హనుమంతుడు నవ్వి, "అవును, నీకంటే ఎక్కువ తెలుసు. వాడు మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ యుద్ధం మీద దృష్టి పెట్టకపోవడం లేదా దేని మీదైనా కొంచెం అదుపు అప్డేట్ చేస్తే చాలు, మనం యుద్ధంలో చాలా సులువుగా గెలవచ్చు. అమ్మాయిలు, మీరందరూ ఒక మంచి పాట నేర్చుకోండి," అన్నాడు. వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే, రుద్ర మళ్ళీ ఒక చిటికి వేస్తాడు. వెంటనే అశ్వద్ధామ, హనుమంతుడు, పరశురాముడు, రుద్ర అందరూ ఒక్కసారిగా మాయమైపోతారు.
శకుని వ్యూహం, రుద్ర ఆగ్రహం
సీన్ కట్ చేస్తే, అది ఒక నల్లటి భవనం. చుట్టూ నెగటివ్ ఎనర్జీ మామూలుగా కనిపించడం లేదు. లోపల ఒక వ్యక్తి హైటెక్ సూట్ వేసుకొని కూర్చుని ఉన్నాడు. అప్పుడే భైరవ ఎగురుతూ వచ్చి దెబ్బలతో కనిపించాడు. "ఏమైంది భైరవ? నిన్ను అంతగా కొట్టారా?" అని అడిగాడు ఆ వ్యక్తి. "కొట్టారు కాదు ప్రభు, కొట్టాడు!" అన్నాడు భైరవ. "ఎవరు?" అనగానే భైరవ మాట్లాడుతూ, "రుద్ర," అన్నాడు.
"అది సరే. ఇప్పుడు వాళ్ళ గురించి ఏమేం తెలుసుకున్నాం?" అని అడిగాడు ఆ వ్యక్తి. "ఆ, తెలుసుకున్నాను ప్రభు. నేను వెళ్ళే లోపే అశ్వద్ధామ, హనుమంతుడు వెళ్ళిపోయారు. వాళ్ళకు మన గురించి ముందే అన్ని తెలిసినట్లు అనిపిస్తుంది. కానీ అక్కడున్నది చిన్నపిల్లలు కదా? ఒక్క దెబ్బతో చంపేద్దామనుకున్నా, కానీ అక్కడ 5 మంది మహనీయులు కనిపిస్తున్నారు. వాళ్ళలో ముగ్గురు మాత్రం చాలా బలమైన వాళ్ళు.
మొదటిగా రుద్ర: ఇతడు నేను రాగానే నన్ను గుర్తుపట్టాడు, తన శక్తితో అడ్డగించాడు. అంతకుముందు ఒక పిల్లి కనిపించింది. అది మానసిక శక్తితో కలిసి ఉండే ఒక వ్యక్తిది. అతని పేరు అర్జున్. అతడు చూడటానికి మీ పూర్వజన్మల అర్జునుడిలా కనిపిస్తున్నాడు. అతనికి కలిగిన జీవాలు ఉన్నాయి: ఒకటి మాయా పిల్లి, మరొకటి మాయా గబ్బిలం, మరొకటి మాయా పాంథర్. ఈ మూడు అతని మానసిక శక్తితో కలిసి ఉంటాయి. ఇతన్ని ఓడించడం చాలా ఈజీ. అతని ఎమోషన్స్‌ను ఆపగలిగితే, ఆ మూడు శక్తులు ఎందుకు పనికిరాకుండా పోతాయి.
ఇక నెక్స్ట్ రుద్ర: ఇతన్ని ఓడించడం కొంచెం కష్టమే. కానీ అతని వీక్నెస్ తెలుసు కదా, ఫీలింగ్స్. అతని భార్యను కానీ, లేదా అతని ఫ్యామిలీలో ఎవరినైనా బంధించి అతని ముందు పెడితే అతను ఈజీగా లొంగిపోతాడు.
ఇక నెక్స్ట్ శివ: అక్కడున్న వాళ్ళలో ఇతను కూడా కొంచెం శక్తివంతుడే. కానీ ఇతను చాలా ఈజీగా లొంగిపోతాడు. అతని మెడ వెనుక ఉన్న ఒక చిన్న వజ్రం లాంటిది ఉంది. దాన్ని మనం ఆపగలిగితే అతను కూడా లొంగిపోతాడు.
ఇక నెక్స్ట్ విక్రమ్: అతడు దాదాపు మీ స్నేహితుడు, అంటే మీ మేనల్లుడు దుర్యోధనుడి స్నేహితుడు కర్ణుడిలా కనిపిస్తున్నాడు. దుర్యోధనుడు ముందు వచ్చి మాట్లాడితే అతను ఈజీగా లొంగిపోయేలా కనిపిస్తున్నాడు. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేదు, పెద్దగా శక్తులు లేవు.
