Part - 9
విజయవాడ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో…..
కొండపల్లి కొండల వెనుక…..
పచ్చటి అడవులు, రాళ్ల గుట్టలు, లోయల మధ్య...
బయటి ప్రపంచానికి దాదాపు దూరంగా బ్రతుకుతున్న చిన్న గిరిజన గ్రామం…
"పొనికె గూడెం"
అస్తమిస్తున్న సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడుతుంటె. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
వచ్చి సరిగ్గ ఆ "పొనికె గూడెం" గ్రామం మద్యన ఆగాడు. అక్కడ ఒక పెద్ద మఱ్ఱి చెట్టు క్రింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని పేరు "చెంచయ్య" ఆ గ్రామం పెద్ద అందుకె అతన్నీ అందరు పెద్దయ్యా అని కూడా పిలుస్తారు .అతని చుట్టూ కొంత మంది గ్రామ ప్రజలు క్రింద కూర్చున్నారు.
ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తిని చెంచయ్య చూశాడు. అతను ఊపిరి సలుపుకుంటూ వచ్చి చెంచయ్య కాళ్ళ దగ్గర కూలబడ్డాడు.
చెంచయ్య : రేయి సాంబడు ఏటయనాది రా.?
సాంబడు : పెద్దయ్య మన మల్లి..... మన మల్లి... మన మల్లి కడుపు పోయ్యిందయ్యా.. ఈ గూడెంలొ ఇంకొ ఆడబిడ్డ కడుపును పొగొట్టుకుందయ్యా...
అంటూ ఏడుస్తూ చెప్పాడు. అది విన్న చెంచయ్య మరియు అక్కడ ప్రజలు బాధపడుతున్నారు.
అక్కడున్న ఒక ముసిలావిడా ఏడుస్తూ.
ముసిలావిడా : ఈ నెలలొ ఇది నాలుగోసారి. మన గూడెంలొ పురిటి బిడ్డల ఏడుపులు విని మూడేళ్ళు అవుతోంది.
సాంబడు : గత మూడేళ్లుగా ఇదే జరుగుతుంది పెద్దయ్యా. ఆడోళ్ళకి కడుపులు నిలవడం లేదు. మగోళ్ళ రక్తం సల్లారి పోయింది. మన గూడెం విత్తనమే ఎండిపోతుందయ్యా.. ఇలా అయితె మన తరంతోనె ఆగిపోతుందేమో అని భయమేస్తుందయ్యా..
చెంచయ్య నెమ్మదిగా తలెత్తి దూరంగా ఉన్న కొండల వైపు చూస్తున్నాడు. తన కళ్లలోంచి కారే నీళ్లు అస్తమిస్తున్న సూర్య కాంతికి మెరుస్తున్నాయి.
------------------------------------------------------------------------
ఏ.సీ.పి అజయ్ కారులొ డీ.జి.పి ఆఫీసుకి వచ్చి సాగర్ వర్మను పిలవడానికని అతని ఆఫీసు గదికి వెళతాడు. ఆ సమయంలొ సాగర్ వర్మ ఏదొ ఫైల్ చదువుతున్నాడు.
ఏ.సీ.పి అజయ్ : సార్ మీరు రెడి ఆ. ఏర్పోర్టుకి బయలుదేరుదామా..?
సాగర్ వర్మ : వస్తున్న Mr. అజయ్ ఒక అయిదు నిమిషాలు
అని చెప్పి తాను అప్పటి వరకు చదువుతున్న ఫైల్ ని మూసి టేబుల్ పై పెట్టి మొఖం కడుక్కోడానికి అని బాత్రూంకి వెళ్ళాడు.
అజయ్ వచ్చి ఫైల్ ఏంటా అని చూశాడు. దానిపై "ప్రాజెక్ట్ పొనికె గూడెం" (Project Ponike gudem) అని వ్రాసి ఉంటుంది.
ఈలోపు సాగర్ వర్మ బయటకి వస్తాడు.
సాగర్ వర్మ : వెళదామా..?
ఏ.సీ.పి అజయ్ : ఇదేం ఫైల్ సార్.?
