2030 యెర్
ఎపిసోడ్ 1: రుద్రమణుల రహస్యం
(సీన్ 1: నిర్మానుష్య ప్రాంతం – రాత్రి)
దట్టమైన చీకటిలో, ఇద్దరు యువకులు - సోము మరియు రోజా - ఎవరో తెలియని గమ్యం వైపు నడుస్తున్నారు. వారి చుట్టూ చిమ్మ చీకటి, అప్పుడప్పుడు వీస్తున్న గాలి సవ్వడి తప్ప ఎలాంటి శబ్దమూ లేదు. సోము చేతిలో ఒక చిన్న, పాతబడిపోయిన పుస్తకం ఉంది. దాని అట్టపై "రుద్ర" అనే పేరు, దాని చుట్టూ 26 మెరిసే వజ్రాల చిహ్నం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకంలోని మొదటి పేజీని తిప్పగానే, అందులో "రుద్రమణులు: వీటి సృష్టికి హనుమంతుడి శక్తి ఒక కారణం. ఆ రుద్రమణుల వల్లనే ఒక ప్రపంచమే పుట్టింది" అని రాసి ఉంది.
సోము ఆ పుస్తకాన్ని చూస్తూ, రోజా వైపు తిరిగి, "సోము, వీళ్ళు చెప్పేది నిజమేనంటావా? నిజంగా అలాంటి వజ్రాలు ఉంటాయా? ఈ పుస్తకంలో ఉన్నట్టుగా ఇది హనుమంతుడి శక్తితోనే ఉద్భవించిందా? అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?" అని సందేహంగా అడిగాడు.
రోజా అతని వైపు చూస్తూ, "అది నాకు కూడా తెలియదు . ఈ రాత్రి సమయంలో, కనీసం కారు కూడా ఇవ్వకుండా మనల్ని పంపించారు. మన పై అధికారులు, 'రుద్ర' అనే వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళమని చెప్పారు. అతనే చివరిసారిగా ఆ వజ్రాలను చూసిన వ్యక్తి అని, అతను ఇంటర్లో బ్రిక్స్ అనే కంపెనీని స్థాపించి ఇక్కడే ఉండిపోయాడని చెప్పారు. అసలు అతనికి ఏం జరిగిందో తెలుసుకోవాలి" అంది. వాళ్లిద్దరూ పురాతన వస్తువులను కనుగొనే పని చేస్తుంటారు. 26 శక్తివంతమైన, పురాతన వజ్రాలను కనుగొనాలని వారికి ఇంతకుముందే ఆదేశాలు అందాయి.
అలా వారు మాట్లాడుకుంటూ నడుస్తుండగా...
(సీన్ 2: ఆకస్మిక దాడి)
ఆకస్మికంగా! ఒక ఎర్రటి కళ్లతో, మండుతున్న చూపులతో ఉన్న వ్యక్తి పై నుంచి దూకాడు. అతని ఆవేశపూరితమైన స్వరం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. "ఎన్నిసార్లు చెప్పాలి దాని గురించి మర్చిపోమని? కొంచెం కూడా తెలివి లేదా మీకు? అది నాది, నాకు మాత్రమే సొంతం! ఎవరూ వాటిని చేరుకోలేరు!" అంటూ అరిచాడు. ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఝళిపిస్తూ, రోజా మరియు సోములను క్షణాల్లో ముక్కలు ముక్కలుగా నరికేశాడు. రక్తపు మడుగులో స్నానం చేసినట్లుగా నిలబడ్డాడు.
ఆ తర్వాత, ఆ ఎర్రటి కళ్ల వ్యక్తి అక్కడి నుంచి ఎగురుతూ, ఒక వింత ఆకారంలో ఉన్న తన స్పేస్ షిప్‌లోకి వెళ్ళిపోయాడు. అది దున్నపోతు కొమ్ములతో, వెనకాల చేప ఆకారంలో, భయంకరంగా కనిపించింది. అతను వెళ్ళిపోగానే, రక్తపు మడుగులో ఇప్పటిదాకా సోము చేతిలో ఉన్న రుద్రమణుల పుస్తకం, బంగారు రంగులో మెరుస్తూ పడి ఉంది.
(సీన్ 3: పుస్తకం ఆవిష్కరణ)
పుస్తకం గాలికి ఒక్క పేజీ తిరిగింది. అందులో చిత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి. హనుమంతుడు లంకను కాల్చివేసి, తన తోకకు అంటుకున్న మంటను ఆర్పడానికి సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు అతని తోకలోని వెంట్రుకలు రాలి సముద్రంలో పడతాయి. ఆ చల్లని నీటికి అవి గడ్డకట్టుకుపోతాయి. అలా పడిన వెంట్రుకలు కొన్ని చోట్ల స్తంభాలుగా మారి, రుద్రమణుల కింద నుంచి పైకి లేచి, సముద్రం మధ్యలో ఒక నగరాన్ని సృష్టిస్తాయి. పుస్తకం ఇంతవరకు ప్రేక్షకులకు వెల్లడించిన వెంటనే...
