Part - 10
సమయం - సాయంత్రం 5:15
నిత్యం రద్దీగా ఉండె విజయవాడ బెంజ్ సర్కిల్
అక్కడున్న పబ్లిక్ లైబ్రేరి (Public library) కి ఎదురుగా అవతల వైపు రొడ్డు ప్రక్కన ఒక 25 ఏళ్ళ అమ్మాయి నించొని ఉంది.
తన మొఖంలొ కంగారు.
కళ్ళల్లొ ఎవరు కోసం ఎదురు చూపులు.
బ్యాగులొంచి తన మొబైల్ తీసి "ఎక్కడున్నావు..?" అని ఎవరికొ మెసేజ్ చేసింది.
1 నిమిషం తరువాత "ట్రాఫిక్కులొ ఇరుక్కుపోయా దగ్గర్లొనె ఉన్నాను" అని తిరిగి ఆ అమ్మాయి మొబైల్ కి మెసేజ్ వచ్చింది.
అది చూసి ఆ అమ్మాయి తన మొబైల్ ని బ్యాగులొ పెట్టి పబ్లిక్ లైబ్రేరి (Public library) వైపు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా అనుకోకుండా ఒక టెంపొ ఆటో వేగంగా వచ్చి ఈమెన గుద్దింది. దాంతొ ఆ అమ్మాయి 7 అడుగుల ఎత్తుకు ఎగిరి కొంచెం దూరంగా రోడ్డుపై పడింది.
ఆ టెంపొ ఆటో నడిపిన వ్యక్తి మద్యం మత్తులొ ఉన్నాడు.
రోడ్డు పై ఉన్న జనాలందరు ఆ అమ్మాయి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి తనని చూశారు . తను స్పృహ కోల్పోయింది. తల మీద నుంచి తీవ్ర రక్త స్రావం. పెద్ద దెబ్బె తగిలింది తలకి
కాళ్ళు, చేతులుపై తీవ్రమైన గాయలు. ఒళ్ళంత రక్తంతొ అచేతనంగా రోడ్డుపై పడి ఉన్న ఆమెను చూసి అక్కడున్న జనాలలొ కొంత అంబులెన్సుకి కాల్ చేశారు. అప్పుడె అక్కడున్న పోలీసులు వచ్చారు.
ఎస్. ఐ : అంబులెన్సు కోసం చూస్తె ఈ అమ్మాయి ప్రాణాలు పోయెలా ఉన్నాయి. కానిస్టెబుల్స్ వెంటనె ఈ అమ్మాయిని మన పోలీసు వాహనంలోకి ఎక్కించండి.
కానిస్టేబుల్స్ : అలాగె సార్
అలా ఆ నలుగురు పోలీసులు కలిసి ఆ అమ్మాయిని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. రక్తం ఎక్కువ పోకుండా గాయాలున్న చోట్లల్లొ గుడ్డలు చుట్టారు.
అలా వాళ్ళు ఆ అమ్మాయిని ఎక్కించుకొని దగ్గర్లొ ఉన్న హాస్పెటల్ కి బయలుదేరారు.
బండి వెనుక భాగంలొ ఆ అమ్మాయి పొడుకొని ఉంది. ఆమె ప్రక్కన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు పేరు అసద్ .
మద్య భాగంలొ మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారు. ఒకరి పేరు నవీన్ ఇంకొకరి పేరు జగన్.
ముందు భాగంలో డ్రైవర్ ప్రక్క సీటులొ ఎస్.ఐ మురళి కూర్చున్నాడు.
దారిలొ ఉండగానె ఆ అమ్మాయి ప్రక్కనున్న కానిస్టేబుల్ అసద్ నెమ్మదిగా లేచి తన వద్దకు వచ్చాడు. ఆ అమ్మాయి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఇంకా ఊపిరి ఉంది.
తరువాత అసద్ తన చేతులతొ ఆ అమ్మాయి ముక్కును, నోరును మూసేశాడు.
