Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 02











ఉదయం ఆరు గంటలు


అప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేసి దాని లోపల అంతా క్లీన్ చేసి చెత్తను బయటపడేయటానికి వచ్చాడు ఓనర్ .అక్కడ ఏదో చెడు వాసన రావడాని గుర్తించాడు .

“ ఏంటి ఎప్పుడు లేంది ,ఇంత దుర్వాసన వస్తుంది ” అంటూ ముక్కు పుట్టలని మూసేస్తూ ముందుకు కదిలాడు .


అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారి భయపడిపోయి కిందపడ్డాడు. ఏదో తరుముతున్నట్టుగా భయపడుకుంటూ అక్కడ నుంచి రోడ్డు పైకి వచ్చాడు. వెంటనే తన చోక్క జోబుని తడుముకొని అందులో ఉన్న ఫోన్ ని ఓపెన్ చేసి పోలీసులకు ఫోన్ చేశాడు.


*******


సూర్యుడికిరణాలు కిటికీలో నుంచి నేరుగా బెడ్ పైకి పడ్డాయి .ఆ వెచ్చదనంతో నిద్రమత్తు కూడా పారిపోయింది .


బద్దకంగా వల్లూవిరిస్తూ లేచింది మన హీరోయిన్.

“ అబ్బా అప్పుడే ఏడు అయిపోయిందా? ఇంత పొద్దు పొద్దున్నే వచ్చి ఏం చేస్తావయ్యా నువ్వు? మా నిద్ర చెడగొట్టడానికి కాకపోతే ” అంటూ కోపంగా సూర్యుని తిట్టింది.


చింపిరి చింపిరి జుట్టుగా మారిన తన వెంట్రుకలని రబ్బర్ బ్యాండ్ తో ముడేసి ,ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఒక అర్థగంట తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ,తనకు కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టుకుని బ్యాగ్ సిద్ధం చేసుకుంది .


“ అమ్మ.......అమ్మ ....” అంటూ దేన్నో రూములో వెతికి ,అది దొరకపోవడంతో పిలిచింది .


“ నాకు కావాల్సింది ఇక్కడే పెట్టుకుంటాను! కానీ పొద్దునికంత మాయమైపోతూ ఉంటాయి ” అంటూ గోనుకుంది. అవతల నుండి ఏలాంటి సమాధానము లేదు.


దాంతో “ స్వాతి ...........!” అంటూ గట్టిగా అరిచింది.


వంట గదిలో గరిటతో, పాత్రలతో యుద్ధం చేస్తున్న ఆవిడ, కూతురు పిలుపుకి తొందర తొందరగా మెట్ల పైకి చేరుకుంది .


“ ఏంటే అలా అరిచావు! భయపడిపోయాను. ఏమైంది ఇప్పుడు? ”అంటూ ఆగకుండా అడగాల్సినవి అన్ని కక్కేసింది.

“ నా మంకీ క్యాప్ కలిగిన కోటు ఎక్కడ పెట్టావు?” అంటూ ఏదో డిమాండింగా నడుంపై చేయి పెట్టుకొని అడుగుతూ .....

“ఓసిని !ఏం పిల్లవే నువ్వు, దానికోసం అంత గట్టిగా అరవలా ?” చిరు కోపం ప్రదర్శిస్తూ ఆవిడ.


“ హా....మరి ! నా వస్తువులను అన్ని నేను ముందే రెడీగా పెట్టుకుంటాను ,మళ్ళీ నాకు లేట్ అవ్వకుండా. నువ్వు చూస్తే ఏమో పొద్దునే మాయం చేసేస్తుంటావు. త్వరగా చెప్పు లేటవుతుంది ” అంటూ మాటల్ని అక్కడే ఆపేస్తూ .


“ అది కింద నీ కూర్చి దగ్గర పెట్టాను. నువ్వు అసలు తినకుండానే వెళ్ళిపోతున్నావు ఇంటికి వచ్చినప్పుడు ; అందుకే ఈసారి అలాగా ప్లాన్ చేశాను” అంటూ విలన్ లాగా అసలు కారణం చెప్పింది .


“ అమ్మ .....ప్లీజ్ ”అంటూ దగ్గరగా వచ్చి బుగ్గ పై ముద్దు పెట్టుకుని ,నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది .మళ్ళీ వారం వచ్చేస్తాను కదా! ఈ ఒక్కసారికి వదిలేయి అంటూ బుజ్జగిస్తూ, తన బ్యాగ్ అందుకుంది.


