Read Are Amaindi - 24 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 10

                   మనసిచ్చి చూడు - 10రెస్టారెంట్లోకి అడుగు పెట్ట...

  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 24

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

చిదంబరం ఇంటికి వెళ్లేసరికి, తన భార్య, కొడుకు, మల్లిక తో మంగళాచారి ఇంకా సుమారుగా యాభయ్యేళ్ళు వయసున్నావిడ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అందరూ అక్కడ హాల్లో వున్న కుర్చీల్లో కూచుని వున్నారు.

"వెళ్ళినపని ఏమైందండీ?" శకుంతల ఆతృతగా అడిగింది.

"ఏమౌతుంది? అది జరిగిన మర్నాడే మన పిచ్చివెధవ ఆ సర్వేశ్వరానికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయిని తను పెళ్లిచేసుకోవడం అవ్వదని తెగేసి చెప్పేశాట్ట. దానితో ఆ సర్వేశ్వరం తన కూతురి పెళ్లి ఇంకోడితో ఫిక్స్ చేసేసాడు." కోపంగా అన్నాడు చిదంబరం. 

"అయినా మా అమ్మాయికి కడుపుచేసిన మీ అబ్బాయికి వేరే అమ్మాయితో ఎలా పెళ్ళిచేస్తారు?" ఆ యాభయ్యేళ్ళు వయసున్నావిడ, మల్లిక తల్లి, చారులత కోపంగా అడిగింది.

"మా అబ్బాయి మీ అమ్మాయికి కడుపు చెయ్యడం ఏమిటి?" తన భార్యమొహంలోకి అయోమయంగా చూస్తూ అన్నాడు చిదంబరం.

"నాకూ అర్ధం కావడం లేదండి. వీళ్ళు వచినదగ్గరనుండి ఏదేదో మాట్లాడుతూ వున్నారు." అంతే అయోమయం గా అంది శకుంతల.

"ఒరే, నువ్వు ఆ దయ్యం పీడ మనకి పూర్తిగా వదిలిపోయింది, మనం ఇంక దానికి భయపడక్కర్లేదు అంటే నేను ఆ సర్వేశ్వరంతో మాట్లాడ్డానికి వెళ్ళాను, మధ్యలో ఇదేమిటి?" నిరంజన్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు చిదంబరం అలాగే నిలబడి.

"మీరు నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్లారు." చిరాగ్గా అన్నాడు నిరంజన్. "ఆ దయ్యం పీడ వదల్చడానికి ఈ మల్లిక ఒక ఉపాయం చెప్పడమే కాకుండా, పెద్ద త్యాగం కూడా చేసింది." అని మల్లిక చెప్పిన ఉపాయమేమిటో, తామిద్దరూ కలిసిచేసిందేమిటో చెప్పాడు నిరంజన్. "మేం ఆలా చేసి, నేను ఆ దెయ్యాన్ని ప్రార్ధించడం వల్లే అది కన్విన్స్ అయి మనల్ని విడిచిపెట్టేసింది. లేకపోతె ఈ పాటికి మనందరి ప్రాణాలు తీసేసి ఉండేది."

ధైర్యం చేసి విషయం అంతా తన తండ్రికి చెప్పాలని నిర్ణయం తీసుకోవడానికి  పదిహేను రోజుల సమయం తీసుకున్నాడు నిరంజన్. ఆ రోజు తర్వాత ఆ దయ్యం అరుపులు వినపడకపోవడం తో మల్లిక మాటలమీద పూర్తి నమ్మకం కుదిరింది కూడా. కానీ చిదంబరం మాత్రం నిరంజన్ విషయం మొత్తం చెప్పేలోగానే, ఆ దయ్యం పీడ తమకి పూర్తిగా వదిలిపోయింది అని చెప్పగానే, సర్వేశ్వరం తో మాట్లాడ్డానికి వెళ్ళిపోయాడు.    

