Read Not the End - 51 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 51

గురువుగారు, నా ప్రశ్న సమాధానం ఇస్తారా?" అని రుద్ర హనుమంతుడిని అడిగాడు. హనుమంతుడు, "ఆ, అర్థమైంది," అని అంటూ ఏంటంటే  సామ్రాట్ కూడా మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి వంశంలో పుట్టిన వాడు కాబట్టి నమస్కరించింది," అని చెప్పాడు.

"ఏంటి వంశమా? శ్రీకృష్ణుడు వంశమా? అర్థం కాలేదే," అని అంటాడు శివ. "అర్థం కావాలంటే నీకు వాసుదేవ వంశం గురించి తెలియాలి," అని అంటాడు హనుమంతుడు, రుద్రను, శివను మరియు సామ్రాట్‌ను చూస్తూ. సామ్రాట్ ఇలా అంటాడు, "నాకు అర్థం కాలేదు. వాసుదేవ వంశం నేను ఎప్పుడో ఎక్కడో విన్నానే," అని ఆలోచిస్తూ, "అవును, అప్పుడు ధర్మ గాడు తప్పించుకునే టైంలో ఆ వంశంలో ఒకరు ఎవరో చాలా లగ్జరీగా ఉన్నారు, ఎవరికి కనిపించకుండా దూరంగా నిలబడి చూస్తున్నారు. ఆ కొద్దిసేపటికి నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అర్థం కాలేదు," అని అంటాడు సామ్రాట్.

"మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, ఆ బుజ్జి మాత ఎవరో కాదు, శ్రీకృష్ణుడి వంశంలో ఒక ఆమె. చివరికి ఆమె తప్పించుకొని ఒక మానవ కన్యగా మారి తన సంతానం ద్వారా మీ వంశాన్ని అభివృద్ధి చేసింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్లిపోయిందో మీ వంశానికి కూడా తెలియదు. మీ వంశం ఇప్పుడే కనిపించదు ఎందుకంటే అది రహస్యంగా దాక్కుని ఉంది. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే వాళ్ళు బయటికి వస్తారు. అప్పటిదాకా ఎవరూ కనిపెట్టలేరు," అని అంటాడు హనుమంతుడు. "అందుకేనా ధర్మ గాడు వాళ్ళను పట్టుకోలేకపోయాడు," అని అంటాడు సామ్రాట్.

కొత్త లోకాలకు వలస

మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడ సీన్ కట్ అవుతుంది. సత్యయుగ గ్రహం అని ఒక గ్రహంలో చూపిస్తారు. అది గ్రహం కాదు సామ్రాట్. అంతకుముందు గెలిచి, చనిపోయి మళ్ళీ బ్రతికిన సమయంలో ద్వారక మళ్ళీ వెలసింది. ఆ ప్లేస్ పేరు సత్యయుగ గ్రహం అని పెట్టారు. అక్కడ ఇప్పుడు వాసుదేవ వంశం మొత్తం అక్కడ చేరింది. "నాన్న, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ద్వారక మళ్ళీ వెలసింది అంటే మీ అమ్మ మళ్ళీ ఎక్కడో ఏదో చేస్తూ ఉండి ఉండాలి," అని అంటుంది ఆ ముసలి వ్యక్తి యొక్క కూతురు అశ్విని.

ఇటు ఒక కుటుంబం మొత్తం అక్కడ అలా ఉండగా, మళ్ళీ ఇక్కడ కట్ చేసి మళ్ళీ మనోహర్ గ్రహంలో చూపిస్తారు. ఆ గ్రహంలో అందరూ ఇక సర్దుకున్నారు. "మేము ఎక్కడికి వెళ్లాలి?" అని అనుకుంటూ ఉండగా ఏదో పెద్ద శబ్దం ఒక్కసారిగా టెలిపోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి ఒక ముసలి వ్యక్తి పత్రం రాసుకొని ఒక ఫోటోను తెరిచాడు. "రండి, ఈ ప్రజలందరూ మా భూమి లోకి రావచ్చు," అని అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. అతని చూడగానే అర్జున్ నమస్కరించి, "గురువుగారు, ఈ గ్రహం అంతం కాబోతుంది కాబట్టి మీరంతా మా భూమి లోకి రావాలి," అని అంటూ పిలుస్తున్నాడు ఆ వ్యక్తి.

"సరే," అని అర్జున్ కూడా తన గురువుకు సహాయం చేస్తూ ప్రజలను తరలించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి అందరూ వెళ్లిన తరువాత ఒకసారిగా అది పిండి పిండిగా మారడం మొదలు పెట్టింది. టవరు, ఇల్లు అన్నీ కూలిపోయాయి. ప్రజలందరూ దాన్ని బాధగా చూస్తున్నారు. ఇన్నాళ్లు ఎంతో అద్భుతంగా ఉన్న ఆ గ్రహం ఒకసారిగా నాశనం అయిపోవడం ఇవన్నీ వాళ్లకు చాలా బాధగా ఉన్నాయి. విక్రమ్‌కి ఇలా అనిపిస్తుంది, "ఒకవేళ భూమి కూడా ఇలాగే అంతమవుతుందా?" అని అనుకుంటున్నాడు. అయినా అది ఇప్పుడు విషయం కాదు అని అనుకుంటూ బయలుదేరుతాడు.

