Read Yevaru..? - 17 by Suresh Josyabhatla in Telugu Crime stories | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 16

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ప్రణయ గీతిక - 4

    ప్రభా   గొర్రెల కాపరి పిలవడంతో గొర్రె కి నాటు వైద్యం చేసిన వ...

  • ఎవరు....? - 17

    Part - 17సమయం : రాత్రి 8:40 గంటలువిజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆఫ...

  • వెంటాడే నీడలు - 15

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ప్రణయ గీతిక - 3

    మొదటిరోజు ట్రైనింగ్ కోసం  ఆసుపత్రికి వచ్చిన ప్రభా గోవిందులు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఎవరు....? - 17

Part - 17

సమయం : రాత్రి 8:40 గంటలు
విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆఫీసు

ఏ.సి.పి అజయ్ టేబుల్‌పై ఉన్న పాత ఫోటోను ఆ వ్యక్తి ముందుకు నెమ్మదిగా జరిపాడు.

ఆ వ్యక్తి చూపు ఆ ఫోటోపై పడిన మరుక్షణమే...
అతని ముఖంలోని రంగులు మారిపోయాయి.
అతని చేతులు స్వల్పంగా వణికాయి.

అజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అతని ముఖంలోని ప్రతి హావభావాన్ని గమనిస్తున్నాడు.

కొన్ని క్షణాల నిశ్శబ్దం...

చివరకు...

ఏ.సి.పి అజయ్ : ఈ ఫోటోలో ఉన్న వాళ్లలో ఎవరెవరు మీకు తెలుసా మొహన్ గారు....? 

ఆ వ్యక్తి గొంతు ఎండిపోయినట్టుగా అనిపించింది.
ముందు నీళ్ల గ్లాస్ తీసుకొని ఒక గుక్క తాగాడు.
మళ్లీ ఫోటో వైపు చూసాడు.

మోహన్ : డాక్టర్ మాధవ్ గారు...
డాక్టర్ రాఘవరావు గారు...
ఈయన డాక్టర్ అనిరుధ్ సేన్...
మిగతా వాళ్లు అప్పటి క్యాంప్ స్టాఫ్ సార్..."

అజయ్ తల ఊపాడు.

ఏ.సి.పి అజయ్ : ఈ ఫోటో ఎప్పుడు ఎక్కడ తీసారో మీకు గుర్తుందా...?

మోహన్ కొద్దిసేపు ఆలోచించాడు. వెంటనే గుర్తుపడతాడు.

మోహన్: ఈ ఫోటో 1995 జూన్ నెల అనుకుంటా తెది సరిగ్గ గుర్తులేదు గాని.. లాంగ్వే గ్రామంలో తీసింది సార్.

అజయ్ వెంటనే ఆసక్తిగా చూస్తాడు.

ఏ.సీ.పి అజయ్ : లాంగ్వే...?

మోహన్: నాగాలాండ్-మయన్మార్ సరిహద్దులో ఉండే చిన్న గిరిజన గ్రామం సార్. 1995లో అక్కడ పెద్ద మెడికల్ క్యాంప్ జరిగింది. దాదాపు నెలరోజులు అక్కడే ఉన్నాం.

ఏ.సీ.పీ అజయ్ : మీరు ఎప్పటి నుంచి సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్ లొ డ్రైవర్ గా పనిచేస్తున్నారు.?

మోహన్ : 35 ఏళ్ళ నుండి. నాకు 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అక్కడ చేరాను. అప్పటికె సంజీవిని ఫౌండేషన్ మొదలై 2 ఏళ్ళు అవుతుంది. 

ఏ.సీ.పీ అజయ్ : అంటె అక్కడున్న వాళ్ళందరి గురించి మీకు బాగా తెలిసె ఉండాలె...?

మోహన్ : అవునండి..

ఏ.సీ.పి అజయ్ : అయితె ఈ ఫొటోలొ డా. రాఘవరావు గారి ప్రక్కన చెయ్యి పట్టుకొని నించున్న ఈ పిల్లవాడెవడొ చెప్పగలరా..?

అని అజయ్ ఫొటోలొ సగం మాత్రం కనిపిస్తున్న పిల్లాడిని చూపించి అడుగుతాడు.

మోహన్ : ఈ పిల్లాడా సార్... ? తను డా. మాధవ్ గారి అబ్బాయి అర్జున్. 

ఏ.సీ.పి అజయ్ : మాధవ్ గారి కొడుకు అర్జునా..? మరి ఆయన ప్రక్కన నించొకుండా రాఘవ రావు గారి ప్రక్కన నించున్నాడేం..?

