Read Are Amaindi - 20 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 20

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"ఏం మాకు మీ అంత డబ్బులేదని ఆలోచిస్తున్నావా? మేం డబ్బుకి పేదవాళ్ళమేమో కానీ, గుణానికి కాదు. నిన్ను నేను ఆ దయ్యం నుండి రక్షించలేకపోతున్నానే అని బాధపడి ఈ నిర్ణయానికి వచ్చానే కానీ మరో దానికి కాదు. నన్ను నీ భార్యగా స్వీకరించలేపోతే అది నీ ఇష్టం. కానీ ఆ దయ్యం నుండి నిన్ను కాపాడలేకపోయానని మాత్రం అనకు. ఇలా తప్ప వేరే మార్గం నాకు కనిపించడం లేదు."

"సరే అయితే. నాకు అభ్యంతరం లేదు." ఈ నిర్ణయానికి కూడా సడన్ గానే వచ్చాడు నిరంజన్. ఎలాగన్నా ఆ దయ్యం పీడ వదిల్తే చాలు అన్న అభిప్రాయానికి వచ్చేసాడు.

"ఇది ఎంతవేగం పూర్తి అయితే అంత మంచిది. ఏ క్షణాన్నైనా అది నీ ప్రాణాలు తీసేవచ్చు."”

"మరింకెందుకు ఆలస్యం? నువ్వు నా బెడ్ మీదకి రా. ఇప్పుడు నాకు నా బెడ్ మీద నుండి కిందకి దిగడానికి కూడా భయంగానే వుంది."

నిరంజన్ అలా అన్న తరువాత మల్లిక అతని బెడ్ మీదకి చేరుకుంది. తరువాత ఆ ఇద్దరిమధ్య అది ప్రారంభం అయింది. తన భయాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి మల్లిక యవ్వనాన్ని తీరుతీరుగా అనుభవించాడు నిరంజన్. తనలో వేడి దింపుకొని, తన కుడిపక్కకి దిగబోతున్న నిరంజన్ ని తన కౌగిలి బిగించి ఆపి అంది మల్లిక. "థాంక్యూ వెరీ మచ్! ఇప్పుడు నువ్విచ్చినంత సుఖం ఇప్పటివరకూ ఏ మగాడు ఇవ్వలేదు నాకు."

"అదేమిటి నువ్వు కన్యనని చెప్పావుగా నాకు." కోపంగా అన్నాడు నిరంజన్.

"ఏ మగాడు ఇలాంటి సుఖం నాకు ఇవ్వలేడు అనబోయి తొందర్లో అలా అనేశాను. అయినా ఒక కన్యకి కన్య కానీ అమ్మాయికి తేడా తెలుసుకోలేనంత దద్దమ్మవా నువ్వు? నువ్వే చెప్పు నేను కన్యని అవునో కాదో?" కోపంగా అంది మల్లిక.

"నువ్వు కన్యవే." నవ్వాడు నిరంజన్. "అయినా నీ దగ్గర అనుభవించినంత సుఖం నేనెక్కడా అనుభవించలేదు. నువ్వు కన్యవి అవునా కాదా అన్నది పెద్ద విషయమూ కాదు. ఏదో ఆ మంజీర లాంటివాళ్లు తప్ప ఈ రోజుల్లో కన్యలు గా ఎవరుంటున్నారు. పెద్దమనుషులు అయ్యేవరకూ కూడా ఆగడం లేదు."

"ఇప్పుడదంతా ముఖ్యం కాదు." నిరంజన్ ని తన కుడివైపుకు తోసి, తను బెడ్ మీద నుండి కిందకి దిగింది మల్లిక. "ఇప్పుడు బెడ్ మీద మఠం వేసుకుని, గాల్లోకి చూస్తూ,  నేను చెప్పినట్టుగా చెప్పు." అంటూ నిరంజన్ ఏం చెప్పాలో చెప్పింది.

"నేను ఈ అమ్మాయిని సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకుంటాను. అందుకనే ఈ అమ్మాయితో అదికూడా పూర్తి చేసాను. నేను నీ కూతురి జోలికి ఎప్పుడూ రాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెట్టు." బెడ్ మీద మఠం వేసుకుని మల్లిక చెప్పమన్నట్టుగానే చెప్పాడు నిరంజన్.

