Read Are Amaindi - 5 by sivaramakrishna kotra in Telugu Detective stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 5

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"ఇంక నేను వెళ్లివస్తాను." కుర్చీలోనుండి లేచి అన్నాడు అనిరుధ్.

"నీ లక్ష్యం కేవలం ఐ ఏ ఎస్ మాత్రమే అని నాకు తెలుసు. కానీ నీ గురించి ఎవరన్నా ఫీల్ అవుతూ వుంటే అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన తరువాత కూడా ఆడతోడు లేకుండా మాత్రం జీవితం గడపవు కదా." తనూ లాప్ టాప్ తో పాటుగా కుర్చీలోనుండి లేచి అంది ప్రమీల.

"నీ ఉద్దేశం నాకు అర్ధం అయింది. నీ మనసులో అభిప్రాయం కనిపెట్టలేనంత బ్లైండ్ కాదు నేను." చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. "కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను. మనోజ్ నిన్నెలా చూస్తాడో నేనూ అలాగే చూస్తాను.   నిన్నా దృష్టితో ఎప్పుడూ చూడలేను."

"నువ్వూ మంజీర ఏ కాదు, మనిద్దరం కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. మనం ఎలా ఆడుకునేవాళ్ళమో ఒకసారి గుర్తుచేసుకో."

"అది చిన్నతనం. మంచిచెడ్డ తెలియని రోజులు. కానీ నీమీద నాకు ఒక తోబుట్టువు లాంటి అభిప్రాయం మాత్రమే వుంది." చాలా అనీజీగా, ఇబ్బందిగా వుంది అనిరుధ్ కి.

"ఏమీ కాదు. పైకి నాటకమాడుతున్నావు కానీ నీకు ఆ మంజీరని పెళ్లి చేసుకోవాలనే వుంది. అలాంటి జామపండు లాంటి అమ్మాయిని ఎవరు వదిలేసుకుంటారు? అంతేకాకుండా కోట్లకొద్దీ ఆస్తికూడా కలిసివస్తుంది." కోపంగా అంది ప్రమీల.

"నువ్వలా ఆలోచిస్తే నేనేం చెప్పలేను. నిన్ను నేను చూసే ధోరణి మాత్రం మారదు. నీకు బాధ కలిగించినందుకు సారీ." అలా అన్న తరువాత అక్కడనుండి వచ్చేసాడు అనిరుధ్.

&&&

చాలా డిస్టర్బింగ్ గా, చిరాగ్గా వుంది అనిరుధ్ కి. ప్రమీల మనసులో ఉద్దేశం తను చాలా రోజులుగా కనిపెట్టివున్నా, ఈ రోజు తనతో ఇలా మాట్లాడుతుందని, తనిలా సమాధానం చెప్పాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. ఎందుకనో తెలియదు కానీ మనోజ్ చెల్లెలిని తన చెల్లెలిలాగే చూసాడు తప్ప మరోలా చూడలేదు.

లంచ్ టైం అయినా ఏమీ తినాలని అనిపించడం లేదు. అయినా ఏదైనా రెస్టారంట్ లో ఏదోఒకటి తిని ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తను అప్పుడప్పుడు భోజనం చేసే రెస్టారెంట్ వైపు నడవడం మొదలు పెట్టాడు.

"అరె అనిరుధ్. ఎక్కడికి వెళుతున్నావు? ఏమిటి విషయం?"

ఆ గొంతు విని ఉలిక్కిపడి ఆగాడు అనిరుధ్. తలతిప్పి ఆ గొంతు వినపడినవైపు చూస్తే, మోటార్ సైకిల్ తనపక్కనే ఆపి వున్నాడు ముకుందం.   

