Read Not the End - 52 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 52

సరే అని అంటూ అర్జున్, "నేను ఎలా ఉన్నాను, ఎక్కడ పుట్టాను నాకు కూడా తెలియదు. మా గురువుగారు విశ్వనాథ్ గారు మమ్మల్ని పెంచారు. కానీ అది మామూలుగానే ఉంది. ఏదో విపత్తు జరిగినట్టుగా ఒక్కసారిగా అఘోరాలు అందరూ గ్రూప్ దగ్గరికి వచ్చారు. అందరూ ఒకటే ప్రశ్న, 'గురువుగారు, ఏదో జరగబోతుంది. మనం ఇంకా ప్రారంభించాదామా?' అని అంటారు. మా గురువుగారు కూడా అవునన్నట్టు సైగ చేస్తారు. అంతే, అక్కడ ఉన్న అఘోరాలు అందరూ ప్రతి చోటుకు వెళ్లి కొంతమందిని వెతికి వాళ్ళ చేత కొన్ని పాఠశాలలు తెరిపించి విద్యలు నేర్పించడం మొదలుపెట్టారు."

అలా కొదమ కథ చెబుతూ కథలోకి వెళ్ళిపోదాం. అలా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఒక వ్యక్తి పిల్లలందరికీ చెప్తున్నాడు, "మనం రాబోయేది చాలా కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మీ శక్తుల వల్ల ఈ భూమికి రక్షణ కలుగుతుంది. ఒక మహా మాంత్రికుడు, తెలివైనవాడు, క్రూరమైనవాడు భూమిని అంతం చేయడానికి సిద్ధమవుతున్నాడు. వారిని మనం ఆపలేం. కానీ మన శక్తులన్నీ కలిస్తే కొద్దిగా టైం పడుతుంది," అని అంటూ ప్రజలకు చెప్తూ ఉండగా, అందులో విశ్వ అనే ఒక వ్యక్తి, "మీనాక్షి, అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఇంకా రాలేదు ఎందుకు? ఈ కథ అంతా అయిపోయేసరికి వాడిని ఎగిరి తంతాడు సారు," అని అంటున్నాడు. మీనాక్షి చిన్నగా నవ్వుతూ, "వస్తాడులే," అని అంటుంది.

అర్జున్ అల్లరి, పరీక్షల ప్రకటన

ఇక క్లాస్ అయిపోయింది. విశ్వనాథ్ అక్కడికి వచ్చాడు. "ఎక్కడికి రా వాడు? ఎక్కడ?" అని అంటున్నాడు. "తెలియదు గురువుగారు," అని విశ్వ అంటున్నాడు. "నేను వెళ్లి తీసుకొస్తాను," అని మీనాక్షి పైకి లేచి వెళ్తుంది. విశ్వ కూడా బయలుదేరి ఇద్దరూ పిలుస్తున్నారు, కానీ అర్జున్ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే వెళ్లి దాన్ని గట్టిగా పట్టుకొని రాలినట్టుగా అర్జున్ కిందపడ్డాడు. "అసలు ఏం జరిగింది రా? ఎక్కడికి వెళ్ళావు క్లాస్ వినకుండా?" అని అంటున్నాడు విశ్వ. అర్జున్ తన చేతిలో మామిడిపండు చూస్తూ, "ఎలా ఉందో చూశారా? ఎర్రగా మాగిన దూర మామిడిపండు భలే ఉంది కదా," అని అంటూ దాన్ని తింటున్నాడు. విశ్వ గట్టిగా ముష్టికాయ వేసి, "సరే, రేపటి నుంచి మీకు పరీక్షలు మొదలవుతాయి," అని అంటూ చెబుతూ, "మీరు ఈరోజు ఎంజాయ్ చేసేది ఉంటే వెళ్లి చేసుకొని రండి. రేపటి నుంచి మీరు ఎక్కడ ఎవరు ఉంటారో నాకు కూడా తెలియదు," అని అంటున్నాడు. "సరే," అని అందరూ "థాంక్స్ గురువుగారు," అని అంటూ మీనాక్షి చేయి పట్టుకొని అంటున్నాడు. మీనాక్షి చిన్నగా నవ్వుతూ చెయ్యి విడిపించుకుని అలా సీన్ కట్ అవుతుంది.అర్జున్ ఆలోచనలో ఉండగా, ఒక్కసారిగా అతని శరీరం వేడెక్కింది. చెప్పలేనంత కోపం అతన్ని ఆవరించింది. అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. మళ్ళీ అదే దృశ్యం, ఎవరో మాట్లాడుతున్న మాటలు. "నువ్వు అతన్ని చంపడం నీ గొప్పతనం కాదు. అతనికున్న శాపాలు, అధర్మం వైపు నిలబడటమే అతన్ని నీ చేతిలో చంపించాయి. నిజం చెప్పాలంటే, నువ్వు అతని చేతిలో ఎప్పుడో చనిపోవాల్సిందే." ఆ మాటలు వినిపించాయి. వెంటనే, "నీ అన్నను నువ్వే చంపావు, ఎందుకు చంపావు? కనీసం పాపం అనిపించలేదా?" అన్న ప్రశ్న వినిపించింది. అర్జున్ మళ్ళీ గట్టిగా అరుస్తూ చేతిని బయటికి విసిరాడు. అతనిలోని కోపం ఒక ఫినిక్స్ పక్షిలా ఒక్కసారిగా బయటపడింది.