"నేనలా చేసిన త్యాగంవల్ల నాకిప్పుడు కడుపు వచ్చింది. ఇప్పుడు మీ అబ్బాయి నన్ను పెళ్లిచేసుకోకపోతే నా గతి ఏం కావలి?" మల్లిక ఏడుపుగొంతుతో అడిగింది.

"నేను చెప్పేను కదండీ దీన్నలా మన కొడుకుతో ఉండనిస్తే దానిబదులు ఇదే మన కోడలు అయి కూచుంటుందని. ఇప్పుడదే జరిగింది." శకుంతల కోపంగా అంది.

దానికి చిదంబరం ఎదో అనబోతూ వుండగా మల్లిక చేతిలో వున్న సెల్ ఫోన్ లో నుండి "నిన్ను చంపేస్తాను, నా కూతురి జోలికి వస్తే నిన్ను నరికేస్తాను. నువ్వు దాన్ని మర్చిపో." అన్న ఒక ఆడగొంతు అరుపులు వినపడడం ప్రారంభించాయి.

"అవిగో అలాంటి అరుపులే మేం అస్తమాను వింటూ ఉండేవాళ్ళం, అదీ కేవలం నువ్వొచ్చినదగ్గరనుండే." నిరంజన్ అయోమయంగా అన్నాడు.

"ఆ ఇప్పుడు నాకు అర్ధం అయింది." తలూపుతూ అంది శకుంతల. "ఇది తన సెల్ ఫోన్ లో అలాటివి రికార్డ్ చేసిపెట్టి, అది మనకి తెలీకుండా మనం వినేలా చేసి, ఆ దయ్యమే అంటున్నట్టుగా మనకి భ్రమ కలిగించింది."

"వాటితో అవసరం అయిపోయింది అవన్నీ డిలీట్ చేసి తగలడమన్నానుగా నిన్ను, నువ్వలా చెయ్యలేదా?" కూతురివైపు కోపంగా చూస్తూ అడిగాడు మంగళాచారి చిన్న గొంతుతో.

"చాలా వరకూ చేసేసాను. కానీ ఎదో ఒకటి మిగిలిపోయి, నా చెయ్యి తగిలి అలా ప్లే అయిపోయింది." కంగారుగా అందిమల్లిక.

"ఏమండీ మంగళాచారిగారు. మీరెందుకు ఇంతకష్టపడి పాపం మీ స్టూడెంట్ ని మా కోడలిని చేయాలనుకున్నారు?" ఇంక నిలబడలేక అక్కడ మంగళాచారికి అపోజిట్ గా వున్న కుర్చీలో కూలబడి, అతనివైపు చూస్తూ అడిగాడు చిదంబరం.

"ఎవరికైనా తమ అమ్మాయిని మంచికుటుంబం లోకి పంపించాలని కోరికగా ఉంటుంది కదండీ. మీరు మీ భార్య చాలా మంచివాళ్ళలాగా కనిపించారు. మీ అబ్బాయి కూడా చాలా బుద్ధిమంతుడనిపించాడు. అందుకనే ఇలా చేసాం." ఒక ఇబ్బందికరమైన ఎక్సప్రెషన్ తో అన్నాడు మంగళాచారి.

"ఓహో, అయితే నువ్వీమెకి తండ్రివన్నమాట. మేం ధనవంతులమని కనిపెట్టి, ఎలాగన్నా మీ అమ్మాయినిమా ఇంటి కోడలు చేసేయాలని ఇదంతా చేశారు. దయ్యాలు, భూతాలూ వున్నాయన్న మా వీక్నెస్ ని బాగా వాడుకున్నారు." శకుంతల కోపంగా అంది.