ముకుందం అనిరుధ్ కి క్లాస్మేట్. నిరంజన్ కి చాలా పెద్ద ఫ్రెండ్. కాకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేప్పుడు అనిరుధ్ సహాయం చేసాడు. అందువల్లే ముకుందం డిగ్రీ పాసవ్వగలిగాడు. ముకుందం డిగ్రీ పాసవ్వడం వల్ల, తను డిగ్రీ పాసయితే కానీ తన కూతురిని ఇచ్చి పెళ్ళిచెయ్యనన్నతన మావయ్య తన కూతురినిచ్చి పెళ్ళిచేసాడు. ఆ కారణంగా అనిరుధ్ అంటే చాలా కృతజ్ఞతగా వుంటాడు ముకుందం.

"మనోజ్ దగ్గరికి వచ్చాను. వాడితో పనయ్యాక ఏదైనా రెస్టారెంట్ లో భోజనం చేద్దామని వెళుతున్నాను. నువ్వెక్కడినుండి?" అనడిగాడు.

"నిరంజన్ ని కలిసి వస్తున్నాను. రా మనిద్దరం కలిసే ఏదన్నా రెస్టారెంట్ కి వెళదాం." అన్నాడు ముకుందం.

మరో సందర్భంలో అయితే అనిరుధ్ అంగీకరించి వుండేవాడు కాదేమో కానీ, నిరంజన్ కి మంచి స్నేహితుడు గా ముకుందానికి విషయం కొంత తెలిసివుండొచ్చు అనిపించింది.

"అలాగే అయితే." అలా అన్నాక ముకుందం మోటార్ సైకిల్ ఎక్కి కూచున్నాడు అనిరుధ్.

"నువ్వు నాకు సహాయం చేసివుండకపోతే నేను డిగ్రీ పాసయి వుండేవాడిని కాదు. నా మావయ్య కూతురిని పెళ్లి చేసుకునివుండేవాడిని కాదు. నా మావయ్య కూతురిని పెళ్లిచేసుకోకపోతే.........."

అనిరుధ్ అనుకున్న రెస్టారెంట్ కె తీసుకుని వెళ్ళాడు ముకుందం. ఇద్దరూ ఎదురు, ఎదురుగా కూచుని భోజనం ప్రారంభించాక అన్నాడు ముకుందం.

"........నీ మావయ్య తన బిజినెస్ లో నిన్ను పార్టనర్ ని చేసుకుని వుండేవాడు కాదు. నువ్వు లైఫ్ లో సెటిల్ అయివుండేవాడివి కాదు. ఈ విషయం చాలా సార్లు చెప్పావు." నవ్వాడు అనిరుధ్.

తన రాసిన పేపర్లు ముకుందానికి చూపించడం అనిరుధ్ కి ఎంతమాత్రం నచ్చలేదు. కానీ ముకుందం ఎంతో బతిమాలి కాళ్లావేళ్లా పడడంతో తప్పలేదు. అది గుర్తుచేసుకోవడం కూడా ఇష్టం వుండదు కానీ కలిసినప్పుడల్లా ముకుందం గుర్తు చేస్తూనే వుంటాడు.

"అవును ఆ నిరంజన్ సైకలాజికల్ గా ఎందుకంత డిస్టర్బ్ అయ్యాడు? ఎందుకలా భయపడిపోతున్నాడు? తన ప్రాబ్లెమ్ ఏమిటి?" సడన్గా అడిగాడు అనిరుధ్.

"అంటే విషయం నీక్కూడా తెలిసిందన్నమాట." నవ్వాడు ముకుందం.

"తెలియడమేమిటి? కలిసి మాట్లాడానుకూడా. కానీ విషయం ఏమిటో మాత్రం తెలుసుకోలేకపోయాను."

"ఆశ్చర్యంగా వుంది. నువ్వు నిరంజన్ ని కలిసి మాట్లాడావా? నువ్వు ఆ నిరంజన్ తో మాట్లాడ్డం నేనెప్పుడూ చూడలేదు. మీ ఇద్దరిమధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు కదా." ఆశ్చర్యంతో నిండిపోయింది ముకుందం మొహం.