(సీన్ 4: మరొకరి ప్రవేశం)
మరో పక్క, ఎక్కడో ఒక వ్యక్తి స్టాఫ్ రూమ్‌లో కూర్చుని ఉన్నాడు. అతని మెడలో ఒక ఈకలాంటి లాకెట్, సారీ, వెంట్రుకలాంటి లాకెట్ అటూ ఇటూ ఊగుతోంది. ఒక్కసారిగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. "మళ్ళీ ప్రారంభమైంది" అని నెమ్మదిగా నవ్వుకుంటూ అనుకున్నాడు. తన కాళ్ళతో ఒక్క జంపులో, పైన ఉన్న రూఫ్‌ను రెండుగా చీల్చుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు. అతను రోజా, సోము చనిపోయిన ప్రదేశానికి చేరుకున్నాడు.
అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పుస్తకాన్ని చూసి, "ఇప్పుడు మళ్ళీ మొదలైంది. వాడు వచ్చాడు!" అని అనుకున్నాడు. మెల్లగా ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, తన మెడలో ఉన్న లాకెట్ దగ్గరికి తీసుకురాగానే, పుస్తకం ఆ లాకెట్లోకి వెళ్లిపోయింది.
(సీన్ 5: ఆశ్రమం – సంభాషణ)
ఆ అబ్బాయి ఒక్కసారిగా రెండు మూడు జంపులలో తన స్థానానికి చేరుకొని కూర్చున్నాడు. ఇలా జరుగుతున్న నేను అనుకోలేదు అని అనుకుంటూ ఏదో తలుచుకుంటూ ఉన్నాడు
2025
మరో పక్క నుంచి ఒక అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఆమె అతని కాళ్ళ వైపు చూసి ఆరా తీయడం మొదలుపెట్టింది. "ఏంటి మళ్ళీ ఏం జరిగింది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్లి వచ్చావ్? నీ కాళ్ళకు రక్తం ఏంటి?"అబ్బాయి బాధగా ఆమె వైపు చూస్తూ, "ఏంటి అక్షరా... ఏదో ప్రమాదం జరగబోతోంది. మళ్ళీ నేను ఎవరినీ పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. నా అనుకున్న వాళ్ళు ఇప్పటికే నాకు దూరంగా ఉన్నారు. నా అనుకున్న వాళ్ళను నేను వదలలేను కదా..." అని అనుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యాడు. "మీ నాన్న చేసిన త్యాగం వలన నేను ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్నాను. కనీసం నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డను అయినా కాపాడుకోవాలి కదా" అని ఫీల్ అవుతూ మాట్లాడసాగాడు."అసలు ఇదంతా జరగడానికి కారణం నేను చిన్నప్పుడు మా తాత ఇచ్చిన ఈ లాకెట్. అది నా మెడలో వేయగానే నా తెలివితేటలు అన్నీ తిరిగిపోయాయి. అందం లేదు, ఐశ్వర్యం లేదు, అందరికీ దూరంగా బతుకుతున్నాను. నాకంటూ సొంత కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎన్నో కష్టనష్టాలను పడ్డాను. చివరికి ఇలా ఎదురవ్వడం..." అతను మాట పూర్తి చేయకుండానే ఆగిపోయాడు.ఎపిసోడ్ 2: గతం వెంటాడుతుంది
(సీన్ 1: రుద్ర ఆవేదన)
అక్షర కడుపులో బిడ్డతో కూర్చుని ఉండగా, రుద్ర ఆవేదనతో మాట్లాడటం కొనసాగించాడు. "నా లోకానికి వెళ్ళడం, అక్కడ యుద్ధం చేయడం, భూమికి తిరిగి రావడం, మరో యుద్ధం... ఇలా నా జీవితం యుద్ధాలతోనే గడిచిపోతుంది. నాకు విరామమంటూ లేదు."
అక్షర రుద్ర భుజాన్ని ఆప్యాయంగా తడుతూ, "ఏంటి రుద్ర, నువ్వే ఇలా అయిపోతే రేపటి రోజున ఎవరు ధైర్యంగా నిలబడతారు? నువ్వు బాధపడటం వలనే మా నాన్నగారు ఆ పని చేయాల్సిన అవసరం వచ్చింది. నువ్వు ఇప్పటికైనా నీ ధైర్యాన్ని కోల్పోకు. దృఢంగా ఉండు" అని ధైర్యం చెప్పింది.
ఆ రాత్రి, రుద్ర, అక్షర భోజనం చేసి పడుకున్నారు. రుద్ర మెడలో ఉన్న లాకెట్ అటూ ఇటూ కదులుతూ, గుండ్రంగా తిరుగుతూ, ప్రేక్షకులను ఒక చిన్న ఇమాజినేషన్లో లోకి తీసుకువెళ్ళింది.
(సీన్ 2: ఆ చిన్ననాటి భయం)
(దృశ్యం: దట్టమైన అడవి)
ఇద్దరు వ్యక్తులు అడవిలో ఏదో వెతుకుతూ నడుస్తున్నారు. వారిలో ఒక చిన్న అబ్బాయి, అతని తండ్రి. ఒక్కసారిగా ఆకాశం నుంచి పెద్ద కాంతి పుంజం కిందకు దూసుకొచ్చింది. "నాన్నా! జాగ్రత్త!" అని ఆ చిన్న అబ్బాయి గట్టిగా అరిచాడు. కానీ అప్పటికే ఒక శూలం లాంటిది వేగంగా దూసుకువచ్చి అతని తండ్రిపై పడింది.
