యుద్ధభూమిలో శపథం - శకుని కుట్ర
శకుని, రుద్రను వదిలి వెళ్తున్నప్పుడు, అదే ప్రదేశం – ఎక్కడైతే మహాభారత సంగ్రామం జరిగిందో – అది ఇప్పుడు యుద్ధభూమిగా మారిందని ఒక పెద్ద శబ్దం వినిపించింది. "ఆ యుద్ధంలో ఈ రుద్ర గాని ప్రాణం లేని శవంలా నిలబెట్టి నేనంటే ఏంటో చూపిస్తాను!" అని శకుని గట్టిగా శపథం చేశాడు. అదంతా చూస్తూన్న రుద్ర, చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమైపోయాడు.
రుద్ర, శకుని మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలోనే, హీరోలు ఉన్న ప్రదేశంలో అశ్వద్ధామ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. "చూడండి, ఇప్పుడు రుద్ర వెళ్ళాడు. ఏదో ఒక గందరగోళం చేస్తాడు. వాడు మన అందరిపై ఎక్కువ దృష్టి పెట్టకుండా రుద్రపై ఎక్కువ దృష్టి పడేలా చేస్తాడు. కాబట్టి మీ సైన్యం ఏంటి, మీ శక్తి ఏంటి, మీ బలాలు ఏంటి – అన్ని ఒక గంటలో నాకు తెలియాలి. ఇప్పుడు నేను యుద్ధరంగానికి తగినట్టుగా ఒక చదరంగాన్ని గీయబోతున్నాను," అని చెప్పాడు. అందరూ అవునన్నట్టు తలలూపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అక్కడికి వచ్చిన అశ్విని, సామ్రాట్‌ను తీసుకొని వెళ్ళిపోతుంది. అశ్వినిని చూస్తున్న అశ్వద్ధామ, "అమ్మా అశ్విని, జాగ్రత్త. నువ్వు ఎవరినీ నమ్మకు. మీ అన్నయ్య కూడా నీ దగ్గరికి వచ్చి రమ్మంటే రాకు," అని హెచ్చరించాడు. ఆ దెబ్బకు సామ్రాట్ ఉలిక్కిపడ్డాడు. "ఏం జరిగింది? ఏం జరుగుతుంది?" అని తనలో తాను అనుకున్నాడు.
అశ్వద్ధామ కొనసాగిస్తూ, "ఇక్కడికి వచ్చినవాడు సామాన్యుడు కాదు భైరవ. అతడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి చూసిన వెంటనే తెలుసుకొని ఉంటాడు. అది ఇప్పటికే శకునికి చేరి ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే ఇది అయినా చేస్తాడు – రెండు ప్లాన్లు పెట్టుకొని ఉంటాడు ఎప్పటికీ. కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళను మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉంచుకోండి," అని చెప్పాడు.
యుగపురుషుల సిద్ధాంతం: జ్ఞానం వర్సెస్ యుద్ధం
అప్పుడే పరశురాముడు వచ్చి, "ఏంటి ఏం చేస్తున్నావ్? వీళ్ళని ఇప్పుడు భయపెట్టడం అవసరమా?" అని అశ్వద్ధామను అడిగాడు. "చూడు మిత్రమా," అశ్వద్ధామ బదులిచ్చాడు, "నువ్వు యుద్ధం చేసి ఉంటావు, యుద్ధంలో పాల్గొని ఉంటావు. కానీ యుద్ధంలో నేను ఉన్నాను, యుద్ధం చేసేటప్పుడు చూశాను, యుద్ధం రూపొందించేటప్పుడు చూశాను. ఇలాంటివి లేకపోతే, దీని మీద దృష్టి లేకపోతే యుద్ధంలో ఎంత నష్టపోతారో నీకు తెలియదు. నీకు తెలిసింది ఏంటి? చంపేయడం. అసురుల్ని ఎంతోమందిని నువ్వు చంపావు. కానీ యుద్ధం గురించి నీకు తెలుసా?" అని అడిగాడు.
పరశురాముడు కూడా "అవును," అన్నాడు. "ఓకే, సారీ. నిన్ను ఇబ్బంది పెట్టినట్టు ఉంటే నన్ను క్షమించు," అన్నాడు అశ్వద్ధామ. "పరవాలేదు. ఇది నిజమే. నేను ఏమనుకున్నానంటే ఇది నిజమే కదా? ఇప్పుడు వీళ్ళకు నువ్వు భయపెట్టావు. వాళ్ళు వీళ్ళను భయపెడతారు, చంపుతారు అని ఆలోచిస్తారు అని వాళ్ళ మనసుల్లో అదే ఉండి, ఒకవేళ యుద్ధంలో ఇటువంటి ఆలోచనలు ఆ దుష్ట మాంత్రికుడు శకుని గ్రహించి వీళ్ళ మెదడులో అటువంటివి వచ్చేటట్టు చేస్తే వీళ్ళు మధ్యలోనే ఓడిపోతారు అని నా భయం," అన్నాడు పరశురాముడు. "ఇది కూడా కరెక్టే. అప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ఇప్పటికి వీళ్ళకి ఈ ఆందోళన ఉండకపోతే వాళ్ళ శక్తులు ఏంటి, బలాలు ఏంటి వాళ్ళు పెద్దగా తెలుసుకోలేరు," అని అన్నాడు అశ్వద్ధామ.