మోహన్ : ఆ... అది ఆ ఫోటో తీసినప్పుడు పెద్ద తలనొప్పి సార్. అర్జున్ అక్కడి నుంచి పరిగెత్తిపోదామని అల్లరి చేస్తున్నాడు. అప్పుడు రాఘవరావు సార్ వాడి చేయి పట్టుకుని ఆపేశారు. అందుకే ఫోటోలో సగమే పడింది. 7 ఏళ్ళ పిల్లాడు కుదురుగా ఉండడు కదా..

అజయ్ మరోసారి ఆ ఫొటోని జాగ్రత్తగా పరిశీలించాడు. నిజంగానె రాఘవ రావు ఎడమ చెయ్యి ఆ పిల్లాడి చేతిని గట్టిగా పట్టుకున్నట్టు కనిపిస్తుంది.

అజయ్ స్వల్పంగా నవ్వాడు.

ఏ.సీ.పి అజయ్ : 7 ఏళ్ళ కొడుకుని తీసుకొని మాధవ్ గారు ఇంత దూరం మెడికల్ క్యాంపులకు తీసుకెళ్ళె వారా..?

మోహన్ : తల్లి లేని పిల్లాడు కద సార్. ఒక్కడినె వదిలేయలేరు. అందుకె ఆయన కూడా తీసుకెళ్ళె వారు...

ఏ.సి.పి అజయ్ : తల్లి లేని పిల్లాడా...? అంటే... మాధవ్ గారి భార్య...?

మోహన్: అవును సార్. అర్జున్ బాబు పుట్టిన నెల రోజులకే ఆవిడ చనిపోయింది.

కొన్ని క్షణాలు...
అజయ్ మళ్లీ ఫోటో వైపు చూశాడు.

ఏ.సీ.పి అజయ్ : OK... ఇంతకి మాధవ్ గారికి రాఘవ రావు మద్య పరిచయం ఎలా ఏర్పడింది...?

మోహన్ : ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణా స్నేహితులు సార్. ఒకె ఊరు. ఇంటర్ వరకు కలిసె చదువుకున్నారు. ఆయన ఆయుర్వేద వైపు పెద్ద పెద్ద డాక్టర్ చదువు చదివితె. రాఘవరావు గారు అలోపతి వైపు డాక్టర్ గా పెద్ద పెద్ద చదువులు చదివారు. 

ఏ.సీ.పి అజయ్ : రాఘవరావు గారు ఆ అర్జున్ తొ ఎలా ఉండేవారు.?

మోహన్: చాలా బాగా ఉండేవారు సార్. పైగా ప్రాణ స్నేహితుడు కొడుకు కదా. ఆ మాత్రం ఆప్యాయత ఉంటుంది.

ఏ.సీ.పి అజయ్: రాఘవరావు గారు పెళ్లి ఎందుకు చేసుకోలేదు...?

మోహన్: ఆయనకి పెళ్లి మీద పెద్ద ఆసక్తి లేదు సార్. ఎప్పుడూ పేదవాళ్లు... వాళ్ల అవసరాల గురించే ఆలోచించేవారు. ఆస్తి బాగా ఉండేది... దాన్నంతా సత్కార్యాలకే ఉపయోగించేవారు.

అజయ్ మౌనంగా తల ఊపాడు.

ఏ.సి.పి అజయ్ : ఈ జూనియర్ డాక్టర్ శ్వేత గురించి చెప్పండి...?

మోహన్ : ఆ అమ్మాయి ఒక అనాధ సార్. దాదాపు 25 ఏళ్ళ క్రితం. రాఘరావు గారు కారులొ వెళుతున్నారు. అప్పుడు ఆ కారును నేనె డ్రైవ్ చేస్తున్న. ఆ సమయంలొ ఒక చోట రోడ్డ ప్రక్కన చాలా మంది జనం గుమిగూడి ఉన్నారు. ఏంటా అని వెళ్ళి చూశాం. అప్పుడు అక్కడ కనిపించిన దృష్యాన్నీ చూసి మా మనసు చలించిపోయంది. 

ఏ.సి.పి అజయ్ : ఏమైంది...?

మోహన్ : షుమారు ఒక 19 ఏళ్ళ అమ్మాయి చనిపోయి ఉంది సార్. ఆ అమ్మాయి శవం ప్రక్కన నిండా సంవత్సరం కూడా నిండని ఒక చంటిపాప గుక్కపెట్టి ఏడుస్తు కనిపంచింది.