"మీరెలాగన్నా అనుకోండి. ఇంకిప్పుడు చెయ్యగలిగినది ఏముంది? ఇప్పుడు మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చెయ్యమంటే మేం పోలీస్ రిపోర్ట్ ఇస్తాం.  ఈ రోజుల్లో మా అమ్మాయి కడుపులో వున్నది మీ అబ్బాయి సంతానమేనని డి.ఎన్.ఏ ద్వారా ప్రూవ్ చెయ్యడం అంత కష్టమేం కాదు. మా పెద్దల్లుడు నోరుమూసుకు చేసుకున్నాడు కానీ, మా రెండో అల్లుడు అలాగే గొడవ చేస్తే డి.ఎన్.ఏ ద్వారా ప్రూవ్ చేసి మా రెండో కూతుర్ని వాడికిచ్చి పెళ్ళిచేసాం." మంగళాచారి అన్నాడు

"మరేం. మా మొదటి ఇద్దరి అమ్మాయిలు ఇద్దరు ముగ్గురిని ట్రై చేసాక కానీ ప్రేగ్నన్ట్ లు కాలేకపోయారు. కానీ మా చిన్నమ్మాయి................" మల్లిక దగ్గరకొచ్చి తనని కౌగలించుకుని, కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుని అంది చారులత. "..........ఐ ఫీల్ ప్రౌడ్ అఫ్ హర్. పెళ్లి చేసుకోవాలని ట్రై చేసిన మొదటివాడితోటె ప్రేగ్నన్ట్ కాగలిగింది.అంతే కాదు ఇలా కలిసి అలా ప్రేగ్నన్ట్ కాగలిగింది."

"ఎనీహౌ ఇదంతా మేం పెద్ద ధనవంతులం అనుకునే మీరు చేసుంటారు, అవునా?" చిదంబరం అడిగాడు చారులత మొహంలోకి చూస్తూ.

"ధనవంతుల ఇళ్లల్లోకి ఇస్తేనే కదా మా పిల్లలు సుఖపడేది, మేమూ ఆనందంగా ఉండేది." చారులతకి బదులుగా మంగళాచారి అన్నాడు.

"మీ అంతగా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళని ఎక్కడా చూడలేదు." నవ్వాడు చిదంబరం. "ఇంతకీ మాకు ఎంత ఆస్థి ఉందనుకుంటున్నారు?"

"మీ మాటల్ని బట్టి, వేష భాషల్ని బట్టి ఒక అయిదారు కోట్లన్నా ఉండొచ్చు అనుకొంటున్నా." మంగళాచారి అన్నాడు.

"మీ అంచనా తప్పు. నా మొత్తం ఆస్తి పదిహేను కోట్లు." చిదంబరం అన్నాడు.

"అవునా?" ఆలా అన్నాక మంగళాచారి ఆనందంగా భార్య ఇంకా కూతురి మొహాల్లోకి చూసాడు. వాళ్ళ మొహాల్లో కూడా అలాంటీ ఆనందమే కనిపించింది.

"ఇంతకీ మీకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా?"

"ఎందుకులేవు? నా ప్రాక్టీస్ ద్వారా మూడు నాలుగు కోట్ల దాకా కూడబెట్ట గలిగాను. ఇప్పటికీ నా ప్రాక్టీస్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాను." గర్వంగా అన్నాడు మంగళాచారి.

"అయితే మీరు నాకు కొంచెం సహాయం గానే  ఉండగలరు."

"నేను మీకు సహాయంగా వుండడమేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు మంగళాచారి.

"నేను మీకు విషయం పూర్తిగా చెప్పలేదు." నవ్వాడు చిదంబరం. "నా ఆస్థి పదిహేను కోట్లయితే అప్పు పాతిక కోట్లు. వ్యాపారం లో విపరీతంగా లాస్ వచ్చి అలా జరిగింది. నాకు అప్పిచ్చినవాళ్ళందరూ ఐ పీ ఫైల్ చేస్తామంటున్నారు. బావగారూ మీరే నాకు సాయం చేసి అలా జరక్కుండా చూడాలి."

&&&

"నువ్వు హిప్నోటిజం గురించి వినేవుంటావు. నీకు దానిమీద మంచి అవగాహన వుండేవుంటుంది." మంజీర మొహంలోకి చూస్తూ అంది తనూజ.

"ఎస్ ఆంటీ. నేను చాలా విన్నాను." గలగలా నవ్వి అంది మంజీర. "నాకు మంచి ఇంటరెస్ట్ కూడా హిప్నోటిజం అంటే."

