Read Yevaru...? - 7 by Suresh Josyabhatla in Telugu Crime stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఎవరు....? - 7

Part - 7

తన భర్త దేవేంద్ర రెడ్డి మరణం వెనుక ఉన్నది తన కొడుకె అని తెలియగానె. ప్రియా ఒక్కసారిగా షాక్ కి గురయ్యి. ఏం మాట్లాడకుండా అలాగె కొడుకు అరవింద్ వైపు చూస్తూ నించుండిపోయింది. అరవింద్ కూడా ఏం మాట్లాడట్లేదు. 

ప్రియ : ఏం మాట్లాడుతున్నావు సాగర్? వాడు ఆయన చావుకి కారణం ఏంటి? కన్నతండ్రిని వాడెందుకు చంపుకుంటాడు.?

సాగర్ వర్మ : మీరు అన్నది నిజమె కన్న తండ్రిని తను చంపాలి అనుకోలేదు. కాని సూర్యనారాయణని చంపాలి అనుకున్నాడు. దురదృష్టం కొద్ది ఆయన బదులు దేవేంద్రగారు చనిపోయారు.

ప్రియ : తననైన ఎందుకు చంపాలనుకుంటాడు.?

సాగర్ వర్మ : అది నేను కాదు అరవిందె చెప్పాలి.

ప్రియ : రేయ్ ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అలా నించున్నావేరా?. ఏదొకటి చెప్పు? 

అరవింద్ : అది అంతా అబద్దం అమ్మ. నేను ఎందుకు సూర్యనారాయణని చంపాలి అనుకుంటాను?. మీరు అబద్దం చెప్తున్నారు అంకుల్

సాగర్ వర్మ : ఏ ఆధారం లేకుండా నీపై నింద వెయాయాల్సిన అవసరం నాకు లేదు అరవింద్. 3 రోజులు క్రితం రాత్రి గుంటూరు నుంచి వస్తున్న సీ.ఐ ప్రవీణ్ మీద గణేష్ చేత దాడి చేయించి గాయాలపాలు అయ్యేలా చేశావు. అదృష్టం కొద్ది తనకి ఎటుంవంటి ప్రాణహాని జరగలేదు.

ఏ.సీ.పి అజయ్ : మ్మ్మ్మ్మూహ్... చెప్పు నిజం..

అని గణేష్ ని అజయ్ గదమాయించాడు. 

గణేష్ : అవును మేడమ్ అరవింద్ సారె దాడి చెయ్యమని చెప్పారు.

సాగర్ వర్మ : నేను కేవలం గణేష్ మాటలు నమ్మి అరవింద్ మీద నేరం ఆరోపించడం లేదు మేడమ్. ఇది ఒకసారి చూడండి. 

అని తాను సేకరించిన సీ.సీ.టీ.వీ ఫూటేజ్ వీడియోలు ప్రియకి చూపించాడు. అందులొ దేవేంద్ర రెడ్డి ఇంటి ముందు నుంచి వెళ్ళడం మరియు సూర్యనారాయణ ఇంటి ముందు నించోవడం ఉంది. 

సాగర్ వర్మ : ఆ బైక్ నంబర్ ను గమనించండి. ఇది ఎవరొ బైకొ గుర్తుపట్టారా..? 

ప్రియ : ఇది... ఇది... అరవింద్ బైక్. పోయిన ఏడాది నువ్వె తన పుట్టిన రోజుకి కానుకగా ఇచ్చావు సాగర్.

సాగర్ వర్మ : బైక్ మాత్రమె కాదు మనిషిని కూడా చూడండి. తన కుడి చేతికి కట్టు ఉంది. 

ప్రియ : అవును ఇది నెల రోజుల క్రితం అరవింద్ బైక్ నడుపుతుంటె తన చేతికి ఏదొ చెట్టుకొమ్మ బాగా గీరుకుంది. అప్పుడు కట్టిన కట్టు. 