"నీకు విషయం అంతా తెలియడం మంచిదనిపిస్తోంది." అలా అన్నాక సర్వేశ్వరం పెట్టిన కండిషన్ గురించి మొత్తం అంతా వివరించి చెప్పాడు అనిరుధ్. "ఆ మంజీర ఇంకా నిరంజన్ ఎంతగా ప్రేమించుకున్నారో అందరికీ తెలుసు. అలాంటిది మంజీర ఆ నిరంజన్ ని మర్చిపోయి నన్నెందుకు పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకుందో నాకు బోధపడలేదు. సర్వేశ్వరం కానీ, ఆ మంజీర కానీ  నేనే మంజీరని ఎందుకు పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్పలేదు. కనీసం ఆ నిరంజన్ ద్వారానన్నా నాకేమన్నా తెలుస్తుందేమోనన్న ఉద్దేశంతో వాడిని కలిసి మాట్లాడాను."

"దానిగురించి నిరంజన్ కి ఎమన్నా తెలిసివుంటుందని నేను అనుకోవడం లేదు. వాడికేమన్నా వాళ్ళెందుకు అలంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుసుంటే నాకు చెప్పేవాడు." ముకుందం అన్నాడు.

"మంజీర కి నాకు పెళ్లి చేసి తీరాలని వాళ్ళ నాన్న భీష్మించుకుని కూర్చున్నాడని చెప్పాను. అలాంటి అమ్మాయి చెయ్యిజారిపోతోందని తెలిసినా వాడెక్కడా చలించడం లేదు. ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే కోట్లకొద్దీ ఆస్తి కూడా వాడి స్వంతమవుతుంది." ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్. 

"ఎలా చలిస్తాడు ఆ అమ్మాయి చేతిలో అలాంటి అనుభవం ఎదురయ్యాక." చిరునవ్వుతో అన్నాడు ముకుందం.

"నువ్వేం చెప్తున్నావో నాకు అర్ధం కావడం లేదు." భోజనం పూర్తిగా అపి, ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్.

"నీకు అర్ధం కావాలంటే నేను చాలానే చెప్పాలి. జాగ్రత్తగా విను." భోజనం చేస్తూనే చెప్పడం మొదలుపెట్టాడు ముకుందం. "ఆ సర్వేశ్వరం ఇంకా నిరంజన్ నాన్న చిదంబరం ఒక్కసారే వ్యాపారం ప్రారంభించారు, వాళ్ళు చేసే వ్యాపారం ఒక్కలాంటిదే అవ్వడం వల్ల ఏవో అవసరాలతో కలిసి మంచి స్నేహితులు కూడా అయ్యారు. కాకపోతే తన వ్యాపారం లో రాణించి సర్వేశ్వరం బాగా సంపాదించగలిగాడు, చిదంబరం అలా సంపాదించలేకపోయాడు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య స్నేహం మాత్రం అలాగే వుండిపోయింది."   

"ఇది అందరికీ తెలిసిన కధే కదా." చిరాగ్గా అన్నాడు

"బహుశా తమ తండ్రితో నిరంజన్ తండ్రికి వున్న స్నేహమే , మంజీర నిరంజన్ తో చనువుగా వుండడానికి కారణం అనుకుంటాను. అయినా మంజీర లాంటి అందమైన అమ్మాయికి నిరంజన్ లాంటి వాడితో స్నేహం చెయ్యాలనిపించడం నాకెప్పటికీ అర్ధంకాని విషయం. తనతో కలిసి తిరుగుతూ ఉండేది. వాళ్లిదరిమధ్య వున్న ఆ చనువువల్లే ఆ ఇద్దరి పెద్దవాళ్ళు, ఇద్దరికీ పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. అసలు వాడితో పెళ్ళికి తనెందుకు ఒప్పుకుందో నాకిప్పటికీ అర్ధం కాదు."