ప్రాణం పోతున్న చివరి క్షణాల్లో, తండ్రి ఆ అబ్బాయిని చూసి, బలహీనమైన స్వరంతో, "చూడు నాన్నా... నేను చెప్పింది ఎప్పటికీ మర్చిపోకు... రుద్ర... రుద్రమణులు..." అని అంటూ కన్నుమూశాడు.
ఈ వ్యక్తి ఎవరో కాదు, ఎర్రటి కళ్లు కలిగిన, రుద్ర, సోములను చంపిన ఆ రాక్షసుడు. ఇది అతని చిన్ననాటి సంఘటన. సీన్ మళ్ళీ కట్ అవుతుంది.
(సీన్ 3: రుద్ర బాల్యం – లాకెట్ రహస్యం)
లాకెట్ మళ్ళీ మరో ఇమాజినేషన్లో, రుద్ర బాల్యానికి తీసుకువెళ్ళింది.
(దృశ్యం: ఒక పాఠశాల మార్గం)
చిన్నపిల్లవాడైన రుద్ర బడికి వెళ్తున్నాడు. అప్పుడప్పుడు అతని మెడలో ఉన్న లాకెట్ మెరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఒక ముసలి వ్యక్తి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. "ఏరా మనవడా! మీ తాత అంత గొప్పవాడివి కావాలి. నీకు అదృష్టం ఎప్పుడూ పడుతూనే ఉండాలి. ఇదిగో, ఇది తీసుకో" అని అంటూ తన మెడలో ఉన్న ఒక చిన్న లాకెట్‌ను రుద్ర మెడలో వేశాడు.
అది చూడటానికి వజ్రంలా మెరుస్తూ, దాని లోపల ఏదో కదులుతున్నట్లు, ఒక వెంట్రుకలాంటిది కనిపించింది. "ఏంటి తాతా?" అని రుద్ర అడిగాడు.
"ఇది అదృష్టం! భవిష్యత్తులో ఒక గొప్ప స్థాయికి చేరుకుంటావు. మీ తాత వాడలేడు, నువ్వు మాత్రమే వాడగలవు. ఇది కేవలం నాకు దక్కింది నీకు ఇవ్వడానికే దక్కినట్టు అనిపిస్తుంది" అని ఆ ముసలి వ్యక్తి చెప్పాడు. "మీ నాన్న కానీ మీ అమ్మ కానీ చూశారంటే గొడవవుతుంది. నేను వెళ్తున్నా" అని అంటూ పక్కనే ఉన్న బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు.
రుద్ర అయోమయంగా, "ఏంటిది? ఎప్పుడూ లేనిది, కొత్తగా వచ్చి నాకిచ్చి పోతున్నాడు? ఎక్కడిది?" అని అనుకుంటూ దాన్ని చూస్తూ ఉండగా, ఆ లాకెట్ అతనికి ఎంతో నచ్చింది.
(సీన్ 4: తెలివితేటల క్షీణత)
ఆ మరుసటి రోజు నుంచి రుద్రకు సరిగ్గా తెలివితేటలు లేకుండా పోయాయి. ముద్దువాడిలా మారిపోయాడు. చదివినది గుర్తుండదు, గుర్తున్నది పనికిరాదు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో, ఇలా ప్రతి సబ్జెక్టులో సగం సగం నేర్చుకున్నాడు. పూర్తిగా నేర్చుకోవడం రాలేదు. తల్లిదండ్రులు, పక్కనున్నవాళ్ళు "ఫెయిల్, ఫెయిల్యూర్" అంటూ అతన్ని వెక్కిరించేవారు.
15 ఏళ్లు అతడు భయం గుప్పెట్లో, ఎక్కడ ఓడిపోతానో అని కనీసం తినడానికి కూడా ఆలోచించేవాడు. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి అతనికి విసుగు వచ్చింది. "మీరందరూ నన్ను ఎంతో బాధ పెట్టారు. కానీ ఇక నేను సహించలేను. నేను వెళ్ళిపోతున్నాను. మీ అందరికీ నేనేంటో చూపిస్తా. నేను మరో రూపంలో తిరిగి వస్తా. అప్పుడు మీరందరూ నా ముందు తలదించుకోవాలి!" అని చాలా పౌరుషంగా వెళ్ళిపోయాడు రుద్ర.
(సీన్ 5: ప్రస్తుతంలోకి)
సీన్ కట్ చేస్తే, రుద్ర ఉలిక్కిపడి నిద్రలేచాడు. వెంటనే రుద్ర కళ్ళు తెరిచాడు. "నా జీవితం మళ్ళీ ఎందుకు గుర్తు వస్తుంది?" అని ఆలోచిస్తూ మెల్లగా లేచి, ముఖం మీద నీళ్ళు పోసుకున్నాడు. అలా ఉదయిస్తున్న సూర్యుడి ముఖాన్ని చూస్తూ ఉండగా...
