Read Not the End - 61 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 61

    సత్యయుగ గ్రహం: కల్కి కోసం శిక్షణఇక అక్కడ కట్ చేస్తే, మళ్ళీ హ...

  • అర్ధం కాని ప్రేమ”

    చదువంటే భయపడే ఒక యువకుడి జీవితంలోకి అనుకోని అతిథిలా అడుగుపెట...

  • K A.U

    చార్మినార్ రక్తపాతం (The Bloodbath of Charminar) దృశ్యం 1: చ...

  • addu ghoda

    Scene: Interior – Car – Eveningకథ పేరు అడ్డుగోడ…కారు లోపల వా...

  • నిజం - 1

    సాగర తీరానికి ఆనుకొని ఉన్న నగరం విశాఖపట్టణం. ఆ నగరం లోని గాజ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 61

సత్యయుగ గ్రహం: కల్కి కోసం శిక్షణఇక అక్కడ కట్ చేస్తే, మళ్ళీ హీరోల వైపు చూపిస్తారు. హీరోలు అందరూ ఒక చోట నిలబడి ఉంటే, వాళ్ళందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడే హనుమంతుడు చిన్నగా నవ్వుతూ, "ఇది మాహిష్మతి సామ్రాజ్యం కాదు. ఇందులో రాజులు లేరు, రాణులు లేరు. ఇది ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఏలగలిగేది కేవలం కృష్ణుడు మాత్రమే. కాబట్టి మీరు అంత తీవ్రమైన ఆలోచన చేయకండి. ఆ కృష్ణుడు తలచినట్టే యుద్ధం జరుగుతుంది. మీరు ఎలా తలిస్తే అలా జరగదు. కాబట్టి మీ సైన్యాలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టండి," అని హెచ్చరించాడు. "మొత్తం అందరిని ఒక చోటికి చేర్చండి," అన్నాడు.వెంటనే అక్కడికి వచ్చిన అశ్విని హనుమంతుడితో, "శుభోదయం! ఈ సైన్యాన్ని మొత్తం మా సత్యయుగ గ్రహంలో ఈ శిక్షణ ఇవ్వగలిగితే మంచిది ఏమో కదా? అక్కడ కూడా చాలా విచిత్రమైన సన్నివేశాలు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న సైనికులు అక్కడ ఇంకా బాగా ట్రైనింగ్ అవ్వచ్చు," అనడంతో హనుమంతుడు, "సరే, మీరు వెళ్ళండి. అది నా ప్రదేశమే కాబట్టి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు," అన్నాడు.ఇక సామ్రాట్, రుద్ర, విక్రమ్, విక్రమార్క, అర్జున్, మాయ అందరూ తమ సైన్యాలతో సహా అక్కడికి బయలుదేరారు. అందరూ సత్యయుగ గ్రహం అని ఉన్న సముద్రపు అడుగున దాగి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఎంతో అద్భుతమైన భవనాలు, అందమైన ఇళ్లులు, అందమైన మనసులు, అంతకంటే అద్భుతంగా కనిపించే సముద్ర జీవులు. వాటిని చూస్తూ రుద్ర ఇలా అంటున్నాడు, "ఇది దాదాపు రుద్రమనుల లోకంలోకి చాలా దగ్గరగా ఉంది."