సాగర్ వర్మ : అది నేను ఇక్కడ రాకమునపు టేకప్ చేసిన పాత కేసు ఫైల్. ఊరికె చదువుతున్నా ఈ కేసుకి ఏమైన ఉపయోగపడచ్చేమొనని.
ఏ.సీ.పి అజయ్ : ఓహో..
సాగర్ వర్మ : సరె పదండి ఫ్లైట్ కి టైమ్ అవుతుంది.
అజయ్ మరియు సాగర్ వర్మ ఇద్దరు కలసి ఉదయం 7:30 కల్లా గన్నవరం ఏర్పోర్టుకి చేరుకుంటారు. సరిగ్గ 8 గంటలకి కలకత్తా ఫ్లైట్ గన్నవరం ఏర్పోర్టులొ దిగింది.
అందులో ఉన్న ప్రయాణికులందరు దిగి నడుచుకుంటూ వస్తున్నారు.
వాళ్ళల్లొ సన్నగా ఉండి కొంచెం చిన్నగా నడుము వంగి తెల్లటి జుట్టు మరియు పండిన ఫ్రెంచి గెడ్డంతొ. ఒంటి మీద ఆకుపచ్చ రంగు టీ-షర్టు మరియు నీలం రంగు జీను ప్యాంటు వేసుకొని కళ్ళుజోడు పెట్టుకున్న ఒక 68 ఏళ్ళ వ్యక్తి వీళ్ళవైపు నడిచుకుంటూ వస్తున్నాడు.
డా.సమర్జీత్ సేన్ : హలొ... దిస్ ఈస్ డా. సమర్జీత్ సేన్. మీరు నా గురించె వచ్చారా..?
అని ప్లెకార్డు మీద అతని పేరు వ్రాసి పట్టుకున్న వీళ్ళ వద్దకొచ్చి అడిగాడు.
సాగర్ వర్మ : అవును సార్ వెల్కమ్..టు..ఆంధ్రా. మై నేమ్ ఈస్ సాగర్ వర్మ ఐ.పీ.ఎస్. ఇతను నా కొలీగ్ అజయ్ ఐ.పీ.ఎస్.
ఏ.సీ.పి అజయ్ : హెలొ డాక్టర్..
డా. సమర్జిత్ సేన్ : హలొ నైస్..టు..మీట్..యు.
సాగర్ వర్మ : రండి హోటల్ కి వెళదాం. అక్కడ మీకు రూమ్ బుక్ చేసి ఉంచాం. అందులొ మీ లగేజి అది పెట్టేసేయండి. మీరేమైన విశ్రాంతి గట్రా తీసుకోవాలి అనుకుంటున్నారా.
డా. సమర్జిత్ సేన్ : నో.. ఐం.. ఫైన్. ముందు కేసు సంగతి చూద్దాం.
సాగర్ వర్మ : అలాగైతె మీ లగేజి అది పెట్టేసి అక్కడె క్రిందున్న రెస్టారెంటులొ టిఫిన్ చేసేసి. ఆక్కడ నుంచి మనం నేరుగా మంగళగిరి లొ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫారెనసిక్ సైన్స్ ల్యాబరేటరి (APFSL)కి వెళిపోదాం.
డా. సమర్జిత్ సేన్ : ఓకే...
ఏ.సీ.పి అజయ్ : మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారె.
డా. సమర్జిత్ సేన్ : మా నాన్నగారు రైల్వే పోలీసు గార్డ్ గా విశాఖపట్టణంలొ పనిచేసే వారు. నేను అక్కడె పెరిగాను. డిగ్రి వరకు నా చదువు అంతా అక్కడె అయ్యింది. అందుకె నాకు తెలుగు బాగా వచ్చు.
ఏ.సీ.పి అజయ్ : మరి కలకత్తాకి ఎప్పుడు వెళ్ళారు.?
డా. సమర్జిత్ సేన్ : నా పై చదువులకని మళ్ళి నేను కలత్తాకి వెళ్ళాను తరువాత మా నాన్నగారు రిటైర్ అయ్యాక మా అమ్మతొ కలిసి వాళ్ళు కలకత్తా వచ్చేసారు అలా అక్కడె మేం స్థిరపడిపోయాం. అదె మాత్రమె కాదు నేను బెంగాలి అయిన నా భార్య మాత్రం పక్కా తెలుగు తనది విశాఖపట్టణం. మాది లవ్ మ్యారేజ్ కాలేజి రోజుల్లొ ప్రేమించుకున్నాం.