అని అరవింద్ వైపు చూసింది. ఏ.సీ.పి అజయ్ వచ్చి అరవింద్ కుడి చేతిని ఎత్తి పట్టుకుంటాడు. అప్పుడు తన మోచేతి మీద ఉన్న దెబ్బగాటు కనిపిస్తుంది. 

సాగర్ వర్మ : +918852241364 ఇది నీ రెండొ నంబరె కదా అరవింద్..?

అరవింద్ : రెండొ నంబరా..? నాకసలు ఇంకొ నంబరె లేదు. అది ఎవరి నంబరొ నాకు తెలియదు..

సాగర్ వర్మ : అంటె ఇది నీ నంబర్ కాదు అంటావు? ఎస్ .ఐ సుందర్ గారు అవి ఇటు తీసుకురండి.

అని ఎస్.ఐ సుందర్ కి చెప్తాడు.

సాగర్ వర్మ : +919908232222 ఇది మాత్రం కచ్చితంగా నీ నంబరె కదా..?

అరవింద్ : అవును ...

సాగర్ వర్మ : గత నెల రోజులుగా నువ్వు ఎక్కడెక్కడ తిరిగావొ నీ +919908232222 నంబర్ టవర్ లోకేషన్ ద్వారా ట్రాక్ చేశాం. కాని అదేం విచిత్రమొ నీ నంబర్ ఉన్న చోటల్లా ఈ +918852241364 నంబర్ కూడా అదె టవర్ లోకేషన్ లొ చూపిస్తుంది.

అరవింద్ : అది యాదృచ్ఛికం కావచ్చుగా...

సాగర్ వర్మ : ఒకసారి లేదా రెండుసార్లు మహా అయితె మూడుసార్లు అంటె యాదృచ్ఛికం అవుతుంది అరవింద్. కాని గత నెల రోజులు నుంచి అయితె. అంతెందుకు ఇప్పుడు కూడా ఆ రెండొ నంబర్ లోకేషన్ ఇక్కడె చూపిస్తుంది. అది యాదృచ్చికమా..?

ఏ.సీ.పి అజయ్ : ప్రియ మేడమ్ ఇటు చూడండి ఆ రెండొ నంబర్ సిమ్ ఈ గణేష్ పేరు మీద ఉన్నట్టు ఆధారాలు.

సాగర్ వర్మ : ఇవి అరవీంద్ వాడుతున్న రెండు నంబర్ల కాల్ డేటా... ఇప్పటికైన నిజం ఒప్పుకొ అరవింద్.

అరవింద్ : నేను నిజమె చెప్తున్న ఈ హత్యకి నాకు ఏ సంబంధం లేదు. (గట్టిగ అరుస్తూ) 

సాగర్ వర్మ : సంబంధం లేకపోతె ఆరోజు మీ నాన్నగారు చనిపోయినప్పుడు వెంటనె పోలీసులకి ఎందుకు ఫోన్ చేశావు.

అరవింద్ : లేదు ఆ రోజు నేను పోలీసులకి ఫోన్ చేయలేదు. అంబులెన్సుకి కాల్ చేశాను. 

అని అరవింద్ మాట తడబడ్డాడు.

అది విని ప్రియ దిగబ్రాంతికి గురయ్యింది. అంతా నిశ్శబ్దం. 

సాగర్ వర్మ చిరునవ్వు నవ్వుతూ ఏ.సీ.పి అజయ్ మరియు మిగతా పోలీసుల వంక చూస్తాడు.

అరవింద్ : ఎస్..నేను సూర్యనారాయణని చంపాలనుకున్నది నిజమె. ఎప్పుడైతె మా నాన్నని వాడు పార్టీ ఆఫీసులొ అందరి ముంది తిట్టి కొట్టి అవమానించాడొ అప్పుడె వాడిని చంపాలి అనుకున్న కాని...

అని మాట పూర్తయ్యె లోపల అరవింద్ చెంప ఛెళ్ళుమనెలా ప్రియ కొడుతుంది.

అరవింద్ : (చెంప మీద చెయ్యి వేసుకొని) అమ్మా....

ప్రియ : ఛీ.... నన్ను అలా పిలవకు...

అరవింద్ : అది కాదు అమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను..

