Read truth - 31 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 31

గంగ తనకు నిజంగానే చెల్లి అని గుర్తువచ్చి విజయ్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి .

ఇప్పుడు ఇది నా ఫ్యామిలీ వాళ్ల జోలికి వచ్చిన వాళ్ళని అస్సలు వదలి పెట్టను, అనుకుంటూ తన పిడికిలి గట్టిగా బిగించాడు. నేను ఇక్కడకి వచ్చి చాలాసేపయింది అందరూ నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుని అక్కడి నుండి సాగర్ వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు.

గంగ, విజ్జి లకు ఫొటోస్ తీస్తున్న సాగర్ విజయ్ ని చూసి ఇంతసేపు ఏం చేస్తున్నావురా , వీళ్లిద్దరూ ఫొటోస్ , వీడియోస్ ఏంటూ నా బుర్ర తినేస్తున్నారు అనగానే గంగా , విజ్జి కోపంగా సాగర్ వైపు చూసారు , అబ్బే సరదాగ అన్నాను అంతే అనేశాడు నవ్వుతూ సాగర్.

ఇంతకీ ఇంతసేపు ఎవరితో కాల్ మాట్లాడవు అన్నాడు అన్నాడు సాగర్ విజయ్ ని చూస్తూ , విజ్జి గంగా కూడా తన వైపే క్యూరియస్ చూడడం చూసి , చెబుతాను ముందు నన్ను జూ లో యానిమల్ లాగా చూడడం ఆపండి అని విజయ్ అనగానే , సరే అలా కూర్చొని మాట్లాడుకుందాం పదండి అంటూ చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు సాగర్ , మిగిలిన వాళ్ళు కూడా తన వెనుకే వెళ్లి కూర్చున్నారు.

విజయ్ : సాగర్ నీకు తెలుసు కదా మా మామయ్య హైదరాబాద్ లో డీసీపీ గా చేస్తున్నారని ఆయనకే కాల్ చేశాను.

గంగ బాబాయ్ గురించి ఏమయినా తెలిసిందా అని సాగర్ అనగానే , ఆయన అసలు ప్రాణాలతో లేరురా అని తడబడుతూ , తన దుఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు విజయ్ .

విజయ్ మాటలకు సాగర్ , విజ్జి తెల్లబోయి చూస్తుంటే గంగకు మాత్రం ఏడుపు వచ్చేసింది , అయ్యో బాబాయ్ చనిపోయారని నాన్న కి తెలిస్తే ఎంత బాధపడతారు ఈ విషయం ఆయనకు ఎలా చెప్పాలి అంటూ విజయ్ వైపు చూసింది , విజయ్ కళ్ళల్లో కూడా నీళ్ళు వుండటం గమనించి విజయ్ అన్నయ్యా మాతో ఇంకా ఏదైనా చెప్పాలా అంది అనుమానంగా కళ్ళలోకి చూస్తూ ,సాగర్ విజ్జి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక గంగ , విజయ్ ల వైపు మార్చి మార్చి చూస్తున్నారు .

విజయ్ తన మామయ్య చెప్పిన విషయాలన్నీ ముగ్గురికీ చెప్పేశాడు . సాగర్ , విజ్జీ ఆశ్చర్యపోతూ నోరు వెళ్ళ బెట్టేసారు , గంగ మాత్రం అన్నయ్యా అంటూ విజయ్ ని పట్టుకుని ఆనందంతో ఏడ్చేసింది.

గంగ : అన్నయ్యా నువ్వే తన తమ్ముడి కొడుకువని తెలిస్తే నాన్న గారు చాలా సంతోషిస్తారు.

విజయ్ : లేదు గంగ అప్పుడే కాదు ముందు బాబు ని చంపడానికి ఇంతలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎవరికి వుందో తెలుసుకోవాలి తర్వాత ఈ విషయం చెప్పొచ్చు

సాగర్ : ఇప్పుడెలారా మనకున్న అన్ని దారులూ మూసుకు పోయాయి ఒక్క క్లూ కూడా మిగల్లేదు కదా ఈ విషయం ఎలా తేలేది నాకేం అర్థం కావడం లేదు .

అందుకు ఆ శరభయ్య ఇంటిని మరోసారి search చేయాలి అన్నాడు సాగర్ గంభీరంగా.

ఈలోగా అక్కడికి వచ్చిన భద్రం గంగమ్మ బండి సిద్దం చేశాను వెళదామా అన్నాడు.

అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వెళదాం అన్నట్టు సైగ చేసుకుని బయలు దేరారు.

తరువాతి రోజు నలుగురూ రాయవరం బయలుదేరారు. గంగా, విజ్జి , సాగర్ కబుర్లలో వుంటే విజయ్ మాత్రం case గురించే ఆలోచిస్తూ వున్నాడు.

సాగర్ విజయ్ ని కదిపి ఏంట్రా మళ్లీ అదే విషయం ఆలోచిస్తున్నావా ,కాసేపు నీ బ్రెయిన్ కి రెస్ట్ ఇచ్చి ఈ ఒక్క రోజయిన ప్రశాంతం గా వుండి రేపట్నుంచి ఫ్రెష్ మైండ్ తో మళ్లీ నీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి నేను కూడా 2 డేస్ లో Hyderabad వెళ్ళాలి ఆఫీస్ లో మీటింగ్ వుంది అన్నాడు.

విజయ్ : 2days. లో వెళ్లాలా నాకు చెప్పనే లేదు.

మాక్కూడా చెప్పలేదు అన్నారు గంగా, విజ్జీ ఒకేసారి .

సాగర్ : నాకు నైట్ మెయిల్ వచ్చింది , అందరూ అప్పటికే పడుకున్నారు , morning ఏమో రెడీ అవడం సరిపోయింది అందుకే ఇప్పుడు చెబుతున్నా.

విజయ్ : మళ్లీ వూరికి ఎప్పుడు వస్తావు.

సాగర్: వీళ్ల ఎగ్జాంస్ అవగానే వస్తాను పార్టీ చేసుకుందాం.

విజయ్ : ఒకే రా.

కబుర్లు చెప్పుకుంటూ రాత్రి వేళకి వూరికి చేరుకున్నారు.

గంగ వాళ్ల నాన్న అందరినీ భోజనం చేసి వెళ్ళమనడం తో కాదనలేక అంతా అక్కడే భోజనం చేశారు.

సాగర్, విజ్జి , విజయ్ ఇంటికి బయలు దేరారు .

గంగ వాళ్ల నాన్న వాళ్ల వెనుకే వెళ్లి విజయ్ ని పిలిచి నా తమ్ముడి గురించి ఏమయినా తెలిసిందా అని అడిగాడు ఆత్రంగా , ఆయన కళ్ళలో తన తమ్ముడి మీద ప్రేమ చూసి నాన్న లేరని మీకు ఎలా చెప్పాలి అని మనసులో భాధ పడ్డాడు విజయ్ .

తన బాధని పైకి తెలీనీకుండా ఆ పని మీదే వున్నాను సర్ త్వరలోనే మీకు ఆ వివరాలు చెప్తాను అన్నాడు విజయ్.