ఏ.సీ.పి అజయ్ : అంటె మీరు మా ఆంధ్రా అల్లుడు అనమాట... (నవ్వుతూ)
డా. సమర్జిత్ సేన్ : (నవ్వుతూ) అవును బాగా పాత అల్లుడిని.
అలా వాళ్ళు డా. సమర్జిత్ సేన్ ని ఏర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని హోటల్లొ తన లగేజి పెట్టేసి తరువాత టిఫిన్ చేసి నేరుగా మంగళగిరి బయలుదేరారు.
ఫారెన్సిక్ ల్యాబరేటరికి చేరుకొన్నాక లోపలికి వెళ్ళారు. అప్పటికె సైంటిఫిక్ ఆఫీసర్ ప్రేరణ వీళ్ళ కోసం ఎదురు చూస్తుంది అనుకుంటా. రాగానె వీళ్ళను చూసి లోపలికి ఆహ్వానించింది.
సాగర్ వర్మ : డాక్టర్ షీ..ఈస్ సైంటిఫిక్ ఆఫీసర్ ప్రేరణ ఈ టాక్సికాలజి డిపార్టమెంట్ కి హెడ్.....
మేడమ్ హీ..ఈస్ డా. సమర్జిత్ సేన్...
డా. ప్రేరణ : ఈయన నాకు తెలీకపోవడం ఏంటి. నేను అయనకి పెద్ద ఫాలోవర్ ని. టాక్సికాలజిలొ ఈయనె నాకు స్పూర్తి. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా సార్. మీ రిసెర్చ ఆర్టికల్సన్నీ ఒక్కటి కూడా వదలకుండా అన్ని చదువుతూ ఉంటాను.
డా. సమర్జిత్ సేన్ : ఇంకా వాటిని చదువుతున్నారన్నమాట…
డా. ప్రేరణ : అఫ్ కోర్స్ సార్ అవి చాలా విలువయినవి మరియు ఎంతొ ఉపయోగపడేవి.
ముఖ్యంగా మీరు పాషాణాలు (Alchemical poisons) ఇంకా క్షారసదృశాలు (Alkaloids) గురించి వ్రాసిన ఆర్టికల్స్ అయితే అసాధారణం.
డా. సమర్జిత్ సేన్ : నా రిసెర్చుపై ఇంతలా ఆసక్తి చూపించె వాళ్ళు ఇంకా ఉన్నారంటె నాకు చాలా సంతోషంగా ఉంది.
డా.ప్రేరణ : నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మిమ్మల్ని కలిసి.
సాగర్ వర్మ : ఓకె మేడమ్. లెట్స్..గెట్..టు..ద..వర్క్. ఇద్దరి హత్య కేసుల్లొ సేకరించిన అన్నీ నమూనాలను బయటకి తీసి ఉంచారా..
డా. ప్రేరణ : యా.. ఇట్స్.. రెడి.. ఈ రెండు కేసులకు సంబంధించిన ఆహార నమూనాలు, జఠర ద్రవ నమూనాలు అదె కడుపులోని ద్రవ అవశేషాలు, పానీయ అవశేషాలు అన్నీ టాక్సికాలజి విభాగంలో భద్రపరిచున్నాయి ఇప్పుడె వాటిని బయటకి తీయించాను.
డా. సమర్జిత్ సేన్ : సరె పదండి. ముందుగా అవి బయట పదార్థాలతో కలుషితం అయ్యే అవకాశం లేదని నిర్ధారించుకోవాలి.
అందరు కలిసి టాక్సికాలజి విభాగంలోని నమూనాలు భద్రపరచు చోటుకి వెళతారు.
లోపలికి వెళ్ళగానె డా.ప్రేరణ రెండు హత్యా స్థలాలలొ సేకరించినటువంటి అన్నీ నమూనాలను మరియు ద్రవ నమూనాలను ముందున్న టేబుల్ పై పెట్టింది.
