బావ మరదలి మధ్య చిలిపి తగాదాలతో సాగే సంసార సమాహారమే ఈ నా కథ.....
అభిరామ్ ❤️ సీతామహాలక్ష్మి
@@@@@@@
అనగనగనగా అది ఒక పల్లెటూరు పేరు వీరభద్రపురం..... ఉదయాన్నే ఆ ఊరిలో ఊరి పెద్ద ఇంటి ముందు పెద్ద పండిరి ఊరంతా వినిపించేలా మైకులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు వారి మనవడు మనవరాలికి....
కుటుంబం మొత్తం పెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒప్పుకోవటంతో మనసంతా ఉప్పొంగిపోతున్నంత సంతోషంతో పెళ్లి పనులలో యాక్టివ్గా పాలుపంచుకుంటూ ఉంటే ఊరందరూ ఊరు పెద్ద ఇంట్లో పెళ్లి అని వాళ్లకు తోచిన సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు.....
పెళ్లికూతురు గదిలో పెళ్లికూతురు తెల్లని తెలుపు , కలువ లాంటి కళ్ళు , తీరైన ముక్కు , దొండ పండు లాంటి పెదవులు , అందంగా నవ్వితే బుగ్గన పడే చోట్ట , గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ తన అందానికి మొత్తం దిష్టి తగలకుండా ఉన్నట్టు ఉంటే , శఖం లాంటి మెడ , బంగారం ఎరుపు వర్ణం కలిగిన జరీ పట్టుచీరని కట్టుకొని అందమైన మామిడి పిందెల నగలు పెట్టుకొని కళ్యాణ తిలకం అద్దుకొని నుదిటిన భాసికం బుగ్గన చుక్క కళ్ళల్లో సంతోషంతో బాపు బొమ్మ పెళ్లి కూతురు అయిందా అన్నట్టు ఉంటే పెళ్లి వల్ల కళ్ళల్లో వచ్చిన మెరుపులు మొత్తం కలిపి పెళ్లి కళ ఉట్టిపడుతుందా అన్నట్టు కనిపిస్తూ ఉంటే పెళ్లికూతురు ఆ ఊరిలో నాకే తను చదువుకున్నంత వరకు ఉన్న ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ సిగ్గుపడుతూ అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తూ ఉంది.....
పెళ్ళికొడుకు గదిలో పెళ్లి కొడుకు పట్టు పంచె పట్టు చొక్కా వేసుకొని పై పంచ వేసుకొని భాసికం కట్టి బుగ్గన చుక్కతో సిల్కీ హెయిర్ , ఫెయిర్ స్కిన్ టోన్ , సిక్స్ ఫీట్ హైట్ ఉండి , చురుకత్తు లాంటి కళ్ళు , ఆ కళ్ళల్లోకి చూస్తే ఎవరైనా ఇట్టే పడిపోతారు అన్నట్టు ఆ కళ్ళు ఒక రకమైన మ్యాజిక్ చేస్తూ ఉంటే , నో స్మోకింగ్ వలన వచ్చిన పింకీష్ లిప్స్ , నవ్వితే బుగ్గన పడే చోట్టలో చూడగానే ఆకట్టుకునే కళయిన మొహం అటు సన్నగా కాకుండా ఇటు లావుగా కాకుండా మంచి ఫిజిక్ తో చూడగానే అమ్మాయిలు కలల రాకుమారుడిలా(మన మహేష్ బాబు అనుకోండి కాకపోతే మహేష్ బాబు కంటే టూ ఇంచెస్ హైట్ తక్కువ) ఉన్న పెళ్ళికొడుకు సేమ్ పెళ్లికూతురి లాగే తన చదువుకున్నప్పటి తన ఫ్రెండ్స్ తో హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాడు......
