Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 12

సీత చిరు కోపంగా సుధ గారి వైపు చూస్తే సుధ గారు అంతకంటే సీరియస్ గా సీతని చూడటంతో సీత ముడుచుకుపోయి “ అందుకే అత్త అమ్మని ఉండమని అడగలేదు ఇలా చూపులతోనే నన్ను బెదరగొట్టేస్తుంది..... సరేలే అత్త అప్పుడప్పుడు వస్తూ ఉండండి.... “ అని అందరినీ కన్నీళ్ళతోనే సాగనంపి రామ్ తో పాటు ఫ్లాట్ కి వస్తుంది

@@@@@@@

డల్ గా సోఫాలో కూర్చొని ఉన్న సీతని చూసి రామ్ నవ్వుతూ తన పక్కన కూర్చొని సీత చేతిని తన చేతిలోకి తీసుకొని “ ఎందుకే అలా డల్ అయిపోతున్నావు??? నేనున్నా కదా నీతో పాటు!!! “ అని అన్నాడు

“ బావ అమ్మాయికి పెళ్లి అయ్యాక అప్పగింతలు అంటే ఏంటో అనుకున్నాను కానీ మొదటిసారి అనిపిస్తుంది అమ్మ అత్త వాళ్ళ అందరూ నన్ను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంటే బాధగా ఉంది..... చదువుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా నాకింత బాధ అనిపించలేదు..... “ అని కన్నీళ్ళతో అంది

“ ప్చ్ ఎందుకే ఆ కన్నీళ్లు??? అయినా మనమేమైనా అడవిలో ఉన్నామా ఏంటి???? సిటీలో ఉన్నాము కావాలంటే వీడియో కాల్ చేసి డైలీ అమ్మ అత్త మావయ్య నాన్న తాతయ్య నానమ్మలతో మాట్లాడుకోవచ్చు..... ఇంకా కావాలంటే సెలవు దొరికినప్పుడల్లా ఊరికి కూడా వెళ్ళిపోవచ్చు.....

నేను కూడా నీతో పాటు ఒంటరిగా ఉన్నాను...... ఇంకా ఎక్కువ నాకు సేఫ్టీ అవసరం ఎందుకంటే నీ వంట ప్రయోగాలన్నీ నామీద చూపిస్తావు కదా మరి ఆ వంటలకి బలయ్యే నేను ఎంత ఫీల్ అవ్వాలి చెప్పు??? “ అని సీత మూడ్ మార్చటానికి అల్లరిగా అన్నాడు

సీతా చిరుకోపంగా బావ అంటూ రామ్ భుజం మీద కొడుతూ ఉంటే రామ్ సీత చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని “ ఇంకెప్పుడు నా ముందు ఇలా ఏడవకే...... ఎందుకో తెలియదు నీ కన్నీళ్లు చూస్తే తట్టుకోలేను..... “ అని ఇంటెన్స్ గా తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పి ఇంకా చెంపల మీద ఉన్న కన్నీటిని తన పెదవులతో తుడవగానే సీత చిగురుటాకుల వణికి పోతూ బావ అని తడబడుతూ అంది

రామ్ తన వణుకు గమనించి సీతను వదిలేసి “ ప్చ్ ఎందుకే ఇలా ప్రతిదానికి వణికిపోతావు??? నేనే కదా నువ్వే అన్నావు మొన్న మనం ఎన్నిసార్లు ఇలా ముద్దులు పెట్టుకోలేదని!!!! మరి సేమ్ నేను అలా ముద్దు పెడితే ఎందుకు ఇలా అయిపోతున్నావు??? “ అని సీత మనసులో ఏముందో కనుక్కోవడానికి అడిగాడు