డా. ప్రేరణ : ఇవి దేవేంద్ర రెడ్డి గారు చనిపోయిన చోట సేకరించినవి. ఇవొచ్చి సూర్యనారాయణ గారు చనిపోయిన చోట సేకరించినవి.
డా. సమర్జిత్ సెన్ తన చేతికి గ్లౌవ్సులు తొడుక్కొని వాటిని ఒక్కొక్కటి చెత్తో పట్టుకొని పరీక్షగా చూస్తున్నాడు.
డా. సమర్జిత్ సెన్ : ఇద్దరి పోస్టుమార్టం రిపోర్ట్లలొ ఉన్న పోలకలేంటి..?
ప్రేరణ వెంటనే ఫైల్ తెరిచి
డా. ప్రేరణ : సడన్ కార్డియాక్ ఎలక్ట్రికల్ ఇన్స్టబులుటి (Sudden cardiac electrical instability) సార్ అంటే గుండె స్పందనలను నియంత్రించే విద్యుత్ సంకేతాలు ఒక్కసారిగా అస్థిరంగా మారడం.
దాంతో సివియర్ అరిథ్మియా (severe arrhythmia) అంటే గుండె లయ పూర్తిగా తప్పిపోవడం
ఆ తరువాత సడన్ కార్డియాక్ అరెస్ట్ (sudden cardiac arrest)
సమర్జిత్ మౌనంగా వింటున్నాడు.
ఏ.సీ.పి అజయ్ : కాని డాక్టర్ ఇద్దరికీ గతంలొ గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేవు.
డా.సమర్జిత్ నెమ్మదిగా నమూనాలని లైట్ వెలుతురుకి ఎదురుగా పెట్టి చూస్తూ
డా. సమర్జిత్ సేన్ : గుండెని ఆపడానికి కొన్నిసార్లు గుండెని తాకాల్సిన అవసరం ఉండదు. మెదడుకు సంబంధించిన నాడి వ్యవస్తకి ఒక్క తప్పుడు సంకేతం పంపితె చాలు.
ల్యాబ్ లో నమూనాలతంటిని పరీక్ష చేసిన తర్వాత
డా. సమర్జిత్ సేన్ : ఈ నమూనాలలో ఏదో అసాధారణం ఉంది.
సాగర్ వర్మ : ఎదైన విషమా..?
డా. సమర్జిత్ సేన్ అవును అన్నట్టు తల ఊపుతాడు. కాని సాధారణ అర్థంలో కాదు.
అతను రిపోర్ట్సుని మరోసారి చూస్తాడు.
డా. సమర్జిత్ సేన్ : ఇది నేరుగా శరీరాన్ని కాల్చే లేదా కణజాలాన్ని నాశనం చేసే పదార్థంలా కనిపించడం లేదు. కానీ నాడీ వ్యవస్థను అసహజంగా ఉత్తేజపరిచే లక్షణాలు ఉన్నాయి.
తర్వాత ఘోస్ట్ పెప్పర్ నమూనాను(Ghost Pepper sample) తీసుకుని చూస్తాడు.
డా. సమర్జిత్ సేన్ : ఈ అస్సాం మిరప పొడి తీవ్రత సహజమె. కానీ దాని వెనుక ఇంకేదో పొర దాగి ఉన్నట్టు అనిపిస్తోంది.
సాగర్ వర్మ : ఏ రకం పదార్థం?
డా. సమర్జిత్ కొద్దిసేపు మౌనంగా ఉంటాడు.
డా. సమర్జిత్ సేన్ : ఖచ్చితంగా చెప్పలేను.కాని ఇది సాధారణ స్ట్రీట్ నార్కొటిక్స్ కేటగిరి అంటె వీధిలొ అమ్మె మాధకద్రవ్యాల వర్గానికి చెందిందని అనిపించడం లేదు.
సాగర్ వర్మ : మరి ఎలాంటి కేటగిరికి చెందుడచ్చు.?
డా.సమర్జిత్ సేన్ : ఇలాంటి న్యూరొ యాక్టివ్ ప్రోఫైల్స్ గురించి నేను చాలా సంవత్సరాల క్రితం కొన్ని ఫీల్డ్ రిపోర్ట్సులో చదివాను.
