Read Those three - 42 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 42

సాగర్ "బి" స్కూల్ లో విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు సిటీ కి రావద్దు. ఇంట్లో కూడా ఉండొద్దు." ఉదయం నాలుగు గంటలకు రహీం నుండి ఫోన్. యాకూబ్ తొలి తిరిగి పోయింది. నిద్ర మత్తు మంచులా కరిగి పోయింది. లేచి బయటకు వచ్చాడు. వసారా అరుగు మీద కూలబడి పోయాడు.
పదేపదే విశాల్ గుర్తొస్తున్నాడు. డబ్బు మదం, గర్వం సమపాళ్ళల్లో ఉన్నా తన దగ్గర ఎప్పుడూ ప్రదర్శించలేదు. తను మాట తీరుతో, ప్రవర్తనో తనతో చాలా స్నేహంగా ఉండేవాడు. అందుకు తను అందించే డ్రగ్స్ ఏమాత్రం కారణం కాదు. అతడికి ఈ అలవాటు ముందే ఉంది. తనవల్ల అతడు చెడిపోలేదు. ఎందుకో అతడి మాటల్లో, నవ్వులో వెలితి లీలగా ధ్వనించేవి.
" యాకూబ్" తల్లి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు.
" నిద్ర పట్టలేదా" ప్రక్కనే కూర్చుని తలపై ప్రేమగా నిమిరింది.
ఆ స్పర్శ అతడిని కదిలించింది. గుండెల్లో గూడు కట్టుకున్న భారం కదిలి కన్నీరై ంం. తల్లి ఒడి లో తల దాచుకున్నాడు. ఫాతిమా కంగారు పడింది" ఏమైంది వీడికి" ?

" యాకూబ్! క్యా హుఆ బేటా?" ఏదో జరగరానిది జరిగిపోయిందని భయపడింది. " అమ్మాయీ జాన్ కు ఏమని చెబుతాడు ? చెబితే తట్టుకోగలదా ? చెప్పకపోతే తన వాళ్ళను మోసగించినట్లవుతుంది. "
ఉదయం ఐదు గంటల తింది. దూరంగా అజా ఆ నీరవనిశీధిలో వినిపోస్తోంది.
తను పాపాన్ని కడిగేసుకునే పవిత్ర సమయం ఇదే . . గుండె చిక్కబట్టుకొని తన నేరచరిత్రను అక్షరం పొల్లు పోకుండా తల్లి కి చెప్పుకున్నాడు. తండ్రి, అక్క మౌన సాక్షులైనారు.
" అమ్మీ ! ఇపుడు నేనేం చేయాలి చెప్పు ? రహీం చెప్పినట్లు ఎక్కడికైనా పారిపోవాలా ? లేక పోలీసులకు లొంగిపోయి శిక్ష అనుభవించాలా ? "
" యాకూబ్ ! ముందీ విషయం చెప్పు ! నేను గానీ , మీ అబ్బా జాన్ గానీ ఆస్తులు, మిద్దెలు, మేడలు లేవని బాధపడ్డామా నిన్ను సంపాదించి, రాశులు పోయమని ఒత్తిడి చేశామా ?
ఎందుకిలా చేశావ్ ? జీవితంలో పైకి రావాలంటే ఇంతకు మించి మార్గాలు లేవా ? "
" మంచి చదువు, ఉద్యోగం మన లాంటి వారికి అందుబాటులో ఉంటే ఇలా అడ్డదారులెందుకు తొక్కుతాం ?"
" అలా సమర్థించుకోవడం చేతకాని తనం.ఓర్పు నేర్పు లేని వాళ్ళే ఇలా మాట్లాడుతారు. లోకం లో ప్రతి ఒక్కరూ పెద్ద చదువు లే చదువుకున్నారా ? గవర్నమెంట్ గిరి వెలగబెడుతున్నారా ? ఏదో ఒక అవకాశం కల్పించుకొని ప్రశాంతంగా బ్రతకటం లేదా? నీ పట్టుదల, నీ కృషి, ఆపై అల్లా దయ ..ఈ మూడుంటే అద్భుతాలు చేయవచ్చు. మన అసంతృప్తి, అసహనం మనల్ని దారి తప్పిస్తాయి. నీ సంగతే తీసుకో . లోకం పై కసితో దారి తప్పావు. దొరికి పోయావు. ఇప్పుడేం చేయాలి అని తల పట్టుక్కూర్చున్నా లు"ఫాతిమా ఒక్కొక్క మాట బాణం లా గుచ్చుకుంటోంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
" జరిగిపోయింది వదిలేయ్ అమ్మాయీ ! జరగవలసింది చూడు. తెలిసో తెలియకో తప్పు చేశాడు అదిప్పుడు ముఖ్యం కాదు . వాడిప్పుడు బయటపడటం ముఖ్యం. దిల్ రుబా మాటల్లో అసహనం, బాధ.
" అవును ఫాతిమా ! ఎలాగైనా వాడిని కాపాడుకోవాలి . వాడి పరిస్థితి చూస్తుంటే నాకు కాలు, చెయ్యి ఆడటం లేదు. " కరీంఖాన్ బేలగా అన్నాడు.
ఫాతిమా ఆలోచనలో పడింది. ముగ్గురూ ఆమె నిర్ణయం కోసం చూస్తున్నారు.
" దిల్ చెప్పింది కరెక్ట్. తప్పొప్పులు నిర్ణయించే సమయం కాదిది. యాకూబ్ నువు తప్పు తెలుసుకున్నావు.జరిగిన దానికి బాధ పడుతున్నావు. నువ్వు ఎలాగైనా బయటపడాలి " ఫాతిమా ఆలోచిస్తూ అంది.
" ఏ.సీ.పీ ఇంతియాజ్, ఆదిత్య మంచి స్నేహితులని చేశావు కదా . ఏ.సీ.పీ మంచివాడైనా నేరుగా పులి నోట్లో ్్తల పెట్టినట్లవుతుంది.ఈ సమయంలో ఆదిత్య గారికి ఫోన్ చేసి ఆయన సలహా అడగటం మేలు. ఆయనే నిన్ను కాపాడగలడు." ఆ సలహా ముగ్గురికీ నచ్చింది.
ఆదిత్య తో మాట్లాడడానికి యాకూబ్ సెల్ తీసుకున్నాడు.
అతను రింగ్ చేయకముందే ఫోన్ మ్రోగింది. అవతల ఆదిత్య.
" యాకూబ్ ! విశాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను, ఇంతియాజ్ స్కూల్ లోనే ఉన్నాం. ఇక్కడి పరిస్థితి దారుణం గా ఉంది. పొరపాటున కూడా ఇక్కడికి రావద్దు.మీ ఇంట్లో కూడా ఉండొద్దు. మీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి పో . నేను తిరిగి ఫోన్ చేసేంతవరకు బయట ఎక్కడా కనిపించవద్దు.
ఏసీబీ నెన్నేమీ చేయరు. నువ్వు అప్రూవర్ వి. నువ్వంటే మా ఇద్దరికీ సాఫ్ట్ కార్నరూ ఉంది. కంగారు పడకు."
" అలాగే సార్ " ప్రాణం లేచి వచ్చింది.
" యాదగిరి పేరుతో నువ్విచ్చిన అడ్రస్ కు పోలీసులు వెళ్తారు. ఇబ్బందేమీ లేదుకదా ?"
" ఆ అడ్రస్ ఓ పాడుబడ్డ ఇంటిది. ఇక్కడ ఎవరూ లేరు సార్"

" ఓకే " ఆదిత్య కట్ చేశాడు.
*************************************†************
కొనసాగించండి 43 లో