హీరోల బలాలు, యుద్ధ వ్యూహాలు
అక్కడ అలా కట్ చేస్తే, ఇద్దరు అలా కూర్చొని ఉంటారు. ఒక గంట కల్లా అర్జున్, విక్రమ్, విక్రమార్క, సామ్రాట్, అలాగే రుద్ర – అందరూ ఒక చోటికి చేరుకున్నారు. వారితో పాటు మాయ కూడా వచ్చింది.
అప్పుడే అందరూ ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మొదటిగా రుద్ర, "నా దగ్గర రుద్రమనుల లోకంలో ఉన్న సైన్యం నాకు తోడుగా ఉంది. వాళ్ళ బలం ఏంటో మీకు తెలుసు కదా?" అన్నాడు. వెంటనే విక్రమ్ మరియు అర్జున్ ఇద్దరూ ఒకేసారి మాట్లాడారు. విక్రమ్, "నా దగ్గర ఎటువంటి సైన్యం లేకపోవచ్చు. కానీ మనోహర లోకం నుంచి తప్పించుకొని ఉన్నవాళ్ళు నా పక్కనే ఉంటారు," అన్నాడు. అలాగే అర్జున్ పక్కన తన భూమిలోని గురువులు మరియు అఘోరీలు సృష్టించిన సైన్యం అంతా మా పక్కనే ఉంది," అన్నాడు.
పక్కనుంచి విక్రమార్క మాట్లాడుతూ, "నా దగ్గర కూడా ఎటువంటి సైన్యం లేదు. కానీ నా భార్య మాయ వల్ల యమపురిలో సైన్యం, యముడు మా పక్కనే ఉంటారు," అన్నాడు. సామ్రాట్ మాట్లాడుతూ, "నా పక్కన నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ సృష్టించిన శక్తులు ఉన్నాయి. అత్యంత ఆధునిక శక్తులు, మాయా శక్తులు కలిగిన నా కుటుంబంలో కనీసం 1000 పైగా మనుషులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి నా సైన్యం కూడా ఉంది. వీళ్ళు కూడా దిగుతారు. కాకపోతే ఒక ప్రత్యేకమైన సమయంలో మాత్రమే వీళ్ళు బయటికి వస్తారు," అన్నాడు.
"సూపర్! అయితే ఇప్పుడు ఇలా చేయవచ్చు," అని చెబుతూ అశ్వద్ధామ, "మీరు ఐదు మంది ఉన్నారు. ఐదు మందికి తల ఒక సైన్యం ఉంది. ప్రతి సైన్యాన్ని ఐదు రకాలుగా విడదీయండి. ఆ విడదీసిన ఐదు మందిని మరో గ్రూపులో కలపండి. ఇలా ఒకరితో ఒకరికి సంబంధం ఏర్పరచండి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళను కలపండి. వాళ్ళు ఒక్కసారిగా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి టెలిపోర్ట్ అయ్యేలా ఒక విధమైన లీడ్ లాంటిది వాళ్ళ మధ్య సృష్టించండి," అని చెప్పడం మొదలుపెట్టాడు. "ప్రతి గ్రూప్‌కు అధిపతి ఉంటాడు. అందులో మీ ఐదు మంది ఐదు గ్రూపులకు లీడర్స్‌గా ఉంటారు," అని చెబుతుండగా, ఒకపక్క నుంచి హనుమంతుడు వచ్చాడు.
"చూడండి! ఇక్కడ జరిగేది మామూలు యుద్ధం కాదు. అసురులు, అంధకాసురులు వంటి వాళ్ళందరూ పక్కన ఉంటారు. వాళ్ళకు మంచి చెడు తెలియదు. వాళ్ళకు కావాల్సింది ఆ పరిస్థితులను ఎలా గెలవాలి మాత్రమే," అని అన్నాడు. "వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకొని ఇలా చేస్తే మనం మధ్యలోనే చనిపోతాం," అని హెచ్చరించాడు హనుమంతుడు.