“ అదేం కుదరదు .నువ్వు మర్యాదగా ఈరోజు తినే వెళ్లాలి .లేదంటే నీ కాళ్లు ఇరగకొడతాను .” అంది బెదిరిస్తూ.

“ ప్లీజ్ ........అమ్మ ....” అంటూ ఏడుస్తున్నట్టు గారాలు పోయింది .


ఏంటమ్మా పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసిందా మీ అమ్మ ; అన్వి వచ్చిన రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అంటూ భార్యపై కోపం నటిస్తూ వచ్చాడు.

“ చూడు నాన్న. నాకు ఒకపక్క లేటవుతుంది అంటే లేదు తినాలి అంటుంది ” కంప్లైంట్ చేస్తూ చెప్పింది.


ఏంటే నువ్వు నా బంగారు తల్లిని ఏదో అంటున్నావు అంటా! కళ్ళు రెండు పెద్దవి చేసి చూశాడు ఆయన .


“ మిమ్మల్ని చూసి భయపడే రోజులు వెళ్ళిపోయాయి .ఇప్పుడు నా మాటే నెగ్గాలి. మీరు దాన్ని సపోర్ట్ చేస్తే ఇద్దరిని కలిపి గదిలో పెట్టి ,నాలుగు రోజులు పస్తులు ఉంచుతా ” కోపంగా రుసరుసలాడుతూ కిచెన్ లోకి వెళ్ళింది.


అప్పుడే తయారు చేసిన దోస తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ అందిస్తూ,టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది.


“ నాన్నో.....స్వాతి గారికి కోపం వచ్చినట్టుంది. మనం సైలెంట్ గా తినేస్తే బెటర్ ” అంటూ చిన్నగా గొనిగిపెట్టి తినడం స్టార్ట్ చేసింది అన్వి.


అలా వాళ్ళు టీవీలో ఏదో చూస్తూ ఆ పూటకి భోజనం ముగించేశారు.


“ అయ్యబాబోయ్ .....అప్పుడే ఎనిమిది అయింది. అర్జెంటుగా వెళ్లాలి ” అంటూ చేయి కడుక్కొని బ్యాగ్ తీసుకొని బయటికి నడిచింది .


ఒకపక్క తింటున్న ప్లేటు పట్టుకొని, మరో చేత్తో పాకెట్లో డబ్బులు తీస్తూ “ అన్వి డబ్బులు తీసుకుని వెళ్ళు ! ” అంటూ ఒక 5000/- ఇచ్చారు.


అంత డబ్బును చూసి “ అయ్యో నాన్న. నాకు ఇంత వద్దు .నాకు ఒక వెయ్యి రూపాయలు సరిపోతాయి .మళ్లీ వారం వచ్చేస్తాను కదా !ఎందుకు అనవసరంగా ఖర్చు చేయడం ” అంటూ తిరిగిస్తుంటే,


“ పర్లేదు నీ దగ్గర ఉంచుకోరా.......” అంటూ బయటికి పంపాడు.


అమ్మ వెళ్లొస్తానే ! అంటూ గట్టిగా చెబుతూ అన్వి బ్యాగ్ తీసుకొని బయట ఉన్న గేటు ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయింది .


అప్పటిదాకా కిచెన్ లో ఉన్న స్వాతిగారు బయటకు వచ్చి “ ఏమండీ మీరు ఎలాగో చెప్పలేకపోతున్నారు. కనీసం నేనైనా చెప్పనా ? వేరే కాలేజీలో జాయిన్ అవ్వమని ,మరీ అంత ఫీజు అంటే మొదట్లో బాగుండేది .
కానీ ఇప్పుడు మీ జాబ్ పోయి ఏదో చిన్న జాబ్ చేస్తున్నారు. ఆ వచ్చిన జీతం కూడా ఇంట్లో గడవడానికి కష్టంగా ఉంది .మళ్లీ దాన్ని ఫీజులకి అంటే ఇబ్బంది అవుతుంది కదా ! ” ఇంతకుముందు కోపం మొత్తం పోయి భర్త పై చాలా ప్రేమగా మాట్లాడింది ఆవిడ .


“ పర్లేదులే స్వాతి. అది గొప్ప కాలేజ్, అందులో నుంచి ఒక్కసారి గ్రాడ్యుయేషన్ తో బయటికి వస్తే బయట బోలెడు అవకాశాలు ఉంటాయి .ఏ ఒక్క జాబ్ దొరికిన మనల్ని మన కూతురే పోషిస్తుంది” అంటూ తన కష్టాన్ని దాచేశాడు .