సాగర్ వర్మ : ఎలాంటివి సార్..?
డా.సమర్జిత్ సేన్ : ఈశాన్య రాష్ట్రాలలొ. అక్కడున్న అటవి ప్రాంతాలలొ కొన్ని అరుదైన వృక్ష పదార్థాలు, పాషాణ ఆధారిత మిశ్రమాలను అక్కడి గిరిజనులు సంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు. అవి చాలా చిన్న మోతాదులో వాడితె ఔషధం అదె ఎక్కువైతే నాడీ వ్యవస్థపై ప్రమాదకర ప్రభావం.
సాగార్ వర్మ : అంటె ఇలాంటివి ఈశాన్య రాష్ట్రాల గిరిజనులు వాడతారా..?
డా. సమర్జిత్ సేన్ : వాడతారు కానీ ఇలా కాదు. ఎందుకంటె ఇది సంప్రదాయ గిరిజనుల తయారీలా లేదు. ఎవరో ఆధునిక పద్ధతిలో శుద్ధి చేసినట్టు ఉంది.
సాగర్ వర్మ : ఎలాంటి పదార్ధం అయ్యుండచ్చొ నిర్ధారించగలరా డాక్టర్.?
డా. సమర్జిత్ సేన్ : నేను పూర్తిగా నిర్ధారించలేను. కానీ ఇది వృక్షాల నుంచి వచ్చే క్షారసదృషాలకు (alkaloids) మరియు కృత్రిమ ఉద్దీపన చేసిన పదార్థానికి మధ్యలో ఉన్న ఏదో మార్పు చేసిన సంయోగ పదార్థం అయి ఉండచ్చు.
సాగర్ వర్మ : అంటే మీకు ఇది ఏ పదార్థమో తెలుసా?
డా. సమర్జిత్ సేన్ కాసేపు మౌనంగా ఉండి. రిపోర్టుని చూస్తూ
డా. సమర్జిత్ సేన్ : తెలిసినట్టే ఉంది. కానీ నేను ఇంతకుముందు ఫారెన్సిక్ కేసులలో దీన్ని చూడలేదు.
డా.సమర్జిత్ సేన్ చూపు ఇంకా report మీదే ఉంది.
డా. సమర్జిత్ సేన్ : ఈ కేసును చూస్తుంటె నాకు చాలా సంవత్సరాల క్రితం నేను చూసిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది.
సాగర్ వర్మ : ఎలాంటి సంఘటన ?
అని సాగర్ వర్మ ఆసక్తిగా అడిగాడు.
డా. సమర్జిత్ కుర్చీలో కూర్చొని వెనక్కి ఆనుకున్నాక.
డా. సమర్జీత్ సేన్ : సుమారు ముప్పైఐదు (35) సంవత్సరాల క్రితం నేను ఫీల్డ్ స్టడీ కోసమని ఈశాన్య రాష్ట్రాలలోని అటవి ప్రాంతాలను అక్కడున్న గిరిజనులను సందర్శించడానికి వెళ్ళాను. అలా నేను అక్కడున్న గిరిజన గ్రామాలు తిరిగతూ అక్కడి గిరిజనులు అడవిలో దొరికే వృక్షాలు, మూలికలను ఎలా వైద్యంలో ఉపయోగిస్తారో అధ్యయనం చేస్తూన్నాను. ఒక్కొక్క ఊరూ గ్రామం దాటుకుంటూ చివరికి నాగాలాండ్ రాష్ట్రంలోని లోంగ్వా గ్రామానికి చేరుకున్నాను. అది మన భారత దేశానికి మరియు మయన్మార్ దేశానికి సరిహద్దు గ్రామం . అక్కడ కోన్యాక్ తెగకు చెందిన గిరిజనలు నివసిస్తున్నారు. ఆ గ్రామ పెద్దతొ పరిచయం పెంచుకొని అక్కడ ఉన్న వైద్యుల దగ్గర కొన్ని వారాలు గడిపాను...
ల్యాబ్‌లో నిశ్శబ్దం అలుముకుంది.
