Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 10

ఓహో అంటూ “ బావ నేను కూడా ఇంకొక టు వీక్స్ లో జాబ్ లో జాయిన్ అవ్వాలి నాకు కావాల్సినవన్నీ నువ్వే కొనిస్తానన్నావు గుర్తుందా???? అలాగే అమ్మ వాళ్లతో కూడా చెప్తానన్నావు కానీ ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? “ అని గారం గా అడిగింది

“ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో హైదరాబాద్ రాగానే చెప్తాను అన్నావు మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు

@@@@@@@

“ హహహ బావ అది మాత్రం నీకు సర్ప్రైజ్ ఇప్పుడు మాత్రం చెప్పను ఇంతకి వర్క్ అయిపోయిందా??? “ అని కళ్ళు నలుపుకుంటూ అడుగుతుంటే ఇంకొక 10 మినిట్స్ అంటూ నిజంగానే టెన్ మినిట్స్ లో వర్క్ అయిపోగొట్టి లాప్టాప్ పక్కన పెట్టి పడుకోగానే “ ఇంతసేపు ఎందుకు పడుకోలేదే నువ్వు??? ఇంతసేపు నిద్రకి ఆగలేవు కదా!!!! “ అని అడిగాడు

“ ఏమో బావ నాకు నీ గుండెల మీద పడుకోవాలి అని ఉంది..... ఎందుకో డైలీ నీ మీదే పడుకున్నాను అనిపిస్తుంది కానీ లేచేసరికి నేను ఏ ప్లేస్ లో ఏదో పడుకున్నానో ఆ ప్లేస్ లోనే ఉంటున్నాను!!!! కానీ నాకు నీ ప్రెజెన్స్ అర్థమవుతుంది ఎందుకంటావు???? “ అని చూపుడువేలిని గడ్డం కింద పెట్టి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి అడిగింది

“ ఎందుకంటే నువ్వు నిజంగానే నన్ను కర్చుకుపోయి నిద్రపోతున్నావు కాబట్టి!!!! అయినా నీ గురించి నీకు తెలియదా???? సక్కగా పడుకోవటం నీకు వచ్చా ఏంటి??? “ అని తల మీద మొట్టి రా అంటూ సీత బాగా అలవాటైపోవడంతో తన గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటే సీత నవ్వుతూ “ మా మంచి బావ పెళ్లికి ముందులాగా అసలు లేవు...... పెళ్లయిపోయాక చాలా మారిపోయావు ఎప్పుడు ఇలానే ఉండు...... “ అని నవ్వుతూ చెప్పి నిద్రపోయింది

సీత నిద్ర పోయింది అనుకున్నాక రామ్ తన బుగ్గ మీద చేయి వేసి తదేకంగా సీత వైపు చూస్తూ “ నువ్వు అన్నట్టు నిజంగానే పెళ్లయ్యాక మారిపోయానే!!!! పెళ్లి కాకముందు వరకు నాలో నాకు క్లారిటీ ఉండేది కాదు పెళ్లవ్వగానే పూర్తి క్లారిటీ వచ్చేసింది..... “ అంటూ తనని ఇంకా కౌగిలిలో బిగించి సంతోషంగా నిద్రపోయాడు

@@@@@@@

తర్వాత రోజు పెద్దవాళ్లు రామ్ తో ఇంకా ఎన్ని రోజులు లీవ్స్ ఉన్నాయని అడగగా నాలుగు రోజులు ఉన్నాయని చెప్తే సరే అని ఆ నాలుగు రోజులు అక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యారు పెద్దవాళ్ళు...... ఆరోజు ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనటానికి బయటికి వెళ్లి అన్ని కొని హోమ్ డెలివరీ పెట్టి బయటే లంచ్ చేసి సరదాగా చార్మినార్ కి వెళ్లి అక్కడంతా తిప్పి చూపించి ఆడవాళ్ళకి నచ్చినవి కొనిపించి ఇంటికి తిరిగి వచ్చేసరికి నైట్ అయిపోయింది......

నైట్ ఆడవాళ్లు చపాతి పన్నీర్ కర్రీ వండితే అందరూ తినేసి ఆ రోజుకి మళ్ళీ హ్యాపీగా నిద్రపోయి తర్వాత రోజు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ గార్డెన్స్ లుంబిని పార్క్ తిరిగి ఈసారి నైట్ కూడా బయటే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చి నిద్రపోయారు.....