"ఇక ఆ దయ్యం వల్ల నీకు ఏ ప్రమాదం ఉండదనే అనుకుంటున్నాను. కాకపోతే నువ్వు సాధ్యమైనంత త్వరలో నన్ను పెళ్లిచేసుకోవాలి. లేకపోతె అది నువ్వు మోసం చేసావనుకుని,ఇంకా రెచ్చిపోయి నీ వాళ్ళని కూడా చంపేస్తుంది."

"లేదు, ఈ విషయాన్ని రేపే నా పేరెంట్స్ తో మాట్లాడతాను." నిరంజన్ అన్నాడు.  అయితేవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆలోచన చాలా భయాన్ని కలిగిస్తూ వుంది.

  "సరే అయితే. ఇంక ఈ రాత్రికి నేను వెళ్లి పడుకుంటాను." ఆవలిస్తూ తన బెడ్ వైపు వెళ్ళబోతున్న  మల్లిక ని చేయిపట్టుకుని తన బెడ్ మీద కి మరోసారి లాగేసాడు నిరంజన్.

ఇంకోసారి వాళ్ళిద్దరి మధ్య అది ప్రారంభం అయిందది. నిజంగానే ఇప్పటి వరకూ తను అనుభవించిన వాళ్ళకన్నా చాలా అందంగా వుండి, వాళ్ళు ఎవ్వరూ ఇవ్వనంత సుఖం ఇచ్చింది మల్లిక. భయం కూడా చాలా వరకూ తగ్గిపోవడం వల్ల ఈ సారి ఇంకొంచం సేపు ఎక్కువ చేసి, ఇంకొంచం సుఖం ఎక్కువ అనుభవించాడు నిరంజన్.

"ఈ సారి మాత్రం ఖచ్చితం గా చెప్తాను. నువ్వు కన్యవి కానే కాదు." మరోసారివేడి దింపుకున్నాక, తన మీద పూర్తిగా వాలిపోయి, తన ఎడమ చెవిలో అన్నాడు నిరంజన్.

"రాస్కెల్, ఎంత ధైర్యం నీకు అలా అనడానికి?" కోపంగా అంది మల్లిక.

"మరి రెండుసార్లు నాతో సుఖం అనుభవించాక కూడా నువ్వు కన్యననే చెప్తావా?"

ఆ మాటలికి గలగలా నవ్వి తన కౌగిలిని నిరంజన్ చుట్టూ  ఇంకొంచెంబిగించింది మల్లిక. 

&&&

"అరె, నువ్వే మా ఇంటికి వచ్చావా?" మంజీర వైపు ఆశ్చర్యంగా, ఇంకా ఆనందంగా చూస్తూ అన్నాడు అనిరుధ్.

"నువ్వు వస్తావేమోనని చూసాను. నువ్వు రాకపోయేసరికి నేనే వచ్చాను." మంజీర అంది చిరునవ్వుతో. "ఇది మా అత్తగారిల్లు, నేను రాకూడదా ఏం?"

"నేనేమన్నా కాదన్నానా? నువ్వు రావడమే కాదు, ఇక్కడే వుండిపోవచ్చు కూడా." నవ్వుతూ అన్నాడు అనిరుధ్.

మంజీరకి అక్కడ వున్నకుర్చీని కూచోడానికి చూపించి, దానికి అపోజిట్ గా వున్న కుర్చీలో తను కూలబడ్డాడు.

"నేను అలా బిహేవ్ చేసినందుకు నీకు కోపం వచ్చింది కదా. అందుకే నువ్వు మా ఇంటికి రావడం మానేసావు కదా." కుర్చీలో కూచున్నాక అనిరుధ్ వైపు చూస్తూ అంది మంజీర.

"అదేమిటి అలా అంటావ్? నేను నీకు ఫోన్ లో చెప్పాను కాదా. సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చాలా దగ్గరికి రావడం వల్ల మనోజ్, నేనూ చాలా సీరియస్ గాకంబైన్డ్ స్టడీ చేస్తున్నాం వాడి ఇంట్లో. అందుకే లాస్ట్ టు డేస్ నీ దగ్గరికి రాలేదు. అదే నీకు ఫోన్ లో చెప్పాను కూడా."

"మరి ఈ రోజు నువ్వు తన ఇంటికి వెళ్లడం లేదా?"