వెంటనే అక్కడ పరశురాముడు కనిపిస్తూ, "ఇది రుద్రమనుల లోకం ఒకటే, అది మీ లోకంలో రుద్రమనులు అని పిలవబడుతుంది. ఇక్కడ సత్యయుగ గ్రహం అని పిలవబడుతుంది. ప్లేసులు వేరే, కానీ శిక్షణ ఒకటే, శక్తులు కానీ భావాలు ఒకటే," అని అన్నాడు.అలాగే మాట్లాడుతూ, "అక్కడ హనుమంతుడి శక్తితో రుద్రమనుల లోకం వెలసింది. ఇక్కడ ద్వారక మునిగిపోయిన తరువాత శ్రీకృష్ణుడి గుండె ఇక్కడ మిస్ అవుతుంది కదా, దాంతో ఇక్కడ దీనికి సత్యయుగ గ్రహం అని వచ్చింది. ఇది ఇప్పుడు ఏంటో నీకు అర్థం అవుతుందా? ఇదే ద్వారక," అని అన్నాడు. అది విన్న తర్వాత "అంటే ఇది నిజమే!" అని అనుకుంటూ అప్పుడే సామ్రాట్ అక్కడికి రావడంతో, "చూసావా సామ్రాట్ మెడలో ఉంది కదా, అది శ్రీకృష్ణుడి గుండె. అది ఎప్పుడు ఎలా ఉప యోగపడుతుంది ఎవరికి తెలియదు. ఇప్పటికీ సామ్రాట్‌ను పెద్ద హీరో చేసింది," అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు.అలాగే ముందుకు వెళుతూ ఉంటే, "ఇక్కడ ఒక విశిష్టమైన అర్జెంటు ఉంది తెలుసా?" అని అంటూ ఒక చెట్టును చూపిస్తాడు. "ఇదే శ్రీకృష్ణుడి రక్తంతో మొలిచిన చెట్టు. అప్పుడు పుట్టినప్పుడు బాణం తాకుతుంది కదా శ్రీకృష్ణుడికి, ఆ రక్తం బొట్టులో నుంచి ఈ చెట్టు పుట్టింది. ఇది తను మళ్ళీ పుట్టడానికి తానే నిర్ణయించుకున్న ఒక రక్తంతో నిండిన చిన్న చెట్టు. ఈ చెట్టుకు మూడు రకాల రంగులు ఉన్నాయి: అందులో పసుపు, బంగారు, నీలి రంగు. ఈ మూడు రంగులు ఇప్పుడు పువ్వుల్లా కనిపిస్తున్నాయి. ఇవి పండుగా మారి ఎప్పుడైతే సువాసన వస్తుందో, అప్పుడే శ్రీకృష్ణుడి కల్కి అవతారం భూమి మీదికి వస్తుందని నమ్మకం. ఇప్పుడు మీ అందరూ ఈ కనెక్షన్‌తో ముడిపడి ఉన్నారు. మీ 5 మంది భార్యల కడుపులో శ్రీకృష్ణుడి అంశా నిలబడి ఉంది. ఇది ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు, కానీ ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. కనులారా వీక్షించడానికి నేను ఎప్పటినుంచో ఉన్నాను. ఆ తర్వాత ఈ గ్రహం కూడా ఉంటే ఉంటుంది, లేదా ఇది కూడా మాయమవుతుంది," అని చెప్పడంతో పరశురాముడు నిరాశగా, "అప్పుడు నేను భూమ్మీద నుంచి వేరే చోటుకు వెళ్ళాలి. అప్పుడే నా శాపం తొలగుతుంది," అని అన్నాడు.