అలా మూడు రోజులు పెద్ద వాళ్లని తిప్పి నాలుగో రోజున తర్వాత రోజు నుంచి రామ్ బిజీగా ఉంటాడని సీత తనకి కావాల్సిన షాపింగ్ చేసుకొని వస్తామని చెప్పి రామ్ ని తీసుకొని షాపింగ్ మాల్ కి వెళ్ళింది......

సీత రామ్ ని ఆఫీస్ కి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని అడిగి రామ్ నీ ఇష్టం అని చెప్పగానే సీత జీన్స్ టీషర్ట్స్ జర్కిన్స్ అలాగే అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సెస్ పటియాల టైప్ పార్టీవేర్ డ్రెస్సెస్ పార్టీవేర్ సారీస్ నార్మల్ సారీస్ చాలా రకాలు తీసుకొని దాదాపు 30 వేల బిల్ చేసింది......

అదంతా చూసి రామ్ కళ్ళు తేలేసి “ ఏంటే ఈ కొనటం??? “ అని అడిగితే సీత ముద్దుగా మొహం పెట్టి “ మరి కొత్త ఆఫీస్ కి వెళ్లేటప్పుడు గ్రాండ్ గా ఉండాలి కదా బావ!!!! అందుకే ఇవన్నీ అయినా నేనేమంత ఎక్కువగా కొనుక్కోలేదు జస్ట్ 30,000 అంతే...... ఆ అమౌంట్ నీకు ఎంత చెప్పు నీ వన్ మంత్ శాలరిలోనుంచి అలా తీసి ఇలా పడేసెయ్...... అలాగే నీకు కూడా షాపింగ్ చేద్దాం పద..... “ అంటూ ముందుకు నడుస్తూ ఉంటే

రామ్ సీత చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి “ అమ్మ సీతమ్మ నేను తెచ్చింది 35 వేలమ్మ.... కార్డ్స్ కూడా తీసుకురాలేదు నువ్వు తక్కువ షాపింగ్ చేస్తావు అనుకొని ఇంతే తీసుకువచ్చాను..... అందులో 30000 నువ్వే తీసుకుంటే 5000 కి నాకు ఒక్క డ్రెస్ కూడా రాదు...... అయినా నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు నువ్వు రా..... “ అని సీత చేతిని పట్టుకుని బలవంతంగా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి తీసుకువెళ్లి బిల్లింగ్ వేయిస్తూ ఉంటే సీత చుట్టూ ఉన్న సారీస్ ని చూస్తూ ఉంటుంది.....

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక అమ్మాయి దూసుకుంటూ వచ్చి అభి అంటూ గట్టిగా హత్తుకొని “ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అభి???? కనీసం చెప్పను కూడా చెప్పలేదు!!! ఆఫీస్ లో అడిగితే సిక్ లీవ్ పెట్టి వెళ్ళిపోయావు అన్నారు...... “ అని తన పాటికి తను మాట్లాడుతూ ఉంటే రామ్ ని ఆ అమ్మాయి హత్తుకోవటం చూసిన సీత కళ్ళు కోపం బాధతో ఎర్రగా మారిపోయి చూస్తూ ఉంటే రామ్ సీతని గమనించి ఏడవటానికి సిద్ధంగా ఉందని అర్థమై ఆ అమ్మాయిని బలవంతంగా దూరం జరిపి “ పర్సనల్ పని మీద వచ్చాను నీతు(ఈ క్యారెక్టర్ ని కొంచెం గుర్తుంచుకోండి) తర్వాత మాట్లాడతాను..... “ అని చెప్పి బిల్లింగ్ అయిపోగానే కవర్స్ అన్ని తీసుకొని సీత చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్లిపోయాడు

నీతు వెళ్తున్న రామ్ వైపే అయోమయంగా చూస్తూ తను పట్టుకున్న సీత చేతి వైపు చూసి “ ఈ అమ్మాయి ఎవరు??? కొత్త క్యారెక్టరా ఏంటి???? అయినా ఇంత హడావిడిగా మాట్లాడుతున్నాడు ఏంటి???? ఎప్పుడు వచ్చాడు హైదరాబాద్ కి వచ్చినట్టు అభి!!! కనీసం మాటవరసకైనా ఎవరికీ చెప్పలేదు??? “ అని అనుకుంటూ ఆలోచిస్తూనే తన షాపింగ్ చేసుకుంటుంది

