Part – 18
సమయం : ఉదయం 10:50 గంటలు
గుంటూరు – తెనాలి హైవే
విజయవాడ నుంచి తెనాలి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఏ.సి.పి అజయ్ కారు వేగంగా ముందుకు దూసుకెళ్తోంది.
అతని మనసులో మాత్రం నిన్న రాత్రి చూసిన ఆ రెండు ఫోటోలు... మోహన్ చెప్పిన ప్రతి మాట... ఇంకా డా. మాధవ్ అనే వ్యక్తి చుట్టూనే ఆలోచనలు తిరుగుతున్నాయి.
అంతలో...
అజయ్ మొబైల్ రింగ్ అయింది.
స్క్రీన్ మీద... "C.I. Praveen Calling..."
అజయ్ బ్లూటూత్ ద్వారా కాల్ లిఫ్ట్ చేశాడు.
ఏ.సి.పి అజయ్ : చెప్పు ప్రవీణ్...
సీ.ఐ ప్రవీణ్ : సార్... మీరు చెప్పినట్టు అన్ని రికార్డ్స్ మళ్లీ క్రాస్ వెరిఫై చేశాను.
ఏ.సి.పి అజయ్ : హ్మ్... ఏమైంది...?
సీ.ఐ ప్రవీణ్ : డాక్టర్ రాఘవరావు గారు... శ్వేతకి లీగల్ గార్డియన్ మాత్రమే సార్.
అజయ్ ముఖంలో చిన్న మార్పు.
ఏ.సి.పి అజయ్ : దత్తత తీసుకోలేదా...?
సీ.ఐ ప్రవీణ్ : లేదు సార్. ఫామిలి కోర్ట్ రికార్డ్స్, అనాధాశ్రమం రికార్డ్స్, స్కూల్ ఎడ్మీషన్ రిజిస్టర్, హాస్టల్ రికార్డ్స్ అన్నింట్లోను...
"లీగల్ గార్డియన్ : డా. రాఘవ రావు
అనే ఉంది."
ఏ.సి.పి అజయ్ : మరి... అందరూ దత్తత కూతురు అంటున్నారు కదా...
సీ.ఐ ప్రవీణ్ : అది కూడా నేనూ ఆరా తీశాను సార్. రాఘవరావు గారు శ్వేతను స్కూల్లో జాయిన్ చేసే ముందు. హిందూ సంప్రదాయం ప్రకారం...కొద్దిమంది పెద్దల సమక్షంలో... తనని కూతురిగా స్వీకరించి... "శ్వేత" అని పేరు పెట్టారట. కానీ ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ లీగల్ అడాప్షన్ గా నమోదు చేయలేదు. చట్టపరంగా మాత్రం...
గార్డియన్ గానె నమోదు చేశారు.
కొన్ని క్షణాలు...
అజయ్ ఏమీ మాట్లాడలేదు. రోడ్డు మీద ముందుకు వెళ్తున్న కారునే చూస్తున్నాడు.
సీ.ఐ ప్రవీణ్ : బహుశా... అందుకేనేమో సార్...
ఫౌండేషన్‌లో ఉన్నవాళ్లందరూ... "రాఘవరావు గారి దత్తపుత్రిక" అని పిలవడం అలవాటు చేసుకున్నారు.
అజయ్ చిన్నగా తల ఊపాడు.
ఏ.సి.పి అజయ్ : సరే...నేను తెనాలి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం ఆఫీసులో కలుద్దాం.
సీ.ఐ ప్రవీణ్ : ఓకే సార్.
కాల్ ముగిసింది.
అజయ్ కారు వేగంగా ముందుకు సాగుతోంది.
కానీ...
అతని మనసులో మాత్రం మరో ప్రశ్న పుట్టింది.
"ఏ.సీ.పి అజయ్ : రాఘవరావు... శ్వేతని చట్టపరంగా దత్తత తీసుకోలేదు... కానీ... తన సొంత కూతురికన్నా ఎక్కువగా ప్రేమించాడు...
ఎందుకు...?"
అజయ్‌కు తెలియదు...
ఆ ప్రశ్నకు సమాధానం...
ఇంకా కొద్ది నిమిషాల్లో...
డాక్టర్ మాధవ్ నోటి నుంచే వినబోతున్నాడని...
సమయం : ఉదయం 11:35 గంటలు
ధన్వంతరి ఆయుర్వేద క్లినిక్, తెనాలి
కారు నెమ్మదిగా క్లినిక్ ముందు ఆగింది.
అజయ్ కారులో నుంచి దిగి క్లినిక్ వైపు నడిచాడు.
బయట వరండాలో అప్పటికే పదిహేను మందికి పైగా రోగులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.
లోపల...
డాక్టర్ మాధవ్ ఒక్కొక్కరిని పిలుస్తూ పరీక్షిస్తున్నారు.
క్లినిక్‌లో పనిచేసే ఒక లేడి అటెండర్ అజయ్‌ని చూసింది. అజయ్ లోపలికి రాబోతున్న సమయంలొ ఆవిడ ఆపి
లేడి అటెండర్ : సార్... మీరు కొంచెం ఉండాలి వెనక చాలా మంది ఉన్నారు.
ఏ.సీ.పి అజయ్ : నేను పేషెంట్ ని కాను. డాక్టర్ గారితొ మాట్లాడడానికి వచ్చాను.