“ మీరు ఎన్నైనా చెప్పండి. మీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఒకసారి మన కూతురుతో మాట్లాడితే తను అర్థం చేసుకుంటుంది ” అంటూ భర్త వైపు బాధగా చూస్తూ.


“ పర్లేదు స్వాతి .ఇప్పుడు బాగానే ఉన్నాను కదా! చూడు బాగా దిట్టంగా .ఇంకెన్ని రోజులు ఒక సంవత్సరమే కదా ” అంటూ ఆయన ఏదో చెప్పడానికి చూస్తూ ఉంటే మధ్యలో ఆపేసి, “ చూడండి మీరు ఇప్పుడంటే ఇలా కాస్త బాగున్నారు .కానీ దాని పెళ్లి కోసం డబ్బులు దాయాలి . ఇప్పుడే ఖర్చు చేస్తే భవిష్యత్తులో దానికి ఇబ్బంది అవుతుంది ” అంటూ భర్తకి సలహా ఇవ్వబోయింది ఆవిడ.


“ పిచ్చి స్వాతి........ఇలా రా ” అంటూ తన ప్లేట్లో దోసని కాస్త కుర్మతో కలిపి ఆవిడ నోట్లో పెట్టాడు.


“ నా కూతురే! నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. అందుకే కాలేజీ ఫీజు మొత్తం నేనే కడితే నాకు భారం అవుతుందని ,తను పార్ట్ టైం జాబ్ చేస్తుంది. దానితో తను కట్టాల్సిన ఫీజుల్లో సగం మాత్రమే నన్ను అడుగుతుంది .ఆ విషయం తెలుసా నీకు ” అంటూ భార్య వైపు చూసాడు .


ఆవిడ మరేం మాట్లాడలేకపోయింది .


అప్పటిదాకా బయటికి వెళ్లిపోయిన అన్వి అంత డబ్బులు నాకే ఇచ్చేస్తే ,ఇంట్లోకి ఎలాగా అని మళ్ళీ ఆలోచించి వెనక్కి వచ్చింది. తీరా వాళ్ళ మాటలు విని గుమ్మం బయట నిలబడిపోయింది.

“ నాకు తెలుసు నాన్న .నేనెప్పుడూ నీ దృష్టిలో మహారాణినే! నీ కష్టం నువ్వు ఎంత దాచాలనుకున్న సరే, కన్న కూతురుగా నేను అర్థం చేసుకోగలను ” అంటూ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆ మాటలు వింటుంది.


వాళ్ళని బాధ పెట్టలేక అటు నుంచి అటే మళ్లీ వెనక్కి వెళ్ళిపోయింది .అక్కడ నుండి బస్టాండ్ కి చేరుకోగానే మళ్లీ తన ముఖం ఎవరికి కనపడకుండా మంకీ క్యాప్ వేసుకుంది .


ఈ ఐదు వేలు నేను జాగ్రత్తగా ఖర్చు చేయాలి .ఈ 5000/- తో ఈ నెల అంతా ఎలాగోలా గడిపేయాలి. నాకు డబ్బులు ఇవ్వాలని అమ్మ వాళ్ళు అసలు బట్టలే కొనుక్కోవడం లేదు. ఈసారి ఇచ్చే డబ్బులతో నేను కచ్చితంగా వాళ్లకి కొనివ్వాలి అని వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూనే బస్సులో ముందుకు వెళ్ళింది.


ఆ తర్వాత బెంగళూరు మెట్రో స్టేషన్ నుంచి హాస్టల్ కి చేరుతుంది . అప్పటికే తొమ్మిది అవుతుంది. వార్డెన్ దగ్గర తను వచ్చిన విషయం గురించి మాట్లాడి ,ఎంట్రీ బుక్ లో తన పేరు రాసి తన రూమ్ డోర్ తెరిచింది .


అప్పటికే లోపల ఉన్న ఇద్దరు నానా రచ్చ చేయడం చూసి ,ఆ శబ్దలేవి బయటికి రాకుండా వెంటనే తలుపేసేసింది అన్వి.


“ ఏంటే పొద్దుపొద్దున్నే నానారభస చేస్తున్నారు. కాలేజీకి టైం అవుతుంది వెళ్ళట్లేదా ?” అంటూ వాళ్ళ వాలకం వైపు చూస్తూ అంది .


“ లేదు ఈరోజు మనం కాలేజీకి సెలవు ప్రకటిస్తున్నాము ” అంటూ చేతిలో దువ్వెన పెట్టుకొని యాంకర్ల మాట్లాడుతుంది సంజన .


