Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 8

లేదు నానమ్మ వెళ్లాలి ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ ఉంది..... ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను లేదంటే వర్క్ కంప్లీట్ అవ్వదు...... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము వెళ్ళిపోతాము..... “ అని అన్నాడు

@@@@@@

పెద్ద వాళ్ళందరూ డల్ అయితే రామ్ నవ్వుతూ “ ఎందుకు అలా డల్ అవుతున్నారు మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మా దగ్గరికి వచ్చేయండి..... లేదంటే నాకు సెలవలు వస్తే నేనే సీతను తీసుకుని ఇక్కడికి వస్తాను...... మీరు అనవసరంగా మా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సీతని నేను జాగ్రత్తగా చూసుకుంటాను...... “ అని అన్నాడు

“ సీతని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావురా మాకు ఆ నమ్మకం ఉంది..... కానీ సీత తన తెలిసి తెలియని తనంతో నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతుందేమోనని చిన్న భయం!!! దానికి ఇంకా బ్రాడ్కా ఆలోచించేంత మనసు రాలేదు..... చిన్నపిల్లల మనసు లాగే ఇంకా అల్లరి చేస్తూ ఉంది...... పెళ్లయింది తన సంసారం స్టార్ట్ అయింది తన సంసారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకోవాలి అన్న ఆలోచన తీరు తనకి ఇంకా లేదు..... అదే మా భయం అక్కడ నిన్ను ఏమి ఇబ్బంది పెడుతుందోనని!!! “ అని అన్నారు సుధ గారు

వీరేంద్ర గారు రాధ గారు కోపంగా “ ఏం కాదు సీత పైకి అల్లరిగా కనిపించిన అందర్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటుంది...... మా కోడలు బంగారం కాబట్టి నువ్వు అనవసరంగా భయపడకు సుధ..... “ అని అన్నారు

“ మీరు ఇలా దానిని వెనకేసుకొని రావటం వల్లే అది అలా మొండి దానిలా తయారయ్యింది..... “ అని చిరుకోపంగా అన్నారు మహాలక్ష్మి గారు సుధ గారు

“ అబ్బా మీరందరూ ఆపండి సీతని నేను జాగ్రత్తగా చూసుకుంటాను...... నాకు దాని మీద నమ్మకం ఉంది అది అన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మారుతుందని!!!! కాబట్టి మీరు అనవసరంగా మా గురించి గొడవ పెట్టుకోకండి..... “ అని నవ్వుతూ అన్నాడు రామ్

“ అది అలా చెప్పరా మీ అత్త నానమ్మ ఎప్పుడు దానిమీద పడిపోతూ ఉంటారు..... “ అని చిరుకోపంగా అన్నారు రాధ గారు

సూర్యనారాయణ గారు గొంతు సవరించి “ సరే సరే ఇక ఆపండి మనం కూడా రామ్ తో పాటు అక్కడికి వెళ్లి ఒక వారం రోజులు ఉండి కావలసినవన్నీ తీసించి అక్కడ సీత క్షేమంగా ఉంటుందో లేదో నమ్మకం కుదుర్చుకొని తిరిగి వద్దాము..... “ అని అన్నారు

“ హా ఇదేదో బాగుంది..... “ అని అందరూ అనగానే “ సరే ఇక ఇదే ఫాలో అవుదాం.... “ అని సూర్యనారాయణ గారు అనగానే సరే మేము వంట పని చూస్తాము అని సుధ గారు రాధ గారు కిచెన్ లోకి వెళ్ళిపోతే రామ్ వర్క్ ఉందని రూమ్ లోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు పొలం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మహాలక్ష్మి గారు మోకాళ్ల నొప్పులుగా ఉన్నాయని రూమ్ లోకి వెళ్లి పోయారు.....

@@@@@@

రామ్ రూమ్ లోకి వెళ్లేసరికి సీత ముద్దుగా నిద్రపోతూ ఉండటం చూసి ఇంతకుముందు జరిగింది గుర్తుచేసుకొని తల విధిలించి “ ఇది దగ్గరగా ఉంటే నా చెయ్యి అసలు కుదురుగా ఉండటం లేదు బాబోయ్...... “ అనుకుంటూ లాప్టాప్ తీసుకువెళ్లి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న పదేపదే సీతనే చూడాలి అనిపిస్తూ ఉంటే “ ఏంటిది ఎప్పుడు లేనిది దీని చుంచు మొహం చూడటానికి మనసింత ఆరాటపడుతుంది??? చ చ నాకేదో అవుతుంది..... “ అనుకుంటూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేసిన అవ్వక లాప్టాప్ తీసుకొని బయటికి వెళ్లి పొలం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి తన బైక్ మీద పొలానికి వెళ్లి పచ్చని ప్రకృతి మధ్య మంచె దగ్గర ఉన్న గుడిసెలో ఉన్న మంచం మీద కూర్చొని లాప్టాప్ ఓపెన్ చేయగానే లాప్టాప్ స్క్రీన్ మీద సీత నవ్వుతూ ఉన్నట్టు కనిపించి “ ఇష్ ఇది నన్ను వదలటం లేదు.... “ అనుకుంటూ వెంటనే లాప్టాప్ మూసేసి అక్కడే ఉంటే ఇంకా సీత అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అనిపించి బయటికి వచ్చి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు వరి పొలం చూస్తూ ఒళ్ళు విరిచి “ అబ్బా ఇలాంటి వాతావరణ సిటీలో కూడా ఉంటే ఎంత బాగుండు!!! కానీ అక్కడ ఇలా ఉండదు కదా!!!! “ అనుకుంటూ పొలం గట్ల మీద నడుస్తూ తన ఫ్రెండ్స్ కనిపిస్తే సరదాగా మాట్లాడుతూ ఊరంతా చూస్తూ సాయంత్రం వరకు గడిపేసాడు