స్పృహ లేకపోవడంతొ ఆ అమ్మాయి ప్రతిఘటించ లేకపోయింది
ముందునున్న వాళ్ళు వెనక ఏం జరుగుతుందొ పట్టించుకోలేదు.
కాసేపటికి ఆ అమ్మాయి ఊపిరి ఆగిపోయింది. తరువాత నెమ్మదిగా అసద్ యధావిదిగా వెనక్కి వచ్చి కూర్చున్నాడు.
కాసేపటికి హాస్పెటల్ కి చేరుకున్నారు. కానిస్టేబుల్సు ఆమెను వాహనం నుంచి దింపి స్ట్రెట్చర్ మీద పడుకోబట్టి హాస్పటల్ లోపలికి తీసుకెళ్ళారు. లోపల డాక్టర్ ని పిలవమని చెప్పారు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఆ అమ్మాయిని పరీక్షించి చూసి తను చనిపోయింది అని నిర్ధారించాడు.
ఎస్.ఐ మురళి మరియు ముగ్గురు కానిస్టేబుల్స్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
ఎస్.ఐ మురళి : తను వివరాలు ఏంటి..?
అని కానిస్టేబుల్ నవీన్ ని అడుగుతాడు.
కానిస్టేబుల్ నవీన్ : ఈ అమ్మాయి ఆధార్ కార్డు మరియు పనిచేస్తున్న ఐ.డి కార్డు ఈమె బ్యాగులొ చూశాను సార్. వాటి ప్రకారం తన పేరు శ్వేత వయసు 25 ఏళ్ళు. ఈమె ఒక ఎం.బి.బీ.ఎస్ డాక్టర్ సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్ అనె సంస్థలొ జూనియర్ డాక్టర్ గా పనిచేస్తుంది.
ఎస్. ఐ మురళి : సరె వెంటనె ఈమెకు సంబంధించిన వాళ్ళకి విషయం చెప్పి ఇక్కడికి పిలవండి.
కానిస్టేబుల్ నవీన్ : అలాగె సార్.
అని చెప్పి ముగ్గురు కానిస్టేబుల్సు బయటకు వెళ్తూ.
కానిస్టేబుల్ జగన్ : ఏరా నవీన్ ఆ అమ్మాయి బ్యాగులొ డాక్యుమెంట్లేమి దొరకలేదా.?
కానిస్టేబుల్ నవీన్ : లేదు రా..
కానిస్టేబుల్ జగన్ : నువ్వు రా అసద్..?
కానిస్టేబుల్ అసద్ : ఆ అమ్మాయిని తనిఖి చేశా నాకేం కనిపించలేదు. తరువాత పని కానిచ్చి కూర్చున్న..
వీళ్ళు వెళ్ళాక ఎస్.ఐ మురళి తన మొబైల్ బయటకు తీసి. ఎవరికొ మెసేజ్ చేస్తున్నాడు.
"తను చనిపోయింది కాని డాక్యుమెంట్స్ దొరకలేదు". (She was dead but documents missing) అని ఇంగ్లీషులొ మెసేజ్ చేశాడు.
------------------------------------------------------------------------
సమయం - సాయంత్రం 7:15
కృష్ణానది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. దానిపై రంగుల వెలుగులలొ ప్రకాశం బ్యారేజి మెరిసిపోతోంది.
అక్కడ జనసంచారం తక్కువగా ఉన్న చోట ఒక ప్రక్కకి నల్లటి SUV కార్ పార్క్ చేసి ఉంది.
ఆ నల్లటి కారు పక్కన ఆనుకుని నిలబడ్డాడు సాగర్ వర్మ.
కృష్ణా నదిని చూస్తూ సిగిరెట్ కాలుస్తున్నాడు
అతని మెదడులొ ఇంకా కార్డియాలజిస్ట్ డా. గోపాల్ చెప్పిన మాటలు తిరుగుతున్నాయి.
"డా. గోపాల్ : మాధక ద్రవ్యాల ఉత్పత్తిదారులు ఇలాంటి ప్రత్యేకమైన పదార్ధాలను తయ్యారు చెయ్యగలరు."