ప్రియ : నేను వినను. నీ అనవసరపు కోపం వల్ల నా భర్తను పోగుట్టుకున్న కద రా.. పో రా ఇక్కడ నుంచి.
సాగర్ వీడిని తీసుకెళ్ళిపో. ఇప్పుడు నుంచి వీడు నా కొడుకు కాదు.

అంటూ ఏడుస్తూ సోఫాలొ కూలబడిపోతుంది.

సాగర్ వర్మ : కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి.

పోలీసులు అరవింద్ చేతికి సంకెళ్ళు వేసి అక్కడ నుంచి తీసుకెళతారు. 
వార్తా చానెల్సు ద్వారా రాష్ట్రం మొత్తం ఈ విషయం పై పెద్ద చర్చ జరుగుతుంది.
మరుసటి రోజు అరవింద్ ను కోర్టులొ ప్రవేశపెడతారు. 

పబ్లిక్ ప్రాసీక్యూటర్ : సర్ అరవింద్ కి దేవేంద్రరెడ్డి గారి హత్యకి సంబంధం ఉన్నట్టు ఇప్పటికె కోర్టు వారికి ఆధారాలు దానితొ పాటు గతంలొ అతను చేసిన వాటికి సంబంధించిన వివరాలు అందిచాం. 

అరవింద్ డిఫెన్స్ లాయర్ : సర్ అవన్నీ కేవలం తనకి సంబంధం ఉందని నిరూపిస్తున్నాయి అంతె కాని తనె హంతకుడు అని నిరూపించడం లేదు. పైగా వాటిలొ ముఖ్యమైన ఆధారం అని చెప్పబడుతున్న సీ.సీ.టీ.వి ఫూటేజ్ వీడియొలొ ఉన్నది అరవిందె అని రుజువు ఏంటి?

పబ్లిక్ ప్రాసీక్యూటర్ : ఆ బైక్ నంబర్ బట్టి అది అరివింద్ దె అని నిర్దారించాం. అంతెకాకుండా ఆ సమయంలొ తను వాడుతున్న రెండు నంబర్ల తాలుకు సిగ్నెల్సు అదె టవర్ లొకేషన్లొ చూపిస్తున్నాయి. ఆది మాత్రమె కాదు. అందులొ ఉన్నది తన బిడ్డె అని ముద్దాయి తల్లి ప్రియ గారె ఒప్పుకున్నారు. ఒకసారి ఆవిడని ఇక్కడ పిలిపించడానికి అనుమతిని ఇవ్వండి.

జడ్జీ : పిలిపించండి..

ప్రియ వచ్చి బోనులొ నిలబడింది.

జడ్జీ : ప్రియ్ గారు. అందులొ ఉన్నది మీ అబ్బాయె అని నమ్ముతున్నారా.?

ప్రియ : అవును..

జడ్జి : ఎలా గుర్తించారు.? ఆ చేతికి ఉన్న గాయం వలన?

ప్రియ : గాయం వలన మాత్రమె కాదు. అరవింద్ కి ఎడం చేతి వాటం ఉంది. ఆ వీడియొలొ తను ఎడం చేత్తొ బండి తాళం చెవిని ఎగిరేసి పట్టుకుంటున్నాడు.

జడ్జి : ఎడం చేతి వాటం అనేది చాలమందికి ఉంటుంది కదా అండి.?

ప్రియ : అది ఒక్కటె కాదు. వాడికి కంగారు గాని కోపం గాని వస్తె చేతి వేళ్ళను బ్రొటిని వేలుపై వేగంగా ఆడిస్తాడు. 

అని చెప్పగానె జడ్జి అరవింద్ వైపు చూస్తాడు. సరిగ్గ అప్పుడె కంగారుగా తన చేతి వేళ్ళని బ్రొటని వేలుపై ఆడిస్తున్నాడు. అది చూసి జడ్జి ఒక అంచనాకి వచ్చాడు.

డిఫెన్స్ లాయర్ : సరె సర్ ఆ వీడియోలొ ఉన్నది అరవిందె అనుకుందాం. అంతమాత్రాన తనె హత్యచేసినట్టు కాదుగా. 