మధ్యాహ్నం లంచ్ కి రమ్మన్నా ఆకలిగా లేదని చెప్పి ఫ్రెండ్స్ తో తినేసి ఇంట్లో లంచ్ స్కిప్ చేసేసాడు......

@@@@@@

నైట్ కి ఇంటికి వచ్చిన రామ్ డిన్నర్ చేశాక వర్క్ అవ్వలేదని లాప్టాప్ పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంటే ఇంతలో సీత ట్రాన్స్పరెంట్ స్కై బ్లూ కలర్ సారీ కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని చేతిలో పాల గ్లాస్ పట్టుకొని రూమ్ లోకి అడుగుపెడుతుంది.....

రావడం రావటమే డైరెక్ట్ గా ఆబి ఎదురుగా నిలబడి “ బావ పాలంట తాగు అమ్మ నీకు ఇవ్వమని చెప్పింది..... “ అని అంటుంది

హా అని ఏమరపాటుగా తలెత్తిన రామ్ సీతని ఆ శారీలో చూసి కనీ కనిపించని అందాలు కనువిందు చేస్తూ ఉంటే ఫ్రీజ్ అయ్యి “ ఎవరైనా ఇలాంటి సారీ కట్టుకుంటారా??? “ అని గుటకలు మింగుతూ అడిగాడు

సీత బుంగమూతి పెట్టుకొని “ నేనేం కావాలని కట్టుకోలేదు అమ్మ అత్త బలవంతంగా కట్టి పంపించారు..... మొగుడి దగ్గరికి వెళ్లేటప్పుడు ఇలాంటి చీరల్లోనే వెళ్లాలంట!!!! అలా ఎందుకో నాకు మాత్రం ఏం తెలుసు??? “ అని చెప్పి రామ్ చేతిలో పాల గ్లాస్ పెట్టి నువ్వు “ సగం తాగి నాకు సగం ఇవ్వు..... నిన్న కూడా మొత్తం నువ్వే తాగేశావు.... ఈరోజు మాత్రం అలా జరగకూడదు..... “ అని వార్నింగ్ ఇస్తున్నట్టు అంటుంది

రామ్ కి అసలు చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు అన్నట్టు ఆ ట్రాన్స్పరెంట్ సారీలో అందంగా నడుము మడతలతో నోరూరిస్తూ ఉన్న నడుముని చూసి దానిని టచ్ చేయాలి అనిపిస్తూ ఉంటే టచ్ చేస్తే మళ్ళీ సీత వీరంగం చేస్తుందేమోనని భయపడుతూ కష్టంగా ఒక్కో గుక్క పాలు తాగుతూ ఉంటే “ ఏంటి బావ ఇంతసేపా పాలు తాగటం??? అయినా నిన్న ఒక గుటకలో తాగేసావుగా మొత్తం!!! మరి ఈరోజు ఏమైంది??? “ అని విసుగ్గా అడిగింది

“ ఏమీ లేదులే!!! “ అని విసుగ్గా చెప్పి “ ఎదురుగా అందాల విందు పెట్టుకొని టచ్ చేయడానికి లేకుండా పోయింది..... “ అని మనసులో గొనుక్కొని విసుగ్గా పావుగంట పాటు సగం క్లాస్ ఖాళీ చేసేసరికి సీత కొట్టేసేలా రామ్ వైపు చూస్తూ ఉంటుంది

రామ్ నవ్వుకుంటూ సీత చేతిలో పాల గ్లాస్ పెట్టి “ ఏంటే ఆ చూపు కొట్టేస్తావా ఏంటి నన్ను??? “ అని అడిగాడు

“ కొట్టటం కాదు పీక పిసికేస్తా ఎవరైనా ఇంత సేపు పాలు తాగుతారా??? ఎంతసేపు నిలబడాలి నేను కాళ్లు లాగేస్తుంటే!!!! “ అంటూ రామ్ పక్కనే కూర్చుని మిగిలిన పాల గ్లాస్ ఐదు సెకండ్లలో ఖాళీ చేసి మూతి తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న టీ టేబుల్ మీద గ్లాస్ పెట్టి బాసిమట్టం వేసుకొని నవ్వుతూ రామ్ వైపు చూడగానే రామ్ నొసలు ముడేస్తూ “ ఇదేంటి ఇలా కూర్చుంది??? “ అనుకుంటూ “ ఏంటే ఏమైనా మాట్లాడాలా??? “ అని అడిగాడు

సీతా హుషారుగా హహ అని తలూపగానే రామ్ నవ్వుతు లాప్టాప్ పక్కనపెట్టి సేమ్ సీత లాగే కూర్చొని చెప్పు అని చెంపలు కింద చేతులు పెట్టి సీత వైపే చూస్తాడు.....