సీత రామ్ ఎదురుగా బాసిమట్టం వేసుకొని కూర్చుని చెంపల కింద చేతులు పెట్టి రామ్ వైపు చూస్తూ కళ్ళు టప టపా కొడుతూ “ ఏమో తెలియదు బావ పెళ్లయిన తర్వాత నీ స్పర్శ తగిలితే చాలు ముడుచుకుపోతున్నాను!!!! బహుశా పెళ్లి ఎఫెక్ట్ ఏమో!!!! ఇదంతా తగ్గటానికి కొన్ని రోజులు పడుతుంది అందుకే నువ్వు నాకు కొంచెం డిస్టెన్స్ మెంటల్ చెయ్..... ఇంతకీ మధ్యాహ్నం లంచ్ కి ఏం చేస్తున్నావు??? “ అని క్యూట్ గా అడిగింది

“ ఏం చేస్తున్నావు కాదు ఏం చేస్తున్నాం అని అడగాలి!!! “ అని సీత నెత్తి మీద మొట్టి “ ఎందుకంటే ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం కాబట్టి..... నేనొక్కడినే ఎన్ని రోజులు వంట చేస్తాను??? ఇద్దరం వర్క్ షేర్ చేసుకోవాలంటే నువ్వు కూడా పనులు నేర్చుకోవాలి కదా!!!

అది వంట దగ్గర నుంచే మొదలు పెడదాం రా..... “ అంటూ సీత చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకువెళ్లి కూరగాయలు బయటికి తీసి “ వీటిని కట్ చెయ్ “ అని ఒకటి కట్ చేసి చూపించి “ ఇలాగే కట్ చేసి ఇవ్వు నేను మిగిలినవి రెడీ చేసుకుంటాను..... “ అని రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి కర్రీస్ కోసం మసాలా పట్టుకుంటూ ఉన్నాడు

సీత రామ్ చెప్పినట్టు కట్ చేస్తూ ఏమరపాటుగా తన వేలు కూడా కట్ చేసుకుని అమ్మ అని అరవగానే రామ్ ఎక్కడ పని అక్కడ వదిలేసి సీత అంటూ తన వైపు తిరిగి రక్తం సీత చూపుడువేలు నుంచి బొటబట కారుతూ ఉంటే ఆ వేలుని చూసి “ అయ్యో వేలు తెగిందే “ అంటూ వెంటనే సీత వేలిని తన నోట్లో పెట్టుకుని బ్లడ్ అంత తాగేస్తూ ఉంటే “ బావ ఏంటిది??? “ అని తడబడుతూ అడిగింది

“ హే ఆగు కదిలావంటే ఇంకా ఎక్కువ బ్లడ్ వస్తుంది..... ఆగిపోవడానికే ఇలా చేస్తున్నాను..... “ అంటూ చప్పరిస్తూ ఉంటే సీతకి రామ్ కి అంత దగ్గరగా ఉండి రామ్ అలా తన వేలిని లింక్ చేస్తూ ఉంటే సిగ్గుగా అనిపించినా అది కనిపించనివ్వకుండా “ ఇది బ్లడ్ ఆపడానికి ట్రై చేస్తున్నట్టు లేదు వాంపైర్ లా నా బ్లడ్ మొత్తం నువ్వే తాగుతున్నట్టుంది..... లాగుతుంది రా వేలు వదులు..... “ అంటూ బలవంతంగా రామ్ నోట్లో నుంచి వేలిని బయటకు తీసి సింక్ కింద పెట్టి “ బ్లడ్ ఆగటానికి ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు నీలా నోట్లో పెట్టుకుని మొత్తం బ్లడ్ కడుపులోకి పోసుకోరు..... “ అని చిరుకోపంగా ఉంది

ఇంతలో రామ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి సీత వేలికి కట్టు కట్టి “ నువ్వు ఏమైనా అనుకో నాకు తెలిసిన పద్ధతిలో నేను నీకు ట్రీట్మెంట్ చేశాను అంతే..... “ అంటూ “ రా నీకు ఎలా కూరగాయలు కట్ చేయాలో దగ్గరుండి నేర్పిస్తాను.... “ అంటూ

