Orei Bawa - Osei Maradala - 11 books and stories free download online pdf in Telugu

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 11

సీత సేమ్ ఏడుపు మొహంతో “ బావ నువ్వు మారిపోయావు అనుకున్నాను కొంచెం కూడా మారలేదు ...... నన్ను ఏడిపించే విషయంలో పీహెచ్డీ చేసి ఛాన్స్ దొరికితే చాలు ఏడిపిస్తున్నావు ...... నేను అత్తతో చెప్తాను నీ మీద నువ్వు ఇలా షాపింగ్ మాల్ లో ఒక అమ్మాయిని హాగ్ చేసుకున్నావని అది కూడా నా ముందు చేసుకున్నావని చెప్తాను ...... “ అని అంది

@@@@@@@

అప్పటికే ఇల్లు వచ్చేయడంతో రామ్ సీత కన్నింగ్ మైండ్ కి షాక్ తో బ్రేక్ వేసి “ అమ్మ తల్లి అంత పని మాత్రం చేయకు‌.... నీ పనిష్మెంట్ నాకు షిఫ్ట్ అవుతుంది..... “ అని చేతులెత్తి దండం పెట్టి “ పద ఇంట్లోకి నీ జాబ్ గురించి మాట్లాడాలి..... “ అంటూ సీతని లోపలికి తీసుకువెళ్లాడు సీత రామ్ వెనకే నవ్వుకుంటూ “ దట్ ఇస్ సీత మహాలక్ష్మి “ అనుకుంటూ ముందుకు పడిన జుట్టుని ఊఫ్ అని వెనక్కి ఊది యాటిట్యూడ్ గా లోపలికి నడిచింది

రామ్ అన్ని కవర్లు లోపలికి తీసుకువస్తూ ఉంటే “ షాపింగ్ మాల్ మొత్తం కొనేశారా ఏంటి ??? ఏంటి అన్ని కవర్లు తీసుకువస్తున్నారు???? మాకు కూడా ఏమైనా పట్టుచీరలు తీసుకున్నారా??? “ అని అడిగారు ఆడవాళ్లు

మహాలక్ష్మి గారు గిర్రున తలతిప్పి “ అవునా రామ్ నిజంగానే మాకు పట్టుచీరలు తీసుకున్నావా??? ఎంత పెట్టి కొన్నావు ఒక పదివేలు పెట్టైనా కొన్నావా ‌ ??? “ అని ఆత్రుతగా అడిగారు

వీరేంద్ర గారు సురేంద్ర గారు సూర్యనారాయణ గారు తల కొట్టుకొని “ ఈ ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలు ఈ మాటలు తప్ప ఇంకేం రావు..... “ అనుకుంటూ ఉంటే రామ్ వెటకారంగా “ అదంతా మీ మనవరాలిని అడగండి మీకోసం ఏం కొన్నదో చెప్తుంది ..... “ అని చెప్పి ఆ ప్యాకెట్స్ అన్ని తీసుకువెళ్లి తన బెడ్ రూమ్ లో పడేసి “ హుష్ అబ్బా ఒక పని అయిపోయింది ఇక వెళ్లి దీని పని చెప్పాలి.... “ అనుకుంటూ బయటికి వచ్చేసరికి

సుధ గారు సీతని నిలదీసిఫై చేస్తూ “ ఎందుకే అన్ని జతలు నీకే కొనుకున్నావు ??? కనీసం రామ్ కి ఒక్క జత కూడా కొనకుండా నీకు మాత్రమే అన్ని కొనుక్కొని ఏం చేసుకుంటావు???? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా మూడు జతలు వేసుకొని గంగిరెద్దుల ఊరేగుతావా ఏంటి???