లేడి అటెండర్ : నన్ను క్షమించండి. అయినసారె మీరు కొంచెం సేపు వెయిట్ చేయ్యాలి. ఎందుకు అంటె డాక్టర్ గారికి పేషెంట్స్ చూస్తున్నప్పుడు క్రమశిక్షణ ముఖ్యం.
ఏ.సీ.పి అజయ్ : ఓహ్... పర్వాలేదు. నేను వెయిట్ చేస్తాను లెండి.
అజయ్ వరండాలోని ఒక కుర్చీలో కూర్చున్నాడు.
లోపల...
మాధవ్ ఓ వృద్ధుడి నాడి పరీక్షిస్తున్నారు. మరొకరికి కషాయం ఎలా వాడాలో వివరంగా చెబుతున్నారు.
అజయ్ మాత్రం...
డాక్టర్ మాధవ్‌ను కాదు...
ఆయన ప్రతి కదలికను గమనిస్తున్నాడు.
ఏ.సీ.పి అజయ్ : ఇంత పెద్ద కుట్రలో ఉన్న మనిషి అయితే... ఇంత ప్రశాంతంగా ఉండగలడా...?
అనే ప్రశ్న మరోసారి అతని మనసులో మెదిలింది.
దాదాపు ఇరవై నిమిషాల తర్వాత...
చివరి పేషెంట్ కూడా బయటకు వెళ్లిపోయాడు.
అప్పుడు ఆ లేడి అటెండర్ వచ్చి అజయ్ ని లోపలికి వెళ్ళొచ్చని చెప్తుంది.
డా. మాధవ్ లోపిలికి వచ్చిన అజయ్‌ను చూసి చిరునవ్వు నవ్వాడు.
డా. మాధవ్ : అరే మీరా.. పది రోజుల తర్వాత రమ్మన్నాను కదా... రెండు రోజులకే వచ్చేశారు. ఏమైంది...? మీ స్నేహితుడు ఎలా ఉన్నాడు...?
ఏ.సీ.పి అజయ్ : బాగానే ఉన్నాడు డాక్టర్ గారు. నిజానికి... నేను ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను.
డా. మాధవ్ : నాతోనా...?
ఏ.సీ.పి అజయ్ : అవును.
డా. మాధవ్ : నాతో ఏం మాట్లాడాలి...?
ఏ.సీ.పి అజయ్ : నాకు ఆయుర్వేదం మీద ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దొరికే వనమూలికల మీద చాలా ఆసక్తి. వాటి గురించి చదువుతుంటాను.
కొన్నిసార్లు చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను. మీ అనుభవం గురించి తెలుసుకోవాలని వచ్చాను..
మాధవ్ కొన్ని క్షణాలు అజయ్ వైపు చూస్తూ ఉన్నాడు
డా. మాధవ్: వాటి గురించి మీరు తెలుసుకుని ఏం చేస్తారు...?
ఏ.సీ.పి అజయ్: పత్రికల్లోని మరియు సామాజిక మాద్యమాల(Social Media)లొని రాస్తుంటాను.అంతే. అది నా హాబీ.
మాధవ్ స్వల్పంగా నవ్వాడు.
డా. మాధవ్: ఏం చేస్తుంటారు...?
అజయ్ ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చాడు.
ఏ.సీ.పి అజయ్: నేను బీ.ఎస్.సీ కంప్యూటర్స్ (BSc computers) చేసి విజయవాడ కమిషనరేట్ ఆఫీసులొ ఐ.టి సపోర్ట్ సెక్షన్ (IT Support Section)లో పని చేస్తున్నాను.
డా. మాధవ్: ఓహ్...అలానా. సరె లోపల హాల్లోకి పదండి. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం.
మాధవ్ అజయ్ ని లోపలికి తీసుకెళ్ళి హాల్లోని సాఫాలొ కూర్చొబెట్టాడు.
డా. మాధవ్ : 10 నిమిషాలు నేను మనిద్దరికి కాఫి కలిపి తీసుకొస్తాను.
అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు.
మాధవ్ లోపలికి వెళ్లగానే. అజయ్ నెమ్మదిగా హాల్ మొత్తాన్ని పరిశీలించడం ప్రారంభించాడు.
గోడలపై ఆయుర్వేద ఔషధ మొక్కల చిత్రాలు.
పాత మెడికల్ క్యాంప్ పొటోలు.
పురస్కారాలు...
సర్టిఫికెట్స్...
అన్నీ చక్కగా అమర్చబడి ఉన్నాయి.
అంతలో...
హాల్ మధ్య గోడపై వేలాడుతున్న ఒక పెద్ద పేయింటింగ్ అతని దృష్టిని ఆకర్షించింది.
నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లాడు.
పేయింటింగ్ లొ. మాధవ్ వర్మ...
ఆయన భుజంపై చేయి వేసి నవ్వుతున్న ఒక టీనేజి కుర్రాడు...
పేయింటింగ్ క్రింద. చక్కని చేతిరాతలో...
"Happy Birthday Nanna"
"A Gift from your Son"
అని రాసి ఉంది.
అజయ్ కొన్ని క్షణాలు ఆ పేయింటింగ్ నే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత పక్కనే ఉన్న టీ.వి స్టాండ్ వైపు చూసాడు.
అక్కడ ఒక చిన్న ఫోటో ఫ్రేమ్. అందులో...