యుద్ధ సన్నాహాలు: ద్వారకలో శిక్షణద్వారకా నగరం – సత్యయుగ గ్రహం –లో అడుగుపెట్టగానే, సామ్రాట్ తండ్రి ప్రజలందరినీ, ముఖ్యంగా వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరినీ యుద్ధానికి సిద్ధం చేశాడు. అతని మాటలు శాసనంగా మారాయి; ప్రతి ఒక్కరూ ఆయన నియమానుసారం కఠినమైన శిక్షణలో మునిగిపోయారు. కొత్తగా వచ్చిన సైనికులు సైతం అతని సూచనలను పాటిస్తూ, టెలిపోర్టేషన్ నైపుణ్యాలను అలవర్చుకున్నారు. ఒక చోట నుంచి మరో చోటికి అదృశ్యం కావడం, తిరిగి కనిపించడం – ఈ పనిని రోజుకు 24 గంటలు అలుపు లేకుండా కొనసాగించారు. ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారని ప్రతిరోజూ పర్యవేక్షించబడ్డారు. ఇలా వారం రోజులకు పైగా శిక్షణ తీసుకున్నారు.శకుని వ్యూహం: భార్యల కడుపులోకి నెగటివ్ ఎనర్జీమరోపక్క, విలన్స్ కూడా అదే పనిగా శిక్షణ తీసుకుంటున్నారు. వారికి తెలిసిన, తెలియని ప్రతి పనిలో ఏదో ఒక వ్యూహాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆ ఐదుగురు హీరోయిన్ల కడుపులో చిన్నగా ఎవరో తన్నుతున్నట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపించడంతో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలాగే హీరోయిన్స్ ఒక పాటను కూడా రచించారు.అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఎదురవుతుండగా, హనుమంతుడు, అశ్వద్ధామ, రుద్ర మళ్లీ ఒక చోటికి చేరుకున్నారు. అది మరెక్కడో కాదు, మహాభారత సంగ్రామం జరిగిన యుద్ధభూమి. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగా అశ్వద్ధామ కళ్ళల్లో నీళ్లు నిండాయి. "నేను ఎంత పెద్ద పాపం చేశాను! ఆ పాపానికి శాపంగా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు, యుగాలు గడిచినా ఇక్కడే ఉన్నాను," అని బాధపడ్డాడు. అతని రోదన ఇంకా ఎక్కువ అవుతూ ఉండగా హనుమంతుడు, "ఇది నువ్వు కావాలని చేసింది కాదు. ఈ సృష్టి కావాలని చేయించింది. దానికి మనం బాధ్యులం అయ్యాం అంతే," అన్నాడు.ఇదే సమయంలో, శకునికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. రుద్రను చూసిన తర్వాత నుంచి అతనికి ఒక సందేహం కలిగింది. "వీడు ఇంత బలంగా ఉంటే, ఇతడి కుటుంబం ఎలా ఉంటుంది?" అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు భైరవ చెప్పిన మాటలు మరొకసారి గుర్తుకు వచ్చాయి – "రుద్ర వాళ్ళ భార్య కడుపుతో ఉందని, తన కడుపులో ఒక దివ్యమైన వెలుగు కనిపిస్తుంది," అని చెప్పడం శకునికి మరింత టెన్షన్ కలిగించింది. "అసలు ఏంటిది? వీళ్ళకే, మానవులకు ఇంత శక్తి ఎలా వస్తుంది?" అని అనుకుంటూనే అతను మరో వ్యూహం పన్నడం మొదలుపెట్టాడు."ఒకవేళ ఈ హీరోయిన్లందరికీ ఒకేసారి ఏదైనా చేస్తే, హీరోలు ఒక్కసారిగా బలహీనపడతారు," అని ఆలోచించి, తన నెగటివ్ ఎనర్జీ ద్వారా ఏడు రంగుల బాల్స్‌ను సృష్టించాడు. వాటిని ఒకదానితో ఒకటి కలిపి, ఐదు రకాల శక్తివంతమైన నెగటివ్ బాల్స్‌గా మార్చాడు. వాటిని హీరోయిన్ల కడుపులోకి పంపాలి. అలా చేసినప్పుడు, వాళ్ళ కడుపులో ఉన్న పిల్లలు శరీరం పోగొట్టుకొని ఒక దివ్యమైన వెలుగుగా కనిపిస్తూ ఉంటారు.