"నువ్వా నిరంజన్ కి ప్రాణ స్నేహితుడివి. అయినా ఇలా మాట్లాడుతున్నవే!" ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్.

"వాడు నాకు ప్రాణ స్నేహితుడే. డబ్బులిచ్చి నన్ను చాలా సార్లు ఆదుకున్నాడు. కానీ నిజం నిజం కాకుండా పోదు కదా. మంజీరలాంటి అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడమేమిటి?"

"సరేలే. అసలు ఏం జరిగిందో చెప్పు." చిరాకు మోహంలో కనిపించకుండా అన్నాడు అనిరుధ్. 

"నిజంగానే ఆ మంజీర కి ఏదో సైకలాజికల్ ప్రాబ్లెమ్ వుంది. వాడితో కలిసి తిరిగేది, వాడిని పెళ్లిచేసుకోవడానికి కూడా ఒప్పుకుంది. కానీ కనీసం వాడు చెయ్యి వేసి ముట్టుకోవడానికి కూడా ఎప్పుడూ ఒప్పుకునేది కాదు.  కారులో కాబట్టి కానీ, అదే ఏ మోటార్ సైకిల్ మీదో అయితే వాడితో వెళ్ళడానికి కూడా తాను ఒప్పుకునేది కాదు."

"ఐ సీ" సాలోచనగా అన్నాడు అనిరుధ్.

"ఇంకా ఆ నిరంజన్ నాకు చెప్పినదేమిటంటే, ఏదన్నా రొమాంటిక్ ప్రస్తావన తెస్తే చాలు, తాను చాలా ఇరిటేట్ అయిపోయేది. సినిమాలో కానీ, టీవీ లో కానీ ఏదన్నా రొమాంటిక్ సీన్ వచ్చినా కూడా పరిస్థితి అదే. నిజానికి వాల్ పోస్టర్స్ లో, ఇంకా మ్యాగజైన్స్ లో ఎక్కడ రొమాంటిక్ ఫోటోలని చూసినా తాను చాలా చిరాకుపడిపోయేది."

"చాలా ఆశ్చర్యంగా వుంది! మంజీర ని పైనుండి గమనించిన వాళ్ళెవ్వరూ తనకి అలాంటి బిహేవియరల్ ప్రాబ్లెమ్ వుంది అంటే నమ్మరు." ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్.

"అది నిజం." తలూపాడు ముకుందం. "నిరంజన్ కి పరిచయం అయినా అమ్మాయిల్లో తను అనుభవించకుండా వదిలిపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ మంజీర తనని కనీసం  చెయ్యివేసి ముట్టుకోనివ్వడం కూడా చెయ్యనివ్వలేదు. ఇదో పెద్ద ఓటమిలా వాడికి అనిపించింది. అంతే కాకుండా ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతూ వున్నాడు. ఎంత అందంగా వుంటేమాత్రం ముట్టుకుని అనుభవించడానికి అవకాశం లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడం వల్ల కోట్లు కలిసి వచ్చినా, సంసారం సుఖం లేకపోతే ఎలా?"      

"అదీ నిజమే కదా." నవ్వాడు అనిరుధ్.

"అందుకని వాడొక ప్లాన్ వేసాడు. తనని తన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి అక్కడ బలవంతంగా అనుభవిద్దాం అనుకున్నాడు. నాకు చెప్పివుంటే నేనేమన్నా వారించి వుండేవాడినేమో. కానీ అంతా అయ్యేవరకూ నాకేమీ తెలియలేదు." గట్టిగా నిట్టూర్చాడు ముకుందం.

"అంతా అయ్యేవరకూ అంటే అసలు ఏం జరిగింది? అఖ్ఖరలేనిదంతా బోలెడు సోది చెప్పి, అవసరమైన చోట ఇలా దాటేస్తావేమిటి?" కోపంగా అన్నాడు అనిరుధ్.