అలాగె నిన్న ఫారెన్సిక్ ల్యాబ్ లొ డా. సమర్జిత్ సేన్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి.
"డా. సమర్జిత్ సేన్ : ఇది సహజంగా లభించే పదార్థానికి మార్పులు చేసిన సంయోగం పదార్ధం అయ్యుండచ్చని నా అంచనా."
ఇలా సాగర్ వర్మ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు అక్కడికి బైక్ పై ఏ.సీ.పి అజయ్ వచ్చాడు.
ఏ.సీ.పి అజయ్ : గుడ్ ఈవినింగ్ సార్...
సాగర్ వర్మ : గుడ్ ఈవినింగ్ Mr.అజయ్.
కొన్ని క్షణాలు ఇద్దరూ నదివైపు చూస్తూ నిలబడ్డారు.
సాగర్ వర్మ : సిగిరెట్...?
అని సిగిరెట్ ప్యాకెట్ చూపిస్తూ అజయ్ కి సిగిరెట్ ఆఫర్ చేశాడు. అజయ్ అందులోంచి ఒక సిగిరెట్ తీసుకొని నోట్లొ పెట్టుకొని వెలిగించాడు.
సాగర్ వర్మ : మన వాళ్ళు ఎక్కడ వరకు వచ్చారు..?
ఏ.సీ.పి అజయ్ : ఇంకొ పది నిమిషాలు సార్ దారిలొనె ఉన్నారు
కాసేపటికి రెండు బైకులు అక్కడికి వచ్చి ఆగాయి.
ఒక బైకు మీద నుంచి సీ.ఐ ప్రవీణ్ దిగితె. ఇంకొ బైక్ మీద నుంచి ఎస్. ఐ. సుందర్ మరియు ఎస్.ఐ జాన్ బాబు దిగారు.
వాళ్ల చేతుల్లో ఏవొ ఫైల్సు, ప్రింటౌట్లు మరియు ఒక టాబ్లేట్ (TAB or Tablet) ఉన్నాయి. అందరూ కారు చుట్టూ చేరారు.
ఏ.సీ.పి అర్జున్ : ఎంత వరకు వచ్చింది పని..?
ఎస్. ఐ సుందర్ : సార్ మీరు చెప్పినట్టె అరవింద్ ని మరియు తనకు డ్రగ్స్ సప్లై చేసె వాళ్ళని విచారించాం. వాళ్ళు కొన్ని వివరాలిచ్చారు.
ఎస్. ఐ జాన్ బాబు : వాళ్ళిచ్చిన వివరాలు బట్టి మాత్రమె కాకుండా వాళ్ళ కాల్ డేటా మరియు సెల్ఫోన్ లోకేషన్స్ ఆధారంగా కూడా మొత్తం ఎంక్వైరి చేసి కొన్ని ఆధారాలను సేకరించాం.
సాగర్ వర్మ : ఏంటవి...?
సీ.ఐ ప్రవీణ్ తన చేతిలొ ఉన్న టాబ్ తీసి ఆన్ చేశాడు.
సీ.ఐ ప్రవీణ్ : సార్ అరవింద్ తాలుకు గత ఎనిమిది నెలల కదలికలని పూర్తిగా ట్రేస్ చేశాం.
టాబ్ స్క్రీన్ మీద మ్యేప్ చూపిస్తూ.
సీ.ఐ ప్రవీణ్ : తను తరుచుగా విజయవాడ నుంచి కోల్కత్తా వెళుతుంటాడు. తరువాత అక్కడ నుంచి "సిలిగురి"
"మాల్దా"
"పూర్ణియా"
"కతిహార్ " ఇలా పశ్చిమ బెంగాల్లోని ఈ నగరాలకు తరుచుగా వెళ్ళెవాడు.
సాగర్ వర్మ మాట్లాడకుండా మ్యేప్ ని గమనిస్తున్నాడు. తరువాత ఎస్.ఐ సుందర్ ముందుకు వచ్చి
ఎస్.ఐ సుందర్ : సార్ ఈ పర్యటనలన్నీ దేవేంద్ర రెడ్డి మరణానికి ముందు జరిగాయి తరువాత కూడా జరిగాయి. అంతే కాదు సూర్యనారాయణ మరణానికి ముందు అంటె మనం అరవింద్ ని అరెస్ట్ చేయడానికంటె ముందు కూడా జరిగాయి.