మాధవ్ వర్మ...ఆయన పక్కనే ఏడేళ్ల చిన్న పిల్లాడు అర్జున్.
అది చూసిన అజయ్...
మోహన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు.
"తల్లి లేని పిల్లాడు కద సార్... అంత చిన్న పిల్లవాడిని ఒంటరిగా వదిలేయలేక ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లేవారు..."
తరువాత తనకి ఒక కప్ బోర్డ్ కనిపించి దాని వైపు అడుగు వేయబోతుండగా...
డా. మాధవ్ : ఇదిగోండి...
అని మాధవ్ రెండు కాఫీ కప్స్ తో వచ్చాడు.
అజయ్ వెంటనే వెనక్కి తిరిగాడు. కాఫీ అందుకుంటూ గోడపై ఉన్న పేయింటింగ్ వైపు చూపిస్తూ.
ఏ.సీ.పి అజయ్: ఈ పేయింటింగ్ చాలా బాగుంది.
మాధవ్ ఒక్కసారి వెనక్కి తిరిగి దాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు.
డా. మాధవ్: ఠాంక్యూ... అది నా పుట్టిన రోజు కనుక. స్వయంగా మా అబ్బాయే గీశి ఇచ్చాడు 2007లో. దాదాపు పంతొమ్మిది సంవత్సరాలవుతుంది
ఏ.సీ.పి అజయ్: ఓహో...మీ అబ్బాయి పేరు...?
డా. మాధవ్: అర్జున్.
ఏ.సీ.పి అజయ్: ఏం చేస్తుంటారు..?
మాధవ్ కాఫీ కొంచెం తాగి.
డా. మాధవ్: అమెరికాలో ఉంటాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అక్కడే స్థిరపడిపోయాడు.
ఏ.సీ.పి అజయ్: మరి...మీరు ఎందుకు ఇక్కడే ఉండిపోయారు...?
మాధవ్ నవ్వాడు.
డా. మాధవ్: నాకు ఈ నేల వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనిపించలేదు. వాడు ఇక్కడికి రాడు. నేను అక్కడికి వెళ్లను. దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. మేమిద్దరం ఎదురెదురుగా చూసుకుని. కేవలం ఫోన్లో మాట్లాడుకోవడమే.
అజయ్ నిశ్శబ్దంగా తల ఊపాడు.
ఏ.సీ.పి అజయ్: ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఇలాగే అయిపోయాయి.
మళ్ళి నిశ్శబ్దం.
అజయ్ ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు.
కానీ మనసులో మాత్రం ఒక్క మాటే తిరుగుతోంది...
"అర్జున్ నిజంగానె అమెరికాలో ఉన్నాడా... లేక... ఇక్కడే ఎక్కడైనా ఉన్నాడా...?"
ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే. బయట క్లినిక్‌లో...
"డాక్టర్ బాబూ...!"
అని ఒక మహిళ గొంతు వినిపించింది.
డా. మాధవ్ : ఒక్క నిమిషం.
అని చెప్పి బయటకు వెళ్లాడు.
అజయ్ కూడా అక్కడి నుంచే గమనిస్తున్నాడు.
బయట ఒక 50 ఏళ్ల మహిళ మరియు ఆమె పక్కన ఓ ఇరవై రెండేళ్ల యువతి ఉంది. చూస్తుంటే తల్లి, కూతుళ్లులా ఉన్నారు.
మాధవ్ దగ్గరకు వెళ్లగానే...
ఆ యువతి ఒక్కసారిగా వంగి ఆయన కాళ్లకు నమస్కారం చేసింది.
మాధవ్ వెంటనే కంగారుగా ఆమెను లేపాడు.
డా. మాధవ్: ఏమిటమ్మా ఇది...? లే..
ఆ మహిళ కళ్లలో నీళ్లు తిరిగాయి.
మహిళ : మీ వల్లే ఈ రోజు నా కూతురు నాకు దక్కింది బాబు. మీకెంత ఋణపడి ఉన్నామో. అది మేమెప్పటికీ తీర్చుకోలేం.
మాధవ్ నవ్వుతూ...
ఆ అమ్మాయి తలపై చేయి పెట్టాడు.
డా. మాధవ్: అమ్మాయి ఆరోగ్యం బాగుంది కదా...అదే చాలు. సంతోషంగా ఉండండి.
వాళ్లు మళ్లీ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొద్దిసేపటి తర్వాత...
మాధవ్ మళ్లీ హాల్‌లోకి వచ్చాడు. అజయ్ తనని ప్రశ్నార్థకంగా చూశాడు.
ఏ.సీ.పి అజయ్: వాళ్లూ...?
మాధవ్ ప్రశాంతంగా కూర్చున్నాడు.
డా. మాధవ్: ఆ అమ్మాయికి ఒక రకమైన మూర్చ వ్యాధి ఉండేది. చాలా చోట్ల చూపించారు గాని తగ్గలేదు. బీదవాళ్లు. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టలేక నా దగ్గరకు వచ్చారు. నేను సంవత్సరం పాటు వైద్యం చేశాను. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఇటీవలే పెళ్లి కూడా కుదిరింది. ఆ శుభవార్త చెప్పడానికి వచ్చారు.
అజయ్ మౌనంగా అతని ముఖం వైపు చూశాడు.
ఒక్క క్షణం...