"ఆ గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ లో తనని రేప్ చెయ్యడానికి ప్రయత్నించాడు నిరంజన్. దానికి మంజీర ఎలా రియాక్ట్ అయ్యిందంటే, వాడిని చితగ్గొట్టి పారేసింది. వాడిని ఎంతలా కొట్టిందంటే, స్పృహ కోల్పోయి,తను వెళ్ళిపోయినా గంటకో ఎంతకో వాడు స్పృహలోకి వచ్చి బతుకు జీవుడా అని ఇంటికి చేరుకున్నాడు."

"ఇప్పటికీ నువ్వు చెప్పడం లో చాలా మిస్ చేశావనిపిస్తోంది." అనిరుధ్ అన్నాడు. "మంజీర కి సెక్స్ అంటే ఎంత ఇష్టం లేకపోయినా, నిరంజన్ తనకన్నా చాలా బలవంతుడు. కావాలనుకుంటే తనని కచ్చితంగా రేప్ చెయ్యగలడు. అంతే కాకుండా తనదగ్గర ఏదో భూతమో దయ్యామో వుందన్నట్టుగా భయపడుతున్నాడు. సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. కేవలం తన్నులు తిన్నంత మాత్రాన ఎవడిలోనన్నాఅలాంటి మార్పు వస్తుందా? సైకలాజికల్ గా అలా డిస్టర్బ్ అవుతారా? అందులోనూ నిరంజన్ లాంటి వాడు."

"నీక్కలిగిన అభిప్రాయమే నాకూ కలిగింది. కానీ వాడు నాకూ ఏ విషయం పూర్తిగా, సరిగ్గా చెప్పడం లేదు. ఆ సంఘటన తరువాత వాడిలో చాలా పెద్ద మార్పే వచ్చింది." నిట్టూర్చాడు ముకుందం. "నాకు తెలిసిందంతా నీకు చెప్పాను."

"ఒకే అయితే." ఇంకా విషయంలో ముకుందం చెప్పేదేం లేదని తెలిసాక వేగంగా భోజనం పూర్తి చేసాడు అనిరుధ్. అనిరుధ్ ఇంకా ఏమీ అడక్కపోవడంతో ముకుందం కూడా వేగంగానే భోజనం పూర్తి చేశాడు.

"నాకు రెండు విషయాల్లో సంతోషంగా వుంది." ఇద్దరూ భోజనం పూర్తి చేసి బయటపడ్డాక అన్నాడు ముకుందం.

"ఏమిటవి?" ఆగి ముకుందం మొహంలోకి చూసి అడిగాడు అనిరుధ్.

"ఒకటి, మంజీర లాంటి ముచ్చటైన అమ్మాయి నిరంజన్ లాంటి తిరుగుబోతు, తాగుబోతుని  పెళ్లిచేసుకోవడం లేదు."

"మరి రెండవది?"

"తను నీలాంటివాడిని పెళ్లిచేసుకోవడం. నువ్వు నిజంగా మంజీర కి తగిన వాడివి. ఆ సర్వేశ్వరం ఇంకా మంజీర అలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆనందకరం."

"కాకపోతే ఆ మంజీరని పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి నేను రాలేదు. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి నేను సిద్ధంగా లేను." అలా అని ముకుండాన్ని అక్కడే విడిచిపెట్టి వేగంగా నడిచాడు అనిరుధ్.       

&&&

"నువ్వు ఎన్ని తెలివితక్కువ పనులు చేసి చచ్చినా, ఆ మంజీరని వలలో వేసుకుని ఒక తెలివైన పని చేసావనుకున్నాను. దానితో పెళ్ళయిపోయివుంటే ఆ అందమైన అమ్మాయి నీ స్వంతం అయిపోవడం  మాత్రమే కాదు, వాళ్ళ కోట్లకొద్దీ ఆస్థి కూడా మనకి కలిసొచ్చేసేది. ఇలా తెలివితక్కువగా చేసి చచ్చావేమిట్రా?" నిరంజన్ తో కోపంగా అన్నాడు అతని తండ్రి చిదంబరం.

