Read Are Amaindi - 23 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 23

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"యు ఆర్ రైట్." తలూపి అంది తనూజ. "నేను మంజీర తో తను పెళ్లి జరగడానికి ముందే సెక్స్ విషయం లో పూర్తిగా నార్మల్ కావాలి అని చెప్పాను. నేను చెప్పినదానికి పూర్తిగా అంగీకరించింది."

"అంటే తను తన ప్రాబ్లెమ్ ని అకనాలెడ్జ్ చేసింది."

"ఎస్, చేసింది. సెక్స్ ప్రతి మనిషికి నాచురల్ అని, దాని పట్ల ఇరిటేషన్ అన్-నాచురల్ అని తనతో నేను యాక్సెప్ట్ చేయించగలిగాను. పెళ్లయ్యేలోపునే తను పూర్తిగా నార్మల్ అవుతుందని, అదికూడా వారిద్దరిమధ్య పూర్తయ్యేలా చేస్తుందని, నేను తనదగ్గర మాట కూడా తీసుకున్నాను. ఆ రోజు అనిరుధ్ ఇంకా తనూ కావాలనే అది ప్రారంభించారు. కొంతవరకూ కో-ఆపరేట్ చేసింది. కానీ సడన్ గా వయొలెంట్ అయిపొయింది. ఎంత వయొలెంట్ అయిపొయింది అంటే, మా అందరికీ కాసేపు దడ పుట్టించింది."

"కొంతమంది ట్రెడిషనల్ గా, లోకజ్ఞానం లేకుండా పెరిగిన గాళ్స్ లో  సెక్స్ పట్ల వ్యతిరేకత నాచురల్. కానీ మంజీర చాలా మాడర్న్ గా ఉండేది. చాలా విషయాల పట్ల తనకి అవగాహన కూడా వుంది. తనలా సెక్స్ విషయం లో వయొలెంట్ అయిందీ అంటే, అదీ తను ఇష్టపడే అబ్బాయి ట్రై చేసినప్పుడు కూడా, దానికి ఏదో పెద్ద రీజన్ వుండే ఉండాలి." సాలోచనగా అంది రాగిణి.

"దానికి ఎమన్నా క్లూ నీ దగ్గర దొరుకుతుందేమోనని నీ దగ్గరికి వచ్చాను." గట్టిగా నిట్టూరుస్తూ అంది తనూజ. "మా అన్నయ్య నాకు చాలా చేసాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. దానికి ప్రతిగా మా అన్నయ్య కి నేనేమీ చెయ్యలేకపోయాను. కనీసం నా మేనకోడలు జీవితాన్ని అయినా పూర్తిగా దారిలోపెట్టి నా ఋణం కొంతైనా తీర్చుకుంటాను."

"నిజం చెప్పాలంటే మంజీర గురించి నేను ఆశ్చర్యపడ్డానే తప్ప, తనెందుకు అలా బిహేవ్ చేస్తూంది అని ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించ లేదు. మీరిలా చెప్పిన తరువాత ఆలోచించాలనిపిస్తూంది." ప్లేట్ లో కొన్ని స్నాక్స్ ఉండగానే ఆ ప్లేట్ ని కిందన పెట్టి కుర్చీలో వెనక్కి జారగిలబడింది రాగిణి.

కిందన పెట్టిన తన స్నాక్స్ ప్లేట్ ని చేతిలోకి తీసుకుని, ఒకటి ఒకటిగా కంజూమ్ చేస్తూ ఆసక్తిగా చూస్తోంది రాగిణివైపు తనూజ.

"తానెప్పుడూ ఏదో థ్రిల్ ఇంకా వెరైటీ కోసం చూస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో కావాలనే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద తగువులు పెట్టుకుంటూ ఉండేది. అదొక రీజన్ తనకి ఫ్రెండ్స్ పెద్దగా లేకపోవడానికి. అంతేకాదు. నిరంజన్ ఒక వెధవ అని తనకి తెలుసు. వాడితో తిరగడం వల్ల తనకి నష్టమని కూడా తెలుసు. అయినా తిరిగింది. ఇదంతా కేవలం ఏదో థ్రిల్ ఇంకా వెరైటీ కోసంచేస్తోందేమోనని నేను ఇప్పటివరకూ అనుకున్నాను."