(రామ్ ఆఫీస్ లో తన పెళ్లి అని ఎవరికి చెప్పలేదు..... అలాగే ఆఫీస్ లో అందరూ రామ్ ని అభి అనే పిలుస్తారు తన ఫ్యామిలీ మాత్రమే రామ్ అని పిలుస్తారు..... యాక్చువల్ గా సడన్గా తన గ్రాండ్ పేరెంట్స్ పెళ్లి అని చెప్పి పిలిచేసరికి షాక్ లో జస్ట్ సిక్ లీవ్ అప్లై చేసి ఊరికి వెళ్ళిపోయాడు రామ్......)

కార్ స్టార్ట్ చేశాక సీత రామ్ పక్కన కూర్చున్నాక “ ఎవరు ఆ అమ్మాయి??? బావని అంత క్లోజ్ గా హగ్ చేసుకుంది ఏంటి??? బావ ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్సా??? అంతకంటే ఎక్కువ??? బలవంతంగా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడా??? తనకి నేనంటే ఇష్టం లేదా?? “ అనుకోగానే సీత కళ్ళల్లో నుంచి కన్నీరు టప టప రాలిపోయాయి అవి రామ్ కి కనిపించనివ్వకుండా విండో లోనుంచి బయటికి చూస్తూ తుడుచుకుంది

రామ్ మాత్రం సీత ఎక్కడ తనని అపార్థం చేసుకుంటుందో అనుకుంటూ టెన్షన్ గా కొంచెం దూరం వెళ్లిన సీత కనీసం తనువైపు చూడకపోయేసరికి తన చేయి పట్టుకొని సీత అని పిలవగానే సీత బలవంతంగా పెదవుల మీద నవ్వు తెచ్చుకొని ఆ బావ అని అంది.....

ఇటు చూడు అని సీత మొహాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకొని ఒక చేతితో కార్ ని హ్యాండిల్ చేస్తూ పరీక్షగా సీత మొహం చూసేసరికి తన కళ్ళు ఎర్రగా మారిపోయి చెంపల మీద కన్నీటి చారికలు కనిపించడంతో కార్ పక్కకి ఆపేసి “ ఏంటే ఇది??? అసలు ఎందుకు ఏడుస్తున్నావు??? “ అనగానే సీత మళ్ళీ కన్నీళ్లు రాల్చేస్తూ “ ఎవరు బావ ఆ అమ్మాయి???

నువ్వు ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారా??? అందుకేనా నువ్వు కనిపించగానే అంత ఎక్సైటింగ్గా వచ్చి హగ్ చేసుకుంది??? నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావా??? నేనంటే నీకు ఇష్టం లేదా??? “ అని తను ఊహించుకున్న వన్నీ ఒక్కసారిగా అడిగేసి

“ ఎందుకు బావ ఇంత పని చేశావు అమ్మ వాళ్ళతో ఆ అమ్మాయి గురించి చెప్పుంటే పెళ్లి ఆపేసేవాళ్ళు కదా!!! అనవసరంగా నువ్వు ఇప్పుడు బాధపడే అవసరం వచ్చేది కాదు కదా!!!! “ అని బాధగా అంది

సీత ఇమేజినేషన్స్ కి రామ్ కళ్ళు తేలేసి తన నెత్తి మీద మొట్టి “ ఏయ్ మెంటల్ ఏం వాగుతున్నావో నీకైనా తెలుస్తుందా??? నేను ప్రేమించడమేంటే??? అయినా నేను ప్రేమిస్తే అమ్మ అత్త వాళ్లకి చెప్పే ధైర్యం నాకుంది..... నేను ఎవరిని ప్రేమించలేదు తను నా కాలేజ్ ఫ్రెండ్ ఇప్పుడు నేను వర్క్ చేసే ఆఫీస్ లో కొలీగ్ అంతే.....

ఆఫీస్ లో మన పెళ్లి అని చెప్పి రాలేదు సడన్గా తాతయ్య వాళ్ళు పెళ్లి అని చెప్పేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సిక్ లీవ్ పెట్టి వచ్చేసాను ఎవరికీ చెప్పకుండా..... అందుకే తను అలా బిహేవ్ చేసింది..... అయినా ఎందుకే నన్నేమీ ఆడకుండా నీలో నువ్వే ఇలాంటివి ఊహించుకున్నావు???

