస్తాయి ప్రియా కి. అందులోనీ  నేమ్స్ అక్షయ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాయి కానీ అందులో ప్రేమ్ పేరు మాత్రం ఉండదు. ఆలోచనలో పాడుతూ బహుశా సేమ్ పేరుతో ఉన్న ఫ్యామిలీ ఉండొచ్చు కావచ్చు అని అంతగా పట్టించుకోదు.

ప్రియా కి తెలియని విషయం ఏమిటంటే ఆ ముసలావిడకి సహాయం చేసే టైంలో ఇద్దరు వచ్చి ఆ ఫైల్ లో ఉన్న కొన్ని పేపర్స్ అండ్ ఫొటోస్ తీసుకుని వెళ్లి ఉంటారు. 


కొనసాగుతుంది..

****
ఇంతకీ ఆ ఫైల్ లోనీ పేపర్స్ అండ్ ఫొటోస్ తీసింది ఎవరు?  ఎవరైనా ఊహించగలరా? . నితిన్ అనుమాన పడ్డట్టు ప్రేమ్ తీసి ఉంటాడు అంటారా? 🤔🤔🤔🤔🤔🤔🤔
మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి చూద్దాం. 
అది కరెక్టో కాదో నేను చెప్తా. ఒకే👍


తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.