ఇంతలో పెళ్లి కొడుకుని పిలవండి అని పంతులుగారు మైక్ లో అందరికీ వినిపించేలా చెప్పగానే పెళ్ళికొడుకు తాతయ్య సూర్యనారాయణ గారు ఆయనతో పాటు ఆయన కొడుకు అల్లుడు వీరేంద్ర సురేంద్ర గారు లోపలికి వచ్చి పరాచకాలు ఆడుతున్న పెళ్ళికొడుకు వైపు చూసి సంతోషంగా “ రారా అల్లుడు నిన్ను పిలుస్తున్నారు..... “ అని సురేంద్ర గారు అంటే
మిగిలిన ఇద్దరు నవ్వుతూ పెళ్లి కొడుకుని తీసుకువెళ్లి మండపం మీద ఉన్న పెళ్లి పీటల మీద కూర్చోబెడితే పంతులుగారు పెళ్లి కొడుకుతో విగ్నేశ్వర పూజ చేయిస్తారు...... విగ్నేశ్వర పూజా అయిపోయాక పెళ్లికూతుర్ని తీసుకురమ్మని చెప్పగానే పెళ్లికూతురు నానమ్మ మహాలక్ష్మి గారు తల్లి అత్తయ్య సుధ రాధ గారు ముగ్గురు వెళ్లి సేమ్ పెళ్ళికొడుకు లాగే పరాచకాలు అడుగుతూ పొట్ట పగిలేలా నవ్వుతున్న పెళ్లికూతురుని చూసి చిరుకోపంగా “ పెళ్లి జరుగుతున్న సిగ్గే లేదు నీ మొహం లో..... “ అని తల్లి సుధ అంటే
“ నా కోడలు చాలా అందంగా ఉంది “ అని రాధ అంటే ఎక్కడ పొంతనలేని కూతురు కోడల్ని చూసి తల కొట్టుకొని “ రావే పంతులుగారు పిలుస్తున్నారు..... “ అని చెప్పి మహాలక్ష్మి గారి పెళ్లికూతుర్ని తీసుకువెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లికూతురు చేత గౌరీ పూజ చేయించారు
పెళ్లి జరుగుతుందన్న సంతోషం ఆ ఊరి జనాలలో ప్రతి ఒక్కరిలోనూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కుటుంబాలనో తాతయ్య నానమ్మలోనూ ఆఖరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురులలో వెలకట్టలేని సంతోషం కనిపిస్తూ ఉంటే ఇది కదా పెళ్లి అన్నట్టు ఏర్పాట్లు కూడా ఉన్నాయి......
అలా గౌరీ పూజ అయిపోయాక ఇద్దరి మధ్య అడ్డుతెర కట్టి ముందుగా కన్యాదానం చేయించి జీలకర్ర బెల్లం పెట్టించాక బట్టలు మార్చుకొని రమ్మని ఇద్దరు మార్చుకుని వచ్చాక పక్క పక్కన కూర్చోబెట్టి మాంగల్య ధారనకి సంబంధించిన మంత్రాలు చదువుతూ ముహూర్త సమయాన అందరికీ తాళిని చూపించి తాళికట్టు బాబు అంటూ పెళ్లి కొడుకు చేతిలో పెడితే పెళ్లి కొడుకు నవ్వుతూ పైకి లేచి పెళ్లికూతురు మెడలో తాళి కట్టి మెడ మీద ఎర్రగా కందేల గట్టిగా గిచ్చితే పెళ్లికూతురు సిగ్గుపడుతూ తలదించి పెళ్ళికొడుకు కాళ్లు ఎర్రగా కందిపోయేలా గిచ్చి నవ్వుకుంది......
వాళ్ళిద్దరి సరసాలు చూసినా పెళ్లికూతురు పెళ్లికొడుకు ఫ్రెండ్స్ ఓ అని అరుస్తూ వాళ్ళు చేయాల్సిన అల్లరి చేస్తూ ఫోటోలు తీస్తూ తెగ హడావిడి చేస్తూ ఉన్నారు......
మాంగల్య ధారణ అయిపోయాక తలంబ్రాలు కొంగుముడి అరుంధతి నక్షత్రం ఉంగరాలు తీయడం ఒకదాని వెనుక ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురి మొహాలలో కనిపిస్తున్న సంతోషాన్ని అందరూ తిలకించి ఆ సీతారాముల పెళ్లే జరుగుతుందా అన్నంత ఆనందంగా చూస్తూ ఉన్నారు.....