అయినా నీకు కొనుక్కుంటే కొనుక్కున్నావు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం మాకు ఒక పట్టు చీర లేకపోతే ఒక నార్మల్ చీరైన కొని తీసుకు వద్దామని లేదా ??? ఇంకెప్పుడు పద్ధతులను నేర్చుకుంటావు??? “ అని చెడ మడ కడిగి పారేస్తూ ఉన్నారు

అప్పుడే బయటకు వచ్చిన రామ్ ఇరుక్కుపోయాను అన్నట్టు మొహం పెట్టి చూస్తూ ఉన్న సీతవైపు చూసి నాలుక బయటపెట్టి వెక్కిరించి వెళ్లి సురేంద్ర గారి పక్కన కూర్చోగానే సీతకి కాలి సుధ గారిని పట్టించుకోకుండా “ అత్తయ్య నీకు ఒక విషయం చెప్పాలి..... “ అని రాధ గారి చుట్టూ చేయి వేసి రామ్ వైపు కోపంగా చూస్తూ అంది

ఇది ఏం చెప్తుంది??? అని అనుమానంగా చూస్తూ ఉంటే రాధ గారు ఏంటి ?? అని అడిగారు

“ అది అత్త షాపింగ్ మాల్ లో బావ ఫ్రెండ్ “ అని అంటూ ఉండగానే రామ్ భయపడి నిజంగా తన ఊహల్లో జరిగింది జరిగేటట్టు ఉంది అనుకొని “ ఆ అత్త చెప్పడం మర్చిపోయాను మన సీతకి జాబ్ వచ్చింది తను మరో వారం రోజుల్లో జాబ్ లో జాయిన్ అవుతుంది కూడా ..... కంగ్రాట్స్ చెప్పండి తనకి..... “ అని టాపిక్ డైవర్ట్ చేశాడు

ఈసారి సీత భయంగా సుధ గారి వైపు చూస్తూ ఉంటే అప్పటికే సుధ గారి కోపంగా సీత వైపు చూస్తూ “ నీకెందుకే జాబ్ ఇంట్లో ఉండి రామ్ ని జాగ్రత్తగా చూసుకోక ??? నువ్వు జాబ్ కి వెళ్లి రామ్ జాబ్ చేస్తూ ఇద్దరు ఎప్పుడో సాయంత్రం ఇంటికి వచ్చి ఆ చిరాకులన్నీ ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంసారం వెళ్లదీస్తారా???

అంత అవసరం ఏమీ లేదు నువ్వు జాబ్ చేయకు నోరు మూసుకొని ఇంట్లో ఉండి వంటలు ఎలా చేయాలి సంసారం ఎలా చక్కదిద్దుకోవాలి ఇంటిని ఎలా చూసుకోవాలి అవన్నీ నేర్చుకో ..... “ అని అన్నారు

సీత ఏడుపు మొహం పెట్టి రామ్ వైపు చూసేసరికి మే హు నా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి “ అది కాదు అత్త సీత కూడా జాబ్ చేస్తే తనకి కూడా బోర్ కొట్టదు కదా !!! పాపం నేను ఉదయం ఎప్పుడో 9 గంటలకి వెళ్లి నైట్ ఎప్పుడో ఎనిమిది గంటలకు వస్తాను..... అప్పటివరకు ఒక్కతే ఉండాలంటే ఎంత భయపడుతుంది చెప్పు???

పైగా మీకు తెలియదా సీతకి ఒంటరితనం అంటే ఎంత భయమో!!! అందుకే తను జాబ్ చేస్తానంటే నేనే ఓకే చెప్పాను..... నాకు తను జాబ్ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ..... పైగా తన జాబ్ ఎక్కడో తెలుసా? నా కంపెనీలోనే నాతో పాటే అటువంటప్పుడు సీత ఆఫీస్ కి నాతోపాటు వచ్చి నాతో పాటు ఇంటికి వస్తుంది కదా!!! “ అని ఏదో కన్విస్ చేయాలి అనుకుని అబద్ధం చెప్పాడనుకున్నాడు రామ్ బాబు

సీత ఆశ్చర్యం ప్లస్ షాక్ గా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నాలుక బయటపెట్టి అబద్ధం చెప్పాను అన్నట్టు కన్ను కొట్టి సుధ గారు వైపు చూసేసరికి సుధ గారు ఆలోచిస్తూ “ నువ్వు అన్నది బాగానే ఉందిరా కానీ మీరు ఇద్దరు ఆఫీస్ లో చిరాకులు ఇంటి వరకు తీసుకువచుకుంటే మీ సంసారం సాఫీగా సాగదు అదే భయంగా ఉంది ...... “ అని అన్నారు