ఏ.సి.పి అజయ్ : ఎలా చనిపోయింది ఆ అమ్మాయి..?

మోహన్ : పాపం తిండి లేక ఆకలికి చనిపోయింది సార్.

ఏ.సి.పి అజయ్ : తరువాత..?

మోహన్ : కాసేపటికి పోలీసులు వచ్చి ఆ శవాన్నీ తీశారు. ఆ పాపని ప్రభుత్వ శిశు సంరక్షణా గృహానికి తీసుకెళ్ళారు. రాఘవరావు సార్ ఆ పోలీసుల వెంటె ఉండి. ఆ అమ్మాయి శవపంచనామ అంతా పూర్తి అయ్యాక దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు. 

అజయ్ మరియు ప్రవీణ్ శ్రద్దగా వింటున్నారు.

మోహన్ : తరువాత మోహన్ సార్ ఆ చనిపోయిన అమ్మాయి గురించి పోలీసుల ద్వారా తెలుసుకున్నారు.

ఏ.సి.పి అజయ్ : ఏం తెలిసుకున్నారు...?

మోహన్ : చనిపోపిన ఆ అమ్మయి పేరు ప్రత్యూష.  ఊరు తెనాలి దగ్గర చుండూరూ అనె గ్రామం. 18 ఏళ్ళ వయసులొ ఎవిడినొ ప్రేమించి వాడిని నమ్మి ఇంట్లొ వాళ్ళకి చెప్పకుండా విజయవాడకి వాడితొ పాటు పారిపోయి వచ్చేసింది. వాడు ఈ అమ్మాయిని వాడుకున్నంత కాలం వాడుకున్నాడు. తరువాత బిడ్డ పుట్టాక వదిలేశాడు.

ఏ.సి.పి అజయ్ : తరువాత ...?

మోహన్ : తరువాత పాపం ఆ చంటి బిడ్డని ఎత్తుకొని ఆ అమ్మాయి రొడ్డున పడ్డాది. తిరిగి తన ఊరుకి వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళాలొ తెలియక తెలియని ఊళ్ళొ బిక్కు బిక్కుమంటు బ్రతికింది. ఏ పని దొరక్కా చివరికి బిచ్చమెత్తుకునేది. దొరికిన దాంతొ పాపకి పాలు కొని తాను పస్తులు ఉండేది. పాపం బిడ్డ ఆకలి తీర్చగలిగింది గాని తన ఆకలి తీర్చుకోలేకపోయింది. చివరికి చనిపోయింది.

ఏ.సి.పి అజయ్ : మరి ఆ అమ్మయి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పారా...?

మోహన్ : చెప్పారు సార్. వాళ్ళు చాలా బాధ పడ్డారు. కాని ఆ పసి బిడ్డని మాత్రం తీసుకోలేదు. అది తెలిసి రాఘవరావు సార్ ఆ పాపని తెచ్చి తెలిసిన అనాధ ఆశ్రమంలొ కొన్నీ రోజులు ఉంచారు. తరువాత దత్తత తీసుకుని శ్వేత అని పేరు పెట్టి పెంచారు. 

కాసేపు అంతా నిశబ్దం ....

ఏ.సీ.పి అజయ్ : శ్వేతకి మరియు డా. మాధవ్ గారి అబ్బాయి అర్జున్ కి మద్య సంబంధం ఎలా ఉండేది..?

మోహన్ : ఇద్దరు సొంత అన్న చెల్లెళ్ళలా కలిసి ఉండేవారు సార్. పైగా అర్జున్ గారు శ్వేతమ్మ కంటె 12 ఏళ్ళ పెద్ద కావడంతొ. శ్వేతమ్మ అర్జున్ గారి మాటకి గౌరవం ఇచ్చేది.

ఏ.సి.పి అజయ్ : సరే మరి ఈ మిగిలిన ఇద్దరు జునియర్ డాక్టర్స్ హరీష్ మరియు పద్మ సంగతులు ఏంటి..?

మోహన్ : హరీష్ అక్కడ కాంపౌండర్ గా పని చేస్తున్న కిరణ్ కుమార్ కొడుకు బాగా చదువుతున్నాడు అని రాఘవరావు గారె తనని ఎం.బి.బీ.ఎస్ చదివించారు తరువాత మా ఫౌండేషన్ లొ ఉద్యోగం ఇప్పించారు. ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తునె 2 ఏళ్ళ నుంచి పీ.జి ఎంట్రెన్సుకి తయ్యారవుతున్నాడు.