"వాడేదో చిన్న పనివుండి బయటకి వెళ్తున్నాడు. కాబట్టి ఇంట్లోనే వుండి చదువుకోవాలని నిర్ణయించుకున్నాను." అనిరుధ్ అన్నాడు.

"అయితే నేనొచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను కదా. ఐ యామ్ సో సారీ." రిగ్రెట్ఫుల్ ఎక్సప్రెషన్ తో అంది మంజీర.

"నీతో మాట్లాడ్డం కన్నా నాకు ఆనందకరమైన విషయం ఏమీ లేదు. దానిగురించి ఏదన్నాత్యాగం చేస్తాను. చివరికి నా సివిల్స్ ఎయిమ్ ని కూడా."

"నా మీద నీకు లవ్ ఫీలింగ్ ఏమీ రాలేదు కదా. అయినా అలా ఎలా?" కళ్ళు చిట్లించింది మంజీర.

"ఏదో ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది. అది లవ్వా మరొకటా అంటే చెప్పలేను." అనిరుధ్ నవ్వాడు. "కాకోపోతే నీ గురించి ఏదన్నా త్యాగం చెయ్యాలనిపిస్తూ వుంది. చేస్తాను కూడా."

"అలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా లవ్వే. అది మరొకటి కావడానికి అవకాశం లేదు." నవ్వింది మంజీర. "నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న నిన్ను నేను చాలా బాధపెడుతున్నాను. నిన్ను చదువుకోనివ్వడం లేదు. అలాగే ఏ రకంగానూ నీకు సుఖం ఇవ్వలేకపోతున్నాను." సడన్ గా విచారం తో నిండింది మంజీర మొహం.

"నువ్వలా ఆలోచించకు." మంజీర కుడిచేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని అన్నాడు అనిరుధ్. "మనమధ్య అంతా సెట్ అవుతుంది. అలా సెట్ అవ్వడానికి ఎంతకాలం పట్టినా కూడా పర్లేదు. అయినా ఇప్పటికింకా మనకి పెళ్లికూడా కాలేదు. ఆ విషయం గురించి ఇప్పుడెందుకు కంగారు పడడం."

అనిరుధ్ చేతుల్ని దగ్గరికి తీసుకుని, కుడిచేతిమీద ముద్దు పెట్టుకుంది మంజీర.

"నువ్వు మాత్రం ఆనందంగా వుండు. నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటానని నీ మామ్ కి నేను మాట ఇచ్చాను. ఆ అమాయకురాలికి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. ఆవిడ దృష్టిలో నేను ఆల్రెడీ నీ భర్తని. నా మీద ఎంతో నమ్మకం తో మనిద్దరికీ పెళ్లికూడా చేసేసిందావిడ."

కాస్సేపాగాక మళ్ళీ అన్నాడు అనిరుధ్

"నిజంగా నీ మీద ఇలాంటి ఫీలింగ్ రావడానికి కూడా కారణం ఆవిడే అనుకుంటా. ఆ రోజుల్లో తరచూ నన్నడిగింది, నా కూతుర్ని పెళ్ళిచేసుకుని జాగ్రత్తగా చూసుకుంటావా అని. అడిగిన ప్రతిసారీ చెప్పేవాణ్ణి, తప్పకుండా అలాగే చేస్తానని. అది వూహ సరిగ్గా తెలియని వయసులో, ఒక అమాయకురాలికి ఇచ్చిన మాట కావచ్చు. కానీ అది పూర్తిగా నిలబెట్టుకోవలసిన బాధ్యత నా మీద ఉంది. నువ్వేరోజూ బాధపడకుండా చూసుకుంటాను." అలా అనేప్పుడు అనిరుధ్ కొంచెం ఎమోషనల్ అయ్యేడు కూడా.

"నువ్వే నా కూతురి మొగుడివి కావాలన్న నా నిర్ణయం లో తప్పు లేదు బాబూ. తనకి నువ్వే సరైన వాడివన్న ఉద్దేశంతోనే తనకి నిన్నిచ్చి పెళ్ళిచేసాను." మంజీర అంది.

"మంజీరా, ఏమిటి నువ్వు మాట్లాడేది?" ఆశ్చర్యంగా అడిగాడు అనిరుధ్.