“ నా గురించి నీకు తెలియదా అత్త నేను ఎక్కడివి అక్కడే వదిలేస్తాను!!!! అయినా ఆఫీస్ లో చికాకులు ఇంటి వరకు ఎవరైనా తీసుకొచ్చుకుంటారా???? సీత కూడా అలా చేయదు నాకు నమ్మకం ఉంది ..... మీరు తనని జాబ్ చేయటానికి ఒప్పుకోండి చాలు నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను..... “ అని భరోసాగా అన్నాడు

వీరేంద్ర గారు మాట్లాడుతూ “ వాడే ఒప్పుకున్నప్పుడు మధ్యలో నీకేంటి సుధ??? అయినా నా కోడలు జాబ్ చేస్తే ఏం పోతుంది??? తనకంటూ కొన్ని కలలు ఆశయాలు ఉంటాయి కదా అవి నెరవేర్చుకోవాలి కదా!!!! మనకోసం మనం సడన్ గా పెళ్లి చేసుకోమన్నామని నో చెప్పకుండా పెళ్లి చేసుకుంది అందుకని తన కళలని చిదిమేయాలని లేదు కదా!!! తనకి జాబ్ చేయడం ఇష్టమేమో చేయనివ్వండి ..... విసుగు వచ్చినప్పుడు తనే మానేస్తుంది..... అంతవరకు నా కోడల్ని ఎవరు వద్దు అని చెప్పటానికి వీల్లేదు..... “ అని అన్నారు

“ హా అంతేనండి అయినా నా బంగారానికి అన్నీ తెలుసు..... తను మన కొడుకుని చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటుంది అలాగే తన జాబ్ కూడా చూసుకుంటుంది.... అంతే కదా సీత??? “ అని తన చెంప మీద చేయి వేసి అడగగానే

సీత సంతోషంగా “ అంతే అంతే అత్త బావని నేను జాగ్రత్తగా చూసుకుంటాను..... బావతో పాటే ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వస్తాను..... నా గురించి బావ గురించి మీరు అసలు టెన్షన్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వను..... “ అని నమ్మకం గా అంది

“ హా అదే అలా చెప్పినప్పుడు ఇంకేంటి అత్త??? అయినా ఆడపిల్ల పెళ్లయ్యాక వంటగదికే పరిమితం చేయాలన్న రోజులు పోయాయి.... బయటికి వెళ్లి బయట ప్రపంచాన్ని చూసే హక్కు తనకి కూడా ఉంది..... అయినా హైదరాబాదులో ఎలా ఉండాలో ఎవరితో ఎలా మెరగాలి అనేది ఇలా జాబ్స్ చేసేటప్పుడే తెలుస్తుంది...... తనకి ఒక అవగాహన వస్తుంది.... వద్దనకు అత్త మా మంచి అత్త కదా నేను చెప్పింది ఒప్పుకుంటుంది కదా!!! “ అని సుధ గారి దగ్గరికి వెళ్లి భుజం చుట్టూ చేయి వేసి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ క్యూట్ గా మొహం పెట్టి అడిగాడు

“ నీ పెళ్ళాం నీ ఇష్టం రామ్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ముందే చెప్తున్నాను సీత నీకు సంబంధించిన ప్రతి ఒక్క పని చేయాలి..... నువ్వు మధ్యలో వేలు పెట్టకూడదు దానికి కూడా ఇంటి పనులు వంట పనులు సంసారం ఎలా సాగించాలి అనేవి తెలియాలి కదా!!! “ అని సీరియస్ గా అన్నారు

“ హా అమ్మ తప్పకుండా బావకి సంబంధించినవి అన్ని నేనే చేస్తాను నువ్వైతే నేను జాబ్ చేయటానికి ఒప్పుకున్నావా అదే చాలు...... “ అని సంతోషంగా ఎగురుతూ “ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పాయసం చేసి పెడతాను..... “ అని వంట గదిలోకి వెళ్తుంటే రామ్ గట్టిగా ఒద్దు సీత అని అరిచాడు

అందరూ రామ్ అరుపుకి ఉలిక్కిపడి వెన్ను తట్టుకుంటూ “ ఏమైంది రా ఎందుకలా అరిచావు??? “ అని సూర్యనారాయణ గారు అడగగానే “ మొన్న చేసిన సీత వంట నేనింకా మర్చిపోలేదు తాతయ్య..... నాకు మళ్ళీ దీని ఎక్స్పరిమెంట్లకి బలవ్వాలని లేదు....