ఆ సమయం లో అనిరుధ్ తో సహా నలుగురూ మంజీర రూమ్ లోనే వున్నారు. మంజీర ఒక వాలు కుర్చీలో వెనక్కి కూచుని వుంది.

"దట్స్ ఏ ప్లస్ పాయింట్." తనూజ కూడా నవ్వింది. "నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేను చెప్పేది కాన్సన్ట్రేటెడ్ గా విను చాలు. నీ మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. వాటి దారిని వాటిని వుండనివ్వు. కొంత సమయం తరువాత నీ బాడీ, నీ మైండ్ నా సజెషన్స్ ఆటోమాటిక్ గా ఫాలో అవుతాయి."

"ఒకే ఆంటీ." చిరునవ్వుతో అంది మంజీర.

"మీ ఇద్దరికీ నేను చెప్పిందంతా గుర్తువుంది కదా." అనిరుధ్ ఇంకా సర్వేశ్వరం ల వైపు చూస్తూ అడిగింది తనూజ.

"మేం బుధ్హిమంతుల్లా నిన్ను, తనని డిస్టర్బ్ చెయ్యకుండా ఇలా నిలబడి చూడాలి, అంతే కదా. అలాగే."సర్వేశ్వరం నవ్వాడు.

"నేను ఆల్రెడీ అంతా నా సెల్ ఫోన్ లో రికార్డింగ్ మొదలుపెట్టాను. మీ హిప్నోటిక్ సెషన్ మొత్తం పూర్తవగానే మనం మంజీర కి కూడా ఇది చూపించొచ్చు." తను రికార్డింగ్ చేస్తూన్న సెల్ ఫోన్ చూపిస్తూ అన్నాడు అనిరుధ్.

"గుడ్" తనూజ తలూపి అని మంజీర వైపు చూసింది. "నౌ ఐ స్టార్ట్ మై హిప్నోటిక్ సెషన్."

"ఐ యామ్ హండ్రెడ్ పెర్సెంట్ బి ప్రిపేర్డ్ టు ఇట్. ఇంక ఏం మాట్లాడకుండా నువ్వు చెప్పేది మాత్రం వింటాను."మంజీర అంది.

"ఒకే" గట్టిగా నిట్టూర్చింది తనూజ. అలాగే మంజీర మొహం లోకి చూస్తూ అంది.

"నీ మనసు పూర్తిగా నేను చెప్పే మాటలమీదే కాన్సంట్రేట్ అయి వుంది. నీ మనసు, శరీరం పూర్తిగా నా అధీనం లో వున్నాయి."

మంజీర లో ఏ మార్పు లేదు. తను అలాగే వుంది.

"ఇప్పుడు నీకు చాలా ప్రశాంతం గా హాయిగా వుంది. చాలా ప్రశాంతం గా హాయిగా వుంది."

"నీ కనురెప్పలు బరువెక్కుతూ వున్నాయి. నీకు నిద్ర వస్తూన్నట్టుగా వుంది. నీ కనురెప్పలు నెమ్మది, నెమ్మదిగా మూతలు పడుతూవున్నాయి."

మొదటిసారి అన్నప్పుడు ఏమీ అవకపోయినా, మరొక రెండుసార్లు మంజీర మొహం లోకే చూస్తూ తనూజ అలా అనేసరికి, మంజీర కనురెప్పలు నెమ్మదిగా మూతలు పడ్డాయి.

"నీకు నిద్రవస్తూన్నట్టుగా వుంది. కానీ నువ్వు నిద్రలోకి జారుకోవడం లేదు. నీకు పూర్తి ప్రశాంతంగా, హాయిగా వుంది."

మంజీర మొహం పూర్తి ప్రశాంతంగా కనిపిస్తూ వుంది సర్వేశ్వరానికి, అనిరుధ్ కి.

"నేను అయిదు అంకీలు లెక్కపెడతాను. నేను అయిదు అనేసరికి నీ మనసు పూర్తిగా నా ఆధీనం లోకి వచ్చేస్తుంది. నేను ఆలోచించమన్న విషయాల గురించి ఆలోచిస్తావు. నేనడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తావు."