తన ఎదురుగా కూర్చున్న ఈ మనిషి. తన అనుమానాల మధ్య. బీదవాళ్లకు దేవుడిలా కనిపిస్తున్న వైద్యుడు. ఆ ఆలోచనే అజయ్ మనసులో మరో కొత్త సందేహాన్ని నాటింది.
డా. మాధవ్ చెప్పిన మాటలు విన్న అజయ్ కొన్ని క్షణాలు మౌనంగా కాఫీ కప్పులోకి చూస్తూ ఉండిపోయాడు.
తన పోలీసు అనుభవంలో నాటకం ఆడేవాళ్లను మరియు మంచి మనుషుల్లా నటించే వాళ్లను ఎంతమందినొ చూశాడు. కానీ...
ఇప్పుడు తన కళ్లముందు జరిగిన సంఘటన మాత్రం నటనలా అనిపించలేదు.
ఆ తల్లి కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత...
ఆ అమ్మాయి ఈయన కాళ్లకు పెట్టిన నమస్కారం...
డా. మాధవ్ స్పందించిన తీరు...
అన్నీ సహజంగా అనిపించాయి.
అజయ్ ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు.
ఏ.సీ.పి అజయ్: డాక్టర్ గారు మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు చేశారు...?
డా. మాధవ్: దాదాపు ముప్పై ఏళ్లకు పైగానే.
ఏ.సీ.పి అజయ్: ఏ ఏ ప్రాంతాలు బాగా తిరిగెవారు.?
డా. మాధవ్ : ఎక్కువ ఉత్తర భారత దేశంలోని ప్రాంతాలు తిరిగెవాడిని ముఖ్యంగా తూర్పూ మరియు ఈశాన్య ప్రాంతాలు.
ఏ.సీ.పి అజయ్: మరీ దక్షిణ భారత దేశంలో తిరగలేదా..
డా. మాధవ్ : తిరిగాను కాని తక్కువ. కొన్ని సెలెక్టడ్ ప్లేసెస్ మాత్రమె..
ఏ.సీ.పి అజయ్: ఏ ఏ ప్రాంతాలు...?
డా. మాధవ్ : మన ఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి మరియు క్రిష్ణా జిల్లాలోని గిరిజన ప్రాంతాలు మరియు నల్లమల అటివి ప్రాంతాలు వెళ్ళెవాడిని. అది కాకుండా తెలంగాణాలొని అసిఫాబాద్ మరియు ములుగు జిల్లాలు కూడా.
ఏ.సీ.పి అజయ్: మరి మిగిలిన రాష్ట్రాలలొ...?
డా. మాధవ్ : మిగిలిన రాష్ట్రాలలొ అంటె తమిళనాడులొ నిలగిరి కొండల ప్రాంతాలు మరియు కళ్ళకురిచి వైపు ప్రాంతాలు.
కర్ణాటక రాష్టృంలొని చామరాజనగర వైపు ఉన్న మాలె మహేదేశ్వర కొండలు మరియు బిలిగిరిరంగన కొండల ప్రాంతాలు.
కేరళ లొని వయనాడు మరియు ఇడుక్కి ప్రాంతాలు. అంతె
ఏ.సీ.పి అజయ్: చాలా ప్రాంతాలు తిరిగారు. అన్ని ప్రాంతాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రాంతం ఏది...?
మాధవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
డా. మాధవ్: చాలా ఉన్నాయి.కానీ.
నాగాలాండ్ సరిహద్దులోని లాంగ్వా గ్రామం మాత్రం జీవితాంతం మర్చిపోలేను.
అజయ్ గమనించాడు.
లాంగ్వా అనే పేరు చెప్పేటప్పుడు...
మాధవ్ ముఖంలో ఒక చిన్న జ్ఞాపకం మెరిసింది.
ఏ.సీ.పి అజయ్: ఎందుకు అంత ప్రత్యేకం ఆ గ్రామం మీకు..?
మాధవ్ చిరునవ్వు నవ్వాడు.
డా. మాధవ్: అక్కడి మనుషులు. వాళ్ల అమాయకత్వం. వాళ్ల జీవన విధానం. ఇప్పటికీ కళ్లముందే కనిపిస్తుంటాయి.
అంతలో...
అజయ్ బ్యాగ్‌లో నుంచి ఒక చిన్న నోట్‌బుక్ తీసుకున్నాడు.
ఏదో రాసుకుంటున్నట్టు నటిస్తూ...
సహజంగానే అడిగాడు.
ఏ.సీ.పి అజయ్: మిగిలిన గిరిజన ప్రాంతాలలొ కూడా అలాగె అందరు ఉంటారు కాద. కాని ఆ చోట మీకెందుకు అంత ప్రత్యేకంగా అనిపించింది.
ఆ ప్రశ్న వినగానే...
మాధవ్ ముఖంపై చిరునవ్వు మరింత విస్తరించింది.
డా. మాధవ్: ఎందుకంటె నా బాల్యంలోని 10 ఏళ్ళు ఎక్కువగా అక్కడె గడిచింది.
అజయ్ ఆశ్చర్యపోయాడు.
ఏ.సీ.పి అజయ్ : బాల్యమా..?
డా. మాధవ్ : అవును నేను గడిపిన ఆ 10 ఏళ్ళ కాలమె నన్ను ఈ ఆయుర్వేదం వైపుకు మళ్ళించింది.
ఏ.సీ.పి అజయ్ : కొంచె వివరంగా చెప్తారా..?