"నేను మంజీర ని కాదు నాన్నా! తన మామ్ ని, నిర్మలాంటీ ని."

అది వింటూనే అర్ధం అయింది అనిరుధ్ కి. తనలో స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అయింది అని. "నిర్మలాంటీ" ఆశ్చర్యం గా అన్నాడు అనిరుధ్.

"అవును, నిర్మలాంటీ నే." నవ్వింది మంజీర. గొంతు మారింది. బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా కనిపిస్తూ వుంది. "ఎంత పెద్దవాడివి అయ్యావు నువ్వు! చిన్న పిల్లాడిగా వుండేవాడివి." అనిరుధ్ ని కౌగలించుకుని అతని కుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఎందుకనో చాలా అనీజీ గా అనిపించింది అనిరుధ్ కి.

"ఆ రోజుల్లోనే నా కూతుర్ని ఎంతో చక్కగా చూసుకునేవాడివి. ఎందుకనో నువ్వు భర్తవైతే తనని చాలా బాగా చూసుకుంటావనిపించింది. అందుకనే నిన్నిచ్చి పెళ్ళిచేసాను." మంజీర అంది మళ్ళీ.

దానికి ఏం చెప్పాలో తెలియక, అసలు ఆ వ్యక్తిని మంజీరగా భావించాలో లేక తన తల్లి నిర్మలాంటీ గా భావించాలో తెలియక మౌనంగా వుండిపోయాడు అనిరుధ్.

"నా అంచనాని నిజం చేసావు. అందుకని చాలా సంతోషం."

అనిరుధ్ ఇంకా మౌనంగానే వున్నాడు.

"నా మంజీరని దేనికి బాధపెట్టకు. తనకి అది ఇష్టం లేకపోతె అదస్సలు అడగకు. నువ్వు మంచిపిల్లాడివి. అడగవు. కానీ కన్నతల్లిని కదా. ఉండలేక చెప్తున్నాను."

"తప్పకుండా అలాగే." అనుకోకుండానే అన్నాడు అనిరుధ్. "కానీ తనకి అదెందుకు ఇష్టం లేదు?" ఇదికూడా అనుకోకుండానే అడిగేశాడు.

ఎదో షాక్ తగిలినట్టుగా అయింది మంజీర మొహం. దానికి ఏం సమాధానం చెప్పాలో తోచనట్టుగా మౌనంగా ఉండిపోయింది.

కానీ దానికి సమాధానం తన స్ప్లిట్ పెర్సనాలిటీ నుండి తెలియొచ్చు అనిపించింది అనిరుధ్ కి. "నేనెప్పుడూ దాని గురించి తనని బలవంతం చెయ్యను. తనికిష్టం లేకపోతె అది నాకూ వద్దు. కానీ ప్రతి మనిషికి ఎంతో సహజమైన అది తనకి మాత్రం ఎందుకు ఇష్టం లేదు?"

"ఏమో, సమాధానం నాక్కూడా తెలియదు. తనకెందుకో అదిష్టం లేదు. కాబట్టి నువ్వు తనని అది అడగకు." బతిమాలుతున్నట్టుగా వుంది మంజీర గొంతు.

"సరే అయితే. నేను అడగను." తలూపాడు అనిరుధ్.

"ఒకడు తనని బలవంతం చేయబోయాడు. వాడిని చావగొట్టి మళ్ళీ నా కూతురిగురించి ఆలోచించినా సరే చంపి పారేస్తానని చెప్పాను. నా కూతురు చాలా అందంగా ఉంటుంది, కానీ అమాయకురాలు. అలాంటి నక్కలనుండి దానిని నువ్వే కాపాడాలి." మంజీర మళ్ళీ అంది.

తను ఎవరిగురించి అలా మాట్లాడుతూ వుందో అర్ధం అయి తెలియకుండానే నవ్వాడు అనిరుధ్. "తనని నేను కాపాడుకుంటాను. మీకు ఏ భయం అక్కర్లేదు." అన్నాడు.

"తనకి నేను మాట ఇచ్చాను. నేను తనని ఎప్పుడూ కాపాడుకుంటాను అని. అలాగే కాపాడుతున్నా. నేను కాపాడలేనప్పుడు తన బాధ్యత నీదే."

"తప్పకుండా అలాగే. చెప్పాను కదా. తనకెలాంటి హాని జరగనివ్వను. తన పూచీ నాది." అనిరుధ్ అన్నాడు.