వెనకాల నుంచి అక్షర చిన్నగా మూలుగుతూ, "రుద్ర... రుద్ర..." అని పిలవగా, రుద్ర వెనక్కి తిరిగి "ఏంటి?" అన్నాడు. వెంటనే అక్షర "ఏం లేదు, ఊరికే" అని అంటూ కడుపు పట్టుకొని లేచి బాత్రూంకి వెళ్ళింది.
మళ్ళీ ఆ సూర్యుడిని చూస్తూ, మళ్ళీ తన బ్యాక్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర ఒక్కసారి కళ్ళు మూసుకుంటాడు.
(సీన్ 6: అస్పష్టమైన దృశ్యం)
(దృశ్యం: ఒక మిషన్ రూమ్ లాంటి ప్రదేశం)
ఒక వ్యక్తి బలంగా, హనుమంతుడిలా కనిపిస్తూ, చేతిలో గదతో చుట్టూ ఉన్న 26 వజ్రాలను చూస్తున్నాడు. ఒక్కో వజ్రం ఒక్కో భాగంలో - కాళ్ళు, చేతులు, తల అంటూ ఒక్కొక్కటి ఒక్కో భాగంలోకి చేరుతూ ఉండగా, ఏదో పెద్ద మిషన్ ఏదో లిక్విడ్ లాంటి దాన్ని ఆపుతూ, గట్టిగట్టిగా కొడుతూ, భూమి మీద ఆ లిక్విడ్‌ను పడనీయకుండా చేస్తున్నట్టు...
ఒక్కసారిగా మళ్ళీ కళ్ళు తెరుచుకుని, "ఎందుకు గుర్తొస్తుంది? నేను ఎందుకు ఇది గుర్తు తెచ్చుకుంటున్నాను? ఇవి నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను" అని బాధగా అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు రుద్ర.
(సీన్ 7: సుమిత్తో సరదా)
మరోసారి రుద్ర కళ్ళు మూసుకుంటాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తే అందమైన ప్రకృతిలో ఇద్దరు అబ్బాయిలు చాలా నిద్రపోతున్నారు. ఒక్కసారిగా ఒక అబ్బాయి,.
అలా పది నిమిషాలు జరగగానే, రుద్రకు (సుమిత్ కి ) మిల్కువ వచ్చింది. "రా రా, నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది" అని అంటూ సుమిత్‌ను పిలిచి డోర్ కొడుతున్నాడు. "ఫ్రెష్ అప్ అయ్యి ఒకేసారి వస్తా!" అని సుమిత్ అంటూ ఉండగా, రుద్ర "చూడు, డోర్ వేసి వెళ్ళిపోతా నేను. మళ్ళీ నువ్వు నీ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేవు!" అని బెదిరించాడు.
"సరే సరే స్వామి, వస్తున్నా!" అని సుమిత్ విరవిరా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి, "పోరా పో!" అని అంటూ రూంలోకి దోబేసాడు. సుమిత్ డ్రెస్ వేసుకుంటూ ఉండగా, రుద్ర కూడా వచ్చి సివిల్ డ్రెస్, బ్లూ కలర్ వేసుకుంటూ ఉండగా, తన మెడలో ఆ లాకెట్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూస్తూ...ఎపిసోడ్ 3: పునరుద్ధరణ మరియు యుద్ధం
(సీన్ 1: రుద్ర మానసిక సంఘర్షణ)
సుమిత్, రుద్ర బ్లూ కలర్ సివిల్ డ్రెస్ వేసుకుంటున్నప్పుడు, సుమిత్ రుద్ర మెడలో ఉన్న లాకెట్‌ను చూసి అడిగాడు. "ఏంట్రా ఇది? ఎందుకు ఎప్పుడూ బయటికి తీయవు? అంత స్పెషలా?"
రుద్ర లాకెట్‌ని పట్టుకొని, నిట్టూర్చాడు. "నీకు తెలియనిది కాదు కదా? ఇది మా తాత ఇచ్చాడు. ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. నా కష్టాలన్నీ దీని వల్లే అయినా, దీన్ని వదిలిపెట్ట బుద్ధి కావడం లేదు. నా జీవితంలో ఇది కూడా ఏదో ఒక కారణంగానే వచ్చి ఉంటుంది. ప్రతి మనిషికి ఏం జరిగినా, అది భవిష్యత్తు గురించి నిర్మించబడుతుంది – అదే నా నమ్మకం. అందుకే దీన్ని నాకనే ఉంచుకున్నాను." తలనొప్పి వచ్చినట్లుగా నొసలు రుద్దుకుంటూ, హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమిత్ కూడా తన జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు.
(సీన్ 2: రుద్రమణుల రాజ్యం – విధ్వంసం)
(దృశ్యం: రుద్రమణుల రాజ్యం)
వారు బయలుదేరిన మరుక్షణం, దృశ్యం మారిపోయింది. ఇప్పుడు రుద్రమణుల రాజ్యం కనిపిస్తుంది. అంతా గందరగోళంగా ఉంది. స్తంభాలు కూలిపోతున్నాయి, ఇటుకలు ఎటు పడితే అటు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. A నుండి Z వరకు ఉన్న నగరాలు - అంటే 'ఏ' అనే వీళ్ళు, 'బీ' అనే నగరం - అలా Z వరకు నగరాలు కనిపిస్తున్నాయి. ప్రతి నగరం మీద ఒక వజ్రం (డైమండ్) వెలుగుతోంది.
