Read Those three - 41 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 41

ఉత్తరం చదివి విశాల్ వైపు జాలిగా చూశాడు. తన సెల్ మోగటం తో బయటకు వెళ్ళాడు. అవతల అన్వర్..
" రహీం ఫోన్ చేశాడు. నన్ను నా టీం తో అండర్ గ్రౌండ్ కు వెళ్ళమన్నాడు . ఇలాంటి పరిస్థితి వేస్తే మమ్మల్ని ఒక ప్రదేశంలో ఉంచుతారు.ఒక విధంగా హౌస్ అరెస్ట్ " .
" ఎక్కడికి వెళుతున్నారు ?"
" అన్వర్ ఆ ప్రదేశము వివరాలు చెప్పాడు.
" అలాగే వాడు చెప్పినట్లే చెయ్యి. ఇంతియాజ్ తో నేను మాట్లాడుతాను. "
" అలాగే. సిటీ లో ఉన్న మేమందరం కలిసి రహీం చెప్పిన
ప్రదేశానికి చేరేటప్పటికి మూడు గంటలు పట్టొచ్చు. అంతవరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు సార్ తో ఈ మాట చెప్పండి. " అన్వర్ అభ్యర్థన.

ఆదిత్య వెంటనే ఇంతియాజ్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. ఇంతియాజ్ నిట్టూర్చాడు.
" పూర్ విశాల్ ! తను చనిపోతూ డ్రగ్స్ రాకెట్ పునాదులు కదిలించాడు. ఈ రాష్ట్రం అతనిని మర్చిపోదు. ఎందరో తల్లిదండ్రులకు కడుపు క్షోభ తప్పించాడు. ఆదిత్యా ! నేను అక్కడికి వస్తున్నాను . హోం మినిస్టర్ కూడా వస్తున్నారు "
ఫోన్ కట్ చేశాడు ఆదిత్య. ఇంతియాజ్ మాటలు కదిలించాయి. తనూ నిట్టూర్చాడు.
తూర్పు న వెలుగు రేకలు పూర్తిగా వికసించే లోపలే విశాల్ ఆత్మ హత్య వార్త నగరంలో దావానలంలా వ్యాపించింది.
"బి" స్కూల్ బయట జనం గుమిగూడు తున్నారు . వారిని నియంత్రించేందుకు అదనపు పోలీసు బలగాలను తెప్పించారు.
జనం బలం చూసి మీడియా మరింత విజృంభించింది.వారిని కట్టడి చేయటం పోలీసులకు కష్టం అయిపోయింది.
హోం మినిస్టర్ పరాంకుశరావు, డి.జి.పీ , అతని క్రింద స్థాయి
అధికారులు, ఇంతియాజ్ రాకతో కాస్త సద్దుమణిగింది.
అసలిది ముఖ్యమంత్రి రావలసిన పరిస్థితి. . ముఖ్యమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన మంత్రి తో అత్యవసర సమావేశం లో ఉన్నాడు. హోం మినిస్టర్ కు ఫోన్ చేసి ఎప్పటి కప్పుడు పరిస్థితి కనుక్కుంటున్నాడు.సూచనలు ఇస్తున్నాడు.
అసలీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? ఉన్న పోలీసులు నిద్ర పోతున్నారా ? నగరంలో ఇంత పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుస్తుంటే ఏం చేస్తున్నారు ? అంతా అయిపోయాక ఆనవాయితీ గా సంతాప వాక్యాలు చెప్పడానికి వచ్చారా ?" హరీష్ రావ్ బాధ, కోపం పరాంకుశరావును తీవ్రంగా అశనిపాతంలా తాకాయి.
డి జి.పీ సమాధానం చెప్పబోయాడు. పరాంకుశరావు సున్నితంగా వారించాడు.
" హరీష్ రావ్ గారు ! కొడుకు ను పోగొట్టుకున్న మీ బాధ ఎవ్వరూ తీర్చలేరు. కానీ మా ప్రయత్న లోపం కానీ, నిర్లక్ష్యం గాని లేవు. మేమీ డ్రగ్స్ రాకెట్ గురించి తెలుసుకుంది ఇటీవలే. కౌంటర్ అటాక్ ప్లాన్ వేసుకొనే లోపలే జరగరానిది
జరిగిపోయింది. " పరాంకుశరావు హరీష్ రావు రెండు చేతులూ పట్టుకున్నాడు. హరీష్ రావ్ ముభావంగా ఉండి పోయాడు.
" తప్పు మీదే కాదు. విశాల్ ఆత్మహత్య కు మేమూ కారణమైనాం. వాడి చివరి ఉత్తరం నాకు, నా భార్య కే కాదు, నాలాంటి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. నేను మీడియా తో మాట్లాడాలి. మరో విశాల్ ఊపిరి ఆగకముందే జాగ్రత్త పడాలి ".
హరీష్ రావ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడన్న భయం ఏ మూలో ఉన్నా, పరిస్థితి తీవ్రత వల్ల పరాంకుశ రావు ఒప్పుకోక తప్పింది కాదు.
క్షణాల్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఉద్విగ్న భరిత వాతావరణం. ప్రతి ఒక్కరి ముఖంలో ఆతృత, జరిగిన విషాదానికి బాధ. సానుభూతి , నిశ్శబ్దం. గుండె లోతులు
తడిమే నిశ్శబ్దం.
" విశాల్ ఆత్మహత్య కు తండ్రిగా నేనెవర్ని తప్పు పట్టను.
వాడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నా , మొదటి కారణం మేమే. వాడి తల్లిదండ్రులం. డబ్బు, హోదా ముఖ్యమనుకున్న మేము మా పిల్లల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. వాడు డ్రగ్స్ కు ఎందుకు అలవాటు పడ్డాడో,. మా నుండి ఏమి ఆశించాడో వాడు రాసిన ఈ చివరి ఉత్తరం చదివితే తెలుస్తుంది. ఈ ఉత్తరం ఎడిట్ చేయకుండా యథాతథం గా మీ పత్రికల్లో ప్రచురారించండి . ప్రతి తండ్రి, తల్లి చదవాలి. పిల్లలు నోట్లో వారి నిర్లక్ష్యం‌ నికి మూల్యం ఎంతభయంకరంగా ఉంటుందో తెలుసుకోవాలి. జాగ్రత్త పడాలి ". క్లుప్తంగా ముగించాలి హరీష్ రావు.
పరాంకుశరావు ఓ ప్రభుత్వ ప్రతినిధి గా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక తండ్రి గా బాధపడ్డాడు. ఆయన పర్సనల్ ఫోన్ మ్రోగటంతో హాల్లో మూలకు వచ్చాడు.