వాళ్ళు ఇప్పుడు అర్జున్ ఉన్న భూమి మీద ఉన్నారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. "ఇప్పుడు చెప్పు అర్జున్, నీ సంగతేంటి?" అని అందరూ అడుగుతున్నారు. అందరూ అంటే కేవలం ఇప్పుడు వీర, విక్రమ్, ఇక అర్జున్ వీళ్ళ ముగ్గురే ఉన్నారు. అర్జున్‌ని అడుగుతున్నారు, "మీ కథ ఏంటి? ఇప్పుడు చెప్పు."సరే అని అంటూ అర్జున్, "నేను ఎలా ఉన్నాను, ఎక్కడ పుట్టాను నాకు కూడా తెలియదు. మా గురువుగారు విశ్వనాథ్ గారు మమ్మల్ని పెంచారు. కానీ అది మామూలుగానే ఉంది. ఏదో విపత్తు జరిగినట్టుగా ఒక్కసారిగా అఘోరాలు అందరూ గ్రూప్ దగ్గరికి వచ్చారు. అందరూ ఒకటే ప్రశ్న, 'గురువుగారు, ఏదో జరగబోతుంది. మనం ఇంకా ప్రారంభించాదామా?' అని అంటారు. మా గురువుగారు కూడా అవునన్నట్టు సైగ చేస్తారు. అంతే, అక్కడ ఉన్న అఘోరాలు అందరూ ప్రతి చోటుకు వెళ్లి కొంతమందిని వెతికి వాళ్ళ చేత కొన్ని పాఠశాలలు తెరిపించి విద్యలు నేర్పించడం మొదలుపెట్టారు."

అలా కొదమ కథ చెబుతూ కథలోకి వెళ్ళిపోదాం. అలా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఒక వ్యక్తి పిల్లలందరికీ చెప్తున్నాడు, "మనం రాబోయేది చాలా కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మీ శక్తుల వల్ల ఈ భూమికి రక్షణ కలుగుతుంది. ఒక మహా మాంత్రికుడు, తెలివైనవాడు, క్రూరమైనవాడు భూమిని అంతం చేయడానికి సిద్ధమవుతున్నాడు. వారిని మనం ఆపలేం. కానీ మన శక్తులన్నీ కలిస్తే కొద్దిగా టైం పడుతుంది," అని అంటూ ప్రజలకు చెప్తూ ఉండగా, అందులో విశ్వ అనే ఒక వ్యక్తి, "మీనాక్షి, అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఇంకా రాలేదు ఎందుకు? ఈ కథ అంతా అయిపోయేసరికి వాడిని ఎగిరి తంతాడు సారు," అని అంటున్నాడు. మీనాక్షి చిన్నగా నవ్వుతూ, "వస్తాడులే," అని అంటుంది.

అర్జున్ అల్లరి, పరీక్షల ప్రకటన

ఇక క్లాస్ అయిపోయింది. విశ్వనాథ్ అక్కడికి వచ్చాడు. "ఎక్కడికి రా వాడు? ఎక్కడ?" అని అంటున్నాడు. "తెలియదు గురువుగారు," అని విశ్వ అంటున్నాడు. "నేను వెళ్లి తీసుకొస్తాను," అని మీనాక్షి పైకి లేచి వెళ్తుంది. విశ్వ కూడా బయలుదేరి ఇద్దరూ పిలుస్తున్నారు, కానీ అర్జున్ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే వెళ్లి దాన్ని గట్టిగా పట్టుకొని రాలినట్టుగా అర్జున్ కిందపడ్డాడు. "అసలు ఏం జరిగింది రా? ఎక్కడికి వెళ్ళావు క్లాస్ వినకుండా?" అని అంటున్నాడు విశ్వ. అర్జున్ తన చేతిలో మామిడిపండు చూస్తూ, "ఎలా ఉందో చూశారా? ఎర్రగా మాగిన దూర మామిడిపండు భలే ఉంది కదా," అని అంటూ దాన్ని తింటున్నాడు. విశ్వ గట్టిగా ముష్టికాయ వేసి, "సరే, రేపటి నుంచి మీకు పరీక్షలు మొదలవుతాయి," అని అంటూ చెబుతూ, "మీరు ఈరోజు ఎంజాయ్ చేసేది ఉంటే వెళ్లి చేసుకొని రండి. రేపటి నుంచి మీరు ఎక్కడ ఎవరు ఉంటారో నాకు కూడా తెలియదు," అని అంటున్నాడు. "సరే," అని అందరూ "థాంక్స్ గురువుగారు," అని అంటూ మీనాక్షి చేయి పట్టుకొని అంటున్నాడు. మీనాక్షి చిన్నగా నవ్వుతూ చెయ్యి విడిపించుకుని అలా సీన్ కట్ అవుతుంది.