యుద్ధ ప్రకటన: కృష్ణాష్టమి నాడు ప్రళయంహనుమంతుడు, అశ్వద్ధామ, రుద్ర అక్కడే ఉన్నారు. అశ్వద్ధామ బాధను హనుమంతుడు తన మాటలతో తీరుస్తూ ఉండగా, అశ్వద్ధామ మళ్ళీ స్థిరంగా, "అవును హనుమ, యుద్ధం ఏ రోజు ప్రకటిద్దాం?" అని అడిగాడు. "ఇంకేముంది, శ్రీకృష్ణుడి జన్మదిన రోజునే యుద్ధం!" అని అన్నాడు హనుమంతుడు. "అలా ఎందుకు?" అని అడగ్గా, "ఆ ఒక్క రోజే మనకు యుద్ధం ప్రారంభించడానికి అయినా, యుద్ధం ముగించడానికి అయినా టైం ఉంటుంది," అని అంటూ సీన్ కట్ అవుతుంది.మరుసటి రోజు కృష్ణాష్టమి. ఆడవాళ్ళందరూ పూజలకు సిద్ధమవుతున్నారు. ఐదు మంది గర్భిణీ స్త్రీలు – హీరోయిన్లు – చీరలు కట్టుకొని ఉదయాన్నే రెడీ అయ్యారు. పూజల్లో కూర్చున్నారు. అలా కట్ చేస్తే, హీరోలు, వారి సైన్యం మొత్తం యుద్ధ భూమిలోకి దిగారు. అటుపక్క నుంచి, నల్లటి మేఘాల మీద శకుని తన సైన్యం మొత్తంతో దిగుతున్నాడు. హీరోలు – రుద్ర, విక్రమ్, విక్రమార్క, అర్జున్, సామ్రాట్, శివ – వీళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు. రుద్రను వెనక్కి రమ్మన్నట్టుగా, వారికంటే వెనకాల ఉన్న హనుమంతుడు, అశ్వద్ధామ, అలాగే పరశురాముడు పిలుస్తున్నారు. ఇప్పుడే యుద్ధం చేయాలనే తపనతో ఉన్న రుద్ర ఒక్కసారిగా నీరసంతో, "ఎందుకు నన్ను ఆపుతున్నారు?" అని అడిగాడు.శకుని దాడి, భూలోకపు అల్లకల్లోలంహీరోలు అందరూ దూకుడుగా పని చేస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తుంటారు. శకునికి టెన్షన్ పట్టుకుంటుంది. "ఇలానే ఎలా ఆపాలి?" అని అయోమయంలో పడతాడు. అప్పుడే తన దగ్గరున్న శక్తిని ఉపయోగించి, ఏడు రంగుల ఇంద్రధనస్సు లాంటి ఒక బాల్‌ను సృష్టించాడు. వాటిని ఐదుగా కలిపి, ఒక శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీతో కూడిన బాల్స్‌గా మార్చాడు. వాటిని ఇప్పుడు సత్యయుగ గ్రహంలోకి పంపాలి. అది ఎలాగో ఆలోచిస్తున్నప్పుడు, ఆకాశంలో ప్రయాణిస్తున్న మాయ వాళ్ళ అమ్మ కనిపిస్తుంది.ఆ నెక్స్ట్ ఆ యుద్ధం మధ్యలోనే కార్తికేయ తన నెమలి మీద ఎగురుతూ వస్తాడు. ఆ నెమలికి ఉన్న ఈక యుద్ధం మధ్యలోనే ఒకటి విడుదలవుతుంది. దాన్ని చూడగానే అందరూ నమస్కరిస్తారు. అప్పుడే ఏం చేయాలని ఆలోచిస్తున్నా శకుని మెదడులోకి ఆ నెమలీక ప్రయాణిస్తుంది. అది చెప్పినట్టుగా శకుని పని మొదలుపెడతాడు. ఆ బాల్‌ను మాయ వాళ్ళ అమ్మతో పాటు పంపిస్తాడు. దానికంటే ముందు సత్యయుగ గ్రహంలోకి ఈ నెమలీక ప్రవేశిస్తుంది. ఆ నెమలీక రాకుండా ఉంటే ఆ లోకంలోకి ఈ నెగటివ్ ఎనర్జీ పోలేదు.ఆ వెంటనే అక్కడ పూజ చేస్తూ, హారతులు, పుష్పాలతో కృష్ణుడికి పూజిస్తూ ఉండగా, హీరోయిన్లు ఐదు మంది పూజలో కూర్చొని ఉంటారు. అప్పుడే ఆ నెగటివ్ ఎనర్జీ హీరోయిన్ల కడుపులోకి ప్రవేశిస్తుంది. ఆ దెబ్బకు హీరోయిన్లందరూ చిన్నగా అరుస్తారు. కానీ ఆ శబ్దం యుద్ధ భూమిలో గట్టిగా, ప్రాణం పోయేంతగా వినిపించడం మొదలుపెడుతుంది. హీరోలందరూ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతారు. "ఏం జరుగుతుంది?" అని అయోమయంలో పడతారు.అదే సమయంలో శకుని, ధర్మకు సిగ్నల్ ఇస్తాడు. వెంటనే ధర్మ తన సైన్యంతో భూలోకంలో అల్లకల్లోలం సృష్టించడం మొదలుపెడతాడు. ప్రజల బాధలు, ఆక్రందనలు, కొంతమంది కాళ్లు చేతులు నరికేస్తే వారి బాధలు, కన్నీళ్లు నెగటివ్ ఎనర్జీగా మారుతున్నాయి. "పిల్లలు చనిపోయారు," అని, "భవనాలు కూలిపోయాయి," అని చుట్టూ ప్రజలు ఏడ్చే కొద్దీ, నెగటివ్ ఎనర్జీ యుద్ధభూమిలోకి ప్రవేశించడం మొదలుపెడుతుంది.

ఎలా ఉంది స్టోరీ