" పరాంకుశరావు గారూ ! నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మీరిప్పుడు ప్రభుత్వ ప్రతినిధి గా " బి" స్కూల్ లో ఉన్నారు. జరిగినదానికి మాకూ చాలా బాధ గా ఉంది. కానీ ఏం చేస్తాం ? ఇలాంటివి తప్పవు. జరుగుతుంటాయి. అయినా లోకంలో అందరూ డ్రగ్స్ వల్లే చనిపోతున్నారా ?".
స్మోకింగ్, ఆల్కహాల్ వేలమందిని పొట్ట బెట్టుకుంటున్నాయి.
మరి ప్రభుత్వం చేసిందేమిటి ? వార్నింగ్ లు ఇచ్చి, టీవీ షోలు చూపించి చేతులు దులుపుకుంటుంది. ఆదాయాలు మాత్రం
వదులుకోవటం లేదు
ఇది కూడా అంతే
. కొన్నాళ్ళు మీడియా లో ఊదరగొట్టి, బురదపాముల్లాంటి
చట్టాల్తో హడావిడి చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నమ్మిస్తే చాలు. వేడి చల్లారి పోతుంది. ప్రజలు మర్చిపోతారు. ఆ తర్వాత మా వ్యాపారం మామూలే. ఎవరో చనిపోయారని, ఏదో జరిగిందని కోట్ల విలువ చేసే వ్యాపారం మానుకోలేముగా. ? మీరు మంచి అనుభవం ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు. మమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటారు. మా రిక్వెస్ట్ ఒకటే.... ఇంతియాజ్ ను " సిట్"
నుండి తప్పించండి. అతడు ఓవరాక్షన్ తో మాకు అడుగడుగునా అడ్డు తగులుతున్నాడు. దయచేసి మాతో సహకరించండి. మీరు లాభం పొందండి.మిమ్మల్ని నేను కలుస్తాను. ఇంతియాజ్ ను తప్పించుకునే మీరు మాకిచ్చే సంకేతం. " ఉంటాను . ఫోన్ కట్ అయింది
పరాంకుశరావు ఉలుకు పలుకు లేకుండా నిలబడి పోయాడు.
***************************************************
కొనసాగించండి. 42 లో