Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 03











వారి వెనుక ఒక అబ్బాయి నిలుచున్నాడు. అతడు పవన్ కళ్యాణ్ లాగా తలపై కొద్దిగా మధ్య పాపిడి తీసి ఉన్న తన హెయిర్ ని సరి చేసుకుంటున్నాడు .


అతని వెంట్రుకలు నల్లని రంగుతో చూడగానే అట్రాక్టివ్ లుక్ లో ఉన్నాయి .ఇంకా కనుబొమ్మల పైన ఉన్న ఆ నల్లని వెంట్రుకలు,అస్సలు గ్యాప్ లేనట్టుగా లైట్ గా కలిసిపోయాయి .


అతనిను దాదాపు పిల్లిలాగా నీలిరంగు కళ్ళతో కనిపించాడు. తన బుగ్గల పైన ఉన్న అందమైన సొట్టబుగ్గ సూర్యుని కాంతి కారణంగా ముత్యంలా మెరుస్తుంది .


అతడు వేసుకున్న తెలుపు రంగు స్వెటర్ లాంటి కోటుని ,దానిపై మోస్తున్న బ్యాగుని ,అతడి మైంటైన్ చేస్తున్న తన స్టైల్ ని చూడగానే ముగ్గురు ఫిదా అయిపోయారు .


ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అప్పటిదాకా మాట్లాడుకుంటున్న అమ్మాయిలు అందరూ ,తన వెనక ఒక పెద్ద సైన్యంలా ఫాలో అవుతున్నారు. వాళ్లందరి కళ్ళలో అసూయ కలుగుతుంది.


ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళని ఎవ్వరిని అడగకుండా ....వీళ్ళని అడిగాడు అనీ!


వాళ్లు ఆ అబ్బాయిని చూస్తూ, అదేదో మైకంలో ఉండిపోయాడు.

వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ ముఖం పైన చిటికె వేస్తూ “ హలో మిమ్మల్నే! ఏం ఆలోచిస్తున్నారు ” అంటూ ప్రశ్నించాడు .


ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన ముగ్గురు “ మేము అటుగానే వెళ్తున్నాం పదండి ,చూపిస్తాము” అంటూ ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళాబోయారు.

“ ఏయ్ .........” అంటూ ఆ అబ్బాయి వెనుక నుంచి ఒక అమ్మాయి గట్టిగా అరిచ్చింది .ఆ అరుపుకి భయపడి పోయిన ముగ్గురు " మేము మీతో పాటు వద్దామనుకున్నాం......కానీ మాకు వేరే పని ఉంది. కాబట్టి మీరు అటుగా వెళ్ళండి అంటూ తన కుడి చేతి చూపుడువేలుని చూపిస్తూ " అక్కడి నుండి జారుకున్నారు.



అక్కటినుంచి పారిపోతుడంతో అబ్బాయికి ఏమి అర్థం కాక చిన్నగా నవ్వుకుంటూ ఆ గది వైపు వెళ్లాడు.

ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోతూ క్యాంటీన్ వైపు వెళ్లారు .కానీ వెనుక వస్తున్న అమ్మాయిలంతా వాళ్ళని అడ్డగించి “ అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఇక్కడ చదువుకోవడమే గొప్ప విషయం .మళ్ళీ ఈ లోక్లాస్ మెయింటెనెన్స్ తో మాకు పోటీ వద్దనుకుంటున్నారా” అంటూ......

“ చూడండి లాస్య .మేము అస్సలు అలా అనుకోవడం లేదు .అబ్బాయి అడ్రస్ అడగనే చెప్పేసాం. అంతే! మేము ఇంకెప్పుడు ఆ అబ్బాయి జోలికి వెళ్ళాము......ప్లీజ్ ” అంటూ బ్రతిమిలాడుతూ చేతులు జోడించి అభ్యర్థించింది అన్వి.