మాధవ్ చిన చిరునవ్వు నవ్వాడు.
డా. మాధవ్ : ఈ ఆయుర్వేద వైద్య జ్ఙానం అనేది మా పూర్వికుల దగ్గర నుంచి సంక్రమించింది.
ఏ.సీ.పి అజయ్ : అంటె మీకంటె మీ ముందు తరాల వాళ్ళందరు ఈ ఆయుర్వేద వైద్య వృత్తినె చేసెవారా..?
డా. మాధవ్ : అవును. మా వంశంలొ పుట్టిన పిల్లలకి 8 ఏళ్ళ వయసు నిండగానె వాళ్ళకి ఈ ఆయుర్వేదాన్నీ పరిచయం చేస్తారు. ఒక 3 ఏళ్ళ పాటు ఇంటి వద్దె శిక్షణ ఇస్తారు. తరువాత తాతతోనొ లేక తండ్రితోనొ కలిసి సంవత్సరానికి ఒక సారి ఈ దేశంలొని అటవి మరియు గిరిజన ప్రాంతాలు సందర్శించి అక్కడున్న వృక్షాలు, మొక్కలు, వేర్లు మరియు నీరు, మట్టి అన్నిటిని పరీక్షించి ఎందులొ ఎలాంటి గుణం ఉందొ తెలుసుకుంటారు...
అజయ్ చాలా శ్రద్దగా వింటున్నాడు...
డా. మాధవ్ : అలా నేను నా బాల్యంలొ మా నాన్న గారితొ కలిసి ప్రతి సంవత్సరం వేసవి సెలవలు 2 నెలలు పాటు ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్ళె వాడిని. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఈ లాంగ్వా గ్రామంలోనె బస చేసేవాళ్ళం.
ఏ.సీ.పి అజయ్ : అంత మారు మూల గిరిజన గ్రామంలొ బస చెయ్యాల్సిన అవసరం దేనికి.
డా. మాధవ్ : ఒక వ్యక్తి కోసం..
ఏ.సీ.పి అజయ్ : ఎవరా వ్యక్తి ...?
డా. మాధవ్ : "అజా కహ్వాంగ్..."
ఏ.సీ.పి అజయ్ : ఆయనెవరు.. ?
డా. మాధవ్ : ఆయన మా తాతగారు అశొక్ స్నేహితుడు మరియు సహా విద్యార్ధి..
ఏ.సీ.పి అజయ్ : సహా విద్యార్దా...?
డా. మాధవ్ : అవును ఆయన మా తాతగారితో కలిసి అతి పూరాతన ఆయుర్వేద వైద్య విద్యను నేర్చుకున్నారు. అదొ పెద్ద కధ. ఇప్పుడెందుకు లెండి
ఏ.సీ.పి అజయ్ : పరవలేదు దయచేసి చెప్పండి. నాకు వినాలని ఉంది.
డా. మాధవ్ : సరె.. మా ముత్తాతగారు పేరు విష్ణు గొప్ప ఆయుర్వేద పండితుడు. కేవలం గ్రాంథాల్లోని చదువు మాత్రమె సరిపోదు. అడువులు, కొండల్లోని ప్రకృతి రహస్యాలను, అధునాతన చికిత్స పద్దతులని తెలుసుకోవాలని మా పూర్వికుల మాట. దానిని మా ముత్తాతగారు చాలా బాగా పాటిస్తారు. అందుకె ప్రతి ఏడాది దేశాటన చేసేవారు.
అది 1928 మే నెల మా తాతగారు అశోక్ ఆయన నాన్నగారితొ కలిసి ఆ ఏడాది ఈశాన్య భారత పర్యటనకు వెళ్ళారు. అప్పుట్లొ అక్కడ ఈనాటి లాంగ్వా గ్రామం లేదా మయన్మార్ సరిహద్దులు లేవు. నాగాలాండ్, మణిపూర్, మిజొరామ్, అరుణాచల్ ప్రదేమ్ మరియు బర్మా దేశం మొత్తం కలిపి ఒక దట్టమైన అటవి ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతాన్నీ "సోమ్రా లోయ" అని పిలిచెవారు.
ఏ.సీ.పి అజయ్ : ఓకె...
డా. మాధవ్ : ఆ "సోమ్రా లోయ" లొనె కొన్యాక్ తెగకు చెందిన ఒక మహోన్నతమైన ప్రకృతి వైద్యుడు ఉండేవారు. ఆయన పేరె "అజా వాంగ్నావ్".
ఏ.సీ.పి అజయ్ : ఆయనెవరు....?
డా. మాధవ్ : ఆయన మా తాతగారికి రెండొవ గురువు. మొదటి గురువు మా ముత్తాతగారు.
ఏ.సీ.పి అజయ్ : ఓహో...
డా. మాధవ్ : మా తాతగారిని ఆయన దగ్గర పెట్టి శిష్యరికం చేయించారు మా ముత్తాతగారు. అక్కడే మా తాతగారికి తన ఈడువాడైన స్థానిక గిరిజన బాలుడు "కహ్వాంగ్ " పరిచయమయ్యాడు. వాళ్ళిద్దరు ఒకె గురువు కింద సహ-శిష్యులుగా మారారు.
ఏ.సీ.పి అజయ్ : డాక్టర్ గారు నాదొక సందేహం. అప్పట్లొ మీ తాతగారి వయసు ఎంతుండచ్చు.
