Featured Books
  • మనసిచ్చి చూడు - 10

                   మనసిచ్చి చూడు - 10రెస్టారెంట్లోకి అడుగు పెట్ట...

  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 04











“ సరే ఆ దేవుని ప్రార్థిస్తూ వచ్చి నీ చివరి మిషన్ ఏంటో ఆ ప్రభువునే అడుగు ” అంటూ ఆ పోప్ చెప్పగానే ,గది తలుపు తీసుకొని ఏసుప్రభు ముందు కూర్చున్నాడు.


పోప్ ఏదో మంత్రిస్తూ ఉండగా ఏసుప్రభు తల నుంచి ఒక పేపర్ ఎగురుకుంటూ పోప్ చేతికి అందింది. కాగితం పూర్తిగా బంగారు రంగులో మెరిసిపోతుంది .దానిపై రచించబడిన నల్లని అక్షరాలు ఏదో సంస్కృత భాషకు చెందిన దానిలాగా అనిపించాయి.


దాన్ని చూసిన పోప్ ఆశ్చర్యంగా ,“ మీ మిషన్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అంటా! అప్పటిదాకా నువ్వు ఓపికగా ఉండాలి ” అంటూ చెప్పాడు .


సరే ! కోన్ని రోజులైతే నేను విశ్రాంతి తీసుకుంటాను . నా ఖర్చులకి కొంచెం డబ్బులు అరేంజ్ చేయగలరా ? అంటూ చాలా జాలిగా చూశాడు .

“ సరే ఈ మానవ ప్రపంచంలో బతకడం ఎలా ఉంది నీకు. ”

నాకైతే అలవాటైపోయింది .ఎప్పుడు చిన్నచిన్న పనులు చేసే నేను, ఇప్పుడు పెద్ద పని చేయబోతున్నాను అని చాలా ఆత్రుతగా ఉంది. ఏ మాటకామాట చెప్పాలి ఈ మనుషుల ప్రపంచంలో బతకాలంటే డబ్బు చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్న రోజులు నేను మనిషిగా బతకాలి అనుకుంటున్నాను అంటూ తన సందేహాన్ని చెప్పాడు.


“ సరే అయితే విశ్రాంతి తీసుకోవడానికి గది ఏర్పాటు చేయనా ?” అంటూ పోప్ ఆడగానే ,

చేయండి. నేను కాస్త బయటికి వెళ్లి చల్లగాలి పీల్చుకొని వస్తాను అంటూ ఆ చర్చి ముందరకొచ్చాడు అభయ్.


అప్పటికి చీకటి పడి చాలా సేపయ్యింది. అందుకే ఆ చర్చి చుట్టుపక్కల ఎవరూ లేరు .ఇదే మంచి సమయం అనుకొని చాలా సంతోషంగా తన శక్తిని పెంచాడు.


తన తలపై ఒక తెల్లని రింగ్ మెరుపు శక్తితో తిరిగి మాయం అయింది. చూట్టూ భరించలేని వెలుగు వచ్చి మయం అయ్యింది. వెంటనే తన భుజాల నుంచి రెండు పొడవైన రెక్కలు లాంటివి వచ్చాయి .


తెల్లగా ఈకలతో మెరిసిపోతున్న తన రెక్కలను చూసుకుంటూ ఎన్ని రోజులైందో ఉపయోగించి అంటూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాడు.


మేఘాల పైన ఎగురుతూ ఆ నగరాన్ని మొత్తం చూస్తూ సంతోషంగా ఫీలయ్యాడు .అప్పుడే ఒక పెద్ద బిల్డింగ్ పైన కూర్చుని ఎవ్వరికీ కనిపించకుండా, రాత్రిపూట కనిపించే ఆ అందమైన నగరాన్ని అదేదో తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు .



******


“ రేపు అబ్బాయి రాకపోతే బాగుంటుంది. సరే కానీ నేను ఉదయం ఈ గదికి వచ్చినప్పుడు మీరు ఏదో న్యూస్ చూశామన్నారు కదా !ఏంటది? ” ఆశ్చర్యంగా అడిగింది అన్వి.


“ హా అవును. నీకు ఆ విషయం చెప్పాలనుకోని మర్చిపోయా ?” అంటూ మళ్లీ అర్జెంటుగా వెతుక్కుంటూ దువ్వెనని తీసుకొని వచ్చి, మైక్లా మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది సంజన .


మీరు చూస్తున్నారు చోక్క చీర టీవీ ఛానల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మనిషి శరీరం పూర్తిగా భయంకరంగా మారింది .ఉదయం యాథలాభంగా తన రెస్టారెంట్ని తెరవడానికి వచ్చాడు ఓనర్. వెనక శవన్ని చూసి భయపడిపోయి పోలీసులకి ఫోన్ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి తన షాప్ వెనక చచ్చిపడి శవంలా కనిపించాడు. అతని మణికట్టులు రెండు కోయబడి, తన తలపై సగం నరకబడి ఉంది .అందులో ఉన్న మెదడు మాయమైపోయిందని నిర్ధారించారు .అతని శరీరం పూర్తిగా రక్తం లేని దానిలాగా తెల్లగా మారింది. అతడి రక్తపు మరకలతో ఆ ప్రాంతం తడిచిపోయింది. ఇలాంటి కిరాతకమైన హత్యని ఏ సైకో కిల్లర్రో చేసి ఉంటాడని వాళ్ళు అభిప్రాయపడ్డారు అంటూ తను చూసిన విషయాలన్నీ చెప్పింది .