కానీ నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడావు. అది నాకు నచ్చలేదు అంటూ తన చేతితో లాగిపెట్టి ఒకటి పీకింది .తన ముఖంపైన వేలిముద్రలుగా పడ్డాయి. అయినా కూడా తను ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది .


“ ఇంకోసారి అబ్బాయి జోలికి రావాలి .అప్పుడు మీ సంగతి తేలుస్తా ” అంటూ వార్మింగ్ ఇస్తూ అక్కడి నుండి తన బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయింది.


తను వెళ్ళిపోయిన తర్వాత సంజన ఇంకా గీత ఇద్దరూ జాలిగా అన్విని చూస్తూ ,“ ఎందుకే ఎప్పుడూ గొడవ పెట్టుకోమంటే భయపడుతూ ఉంటావు. ఒకసారి దానికి తగిన బుద్ధి చెప్తే సరిపోతుంది కదా! ఈ విషయంలో నీ తప్పేం లేదు .అనవసరంగా వాడే వచ్చి మనల్ని దెబ్బలు తినేలా చేశాడు ” అంటూ వచ్చిన అబ్బాయి పైన కోపంగా తిట్టుకుంటూ అన్వి బుగ్గ పైన చిన్నగా ఏదో మందు రాసింది మన డిటెక్టివ్ గీత .


“ మీరు లైట్ తీసుకోండి .ఇలాంటివి మనకి రోజు మమూలే కదా! మన దగ్గర నిజంగా డబ్బు లేదు. అలా డబ్బు ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే మన జీవితాలు నాశనం అవుతాయి .ఒక్కసారి మన చేతికి గ్రాడ్యుయేషన్ పట్టా రానీ, ఆ తర్వాత వాళ్ళ అంతు చూద్దాం ” అంటూ అక్కనుండి వెళ్ళిపోయింది.



ఆరోజు క్లాసులో వాళ్లు లాస్ట్ బెంచ్ లో కూర్చున్నారు. ముగ్గురు మాట్లాడుకుంటూ రోజులాగే కూర్చున్నారు .లాస్ట్ బెంచ్ ముందర ఉండే టేబుల్లో మన డిటెక్టివ్ ,యాంకర్ ఇద్దరు కూర్చున్నారు.


లాస్ట్ బెంచ్ లో మన అన్వి మాత్రమే కూర్చుంది.


ఇంతలో ఆ క్లాసులోకి భూషణ్ గారు వచ్చారు. ఆయన రావడంతోనే అందరూ లేచి, “ గుడ్ మార్నింగ్ సార్....” అంటూ విష్ చేశారు .


“ షీట్ డౌన్ ”అంటూ ఆయన చెప్పి తన లెక్చర్ స్టార్ట్ చేశాడు .నిజానికి ఆ కాలేజీ ధనవంతుల కోసం మాత్రమే కట్టించబడింది .ఒకప్పుడు అన్వి వాళ్ళు కూడా ధనవంతులు .అందుకే అందులో చదువుతూ వచ్చింది .


సడన్గా పరిస్థితి దిగజారడంతో ఇక వాళ్ళు ఇలా మారాల్సి వచ్చింది .వాళ్ల నాన్నగారు ఈ భూషణ్ సార్ మంచి స్నేహితుడు .అందుకే ఆ కాలేజీలో పేద విద్యార్థుల కోసం ఉండే స్కాలర్షిప్ అన్వికి వచ్చేలాగా చేశారు. దానికి తోడు పేద పిల్లల కోసం ఫండింగ్ స్టార్ట్ చేశారు .అందులో వచ్చిన దాంతో అన్విని చదివించడానికి ఉపయోగించారు .అలా ఆయన సపోర్ట్ తో తను ఈ స్టేజ్ లో ఉంది .లేదంటే ఇంతకంటే దిగిజారిపోయి ఉండేది.