కృష్ణుడి రాకకు సిద్ధం, యమలోకపు వ్యూహాలు
"సరే హనుమ, ఇప్పుడేం చేయమంటావ్? నువ్వు చెప్పింది ఏం మార్చుకో రంగంలో. నేను చెప్పింది మాత్రం చేయండి," అని హనుమంతుడు వాళ్ళందరికీ సీక్రెట్‌గా ఏదో చెప్పాడు. వాళ్ళందరూ విని షాక్ అవుతారు. "చూడండి, నేను చెప్పింది మాత్రమే చేయండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను చెప్పేది మాత్రం చేయండి," అని అన్నాడు. అందరూ నిరాశగా ఉన్నారు.
అప్పుడే ఐదు మంది హీరోయిన్లు బయటికి వస్తారు. వాళ్ళందరికీ ఒకే టైంలో, ఒకే రోజు, ఒకే పూట ప్రెగ్నెన్సీ రావడం, ఇప్పుడు అందరూ ప్రెగ్నెన్సీతో ఉండటం, మాయ కూడా అందులో చేరడం - ఈ మహత్తర కార్యానికి ఒక రూపకల్పనగా మారింది. హనుమంతుడు ఆశ్చర్యంతో, "ఇదే ఇది కదా అసలైన గోల్‌మాల్ అంటే! ఇప్పుడు కృష్ణుడు రాకకు ఒక పెద్ద వేదిక సిద్ధమవుతుంది. ఈ యుద్ధరంగంలోనే ఇది జరిగేలా ఉంది," అని సంతోషపడిపోతున్నట్టు అనిపిస్తుంది.
అలా అక్కడ కట్ చేస్తే, శకుని దగ్గర చూపిస్తాడు. శకుని కోపంతో చెలరేగిపోతున్నాడు. అప్పుడే ధర్మాత్మ అక్కడికి వస్తుంది. "ఏమైంది మిత్రమా? అంత కోపంగా ఉన్నావ్?" అని అడిగాడు. "వాడు రుద్రగాడు నన్ను అవమానించాడు. వాని యుద్ధరంగంలో కచ్చితంగా ఓడించి నేనే చంపుతా!" అన్నాడు శకుని. అదంతా వింటున్న ధర్మాత్మ, "ఆగు! నిన్ను ఒకడు వచ్చి బెదిరించి యుద్ధం గురించి చర్చించి వెళ్లిపోయాడా? నువ్వు అతని మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా? నీకు ఎంత తెలివి ఉన్నా ఇది ఎలా మర్చిపోయావు? ఇప్పుడు నువ్వు రుద్ర మీదికి దృష్టి పెడితే యుద్ధంలో వారే విజయం పొందుతారు. వాళ్ళ ప్లాన్ కూడా అదే. రుద్రనే ఎందుకు పంపించారు? వాడెంత శక్తివంతుడు? ఆ గ్రూప్‌లో ఎవరూ లేరు, ఉన్న అంత తెలివైన వాళ్ళు, దూకుడు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. వాడి దూకుడుతో నిన్ను తప్పుదారి పట్టిస్తున్నాడు. నేను చెప్పేది విను, యుద్ధరంగంలో మనమే గెలుస్తాం. నేను చెప్పినట్టు చెయ్యి," అని అన్నాడు.
వెంటనే బీజాసురుడి నాన్న అక్కడికి వచ్చాడు. అతను కూడా కోపంతో ఉన్నాడు. మరోపక్క నుంచి జాన్ - రెండు లోకాలను కలిపి అతలాకుతలం చేసిన జాన్ - ఇప్పుడు నలుగురు ఒకచోటికి చేరారు. ఒకడికి టెక్నాలజీ మీద దృష్టి ఉంటే, మరొకరికి దైవశక్తుల మీద అనుభవం ఉంది, మరొకరికి దుష్టశక్తుల మీద అనుభవం ఉంటే, మరొకరికి మానసిక శక్తి మీద అనుభవం ఉంది. వీళ్ళ నలుగురు కలిస్తే ఎలాంటి ప్రళయం వస్తుందో అనుకుంటున్న సమయంలోనే, జాన్ తన వెనుక చాలా రోబోట్‌లను తీసుకువచ్చాడు. ఎర్రటి కళ్ళతో, నీలిరంగు శరీరంతో అచ్చం భూతంలా కనిపిస్తున్నాడు. పెద్ద పెద్ద గోర్లు, ఒక్క దెబ్బతో ఆ గోర్లతోనే అందరిని చంపిన శక్తి కలిగిన రోబోట్‌లు అవి. ధర్మాత్మ ఆ టెక్నాలజీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆ ఏఐని సృష్టించాడు, దానిని కూడా కంట్రోల్ చేస్తాడు. ఇక అసలు లోకం నుంచి వచ్చిన బీజాసురుడి నాన్న తన సైన్యాన్ని తీసుకువచ్చాడు. కప్పలు, పాము లాంటి శరీర అవయవాలతో ఘోరంగా, ఒక్క దెబ్బతో పక్క వాడిని నమిలి పారేసే శక్తి కలిగిన అసురులందరూ ఒకచోట చేరారు.