Read Are Amaindi - 21 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 21

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"కానీ మనం ఆరోజు ముద్దులు పెట్టుకున్నాము. అంతకు ముందు కూడా ఒకసారి నేను సెక్స్ లేకుండా వుండగలను, నీకు సెక్స్ ఇష్టం లేకపోతె నాకూ వద్దు అన్నప్పుడు కూడా నువ్వు నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నావు."

"ముద్దు పెట్టుకోవడం అన్నది కేవలం సెక్స్ లో పార్ట్ మాత్రమే కాదు. చిన్నపిల్లల్ని మనం కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటాం. మా డాడ్ కూడా నన్నెన్నో సార్లు కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. మా మామ్ కూడా అలా చేసేది. మన అఫెక్షన్ ని తెలియచేస్తూ పెట్టె ముద్దుల పట్ల, కౌగలింతలు పట్ల నాకు ఇరిటేషన్ రాదు. కానీ అవి సెక్స్ లో పార్ట్ గా వున్నపుడు మాత్రం నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది."

"ఓహ్, గాడ్! నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు." కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అనిరుధ్.

"రెండోసారి నువ్వు నాకు ముద్దులు పెట్టినప్పుడు, నేను నీకు పెట్టినప్పుడు, అవి నాకు సెక్స్ లో పార్ట్ అని తెలిసి ఇరిటేటింగానే అనిపించింది. కానీ ఎలాగన్నా నా వీక్నెస్ నుండి బయటపడాలి అన్న పట్టుదలతో పట్టించుకోలేదు. కానీ విషయం అక్కడి వరకూ వచ్చేసరికి ఇంక తట్టుకోలేకపోయాను, వయొలెంట్ అయిపోయాను."

"నువ్వు సెక్స్ ని పూర్తిగా యాక్సెప్ట్ చేసేవరకూ నేను నిన్ను తాకను కూడా తాకను. ఆరోజు ఎక్స్పీరియన్స్ తో నాకు చాలా భయంగా వుంది." కళ్ళు విప్పి, మొహం లో భయం అభినయిస్తూ అన్నాడు అనిరుధ్.

ఆ విషయం విని నవ్వినా వెంటనే సీరియస్ గా మారిపోయింది మంజీర మొహం. "అందరి జీవితాల్లోనూ ఎంతో నాచురల్ అయినా సెక్స్ ని నేనెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకలా వయొలెంట్ అయిపోయాను, ఆలోచిస్తూంటే నాకు పిచ్చి పడుతున్నట్టుగా వుంది."

"నువ్వు అనవసరంగా అలోచించి మనసు పాడు చేసుకోకు, మన సమస్య ని పరిష్కరించడానికి నీ సైకియాట్రిస్ట్ ఆంటీ సిద్ధం గా వుంది. నువ్వు కాస్త పేషేంట్ గా వుండి, ఆవిడకి కో-ఆపరేట్ చెయ్యాలి అంతే." అనిరుధ్ అన్నాడు.

"నువ్వు చెప్పింది నిజమే." అలా అన్నాక కుర్చీలోనుండి లేచింది మంజీర. "పద ఇంటికి వెళదాం. ఈ రోజు నీ లంచ్ ఇంకా డిన్నర్ కూడా అక్కడే. రాత్రి పడుకోవడానికే ఇక్కడికి వద్దువుగాని." అనిరుధ్ ని కుడిచెయ్యి పట్టుకుని లేవదీస్తూ అంది.

"పెళ్లి కాకుండానే ప్రతిరోజూ అక్కడ అలా ఇష్టం లేదు." లేచి నిలబడ్డా అయిష్టం నిండిన మొహంతో అన్నాడు అనిరుధ్.

"మనకి పెళ్లి కాకపోవడం ఏమిటి? నా మామ్ ఎప్పుడో మన పెళ్లి చేసేసింది. మనం ఎప్పుడో భార్యాభర్తలం." గలగలా నవ్వింది మంజీర. "నాకు చాలా ఆకలేస్తూంది. అట్టే ఆలస్యం చెయ్యకుండా పద." తన భుజం మీదా చెయ్యివేసి నెడుతూ అంది.

ఇంక తప్పక అక్కడనుండి నడిచాడు అనిరుధ్.