తన ప్రవర్తనను చూసిన అన్వి నవ్వుకుంటూ ఏంటి సంగతి అన్నట్టుగా కల్లగరేసి బెడ్ పై కూర్చున్న గీతను అడిగింది .


గీత తన కళ్ళకు ఉన్న గుండ్రని కళ్ళద్దాలని ఒకసారి పైకి అలా తట్టుకొని ,“ ఈరోజు న్యూస్ లో ఒక సైకో థ్రిల్లర్ హత్యని చూసింది .అప్పటినుంచి అందులో యాంకర్ ని ఇమిటెడ్ చేస్తూ, ఈ పిచ్చి సంజన వాగుతుంది ” అంటూ డిటెక్టివ్ గా చెప్పింది.


“ ఇప్పుడే అందిన తాజా సమాచారం .ఫ్రెండుని ప్రోత్సహించకుండా పిచ్చిది అన్న డిటెక్టివ్ గీతను హత్య చేసిన యాంకర్ సంజన ” అంటూ బెడ్ పైకి అమంతం దూకింది .


వాళ్ల అల్లరిని చూసి బాగా నవ్వుకుంటూ “ మీ గోల నేను మళ్ళీ భరిస్తాను కానీ ,ముందైతే మనం కాలేజీకి వెళ్దాం .ముందే దానికి బోలెడు డబ్బులు తగలేసాను” అంటూ డ్రస్ తీసుకొని మన యాంకర్ సంజనాన్ని బాత్రూం గదిలోకి తోసింది.



అలా వాళ్ళు ఒక అర్థగంటలో రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరారు. కాలేజీలో వాళ్ళు అడుగుపెట్టగానే వచ్చారు కోతి బ్యాచ్ అంటూ చాలామంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు .ఇవి రోజూ ఉండే విషయాలే కదా ! అని వాళ్ళు ముందుకు వెళ్తుంటే ,కొంత మంది అమ్మాయిలు మాట్లాడుకోవడం వినిపించింది.


“ అస్సలు ఏమన్నాడే! గ్రీకు వీరుడికి ఆ హెయిర్ తన నడిచే వాకింగ్ స్టైల్ సూపర్ ఉంది” అంటూ ఒక బ్యాచ్ లో ఒక అమ్మాయి చెప్తుంది.


“ అవును నేను చూశాను. ఆ అబ్బాయి న్యూ జాయినింగ్ అనుకుంటా! ఏ క్లాసులో కూర్చుంటాడో తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకి. ఆ అబ్బాయి నా పక్కన కూర్చుంటే ” అంటూ తన సంతోషం చాటుకుంది ఇంకో బ్యాచ్ లోని ఇంకో అమ్మాయి.


“ నాకు ఇంకోసారి కనపడాలి .డైరెక్ట్ గా వెళ్లి ప్రపోజ్ చేసేస్తాను. ఆ చూపులు నా ఎదకి గుచ్చుకుంటున్నాయి. ” ఇంకో బ్యాచ్ లో ఇంకో అమ్మాయి మాట్లాడుతుంది .


“ హేయ్.... గీత వీళ్ళందరికీ పిచ్చి పట్టిందా! ఎవరో ఒక అబ్బాయి గురించి వీళ్లు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు .ఎంత అందంగా ఉంటే మాత్రం, మరి అందరూ అబ్బాయిని పొగడమేంటి ? నీ డిటెక్టివ్ స్టైల్ లో ఏదైనా కనిపెట్టూ ” అంటూ ఆ విషయం పై ఆసక్తి చూపిస్తున్నట్టుగా అంది అన్వి.


ఇప్పుడే అందిన తాజా వార్త అంటూ మళ్ళీ చేతిని నోటి దగ్గరికి తెచ్చుకొని యాంకర్ల ఫీల్ అయిపోతూ చెప్పడానికి ప్రయత్నించిన సంజనని, తన అరుపుని వెంటనే మూసేసింది అన్వి.


ఇంతలో వాళ్ళ వెనకనుంచి “ హలో! ఐ యాం అభయ్. ఇక్కడ సెకండియర్ కెమిస్ట్రీ గ్రూప్ కి ఎలా వెళ్లాలో కాస్త చెప్తారా? ” అంటూ వెనకనుంచి మధురమైన గంభీర గొంతు వినిపించింది.


ఆ ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. అంతే! ఒక్క క్షణం తమ కళ్ళను తమే నమ్మలేనంత ఆశ్చర్యానికి గురైపోయారు.



——— ***** ———