డా. మాధవ్ : 10-11 ఏళ్ళు. ఎందుకు...?
ఏ.సీ.పి అజయ్ : ఏమి లేదు. అంత చిన్న పిల్లవాడిని మీ ముత్తాతగారు భాష కూడా తెలియని ఒక గిరిజన లోయలొ ఎలా వదిలి వెళ్ళారా అని.
మాధవ్ చిన్నగా నవ్వాడు.
డా. మాధవ్ : ఆ మాత్రం మా ముత్తాతగారికి తెలియదా. అప్పట్లొ మా ఆయనకి అభిజిత్ శర్మ అనె ఒక చిన్ననాటి స్నేహితుడు అస్సాంలోని గౌహతి నగరంలొ ఉండెవారు. మన తెలుగువారె కాకపోతె అక్కడికి పోయి స్థిరపడ్డారు. ప్రతి ఏట దేశాటనలొ భాగంగా ఉత్తర భారతదేశం వెళ్ళాల్సి వస్తె ఆయన సహాయం తిసుకునెవారు. మా తాతగారికి తోడుగా అప్పుడు ఈయన్నీ అక్కడ పెట్టి మా ముత్తాతగారు తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి లాంగ్వా గ్రామానికి వెళ్ళి చూసి వచ్చేవారు.
ఏ.సీ.పి అజయ్ : ఈ అభిజిత్ శర్మ గారు కూడా ఆయుర్వేద వైద్యుడా...?
డా. మాధవ్ : కాదు ఆయన కామాఖ్య దేవి అమ్మవారి ఉపాసకుడు. ఆవిడ మీద భక్తితొ 13 ఏళ్ళకె ఊరి విడిచి కాలినడకన దాదాపు 3 నెలల పాటు ప్రయాణించి గౌహతి నగరానికి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మపుత్ర నది తీరాన నీలాచల కొండపైన కామాఖ్యా దేవి అమ్మవారి ఆలయం ఉంది. ప్రతి ఏటా జరిగె అంబుబాచి మేళా సమయానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. అమ్మవారిని చూసి పులకించిపోయి అక్కడె స్థిరపడిపోయారు.
ఏ.సీ.పి అజయ్ : కామాఖ్యా దేవి ఆలయంలోనా...?
డా. మాధవ్ : కొంతకాలం ఆ ఆలయ ప్రాంగణంలోని మరియు నిలాచల కొండల్లొ ఉన్నారు. ఆ తరువాత అక్కడె కొండ దిగువున బ్రహ్మపుత్ర నది తిరాన ఉన్న గోరఖ్ బాబా ఆశ్రమంలొ బాబా గోరఖ్ నాథ్ అనె సన్యాసి దగ్గర శిష్యుడిగా చేరారు..
ఏ.సీ.పి అజయ్ : ఒక సన్యాసికి గిరిజనుల గురించి ఎలా తెలుస్తుంది? కేవలం స్నేహితుడు అని మీ ముత్తాతగారు ఆయన్నీ వెంట తీసుకెళ్ళి ఉంటారు కదా..?
డా. మాధవ్ : అభిజిత్ శర్మ గారు ఒక సన్యాసి. సన్యాసులు ఎక్కువుగా సంచారులు. గౌహతిని తన నివాస కేంద్రంగా చేసుకున్నప్పటికి సంవత్సరంలొ ఎక్కువ కాలం ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలోని అడవుల్లో, కొండల్లొ సంచరిస్తూ సాధన చేసేవారు. ఆ ప్రయాణాల్లొ తారసపడిన ఎన్నో గిరిజన గ్రామాల్లోని అడవిబిడ్డలతొ ఆయనకి సంపర్కం ఏర్పిడింది. ముఖ్యంగా సోమ్రాలోయలోని కొన్యాక్ తెగతొ పాటు మిగిలిన ఎన్నో నాగ తెగల జాతులతొ అతనికి గాఢమైన విశ్వాస సంబంధం ఏర్పడింది.
ఏ.సీ.పి అజయ్ : ఎంత కాలం మీ తాతగారు ఆయన వద్ద విద్య నేర్చుకున్నారు.?
డా. మాధవ్ : దాదాపు 10-11 ఏళ్ళు. అక్కడ ఆయన కేవలం మొక్కలను గుర్తించడమె కాదు ప్రకృతి శక్తిని వైద్యంలొ ఎలా వాడాలొ కూడా నేర్పారు. ఏ కొండ వాగు నీటిలొ ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి. అది ఏ రోగాన్నీ నయం చేస్తుంది. ఏ నేలలొ పెరిగె మొక్క వేరుకు ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది. విషపూరితమైన వనమూలికలను కూడా శుద్ది చేసి ప్రాణాలను రక్షించె అమృతంగా ఎలా మార్చాలి.... ఇవన్నీ కూడా నేర్చుకున్నారు.
ఏ.సీ.పి అజయ్ : మరి ఆ రోజుల్లొ తెల్లవాళ్ళ బెడద లేదా..?
డా. మాధవ్ : ఉండేది. కాని వాళ్ళు నేరుగా అడవుల్లోని గిరిజనుల వద్దకు వెళ్ళలేరు.
ఏ.సీ.పి అజయ్ : ఎందుకు..?