“ వామ్మో ఏంటి అంత భయంకరంగా చంపాడా? ఇంతకైతే ఎక్కడ జరిగింది ” అంటూ భయపడుతూనే అడిగింది అన్వి.


బెంగళూరు మెట్రో స్టేషన్ నుంచి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఊరు అని గుర్తు ఉంది అంటూ గాల్లోకి చూస్తూనే ఆలోచిస్తు చెప్పింది మన డిటెక్టివ్ గీత .


“ ఏయ్ గీత .ఇంతకీ అతన్ని కావాలనే చంపింటారా? లేదా ఏదైనా జరిగిందా ? నీ స్టైల్ లో చెప్పవే ! ” దగ్గరికి వస్తున్నట్టు ఆతృతగా అడిగింది అన్వి.


ఎంత సైకో కిల్లారైన ఇలా చేస్తాడు అంటే నేను అసలు నమ్మను. ఇది కచ్చితంగా దయ్యాల పని .....అని ఏదో చెప్పబోతున్న గీతని వెంటనే ఆపేసి, “ నాకు నిద్ర వస్తుంది ” అంటూ భయపడిపోతూ వెళ్లి దుప్పటి కప్పేసింది.


*******


సరిగ్గా హత్య జరిగేన సమయంలో.


ఆ వ్యక్తిని చంపిన ఆ రెండు కళ్ళు, అతని తల నుంచి మెదడుని బయటికి తీసింది.

( అక్కడ మొత్తం చీకటిగా ఉంది కాబట్టి ముందు ఏం జరుగుతుందో మీకు కనిపించదు. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.....!)


మన అన్వి కార్ యాక్సిడెంట్ నుండి కాపాడిన తర్వాత ఆ అబ్బాయి ఆ చీకటిలో కలిసి పోయాడు. అప్పుడే అటూగా సిగరెట్ తాగుతూ వచ్చిన ఆ వ్యక్తిని చీకటిలోపలికి తీసుకొని వెళ్ళి తన నిజస్వరూపాన్ని చూపించాడు.


నిజానికి తను మనిషి రూపంలో ఉండే ఒక డ్రాకులా!.తన రెండు కన్నులు నిప్పు గోళల మండుతూ ఉన్నాయి . పళ్ళు రెండు చివరన రెండు రాక్షస కోరలు పెరిగాయి . తన మంకీ క్యాప్ తీయగానే తన చేతి గోర్లు చిన్నగా పెరిగి, తన శరీరం రంగు మారింది .


అదంతా చూసినా వ్యక్తి భయపడిపోయి పరిగెత్తడానికి ప్రయత్నిస్తే ,డ్రాకులా వెళ్లకుండా ఆపేశాడు . పక్కనే ఉన్న గోడకి నాలుగు ఐదు సార్లు డబల్ మని అతడి తలను పగలగొట్టాడు.


కొన ఊపిరితోనైనా తన ప్రాణాన్ని దక్కించుకోవాలని పారిపోవడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి మణికటును కోసేసి , దాని నుండి వస్తున్నా రక్తాన్ని తాగాడు. ఆ వ్యక్తి రక్తం తన పెదవుల కింద చిన్నగా కారుతూ ఉంటే.......దాన్ని తన నాలుకతో చప్పరిస్తూ ,“ నువ్వు చేసిన పాపాలకి నీకు ఇదే శిక్ష. నీకు ఈ భూమి పైన బ్రతికే అధికారం లేదు ” అంటూ చిన్నగా నవ్వుతూ .


వెంటనే వెనక ఏదో ప్రత్యక్షమైంది.

“ ఏంటి ఇలా వచ్చావు.....?” అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అడిగాడు డ్రాకులా.


అదే యువరాజా! మిమ్మల్ని తీసుకురమ్మని ప్రభువుగారు చెప్పారు అంటూ భయపడుతూ ఉన్న ఒక చిన్న రక్తపిశాచి చెప్పింది.


“ నన్ను తీసుకొని రమ్మని చెప్పారా? ఎందుకు? నేను ఇక్కడ మనుషులలో ఇప్పటికే సంతోషంగా ఉన్నాను. నాకు ఈ రాజ్యాన్ని పాలించాలని లేదు అనీ నా మాటగా వెళ్లి చెప్పు ” అంటూ కఠినంగా అరిచాడు .


అతని కంట్లో వస్తున్న ఆ వెలుగుని చూడలేక భయపడిపోతున్న చిన్న రక్తపిశాచి , “ ప్రభు నేను ఎంతగా చెప్పినా ఆయన వినలేదు . ఒకసారి వచ్చి మీరే చెప్పండి .ఇలా మీకే ఎదురు చెబుతున్నందుకు నన్ను క్షమించండి ” అంటూ మోకాళ్లపై పడి ప్రాధేయపడింది.