సీతని వెనుక నుంచి హత్తుకున్నట్టు నిలబడి తన చేతుల మధ్యలో నుంచి తన చేతులు పెట్టి సీత చేతులు మీద పెట్టి “ ఇలా కట్ చేయాలి “ అంటూ సీత చేతులతో కట్ చేయిస్తూ తన ఊపిరి సీత మెడ మీద వదులుతూ ఉంటే సీతకి రామ్ ఊపిరికి ఒంట్లో సెగలు రేపుతున్నట్టు అనిపిస్తూ కళ్ళు మత్తుగా మూసుకుపోతూ “ బా బావ ప్లీజ్ వదులు..... “ అని కష్టంగా పలికింది

“ వదిలితే మళ్లీ వేలు కట్ చేసుకుంటావు కొంచెం సేపు ఆగలేవా??? “ అని కసిరి అలానే కట్ చేస్తూ ఉంటే సీత ఐదు నిమిషాలు తట్టుకున్నది కాస్తా ఇక ఆకలేక రామ్ భుజం మీద వాలి పోయి “ నువ్విలా నన్ను హత్తుకుంటే నాకు లోపల ఏదేదో అవుతుంది బావ ప్లీజ్ నా చేతిని వదలవా!!! “ అని మత్తుగా అంది

రామ్ అప్పుడు సీత పరిస్థితి గమనించి సీత తన భుజం మీద వాళ్లగానే రామ్ కి కూడా ఏదో అయిపోతున్నట్టు అనిపించి సీత చేతులు మీద నుంచి తన చేతులు నిదానంగా కిందకి జారుస్తూ నడుమూ మీదకు చేర్చి చీరలో నుంచి జోనిపి రెండు చేతులతో నడుము గట్టిగా పట్టుకొని బుగ్గ మీద నుంచి మెడ మీద వరకు ముద్దులు పెడుతూ సీత అని హస్కీగా పిలిచాడు......

రామ్ పెదవుల స్పర్సకి సీతకి మైకం కమ్ముతూ ఉంటే హా బావ అని కళ్ళు మూసుకుని భారంగా అంది......

రామ్ సీతని ఒక్కసారిగా తనవైపు తిప్పుకొని కిచెన్ గాస్కెట్ మీద సీత నడుము రెండు వైపులా పట్టుకుని ఎత్తి కూర్చోబెట్టి తన మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటే సీత కళ్ళు వాల్చేసి “ అలా చూడకు బావ “ అని రామ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి నెడుతూ ఉంటే

రామ్ ఇంచ్ కూడా కదలకుండా ఇంకా దగ్గరగా జరిగి “ ఇలా కాక ఇంకెలా చూడాలి??? “ అంటూ హస్కీ మాటలతో రొమాంటిక్ చూపులతో సీత మొహం దోసిలిలోకి తీసుకొని పెదవుల మీద బొటనవేలతో నిమురుతూ “ ఒక్కసారి ముద్దు పెట్టుకోనా??? “ అని ముద్దుగా ఇంటెన్స్ గా అడిగాడు

అప్పటికే రామ్ స్టవ్ మీద నూనె పోసి దానిలో పోపు వేసి ఉండటం వలన అది మాడి మసి బొగ్గై మాడిన స్మెల్ వంటగది అంతా వ్యాపించి ఆ స్మెల్ సీత ముక్కుని తాకగానే సీతకి ఒక్కసారిగా మత్తు వదిలి బావ అని గట్టిగా అరుస్తూ ఉంటే రామ్ ఉలిక్కిపడి వెనక్కి జరిగి ఏమైందే!!! అని కంగారుగా అడిగాడు

“ అయ్యో బావ పోపు మాడిపోయింది.... అడ్డులే “ అంటూ కిందకి దిగి స్టవ్ దగ్గరికి వెళ్లేసరికి పోపు నల్లని చీకటిలా కనిపిస్తూ ఉంటే తల కొట్టుకొని “ అయ్యో అనవసరంగా పోపు బాండీ అన్నీ పాడైపోయాయి..... “ అంటూ ఉత్త చేతులతో దాన్ని ముట్టుకోవడానికి చేయి పెట్టగానే