"రాగిణీ నువ్వేం చెప్పదలుచుకున్నావ్ అసలు?" తన చేతిలో స్నాక్స్ ప్లేట్ కిందన పెట్టేసి, ముందుకు వంగి రాగిణి మొహంలోకి ఆసక్తిగా చూసింది తనూజ.

"అల్ ది టైం, ఐ రిపీట్ అల్ ది టైం, తను ఏదో థ్రిల్ ఇంకా వెరైటీ కోసం కాదు, ఏవో జ్ఞాపకాలనుండి పారిపోవడానికి ట్రై చేసింది. తనని బాధించే ఆ జ్ఞాపకాలు తన జోలికి రాకుండా వాటిని పూర్తిగా కప్పెట్టడానికే అలా చేసింది. ఎప్పుడూ తన మైండ్ ని డైవర్ట్ చెయ్యడానికి నిరంజన్ లాంటి వాడితో తిరిగింది. అంతే కానీ తను సరిగ్గా ఆలోచించలేక కాదు."

"నువ్వు సరిగ్గానే ఆలోచిస్తున్నావా?" భృకుటి ముడేసింది తనూజ.

"ఎస్ ఆంటీ, హండ్రెడ్ పెర్సన్ట్ నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను. తను అలా బిహేవ్ చెయ్యడానికి, ఇంకా సెక్స్ పట్ల తన వ్యతిరేకత కి కూడా ఏవో సంఘటనలు కారణం. అవి ఎప్పుడో చిన్నతనం లో జరిగివుంటాయి, వాటిని తొక్కిపట్టే ప్రయత్నం తను చేస్తోంది. నా అభిప్రాయం లో ఆంటీ తను చాలా రోజులు గా టెరిబుల్ మెంటల్ స్ట్రగుల్ లో వుంది. నా అంచనా తప్పు కాకపోతే ఆ మెంటల్ స్ట్రగులే తన యాక్సెంట్రిక్ బిహేవియర్ కి, ఇంకా ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ కి కారణం."

     ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది కొంతసేపు. ఇద్దరూ పూర్తి ఆలోచనలోనే వున్నారు. ఒక నిమిషం అలా తరవాత ఆ నిశ్శబ్దం ఛేదిస్తూ మళ్ళీ రాగిణి ఏ అంది. "ఎస్, అన్ని సందర్భాల్లో తన ప్రయత్నం కేవలం మైండ్ డివెర్షన్. కేవలం మనసుని మళ్లించి ఆ జ్ఞాపకాలు తనమీద దాడి చెయ్యకుండా ఉండడానికి మాత్రమే ట్రై చేసింది. తనకి మంచి, చెడూ అన్నీ గుర్తు వున్నాయి. అందుకనే నింరంజన్ లాంటి వాడితో తిరిగినా ఎలాంటి దురలవాట్లకు లోను కాలేదు."

"వండర్ఫుల్ రాగిణీ. నువ్వు పెద్ద సైకాలజిస్ట్ వి అవతావనడం లో నాకు ఎలాంటి డౌట్ లేదు. చక్కటి ఎనాలిసిస్. నువ్వు చెప్పింది హండ్రెడ్ పెర్సన్ట్ రైట్." నవ్వుతూ అంది తనూజ.

"థాంక్ యు ఆంటీ." తనూ నవ్వింది రాగిణి.                         

"థాంక్స్ రాగిణీ. నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇంత మంచి క్లూ దొరుకుతుందని నేను అనుకోలేదు." తనూజ అంది.

"ఇంతకన్నా ఎక్కువగా నేను తనగురించి చెప్పగలననుకోవడం లేదు ఆంటీ. ఇంకా ఏదన్న ముఖ్యమైన విషయం గుర్తుకు వస్తే నేను మీకు తప్పకుండా ఫోన్ చేసి చెప్తాను."

"చాలా ముఖ్యమైన క్లూ ఇచ్చావు, అది చాలు." కుర్చీలోనుండి లేచి నిలబడి అంది తనూజ. "ఇక నేను వెళ్లివస్తాను."

"ఆంటీ మీరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది." రాగిణి కూడా కుర్చీలోనుండి లేచి అంది.

"నీ పెళ్ళికి వస్తాను కదా, అప్పుడు తప్పకుండా చేస్తాను. ప్రస్తుతానికి వెళతాను." అంటూ బయలుదేరింది.