ఏ.సి.పి అజయ్ : మరి పద్మ...?

మోహన్ : పద్మ వచ్చి శ్వేతమ్మ ప్రాణ స్నేహితురాలు కలిస చదుకున్నారు. బీద కుటుంబం నుంచి వచ్చింది. శ్వేతమ్మ అడిగింది అని ఈ అమ్మాయిని కూడా రాఘవరావు గారె శ్వేతమ్మతొ పాటు ఎం.బి.బీ.ఎస్ చదివించారు. హరీష్ ఫౌండేషన్ లొ చేరిన 3 ఏళ్ళకి శ్వేతమ్మ మరియ పద్మ కూడా ఫౌండేషన్ లొ జునియర్ డాక్టర్లగా జాయిన్ అయ్యారు. హరీష్ లాగె వాళ్ళు కూడా పీ.జి ఎంట్రెన్సుకి తయ్యారవుతుండెవారు.

ఏ.సీ.పి అజయ్ : శ్వేత చనిపోయిన సమయానికి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు...? ఇప్పుడు ఎక్కడున్నారు..?

మోహన్ : శ్వేతమ్మ చనిపోక ముందు ఆ రోజు వీళ్ళద్దరు ఆమెతొ కలిసి ఎక్కడికొ బయటికి వెళ్ళారు. తరువాత హరీష్ మరియు పద్మ మాత్రమె ఫౌండేషన్ కి తిరిగొచ్చారు. అడిగితె శ్వేతమ్మ ఎవిరినొ కలవడానికి వెళ్ళిందంట అందుకని వీళ్ళద్దరు తిరిగొచ్చేశారు.

ఏ.సీ.పి అజయ్ : మరి తరువాత ఏమయ్యారు...?

మోహన్ : శ్వేతమ్మకి ఏక్సిడెంట్ అయ్యిందని సంగతి ముందు వీళ్ళద్దరికె తెలిసింది. వెంటనె హాస్పెటల్ కి వెళ్ళారు. మాకు తరువాత తెలిసింది. కాని హాస్పెటల్లొ శ్వేతమ్మ చనిపోయాక వీళ్ళిద్దరు ఏమైపోయారొ ఎవిరికి తెలియదు. ఇప్పటివరకు ఎక్కడున్నారొ నాకు కూడా తెలియదు సార్.

ఏ.సీ.పి అజయ్ : ఇంతకి శ్వేత ఎవరిని కలవడానికి వెళ్ళిదంటా...?

మోహన్ : డా. మాధవ్ సార్ అబ్బాయి అర్జున్ గారిని....

ఏ.సీ.పి అజయ్ : అర్జున్నా ... మరి శ్వేత చనిపోయినప్పుడు అతను కూడా అక్కడున్నాడా...?

మోహన్ : లేరు సార్..

కోంచెం సేపు నిశ్శబ్దం....

టేబుల్ మీద ఉన్న ఫోటోను మరోసారి చూశాడు.

కొన్ని క్షణాలు...
అతని చూపు ఆ ఫోటో మీదె తిరిగింది.
తర్వాత...

ఏ.సీ.పి అజయ్: సరే మోహన్ గారు. ఇప్పటికి మీరు వెళ్లొచ్చు.

మోహన్ లేచి నిలబడ్డాడు.

మోహన్: సరె సార్...

మోహన్ నెమ్మదిగా బయటకు వెళ్లిపోయాడు. క్యాబిన్ తలుపు మూసుకుపోయింది.

కొన్ని క్షణాలు అజయ్ తన కుర్చీలోనే కూర్చుని ఆలోచిస్తున్నాడు.

సీ‌.ఐ ప్రవీణ్: ఏమైనా క్లూ దొరికిందా...?

అజయ్ సమాధానం చెప్పలేదు. మెల్లగా ఆ పాత ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు.

ఫోటో చివర డాక్టర్ రాఘవరావు చేయి పట్టుకున్న. మరియు సగం మాత్రమే కనిపిస్తున్న ఏడేళ్ల పిల్లవాడు.

అజయ్ టేబుల్ మీద ఉన్న మాగ్నిఫైయింగ్ గ్లాస్ (భూతద్ధం) తీసుకుని. ఆ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు.

కానీ ముఖం సగమే ఉండడంతో ఏమీ స్పష్టంగా కనిపించలేదు. దాంతొ చిరాకుగా ఫోటోను ప్రక్కన పెట్టేశాడు.