ఏ.సీ.పి అజయ్ తన కనుబొమ్మలను ముడిచాడు.
ఏ.సీ.పి అజయ్ : వ్యాపారానికి సంబంధించా?
ఎస.ఐ సుందర్ : లేదు సార్
ఏ.సీ.పి అజయ్ : ఎవైనా ఆధారాలు ఉన్నాయా?
జాన్ బాబు రిపోర్ట్సును ముందుకు జరిపాడు.
ఎస్.ఐ జాన్ బాబు : సార్ అరవింద్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా నేరుగా వెళ్లలేదు. అయితే డబ్బు వెళ్లినట్టు స్పష్టమైన మాత్రం ఆధారాలు ఉన్నాయి.
సాగర్ వర్మ : ఎలా..?
ఎస్.ఐ. జాన్ బాబు: నగదు లావాదేవీలు ఎప్పుడు మూడు విధాలుగా జరిగాయి.
1) క్యాష్ డిపాజిట్స్ (Cash deposits):
ఇప్పుడు విజయవాడలొ ఉన్న అరవింద్ ఒక లక్ష రూపాయలు నగదు రూపంలొ ఒకడికి ఇచ్చాడనుకోండి. కొన్ని రోజులు తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా నగరంలొ ఎవరో ఆ డబ్బుని అరవింద్ బ్యాంక్ అకౌంట్లొకి జమ చేస్తాడు. దీని వల్ల ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందొ ట్రేస్ చేయడం కష్టం.
2) లేయిర్డ్ ట్రాన్సాక్షన్స్ (Layered transactions):
డబ్బుని రెండు మూడు అకౌంట్ల మద్యలొ తిప్పి చివరికి మరో అకౌంటుకి పంపిస్తారు. దీని వల్ల పోలీసులు చివరిగా డబ్బును పంపించిన అకౌంటుని చూసినప్పుడు అసలు డబ్బు అరవింద్ దగ్గర నుంచి వచ్చిందని వెంటనే గుర్తించలేరు. దీనినే లేయిరింగ్ (layering) అంటారు.
3) దర్డ్ పార్టి అకౌంట్స్ (Third party accounts):
నగదు లావాదేవీలకు ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్సు అన్నీ చాలా వరకు దర్డ్ పార్టి అకౌంట్స్ (Third party accounts) అంటె మూడొ వ్యక్తులు బ్యాంకు ఖాతాలు అనమాట.
ఏ.సీ.పి అజయ్ : అంటే ఆరవింద్ తన పేరు మాత్రమె కాకుండా ఆ డ్రగ్స్ తయ్యారు చేసె అవతలి వ్పక్తి పేరు కూడా బయటపడకుండా ఆర్ధిక లావాదేవీలని దాచిపెట్టాడనమాట.
సాగర్ వర్మ : కాల్ రికార్డ్స్ (Call records)..?
సీ.ఐ ప్రవీణ్ వెంటనే సమాధానం ఇచ్చాడు.
సీ.ఐ ప్రవీణ్ : అసక్తికర విషయం అక్కడే ఉంది సార్
సాగర్ వర్మ : ఏంటది...?
సీ.ఐ ప్రవీణ్ : అరవింద్ వెళ్ళిన ప్రతి ట్రిప్ లో ఒక కామన్ కాంటాక్ట్ ఉంది.
టాబ్ మీద ఒక నంబర్ డిస్ప్లే అయింది.
సీ.ఐ ప్రవీణ్ : పేరు లేదు, అడ్రస్ లేదు, KYC వివరాలు కూడా ఫేక్. పైగా ఆ నంబర్ గల వ్యక్తితొ అరవింద్ ఫోన్ లొ మాట్లాడడం తప్ప ఎప్పుడు నేరుగా కలవలేదు.