&&&

"ఆంటీ అది నా మామ్ కాకపోతే, కేవలం నా సబ్-కాంషస్ మైండ్ లో పార్ట్ మాత్రమే అయితే, నాకందులోనుండి క్యూర్ కావాలని  వుంది. ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ నాలో అలా ఎక్స్పోజ్ కావడం నాకు ఇష్టం లేదు." లంచ్ చేసి అందరూ హాల్లో సెటిల్ అయ్యాక అంది మంజీర.

ఈసారి సర్వేశ్వరం, అనిరుధ్ పక్కపక్కనే కూచుంటే, తనూజ, మంజీర వాళ్ళకి అపోజిట్ గా కుర్చీల్లో కూచున్నారు.

"స్ప్లిట్ పెర్సనాలిటీ, ఇంకా ముల్టీపుల్ పెర్సనాలిటీలని క్యూర్ చెయ్యడం కొంచెం కాంప్లికేటెడ్ ఎక్సరసైజ్ నిజం చెప్పాలంటే దానికి కంప్లీట్ సొల్యూషన్ లేదనే చెప్పాలి." తనూజ అంది.

"అంటే జీవితాంతం నేను ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ తో ఇలా సఫర్ కావాల్సిందేనా? ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ నాలో ఎక్స్పోజ్ అయినప్పుడు నేను ఏం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్ధం కావడం లేదు. నాకు చాలా భయంగా కూడా ఉంది." మంజీర అంది.

"ఇంకా సంతోషించు. నీలో ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ నీ మామ్ మాత్రమే, నీ శ్రేయస్సు కోరుకునే మనిషి. సబ్జెక్ట్ కి అపకారం చేసేలా తయారయ్యే స్ప్లిట్ పెర్సనాలిటీ లు కూడా ఉంటాయి." తనూజ అంది.

"ఏమిటో ఈ స్ప్లిట్ పెర్సనాలిటీలు, ముల్టీపుల్ పెర్సనాలిటీలు నాకసలు అర్ధం కావడం లేదు. అది స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు నీ వదిన నిర్మల అంటే వినిపించుకోవు.అది స్ప్లిట్ పెర్సనాలిటీయే అయితే అలాంటి సమస్య నా కూతురికి ఎందుకు రావాలి?" చిరాగ్గా అన్నాడు సర్వేశ్వరం.

"కొన్నిరకాల పరిస్థితులు ఈ స్ప్లిట్ పెర్సనాలిటీలు, ముల్టీపుల్ పెర్సనాలిటీలు ఇంకా పెర్సనాలిటీ డిసార్డర్ లకి కారణం అవుతాయి. పెద్ద చిక్కల్లా ఈ రకమైన పరిస్థితులే స్ప్లిట్ పెర్సనాలిటీలకి కారణం అవుతాయని మనం చెప్పలేకపోవడం. ఉదాహరణకి మనం ఏదైనా ఒకటి చెయ్యాలని ఎంతగానో అనుకొంటూ, అది చెయ్యడానికి సాహసం చెయ్యలేని  పరిస్థితుల్లో  ఉంటే ఈ స్ప్లిట్ పెర్సనాలిటీలు, ముల్టీపుల్ పెర్సనాలిటీలు తయారవుతాయి. ఉదాహరణకి నీకు ఒకళ్ళని చంపాలని ఎంతో కోరికగా ఉంది. కానీ అలా చేసే శక్తి నీకు లేదు. అలాంటి సమయం లో నీ సబ్-కాంషస్ లోనుండి ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ తయారవుతుంది." కాస్త ఆగాక మళ్ళీ అంది తనూజ. "విచిత్రం ఏమిటంటే ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ కూడా  హేస్టీ గా బిహేవ్ చెయ్యదు. ఆలోచించే బిహేవ్ చేస్తుంది. అలా చాలా హత్యలు ఒకే స్ప్లిట్ పెర్సనాలిటీ వల్ల జరిగిన సందర్భాలు వున్నాయి."

"కానీ మంజీర లో తన మామ్ స్ప్లిట్ పెర్సనాలిటీ తయారవ్వడానికి కారణం ఏమిటి?" అనిరుధ్ అడిగాడు.