డా. మాధవ్ : అప్పట్లొ మన దేశంలోని అన్నీ గిరిజన ప్రాంతాలలొ కొన్నీ ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారతావనిలోని తెగలు ఎవరినిపడితె వారిని అంత సులభంగా లోపలికి రానివ్వరు. తెల్లవాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడెవాళ్ళు. అందుకె స్వేచ్చగా మా తాతగారు వాళ్ళ వద్ద ఉండి నేర్చుకోగలిగారు.
ఏ.సీ.పి అజయ్ :ఓ... ఆ తరువాత..?
డా. మాధవ్ : ఆ తరువాత మా తాతగారు నేర్చుకున్న విద్యతొ తిరిగి మా సొంత ఊరికి వచ్చి మా ముత్తాతగారితొ కలిసి ఆయుర్వేద వైద్యుడిగా స్థిరపడ్డారు. తరువాతి కాలంలొ. దేశాల మద్య అధికారిక సరిహద్దు గీతలు ఏర్పడ్డాయి. సోమ్రా లోయ విడిపోయింది. కాని మా తాతగారి స్నేహితుడు కహ్వాంగ్ మాత్రం ఆయన గురువు అజా వాంగ్నావ్ పదవిని స్వీకరించి అజా కహ్వాంగ్ గా మారి సరిహద్దు రేఖకు సరిగ్గ మద్యకు వచ్చిన లాంగ్వా గ్రామంలో స్థిరపడ్డారు.
ఏ.సీ.పి అజయ్ : మళ్ళి కలుసుకునే వారా..?
డా. మాధవ్ : అవును ప్రతి సంవత్సరం తప్పకుండా కలుసుకునేవారు. తరాలు మారిన వాళ్ళ స్నేహం మాత్రం మారలేదు. మరింత బలపడింది. ఆయన బ్రతికున్నంతకాలం ప్రతి ఏటా ఆయన్నీ కలుసుకునేవాళ్ళం. 2004 సెప్టంబర్ లొ ఆయన చనిపోయాక పెద్దగా వెళ్ళలేదు.
ఏ.సీ.పి అజయ్ : మీతొ అజా కహ్వాంగ్ గారి పరిచయం ఎలా ఉండేది.?
డా. మాధవ్ : చాలా బాగుండేది. ముఖ్యంగా నేను మెడికల్ కాలేజిలొ చదువుకునె రోజుల్లొ కూడా సెలవుల్లొ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతొ కలిసి అడవుల్లొ తిరిగేవాడిని. పుస్తకాల్లొ లేని ఎన్నో అద్భుతమైన వైద్య రహస్యాలను మా తాతగారు మరియు అజా కహ్వాంగ్ ఇద్దరు నాకు నేర్పారు.
ఏ.సీ.పి అజయ్ : ఇప్పుడు అర్ధం అవుతుంది ఆయుర్వేద వైద్య విద్యలొ మీకింత జ్ఞానం ఎలా వచ్చింది అని. మరి.. ఇంత వైద్య జ్ఞానం ఉన్న మీరు మీ పెద్ద వాళ్ళకి భిన్నంగా ఎందుకు ఆయుర్వేదంలొ BAMS & MD డాక్టర్ డిగ్రీలు చేశారు. నేరుగా మీ నాన్నగారు, తాతగారిలా వైద్య వృత్తి కొనసాగించలేరా..?
డా. మాధవ్ : రోజులు మారాయి. చట్టరిత్యా మన దేశంలొ జ్ఞానానికంటె పట్టా డిగ్రీలకె విలువ ఎక్కువ. అందుకె అవన్నీ చేశాను.
ఏ.సీ.పి అజయ్ : అది నిజమె లెండి. సరె మీ తాతగారు ఎలాంటి వైద్యం చేసేవారొ చెప్తారా దయచేసి. ఆయన ఎంతటి వైద్యులొ తెలుసుకోవాలని ఉంది.
డా. మాధవ్ : నా చిన్నతనంలొ జరిగిన ఒక సంఘటన ఉంది. అది ఒక్కటి చాలు మీకు మా తాతగారి ఎంతటి వైద్యుడొ తెలుస్తుంది.
ఏ.సీ.పి అజయ్ : చెప్పండి....
డా. మాధవ్ : అప్పడు నాకు 13 ఏళ్ళు మా తాతగారి వద్దకు కొంత మంది స్పృహలో లేని వ్యక్తిని తీసుకొచ్చారు. అడిగితె కొన్ని నిమిషాల క్రితం అతను గుండె పట్టుకొని నొప్పతొ బాధపడుతూ కుప్పకూలాడంటా..
అజయ్ ఆశ్చర్యంగా వింటున్నాడు.
డా. మాధవ్ : మా తాతగారు అతగాడి నాడి వ్యవస్తను మరియు కళ్ళను, నాలుకను పరీక్షించారు. అతని శ్వాసా కూడా మందగించింది. వెంటనె ఒక పసరను తయ్యరు చేసి బాగా కాల్చిన రాళ్ళను ఒక పళ్ళెంలొ పెట్టి అతని వద్దకు తీసుకువచ్చారు. అతని ముక్కు దగ్గర కొంత పసర మందు పూసి తరువాత ఆ కాలిన రాళ్ళపై మిగిలిన పసరను వేసి అతని ముక్కు వద్ద పెట్టారు.
ఏ.సీ.పి అజయ్ : తరువాత కొన్ని నిమిషాల అతను లేచి కూర్చున్నాడా...?