ఒక్కసారిగా, నీలిరంగు శరీరంతో, ఎర్రటి కళ్ళతో ఉన్న ఒక పెద్ద వ్యక్తి ముందుకు వచ్చాడు. "చూడండి! మీ అందరినీ నేను ఇప్పుడే చంపేస్తాను. నాకు రుద్రమణులు ఇవ్వండి! నేను నాయకత్వం వహిస్తాను అని చెప్తే విన్నారా? ఇప్పుడు మీ అందరి చావు నా చేతుల్లోనే!" అంటూ పెద్దగా అరిచాడు. తన చేతుల నుంచి నల్లటి కిరణాలను వదులుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.
(సీన్ 3: పోరాటం మరియు త్యాగం)
అదే సమయంలో, ఒక వ్యక్తి తన భుజంపై తాబేలు షీల్డ్ లాంటిది తగిలించుకొని, చేతిలో గదతో విరుచుకుపడ్డాడు. నల్లటి కిరణాలకు అడ్డుగా తన గదను పెడుతూ పోరాడుతున్నాడు. దూరంగా ఉన్న ఎవరినో చూస్తూ, "అమ్మా! వెళ్ళిపో! నాన్న! నువ్వు కూడా! నేను చూసుకుంటా! మీరందరూ జాగ్రత్తగా ఉండండి!" అని అరుస్తూ పోరాడుతున్నాడు.
అలా అరుస్తూ ఉండగా, దూరంగా ఉన్న ఒక అమ్మాయి, "నాన్నా! ఆగు! నేను వస్తా!" అని అంది. షీల్డ్ వేసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, "చెప్పేది అర్థం కాలేదా?" అని అంటూ తన చేతిలో ఉన్న గదతో ఆ కిరణాలను కొట్టి, ఆ ఎర్రటి కళ్ళ మనిషిని ఒక్కసారిగా ఢీకొట్టాడు. ఆ వ్యక్తి రెండు అడుగులు వెనక్కి వేశాడు.
"చూడమ్మా, నేను చెప్పేది విను!" అని అంటూ తన చేతి నుంచి బంగారు రంగు వలయాన్ని సృష్టించాడు. "నాన్నా, తనను లోపలికి పంపించు!" అని ఆ అమ్మాయిని ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి పక్కనున్న ముసలి వ్యక్తి, "అమ్మా, వెళ్ళు! నేను చూసుకుంటా! మీ నాన్నకు ఏం కాదు!" అని అంటూ లోపలికి పొమ్మన్నాడు.
"ఎందుకు? ఎందుకు బాబీ? నన్నెందుకు దోబేస్తున్నావ్?" అని ఆ అమ్మాయి ప్రశ్నించింది. "చూడు తల్లీ, మీ నాన్న చెప్పేది అర్థం చేసుకో. మీ నాన్న ఎక్కడికి పంపించాడో నాకు కూడా తెలియదు. కానీ మీ నాన్న పంపించాడు అంటే నిన్ను ఆ రుద్ర గురించి వెతకమని అర్థం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నేను చూసుకుంటా!" అని అంటూ తన మనవరాలిని లోపలికి పంపి, ఆ బంగారు రంగు వలయాన్ని మూసేశాడు.
(సీన్ 4: నిస్సహాయ పోరాటం)
సీన్ కట్ చేస్తే, షీల్డ్ వేసుకున్న వ్యక్తి మళ్ళీ పోరాటంపై దృష్టి పెట్టాడు. ఎంత దాడి చేసినా కానీ, ఆ నల్లటి వలయాలు గిరగిరా తిరుగుతూ ఆ షీల్డ్ వేసుకున్న వ్యక్తిని చుట్టూ చాలా గట్టిగా గాయం చేస్తున్నాయి.
ఒక త్రిశూలం లాంటి స్పేస్ షిప్ సిద్ధం చేస్తూ, కొంతమంది వ్యక్తులు వేగంగా అక్కడికి వచ్చారు. "సార్! పదండి మనం వెళ్దాం! ఇక్కడున్న అధిపతులు చూసుకుంటారు. మనం వెళ్లి రుద్రను కనుక్కుందాం. అతను మాత్రమే మనల్ని కాపాడగలడు!" అని అంటూ ఉండగా, షీల్డ్ వేసుకున్న వ్యక్తి ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ ఉండగా, ఆ యువకులు అతనిని తమ స్పేస్ షిప్‌లోకి ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
వెంటనే అదంతా గమనిస్తున్న ఎర్రటి కళ్ళ వ్యక్తి గట్టిగా నవ్వుతూ, "పారిపోతున్నారా? ఎంత దూరం పారిపోతారు? పారిపోండి చూద్దాం!" అని అంటూ తన చేతి నుంచి నల్లటి కిరణాలను వదిలి, ఆ నల్లటి స్పెషల్ మార్చా త్రిశూలం లాంటి స్పేస్ షిప్ వెనకాల పంపించాడు.