రాగిణి తనూజ తో గుమ్మం వరకూ వచ్చి సాగనంపింది. తను బయటకి వచ్చే సమయం లో, ఎవరూ లేకపోడంతో స్ట్రెయిట్ గా వచ్చేగలిగింది. తను రాగిణి ఇంటికి వచినప్పటిలాగానే, క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది తనూజ.

&&&

"రాగిణి అభిప్రాయ పడినట్టుగానే తన చిన్నతనం లో జరిగిన ఏవో చేదు సంఘటనలే తన యాక్సెంట్రిక్ బిహేవియర్ కి ఇంకా సెక్స్ పట్ల వ్యతిరేకత కి కారణం అని నేనూ అనుకుంటున్నాను." తన అన్నయ్య సర్వేశ్వరానికి రాగిణి తో తను మాట్లాడినదంతా చెప్పాక, అంది తనూజ.

"ఎప్పుడూ తను నాతోనే వుంది. తానెప్పుడూ సేఫ్ గా ఉండేలా నేనెన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. ఎలాంటి చేదు సంఘటనలన్నా జరగడానికి అవకాశం ఎక్కడిది?" ఆశ్చర్యంగా అన్నాడు సర్వేశ్వరం.

"దానికి సమాధానం నేను చెప్పలేనన్నయ్యా." నిట్టూరుస్తూ అంది తనూజ. "కానీ అలాంటి అన్-వాంటెడ్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకపోతే నీ కూతురు అందరిలా కాకుండా తేడాగా ఎందుకుంది?"

"దానికి సమాధానం చెప్పలేకపోయినా పర్లేదు. నన్ను ఏ ప్రశ్నలు అడక్కుండా. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో చెప్పు? నా కూతురు అందరి ఆడపిల్లల్లా ఆనందకరమైన జీవితం గడపాలి, అంతే." ధృడంగా అన్నాడు సర్వేశ్వరం.

"ఆ సంఘటనలేమిటో తెలియకుండా తన సమస్య పరిష్కారం కాదు. తనని హిప్నోటైజ్ చేసి అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ తరువాత ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది."

"తప్పకుండా అలాగే చెయ్యి, కానీ ఆ చేసేదేదో సాధ్యమైనంత త్వరగా చెయ్యి."

"ఒకే అన్నయ్యా. ఒకసారి మంజీర తోటి ఇంకా అనిరుధ్ తోటి కూడా మాట్లాడాక, తనని హిప్నోటైజ్ చేసి ఆ సంఘటనలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను."

"సరే అయితే" అందుకు అంగీకరిస్తూ తలూపాడు సర్వేశ్వరం.

&&&

"ఆంటీ నా బాగు కోరి నువ్వు చేసేదేదీ నేను వద్దనను. నువ్వెప్పుడు నన్ను హిప్నోటైజ్ చేద్దామనుకుంటున్నావో చెప్పు, ఐ యామ్ రెడీ ఫర్ దట్." ఉత్సాహంగా అంది మంజీర, తనూజ ఎప్పుడైతే తనని హైప్నోటైజ్ చేసి కొన్నివిషయాల గురించి తెలుసుకోవాలనుకుంటూందని చెప్పగానే.

"సినిమాల్లోనే తప్ప ఇప్పటివరకూ ఎప్పుడూ ఎవరూ హిప్నోటైజ్ చెయ్యబడడం నేను చూడలేదు. నాకు చాలా ఆసక్తిగా వుంది." అనిరుధ్ అన్నాడు.

"నాక్కూడా ఇదే మొదటిసారి ఇలాంటివి చూడ్డం." సర్వేశ్వరం అన్నాడు.

"ఒకే, మీరిద్దరూ కూడా వుండి చూడొచ్చు, కాకపోతే ఎక్కడా డిస్టర్బ్ చెయ్యకూడదు." చిరునవ్వుతో అంది తనూజ.

"ఆ నిన్ను డిస్టర్బ్ చెయ్యడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా? నిన్నెక్కడా డిస్టర్బ్ చెయ్యకుండానే చూస్తాం లే." సర్వేశ్వరం చిరునవ్వుతో అన్నాడు.

"ఒకే అయితే." తలూపి అంది తనూజ. "కాకపోతే నేను మంజీర ని హిప్నోటైజ్ చేసి తెలుసుకోబోయే విషయాలు చాలా డిస్టర్బింగ్ గా ఉండొచ్చు."

"ఆంటీ ముందు మీరు నన్ను హిప్నోటైజ్ చేసి అవేమిటో తెలుసుకోండి." ఉత్సాహంగా అంది మంజీర. "అవేలాంటివైనా పర్లేదు. ముందు నేను అన్నివిధాలుగా నార్మల్ కావాలి."