రామ్ సీత చేయని పట్టుకొని వెనక్కి లాగి “ ఏయ్ మెంటల్ అలా పట్టుకుంటే చేయి కాలుతుందని మినిమం తెలివి లేదా??? “ అని అరుస్తూ స్టవ్ ఆఫ్ చేసి “ పోతే పోయిందిలే ఇంకొకటి పెట్టుకుందాం.... “ అంటూ

ఆ బండి క్లాత్ తో పట్టుకొని తీసి సింక్ లో వేసేసి మరో బాండి పెట్టి “ ఇక నువ్వు బయటికి పోవే!!! నువ్వు వంటలో నాకు హెల్ప్ చేసేదేమో కానీ ఇలా అన్ని మాడ్చేలా ఉన్నావు..... “ అని చిరుకోపంగా అన్నాడు

“ నీ ఇష్టం బావా “ అని నవ్వుతూ రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి “ అలాగే సాయంత్రం స్నాక్స్ కూడా నువ్వే ప్రిపేర్ చెయ్..... నా వేలు తెగింది కదా!!! “ అని ఇన్నోసెంట్ గా మొహం పెట్టి వేలు చూపించి చెప్పి ఫ్రిజ్లో జ్యూస్ తీసుకొని బయటికి వెళ్లిపోయింది

“ అబ్బబ్బ దీని పనే ప్రశాంతంగా ఉంది.... బ్యాచిలర్ గా ఉన్నప్పుడు అనవసరంగా వంటలు నేర్చుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను!!!! పెళ్ళాలు ప్రేమతో మొగుడికి వండి పెడతారు ఇక్కడ రివర్స్ లో మొగుడు వండి పెడితే పెళ్ళాం శుభ్రంగా తిని పెడతాను తొంగుంటాను అంటుంది!!!! “ అని తల కొట్టుకొని

ఒక రసం ఒక టమాట పులుసు ఒక దొండకాయ వేపుడు మూడు చేసి ఆల్రెడీ అయిపోయిన రైస్ తీసుకువెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టి “ ఒసేయ్ దెయ్యం రావే ఇక తిందాం..... “ అని అరిచాడు

“ ఏంటి బావా ఒక్క పూట వంటకి రెస్పెక్ట్ మళ్లీ ఎగిరిపోయిందా??? పాత రామ్ బయటికి వచ్చేస్తున్నాడా ఏంటి??? దయ్యం అని పిలుస్తున్నాడు!!!! “ అని అల్లరిగా అడిగింది

అవునే అని విసుగ్గా చెప్పి “ రా లంచ్ చేద్దాం ఆకలిగా ఉంది “ అంటూ తన ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంటే సీత బెలగా మొహం పెట్టి రామ్ పక్కన కూర్చుని రామ్ తింటూ ఉంటే అలానే చూస్తూ ఉంది.....

సీత చూపులు గమనించిన రామ్ ప్లేట్ దాచేస్తూ “ ఏంటే దిష్టి పెడుతున్నావా??? నీకు కూడా వండాను పెట్టుకొని తిను..... “ అని ఉరిమి చూస్తూ అన్నాడు

సీత సేమ్ బేల మొహం విత్ ఎక్స్ప్రెషన్ తో “ ఎలా బావ నా వేలు తెగింది కదా!!!! అని వేలు చూపించి అది కూడా కుడి చేతికి తెగింది ఇక ఎలా తినను??? “ అని అంది

రామ్ అప్పుడు గమనించి “ అయ్యో అసలు ఆ విషయమే మర్చిపోయానే..... “ అంటూ వెంటనే ప్లేట్లో ఇంకొంచెం అన్నం పెట్టుకొని కూరలో కలిపి “ దా నేను పెడతాను..... “ అంటూ గోరుముద్దలు కలిపి సీతకి పెడుతూ ఆ ఎంగిలి చేతితోనే తను తింటూ ఉంటాడు