పబ్లిక్ ప్రాసీక్యూటర్ : అందుకె సర్ మరీంత విచారణ కోసం సదరు ముద్దాయిని 10 రోజుల పాటు పోలీసువారి కస్టడికి అప్పింగించాలని మనవి.

జడ్జ్ : ముద్దాయిని 10 రోజులు పోలీసువారి కస్టడికి పంపిస్తున్నాం. అంతవరకు ఈ కేసును వచ్చె నెల 12వ తారీకు వాయిదా వేస్తున్నాం.

ఇంటరాగేషన్ గది (Interrogation room).....
సాగర్ వర్మ ఎదురుగా అరవింద్ కూర్చొని ఉన్నాడు.

ప్రక్కన అజయ్ ఇంకొ కుర్చిలొ కూర్చొని ఉన్నాడు.

సాగర్ వర్మ : చెప్పు అరవింద్ ఎందుకు చంపావు...?

అరవింద్ : నేను ఎవరిని చంపలేదు.

సాగర్ వర్మ : నేను అడుగుతున్నది మీ నాన్నగారి గురించి మాత్రమె కాదు అరవింద్. "పల్లవి" గురించి కూడా...

పల్లవి పేరు వినగానె అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

సాగర్ : ఏంటి షాక్ అయ్యావా..? నీ నేర చరిత్ర మొత్తం మాకు తెలిసు. 

ఏ.సీ.పి అజయ్ : 17 ఏళ్ళకె డ్రగ్స్ కి అలవాటు పడ్డావు. 19 ఏళ్ళకి డ్రగ్స్ దందా చేసె వాళ్ళతొ చేతులు కలిపి నువ్వు కాలేజిలొ డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టావు. 

సాగర్ వర్మ : నువ్వు ఇంజినీరింగ్ 3వ సంవత్సరంలొ ఉన్నప్పుడు. అప్పుడె కొత్తగా కాలేజిలొ చేరిన పల్లవిని చూశావు. తనపై మనసుపడ్డావు. తన వెంట తిరిగావు. కాని ఆ అమ్మాయి నిన్ను పట్టించుకోలేదు. నీ ఇంజినీరింగ్ పూర్తియిన కూడా నువ్వు రోజు ఆ అమ్మాయి కోసం కాలేజికి వెళ్ళెవాడివి. ఎప్పటికైన ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడకపోదా అని 1 సంవత్సరం పాటు ఎదురుచూశావు. 

ఏ.సీ.పి అజయ్ : కాని ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలొ ఉన్నప్పుడు ఎవరినొ ప్రేమిస్తుంది అని తెలిసి వాడి గురించి కనుక్కున్నావు. ఆ అబ్బాయి పల్లవి బావ అని తన మేనమావ కొడుకు అని. తన చదువు పూర్తయ్యాక వాళ్ళ బావని పెళ్ళి చేసుకొబోతుంది అని తెలిసి తట్టుకోలేకపోయావు. 

సాగర్ వర్మ : 2 నెలలు పాటు పల్లవిని పూర్తిగా ఫాలొ అయ్యావు. సరిగ్గ ఒక రోజు రాత్రి పల్లవి తన స్నేహితురాలు ఇంటి నుంచి తన కాలేజి హాస్టల్ కి ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటె. నీ స్నేహితులతొ కలిసి కిడ్నాప్ చేశావు. తను అరవకుండా ఉండేందుకు మత్తు మందు ఇచ్చి తనని ఊరి చివర ఉన్న నీ ఫార్మ్ హౌస్ కి తీసుకువెళ్ళావు. 

ఏ.సీ.పి అజయ్ : డ్రగ్స్ ఇచ్చి 2 రోజుల పాటు నువ్వు నీ నలుగుర స్నేహితులు కలిసి ఆ అమ్మాయి జీవితాన్నీ నాశనం చేశారు. చివరికి మీ క్రూరత్వాన్నీ తట్టుకోలేక పల్లవి చనిపోతె అక్కడె తనని ఫార్మ్ హౌస్ వెనకాల పాతిపెట్టేశారు.