(సీన్ 5: 26 అధిపతుల బలిదానం)
(దృశ్యం: ఎర్రటి కళ్ల వ్యక్తి ముందు)
మళ్ళీ ఎర్రటి కళ్ళ వ్యక్తి దగ్గర చూపించారు. చుట్టూ 26 మంది అధిపతులు నిలబడి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. "ఏంట్రా? మీరు నన్ను ఎదుర్కొంటారా? ఇక్కడున్న రాజు ఎందుకు లేకపోయాడో మీరంతా...!"
ఒక అధిపతి ధైర్యంగా, "ఒకరిని ఎదుర్కోవడం వేరు. ఇక్కడ 26 మంది ఒక గ్రూప్. మీరు సారీ, నువ్వు ఒకప్పుడు రాజు అయినా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎలా ఎదుర్కొంటావు ఇంతమందిని? రుద్రమణి శక్తులను ఎలా తట్టుకుంటావు?" అని అన్నాడు. ఒక్కో అధిపతి ఒక్కో రంగులో ఉన్న త్రిశూలం, కత్తి, దాలు, ఇటువంటి గొప్ప గొప్ప ఆయుధాలను విసురుతూ పోరాడుతున్నారు. కానీ నల్లటి కిరణాల ముందు వారి శక్తి సరిపోలేదు. ఎందుకంటే అక్కడికి ఇంకా రుద్రమణి అధిపతిగా, అన్నిటికీ అధిపతిగా ఉన్న ఏదో ఒకటి మిస్ అయ్యింది - అది రుద్ర కావచ్చు లేదా అతని మెడలో ఉన్న లాకెట్ కావచ్చు.
కొద్దిసేపటికి, ఎర్రటి కళ్ళ వ్యక్తి 26 మందిని కట్టుబట్టి, ఒక్కొక్కరిని చంపుతూ, "చూడండి! ఇక్కడికి ఎవరు అదిపతిలుగా, ఎంత పెద్ద యుద్ధాలు అయినా నా ముందు నిలబడలేరు! కాబట్టి మీరందరూ నాకు లొంగిపోండి!" అని అంటూ అందరినీ చంపుతూ, ఐదుగురిని "వెళ్ళిపోండి! బ్రతకండి! లేదంటే నా చేతిలో చచ్చిపోతారు!" అని అంటూ వాళ్ళను ఎక్కడికో విసిరేశాడు.
అధిపతులు వెళ్ళిపోయారు, కానీ అక్కడే ఉన్న డైమండ్స్ మాత్రం నిశ్చలంగా అక్కడే ఉండి, ప్రజలకు రక్షణ కలిగిస్తూ, ఒక షీల్డ్‌గా ఏర్పడి మొత్తం 26 నగరాలను కాపాడటం మొదలుపెట్టాయి.
(సీన్ 6: త్రిశూలం పయనం)
సీన్ కట్ అవుతుంది. ఆ త్రిశూలం లాంటి స్పేస్ షిప్, నల్లటి స్పెషల్ మార్చా త్రిశూలాన్ని ఢీకొట్టి, ఒక ముక్కను విరగగొడుతుంది. అది ఎక్కడికో వెళ్లి పడుతుంది. ఇప్పుడు బాగా లేని బేసిక్ తో, సగం దూరం వెళ్లి అక్కడే త్రిశూలం లాంటి స్పేస్ షిప్ మాయమవుతుంది.
(సీన్ 7: రుద్ర కొత్త జీవితం)
సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ముందు రుద్ర కనిపిస్తాడు. "నాకు ఏదైనా మంచి పని చూడు!" అని అంటూ ప్రేయర్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు.ఎపిసోడ్ 4: అదృష్టమా? గందరగోళమా?
(సీన్ 1: సైబర్ క్రైమ్ టీమ్)
రుద్ర ఒక పెద్ద బిల్డింగ్ ముందు అడుగులు వేస్తూ ఉండగా, అతని ఫోన్‌కి కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి టీమ్ లీడర్ రజనీ వాయిస్.
"హలో సార్, ఇక్కడ చూసేదేమీ లేదు, అంతా తినేదే!" అని రుద్ర సరదాగా అన్నాడు.
రజనీ విసుగ్గా, "సారీ సరే వినండి, చూడండి... గ్రూప్! సారీ సారీ సారీ, చూడటం కాదు వినండి! మీ ముగ్గురూ నేను చెప్పిన దానిపై పని చేయండి. ఏంటంటే... ఇప్పుడు కొత్త టెక్నాలజీ పెరగడం వల్ల డబ్బులు చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. ఎలా అంటే, మీ దగ్గర వేలిముద్ర కాదు, కనీసం నీ నీడను చూసి కూడా డబ్బులు కొట్టేసి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినది ఏంటంటే... ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఫోన్‌పే లేదా గూగుల్‌పే స్కానర్, ఇటువంటివన్నీ హ్యాక్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ డబ్బు వేసినా, చివరికి ఎక్కడికో వెళ్తుంది. ఇలాంటి వాటిని కనిపెట్టడానికి మనం సైబర్ టీమ్‌గా మారాం. ఇప్పుడు మీరు దీనిపై వర్కవుట్ చేయండి. ఇంతకుముందు ఏం కేసులు రాలేదు. దీనిమీద డీప్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఎలక్షన్స్ మొదలవుతున్నాయి. ఎక్కడ డబ్బు ట్రాన్సాక్షన్ అయినా, పెద్ద పెద్ద వాళ్ల డబ్బు పోవడంతో మన మీద పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి" అని హెచ్చరించాడు.