సాగర్ వర్మ : ఈ నంబర్ కి ఎన్ని సార్లు అరవింద్ కాంటాక్ట్ చేశాడు?
సీ.ఐ ప్రవీణ్ : ముప్పై నాలుగు సార్లు సార్
ఏ.సీ.పి అజయ్ ఆశ్చర్యపోయాడు.
ఏ.సీ.పి అజయ్ : ఒకే నంబర్ కి?
సీ.ఐ. ప్రవీణ్ : అవును సార్
సాగర్ వర్మ రిపోర్టు తీసుకుని చదువుతున్నాడు.
సాగర్ వర్మ : లోకేషన్ (Location)..?
సీ.ఐ ప్రవీణ్ : ఒక చోట ఫిక్సడ్ కాదు సార్. మారుతూ ఉంది. కానీ సెల్ టవర్ అనాలసిస్ (cell tower analysis) ప్రకారం ఎక్కువసార్లు సిలిగురి, మాల్దా బెల్టులో యాక్టీవ్ గా ఉంది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
కృష్ణానది మీదుగా గాలి వీచింది.
సాగర్ వర్మ : డా. గోపాల్ ఒక విషయం చెప్పారు.
అందరూ అతని వైపు చూశారు.
సాగర్ వర్మ : ఇలాంటి పదార్ధం (compound) తయారు చేయడానికి రసాయన శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలని. అంతె కాకుండా డా. సమర్జిత్ సేన్ మరో విషయం చెప్పారు. ఇది సహసిద్ద పదార్ధం (natural substance) ని మార్పులు చేసి తయారు చేసి ఉండవచ్చు అని
సాగర్ వర్మ రిపోర్ట్ మూసేశాడు.
సాగర్ వర్మ : అంటే మనం వీధిస్థాయి విక్రేతలను (street peddlers) కాదు...
కొద్దిసేపు ఆగాడు.
సాగర్ వర్మ : వాళ్ల వెనుక ఉన్న నెట్వర్కని వెతకాలి.
ఏ.సీ.పి అజయ్ : ఆయితె ఇప్పుడు ఏం చేద్దాం సార్
సాగర్ వెంటనే సమాధానం ఇచ్చాడు.
సాగర్ వర్మ : ఈ నంబర్ ఎవరిదొ కనుక్కోండి. తరువాత అరవింద్ ఆయా నగరాల్లో ఎవరెవిరిని కలిశాడో తెలుసుకోండి.
"హోటల్స్"
"సీ.సీ.టీ.వి."
"రైల్వే బుకింగ్స్."
"ఫ్లైట్ రికార్డ్స్"
ఇలా అన్నీ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించండి.
అని చెప్పి సాగర్ వర్మ చివరిసారిగా కృష్ణానది వైపు చూశాడు.
సాగర్ వర్మ : దేవేంద్ర రెడ్డి మరియు సూర్య నారాయణుల మరణాల కారణం ఒకే పదార్థం.
అతని స్వరం గంభీరంగా మారింది.
సాగర్ వర్మ : ఆ పదార్థం ఎక్కడ తయారైందో కనుక్కుంటే. హంతకుడు ఎంత దూరంలో ఉన్నాడో కూడా తెలుస్తుంది.
నలుగురు అధికారులు ఒకరినొకరు చూసుకున్నారు.
దర్యాప్తు (Investigation) ఇప్పుడు కొత్త దిశలోకి వెళ్లబోతోందని అందరికీ అర్థమైంది.
ఎస్.ఐ సుందర్ టాబ్ లో మ్యాప్ ని మళ్ళి ఓపెన్ చేశాడు.
ఎస్.ఐ సుందర్ : సార్ ఇంకో విషయం.
సాగర్ అతని వైపు చూశాడు.
సాగర్ వర్మ : చెప్పండి.
ఎస్.ఐ సుందర్ : సార్ అరవింద్ వెళ్ళిన నగరాలు యాదృచ్ఛికంగా ఎంపిక చేసినట్టుగా కనిపించడం లేదు.
టాబ్ స్క్రీన్ మీద తూర్పూ భారత దేశం యొక్క మ్యాప్ కనిపించింది.