"సబ్జెక్ట్ ఇంత ఉత్సాహం గా వున్నప్పుడు, ఇంక ఆలోచించడానికి ఏమీ లేదు.సాధ్యమైనంత త్వరగానే నిన్ను హిప్నోటైజ్ చేసి ఆ విషయాలేమిటో నేను తెలుసుకుంటాను."తనూజ అంది

“నేను నా రూమ్ లోకి వెళ్లి కాసేపు ఎదో చదవడమే, చూడడమో చేసి పడుకుంటాను." అలా అన్నాక కుర్చీలోనుండి లేచి అనిరుధ్ మొహం లోకి చూసింది మంజీర "నువ్వు కూడా రావచ్చు, కావాలనుకుంటే."

"లేదు నేనూ వెళదామనుకుంటున్నా, డిన్నర్ కూడా అయిపోయిందిగా." అనిరుధ్ అన్నాడు.

"సరే అయితే." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది మంజీర మేడ మీద తన రూమ్ లోకి.

"ఇక్కడ నాకొక విషయం అర్ధం కావడం లేదు." మంజీర పూర్తిగా అక్కడనుండి వెళ్ళిపోయాక, తనూజ మొహం లోకి చూస్తూ అన్నాడు అనిరుధ్. "మంజీర కేవలం ఆ విషయాల్ని మర్చిపోవడానికే కావాలని అలా బిహేవ్ చేసివుంటే, అవి బయటకి వస్తాయని తెలిసీ తనని హిప్నోటైజ్ చెయ్యడానికి ఎలా ఒప్పుకుంది?"

రాగిణి తనతో షేర్ చేసుకున్నదంతా, మంజీర కి తెలియకుండా, అనిరుధ్ కి కూడా చెప్పింది తనూజ.

"మంజీర ఆ విషయాల్ని ఎంతగా తొక్కిపెట్టాలని చూస్తూందంటే, అవి తన జీవితంలో అసలు జరగనే లేదు. కాంషస్ గా తన జీవితం అంతా చక్కగానే ఉందని తనని తాను నమ్మించుకుంటూ, అలా తన గతంలో ఆ చేదు సంఘటనలు ఏ రకంగానూ తనకి గుర్తురాకుండా ఉండడానికి, మైండ్ డైవర్ట్ కావడానికి తన సహజ ప్రవృత్తినే మార్చుకుంది." తనూజ అంది.

"ఏమిటో నువ్వు చెప్పేదేదీ నాకు అర్ధం అయి చావడం లేదు." చిరాగ్గా అన్నాడు సర్వేశ్వరం.

"నా అంచనా తప్పుకాకపోతే మంజీర ఆ విషయాల్ని నాకు చెప్పకుండా ఉండడానికి డీప్ గా ట్రై చేస్తుంది. హిప్నోసిస్ లోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఆ విషయాలు మరిచిపోవడానికి తన ఒరిజినల్ క్యారక్టర్ నే మార్చుకుంది. మనకి అనుమానం రాకుండా తను అలా నటిస్తూంది. నేను హిప్నోటైజ్ చేసికూడా తనచేత ఆ విషయాలు చెప్పించగలనని అనుకోవడం లేదు. సబ్జెక్ట్ సంపూర్ణ సహకారం లేకుండా తనచేత హిప్నోసిస్ లో మనం ఏమీ చెప్పించలేం." సాలోచనగా అంది తనూజ.

"అయితే తనని నువ్వు హిప్నోటైజ్ చెయ్యడం దేనికి? నువ్వు నాతో మొదట మాట్లాడినప్పుడు తనని హిప్నోటైజ్ చేసి, ఆ విషయాలు తెలుసుకుని, తనని క్యూర్ చెయ్యొచ్చు అన్నావు. ఇప్పుడిలా అంటున్నావు. అసలు తనని క్యూర్ చెయ్యడం నీ వల్ల అవుతుందా?" ఇంకా చిరాకు పడిపోయాడు సర్వేశ్వరం.

"అన్నయ్యా అన్ని ఆలోచనలు ఒకేసారి రావు. ఆలోచిస్తూన్న మీదట ఒకటీ, ఒకటీ తడుతూ ఉంటుంది." తనూజ కోపంగా అంది.