"చెప్పడం కష్టం. కాకపోతే మంజీర మామ్ ఎప్పుడు నీ దగ్గరే వుంటాను, నిన్ను కాపాడు కుంటాను అని తనతో  అనేదని మంజీర చెప్పింది. దానితో మంజీర సబ్-కాంషస్ తన తల్లి స్ప్లిట్ పెర్సనాలిటీ ని తయారు చేసివుంటుంది. ఇది కేవలం నా ఊహ మాత్రమే. అలా తన తల్లి స్ప్లిట్ పెర్సనాలిటీ తనలో తయారు కావడానికి కారణం ఏదన్నా కావొచ్చు."

"కానీ ఏం లాభం? నువ్వా సమస్య క్యూర్ కాదంటున్నావు కదా. ఇలాంటి సమస్యలు క్యూర్ చెయ్యలేకపోతే నీలాంటి సైకియాట్రిస్ట్ లు వుండి ఏం లాభం?" చిరాగ్గా అన్నాడు సర్వేశ్వరం.

అది విని నవ్వింది తనూజ. "నీ దృష్టిలో అది తన స్ప్లిట్ పెసనాలిటీ కాదు, వదినె కదా. ఇంక క్యూర్ చెయ్యాల్సిన అవసరం ఏమిటి? ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయినప్పుడల్లా వదిన వచ్చిందని ఆనందపడు."

దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు సర్వేశ్వరం. తక్కిన ముగ్గురిలో ఎవరో ఎదో చెప్పేలోపుగానే మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది తనూజ.

"కొన్ని సందర్భాలాలో ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ, ముల్టీపుల్ పెర్సనాలిటీలు ఎప్పుడన్నా జీవించి వున్న వ్యక్తులు అయితే, కొన్ని సందర్భాలలో పూర్తి ఇమాజినరీ అయివుంటాయి. ఇప్పటికీ జీవించి వున్న ఎవరన్నా వ్యక్తిని లేదా వ్యక్తులని కూడా స్ప్లిట్ పెర్సనాలిటీ ఇంకా ముల్టీపుల్ పెర్సనాలిటీలగా మైండ్ సృష్టించొచ్చు. అయితే అవి  మంజీర స్ప్లిట్ పెర్సనాలిటీ లా కేవలం సబ్జెక్టు వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకునే బిహేవ్ చేస్తాయని చెప్పలేం. అవెలా బిహేవ్ చేస్తాయన్నది అవి ఎందుకు సృష్టించబడ్డాయి అన్నదానిమీద ఆధారపడివుంది. అవెందుకు సృష్టించబడ్డాయి అన్న కారణాలు తెలుసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగానే ఉంటుంది."

"ఇది అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం గానే వుంది." అనిరుధ్ అన్నాడు.

"కష్టపడి అర్ధం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. అంత అవసరం లేదు." నవ్వింది తనూజ. "మంజీర స్ప్లిట్ పెర్సనాలిటీ తో పెద్ద ప్రాబ్లెమ్ ఉండదనే నాకు అనిపిస్తోంది. తను పూర్తిగా సేఫ్ హాండ్స్ లో వుంది, ఇంక తనకి ప్రాబ్లెమ్ ఉండదు అనిపిస్తే తనలో తన మామ్ స్ప్లిట్ పెర్సనాలిటీ వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. కొన్ని రోజుల తరువాత అసలు రాకపోవచ్చు కూడా."

 "నా దగ్గర తను సేఫ్ హాండ్స్ లోనే కదా వుంది? మరి మంజీర లో ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ కావడానికి, నువ్వన్నట్టుగా అది స్ప్లిట్ పెర్సనాలిటీ ఏ ఐతే, అందుకు కారణం ఏమిటి?" సర్వేశ్వరం అడిగాడు.

"తను బాల్యంలోనే పెళ్లిచేసిన అనిరుధ్ తో తన కూతురు సెటిల్ అవుతందన్న నమ్మకం చాలలేదు. అలాగే నిరంజన్ లాంటి బాడ్ కేరక్టర్స్ తో మంజీర తిరుగుతూ వుంది. అందుకే ఆ నిర్మల స్ప్లిట్ పెర్సనాలిటీ  గా ఎక్స్పోజ్ అవుతూ వుంది." తనూజ అంది.