"సరే, ఇక నాకు టైమ్ అయ్యింది, ఫ్లైట్ మిస్ అవుతాను. మీ అందరూ నేను చెప్పిన దానిపై ఇన్వెస్టిగేషన్ చేయండి" అని చెబుతూ రజనీ కాల్ కట్ చేశాడు.
అందరు తలలు పట్టుకొని, "ఏంటి? మా మాస్టర్ లేకుండా ఎలా? మన ఊళ్లో అవుతుందా?" అని అక్కడున్న కొంతమంది నిరాశగా అన్నారు. రుద్ర మాత్రం "చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమో!" అని అనుకున్నాడు. సీన్ కట్ అవుతుంది.
ఇప్పుడు దీనిబట్టి మనకు అర్థమవుతుంది రుద్ర ఎలా కష్టపడి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో చేరాడు. రజనీ ఆఫీసర్ టీమ్ లీడర్. ఇప్పుడు అటువంటి విషయం మీదే రజనీ ఎక్కడికో వెళ్ళాడు. ఇదంతా అర్థం చేసుకున్న రుద్ర, తన అదృష్టం ఇప్పటికైనా పండుతుందేమో అని ఆశతో, ఇలా తిరుగుతూ, ఎక్కడ ఏదైనా జరుగుతుందా అని అనుకుంటూ ఉండగా, అక్కడి నుంచి సీన్ కట్ చేసి చూపించారు.
(సీన్ 2: యోగయ్య అప్పు)
(దృశ్యం: సోమరాజు కార్యాలయం)
ఒక ముసలి వ్యక్తి, యోగయ్య, కాంట్రాక్టర్ సోమరాజు దగ్గరికి వచ్చాడు. "సార్," అని మాటలు మొదలుపెట్టాడు. "సార్, నా పేరు యోగయ్య. ఇంకో రెండు మూడు రోజుల్లో నా కూతురు పెళ్ళి. దాని కోసం కొంచెం డబ్బు కావాలి. మళ్ళీ కావాలంటే, ఇంకో 10-20 రోజుల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్, ఇవ్వండి."
సోమరాజు, వడ్డీకి డబ్బులిస్తూ బాగా బతికే కాంట్రాక్టర్. "నీకు ఇవ్వడం ఇబ్బంది లేదు, కానీ నాకు..." అని ఆగి, "ఏం లేదు. ఇంటి స్థలం లేదా బంగారం ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వవచ్చు కదా?" అని అడిగాడు.
"నేను పేదవాడిని సార్. మా దగ్గర ఎలా వస్తాయి డాక్యుమెంట్స్? మీకు ఇస్తాం సార్!" అని యోగయ్య బతిమాలాడు. సీన్ కట్ అవుతుంది.
(సీన్ 3: సైబర్ దొంగతనం)
అలా రెండు మూడు గంటలకల్లా, యోగయ్య డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి కాంట్రాక్టర్ సోమరాజుకు ఇచ్చాడు. "లక్షలు డబ్బు కూడా... సరే, ఇంక ఫోన్‌పే ఉందా? నా దగ్గర క్యాష్ లేదు" అని సోమరాజు అడిగాడు. యోగయ్య తన బ్యాంక్ అకౌంట్, ఫోన్‌పే నెంబర్ చెప్పాడు. కాంట్రాక్టర్ డబ్బు వేశాడు.
ఇలా కట్ చేస్తే మరో పక్క, ఒక 10-20 మంది అక్కడక్కడా కూర్చుని, "ఏదో మనకు కొత్త కేసు దొరికినట్టుందే!" అని అంటూ చూస్తూ ఉండగా, 10 లక్షల డబ్బు పది మంది అకౌంట్లలో తలో ఇంత పడింది. అంతటితో ఆ అకౌంట్లతో, లబ్ధిదారుల అకౌంట్‌కు ఉన్న సంబంధాలను బ్లాక్ చేసి పడేశారు. అంతే, ఇక ఎవరికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. కానీ ముసలి వ్యక్తి యోగయ్యకి, కాంట్రాక్టర్ సోమరాజుకి మాత్రం వాళ్ళ దాంట్లో పడినట్లు తెలుస్తుంది. చివరికి ఆ ముసలి వ్యక్తి ఎంతో సంతోషంగా రెండు మూడు రోజుల్లో పెళ్ళి జరిపేసి తన భారం తీర్చుకోవాలని ఆశతో వెళ్ళిపోతాడు.