ప్రేయసి అయిన మాయ: మృత్యుదేవత. తను యముని పుత్రిక కాబట్టి తనకి నెగటివ్ ఎనర్జీ అంటే చాలా సులభం. మనందరినీ ఒక్క చిటికెలో చంపేస్తుంది. కానీ యమలోకంలో చిన్న పని చేస్తే తను ఆ ప్రదేశంలో లేకుండా యమలోకానికి వెళ్లిపోయే స్థితి వస్తుంది. అప్పుడు మనం యమలోకానికి భూలోకానికి ఉన్న టెలిపోర్టర్‌ని ఆపేస్తే తను మళ్ళీ తిరిగి రాదు," అని అన్ని విషయాలు చెప్పాడు భైరవ.
ఇక చివరిగా ఉన్నది సామ్రాట్: అతని మెడలో మీకు తెలుసు కదా, కృష్ణుడి అంశం మొత్తం నాశనం అయ్యింది అని. కానీ అది అబద్ధం. అప్పుడు కృష్ణుడికి పెట్టిన శాపం పెద్దగా ఫలించినట్టు లేదు. తన కుటుంబంలో ఒక అమ్మాయి తప్పించుకొని ఇప్పుడు బుజ్జిదేవిగా మారింది. తన కుటుంబంలోని వ్యక్తి ఈ సామ్రాట్ అంటే అర్థం చేసుకోండి ఎంత శక్తివంతుడు అయి ఉంటాడో. కానీ అతను కూడా చాలా శక్తివంతుడే. ఒక చిన్న ఉపాయం: తనకొక అశ్విని అని చెల్లెలు ఉంది. తనని పట్టుకొని బెదిరించడం చేస్తే మొత్తం కథ మన వైపు తిరుగుతుంది," అని పూర్తిగా విడమరిచి చెప్పాడు భైరవ.
ఆ హైటెక్ సూట్ వేసుకున్న వ్యక్తి గట్టిగా నవ్వి, "నాకు తెలుసు! అందుకే కదా నిన్ను పంపించింది. నేను వెళ్తే మరో కలగా ఉండేది. నువ్వు వెళ్ళడం వల్ల దెబ్బలతో తిరిగి వచ్చావు. అలాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చావు. నువ్వు నిజంగా నా ప్రియమైన మిత్రుడివి," అంటూ భైరవని కౌగిలించుకుంటూ ఉండగా, ఒక్కసారిగా ఎవరు వచ్చినట్టు శబ్దం. ఒక పెద్ద ఖడ్గం ఎగురుతూ అక్కడికి రాగానే, రుద్ర తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఒక్కసారిగా ఒక్క పోటు పొడిచాడు. భైరవ అక్కడే చనిపోయాడు.
"ఏంట్రా, అంత ఈజీగా తప్పించుకొని ఇస్తే నేను ఎందుకు అవుతాను?" అంటూ మాయా రూపంలో రుద్ర మాట్లాడసాగాడు. ఆ నెగటివ్ ఎనర్జీలలో కలిసిపోయాడు. రుద్ర చుట్టూ తిరుగుతూ, "నువ్వు ఎవరో తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు, నీ జీవిత చరిత్ర తెలుసు. కానీ ఇక్కడ ఉన్నది రుద్ర. ఈ రుద్రను తాకాలంటే నువ్వు మరో జన్మ ఎత్తినా కానీ కాదు! కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. కుదిరితే పారిపో, లేదా లొంగిపో. ఇలాంటి డైలాగులు నువ్వు పంపిన జాన్కి ఎన్నో చెప్పాను. కానీ వాడు వినలేదు. చివరికి చనిపోయాడు. కానీ ఇంకా ఎక్కడో బతుకుతున్నాడని నాకు అర్థం అవుతుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్త! విలన్స్ ఒక్కో విలన్ ఏ లోకం నుంచి వస్తారో, ఎక్కడి నుంచి వస్తారో, బండిలో వస్తారు, కారులో వస్తారు, మట్టిలోంచి వస్తారు, ఆకాశంలో నుంచి వస్తారు. అది నాకు తెలియదు. కానీ చెప్తున్నా, నిన్ను, నీ సైన్యాన్ని అతలాకుతలం చేసి చంపేస్తా," అని బెదిరిస్తున్నాడు రుద్ర.
"ఏం మాట్లాడుతున్నావ్? దమ్ముంటే నువ్వు కనిపించరా? నీ అంతు చూస్తా!" అని అన్నాడు ఆ హైటెక్ సూట్ వ్యక్తి. "ఏంటి, ఈ డొక్కు డబ్బా వేసుకొని నన్ను చంపుతావా? నీకోసం ఒక చిన్న డైలాగ్ వేస్తా చూసుకో! ఇది మా భూమిలో ఎంత ఫేమస్ అయినా ఆడియో వీడియో ఎఫెక్ట్‌రా! దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా! శకుని, పట్టుకుంటే వదిలేస్తావా? భూమిని పట్టుకుంటావా?" అని అంటూ గట్టిగానే నవ్వుతున్నాడు. అక్కడున్న సామాన్లను విసిరేసి చేసి, భవనాన్ని కూల్చి పడేస్తాడు. వెంటనే "నువ్వు పట్టుకోలేకపోయావు కాబట్టి నీ మాట ప్రకారం భూమిని నీకు దక్కనివ్వను!" అని అంటూ మాయమైపోతాడు.రుద్ర