కాస్త గాప్ ఇచ్చి "ఒకటి..............నీకు పూర్తి ప్రశాంతంగా వుంది, హాయిగా వుంది."

తరువాత ఇంకొంచెం గాప్ ఇచ్చి "రెండు............నీ మనసు పూర్తిగా నేను చెప్పే మాటల మీదే కాన్సంట్రేట్ అయివుంది."

ఒక నాలుగు సెకెన్ల తరువాత. "మూడు............నీకు చాలా హాయిగా, ప్రశాంతం అనిపిస్తూ, నా మాటల మీద నీ మనసు పూర్తిగా నిలిచి వుంది."

"నాలుగు...............నీ మనసు ఇప్పుడు వందశాతం నా అధీనం లో వుంది. నేను ఆలోచించమన్న విషయాల గురించి ఆలోచిస్తుంది. నేను గుర్తు చేసుకోమన్న విషయాల గురించి గుర్తు చేసుకుంటుంది." ఇంకొక అయిదు సెకెన్ల తరువాత అంది.

"అయిదు..........నేను ఆలోచించమన్న విషయాల గురించి ఆలోచించకుండా నువ్వు ఉండలేవు. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా నువ్వు ఉండలేవు."

 అలా అన్నాక కాస్త ఆగింది తనూజ. మంజీర వైపు చూస్తున్న అనిరుధ్ కి, సర్వేశ్వరానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన మొహం చాలా ప్రశాంతంగా, తను నిద్రపోతున్నట్టుగానే వుంది. తనూజ ఏమడిగినా అందుకు తను సమాధానాలు ఇస్తుందని మాత్రం అనిపించలేదు.

 "ఇప్పుడు నువ్వు ఇటీవల జరిగిన సంఘటనలు గురించి ఆలోచిస్తావు. ఆ ఆలోచనలు నీకు వస్తాయి. నువ్వా ఆలోచనలని తప్పించుకోలేవు."

మంజీర నుదిటిమీద ముడతలు కనిపించాయి, సడన్ గా తనేదో ఆలోచించడం ప్రారంభించినట్టుగా. 

"మీ డాడ్ అనిరుధ్ ని నిన్ను పెళ్లిచేసుకోమని బ్లాక్మెయిల్ చెయ్యడం గురించి నువ్వాలోచిస్తున్నావు. నువ్వా సంఘటన గురించి ఆలోచిస్తున్నావు."

చిన్న చిరునవ్వు వచ్చి చేరింది మంజీర పెదవుల మీదకి.

"నీకప్పుడు ఎలా అనిపించింది?"

ఏ సమాధానం లేదు మంజీర దగ్గరనుండి.    

 "నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్తావు. సమాధానం చెప్పకుండా ఉండలేవు."

"ఫన్నీ గా అమ్యూజింగా అనిపించింది. నేను తన ప్రెడికెమెంట్ ని ఎంజాయ్ చేసాను."

అది వినగానే అనిరుధ్ మొహం లోకి చూసారు సర్వేశ్వరం, తనూజ అనుకోకుండానే. చిరుకోపం తో నిండివుంది అనిరుధ్ మొహం.వస్తూన్న నవ్వుని ఆపుకుని మళ్ళీ మంజీర వైపు చూసింది తనూజ.

"అయితే నీకు అతని పరిస్థితికి జాలి అనిపించలేదా?"

"జాలి ఎందుకు? నాలాంటి అందమైన అమ్మాయి అలా దొరికేయడం చాలా లక్కీ." మంజీర వాయిస్ మామూలుగానే వుంది. "ఒకప్పుడు నేనంటే చాలా మోజుపడ్డాడు కూడా. నాతొ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చెయ్యాలని ఎంతో ట్రై చేశాడు."

"అది అబద్ధం." ఉండలేక కోపంగా అన్నాడు అనిరుధ్.