అది మరీ అంటూ సీత చేతులు నిలుపుకుంటూ తలదించుకొని నసుగుతూ ఉంటే రామ్ సీత చేతులు తన చేతిలోకి తీసుకొని “ ఏం చెప్పాలనుకున్నావో నిరభ్యంతరంగా చెప్పు..... అయినా నీ బావ దగ్గర నీకు మొహమాటం ఏంటే??? “ అని నవ్వుతూ అడిగాడు

“ చెప్పాక నువ్వు కాదనకూడదు మరి!!!! “ అని ఓరగా కళ్ళు పైకెత్తి అడగగానే ఆ చూపుకి రామ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు “ ఏం చూపే బాబు నీది??? “ అనుకుంటూ “ ఏం కాదనను చెప్పు..... “ అనగానే “ బావ అది నేను జాబ్ చేయాలనుకుంటున్నాను..... “ అని కళ్ళు గట్టిగా మూసుకొని అంది

రామ్ సీత చేతులు తన పెదవుల దగ్గరికి తీసుకువచ్చి తన పెదవుల మీద ఆనించుకొని ముద్దు పెడుతూ “ చెయ్ ఇప్పుడు ఎవరు కాదన్నారు నిన్ను??? అయినా ఆడపిల్ల వంటగదికే పరిమితం అవ్వాలి అన్న మైండ్ సెట్ నాది కాదని నీకు తెలుసుగా???? మరి ఎందుకు ఇంత కంగారుగా భయంగా నన్ను అడగటం??? నీ స్వేచ్ఛ నీకుంది ఓకే!!! “ అని అన్నాడు

సీత హుషారుగా “ నిజంగానా బావ నిజంగానే అంటున్నావు కదా!!! ఇప్పుడు ఇలా అని రేపు అమ్మవాళ్ళు ఎందుకు నా చేత జాబ్ చేయిస్తున్నావు మాన్పించేయ్ అంటే వాళ్ళ మాట విని నన్ను మాన్పించేయవు కదా??? మరొకటి ఇంట్లో మనఃశ్శాంతి లేదని జాబ్ మేనేయమని అనవు కదా!!!! “ అని అడిగింది

రామ్ హహహ అని నవ్వుతూ “ నేనెందుకు అలా అంటానే??? జాబ్ కి వెళ్లేటప్పుడు ఇద్దరం వర్క్ షేర్ చేసుకుందాం లేదంటే ఉదయాన్నే నువ్వు లేచి మొత్తం పనిచేసి నాకు కూడా క్యారేజ్ కట్టిపెట్టు ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్దాం..... నిన్ను నీ ఆఫీస్ లో వదిలి నేను నా ఆఫీస్ కి వెళ్తాను..... అయినా ఆడపిల్ల స్వేచ్ఛ హరించే భర్తనా ఏంటి నేను??? నీ కళ్ళుకి నేను అలా కనిపిస్తున్నానా??? “ అని అడిగాడు

“ ఛ ఛ అదేం కాదు బావ కాకపోతే రేపు ఎప్పుడైనా నువ్వు ఫ్రస్టేషన్లో చిన్న మాట అన్న తట్టుకోలేను అందుకే అడిగాను...... “ అని అమాయకంగా అంది

“ సరేలే కానీ మరి జాబ్ కి అప్లై చేసావా అక్కడికి వెళ్లాక ఇంటర్వ్యూకి వెళ్తావా??? “ అని అడిగాడు

“ లేదు బావ మొన్న ఎగ్జామ్స్ అయిపోగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చింది..... కాకపోతే ఇంట్లో చెప్తే ఒప్పుకోరు అని ఇంతవరకు చెప్పలేదు..... ఇప్పుడు మనకు పెళ్లయింది కదా ఎలాగో మనం ఉండేది సిటీలోనే అందుకే నిన్ను అడుగుతున్నాను.... అమ్మ వాళ్ళ అందరిని ఒప్పించే బాధ్యత కూడా నీదే ఓకేనా??? “ అని అడిగింది

“ సరేలే కానీ ఎక్కడ జాబ్??? “ అని అడిగాడు

“ ఇప్పుడు కాదు హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను..... ఇప్పుడే ఎందుకు చెప్పు..... మొత్తానికి నువ్వు నేను జాబ్ చేయటానికి ఒప్పుకున్నావు..... రాహు “ అంటూ రామ్ ఒడిలోకి దూకి మరి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది

రామ్ సీత ముద్దుకి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి సీత నడుము చుట్టూ చేతిని బిగించి అలానే ఉండిపోయాడు.....

ఇంకా ఉంది......

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......