ఏ.సీ.పి అజయ్: ప్రవీణ్...

సీ.ఐ ప్రవీణ్: సార్...

ఏ.సీ.పి అజయ్: 1995 లాంగ్వే ట్రైబల్ మెడికల్ క్యాంప్. ఆ క్యాంప్‌కి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు కావాలి.
"పాల్గొన్న వాళ్ల జాబితా..."
"రిపోర్టులు..."
"ఇంకా ఫోటోలు ఉంటే అవి కూడా."
"ముఖ్యంగా... డాక్టర్ మాధవ్ కుటుంబ వివరాలు." అన్నీ...

ప్రవీణ్ వెంటనే నోట్ చేసుకున్నాడు.

సీ. ఐ ప్రవీణ్ : సరే సార్.

ఏ.సి.పి అజయ్: పాత ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ రికార్డ్సులొ ఉండొచ్చు. అక్కడి నుంచి మొదలు పెట్టు.

సీ. ఐ ప్రవీణ్: ఓకే సార్.

అజయ్ మరోసారి ఫోటోను చూశాడు. సగం మాత్రమే కనిపిస్తున్న చిన్న పిల్లవాడు.

అజయ్ మనసులో ఒక్క ప్రశ్న మాత్రం మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.
"డా. మాధవ్ కొడుకైన అర్జున్ కు ఏమైనా సంబంధం ఉందా...?"

కానీ...
దానికి సమాధానం మాత్రం ఇంకా తెలియాలి.

సమయం : రాత్రి 10:00 గంటలు

అజయ్, ప్రవీణ్ ఇద్దరూ కమిషనరేట్ నుంచి బయటకు వచ్చారు. సడన్ గా అజయ్ కి ఏదొ గుర్తొచ్చి

ఏ.సీ.పి అజయ్: ప్రవీణ్...

రమ్మన్నట్టు చెత్తొ సైగ చేశాడు

ఏ.సీ.పి అజయ్ :  ఒక చిన్న విషయం.

సీ.ఐ ప్రవీణ్: చెప్పండి సార్.

ఏ.సీ.పి అజయ్: డాక్టర్ రాఘవరావు గారు పెళ్లి చేసుకోలేదని అందరూ చెబుతున్నారు. అయితే... శ్వేతని దత్తపుత్రిక అంటున్నారు. రెండు మ్యాచ్ అవ్వడం లేదు.

సీ.ఐ ప్రవీణ్: అంటే...?

ఏ.సీ.పి అజయ్ : చట్టపరంగా అవివాహితులకి ముఖ్యంగా మగవాళ్ళకి పిల్లల్ని దత్తత ఇవ్వరు. ఒకసారి లీగల్ రికార్డ్స్ని మళ్ళి చెక్ చెయ్యి. 
దత్తత తీసుకున్న తండ్రినా... లేక లీగల్ గార్డియనా... అనేది క్లారిటీ కావాలి. రెండింటికి పెద్ద తేడా ఉంది. చెక్ చేసి రేపు చెప్పు...

సీ.ఐ ప్రవీణ్ : సరె సర్. రేపు ఉదయాన్నే ఫామిలి కోర్ట్ రికార్డ్స్, అనాధాశ్రమం రికార్డ్స్, స్కూల్ ఎడ్మీషన్ రికార్డ్స్ అన్నీ మరొక్కసారి చూస్తాను.

ఏ.సీ.పి అజయ్: హ్మ్... Just to be sure.

సీ.ఐ ప్రవీణ్: గుడ్ నైట్ సార్.

ఏ.సి.పి అజయ్: గుడ్ నైట్.

ఇద్దరూ తమ తమ వాహనాల వైపు నడిచారు.

అజయ్ తన కారులో కూర్చున్నాడు. ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కారు నెమ్మదిగా రోడ్డుమీదికి వచ్చింది.
కానీ...
అతని మనసు మాత్రం ఆ పాత ఫోటో దగ్గరే ఆగిపోయింది.

సమయం : రాత్రి 10:30 గంటలు 
ఏ.సీ.పి అజయ్ ఇల్లు.

అజయ్ కారు తన ఇంటి ముందు ఆగింది. కారు దిగి తన ఇంటి డోర్ బెల్ కొట్టాడు. 

కొద్దిసేపటికి.తన భార్య వచ్చి తలుపు తీసింది..

అజయ్ భార్య: ఇంత ఆలస్యం అయ్యిందే...?