భూషణ్ గారు పైకి గంభీరంగా కనిపించినా, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఆయనకి అన్వి అంటే చెప్పలేనంత అభిమానం. ఎందుకంటే చాలామంది పిల్లలు స్కాలర్షిప్ తీసుకొని దాన్ని వృథాగా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ అన్వి మాత్రం చాలా డెడికేషన్ కలిగిన అమ్మాయి .


క్లాసులకి రోజు వచ్చి చెప్పిందంతా బాగా వింటూ ఉండేది .దాంతో మార్కులు కూడా బాగా వచ్చేవి. అందుకే ఆయనకి అన్వి పైన ఒక రకమైన అభిమానం. కానీ ఏ డబ్బు లేని ఒక అమ్మాయి ఎక్కువ మార్కులతో వాళ్లని లీడ్ చేస్తుండటంతో ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ తను అంటేనే కోపం.


రోజు తనని ర్యాగింగ్ చేయడం ,తనతో మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇబ్బంది పెట్టడం చేసేవాళ్ళు .


ఆయన పాఠం చెప్తుంటే “ మే ఐ కమింగ్ సార్ ” అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది .


“ ఎస్ కమింగ్ .ఏం కావాలి ” అంటూ చేతిలో చాక్పీస్తో, మరో చేతిలో బుక్కుతో తన వైపు చూశాడు.


“ సార్ ! నా పేరు అభయ్. నేను కొత్తగా ఈ కాలేజీలో చేరాను .ఇప్పుడే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి క్లాస్ కి వస్తున్నాను ” అంటూ తన గురించి చెప్పాడు .


తన రూపురేఖలు అవన్నీ చూసి కాస్త సందేహిస్తూనే “ ఓకే గో అండ్ సిట్ . బి సైలెంట్ ” అంటూ వార్నింగ్ ఇస్తూ మళ్లీ పాఠం చెప్పడం స్టార్ట్ చేశాడు .


క్లాసులో ఆ అబ్బాయి వచ్చింది మొదలు ఎవ్వరు సార్ చెప్పే పాఠం వినలేకపోతున్నారు.


అబ్బాయిలు అయితే అతడి ఫిజిక్ ,తన అందానికి చాలా అసూయగా ఫీల్ అవుతున్నారు. అమ్మాయిల విషయమైతే చెప్పనక్కర్లేదు. నిజానికి ఆ క్లాసులో అందరూ కలిసి కూర్చుంటారు. ఎవరు ఏక్కడ కూర్చోవాలన్నది వాళ్ళ ఇష్టం .దాంతో అబ్బాయి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి చివరి బెంచిలో కూర్చున్నాడు అది కూడా అన్వి పక్కన .


అప్పటిదాకా అమ్మాయిలు వాళ్ళ పక్కన కూర్చోవాలని వాళ్ళ ఫ్రెండ్స్ని లేపి వేరే చోట కూర్చోబెట్టారు .అవేం పట్టించుకోకుండా అభయ్ నేరుగా వెళ్లి తన దగ్గర కూర్చోవడంతో అందరికీ కోపం వచ్చింది .ఆ కోపం ఆ అబ్బాయి పైన కాదు అన్వి పైన.


తను ఊహించకుండా వచ్చి కూర్చోవడంతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిన అన్వి, తన జుట్టు సరి చేసుకుంటూ ......సార్ చెప్పే పాఠం పైన దృష్టి సారించింది . అభయ్ కూడా తన నోట్ పుస్తకాన్ని తీసి మధ్య మధ్యలో అన్విని గమనిస్తూ వింటున్నాడు.


ఇప్పటికే తనతో మాట్లాడానని చాలా గోలగోల చేశారు. ఇప్పుడు తను నేరుగా నా పక్కన కూర్చున్నాడు. ఇక నన్ను చంపేస్తారు వీళ్ళు. సార్ బయటికి అలా వెళ్ళగానే, నేను ఎస్కేప్ అయిపోవాలి అని మనసులోని ప్లాన్ రెడీ చేసుకుని పేపర్ పైన ఏదో రాసి ,ముందున్న వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చింది.