సాగర్ వర్మ : మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గుంటూరులొ ఆ పిల్ల తల్లిదండ్రులను సీ.ఐ ప్రవీణ్ కలిశాడని నీకు నీ మనుషుల ద్వారా సమాచారం అందింది. అందుకె ఆ రోజు రాత్రి తనపై గణేశ్ చేత దాడి చేయించావు.

ఏ.సీ.పి అజయ్ : అసలు నువ్వు సూర్యనారాయణని చంపాలి అనుకున్నది మీ నాన్నగారు దేవేంద్ర రెడ్డితొ పార్టీ ఆఫీసులొ జరిగిన గొడవ వల్ల కాదు అని మాకు తెలుసు. సూర్యనారాయణకి నీ మాధక ద్రవ్యాల దందా మరియు పల్లవి పై మీరు చేసిన అమానుష చర్య గురించి తెలిసింది. 

సాగర్ వర్మ : తనకి తెలిసింది అన్న విషయం నీకు తెలిసింది. సూర్యనారాయణ ఎక్కడ ఈ నిజాలను బయటపెడతాడొ అని భయపడ్డావు. అందుకె చంపాలి అనుకున్నావు. అంతెగా అరవింద్...?

అరవింద్ : ఇదంతా మీకెలా తెలసు..?

ఏ.సీ.పి అజయ్ : ఎలాగా..? గత నాలుగు నెలలుగా నీ కాల్ డేటా మరియు నువ్వు తిరిగిన సెల్ఫోన్ లోకేషన్స్ అన్నీ ట్రాక్ చేశాం. దాంతొ నీ డ్రగ్స దందా మొత్తం బయటిపడింది. దందాలొ నీకోసం పని చేసే వాళ్ళని పట్టుకొని మా పద్దతిలొ విచారించేసరికి మొత్తం కక్కేశారు. 

సాగర్ వర్మ : ఆ తరువాత నువ్వు చదివిన కాలేజికి వెళ్ళి నీ గురించి మొత్తం వాకబు చేశాం. పల్లవి గురించి తెలిసింది. పోయిన ఏడాది నుంచె ఆ అమ్మాయి కనబడటం లేదు అని తెలిసింది. 

ఏ.సీ.పి అజయ్ : సీ.ఐ ప్రవీణ్ విజయవాడ పోలీసు స్టేషన్లొ ఆ అమ్మాయి కనబడటం లేదు అని ఇచ్చిన ఆ మిస్సింగ్ కంప్లైంటు ఆధారంగా ఆమె తల్లిదండ్రులని కలిశాడు. అది నీకు తెలిసి దాడిచేయించావు.

అరవింద్ : మరి ఆ అమ్మాయిని నేనె కిడ్నాప్ చేసి చంపాను ఎలా తెలుసుకున్నారు. ?

సాగర్ వర్మ : నువ్వు గణేష్ చేత ప్రవీణ్ పై దాడి చేయించకుండా ఉండుటె మాకు అసలు అనుమానమే వచ్చేది కాదు. అక్కడె దొరికిపోయావు. దాంతొ అనుమానం వచ్చి నువ్వెప్పుడు మీ నాన్నకి తెలియకుండా ఊరి చివల ఫార్మ్ హౌసులొ నీ స్నేహితులతొ కలిసి మందు కొడతావు అన్న సంగతి నాకు తెలిసు. అందుకె అక్కడి వాచ్ మేన్ ని కూడా మా పద్దతిలొ అడిగాం. వాడూ మొత్తం చెప్పేశాడు. 

ఏ.సీ.పి అజయ్ : పాతిన చోట ఆ పిల్ల అస్తిపంజరాన్నీ వెలికి తీసి దాన్నీ డీ.ఎన్.ఎ పరీక్షకు పంపించాక. అది పల్లవిదె తెలుసుకున్నాం.

తన నేర చరిత్ర మొత్తం తన ముందు పెట్టేసరికి అరవింద్ అలా షాక్ లొ ఉండిపోయాడు. 