నేను ఎవరిని ప్రేమించలేదు ఓకే బలవంతంగా నీకు తాళి కట్టలేదు ఓకే...... ఇంకొకసారి ఏడ్చావంటే కొట్టేస్తాను చెప్తున్న..... “ అని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టాడు

సీత కళ్ళల్లో మెరుపుతో “ అంటే నువ్వు ఎవరిని ప్రేమించలేదా బావ??? నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదా??? ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా??? చెప్పు చెప్పు..... “ అని అడిగింది

సీత ఎక్సైట్మెంట్ చూసి రామ్ నవ్వుతూ “ హా నేను ఎవరిని ప్రేమించలేదు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు ఓకేనా..... ఇంకొకసారి ఇలా చిన్నచిన్న వాటికి ఏడవకు ఏదైనా సరే డైరెక్ట్ గా నన్ను అడుగు...... నన్ను అడిగే అధికారం హక్కు నీకు మాత్రమే ఉన్నాయి సరేనా..... “ అని సీత నుదిటికి తన నుదుటిని ఆన్చి అన్నాడు

“ హా ఓకే బావ ఒక్క క్షణం గుండె ఆగిపోయింది నువ్వు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నవేమో నేనంటే నీకు ఇష్టం లేదేమో అని చాలా భయపడ్డాను..... “ అని భయంగా ఉంది

“ ఇంకెప్పుడు అలా అనుకోకు..... “ అని టాపిక్ డైవర్ట్ చేయడానికి “ సరే కానీ ఇంటికి వెళ్ళాక ఇన్ని రకాల డ్రెస్సెస్ తీసుకున్నావు అదికూడా జీన్స్ టీషర్ట్స్ తీసుకున్నావని అత్తకి తెలిస్తే నిన్ను చీపిరి తీసుకొని ఉరికించి కొడుతుందేమో!!!! ఒక్కసారి ఇమేజింగ్ చేసుకో...... “ అని నవ్వుతూ అన్నాడు

సీత నిజంగానే ఇమేజింగ్ చేసుకుంటే సుధ గారు చీపిరి పట్టుకొని సీతని ఇల్లంత పరిగెత్తించి కొడుతున్నట్టు ఊహల్లో కనిపించి ఒక్కసారిగా బెదిరిపోయి తు తు అని భుజం తట్టుకొని “ బావ నువ్వే నన్ను కాపాడాలి అమ్మ నుంచి..... అమ్మకి నువ్వే సర్ది చెప్పు పైగా అందరికీ నా జాబ్ గురించి ఇంతవరకు చెప్పలేదు...... జాబ్ గురించి చెప్పాక ఈ డ్రెస్ గురించి చెప్పు లేకపోతే అసలు ఇవి ఇంట్లోకి కూడా తీసుకురాకు..... ఇలా కార్ లోనే ఉంచు అమ్మ వాళ్ళు వెళ్లిపోయాక తెచ్చుకుందాం..... “ అని ఏడుపు మొహం పెట్టి అంది

రామ్ హాహహా అని గట్టిగా నవ్వుతూ “ అత్తంటే ఎంత భయమే!!!! ఆ మాత్రం భయం నా గురించి కూడా పెట్టుకో ఎందుకంటే నిన్ను ఇరికించటంలో నేను ఫస్ట్ ఉంటాను కదా!!!! “ అని శాడిస్ట్రిక్ స్మైల్ ఇచ్చి “ పదా ఇంటికి వెళ్ళాక నీకు దేత్తడి పోచమ్మ గుడి అంటే ఏంటో చూపిస్తాను...... “ అని చెప్పి కాల్ స్టార్ట్ చేస్తే

సీత సేమ్ ఏడుపు మొహంతో “ బావ నువ్వు మారిపోయావు అనుకున్నాను కొంచెం కూడా మారలేదు...... నన్ను ఏడిపించే విషయంలో పీహెచ్డీ చేసి ఛాన్స్ దొరికితే చాలు ఏడిపిస్తున్నావు...... నేను అత్తతో చెప్తాను నీ మీద నువ్వు ఇలా షాపింగ్ మాల్ లో ఒక అమ్మాయిని హాగ్ చేసుకున్నావని అది కూడా నా ముందు చేసుకున్నావని చెప్తాను...... “ అని అంది

ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......