అలా బెల్ మోగగానే, “ సార్ మాకు కొంచెం డౌట్ ఉంది . మేము లైబ్రరీ కి వెళ్లి క్లారిఫై చేసుకోవచ్చా? ” అంటూ సార్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే టక్కున లేచి అడిగింది అన్వి.


“ దానికి ఏముంది .వెళ్లూ అన్వేషణ ” అంటూ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు .ఇదే మంచి సమయమని కోపంగా చూస్తున్న అమ్మాయిల నుంచి ముగ్గురు జారుకున్నారు.


వెంటనే ఆ కాలేజీ క్యాంపస్ నుంచి బయటికి వచ్చి ,వాళ్ళ రూమ్ కి చేరుకునే దాకా వాళ్ళ గుండెలు లాబ్ డాబ్ అంటూ శబ్దం చేస్తూనే ఉన్నాయి.


కిచెన్ లోకి వెళ్లి బాటిల్ తీసుకొచ్చిన అన్వి నీళ్లు తాగుతూ , “ ఏంటే దరిద్రం మన వెంట తిరుగుతున్నట్టు ,ఆ అబ్బాయి మన వెంట తిరుగుతున్నాడు .ఇలా అయితే మనకి చదువుకునే టైమే ఉండదు ” అంటూ చిరాగ్గా చెప్పింది అన్వి.


ఏ మాటకామాటే .....అబ్బాయి మాత్రం సూపర్ ఉన్నాడు అంటూ అదేదో ట్రాన్స్లో ఉన్నట్టు అంటుంది మన యాంకర్ సంజన.


“ నేను ఏం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నవే ? కాస్త దానికి అర్థం అయ్యేలాగా చెప్పే ” అంటూ గీత వైపు చూసింది .


దాదాపు గీత పరిస్థితి కూడా అలాగే ఉండటంతో వీళ్ళకి చెప్పి వేస్ట్ అని మనసులోని తిట్టుకుంది.


*******



కాలేజీ అయిపోవడంతో సాయంత్రం అందరూ వెళ్లిపోయారు. వీళ్ళ ముగ్గురు ముందే జారుకోవడంతో అక్కడున్న వాళ్ళందరికీ కోపం కట్టలు తెంచుకుంది . రేపైనా దొరక్కపోరా ? వాళ్ళ సంగతి చెప్తామని మనసులోనే తిట్టుకున్నారు.


అభయ్ తన బ్యాగ్ తీసుకొని చిన్నగా రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు . దారి మధ్యలో తనతో మాట్లాడాలని చాలామంది అమ్మాయిలు ప్రయత్నించారు. కానీ వాళ్లకి అవకాశం ఇవ్వకుండా పనుంది అని చెప్పి తప్పించుకున్నాడు .


అలా తను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ, ఎవరు చూడకపోవడంతో పక్కనే ఉన్న ఒక సెయింట్ చర్చ్ లోకి వెళ్లిపోయాడు .


నిజానికి ఆ చర్చ్ ఎప్పుడు మూసే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి పెద్దగా ఎవరు ప్రజలు రారు. లోపలికి వెళ్ళిన అభయ్ పోప్ దగ్గర “ నేను వచ్చేసాను .ఈరోజు నేను చేయవలసిన మిషన్ ఏంటి? ” అంటూ చాలా చనువుగా అడిగాడు.


నీ గురించి నాకు బాగా తెలుసు .నీలాగా ఎవరు ఇంతవరకు పనిచేయలేదు . నువ్వు ఈ చివరి మిషన్ పూర్తి చేస్తే ఇక అన్ని అధికారాలు నీకే దక్కుతాయి. ఆ విషయానికి నేను చాలా సంతోషిస్తున్నాను అంటూ చెప్పాడు పోప్.



——— ***** ———