"మీ అమ్మ ఎంత మంచిదో నువ్వంత మంచివాడివి." మళ్ళీ అనిరుధ్ ని కౌగలించుకుని అతని రెండుబుగ్గల మీద  ముద్దులు పెట్టుకుంది మంజీర.

తనని తన తల్లి నిర్మలాంటీ గా భావిస్తూండడం వల్ల చాలా అనీజీ గా వుంది అనిరుధ్ కి. నెమ్మదిగా ఆ చేతులనుండి విడిపించుకుని తనని కుర్చీలో కూచోపెట్టాడు అనిరుధ్.

"తన డాడ్ మా ఇద్దరికీ సాధ్యమైనంత త్వరలో పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్నారు." ఇంకేం మాట్లాడాలో అర్ధం కాక అన్నాడు అనిరుధ్.

"మీ ఇద్దరికీ ఇప్పుడు పెళ్లి ఏమిటి? మీ పెళ్లి నేనెప్పుడో చేసేసాను. మీరిద్దరూ ఆల్రెడీ భార్యాభర్తలు." నవ్వింది మంజీర.

అంతలోనే అనిరుధ్ కి సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. "మీకు మనవడో, మనవరాలో కావాలని లేదా మంజీర ద్వారా?" ఇలా అడిగి మంజీరకి సెక్స్ అంటే ఎందుకు అయిష్టమో, ఆ సమస్య ఎలా పరిష్కారం కావచ్చో తెలుసుకోవచ్చనిపించింది.

"ఎందుకు వద్దు? తప్పకుండా కావాలి." సమాధానం ఆవిడనుండి స్ట్రెయిట్ గా వుంది.

"మరి తనకి సెక్స్ అంటేనే పడదు. ఇంకది ఎలా సాధ్యం?"

ఆ ప్రశ్న వినగానే మంజీర మొహం లో అయోమయం కనిపించింది.

"నేను దాని గురించి బలవంత పెట్టను. తనకిష్టం లేనిది చెయ్యాలని నాకూ లేదు. కానీ మా మధ్య సెక్సే లేకుండా మీకు మనవడో, మనవరాలో ఎలా సాధ్యం?"

మంజీర మొహం లో అయోమయం అలాగే వుంది.

"మీరు తనకి సెక్స్ ఎందుకు ఇష్టం లేదో తెలుసుకుని, దానికి పరిష్కారం చూడొచ్చుగా?" మంజీర మొహం లోకి అలాగే చూస్తూ అడిగాడు అనిరుధ్.

మంజీరా అయోమయంగా, మౌనంగా అలాగే వుంది.

"నాకు మీ హెల్ప్ కావాలి ఈ విషయం లో. చెప్పండి." మళ్ళీ అన్నాడు అనిరుధ్.

"అనిరుధ్ నువ్వేం మాట్లాడుతున్నావ్? నాకు అర్ధం కావడం లేదు." మంజీర అంది.

"ఓహో, తనకి ఇష్టం లేని ప్రశ్న అడిగేసరికి ఆవిడ వెళ్లిపోయిందన్న మాట." నిట్టూరుస్తూ అన్నాడు అనిరుధ్.

"ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లిపోయారు? ఇంతసేపూ ఇక్కడేవున్నది మనం ఇద్దరమే కదా." ఆశ్చర్యం తో, ఇంకా అదే అయోమయం తో అడిగింది మంజీర.

"నీ లోకి మీ మామ్ వచ్చారు. మీ ఆంటీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆవిడ స్ప్లిట్ పెర్సనాలిటీ నీలో ఎక్సపోజ్ అయింది. మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం."

"గాడ్! ఏమిటి నువ్వు చెప్తున్నది?" షాక్ తో నిండిపోయింది మంజీర మొహం.

"నిజమే చెప్తున్నా. అయినా నీకు ఎందుకంత ఆశ్చర్యం? నీ బాడీ లోకి మీ మామ్ వస్తూంటుందిగా, అదే ఆవిడ స్ప్లిట్ పెర్సనాలిటీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా." అనిరుధ్ అన్నాడు.