అని అనుమానంగా తెలిసినట్టుగా అడిగాడు.
డా. మాధవ్ : అవును... మీరు చెప్పినట్టె అతను ఆ పసర మందు ఆవిరి పీల్చగానె లేచి కూర్చున్నాడు.
అజయ్ కి ఇలాంటి సంఘటనె డా. సమర్జిత్ సేన్ నోటి వెంట విన్నట్టు గుర్తు.
ఏ.సీ.పి అజయ్ : కాని అతని చెప్పిన సంఘటన నాగాలాండ్ లోని లాంగ్వా గ్రామంలోనిది. అంటె అతను చెప్పిన వృద్ద వైద్యుడు ఈ అజా కహ్వాంగ్ అయ్యుండచ్చు.
అని అజయ్ తన మనసులొ అనుకున్నాడు. తన అనుమానం తీర్చుకోవడం కోసం మరొ ప్రశ్న వేశాడు.
ఏ.సీ.పి అజయ్ : మాధవ్ గారు వారస్త్వంగా మీ అబ్బాయికి కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్నీ ఎందుకు నేర్పించలేక పోయారు..?
డా. మాధవ్ : ఎందుకు నేర్పలేదు. వాడు 17 ఏళ్ళు వయసు వరకు నా వద్దె నేర్చుకున్నాడు. కాని వాడికి ఈ వృత్తి పట్ల ఆసక్తి లేదు ఎప్పుడు ధనార్జన పైనె దృష్టి. అందుకనె వాడు ఇంటర్ లో BiPC తీసుకోకుండా MPC గ్రూప్ తీసుకొని ఇంజినేరింగ్ చేశాడు. వాడికి ఆసక్తి లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను వాడి ఇష్టానికి వదిలేశాను.
ఇలా మాట్లాడుతుండగా బయట కొంతమంది పేషంట్లు వచ్చారు. వాళ్ళను చూసి డా. మాధవ్
డా. మాధవ్ : క్షమించాలి పేషంట్లు వచ్చారు. మనం తరువాత మాట్లాడుకుందాం ఏమనుకోవద్దు..?
ఏ.సీ.పి అజయ్ : అయ్యొ భలె వారె. నాకోసం మీరు ఇంత సమయాన్నీ కేటాయించారు. నేనె మీకు ఠాంక్స్ చెప్పాలి. ఇంక నేను వస్తానండి.
డా. మాధవ్ : మంచిది....?
అజయ్ బయటకి వచ్చి తన కారును తీసి స్టార్ట్ చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తన మొబైల్ ఫోన్ తీసుకొని సీ.ఐ ప్రవీణ్ కి కాల్ చేశాడు.
ఏ.సీ.పి అజయ్ : హలొ ప్రవీణ్ నువ్వు ఓ పని చెయ్యాలి. అమెరికాలొ ఉన్న డా. మాధవ్ గారి అబ్బాయి అర్జున్ కి సంబంధించి మొత్తం వివరాలు సేకరించు.
సీ.ఐ ప్రవీణ్ : ఏమైన క్లూ దొరికిందా..?
ఏ.సీ.పి అజయ్ : అవును. మన కేసులో ఇప్పటివరకు నాకు కనిపించిన ప్రతి ఆనవాలు... ఒకే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తున్నాయి. అతనె డా. మాధవ్ కొడుకు అర్జున్. సాఫ్టవేర ఇంజినేరింగ్ చేసిన వారస్త్వపు ఆయుర్వేద జ్ఞానాన్నీ వదులుకోలేదు.
సీ.ఐ ప్రవీణ్ : అవును నువ్వు చెప్తుంటె నాకు అదె అనుమానం వస్తుంది. మొబైల్ ఫోన్ హ్యాకింగ్, కాల్ డైవర్షన్, ఒక రకమైన మూలికతొ హత్యలు ఇవన్నీ తను చేయడానికి అవకాశాలున్నాయి.
ఏ.సీ.పి అజయ్ : Exactly. హత్యల్లో వాడిన విధానం... టెక్నాలజీ మీద పట్టు ఉన్న వ్యక్తి పని. అదే సమయంలో అరుదైన వనమూలికల పరిజ్ఞానం కూడా ఉంది. ఈ రెండు లక్షణాలు ఇప్పటివరకు నేను చూసిన వారిలో... ఒకే వ్యక్తిలో ఉన్నాయి...అది అర్జున్
సీ.ఐ ప్రవీణ్ : కాని ఎలా తను అమెరికాలొ ఉన్నాడు అని చెప్పావుగా.
ఏ.సీ.పి అజయ్ : అందుకె నువ్వు మొత్తం వివరాలు సేకరించి. అర్జున్ నిజంగానె అమెరికాలోనె ఉన్నాడా లేక ఇక్కడె ఎక్కడైన దాంకున్నాడా అనేది తెలుసుకోవాలి. ఎలాగొ 2 రోజుల్లొ ఈ హత్యల వెనకున్న కారణం కూడా తెలిసిపోతుంది.
సీ.ఐ ప్రవీణ్ : అలాగె...
అని ప్రవీణ్ ఫోన్ పెట్టేశాడు. కారు నడుపుతున్న అజయ్ మొహంలొ ఒక రకమైన గర్వం వచ్చింది.. సాగర్ వర్మ కంటె ముందె తను హంతకుడిని చేరుకోబొతున్నాడు అని.