"ష్.....మాట్లాడ కూడదు. నిశబ్దం గా ఉండాలి. చెప్పాను కదా." అనిరుధ్ మొహం లోకి చూస్తూ చిన్నగొంతుతో అలా అన్నాక మళ్ళీ మంజీర మొహం లోకి చూసి అంది. "అయితే అనిరుధ్ ని చేసుకోవడం నీకు ఇష్టమేనా?"

"ఇష్టమే. చాలా ఇష్టం."

"మరయితే ఒకప్పుడు అనిరుధ్ తో ఎందుకలా బిహేవ్ చేసావ్? ఎందుకలా ఇన్సల్ట్ చేసావ్?"

మంజీర నుండి సమాధానం లేదు.

"నువ్వు నా ప్రశ్నకి సమాధానం ఇస్తావ్. ఇవ్వకుండా ఉండలేవు."

"నేను నా పాత జ్ఞాపకాలనుండి పారిపోవాలనుకున్నాను. మామ్ తో అసోసియేట్ అయి వున్నవి ఏవీ నేను భరించలేకపోయాను. సాధ్యమైనంత వరకూ, కుదిరినంత వరకూ వాటినుండి దూరంగా వెళ్ళిపోయాను. అనిరుధ్ మామ్ నే గుర్తు చేసేవాడు."

"ఎందుకలా?"

"మామ్ జ్ఞాపకాలు మరీ తియ్యగే ఉండేవి. మామ్ ఇంకలేదంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. అందుకనే."

"మరి నిరంజన్ తో ఎందుకు తిరిగావ్? వాడితో ఎందుకు స్నేహం చేసావ్?"

మంజీర నుండి సమాధానం లేదు.

"మంజీరా నువ్వు నాకు సమాధానం చెప్తావ్. చెప్పే తీరతావ్. నిరంజన్ తో ఎందుకు తిరిగావ్? వాడు తాగుబోతు, తిరుగుబోతు అని నీకు తెలుసును."

మంజీర ఇంకా మౌనంగానే వుంది. కానీ ఎదో బాగా ఆలోచిస్తున్నట్టుగా ఆమె నుదురు మాత్రం ముడతలు పడింది.

"నువ్వు నాకు సమాధానం చెప్తావ్ మంజీరా. చెప్పే తీరతావ్."

"ఎదో థ్రిల్ కోసం, వెరైటీ కోసం తిరిగాను."

"అని నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నావ్. అదే నిజం అయితే నేను అడగగానే చెప్పేదానివి." తనూజ అంది. "నువ్వు నాకు నిజం మాత్రమే చెప్తావ్. చెప్పు ఆ నిరంజన్ తో ఎందుకు తిరిగావ్?"

"నన్ను ఆ జ్ఞాపకాలు బాగా బాధపెట్టేవి. వాటినుండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియలేదు."

"మామ్ జ్ఞాపకాలు నిన్ను అంతగా బాధపెట్టాయా? వాటినుండి తప్పించుకోవడానికి నువ్వు చెడ్డమార్గాన్ని కూడా ఎంచుకున్నావా? మామ్ తో అసోసియేట్ అయి వున్నవాటినుండి పారిపోవడం నీకు సరిపోలేదా?"

"అవి కేవలం మామ్ జ్ఞాపకాలు మాత్రమే కాదు?"

"మరైతే ఏమిటవి?"

"నేను వాటిని ఎవరికీ చెప్పకూడదు. చెప్పనని మామ్ కి మాట ఇచ్చాను." ఇబ్బందిగా మారింది మంజీర గొంతు.

ఆ విషయం విని అనిరుధ్, ఇంకా సర్వేశ్వరం మొహ మొహాలు చూసుకున్నారు ఆశ్చర్యంతో.

"కానీ నువ్వు నాకు అన్ని విషయాలు చెప్తావ్. ఆ జ్ఞాపకాలు ఏమిటో కూడా చెప్తావ్."