తన కారణంగా ఇలా వాళ్ళ మధ్యవర్తులు చనిపోవడం ఇష్టం లేని ఆ డ్రాకులా ( అంటే ఒక రకంగా మంచి డ్రాకులా. అన్ని డ్రాకులాకి వేరేగా ఉన్న మంచి డ్రాకులా ) సరే పద నువ్వు నన్ను చూసి భయపడ్డావు. కాబట్టి ఇకపై భయపడకు అంటూ పక్కనే చచ్చిపడిన ఆ వ్యక్తి తల సగం కొరికాడు.



అందులో నుండి మెదడు భాగాన్ని తీసి బహుమతిగా ఆ చిన్న రక్తపిశాచికి ఇచ్చాడు. తర్వాత చీకటిలోని వాళ్ళు మాయమై వేరే కొత్త ప్రపంచంలో ప్రత్యక్షమయ్యారు .


ఎదురుగా అత్యంత భయంకరమైన ఒక ద్వీపం ఉంది .అందులో రాజకోటలాగా పాడుబడిన ఒక శిథిలావస్థ భవనం. వెలుతురే లేని ఆ ప్రపంచంలో ఎన్నో దుష్ట ఆత్మలు, రక్త పిశాచాలు ప్రతి దుష్ట శక్తికి నిలయంగా మారాయి .దాని నాయకుడే మహా డ్రాకులా .


అతని కొడుకే ఈ చిన్న డ్రాకులా!.తండ్రి తర్వాత వాళ్ళని పాలించడానికి ఒక నాయకుడు కావాలి అందుకే తనని వాళ్ళకి నచ్చిన విధంగా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా ఈ చిన్న డ్రాకులా మనుషులని చంపడానికి ఇష్టపడడు.


తను బ్రతకడం కోసం రక్తము కావాలన్నది నిజమే! దానికోసం అమాయకమైన ప్రజలని చంపడం తనని చాలా బాధిస్తుంది .అందుకే ఆ ప్రజలకు దూరంగా మనుషుల లోకంలో జీవిస్తున్నాడు.


రాజ దర్బార్ లోకి వెళ్ళగానే , “ చిన్న డ్రాకులా! ఇన్ని రోజులు ఎటు వెళ్లిపోయావు ” అంటూ తండ్రి ఆప్యాయంగా అడిగాడు.


“ నేను మనుషులలో చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను మీరు అనవసరంగా పిలిచారు ” అంటూ తండ్రి అంటే కోపం ఉన్నట్టుగానే మాట్లాడాడు.


నిన్ను నేను ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది .మా కోసం నువ్వు ఆ ఒక్క చిన్న పనిని చేసి పెట్టగలవా ? దాదాపు అభ్యర్థిస్తున్నట్టుగా వచ్చి కొడుకు చేతులను పట్టుకుని అడిగాడు.



ఆయన మాటల్లో ఏదో తెలియని అమాయకత్వాన్ని గ్రహించిన చిన్న డ్రాకులా “ ఏంటి నాన్న .....” అంటూ ఆప్యాయంగా అడిగాడు .



వెంటనే ఆయన చేతిని చిటికె వేయగానే అందులో ఒక ఫోటో కనిపించింది .ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూపిస్తూ, నువ్వు ఈ అమ్మాయిని మన రాజ్యానికి తీసుకొని రావాలి. తనని నువ్వు ప్రేమించేలా చేసుకుని తనని డ్రాకులాలకి యువరాణిని చేయాలి అంటూ తన అసలు ఉద్దేశాన్ని చెప్పాడు .


తను మరెవరు కాదు. అన్వి! ముందు రోజు ఆ అమ్మాయిని కాపాడాడు .అదంతా గుర్తుకు రాగానే “ ఏంటి కానీ ఎందుకు ? ” దాదాపు ఇష్టం లేనట్టే కోపంగా అరిచాడు.


రాబోయే రోజుల్లో నేను డ్రాకులా భవిష్యత్తు కేవలం ఈ అమ్మాయి చేతుల్లోనే ఉంది. ఇప్పటివరకు నేను నిన్ను ఏది అడగలేదు .నిన్ను బలవంతము చేయలేదు .నాకోసం నువ్వు తనని యువరాణిగా తీసుకుని వస్తావా ? అంటూ మోకాళ్లపై కూర్చుని అడిగాడు .


ఎప్పుడు కోపంగా గంభీరంగా కనిపించి తన తండ్రి; రాక్షసులకు రాజైన డ్రాకులా ,ఇలా మారిపోవడాన్ని చూసినా తనకి చిన్న పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకొని ,“ తప్పకుండా మీ కోరికను నేను తీరుస్తాను ” అంటూ హామీ ఇచ్చి, మరేం మాట్లాడకుండా పక్కన కిటికీలో గబ్బిలముగా మారి ఎగిరిపోయాడు.


——— ***** ———