డా. సమర్జిత్ చెప్పింది అందరు శ్రద్దంగా వింటున్నారు.
డా. సమర్జిత్ సేన్ : ఒక రోజు ఆ గ్రామంలోనీ వ్యక్తి ఒకరు అకస్మాత్తుగా ఛాతి పట్టకొని కుప్పకూలిపోయాడు. అతని శ్వాస చాలా మందగించింది. స్పృహ కూడా కోల్పోయాడు. అక్కడున్నవాళ్లందరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఏ.సీ.పి అజయ్ : తర్వాత?
డా. సమర్జిత్ సేన్ : అక్కడున్న వృద్ధ వైద్యుడు వెంటనే అడవిలో దొరికే కొన్ని మూలికలతో తయారుచేసిన ద్రావణాన్ని తీసుకొచ్చాడు. దానిలో కొంత భాగాన్ని అతని ముక్కు దగ్గర ఉంచాడు. ఇంకొంత ద్రావణాన్ని వేడి రాళ్లపై చల్లి వచ్చిన పొగను అతను పీల్చేలా చేశారు.
డా.ప్రేరణ : అది పనిచేసిందా?
డా. సమర్జిత్ సేన్ అవును అన్నట్టు నెమ్మదిగా తల ఊపాడు.
డా. సమర్జిత్ సేన్ : కొన్ని నిమిషాల తర్వాత అతని శ్వాస క్రమంగా సర్దుకుంది. కళ్ళు తెరిచాడు. తర్వాత లేచి నెమ్మదిగా కూర్చున్నాడు.
సాగర్ వర్మ ఆశ్చర్యంగా చూశాడు.
సాగర్ వర్మ : అంటే ఆ మూలిక గుండెను మళ్ళి సాధారణ స్థితికి తీసుకువచ్చిందా?
డా. సమర్జిత్ సేన్ : అలా నేను ఖచ్చితంగా చెప్పలేను.
డా. సమర్జిత్ సేన్ కాసేపు ఆలోచించి అన్నాడు.
డా. సమర్జిత్ సేన్ : కానీ ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా అనిపించింది. వాళ్లు గుండెను నేరుగా ప్రభావితం చేయడం లేదు. గుండెను నియంత్రించే నాడీ వ్యవస్థపై పని చేస్తున్నారు.
ల్యాబ్‌లో మళ్లీ నిశ్శబ్దం నెలకొంది.
డా. సమర్జిత్ సేన్ తన ముందున్న ENO ప్యాకెట్ రిపోర్టు మరియు ఘోస్ట్ పెప్పర్ నమూనాల రిపోర్ట్సు వైపు చూశాడు.
డా. సమర్జిత్ సేన్ : ఆ రోజు నేను చూసింది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగించిన జ్ఞానం.
అతని స్వరం మరింత గంభీరంగా మారింది.
డా. సమర్జిత్ సేన్ : కానీ ఇక్కడ...
అతను రిపోర్టు పై వేలితో మెల్లగా తడుతూ
డా. సమర్జిత్ సేన్ : ఇక్కడ ఎవరో అదే సూత్రాన్ని పూర్తిగా వ్యతిరేక దిశలో ఉపయోగించినట్టు అనిపిస్తోంది.
కొన్ని క్షణాలు ఆగి మళ్లీ అన్నాడు
డా. సమర్జిత్ సేన్ : ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
ఏ.సీ.పి అజయ్ : ఏంటి?
డా. సమర్జిత్ సేన్ ఈ పదార్థాన్ని తయారు చేసిన వ్యక్తికి నాడీ వ్యవస్థ గురించి అవగాహన ఉంది. గుండె లయ ఎలా పనిచేస్తుందో తెలుసు. ఇంకా ఫారెన్సిక్ టాక్సికాలజి గురించి కూడా తెలుసు.
సాగర్ వర్మ నిశ్శబ్దంగా దేవేంద్ర రెడ్డి మరియు సూర్య నారాయణ ఫైల్సు వైపు చూశాడు.
ఇప్పుడు అతని మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే తిరుగుతోంది.
ఇలాంటి పదార్ధాన్నీ తయ్యారు చేసిన ఆ వ్యక్తి "ఎవరు...?"