ఏ.సీ.పి అజయ్ : పని ఎక్కువైందిలె. నువ్వూ పిల్లలు భోజనం చేసేశారా...?

అజయ్ భార్య : మా అందరిది అయిపోయింది. మీకోసమె ఎదురుచూస్తున్నా. వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రండి భోజనం వడ్డిస్తా...

ఇంటి హాల్ అంతా సినిమా శబ్దం.
టీవీ ముందు...
కొడుకు, కూతురు ఇద్దరూ దుప్పట్లు కప్పుకుని మరి సోఫాలొ కూర్చుని సినిమా చూస్తున్నారు.

టీవీలోని యూట్యూబ్ లొ ...
జూ. ఎన్.టి.అర్ – "సాంబ" సినిమాలోని
యాక్షన్ సీన్ నడుస్తోంది.

అజయ్ షూస్ విప్పుకుంటూ వాళ్ల వైపు చూశాడు.

ఏ.సి.పి అజయ్: ఏంట్రా...ఇంకా పడుకోలేదా...?

అజయ్ కొడుకు : రేపు ఆదివారం కద నాన్న...

అజయ్ కూతురు: సాంబ సినిమా అయిపోయాక పడుకుంటాం.

అజయ్ చిన్నగా నవ్వాడు.

ఏ.సీ.పి అజయ్ : సరే...సినిమా అయిపోగానె  ఇద్దరూ మంచం మీద ఉండాలి. ఓకేనా...?

అజయ్ కొడుకు, కూతురు : ఓకే...

అజయ్ లోపలికి వెళ్లి ఫ్రేష్ అవుతాడు.
భోజనం చేసి...
తిరిగి హాల్‌కి వచ్చి పిల్లలు ప్రక్కన సోఫాలో కూర్చుంటాడు. టీ.వి వైపు చూస్తూ...

కాని తన ఆలోచనలు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతున్నాయి...

సమయం : రాత్రి 11:35 గంటలు

సాంబ సినిమా అయిపోయింది. హాల్లొ నిశ్శబ్దం అలుముకుంది. 

అజయ్ టీ.వి రిమోట్ తీసుకొని...

ఏ.సి.పి అజయ్ : సినిమా అయిపోయింది కదా ఇంక పోయి పొడుకోండి. మిగతా సినిమాలు రేపు చూద్దురుగాని..

పిల్లలిద్దరు అజయ్ కి ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి పొడుకోడానికి తమ గదిలోకి వెళుతున్నారు.

అజయ్ వాళ్ళు వైపు చూస్తు చిరునవ్వు నవ్వాడు.

అజయ్ భార్య కూడా పొడుకోడానికి గదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అజయ్ ఒక్కడె హాల్లొ ఉన్నాడు. 

టీవిలొ సాంబ సినిమా టైటిల్ లోగొ స్క్రీన్ మీద ఇంకా అలాగె ఉంది. అజయ్ టీ.వి రిమోట్ తొ టీవీ ఆఫ్ చేద్దామనుకున్నాడు.

కాని ఒక్కసారిగా అతని చెయ్యి గాల్లోనె ఆగిపోయింది. ఏదొ ఎక్కడొ చిన్నగా గుర్తొచ్చింది. రీమోట్ తొ టీ.వి ని ఆఫ్ చేసి. సోఫాలొ కూర్చున్నాడు

ప్రక్కనున్న తన మోబైల్ తీసుకున్నాడు. దాంట్లొ తన ఈ - మేయిల్ తెరిచి సీ.ఐ ప్రవీణ్ పంపిన డా. రాఘవ రావు ఫైల్ ఓపెన్ చేసి అందులొ ఉన్న ఫోటోలను ఒక్కొకొక్కటి గా స్క్రోల్ చేస్తున్నాడు. 

అలా ఒక ఫోటొ దగ్గర ఆగాడు. అదె ఫొటోను డా. మాధవ్ క్లీనిక్ లో కూడా చూశాడు. ఆ ఫొటోలొ డా. మాధవ్ ప్రక్కన ఉన్నది డా. రాఘవ రావు. వీరిద్దరి మద్యలొ స్కూలు డ్రేస్ లొ ఉన్న ఒక 13-14 ఏళ్ళ బాలుడు. 

ఆ బాలుడుని చూస్తూ. 

ఏ.సి.పి అజయ్ : ఈ కుర్రాడు... "సాంబయ్యా..." పొనికె గూడెం...
అంటె ఈ డా. మాధవ్ కి కూడా పొనికె గూడెంతొ సంబంధం ఉందనమాట....