మంజీర నుదిటిమీద గీతలు బిగుసుకుపోయాయి. రెండు అరచేతులు పిడికిళ్ళుగా బిగుసుకున్నాయి. మంజీర చాలా స్ట్రగుల్ అవుతూందన్న విషయం ముగ్గురికీ అర్ధం అయింది.

"నువ్వు నాకు ఆ విషయాల్ని చెప్పాలి మంజీరా, చెప్పే తీరాలి, చెప్పకుండా నువ్వు వుండలేఫు." మంజీర ని అలాగే గమనిస్తూ అంది తనూజ.

మంజీర ట్రబుల్ ని చూస్తూ సర్వేశ్వరం ఎదో అనబోయేలోగానే, చటుక్కున ముందుకు కూచుని తనూజ మొహం లోకి చూస్తూ కోపంగా అంది మంజీర.  

"ఎందుకే నా కూతుర్ని అలా కాల్చుకు తింటావ్? తను నాకు మాట ఇచ్చాను, ఆ విషయాల్ని నీకు చెప్పలేనని చెపుతూంది కదా." మంజీర గొంతు మారింది. మొహం కోపంతో నిండి వుంది.

"తనలో స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయింది." చిన్న గొంతుతో అన్నాడు అనిరుధ్ ఎగ్జైటింగ్ గా ఫీలవుతూ.

"కాదు అది నా భార్య నిర్మల." సర్వేశ్వరం గొంతులో కూడా అలాంటి ఎగ్జైట్మెంటే వుంది.

"నేనేం నీ కూతుర్ని బాధపెట్టడం లేదు. ఆ విషయాల్ని ఎవరికీ చెప్పకూడదని చెప్పి తనని మొదటినుండి రంపపు కోతకి గురిచేసింది నువ్వు వదినా." మంజీర మొహంలోకి చూస్తూ తనూజఅని కాస్త ఆగింది.

"చూసావా, నా చెల్లెలు తను తన వదిన అన్నట్టుగానే ట్రీట్ చేస్తూ వుంది. తను నా భార్య నిర్మలే." సర్వేశ్వరం అన్నాడు.

'స్ప్లిట్ పెర్సనాలిటీలని అలాగే ట్రీట్ చెయ్యాలి' అనబోయి అక్కడ ఎక్కువ డిస్టర్బన్స్ క్రియేట్ చెయ్యడం ఇష్టం లేక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్.

"ఆ జ్ఞాపకాల్ని ఎవరికీ చెప్పలేక, తనలోనే దాచుకోలేక, తన జీవితాన్నే నాశనం చేసుకుంటూంది నీ కూతురు. ఇప్పటికైనా తనకి విముక్తిని కలిగించు. తను చెప్పని విషయాల్ని నువ్వైనా నాకు చెప్పు." అలాగే మంజీర మొహం లోకి చూస్తూ అడిగింది తనూజ.

మంజీర ఏం మాట్లాడలేదు. అలాగే తనూజ మొహం లోకి చూస్తూ వుంది.

తనూజ మంజీర కుడిచేతిని తనచేతుల్లోకి తీసుకుని నొక్కుతూ మోకాళ్ళమీద మంజీర కుర్చీ పక్కన కూచుంది. "వదినా నువ్వు అమాయకురాలివి. నీకు ఏమీ తెలియదు. అందుకే నీ మీద జరిగిన దుర్మార్గాన్ని సహించావు. అది చెప్పినా ఎవరూ నమ్మరని భయపడ్డావు. అందుకే అది ఎవరికీ చెప్పొద్దని నీ కూతురికి కూడా చెప్పావు, అవునా?"

దానికి మంజీర ఏం మాట్లాడలేదు కానీ తన మొహం అంతా షాక్ తో నిండిపోయి నోరు తెరుచుకుంది.

"చెప్పు వదినా, అవేమిటో ఇప్పటికైనా చెప్పు. అవి తెలిస్తేనే నేను మంజీర జీవితాన్ని బాగు చేయగలను. లేకపోతె తన జీవితమే నాశనం అవుతుంది." తన కుడిచేతిని రెండుచేతులతో గట్టిగా నొక్కుతూ అంది తనూజ. 

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)