"ఎనీహౌ ఆంటీ, ఈ హిప్నోటిజం వల్ల కూడా ప్రయోజనం ఉండకపోతే మనం ఆ విషయాల్ని ఎలా తెలుసుకోవడం? తనని ఎలా క్యూర్ చెయ్యడం?" అనిరుధ్ అడిగాడు.

"నేననుకోవడం నేను తనచేత ఆ విషయాల్ని చెప్పించడానికి ప్రయత్నించే సమయంలో తన మామ్ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ కావచ్చు. మనం ఆ విషయాలు ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ చేత చెప్పించొచ్చు."

"స్ప్లిట్ పెర్సనాలిటీ అంటే ఆ పార్ట్ అఫ్ ది సేమ్ మైండ్. అలాంటప్పుడు మంజీర చెప్పడానికి ఇష్టపడని విషయాల్ని ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రం చెప్తుందా?"

"నో అనిరుధ్. స్ప్లిట్ పెర్సనాలిటీ సబ్జెక్ట్ కన్నా డిఫెరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అసలు సబ్జెక్ట్ చెయ్యలేనివి చెయ్యడానికే స్ప్లిట్ పెర్సనాలిటీలు క్రియేట్ అవుతాయి."

"ఒకవేళ ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ కాకపోతే?"

"అప్పుడే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం." గట్టిగా నిట్టూర్చింది తనూజ. "బట్ ఐ యామ్ కాన్ఫిడెంట్, ఆ సమయం లో తన మామ్ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అవుతుందని. ఒక్క విషయం అనిరుధ్."

"చెప్పండి ఆంటీ."

"నేను తనని హిప్నోటైజ్ చెయ్యడానికి ప్రారంభం చెయ్యడం దగ్గరనుండి, మొత్తం అంతా కంప్లీట్ అయ్యేవరకూ నువ్వు నీ సెల్ ఫోన్ లో రికార్డ్ చెయ్యి."

"ఒకే ఆంటీ." తలూపాడు అనిరుధ్.

"ఎంత ఆలోచించినా ఆ చేదు సంఘటనలు ఏమై వుంటాయో నేను అంచనా వెయ్యలేకపోతున్నాను." గట్టిగా నిట్టూర్చాడు సర్వేశ్వరం.

"నేను అంచనా వెయ్యగలుగుతున్నాను. నా అంచనా తప్పుకాకపోతే హండ్రెడ్ పెర్సెంట్ అదే అయి ఉంటుంది." తనూజ అంది.

"అయితే అవేమిటో నాకూ చెప్పి చావొచ్చు కదా." సర్వేశ్వరం కోపంగా అన్నాడు.

"ఎందుకన్నయ్యా? నేను చెప్పినా నువ్వు నమ్మవు. రేపు నీ కూతురి నోటినుండి నువ్వే విందువు గాని." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది తనూజ.

"మీరు రిలాక్స్డ్ గా వుండండి అంకుల్. అంతా చక్కబడుతుంది." అలా చెప్పాక అనిరుధ్ కూడా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

సర్వేశ్వరం మాత్రం ఆ కుర్చీలోనే చాలా సేపు అలా కూచుని వుండిపోయాడు. ఎందుకో తన మనసంతా చాలా ఆందోళనగా వుంది.        

&&&

"మీ అమ్మాయి చేసినదాంట్లో అసలు తప్పే లేదు. ఆ విషయం తెలిసి నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. కట్టుబాట్లు, నీతి నియమాలతో పెరిగిన ఆడపిల్లలు కట్టుకోబోయే వాడే అయినా పెళ్ళికి ముందు వంటిమీద చెయ్యివెయ్యడానికి ప్రయత్నిస్తే అలాగే చేస్తారు.మీ అమ్మాయీ అంతే చేసింది."

ఆ రోజు ఉదయం సర్వేశ్వరం ఇంటికి వచ్చాడు చిదంబరం. ఆ సమయం లో అనిరుధ్ తో సహా అందరూ ఇంట్లోనే వున్నారు. అందరూ హాల్లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.

"నేనిప్పుడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని అడగడానికి వచ్చాను. శుభస్య శీఘ్రం అన్నారు. ఈ విషయం లో ఆలస్యం మంచిది కాదు."

"కానీ మీ అబ్బాయి నాకు ఫోన్ చేసి మా అమ్మాయిని పెళ్లిచేసుకోవడం తన వల్లకాదని, తనని మర్చిపొమ్మని చెప్పాడు." సర్వేశ్వరం అన్నాడు.