ఎస్. ఐ సుందర్ :
"సిలిగురి (Siliguri)"
"మాల్దా (Malda)"
"కతిహార్ (Katihar)"
"పూర్ణియా (Purnia)"
ఇవి అన్నీ ఒకే కారిడార్ లోకి వస్తాయి సార్
ఏ.సీ.పి అజయ్ : అయితె దాని ప్రత్యేకత ఏంటి?
ఎస్. ఐ సుందర్ : అధికారికంగా చూస్తే ఇవి వాణిజ్య కేంద్రాలు (commercial towns). కానీ నార్కొటిక్స్ బ్యూరొ (Narcotics Bureau) రిపోర్ట్స్ ప్రకారం.
అతను ఫైల్ తిప్పాడు.
ఎస్. ఐ సుందర్ : ఈ బెల్ట్ చాలా సంవత్సరాలుగా అక్రమ మాధకద్రవ్యాల కదలికల రిత్యా సున్నితమైన కారిడార్ గా దీన్నీ పరిగణిస్తారు
సీ.ఐ ప్రవీణ్ : మయన్మార్ వైపు నుంచి వచ్చే అక్రమంగా రవాణా అయ్యె సరుకులు(illegal consignments). బాంగ్లాదేశ్ దారి నుంచి వచ్చే సరకు రావాణాలు (consignments). అన్నీ కూడా చివరికి భారత ప్రధాన భూబాగంలోకి ఈ నగారు ద్వారా అనేక మద్యవర్తుల వ్యవస్త (intermediary networks) ని ఉపయోగించి ప్రవేశిస్తాయి.
ఏ.సీ.పి అజయ్ : అంటే ఇది చిన్నస్థాయి డ్రగ్స్ అమ్మకాల వ్యవహారం కాదనమాట...
ఎవరూ వెంటనే సమాధానం చెప్పలేదు.
ఎస్.ఐ జాన్ బాబు మరో డాక్యుమెంట్ తీసి చూపించాడు.
ఎస్.ఐ జాన్ బాబు : సార్ అరవింద్ కలిసిన వ్యక్తులలో ఇద్దరు ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరొ (Narcotics Control Bureau) వెతుకుతున్న వాళ్ళలో ఉన్నారు.
సాగర్ కనుబొమ్మలు ముడిచాడు.
సాగర్ వర్మ : వాళ్ళపై ఉన్న చార్జేస్ ఏంటి?
ఎస్.ఐ జాన్ బాబు : నేరుగా డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు లేవు సార్
సాగర్ వర్మ : మరి...?
ఎస్.ఐ జాన్ బాబు : సరుకు రవాణా, నిల్వ, పంపిణీ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించినందుకు వీళ్ళపై కేసులు నమోదయ్యి ఉన్నాయి సార్.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
ఏ.సీ.పి అజయ్ : అంటే మనం ఊహించిన దానికంటే ఇది పెద్ద వ్యవస్తె అనమాట.
సాగర్ వెంటనే సమాధానం ఇవ్వలేదు. అతను కృష్ణానది వైపు చూస్తూనే ఉన్నాడు.
తర్వాత మెల్లగా
సాగర్ వర్మ : కాదు...
అందరూ ఆశ్చర్యంగా చూశారు.
ఏ.సీ.పి అజయ్ : ఏం సార్..?
సాగర్ వర్మ : ఇప్పుడే ఎవరు నిర్దారణలకు వెళ్ళద్దు. డ్రగ్ నెట్వర్క్ కనిపించింది కాబట్టి హత్యల తాలుకు ఉద్దేష్యం కూడా అదే అనుకోవద్దు.
సీ.ఐ ప్రవీణ్ : అర్ధమైంది సార్.
సాగర్ రిపోర్ట్ మూసేశాడు.
సాగర్ వర్మ : ప్రస్తుతం మనకు కావాల్సింది ఒక్కటే. అరవింద్ ఎవరిని కలిశాడు? ఏం తెచ్చుకున్నాడు? వీటి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు....?