పెళ్లి అయిపోతుంది అనగా మధ్యాహ్నం భోజనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యి అందరూ భోజనాలకు వెళ్తే ఇది లేదు అది లేదు అని చెప్పకుండా తెలుగు వంటకాలు అన్ని వండించి మరో అయిదు తరాలు గుర్తుంచుకునేలా చేస్తారు సూర్యనారాయణ గారు భోజనాల ఏర్పాట్లు......
పెళ్లి ముగిసి ఫోటో సెషన్ మరో రెండు గంటలు సాగాక మంచి గడియలు అయిపోతున్నాయని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత గృహప్రవేశం చేయించడానికి తీసుకువెళ్తే ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలని పెళ్ళికొడుకు కి చెల్లెలు వరస అయ్యే వాళ్ళు ఆటపట్టించగానే పెళ్లికూతురు సిగ్గుపడుతూ తలదించుకుంటే పెళ్ళికొడుకు నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తాడు.....
“ సిగ్గు పడటం కాదు మాకు కావాల్సింది మీ పేర్లు చెప్పండి అని ముందు నువ్వు చెప్పు అన్నయ్య..... “ అంటూ పెళ్లి కొడుకుకి చెల్లి వరసయ్యే అమ్మాయి అడిగితే “ నేను అభిరామ్ నా భార్య సీతా మహాలక్ష్మి తో కలిసి వచ్చాను లోపలికి రానివ్వండి..... “ అని అన్నాడు.....
ఆ మాటకి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఓ అని అరుస్తూ “ మావాడు చెప్పాడు ఇప్పుడు మీ అమ్మాయిని చెప్పమనండి...... “ అని ఆట పట్టిస్తూ ఉంటే పెళ్లికూతురు ఫ్రెండ్స్ “ చెప్పవే వాళ్లే అంత ధైర్యంగా చెప్పినప్పుడు మనమెందుకు చెప్పకూడదు??? చెప్పు..... “ అని ప్రోత్సహిస్తే పెళ్లికూతురు తల దించుకునే “ నేను సీతా మహాలక్ష్మి నా భర్త అయిన అభిరామ్ తో కలిసి వచ్చాను లోపలికి రానివ్వండి..... “ అనగానే
ఇంకొకసారి అందరూ ఓ అని అరిచి దిష్టి తీయించి కానుకలు ఇప్పించి కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక ఇంట్లో దీపం వెలిగించి కొంగుముడి విప్పదీసి రెస్ట్ తీసుకోమని ముందుగానే వాళ్లకి ఉన్న ఎవరి రూమ్స్కి వాళ్ళని పంపించి హడావిడి అంతా చూసుకుంటూ ఉంటారు పెద్దవాళ్లు...... పెళ్ళికొడుకు రూమ్లో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఉంటే పెళ్లి కూతురు రూములో పెళ్లికూతురు ఫ్రెండ్స్ అండి ఇద్దరిని ఆట పట్టిస్తూ ఉన్నారు.....
అలా పెళ్ళి హడావిడి ముగిసి నైట్ కి అందరూ భోజనాలు చేసి ప్రశాంతంగా నిద్రపోయి తర్వాత రోజు అభిరామ్ సీతామహాలక్ష్మితో ఊరందరి మధ్య సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి కలకాలం నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని అందరి చేత దీవెనలు అందేలా చేస్తారు పెద్దవాళ్ళు అందరూ......
సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యాక ఫ్రెండ్స్ అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతే కొంతమంది చుట్టాలు మాత్రమే మిగిలి పెళ్లి కొడుకు ఫ్యామిలీ పెళ్లికూతురు ఫ్యామిలీ సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటే ఆ రోజు నైట్ కి కార్యం ఉందంటూ నైట్ అందరిని త్వరగా తినమని హడావిడి చేసి అందరూ తిన్నాక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయ్యాక
హాల్లో ఉన్న దివానా కాట్ మీద ఎదురెదురుగా కూర్చోబెట్టి బంతిపూల ఆట చిలకలు తినిపించడం అంటూ చిన్నచిన్న ఆటలు ఆడించి పెళ్లికూతురు సిగ్గుతో ముడుచుకుపోయేలా చేసి పెళ్ళికొడుకుని అందంగా అలంకరించిన రూమ్ కి పంపించి పెళ్లికూతురు చేతిలో పాల గ్లాస్ పెట్టి పాల గ్లాస్ తో రూమ్ లోకి వెళ్లిన నువ్వు పాలిచ్చే తల్లిగా బయటికి రావాలి అని దీవించి పెళ్లికూతుర్ని అందరి చమత్కారాల మధ్య శోభనపు గదిలోకి నెట్టేసి బయట నుంచి గడియ వేసి వెళ్ళారు......
ఇక్కడి నుంచి మొదలైంది అసలైన కథ.....
అప్పటివరకు సిగ్గుపడుతున్న పెళ్లికూతురు సిగ్గు లేకుండా తలపైకి ఎత్తి విసురుగా నడుచుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్లి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి “ లేరా నేను నిద్రపోవాలి..... “ అని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఆపిల్ తింటూ కూర్చొని ఉన్న అభిరామ్ తో కోపంగా అంది
అభిరామ్ కళ్ళు ఎగరేస్తూ “ మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వటం తెలీదా??? ఇప్పుడు నేను నీ బావని కాదు మూడు ముళ్ళు వేసి నీలాంటి చుంచు మొహాన్ని పెళ్లి చేసుకున్న హ్యాండ్సమ్ భర్తని...... నీ మీద సర్వాధికారాలు పొందిన మొగుడిని..... “ అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ కళ్ళు ఎగరేశాడు అభిరామ్
“ తాళి కట్టినంత మాత్రాన నామీద అధికారాలేమీ నీకు వచ్చేయవు గుర్తుంచుకో..... “ అని విసురుగా చెప్పి పెళ్లి కొడుకు చేయి పట్టుకుని కిందకి విసిరేసి పెళ్లి కొడుకు కూర్చున్న ప్లేస్ లో కూర్చుంది సీత
అసలే అభిరామ్ అంత సాలిడ్ కాకపోయే సీత లాగగానే కింద పడిపోయి “ ఒసేయ్ నిన్ను!!! “ అంటూ విసురుగా పైకి లేచి సీత జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటే “ ఒరేయ్ నిన్ను “ అంటూ సీత కూడా తగ్గకుండా రామ్ జుట్టు పట్టుకుని పీకేస్తూ “ వదలను రా నిన్ను నా జుట్టే పట్టుకుంటావా??? ఎంత ధైర్యం నీకు??? “ అని అరుస్తూ ఉంటే
“ మొగుడని కూడా చూడకుండా నా జుట్టే పట్టుకొని లాగుతున్నావా??? నీకెంత ధైర్యమే..... “ అంటూ ఇద్దరూ పిల్లి ఎలుకల్లా కొట్టుకుంటూ బెడ్ మొత్తం చిందరవందరు చేసి చివరికి జుట్టులు వదిలి అక్కడ పెట్టిన ఫ్రూట్స్ స్వీట్స్ తో క్యాచింగ్ ఆట ఆడుతూ ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటూ “ వదలను రా నిన్ను ఈరోజు చంపి పూడుస్తా..... “ అని సీత అరుస్తుంటే “ రావే రా నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఉంటామని!!! “ రామ్ అరుస్తూ ఉన్నాడు.....
ఆ అరుపులు బయట వరకు వినిపిస్తూ ఉంటే పెద్ద వాళ్ళందరికి అవి మరోలా అర్థమయ్యి “ ఓరి దేవుడో వీళ్ళకి చాలా స్పీడ్ ఎక్కువైంది..... రూమ్ లోకి వెళ్ళగానే ఇన్ని అరుపులు వినిపిస్తున్నాయి..... “ అని ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు
ఇంకా ఉంది.....
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......