"అవును కానీ నేనిదిప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నాకంతా ఎదో నిద్రలో వున్నట్టుగా వుంది. నీతో ఏం మాట్లాడేను అన్నది కూడా నాకు గుర్తు లేదు." ఆ షాక్ కొంచెం డైజెస్ట్ అయి అంది మంజీర.

"స్ప్లిట్ పెర్సనాలిటీ చేసేదేదీ సబ్జెక్ట్ కి తెలిసే అవకాశం లేదు. ఆ సబ్జెక్టు తో తీసిన సినిమాలు చూడ్డం కానీ, రాసిన నవలలు చదవడం కానీ నువ్వు చెయ్యలేదా?"

"ఆ ఏవో కొన్నిపుస్తాకాలు చదివాను. కాకపోతే నాకే ఇలాంటి స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ వస్తుందనుకుంటే, ఆ విషయం గురించి ఇంకా బాగా తెలుసుకుని ఉండేదాన్ని." నిట్టూర్చింది మంజీర. "ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరూ?"

తమ మధ్య జరిగిన సంభాషణ వివరంగా చెప్పాడు అనిరుధ్. "రెండు సందర్భాల్లో ఆవిడ నన్ను గట్టిగా కౌగలించుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది. అప్పుడు నాకు చాలా అనీజీ గా అనిపించింది."

"ఎందుకలా?" నవ్వింది మంజీర.

"నిన్నప్పుడు నీ మామ్ గా చూస్తూ వున్నప్పుడు ఇలాంటి యవ్వనం తో వున్నా శరీరంతో కౌగలించుకుని పెట్టె ముద్దులు ఎలా అనిపిస్తాయి?"

"ఓహ్ అదా." మరోసారి నవ్వింది మంజీర. "అది కేవలం నా మైండ్ లో ఒక పార్ట్ మాత్రమే కానీ నా మామ్ కాదనే నీ అభిప్రాయం కదా. సో అనవసరంగా ఫీలవ్వకు."

"సెక్స్ పట్ల నీకున్న అయిష్టత కి కారణం నీ స్ప్లిట్ పెర్సనాలిటీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసాను." తను అడిగిన ప్రశ్నలు మరోసారి చెప్పాడు అనిరుధ్. "అప్పుడే ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ మాయం అయిపొయింది."

"స్ప్లిట్ పెర్సనాలిటీ అంటే నా మైండ్ లో ఒక పార్టే కదా. తనకి ఆ ప్రశ్నకి సమాధానం తెలిసివుంటే నాకూ తెలిసివుండేది. తెలియని ప్రశ్నకి సమాధానం చెప్పలేకే తను వెళ్ళిపోయింది."

"స్ప్లిట్ పెర్సనాలిటీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సబ్-కాంషస్ మైండ్ బట్ నాట్ కాంషస్ మైండ్. సబ్-కాంషస్ మైండ్ లో వున్న చాలా విషయాలు కాంషస్ మైండ్ కి తెలియవు." అనిరుధ్ అన్నాడు.

"సెక్స్ కావాలని నీకు చాలా అనిపిస్తూ వుంది కదా. నాలో వున్న ఆ సమస్యని ఎలాగన్నా పరిష్కరించాలని చూస్తున్నావ్." అనిరుధ్ మొహం లోకి చిలిపిగా చూస్తూ అంది మంజీర.

"ఆరోగ్యంగా వున్న ప్రతి మనిషి కి అది కావాలనే అనిపిస్తుంది. అలా నాకనిపించడం లేదు అని అంటే అది కేవలం అబద్ధమే." నిట్టూర్చాడు అనిరుధ్. "కానీ నీకు ఇష్టం లేకుండా, నిన్ను ఇబ్బంది పెడుతూ అదెప్పుడూ మనమధ్య జరగదు. ఐ ప్రామిస్ యు."

"నాకెందుకు సెక్స్ అంటే అలాంటి అయిష్టం వచ్చిందో అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకెందుకో చిన్నపటినుండీ రొమాంటిక్ సీన్స్ చూసినా, ఎవరన్నా ముద్దులు పెట్టుకోవడం, ఇంకా కౌగిలించుకోవడం చూసినా చాలా ఇరిటేటింగా అనిపిస్తుంది. ఇంక మెయిన్ సెక్సువల్ కోర్స్ గురించి ఆలోచిస్తే చాలు, చాలా వయొలెంట్ అయిపోతాను."

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)