సాగర్ వర్మ : ఇప్పుడు చెప్పు అసలు దేవేంద్ర రెడ్డిగారు చనిపోయినప్పుడు ఆ ఇంటి దగ్గర నువ్వేం చేస్తున్నావు. ఆ విషం కలిపింది నువ్వే కదా. ?

అరవింద్ సమాధానం చెప్పేలోపు సాగర్ వర్మకి కాల్ వచ్చింది అని ఎస్.ఐ జాన్ బాబు వచ్చి చెప్తాడు. అది మాట్లాడడానికి అని విచారణ జరిపై గది నుంచి బయటకి వస్తాడు.

సాగర్ వర్మ : హలో.. ఎవరూ..? 

అని సాగర్ వర్మ ఫోన్లో మాట్లాడుతుంటె. లోపల ఏ.సీ.పి అజయ్ విచారణని కొనసాగిస్తున్నాడు.

ఏ.సీ.పి అజయ్ : చెప్పు ఆ విషం కలిపింది నువ్వె కదా?. అది కలపడానికె కదా సూర్యనారాయణ ఇంటికి వెళ్ళింది.?

అరవింద్ : ఆ రోజు విషం కలపడానికె సూర్యనారాయణ ఇంటికి వెళ్ళాను కాని కలిపె అవకాశం నాకు దొరకలేదు. పైగా అదె సమయానికి సూర్యనారాయణతొ మా నాన్న కూడా రావడం చూసి ఆ ఇంటి వెనక సీ.సీ కెమెరాల్లొ కనబడకుండా దాంకున్నా. అరగంట తరువాత మా నాన్న గుండె పట్టుకొని నెలపై పడి గిలగిల్లాడడం చూసి వెంటనె అంబులెన్సుకి కాల్ చేశా..

ఏ.సీ.పి అజయ్ : నువ్వు కలపలేదా..? అబద్దం చెప్పకు. అయిన నువ్వు అంబులన్సుకి కాల్ చేస్తె వాళ్ళు రావాలి గాని ముందు పోలీసులు ఎందుకు వస్తారు..

అరవింద్ : ఏమొ నాకు తెలియదు.

ఈ లోపు బయట ఫోన్లొ మాట్లాడుతున్న సాగర్ వర్మ ఏదొ విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంటరాగేషన్ గదిలొ ఉన్న అరవింద్ వైపు అయోమయంగా చూస్తాడు. అనుకోకుండా సాగర్ వర్మ హావాభావాలను లోపలున్న ఏ.సీ.పి అజయ్ గమనించాడు. 

"ఏమైంది" అన్నట్టు సాగర్ వర్మను చూసి సైగ చేశాడు. ఫాన్ పెట్టేసి ఏ.సీ.పి అజయ్ ని "రమ్మని" సాగర్ వర్మ సైగ చేస్తాడు. 

ఏ.సీ.పి అజయ్ రాగానె సాగర్ వర్మ మొబైల్ ఫోనులొ లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. అవతల మాట్లాడుతుంది ఎస్.ఐ సుందరం. 

ఏ.సీ.పి అజయ్ : హలో సుందరం ఏమైంది.?

ఎస్. ఐ సుందరం : సార్ సూర్యనారాయణ గారు నిన్న రాత్రి ఆయన ఫార్మ్ హౌసులొ గుండెపోటుతొ చనిపోయారు. అచ్చం దేవేంద్ర రెడ్డి గారి లాగా.

అంతె వినగానె ఏ.సీ.పి అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి సాగర్ వర్మని చూస్తాడు. తరువాత ఫోన్ పెట్టేసి 

ఏ.సీ.పి అజయ్ : అరవింద్ ఇక్కడ ఉండగా అక్కడ ఆయన ఎలా చనిపోయాడు. ఒకవేళ అయనది సహజ మరణమా...?

అని చెప్పి ఇద్దరు బయటనుంచి ఇంటరాగాషేన్ గదిలొ ఉన్న అరివింద్ రెడ్డిని చూస్తూ ఉండిపోతారు.....