(సీన్ 4: మోసం బయటపడింది)
మరుసటి రోజు, కాంట్రాక్టర్‌కి ఫోన్ చేసి, "ఏంటి సార్? మీరు డబ్బులు వేస్తానని డబ్బులు వేయలేదు? నేను ఎలా ఒప్పుకుంటాను? మా పేపర్స్ కూడా మీకే ఇచ్చాం. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలి? డబ్బులు పడలేదు!" అని ముసలి వ్యక్తి యోగయ్య మొదలుపెట్టాడు.
అయినా కానీ, సోమరాజు అది పట్టించుకోకుండా, "చూడవా, డబ్బులు నావి కూడా పోయాయి. నీకు వేశాను, అది నాకు తెలిసింది. కానీ నువ్వు చెప్పకముందే నాకు అర్థమైంది. నేను బ్యాంకులో ఉన్నాను. నా డబ్బులు ఎలా పోయిందో నాకు అర్థం కావడం లేదు. నేను వేసింది నీ దాంట్లోకి వచ్చినట్లు ఫస్ట్ చూపించింది. ఇప్పుడు ఎటువంటి సంబంధం లేని లాగా, అసలు నీకు నాకు లింకే కానట్టుగా చూపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరే ఏదో మోసం చేశారు. నా డబ్బులు మాకు ఇవ్వండి!" అని బెదిరించడం మొదలుపెట్టాడు సోమరాజు.
(సీన్ 5: రుద్ర చిరాకు, లాకెట్ మెరుపు)
ఇదంతా పోలీస్ కేసుకి చేరుకుంది. పోలీసులకు అర్థం కాలేదు. వెంటనే రజనీకి ఫోన్ చేశారు. అందరూ తలలు బాదుకున్నారు. అప్పుడే రుద్ర పక్కనున్న వ్యక్తి మాట్లాడుతూ, "మనందరం మూసుకోవాల్సిందే!" అని అంటూ తల పట్టుకున్నాడు.
రుద్ర చాలా అయోమయంగా, "ఏంటి ఇది? నా వల్ల జరిగిందా?" అని అనుకుంటూ కంప్యూటర్ దగ్గర కూర్చుని ఏదేదో నొక్కుతూ ఉన్నాడు. అసలు ఏమీ కాకపోవడంతో విసుగు చెంది, కంప్యూటర్ని పక్కన కొట్టి, "ఏంటిది?" అని చిరాకు పడ్డాడు.
అదే క్షణంలో రుద్ర మెడలో ఉన్న లాకెట్ మెరవడం మొదలుపెట్టింది.
(సీన్ 6: అక్షర ప్రవేశం – కాలం స్తంభించింది)
ఇలా కట్ చేస్తే, మరో వైపు ఒక అద్భుతం జరగడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి (అక్షర) ఆకాశం నుంచి కిందికి దిగుతూ ఉంది. ఎప్పుడైతే ఆకాశం నుంచి కిందికి దిగుతూ ఉందో, ఒక్కసారిగా ట్రాఫిక్ ఆగిపోయింది. మనుషులు కదలడం లేదు. పక్షులు కదలడం లేదు. గాలి వీస్తుందా లేదా అన్నది కూడా అర్థం కావడం లేదు.
ఆ తరువాత ఆ అమ్మాయి రోడ్డు మీద దిగి, తన బైక్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే కదిలిందో, ఆ వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఖాళీ, పక్షులు, మనుషులు అందరూ మామూలు అయిపోయారు. ఇలా సీన్ కట్ అవుతుంది.ఎపిసోడ్ 5: రహస్య ఛేదన
(సీన్ 1: రుద్ర మేధాశక్తి)
అక్షర ఆకాశం నుంచి కిందకు దిగుతూ ఉండగా, ఇక్కడ రుద్రకు ఏదో మెరుపు తట్టింది. అతను తన దగ్గర ఉన్న కొన్ని అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులను బయటికి తీశాడు. వాటిని కలిపి ఏదో ఒక పెద్ద కమ్యూనికేషన్ లేయర్ లాంటిది సృష్టించి, దాన్ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేశాడు. బ్లాక్ చేసిన అకౌంట్స్‌ని, వాటి లొకేషన్స్‌ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు.
ఇదంతా గమనిస్తున్న చుట్టూ ఉన్న పదిమంది సిబ్బంది బిత్తరపోయి చూస్తున్నారు. "ఏంటి చేస్తున్నావు రా? అసలు రజనీ సార్‌కి తెలిస్తే నీ పని అయిపోతుంది! కనీసం రజనీ సార్‌కి కూడా ఇది తెలిసి ఉండదు!" అని ఆశ్చర్యపోయారు.
రుద్రకు బ్లాక్ చేసిన అకౌంట్స్ ఒకటి కాదు, కనీసం 20కి పైగా ఉన్నాయని తెలిసింది. నిన్న మొన్న చేసిన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ ఒకటి, 'దా సిరీస్' అనే పేరుతో ఉన్న అకౌంట్‌తో కనెక్ట్ అయ్యింది. మొన్న డబ్బు పోయిన రోజు, ఆ యోగయ్య, సోమరాజు ఇద్దరి అకౌంట్లకు కనెక్ట్ అయ్యి, తర్వాత