"వంటిమీద చెయ్యే వెయ్యనివ్వకపోతే ఆ అందంతో ప్రయోజనమేమిటి? ప్రాణాలు పొయ్యే పరిస్థితి వుంటే ఆ కలిసొచ్చే ఆస్థి గురించి ఏం ఆలోచిస్తాం?" నిరంజన్ కూడా కోపంగా అన్నాడు.

"అసలు ఏం జరిగిందిరా? ఎందువల్ల నువ్వింతలా భయపడిపోతున్నావు? దేనికీ భయపడేవాడివి కాదు, నువ్వేనా ఇలా మాట్లాడేది?" నిరంజన్ తల్లి శకుంతల ఆశ్చర్యంగా అంది.  

"ఒక్కసారి ఆ అమ్మాయి అందం గురించి, ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే మనకి కలిసొచ్చే కోట్లగురించి ఆలోచించరా. నీ భయం తొలగిపోయి మునపటి ఉత్సాహం తిరిగివస్తుంది." చిదంబరం అన్నాడు.

"ఆ దయ్యం వాడి ప్రాణాలు తీసేసేటంత పనిచేసింది. వాడిని పెళ్ళిచేసుకుంటే వాడినే కాదు, మనల్నీ చంపేస్తుంది. వాడినెలా మామూలు మనిషిని చేసుకోవాలి అని ఆలోచించకుండా, ఆలా మాట్లాడతారేమిటండీ?" కోపంగా అంది శకుంతల.

"నువ్వొక విషయం జాగ్రత్తగా విను. అది విన్న తరువాత కూడా నేను పనికిరాని వాగుడు వాగుతున్నాననిపిస్తే చెప్పు, నేను ఆపేస్తాను." కాస్త ఆగి అన్నాడు చిదంబరం. "ఆ సర్వేశ్వరం కొట్లమీద కోట్లు ఆర్జించాడు. ఆ మంజీర వాడి ఒక్కగానొక్క కూతురు, ఇంకా ఆ సర్వేశ్వరానికి తన కూతురంటే వల్లమాలిన ప్రేమ. మనవాడికి ఏ బిజినెస్ చేసి రాణించ గలిగే శక్తీ ఎలాగు లేదు. ఆ మంజీర ని పెళ్ళిచేసుకుంటే ఆ ఆస్తికంతటికి యజమానై హ్యాపీగా కాలుమీద కాలు వేసుకుని జీవితాంతం బతకొచ్చు. అంతపెద్ద ధనవంతుడితో సంబంధం పెట్టుకుంటే మనకీ చాలా బాగుంటుంది.   ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మన వ్యాపారం బాగా లాస్ లో వుంది, మనం పీకల్లోతు అప్పులో వున్నాం. ఈ విషయం పైకి ఎవరికీ తెలియకుండా జాగ్రత పడుతున్నాను. ఈ పరిస్థితులలో ఆ సర్వేశ్వరం తో సంబంధమే మనల్ని ఆదుకోగలదు.   ఇప్పటికీ నేను మాట్లాడేది బాగాలేదంటే చెప్పు, మళ్ళీ ఈ ఊసు తేను."

"నేను అది కాదనను. కానీ మనవాడేదో చెయ్యివెయ్యబోతేనే అది అంతలా చితకేసింది. పెళ్లయ్యాక వీడినసలు ఎమన్నా చెయ్యనిస్తుందా? ఈసారి ప్రాణాలే తీసేదన్ననమ్మకం ఎమన్నా వుందా?" నిజానికి ఆ ఆస్తిపాస్తులు వదులుకోవడం శకుంతలకి కూడా ఇష్టం లేదు.అంతేకాకుండా తమ వ్యాపారం ప్రస్తుతం లాస్ లో ఇంకా తాము అప్పుల్లో ఉన్నామని నిరంజన్, శకుంతల ఇద్దరికీ తెలుసు.