"ఆంటీ మీరిక్కడ చిత్రం గా మాట్లాడుతున్నారు." అనిరుధ్ అన్నాడు. "స్ప్లిట్ పెర్సనాలిటీ అంటే పార్ట్ అఫ్ ది మైండ్ అంటూనే మళ్ళీ నిర్మల, అదే మంజీర మామ్, నిజంగానే తన బాడీలోకి వస్తుందన్నట్టుగా చెప్తున్నారు."

"మైండ్ కి మించిన చిత్రమైన విషయం ఇంకోటి లేదు." తనూజ అంది. "ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక జీవించిన లేదా, జీవిస్తున్న వ్యక్తి తాలూకు స్ప్లిట్ పెర్సనాలిటీ ఇంకో వ్యక్తిలో ఏర్పడితే, ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఏ వ్యక్తి కి సంభందించిందో ఆ వ్యక్తిలాగే ఆలోచిస్తుంది, ఆ వ్యక్తి లాగే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ మంజీర లో ఏర్పడిన తన మామ్ తాలూకు స్ప్లిట్ పెర్సనాలిటీ తన మామ్ లాగే ఆలోచిస్తుంది, తన మామ్ లాగే బిహేవ్ చేస్తుంది."

"మీరు చెప్పింది నిజమే. మంజీర లో తన మామ్ తాలూకు స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయినప్పుడు. తన గొంతు మారింది, తన బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. ఒక్క బాడీ లో డిఫరెన్స్ తప్ప నేను తన మామ్ తో మాట్లాడుతున్నట్టుగానే ఫీలయ్యాను." అనిరుధ్ అన్నాడు.

"తనలోకి నిర్మల వచ్చినప్పుడు నాక్కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది." సర్వేశ్వరం అన్నాడు.

"ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మంజీర లో ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం అది ఎక్స్పెల్ చెయ్యడానికి ప్రయత్నించకూడదు. ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ కోరికలేమిటో తెలుసుకోవాలి, అది ఎందుకు ఆ బాడీలో ఎక్స్పోజ్ అవుతూందో తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో ఆ స్ప్లిట్ పెర్సనాలిటీల ద్వారానే అవి ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నాయో, అవి ఆలా కాకుండా ఉండడానికి ఎం చెయ్యాలో తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది."

"మంజీర లోకి ఎప్పుడు నిర్మల వచ్చినా నేను తనతో ఆనందంగా మాట్లాడతాను తప్ప తనని వెళ్లగొట్టె ప్రయత్నం చెయ్యను." సర్వేశ్వరం అన్నాడు.

దానికి తనూజ ఎదో చెప్పబోయేంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. "హాయ్ రాగిణి, ఎలా వున్నవే." అంటూ వెళ్లి మంజీర తనని కౌగలించుకుంది.

"నేను బాగానే వున్నాను, నువ్వెలా వున్నావ్?" తను కూడా మంజీర ని కౌగలించుకుని, తన మొహంలోకి చూస్తూ అడిగింది రాగిణి.

"నేనూ బాగానే వున్నాను. మార్నింగ్ నీ ఫోన్ వచ్చిన దగ్గరనుండీ నీ గురించే ఎదురు చూస్తూ వున్నాను. అంటే నా కన్నా ముందు నువ్వే పెళ్లిచేసుకోబోతున్నావన్న మాట." తనూజ అంది.

"అదే నాకూ ఆశ్చర్యంగా వుంది. నిరంజన్ తో నీ పెళ్లి నా పెళ్లికన్నా ముందే అవుతుందనుకున్నా. కానీ నీ పెళ్లికన్నా ముందు నా పెళ్లే అవుతోంది." రాగిణి అంది.

"ముందు ఆ అమ్మాయిని మాకు పరిచయం చేసి తరువాత మీరిద్దరూ మాట్లాడుకోవడం బాగుంటుంది కదా." తనూజ అంది.

"మార్నింగ్ చెప్పానుగా ఆంటీ నా ఫ్రెండ్ రాగిణి పెళ్లిచేసుకోబోతూంది, పెళ్ళికి పిలవడానికి రాబోతూ వుంది అని. ఆ రాగిణి ఏ ఈ రాగిణి." అని తనూజ మొహం లోకి చూస్తూ చెప్పి, తరువాత రాగిణి మొహం లోకి చూస్తూ అంది. "రాగిణీ నీకు చెపుతూండేదాన్ని కదా, నాకొక సైకియాట్రిస్ట్ ఆంటీ ఉందని, ఆ ఆంటీ ఏ ఈ ఆంటీ, తను మా డాడ్, ఇంక ఈ అబ్బాయి ........."