అలా ఆ దృశ్యం కట్ అవ్వగానే, వచ్చిన ఫినిక్స్ కూడా అతనిలో తిరిగి కలిసిపోయింది. తనకు మూడు జీవుల మానసిక శక్తితో అనుసంధానం అయిందని అర్థం చేసుకున్న తర్వాత, అర్జున్ అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి మరోచోట ప్రత్యక్షమయ్యాడు. అది కూడా ఒక అడవి. "ఇప్పుడేం చేయాలి అసలు? ఏమైంది నాకు? ఇంత అలసటగా ఎందుకుంది? ఎవరో కొట్టినట్టుగా ఇంత బాధ ఎందుకు? నేను ఏం చేశాను అసలు? అది కలా, నిజమా?" అని గందరగోళంలో ఉన్నప్పుడు, ఒక పిల్లి పిల్ల అతని భుజంపైకి ప్రత్యక్షమైంది. అది "మియా మియా" అంటూ ముందుకి వెళ్ళమని చెప్పినట్టుగా అరవగా, తన మనసులో మాత్రం "ముందుకు వెళ్ళు, ఏదో జరుగుతోంది" అని వినిపించింది. "అసలు ఏం జరుగుతోంది? నాకు ఏమైంది?" అనుకుంటూనే అతను ముందుకు వెళ్ళసాగాడు. పిల్లిపిల్ల మాయమైపోయింది. వెంటనే ఒక గబ్బిలం శబ్దం చేస్తూ, "రా" అన్నట్టుగా అతన్ని ముందుకు తీసుకువెళ్లింది. కొద్ది దూరంలో ఏదో వేడి లావా పొంగుతున్నట్టుగా అనిపించింది.

ఒక చిన్న గుంటలో లావా పొంగుతూ ఉండగా, ఆ లావా మధ్యలో ఒక గుడ్డు లాంటిది కనిపించింది. కొంతమంది అసురులు అక్కడికి వచ్చి ఇంజెక్షన్లు వేస్తున్నారు. వాళ్ళ చేతిలో ఒక సీసా లాంటి వస్తువులో ఒక ఎర్రటి ఆత్మ కనిపించింది. ఆ ఆత్మ గబ్బిలాన్ని చూడగానే సహాయం చేయమని చూసింది. వెంటనే గబ్బిలం అర్జున్‌కి ఆ ఆత్మను చూపించింది. అర్జున్ "ఏం జరుగుతోంది?" అనుకుంటూ దగ్గరికి వెళ్తుండగా, వందమంది అసురులు ఆ ఆత్మను తీసుకొని దగ్గరికి వచ్చారు. "ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని వాళ్ళు అనగానే, ఆ గుడ్డు లావా ఒక్కసారిగా మాయమైపోవడంతో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వెంటనే అర్జున్ వాళ్ళను పట్టుకొని "ఎవడ్రా మీరు? ఏం చేస్తున్నారు? మీరంతా మాయగాళ్లా? ఏం చేస్తున్నారు ఇక్కడ?" అంటూ వాళ్ళను కొడుతుండగా, వాళ్ళు మాయమవుతున్న సమయంలోనే ఆ సీసా పగిలిపోయింది. ఆ పిల్లి ఆ సీసాను పట్టుకొని పగలగొట్టింది.

వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ వచ్చారు. "జాన్ గాడు ఎక్కడ? వాణ్ణి నేను అంతం చేయాలి" అని ఒక వ్యక్తి అంటున్నాడు. "ఎవరురా నువ్వు? నీకు చెప్పేది అర్థం కావడం లేదా? వాడెవడో నాకు తెలియదు. కేవలం నాకు ఇచ్చిన పనిని నేను చేయాలనుకుంటున్నా" అని మరొకరు అంటున్నాడు. దూరంగా ఒక చిన్న గుహలోంచి వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ బయటికి వస్తున్నారు. "ఈ అసురుని నువ్వు కొడుతున్నావ్? నా పేరు తెలుసా?" అని ఒకడు అంటున్నాడు. "నా పేరు మకరధ్వజుడు" అని అంటూ ఉండగా, దృశ్యం కట్ అయింది.

అప్పుడే అర్జున్ కూడా అక్కడికి వెళ్లి మకరధ్వజుని పట్టుకొని "అసలు ఏం జరిగింది మిత్రమా? ఎవరు ఇతడు?" అని అడిగాడు. "చెప్తా, కానీ ఫస్ట్ ఇవి పట్టుకొని ఆ జాన్ గాడు ఎక్కడున్నాడో అడుగు. లేదంటే మన ప్రపంచానికి ఆపద వస్తుంది" అని మకరధ్వజుడు అన్నాడు. "అవునా? ఎందుకు?" అని అర్జున్ అడిగాడు. "ఎందుకు అని ఇప్పుడు అడగకూడదు మిత్రమా, సహాయం చెయ్యి" అని మకరధ్వజుడు చెప్పాడు. "సరే" అని అర్జున్ కూడా ముందుకు వెళ్తుండగా, మకరధ్వజుడు ఒక్కసారిగా అర్జున్‌ను కొట్టి, "ఎవడ్రా నువ్వు? నన్నే పట్టుకుంటావా?" అన్నాడు. వెంటనే అర్జున్‌కు కోపం రావడంతో అతనిలో నుంచి ఫినిక్స్ బయటికి వచ్చి చుట్టూ అడ్డగించింది. వెంటనే "విక్రమ్ సూపర్" అంటున్నాడు. "ఆ విక్రమ్ వేరే, ఈ విక్రమ్ వేరే విక్రమ్, ఓకేనా? కన్ఫ్యూజ్ కాకు. నా పేరు విక్రమార్క. థాంక్స్ బ్రదర్" అని ఆ వ్యక్తి అన్నాడు. వెంటనే తన చేతులతో ఒక బాణం లాంటిది సృష్టించి, దాని చివర్న ఏదో డైమండ్ లాంటిది పెట్టి మకరధ్వజుని చంపుతూ, "చెప్పు, వాడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు" అని అంటుండగా, "చెబుతా, నన్ను చంపకు" అని మకరధ్వజుడు అన్నాడు. "వెంటనే చెప్పు" అని విక్రమార్క అన్నాడు. "అతడు వేరే లోకానికి వెళ్ళిపోయాడు. అతనిని కనుక్కోవడం అసాధ్యం" అని మకరధ్వజుడు చెప్పాడు. "చాలు, వాణ్ణి ఎలాగైనా నేను కనుక్కుంటా" అని అంటూ గుండెల్లో బాణం దించాడు. వెంటనే మకరధ్వజుడు విక్రమార్క పేరును గట్టిగా పలుకుతూ ఎక్కడికో పంపించాడు. ఇలా దృశ్యం కట్ అయింది.

అతన్ని చంపిన తర్వాత "సరే మిత్రమా, నేను వెళ్తున్నాను" అని విక్రమార్క అన్నాడు. "నీ పేరు విక్రమార్క. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?" అని అర్జున్ అడిగాడు. "నాది భూమి. మనదే కదా? ఇంకెందుకు అడుగుతున్నావ్? నేను ఒక నగరం నుంచి వచ్చాను" అని తనకి జరిగిన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అది పెద్ద కథ అని, "ఇంకెప్పుడైనా చెప్తాలే మిత్రమా, ఇదిగో దీన్ని తీసుకో. ఎప్పుడైనా కలవాలనిపిస్తే నన్ను పిలుచు" అని అన్నాడు. వెంటనే అక్కడ పని పూర్తవగానే మళ్ళీ అర్జున్ తన గురువు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు. "ఓకే, ఇప్పుడు నువ్వు వేరే చోటికి వెళ్ళాలి" అని గురువు అన్నాడు. వెంటనే అక్కడి నుంచి అర్జున్ ధర్మా నీ కలిసి, విక్రమ్‌తో స్నేహం చేసి కథను ముగించాడు.