"కొంతమంది అమ్మాయిలు కట్టుకోబోయేవాడి చేతుల్లో అయినా సరే పెళ్ళికి ముందు సెక్స్ అంటే అలాగే రియాక్ట్ అవుతారు. పెళ్లయ్యాక అటువంటి ప్రాబ్లెమ్ ఉండదు." చిదంబరం అన్నాడు.

"అయ్యో నాన్నా. ఆ భూతం నేను దానిగురించి ఆలోచించినా కూడా నన్ను చంపిపారేస్తుంది. ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఎందుకలా అంటారు?" నిరంజన్ భయంగా అన్నాడు.

"ఎవర్రా ఆ భూతం? ఎందుకలా అర్ధంలేని మాటలు మాట్లాడతావు?" కోపంగా అన్నాడు చిదంబరం.

"ఏమో నాన్నా, అదెవరో నాకూ తెలియదు. మొదట నేను దాన్ని లొంగదీసుకోగలననే అనిపించింది. నేను అదే ప్రయత్నంలో వుండగానే, అది అదొకలా మారిపోయింది. దానిని ఒక దయ్యం పూనినట్టుగా అయిపోయింది. అప్పుడసలు అదా మంజీర కానే కాదు. అది మామూలు మంజీరె అయితే దానికంత బలం వుండే అవకాశమే లేదు. నన్ను కాళ్లతో, చేతులతోచితగ్గొట్టి పారేసింది.. అలా కొట్టేటప్పుడు చెప్పింది, ఆ మంజీరని పెళ్లిచేసుకునేవాడు వేరే ఉన్నాట్ట. నేను దానిగురించి ఆలోచించినా కూడా నా తాట తీస్తానని చెప్పింది. అంతేకాకుండా నావల్ల ఆ మంజీర కి ఏ ప్రమాదం లేకుండా ఎప్పుడు నాతొ వుండి నన్ను కనిపెడతానని చెప్పింది."  ఇంకా అదే భయంతో అన్నాడు నిరంజన్.

"అయితే అదెవరో, అదెందుకు ఆ మంజీర శరీరంలోకి వచ్చిందో మాత్రం నీకు చెప్పలేదు." శకుంతల అంది.

"చెప్పిందో మానిందో అదలా నన్ను ఇష్టానుసారం చితకేస్తూవుంటే అది మాట్లాడే మాటలమీద నాకు కాన్సంట్రేషన్ కాలేదు. ఎప్పుడు స్పృహ కోల్పోయానో కూడా నాకు తెలీదు. నాకు స్పృహ వచ్చాక అదక్కడ లేదు, నేను నెమ్మదిగా ఇంటికొచ్చాను." నిరంజన్ అన్నాడు. 

"ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో బోధపడ్డం లేదు. మనం కన్సల్ట్ చేసిన డాక్టర్లు ఎవరూ జబ్బు కుదర్చలేకపోయారు.  వీడి జబ్బు ఎలాగోలాగ కుదిర్చి ఈ పెళ్లి చేసెయ్యాలి." చిదంబరం అన్నాడు.

"మనవాడిది శారీరక వ్యాధో, మానసిక వ్యాధో కాదు, నిజంగానే ఓ దెయ్యం దీనంతటి వెనకాల వుందని మీరెందుకు అర్ధంచేసుకోరు? మామూలు డాక్టర్లు, సైకాలజిస్టులు మనవాడికి సరిపోరు." శకుంతల అంది.

దానికి చిదంబరం ఎదో అనబోతూ వుండగా, అక్కడికి శకుంతల తమ్ముడి వరస అయినా అనంతం వచ్చాడు. వాడికి విషయం అంతా తెలుసు. అయినా వాడిముందు మళ్ళీ చిదంబరం , శకుంతల వాళ్ళ గోడు వెళ్లబోసుకున్నారు.    

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)