ప్లీజ్ ఇప్పుడు ఈ పాయసాలు చేసే ప్రోగ్రాంలు ఆపేయమని చెప్పండి..... కావాలంటే ఫ్రిజ్లో స్వీట్స్ ఉన్నాయి అవి తీసుకువచ్చి అందరి నోర్లలో పెట్టమని చెప్పండి...... “ అని ఏడుపు మొహం పెట్టి అన్నాడు

నిజమే అని అందరికీ అనిపించినా సుధ గారు మాత్రం కోపంగా సీతవైపు చూస్తూ “ ఇప్పుడే చెప్తున్నా సీత నువ్వు వంట పని మొత్తం నేర్చుకోవాలి..... అన్ని రకాల వంటలు నేర్చుకొని నీ మొగుడి కోసం నువ్వే వండి పెట్టాలి అర్థమైందా??? “ అని అడిగారు

“ పో అమ్మ చేస్తానంటే డిస్కరేజ్ చేస్తూ నేను చేసిన వంటలకి మీరేమైపోతారు అన్నట్టు మాట్లాడుతూ మళ్ళీ వంట నేర్చుకోమని చెప్తున్నారా??? ఇలా అయితే నేను ఎలా వంట నేర్చుకుంటాను??? “ అని బుంగమూతి పెట్టింది

రాధ గారు నవ్వుతూ “ పదా మనం వంట చేద్దాం “ అంటూ సీత చేయి పట్టుకుని కిచెన్లోకి తీసుకు వెళ్తూ “ చూడండి ఆరోజు చేసినట్టు ఈరోజు కూడా మళ్లీ సీతని వెక్కిరించే ప్రోగ్రాం పెట్టారంటే చెప్తున్నాను మధ్యాహ్నం లంచ్ అందరికీ కట్ చేసేస్తాను..... “ అని వార్నింగ్ ఇచ్చి మరి కిచెన్లోకి వెళ్లి సీతకి పాయసం ఎలా చేయాలో చెప్తూ ఉంటే తను చేసి ముందుగా రామ్ కి స్వీట్ ఇచ్చి తినమని చెప్తే రామ్ రాధ గారి మీద నమ్మకంతో స్వీట్ తిని “ వావ్ సూపర్ మొన్నటికంటే చాలా బెటర్.... “ అంటూ ఒక్క స్పూన్ కూడా వదిలేయకుండా మొత్తం తినేసాడు

అందరూ పాయసం తిని బాగుందని చెప్పటంతో సీత థాంక్యూ థాంక్యూ అని ఉబ్బితబ్బిబైపోయి అందరితో పాటు సెటిల్ అయ్యి మాట్లాడుతూ ఉంటే రాధ గారు సుధ గారు నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్లి లంచ్ ఏర్పాట్లలో పడిపోతారు.....

తర్వాత రోజు అందరూ తిరిగి వారి ఊరికి వెళుతూ ఉంటే సీత ఏడుస్తూ “ బెంగగా ఉంది అత్త నువ్వైనా ఉండొచ్చు కదా!!!! నువ్వుంటే నాకు బాగుంటుంది.... “ అని అంటే సుధ గారి చిరుకోపంగా “ ఎవరైనా అమ్మని ఉండమని అడుగుతారు ఇక్కడ రివర్స్లో అత్తని ఉండమని అంటున్నావు కర్మ కర్మ.... “ అని తల కొట్టుకొని పద వదిన లేట్ అవుతుంది అని అంది

సీత చిరు కోపంగా సుధ గారి వైపు చూస్తే సుధ గారు అంతకంటే సీరియస్ గా సీతని చూడటంతో సీత ముడుచుకుపోయి “ అందుకే అత్త అమ్మని ఉండమని అడగలేదు ఇలా చూపులతోనే నన్ను బెదరగొట్టేస్తుంది..... సరేలే అత్త అప్పుడప్పుడు వస్తూ ఉండండి.... “ అని అందరినీ కన్నీళ్ళతోనే సాగనంపి రామ్ తో పాటు ఫ్లాట్ కి వస్తుంది

ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.......


షేర్ చేయబడినవి

NEW REALESED