".........పేరు అనిరుధ్. మన క్లాస్మేట్. నాకు గుర్తువున్నాడు." రాగిణి అంది.

"సరే అయితే వచ్చి కూచో." రాగిణిని తీసుకొచ్చి, అక్కడవున్న ఇంకో సోఫాలో కూచోబెట్టి తనూ పక్కనే కూచుంది.

"నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం. మంజీర తనకొక సైకియాట్రిస్ట్ ఆంటీ ఉందంటే, మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలని చాలా ఆశ పడ్డాను. మిమ్మల్ని నాకు పరిచయం చేస్తానని మంజీర నాకు ప్రామిస్ చేసింది కూడా." రాగిణి అంది.

"నిన్ను కలుసుకోవడం నాకూ చాలా ఆనందంగానే వుంది." తనూజ అంది నవ్వుతూ.

"నేను మీలా సైకియాట్రిస్ట్ ని కాలేక పోయాను, కానీ ఎం.ఏ. సైకాలజీ తో చదువుతున్నాను."

"చాలా మంచిపనే చేస్తున్నావ్." తనూజ అంది.

"ఇంతకీ మంజీరా నిరంజన్ తో నీ పెళ్లి ఎప్పుడు?" మంజీర మొహం లోకి చూస్తూ అడిగింది రాగిణి.

"ఇక్కడే నీకొక షాక్." నవ్వుతూ అంది మంజీర. "నిరంజన్ తో నా పెళ్లి క్యాన్సిల్ అయిపొయింది. నేను ఈ అనిరుధ్ ని పెళ్లిచేసుకోబోతూ వున్నాను."

"నాకేం అర్ధం కావడం లేదు. నిరంజన్ తో నీ పెళ్లి క్యాన్సిల్ కావడం ఏమిటి, ఈ అనిరుధ్ ని నువ్వు పెళ్లిచేసుకోవడం ఏమిటి?" అయమయంగా అడిగింది రాగిణి.

"అది చెప్పాలంటే నీకు పెద్ద కధే చెప్పాలి. రాత్రికి ఎలాగూ ఇక్కడే స్టే చేస్తావు కదా. అప్పుడు చెప్తాను." మంజీర అంది.

"ఐ యామ్ సారీ. నాకు రాత్రికి ఇక్కడ ఉండడం కుదరదు. పెళ్లి దగ్గరలోనే వుంది, ఇంకా నేను చాలా మంది ఫ్రెండ్స్ ని పిలవాలి. అందుకని నేను వెళ్ళాలి." రాగిణి అంది.

"అయితే నీకు ఆ కధంతా చెప్పడం కుదరదు. నువ్వు వెళ్లొచ్చు." కోపం గా అంది మంజీర.

"ప్లీజ్ కోపం తెచ్చుకోకు. నువ్వు కోపం తెచ్చుకుంటే నేను చూడలేను. పెళ్లయ్యాక కూడా నేను కలుస్తూనే వుంటాను కదా." మంజీర గడ్డం కుడిచేత్తో పట్టుకుని బతిమాలుతూ అంది రాగిణి.

"ఆల్రైట్. పెళ్లిచేసుకుంటున్నానన్న ఆనందం లో వున్న ఫ్రెండ్ ని బాధపెట్టడం ఇష్టం లేక మామూలు అవుతున్నాను." ఆ చేతిని తొలగించి నవ్వుతూ అంది మంజీర.

అంతలో అక్కడికి ఒక సర్వెంట్ మెయిడ్ వచ్చి అందరికీ, టీ ఇంకా కాఫీ సెర్వ్ చేసింది.

"ఆంటీ మీ ఫోన్ నెంబర్ నాకు ఇస్తారా? మీ లాంటి సైకియాట్రిస్ట్ తో మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయాలు నాకు ఉంటాయి." టీ ని సిప్ చేస్తూ అడిగింది రాగిణి.