"అలా ఎప్పుడు చెప్పాడు?" కోపంగా అడిగాడు చిదంబరం.

"ఆ మర్నాడే అనుకుంటా. తనకి ఇష్టం లేకపోతె బలవంత పెట్టడం మంచిది కాదని మా అమ్మాయి పెళ్లి వేరొకళ్ళతో ఫిక్స్ చేసేసాను కూడా."

"అదేమిటి సర్వేశ్వరం అలా అంటావ్? మీ అమ్మాయి, మా అబ్బాయి ఎంతగా ప్రేమించుకున్నారు, ఎంతగా కలిసితిరిగారు. వాళ్ళ ప్రేమగురించి అందరికీ తెలుసు. మావాడు ఎదో కాస్త తొందర పడి అలా అన్నాడని వేరేవాడితో పెళ్లి ఫిక్స్ చేసేస్తావా? అయినా మీ అమ్మాయి మా వాడితో ప్రేమ మర్చిపోయి ఇంకొకళ్ళని ఎలా పెళ్లిచేసుకుంటుంది?" కోపంగా అడిగాడు చిదంబరం.

"నేనుప్పుడూ నిరంజన్ ని ప్రేమించలేదు అంకుల్. డాడ్ ఫ్రెండ్ కొడుకు కదా అని స్నేహం చేసాను. ఆ స్నేహంతో కలిసి తిరిగాను. డాడ్ కావాలనుకుంటున్నారు కదాని పెళ్లి చేసుకుందామనుకున్నాను." మంజీర అంది. "కానీ పెళ్ళికి ముందే ఆగలేక రేప్ చెయ్యాలని చూసేవాడిని నేను పెళ్లిచేసుకోలేను. నాకు మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేదు."

"అదేమిటమ్మాయ్.........." చిదంబరం ఇంకా ఎదో అనబోతూ వుండగా, తనూజ అంది. "తనకిష్టం లేదంటూందిగా ఆ విషయం మర్చిపొండి. మేము తన పెళ్లి వేరే అబ్బాయి తో ఫిక్స్ చేసేశాంకూడా."

"ఆ అబ్బాయి ఈ అబ్బాయేనా?" అనిరుధ్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు చిదంబరం. అనిరుధ్ ని చూస్తూనే ఆ రోజు వచ్చిన కుర్రాడే అని గుర్తుపట్టాడు చిదంబరం. అంతేకాకుండా అనిరుధ్ గురించి నిరంజన్ చెప్పింది కూడా గుర్తువచ్చింది అలాగే అనిరుధ్ తోటే మంజీర పెళ్లి ఎందుకు ఫిక్స్ చేశారో కూడా అర్ధం అయింది. "ఇంత హడావిడిగా  మీ అమ్మాయికి ఈ అబ్బాయితో పెళ్లి ఎందుకు ఫిక్స్ చేసేసారో తెలుసుకోవచ్చా?"

"ఈ అబ్బాయి కూడా నా ఫ్రెండ్ కొడుకే. బుద్ధిమంతుడు. మా అమ్మాయికి కూడా నచ్చాడు. తనకీ మా అమ్మాయి నచ్చింది. అందుకనే ఈ ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ చేసేశాం." అసలు విషయం చిదంబరానికి చెప్పే ఉద్దేశం అసలు లేదు సర్వేశ్వరానికి.

చిదంబరం మళ్ళీ ఎదో అనబోతూ వుండగా సర్వేశ్వరమే అన్నాడు. "చిదంబరం. ఐ యామ్ సారీ. ఇంక మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిగే అవకాశం అయితే లేదు. కానీ మనిద్దరిమధ్య స్నేహం మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది. నువ్వు ప్రస్తుతం వున్న ఇబ్బందులు, అప్పులు అన్నిటిలోనుండి నువ్వు బయటపడడానికి సహాయం చేస్తాను. నన్ను నమ్ము."

ఇంక ఆ విషయం గురించి ఎక్కువగా ఏం మాట్లాడినా ఆ చేసే సహాయం కూడా చెయ్యకుండా పోతాడేమోనని భయం వేసింది చిదంబరానికి. “నువ్వలా తీర్మానించాక వేరే చేసేదేముంది? మరి నేను వెళ్ళొస్తాను." అని తిన్నగా ఇంటికి వచ్చేసాడు. 

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)