రెండు ముద్దులు తిన్న సీత “ వావ్ బావ నీ వంట సూపర్...... వంటలో నిన్ను కొట్టే వాడే లేడు..... నీ ఫుడ్ తింటే కచ్చితంగా వారం రోజుల్లోనే నేను ఇంకో నాలుగు కేజీలు పెరిగిపోతాను.... కీప్ ఇట్ అప్ బావ..... “ అని భుజం తట్టి మెచ్చుకొని రామ్ పెట్టిన అన్నం మొత్తం మెక్కేసి బ్రేవ్ అని త్రేపి మరి పైకి లేవగానే

రామ్ కోర కోరా సీతవైపు చూస్తూ “ సాయంత్రం యూట్యూబ్ లో చూసి నువ్వే స్నాక్స్ డిన్నర్ చేయాలి..... నేను మాత్రం కిచెన్ లోకి తొంగి కూడా చూడను..... అలా కాని చేయలేదో అత్తకి ఫోన్ చేసి నువ్వు వంట చేయకుండా నా చేత చేయిస్తున్నావని చెప్తాను..... “ అని వార్నింగ్ ఇచ్చి తన ఫుడ్ తినేసి రేపు ఆఫీస్ కి వెళ్ళటానికి కావలసినవి చూసుకుంటూ ఉన్నాడు

సీత రామ్ వార్నింగ్ ని ఈజీగా తీసుకొని నాలుక బయటపెట్టి “ ఆ ఏముందిలే వంటే కదా అలా చేస్తే ఇలా పడుంటుంది!!!! ‘ అనుకుంటూ సాయంత్రం వంట చేయటానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏమేం వండగలదో మొత్తం చూసుకొని లిస్ట్ రాసిపెట్టుకొని ఎలా చేయాలో రాసిపెట్టుకొని “ హమ్మ ఒక పని అయిపోయింది..... “ అంటూ వాటర్ తాగి టైం చూసేసరికి అప్పటికే సాయంత్రం ఆరైపోవడంతో “ బాబోయ్ చూస్తూ రాస్తూనే టైం అయిపోగొట్టేనా??? “ అనుకుంటూ హడావిడిగా కిచెన్ లోకి వెళ్లి తను రాసుకున్నట్టుగా మొత్తం చేసి పెట్టి రామ్ కి పెట్టగానే రామ్ తిని వావ్ అని కాకపోయినా పర్వాలేదు అని అనిపించుకుంది......

తర్వాత రోజు టిఫిన్ జీడిపప్పు ఉప్మా చేస్తే రామ్ ఎలా ఉన్నా సరే తినేసి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి జాగ్రత్తగా ఉండని ఏమైనా అవసరమైతే ఫోన్ చేయమని మరీ మరీ చెప్పి బయటికి వెళ్లి తన బైక్ తీసి ఆఫీస్ కి బయలుదేరాడు......

ఆఫీస్ చేరుకోని లోపల అడుగుపెట్టిన రామ్ ని చూసి నీతూ ఎగ్జైటింగ్ గా రామ్ దగ్గరికి వచ్చి అభి అని పిలుస్తూ హత్తుకోవడానికి రెండు చేతులు ముందుకు చాప గానే రామ్ సీరియస్గా నీతూ వైపు చూస్తూ తనని హత్తుకోవడానికి వస్తుందని అర్థమయ్యి చెయ్యి పెట్టి రెండు అడుగుల దూరంలోనే ఆపేసి “ మనం ఆఫీస్ లో ఉన్నాము నీతూ!!!! పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు!!! ఇకనుంచి నాకు కొంచెం దూరంగా ఉండు..... “ అని సీరియస్ గా చెప్పి “ నేను ఎండి ని కలిసి వస్తాను అని ఎండి కాబిన్ కి వెళ్ళిపోయాడు

ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......