"ఓ, తప్పకుండా. నీ ఫోన్ నెంబర్ నాకు చెప్పు. నేను నీకు మిస్డ్ కాల్ ఇస్తాను." ఒళ్ళో వున్న ఫోన్ ని చేతిలోకి తీసుకుని అంది తనూజ.

రాగిణి తన నెంబర్ చెప్తూ ఉండగా ఆ నెంబర్ కి డయల్ చేసింది తనూజ. తన ఫోన్ లో తనూజ నెంబర్ రింగ్ కాగానే అది సేవ్ చేసుకుంది రాగిణి.

స్నాక్స్, టీ ఫినిష్ చేసి, వాటిని కిందపెట్టి, సోఫాలోనుండి లేచి నిలబడుతూ అంది రాగిణి."మీరందరూ నా పెళ్ళికి తప్పకుండా రావాలి. అనిరుధ్ నువ్వు కూడా. ఆంటీ మీరు నాకు స్పెషల్ గెస్ట్." వెడ్డింగ్ కార్డు  సర్వేశ్వరానికి ఇస్తూ చెప్పింది రాగిణి. "పెళ్లి మా ఇంటిదగ్గరే. మా ఇల్లు పక్క టౌన్ లోనే. మీలో ఎవరు ఆబ్సెంట్ అయినా నేనూరుకోను."

"తప్పకుండా అలాగే." మొదట మంజీర, తరువాత తక్కినవాళ్లు అదే ప్రకారంగా చెప్పారు.

"ఇక నేను వెళ్తాను. ఎక్కువ సేపు వుండలేదు అనుకోవద్దు. చెప్పాగా, పిలవాల్సిన ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది వున్నారు."

"ఒకే అయితే. పద నేనూ గుమ్మం వరకూ వస్తాను." మంజీర కూడా లేచి రాగిణి తో పాటుగా గుమ్మంవరకూ వెళ్ళింది.

ఆ రోజు రాత్రి కూడా సర్వేశ్వరం ఇంట్లోనే డిన్నర్ చేసి తన ఇంటికి వచ్చాడు అనిరుధ్.

&&&

"గాడ్...........గాడ్.......గాడ్........" సాకేత్ తన నడుముని ప్రమీల మీద ఫోర్స్ గా కదుపుతూ వుంటే, తన ఆడతనం లో అతని మగతనాన్ని బిగుతుగా ఫీలవుతూ, తన కౌగిలిని అతనిచుట్టూ ఇంకా బిగించి, సుఖ సముద్రం లో తేలుతూ  ఇంక  ఉండలేక అంటూ వుంది ప్రమీల. "నన్నీ సుఖం తో చంపేస్తావేమోనని భయంగా వుంది."

ఆ రోజు ఉదయమే ఊళ్లోకి వచ్చాడు సాకేత్. అప్పటివరకూ వెల్లలు వేగిపోతూవున్న ప్రమీల మధ్యాహ్నమే అతని దగ్గరికి వచ్చేసింది. ఇద్దరూ ఆ సుఖం కోసం వేగిపోతూనే వున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకి ఆలా ప్రారంభించిన తరువాత అప్పటికి రెండుసార్లు వేడిదింపుకున్నాడు సాకేత్. అతను తనని ఎంజాయ్ చేసిన తీరులో ఎక్కడా తేడా లేదు ప్రమీల కి. ఎప్పటిలాగే తీరు తీరుగా ఆమె ప్రతి యవ్వన భాగాన్ని అనుభవిస్తూనే వేడి దింపుకున్నాడు సాకేత్.

"ఈ సారన్నా నన్ను డిజప్పోయింట్ చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నించి." ఫ్యూరియస్ గా నడుముని కదిపి, ముచ్చటగా మూడోసారి ఆమెలో వేడిని దింపుకున్నాక, ఆమె మీద గాలి తీసిన బెలూన్ లా వాలిపోయి, ఆమె ఎడమ చెవిలో అన్నాడు సాకేత్.

"కడుపుతో పెళ్లి పీటల మీద కూచోలేను నేను." అందివచ్చిన అతని బుగ్గమీద ముద్దుపెట్టుకుని, కౌగిలిని కొంచెం లూజ్ చేసి అంది ప్రమీల. "అయినా నీకు ఇదేం సరదా? పెళ్ళికి ముందు కడుపు చాలా ఎంబరాసింగా ఉంటుంది."

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)